సేయనివా డెవ్వడు చేరి
ప|| సేయనివా డెవ్వడు చేరి చిల్లరదోషాలు | యేయెడ జీవులజాడు లీశ్వరకల్పితమే ||
చ|| దేవునినమ్మినయట్టిదేహియట యాతనికి | యీవల నెంతటిపాప మేమిసేసును |
భావించి యన్నినేరాలు పరిహరించు నతడే | ఆవటించుసూర్యునికి నంధకార మెదురా ||
చ|| పూజింపించుకొనేవాడు భువనరక్షకుడట | తేజముతో దురితాలు తెంచగలేడా |
రాజుసేసినయా ణాజ్ఞ రాజుకంటే నెక్కుడా | వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు ||
చ|| చేతనాత్మకుడట శ్రీవేంకటేశ్వరుడు | జాతిలేనిజీవునికి స్వతంత్ర మేది |
కాతరపుజన్మానకు గార్యకారణ మేది | యేతున గరుడనికి నెదురా పాములు ||
pa|| sEyanivA DevvaDu cEri cillaradOShAlu | yEyeDa jIvulajADu lISvarakalpitamE ||
ca|| dEvuninamminayaTTidEhiyaTa yAtaniki | yIvala neMtaTipApa mEmisEsunu |
BAviMci yanninErAlu parihariMcu nataDE | AvaTiMcusUryuniki naMdhakAra medurA ||
ca|| pUjiMpiMcukonEvADu BuvanarakShakuDaTa | tEjamutO duritAlu teMcagalEDA |
rAjusEsinayA NAj~ja rAjukaMTE nekkuDA | vOjatO vajrAyudhAna kOpunA parvatAlu ||
ca|| cEtanAtmakuDaTa SrIvEMkaTESvaruDu | jAtilEnijIvuniki svataMtra mEdi |
kAtarapujanmAnaku gAryakAraNa mEdi | yEtuna garuDaniki nedurA pAmulu ||
బయటి లింకులు
మార్చు
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|