సుభద్రా కళ్యాణం

సుభద్రా కల్యాణము

తాళ్లపాక తిమ్మక్క రచన.

శ్రీరమావల్లభులు - శ్రీకృష్ణు లెలమి
ద్వారకాపట్టణము - తమ రేలుచుండ
శ్రీకాంతపతికృపను - జెలగి పాండవులు
ప్రాకటంబుగను ద్రౌ - పదిని బెండ్లాడి
రంత నింద్రప్రస్థ - మను పట్టణమున
సంతసంబున నున్న - సమయంబునందు
సురముని యేతెంచె - సుదతి పూజించె
అరలేక మ్రొక్కగా - నపుడు ద్రౌపదిని
దీవించి లోపలికి - దిరిగి పొమ్మనియె
నేవురితోఁబలికె - నిట్లు నారదుడు
ఇంతుల కథలైన - నెంతవారికిని
చింతింప మదిలోన - చీకాకు గదురు
సుదతికై సుందోప - సుందుల చరిత
విదితముగ జెప్పెదను - వినుడంచు బలికె
సుందరికొఱకునై - సూడు పుట్టంగ
సుందోపసుందులు - మ్రంది మన్నైరి

కావున మీర లొ - క్కటఁ గాంత పొందు
గావింపరాదు సం - కటపాటు గదురు
ఒక్కొక్కయే డామె - యొక్కొకరినగర
మక్కువతోనున్కి - మర్యాద యగును
ఒక్కరి నగరిలో - నువిద యున్నపుడు
మక్కువ వేఱొకరు - మసల రాదచట,
ఏకాంత మరయక - యేగినవారు
వ్యాకులపడక యా - వసతి వర్జించి
తిరముగా నొకయేఁడు - తీర్థాళులందు
చరియించ వలె నని - సమయంబు చెప్పె
ఒప్పించె నారదుం - డొగి నేగె నంత
అప్పటినుండి - తా రైదుగురు రట్లె
సమయంబు పాటించి - సాధ్వితోగలసి
ప్రమదంబుతో భూమి - పాలించు చుండ్రి
ఒక్కనాడాపురిని - నొక విప్రునింట
తెక్కలి మ్రుచ్చులు - ధేనువుల్ గొనుచు
చనిరి విప్రుం డంత - సవ్యసాచికిని
మొనసి ధేనువులకై - మొఱవెట్ట దొణగె
భూసురవర్యుండు - మొఱలిడ దెలిసి
భాసురంబుగ తన - ప్రతినను తలచి
ఆయార్తరవముల - కా ధనంజయుఁడు

ఆయుధశాలకు - నరుగంగవలసి
ధర్మనందనుడు తా - ద్రౌపతి గూడి
శూర్మితో నుండుట - గూడ గుర్తించి
ఆభూమిదేవు నుడు - లడలు ధేనువుల
క్షోభలు మాన్పంగ - జూచి ధర్మువును
అనుచు నాయుధ శాల - కరుదెంచి క్రీడి
తనువున నాయుధాల్ - తగదాల్చి పట్టి
తరమి యాముచ్చుల - దండించి పసుల
మరల నాద్విజునకు - మరియాద నొసగి
తనయన్న కడ కేగి - దండంబు వెట్టి
మును జేయనమయము - మునుకొని చెప్పి
యెలమితో దీర్థముల - కేగెద ననగ
బలికె ధర్మజు డంత - బార్థుని తోను
నను విడచి యేరీతి - చెనెదవోయన్న
కొమరొప్ప వచ్చితివి - గోవులకొరకు
సమయభంగములేదు - చనవల దనెను
మనము గావించిన - మర్యాద లన్ని
మనమె చేయకయున్న - మరి ధర్మమేది?
అనుచు ధర్ముజుచేత - ననిపించు కొనియె
యన్న పాదములకు - నతిభక్తి మ్రొక్కి

వాయునందనునకు - వందనం బొసగి
కవలు మ్రొక్కినవారి - గౌగిట జేర్చి
ఆయతిధిచేతను - అనిపించుకొనియు
చనియె తీర్థములకు - శక్రనందనుడు
గరిమ పెద్దలు పుణ్య - కథలు జెప్పుచును
ధర ప్రదక్షిణము స - దా చరింపుచును
అక్కడక్కడ గల - యఖిల తీర్థములు
వేడుక నాడుచు - విజయుండు కనియె
అంగవంగకళింగ - బంగాళములను
పార్థుండు గడిచెను - బహుదేశములను
గంగ స్నానము జేసి - కడు నీమమునను
సంగతిగ నొకనాడు - జపతపంబులను
గావింప నొక నాగ - కన్య యేతెంచి
కనుమూయ గావించి - యనురక్తి మించి
ఘనగతి నాగలో - కమునకు జనెను
మౌనంబు మాని యా - మగువ కిట్లనెను
మానిని వినవె జి - హ్మగ లోకమునకు
నేనేల వచ్చితి - నీకు పేరేమి
పూని తెల్పు మని యా - పొలతిని నడుగ
నై రావంతుడు జా - హ్నవికి వల్లభుడు
కౌరవ్వు డనువాడు - కలడు తక్షకుడు

నా పేరును వులూచి - నను గనిరి వారు
నీ పౌరుషమ్ములు - నీ రూపుమహిమ
పనిగొని గీతరూ - పమున వెల్లడిగ
విని నిన్ను గామించి - వేడ్క దెచ్చితిని
నా కోర్కె లీడేర్చు - నాకేశతనయ
కైకొను మనెడు నా - కాంత నీక్షించి
నారద సద్బ్రహ్మ - చారి యానతిని
నిగిడి ఈ ధరమీది - నిఖిల తీర్థములు
పరగ చరించగ - సమయమ్ము గలిగె
పరగ ధర్మజునితో - పలికి వచ్చితిని
నీ మనోభీష్టంబు - నే నెట్లు దీర్తు
భామిని ! యనిన నా - పద్మాక్షి పలికె
ధర్మమేదియు ప్రాణ - దానము తోను
తుల దూగదని మహా - త్ములు వలుకుదురు
చేకొని తన్ను ర - క్షించిన మీకు
పాకశాసని ! వ్రత - భంగ మెక్కడిది
పరగ ధర్మస్థితి - పాంచాలికడను
నరగ మీ చేసిన - సమయమ్ము కాద
అనగ ధర్మ స్థితి - కాత్మ మోదించి
అచట పుత్రుని గాంచి - ఆనాతి కొసగి
మనమున నుప్పొంగి - మరునాడు వెడలె

కమలార్కు డుదయించు - కాలంబునందు
క్రమమున క్రీడి గం - గానది జేరె
తనవెంట వచ్చిన - ధారుణీసురుల
గనుగొని యర్పించి - కథలెల్ల జెప్పె
అర్థముల్ ధేను స - హస్రముల్ గాను
అర్థితో భూసురుల - కమరకంబొసగె
అనిపికొని కొందరి - నందు గొందరిని
నొనరగా చేకొని - యుదధి తీరమున
ఉర్వీధరుని పురు - షోత్తము గాంచి
పమ్మిన భక్తితో - ప్రణతు లొనర్చె
ఓ విశ్వపాలక - ఓ విశ్వకర్త
యో విశ్వరక్షక - యో జగన్నాధ
నీ యందు గల్గు నీ - నిఖిలలోకములు
మాయెడ కృప యుంచి - మమ్ము రక్షించి
పాయక నాకోర్కె - ఫలియింపజేయు
మనుచు సన్నుతి జేసి - యతనికి మ్రొక్కి
చనుతెంచె పర్వ - స్వామిసన్నిధికి
అమర సహోబళం - బా వెంకటాద్రి
వరుస నాపై కంచి - వరదుల గొలిచె
క్రమమున కావేటి - రంగనాయకుల
ప్రేమను దర్శించి - పిదప తానంత

అల దక్షిణమ్మున - వెలసిన యట్టి
అలతి నదుల తీర్థ - ములనాడే క్రీడి
మునుకొని యటు పద - మూడవ నెలను
పనిబూని మణిపురి - పట్టణమ్మునకు
అరిగె నప్పర మేలు - నవనీశ్వరుడు
బలవిక్రముడు చిత్ర - వాహనుం డపుడు
ఎదురేగి తోడ్తెచ్చి - హేమపీఠమున
వదలని భక్తితో - వాసవి నునిచి
అడుగుల నర్ఘ్యపా - ద్యముల బూజించె
సురపతి సుతుడు వ - చ్చుట వైపు దెలిసి
కౌంతేయు డిష్ట మా - ర్గమున జిక్కునని
యంతంత మది నుబ్బి - యర్జును జూచి
యేను నీ కొకమాట - నెఱిగించవలెను
మానవాధీశ్వర = మావంశ మందు
ఘన విక్రముడు ప్రభా - కరుడను రాజు
 తనయుల కొరకు దా - దడయకెంతెంతో
తపనుజేసిన చంద్ర - ధరుడును మెచ్చి
అపుడు దానొక మాట - నరుదుగ బలికె
వసుధేశవరుడ నీ - వంశ వీరులకు
పొసగంగ నొక్కొక్క - పుత్రుండు పుట్టు
అని యిచ్చె వరమీశు - డతని వరమున

గొసకొని యొక్కొక్క - కొమరుండు పుట్టే
ఘనుడ నా కిప్పుడీ - కన్యక పుట్టె
తనయుల కొఱకుగా - తన నే బ్రోతు
ఈలతాంగి నుద - యించు నాసుడుడు
వాలాయముగను మా - వంశమ్ము నిలుపు
వర జూజ తో మంచి - వరునకీ కొమిరె
పరగ నిచ్చుట నాదు - భాగ్యమే కాదె
యెనగ భూపతివి నీ - విందు వంశశ్యుడవు
పొసగ పెండ్లాడు నా - పుత్రిక ననిన
కవ్వడి దానికి - కడు నంతసిల్లి
నివ్వటిల్లేడి కోర్కె - నెల్త బెండ్లాడె
అంగజు దేవి జి - త్రాంగద గూడి
పొంచుచు నంతానా - పురము చెంగటను
ఆయ్యర్జునుడు వసు - ధామరుల గూడి
చయ్యన జను దేర - జలధి తీరముకు
స్నానము చేయగ - సమ కట్టి యున్న
పూని యక్కడి ముని - పుంగవుల్ విజయ
గనిరి యీ కొలనుమ - హా దుర్గమమ్ము
ఘన తరగ్రా హాసం - కలితమ్ము నగును
పార్థుడ యిచ్చోట - భరితమ్ములైన
తీర్థ రాజమ్ములు - దీవించు నైదు

సలలితముగను బ్ర - సన్న తీర్థమ్ము
ఫలదమై నట్టి సౌ - భద్ర తీర్థమ్ము
సొమింపగాను బౌ - లోమ తీర్థమ్ము
కారుణ్యమయుడ యీ - కారంధమంబు
ధారునిలో ప్రసి - ద్దమ్మయి యెప్పు
బలభేది మత యెట్టి - బల్లిదు లైన
చెలగి ఈ కొలకులు - చేర నోడుదురు
అని చెప్పగా దాను - వినియు నర్జునుడు
వచ్చి యీ ఘన సరో - వరములో జొచ్చి
యిచ్చమై తీర్థమ్ము - లే నాడవలెను
అనుచు నయ్యర్జునుం డతి సాహసమున
ఆయెడ సౌభద్ర -మనియెడి కొలను
నరగ ప్రవేశించె - జలమధ్యమునకు
కడు నుగ్రగతి మహా - గ్రాహ మేతెంచి
తను డాయ దాని ను - ద్దండిత బట్టి
బహు పరాక్రమ శాలి - బైట పదవేసె
నకరరూపము మాని - నాతియై నిలిచె
శక్ర నందునుడు నా - శ్చర్యపడి చూచె
ఇదియేమె భామ నీ - వింతకు ముందు
వదలక ల్యీసరో - వరములో నుంటి

జలచరాకృతి మాని - జలజాక్షి వైతి
వలనుగా నెఱిగించ - వలెను తత్ క్షణమె
మత్తాక్షీ నీవు మున్ - మకరివై యుండి
యిచట భామిని యవుట - కరవేది చెపుమ
అనఘుడ నే వంద - యనెడి యిచ్చరను
ధనదునకును గూర్చు - దాన నాసఖులు
సౌరభేయి సమీగ - జయలతల్ వారు
నలుగురు తన యట్టి - సక్ర రూపమున
జలధిలో నున్నారు - శాప విముక్తి
ననువొంద గావించు - మనిన నర్జునుడు
యేమి కార్యమున - నిట్టి చందమున
భామిని యిది మీకు - పాట్ల్లె ననిన
ఇంద్ర నందన మను - జేంద్ర యేపురము
యింద్రాది లోకము - లెల్ల కనుగొనుచు
ధరణిపై ఘన తపో - ధను లున్న వనము
గనుగొని యందగ్ని - కల్పుడౌనొక్క
బ్రాహ్మణూని తపస్సు - భంగమ్ము చేయ
తలచిన నలిగి యా - తాపసోత్తముడు
చకన్య్ నూఱగ రాని - శాపము బెట్టె
భయమున నాముని - బ్రార్థన చేయ
దయ జూచి యాతపో - ధనుడిట్టు పలికె

సాహసుండెవ్వడీ - నరిసిలో చొచ్చి
బాహుల మియు బట్టి - బయట వేయంగ
నోపౌనో మీ శాప - ముడుగు నాక్షణమె
పోపొండి మీరుమీ - భూమికి ననుచు
చను దేర నారద - సంయమి వచ్చి
సతులాల యీ ముని - శాప వాక్యమ్ము
మిక్కిలి కృరమే - మిట మాంపరాదు
తరులుడు మీఖింక - దాక్షిణాంభోది
తటమున పంచ తీ - ర్థములు శోభిల్లు
అటుచని నూరేండు - లందుడు డనెను
ఒకనాడు ఫల్గునుం - డు ర్విపై కరిగి
సకల తీర్థముల ద - ర్శన కాంక్ష వచ్చి
 స్నానము జేయ మీ - శాపము దీరు
అని చెప్పి నారదుం - డరిగె తనంత
మీరాక గోరగా - మీరు వేంచేయ
నరయగ ధన్యుల - మైతిమి మేమి
నరుడప్పు డారీతి - లనుగుర సతుల
కరుణించి శాపము - కడతేర్చె నంత
మగువల వీడ్కొని - పణిపురు పురికి
మగుడ నేతెంచి నె - మ్మదిని కొన్నాళ్ళు
అంగన యుండె జి - త్రాంగద యింట

అనఘుడు బభ్రువా - హనుడను సుతుని
వరచిత్రఘను చిత్ర - వాహనువంశ
కరునిగా నొసగి యా - కాంత దిగ విడచి
స్థిరముగా గోకర్ణ - దేవు దర్శించి
అరిగె నవ్వలిపార్శ్వ - మంబుధిచెంత
పావనంబైన ప్ర - భాసతీర్థమున
భావజాకారుడు - పార్థు డుండగను
చేరువ నంత నా - శ్రీకృష్ణు డుండు
ద్వారకాపురియని - తగు మునుల్ పలుక
నీలమేఘశ్యాము - నిఖిలాభిరాము
లాలితశుభగాత్రు - లక్ష్మీకళత్రు
అకంజదళనేత్రు - నలరి సేవింప
నాకోర్కె లెల్లగ్ర - న్నన సమకూడు
గదునిచే మును వింటి - కన్య సుభద్ర
మదిరాక్షి సుకుమారి - మత్తేభగమన
గుణవతి యనగ మ - క్కువ చూడ వలెను
క్షణమైన నా కొమ్మ - కనుగొనవలెను
అనుచు ధనంజయు - డా ద్వారవతికి
చన నున్నతలపున = సకలయాదవులు
యతుల బూజింతు రన్ - మతిగల్గి కపట
యతివేషధారియై - యలరి యర్జునుడు

భుక్తి ముక్తి ప్రియు - పుండరీకాక్షు
భక్త వత్సలు కృపు - పరమాత్ము కృష్ణు
తత్తర వడక చి - త్తమ్ములో నునిచె
అంతనా నరుని తల - నంతయు దెలిసి
యొక్కరుండేతెంచె - నొనర నచ్చటికి
నరుడు నచ్చెరు వంది - నారాయణునకు
సరగున ప్రణమిల్లి - సభక్తి మొక్కి
వనమాలి కెదురుగా - వచ్చి యర్జునుడు
దండ ప్రణామమ్ము - తగ నాచరించె
నారాయణా యనుచు - నవ్వుచు నరుడు
కరము బట్టుక వాని - కడు లేవ నెత్తె
హరియు నవ్వుచు బల్కె- నర్జుని జూచి
నిన్ననే సుతుల గని - నెఱతనమునను
యింతలో సన్యాసి = వెట్లయితి వయ్య
యెరుగుచుము ఈవిద్య - లెల్లను మేము
గరిమ వేసాలల్ల - గ్రాసాల కొఱకె
అని గేలి సేయుచు - నతి దోకొనుచు
చనుదెంచె రైవత - సైలమ్ము కడకు
అచట నర్జును నుంచి - హరియు నంతటను
నడవడచి ద్వారకా - నగరి కేతెంచి

కొలువులో యాదవ - కోట్లును గొలువ
బలదేవుతోడను - పద్మాక్షు డనెను
తాలాంఅ సకలయా - దవులతో గూడ
వాలాయముగను రఈ - వతమహోత్సవము
జరుపంగ్ద వలె ననిన - శౌరి కాక్షణమె
సమరసమ్మున పురు - సాశించు మనిరి
సకల పౌరులు నొప్ప - సాటించి రెలమి
పప్పు బూరెలు నెయ్యి - పాయసాన్నములు
కాయ కూరలు పెక్కు - కలవంటకాలు
ఊరుగాయలు నెయ్యి - బొబ్బట్లు వడలు
గారెలు బూరెలు - కండ మండి గెలు
అరటి పండులును రా - జన్నరాసులును
పిండి కూరలు మొదల్ - పెద్ద కుడుములును
గరిగలఘటముల - గంపల నునిచి
ముందఱ నడిపించె -మురజనాదములు
సంతోష ఘోషములే - సంకులమ్ముగను
పడుచులు పెద్దలు - బాలింత రాండ్లు
కొడుకులు కోడండ్లు - కూతులంల్లుండ్లు
తోతొక్కులాడుచు - ద్రోవ కిక్కిరిసి
చనిరి యాదవు లంత - సంభ్రమమునను
అంతంత చరురంత - యానంబు లెక్కి

అంతఃపుర స్త్రీలు - నంత నేతేర
నుద్ధవసాత్యకు - లుభయ పార్శ్వముల
బద్దానురాగులై - అలసి తన్ గొలువ
అప్పుడు శ్రీకృష్ణు - డన్నయు దాను
క్రొత్త ముత్యమ్ముల - గొడుగుల నీడ
సురలెల్ల చను దెంచి - చూడగా నపుడు
గరుడధ్వజాంకిత - ఘన అరథం బెక్కి
ఆయచలమ్మున - యాదవుల్ గొలువ
తడయ కప్పుడు రైవ - తకమున విడిచె
ఆయచలమునకు - యాదవుల్ వచ్చి
అయత భక్తితో - నర్చించి మ్రొక్క
అపుడు సుభద్రయు - నాక్షనమ్మునను
పణతియ బంగారు - పల్లకి నెక్కి
చామ రుక్మిణి సత్య - భామ రేవతియు
 దేవకి వసుదేవ - దేవులందరును
వారి వారికి తగు - వాహనాలెక్కి
వచ్చిరి రైవత - పర్వతమునకు
కొమ్మలు పదివేలు - కొలుచుచు రాగ
సమ్మతిగ నేతెంచి - సంభ్రమమ్మునను
వాసవి సుతుడు తన - వరుదు కావ్లసి
ఆయచలమునకు - నాయింతి మ్రొక్కె

అసమయమ్మున - నర్జునుడు తనదు
మదిలోన తలపోసె - మగువ రూపమ్ము
దండ లావణ్య మెం- తయు రూపుతోను
వుండునో యనుచు ని - ట్లొగి కొంత సేపు
యింతి మోముకు చంద్రు - డీడైన నేమి
కుంతలలాకలిమి - కొదమతుమ్మెదలు
బాలకనుబొమ్మలకు - ప్రతి యౌనువిల్లు
పాలించు ముత్యముల - పణతి చిర్నగవు
నతినాన తిలపుష్ప - సమమైన దేమి
తివ్ మ -ధ్యమ్ము సింహమునకు సరియె
అని పోల్ప తగు సుంద - రాంగి యవ్వనము
కనుగొని పెక్కండ్రు - కాతలు గొల్వ
కవ్వడి గనుగొని - కమలాక్షు డనియె
కనుచూపి నంతలో - కాంక్షింప తగున
మొదల సుభద్రపై - మోహంబు నీకు
వదలక యుండుట - వడి యెరుంగుదుము
తలపు నీడేరు - తలకకు మనుచు
జలజాక్షు డావేళ - చెలిని రప్పించి
వందనము జేయించె - వ్ర మునీంద్రునకు
పాండవద్విజులకు - పార్థు డిచ్చోట
దండియై యుండుట - తగ నెరింగించ

వడిగ నేగుల వారి - వలన పంపించె
బలదేవు జూచి యా - పద్మాక్షు డనెను
ఎక్కడ నుండి - యీ పర్వతముకు
నరయ మెవ్వరో కాని- యతి వచ్చి నాడు
పొసగ చాతుర్మాస్య - పూజా చేయుదమ
అని నెడబాటుగా - అన్నతో బలికి
నడనడచి ద్వారకా - నగరి కేతెంచె
అప్పుడు బలభద్రు - దాముని జూచి
భక్తితో నిట్లని = ప్రార్థన చేసె
పొసగ చారుర్మాస్య - పుణ్య వ్రతంబు
జరుపు మానగరాన - సంయమి నాథ
అని తోడు కొని వచ్చి - రాద్వారకకును
రావె యమ్మ సుభద్ర - రమణిరో నీవు
మది రాయతాక్షి నా - మనవి చేకొనవె
కన్యచే భిక్షయె - నంద నొల్లండు
కన్యాగృహంబున - కన్యకామణివి
సన్యాసి నునిచి పూ - జావిధి చేయ
మనుచు చల్లిలికి స -న్యాసి నొప్పించి
ఆపద్మనాభుండు - అపుడూరకుండె
ముత్తేలనంచునా - కొత్త బిందెలను

అత్తరి జలక మా - యత్తమ్మ జేసె
యేవేళ కా మౌని - యిష్టమ్ము లెరిగి
ఆవేళ కావించు - నఖిల వస్తువులు
పొలుపైన రత్నాల - బొమ్మరింటికిని
తళుకైన పగడాల - ద్వార బంధములు
పచ్చల తేలుపులు - పన్నారు గురుగు
లచ్చంపు దంతేఅన - నమరు బొమ్మలును
చెరుగుల యంచుల - జీని వ్రాతలును
చిరుతపప్పుళ్ళు మరి - చెంద్రకావులును
బంగార మమరించె - చెలియ సుభద్ర
బలసి సుభద్ర శో - భనము చేయగను
అరుదెంచి కవ్వడి - అతివ కిట్లనెను
ఇందు పురోహితుం - డెవారె నీకు
అందమై నట్టి ఘడి -యారమ్ము నేదె
అన్నియు నేల నీ - యాశ్రితుడ నేనె
యున్నాను నీ పెండ్లి - నొనర జేయించ
 పప్పు బూరెలు మంచి - పాయసాన్నములు
వొప్పైన బిక్ష మా - కొనరగా గద్దు
పన్నారు గురుగుల పంచ భక్ష్యములు
నెన్నిక భుజించె - నెలమితో నగుచు

తెరయొద్ద నిలుచుండి - దేవేంద్రసుతుడు
నరసిజవదనతో - సరసమ్ము లాడు
భావగర్భితముగా - పలుకు మర్మములు
భావించి పతి జూచి - పరగ తమకించు
చెలియ లక్షణములు - చెప్పెద ననుచు
కలికి నొయ్యెన లేమ - కరము చేబట్టి
అక్షీణజృంభణం - బది యెంట గద్దు
అక్షయ సౌభాగ్య - మది యింట గద్దు
పద్మ రేఖలు నీకు - బాసిల్లు ననుచు
పద్మాక్షి పాదముల్ - భావించి చూచె
వియ్యమ్ము లందగా - వెలదిరో గురుతు
ముడి వడె హారముల్ - ముద్దుల గుమ్మ
చిక్కు విడిపించు నే - చేడె సుభద్ర
మక్కువ నామీద - మరువకు మనెను
వేదోక్త యుక్తిని - వింత పెండ్లిండ్లు
కావించవలె నండ్రు - ఘన శాసనమున
లాలవ దినమున - నాగ వల్లికిని
శోభనం బగు గదే - సుదతి యిద్దరకు
పానుపుటింటికి - పరగ బొమ్మలను
కడు వేక నంపుదమ - కమలాయ తాక్షి
అనుచు కందువ మాట - యతి తను బలుక

నివ్వెర పడి యుండె - నెలత సుభద్ర
మరి యెన్నోరీతుల - మాయల తపసి
నెరవక తను జూడ - వెరగందె నబక్వ్ల
గ్రక్కున శ్రీ కృష్ణ - కడకు నేతెంచి
యెక్కడి యవి వరుం - డితడు వోయన్న
చూడ నయమి గాని - చూరకా డితడు
ఆడెడి మాటలి - ట్లని పల్క రాదు
సరస మాడగ వచ్చు - సారె నాతోను
సొంపు నొయ్యారంపు - చూపులే తరచు
ఇత్తరి నే భిక్ష - మిడి నత దాను
 పొత్తువ భుజియింప - పొలతి రమ్మనెను
ఎంత జేసితిరి మీ - రిటువంటి వారి
నంతఃపురమ్ములో - నర్యమా యుంచ
అన్న యీ సన్యాసి - ననుపుమా వేగ
ఎన్నిక బూజింప - నే దగవు గాదు
తన్ను జూడగ నిల్వ- తగవుగా దితడు
కటకట యిటువంటి - కపట సన్యాసి
నెటులవలె బూజింతు - నిందిరారమణ
అనిన నవ్వుచు గృష్ణు - డా యతీశ్వరుని
 వినయమ్ముతో బిల్చి - వేడ్క నిట్లనెను
అయ్య మీపనులన్ని - ఆగడాలాయె

తొయ్యలి నాతోన - దూఱుగా జెప్పె
పెద్దలు మీరింత - బుద్ది దప్పినను
సుద్దుల నందఱు - చులుకగా నగరె
కాక నాచెల్లలు - కడు ముద్ద రాలు
లీలగా దుర్భాష - లేల పలికితిరి
కోరి నకోర్కి చే - కూరిన దాక
ఏరీతినే నూర - కే యుండరాద?
ఇచ్చట చెప్పిన - యింతి సుభద్ర
నచ్చట రాముతో - నలిగి చెప్పినను
యీద్వారకాపురు - యిందుండ బోదు
నవనిపై చరియించు - మని నిన్ను గొట్ట
నని గేలి చేయుచు - నతని వీడ్కొనుచు
ప్రియముతో చను దెంచె - పిదప తా నంత
నవరత్న కనక సిం - హాసనమ్ము నను
పొఏర్మితో గూర్చుండి - పీతాంబరుండు
శిరను వంచుక యున్న - చెల్లెలి జూచి
నయతోడ బిలిచె నా - త్రైలోక్య పతియ
అమ్మరా ముద్దుల - గుమ్మ రా వేగ
కొమ్మ రా ననకంపు - బొమ్మ రావమ్మ
ముత్యాల సరమ రా - ముద్దరాలా రా
చిత్తజు బాణమా - చెలియ రావమ్మ

చిలుకలకొలికి రా - శృంగార కన్య
తొలకరి మెఱువ రా - తోయజ గంధి
పండు వెన్నెల రావె - భాగీర్తి రావె
గండు గోవెల రావె - కమలాక్షి రావె
మచ్చెకంటీ రావె - మాధవళీ రావే
అంఋతంపు తెప్పరా - అరవిరి మొగ్గ
బంగారు పెట్టెరా - భాగ్యాల బరణి
నెలయ మజ్జగముల - వింత యైనట్టి
శ్రీ కలా బిరుదుల - చెలియ రావమ్మ
కోరు కార్యమ్ముచే - కూరినందాక
అని యిట్లు తమ అన్న - అంతించి పిలువ
పసిడి సలాక నా - పణతి సుభద్ర
వలి పువ్వు గుత్తుల - తలిరాకు బోణి
లలిత సౌరభ శోభ - గులకరింపంగ
నసి చక్కగా పైట - సవరించు కొనుచు
నడనడ చిన్నారి8 - నడుము జవ్వాడ
అందెలు మ్రోయగ - హారముల్ తూగ
మొలనూళ్ళు ఘంటలు - ముద్దియల్ మ్రోయ
నంది దండలు వెల్గ - పరివెణల్ దూల
దివ్వెలై హారముల్ - తెరువు జూపగను
హంసల నడకతో - నతివ సుభద్ర

అల్లనల్లనె వచ్చె - అన్నముందరికి
భద్రేభగమన సు - భద్ర రమ్మనుచు
తోయజాక్షుడు తన - తొడపైన నునిచె
నీలాలవంటి వా - నెలత నెఱికురులు
వాలారు కొన గోళ్ళ - వడి చిక్కు దీసె
శ్రీకృష్ణు డావేళ - చెలెలికి నపుడు
నేనకొప్పటు బెట్టె - చెలువమ్ముతోను
చుబుకంబు పైకెత్తి - చూచి యోదార్చి
మక్కువ నలరించె - మగువ నమ్మోము
కుంచించుకొని శిరసు - వంచుకొన బోవ
శిరసు తాబఈకెత్తి - చెల్లెలిని చూచి
చిఱునవ్వుతో బల్లికె - శ్రీ కృష్ణుడెలమి
యే మనె సన్యాసి - యిపుడు నిన్నైన
నాతోను జెప్పిన - నాతి నే బోయి
మందలించెద నమ్మ - మరి యాదగాను
ముద్దరా లోర్చునా - మొప్పె మాటలకు
అని మట్టు పెట్టి యిపు - డాడి వచ్చితిని
రమణి నీ జోలికి - రా వెఱచు నింక
వచ్చిన యప్పుడె - వనిత నేబోయి
యిట్టె బంధించెద - నిపుడె కొట్టెదను
అని బుజ్జగించి చె - ల్లెను గారవించి

చెలునమ్ముగా బలికె - శ్రీ కృష్ణు డెలమి
మత్తేభగమన నా - మనసు చేకొనవ
మదిరాక్షి నీకొక్క - మాట జెప్పెదను
తగ నేదు నేడు ప - ద్నాల్గు లోకములు
నరసి చూచితి నేను - ఆది కాలౌన
ఇటువంటి సన్యాసి = నెట జూడ లేదు
అటు గనుక నీ తోడ - నిటు జెప్పవలసె
శిరసు నాఘ్రాణించి - చెల్లెలి నపుడు
కనుకొని పలికె నా - కంజాక్షు డెలమి
యేమని వర్ణింతు - నితని మాహత్మ్య
మేమని వర్ణింతు - నితని పౌరుషము
పొరమధగణముతోను - పార్వతీశ్వరుడు
నవతాడ వచ్చితా - చాలంగ నొచ్చె
అకాలకంఠుడు - నటు లోడిపోయె
నీతని గెలువగా - నెవ్వరి వశము
ఈయతీశ్వరుని పే - రెవరు తలచినను
 వైరుల గుండెలు - వ్రక్కలై పోను
ఉపవాసముల చేత - నొడలెల్ల స్రుక్కి
యెలమి యొఱుగని - వాని వలె నున్న వాడు
అడవులే మేలాయె - నాముని పతికి
పండ్లు ఫలములు - భక్షింపు చుండు<poem>

ఆకలి గొన్నప్పు - డాతని భిక్ష
కరసి యున్నము పెట్ట- నండ లేరెవరు
కరానికోసమే - కడు చిక్కు పడెను
కార్యము చేసి గ్ర - క్కున నంప వలెను
సుదతి యీతని జూడ - సురపతి సుతుడె
మనసులో నీ కను - మానమ్ము వద్దు
కన్య నీచేతి భి - క్షమె కాని యతడు
అన్యులచే భిక్ష - అందు కోబోడు
దానిచే నీకు నిం - తగ జెప్పవలసె
యెప్పటి వలెనే నీ - వీ యతీశ్వరుని
తప్పక పూజించు - తురుణి పొమ్మనిన
అన్న మాటలకు తా - నంగీకరించి
మత్తేభగమన గ్ర - మ్మున లేచి వచ్చె
అందెలు కదస్లంగ - హారముల్ వెలుగ
మదిరాక్షి చనుదెంచె - మౌని యింటికిని
పొసగ నానాటి క - పూర్వమ్ము గాను
అఖిల పదార్థమ్ము - లాయత్త పరచు
విందులు కావించు - వేవే విధముల
పొందుగా నతనికి - భజియింప నిడును
వలపుతో ననియెల - వరున భుజించి
కడు డస్సి యుంటకు - కారణం బేమి

యీచూపు లీతమక - మీవిలాసములు
యేతాపసుల యందు - నెఱుగ మెన్నడును
విజయుని రూప వి - వేక సంపదలు
గజరజు వరదుచే - గరిమ నే విందు
తెగవాలు కన్నులు - దీర్ఘ బాహువులు
పదడంపు వన్నెగల - పాద పద్మములు
చూడగా నీతండు - క్రీడియే కాని
వాలాయముగ యతీ - శ్వరుడు గాబోడు
కపట సన్యాసిగా - కల్పించి యిచట
వుపమను శ్రీ కృష్ణు - డునిచినాడేమొ
అని మనమున జాల - హర్షమ్ము నొంది
శృంగార మమరించె - చెలియ సుభద్ర
పైకొనియెద నంచు - పద్మాయతాక్షి
జోకతో కమ్మగ - స్తురి నలు గిడేను
జాతి గొజ్జగి నీట - జలకమ్ము లాడి
రీతిగా నొక వింత - రేఖ చూపట్టి
ఉమ్మెత్త పువ్వు వలె = నుతకిన మడత
నఖముల గొని తెచ్చి - నాతి యిచ్చినను
చెంగావి పావడ - రంగు మీఱంగ
చుంగు విడిచి కట్ట - సదతి సుభద్ర
పాలిండ్ల వలను క - న్పడగ నొక వింత

లీల పయ్యెద కొంగు - లే జాఱ విడిచె
నటనతో పై నము - నడ చేటి మగువ
రమణ బాగుగ కొంగు - రంగుగా జెలగె
జిఅవ్వాజి పదనిచ్చి - చంద్ర కాంతముల
దువ్వెన నెరగోర - దువ్విన కురుల
పాపా నొనరించి - బాగుగా దీర్చి
చూపట్టు కొప్పు నిం = చుక జాఱ ముడిచె
మల్లెలు మొల్లలు - మందారములును
చల్లనిజాజులు - సంపంగి విరులు
పోఅరిజాతమ్ములు - బాగుగ తీర్చి
యెయ్యనె తుఱిమె నా - యత్సల గంది
విటుల మన్మథు డేయు - విరి మొగ్గ తూపు
నటన గుమ్మడి గింజ - నావమ్ము తీర్చె
బసిడి ముత్యాల నొ - ప్పగ పూర్ణ చంద్రు
తవమించు చెవుల తేఅ - టంకాలు చేర్చె
మొగపు తీగెకు చెంత - ముత్యంపు కొలికి
జగిమణుల్ మిగులు మం - జిడి తాళి జేసె
పుంజాల దండ దా - పున నేవళమ్ము
రంజిల్లు భన్నవ - రమ్ము క్రీడించ
యిన్ని సిమ్ములకును - వన్నె బెట్టినటు
మూడు వేల్ వెలసేయు - ముక్కఱ బెట్టె

కుంకుం గంధము - కూర్చిన మంచు
గోపకస్తురి బూసె - కొమరారు మేన
వచ్చి పోకలతోడ - పండు టాకులతో
గమ్మన కవుర నీ - డెమ్ము గావించె
ఆరామచిలుక భు_జాంగదమ్మునను
రాజసమ్మున నునిచె - రమణి సుభద్ర
ఝుణఝుణత్కారముల్ - సలుప సొమ్ములును
పచ్చలరుచుల స్థం - భమ్ముమాటునను
మత్తాక్షి నిలుచుండె - మౌని జూచుచును
బృందావన్ము మీద - వెలయు నా మౌని
కమలార్క బింబంబు - గతి బోలువాని
బాలేందు చాయల - పదిగి నిరుగడల
నెమ్మెగపుటూర్థ్వ పుం - డ్రమ్ముల వాని
నొప్పుచందుర కావి - మూటార్చి నట్టు
కప్పారు నిడువాలు - గడ్డము వాని
మొలకెత్తు ముత్యంపు - మొగ్గల బోలు
తళుకొత్తు శుభ్రదం - తమ్ముల వాని
అలవడు తులసి పూ -నలవేరు వాని
కవగూడ హస్రినీల - కాంతి తేలించు
తమ్మి పూనల దండ - తస్న కురము సొంపు
సొమ్ముగా నవరించి - చూపట్టు వాని

యిన్ని విధంబుల - నున్న యా మౌని
జూచి సంతోషమున సుదతి యిట్లనెను
అడిగెద నని పూని - అతివ సుభద్ర
తనమనములోనున్న - తాత్పర్యమునను
చిత్సౌఖ్యరసలత - చిగిరించ గాను
ఉత్సాహమున మేను - ఉబ్బి పొంగగను
పలుకు పల్కుకు తేను - లొలుకగా నపుడు
పలికె దా నొకమాట - పద్మాయతాక్షి
అయ్య మీరేడస - మరసి చూచితిరో
యెయ్యది మీనామ - మెచట నుండుదురో
పరగ నింద్రపస్థ - పట్టణమ్మునను
బహుళ సంపదలతో - బరగు చున్నారె
ధీర మానసులు కుం - తీసుతుల్ వారు
అరయ గడు సఖు - లై యున్నా వార
కోరి మా మేనత్త - కొడుకు లైదుగురు
వారికి కుశలమా - వరముని చంద్ర
ఆ రాజవరులలో - నర్జునుండెలమి
ధారుణి తీర్థముల్ - దరిసింప నేగె
తీర్థముల్ క్షేత్రముల్ - తిరుగుచో మీరు
ఇంద్రనందను నెందు - నే జూడలేదా
జగస్తి నస్ంతట మీరు - చరియింతు రనగ

అలసి మి మ్మిప్పుడు - ఆడుగంగ వలనె
హరి పాదముల బుట్టె - నట్టె యాగంగ
భూతలమ్మున వెలసి - పొలు పమరు చుండు
మఱి పట్టభద్రుడు - మాయన్న కతడు
వందన మర్పింప - నందు బోబోలు
నని మున్న వింటినే - నతడు తా నిటకు
నరుదెంచు టెరిగితే - సంయమి నాథ
యీద్వారకాపురి - యెంతో దూర మని
తన పురమున కట్టె - తా నేగె నేమొ
అని యిట్లు తా బల్క - నా మునీశ్వరుడు
మౌనమ్ముతో నుండె - మఱి కొంత సేపు
ఓ మునిపుంగవ - యో పుణ్య మూర్తి
గంగాతరంగ భం- గక్రమశుభ్ర
పాథోభర న్యాయ - పర భక్తి యోగ
నాథ నాదైనమ - నవి చేకొన గదె
అనుచు సుభద్ర దా- నాడు వాక్యములు
విని చెవి పండుగై - విజయు డిట్లనియె
పద్మాక్షి నీతోను - పలుకగా వెఱతు
పలికిన పలుకులు - భావ మేర్పఱచి
దూఱు లెక్కించెదో - తోయ జాక్షునకు
వలపు గల్కక యుండ - పలుక గల్గుదునె

పడుచుదనమున నే - పలుకు పల్కులను
మనసులో నుంతువా - నను రాజఋషిని
అను మాటల నువిని - యవాంతరములు
లేమలో భావించి - లేనవ్వు నవ్వె
కామ తంత్రము రహ - స్యములు పుష్పించ
చక్కని ముఖ పద్మ - సారస్య మెంచె
చక్కని నెమ్మేని - జిగి విచారించె
తిన్నని మాటలు - తేట లాలించె
సన్నంపు సదరంపు - చామ వర్తింపు
మొలక నవ్వుల దీవి - ముకుద కెమ్మోవి
తరలాక్షి పులకించి - కలజూచి చూచి
తల యూచి విజయుండు - తానెర గందె
యిటు వంటి బోటికి - యీకోడె కాడె
నచ్చిన వాడని - నాతి నాతరుణు
నచ్చుగా వు వువింట- నతనుండు గొట్టే
బృందావనము మీద - ప్రేమతో మౌని
కందువ దెలియక - కడు మూర్ఛ వోయె
ఓ ముద్దు చిలుక నే - నుల్కిపల్కితిని
వల దింక వలదని - వ్యవహరింపుచును
బడలిక గొని మౌని - పవలించె నంత

నారామచిలుక ఫ - క్కున నేగు దెంచె
పసిడి రెక్కలు - సొంపు లెసగి యాడగను
మాణిక్యవుంగంఠ - మాలికల్ మెఱయ
పార్థుని భుజముల - పై నిల్చి యపుడు
నయ భయములతోను - నరున కిట్లనెను
బావ లేలెమ్మని - బడలికల్ తెలిపి
మోవి గంటిని చేసి - ముద్దులు వెట్టె
యిది మేమి విజయుడా - యీరీతి నుండ
అన్నిట గుణశాలి - వౌదువు నీవు
అర్జున నీమన - మలరు చుండగను
నిర్జరీగతి నాతి - నిన్నెతానడిగె
నెలమి దుర్యోధనున - కిచ్చెదననిన
కడు తాపమును బొంది - కాంత నిన్నడిగె
యిరువురి మనసులో - నెల్ల తాపములు
నెఱిగియు నెఱుగని - తెఱ గుండ వలెను
ఇంతిని తోడ్కొని - యింద్ర ప్రస్థమున
కెంతో వేడుకల నీ - వేగుదురు గాని
కమలాక్షి పెంచిన - కడు ముద్దు చిలుక
నడుగ వలె నా నీకు - అన్ని బుద్ధులకు
మందెమేలమ్ములకు - మఱి వేళ గాదు
అనుచు ముంజేతి కం - కణముపై వ్రాలె

ఓ చెల్ల యని మతి - నాచకోరాక్షి
తడయక తలపోసి - దా నప్పు డడిగె
నెచ్చట నున్నాడో - యెలమి నర్జునుడు
తీర్థమ్ము లేవేవి - తిరుగు చున్నాడో
యేపుణ్య భూముల - కేగి యున్నాడో
వినిపిచు మనె - నామె తెకను తెల్లముగ
అని యిట్లు బలుకగా - నామునీశ్వరుడు
అమరగా బలికెను - అతివతో నపుడు
కోమలి యిద్దఱము - గోకర్ణమందు
కూడియే యుంటిమి - కొన్నాళు లచట
భోజనమ్ములు శయన - ములు నొక్క చోటె
చెలియ యంటిమి మేము - చెలి కాండ్ల వలను
అతనికి నాకును - అరమర లేదు
అతనికి నాకైక్య - మతివరో వినవె
నీరూపు నీరేఖ - నీ చక్కదనము
వేమాఱు తలపోసి - వివశుడై యుండు
నిడు రేయి పగలు కం - టికి కూర్కు లేద
యింతి నీ పై మోహ - మెనగొనియుండు
నెలమి నర్జునిని రూ - పెఱుగనే తాను
రూపేల గోరక - నోపల్లవాంగి
మందార దామమా- మాయన్న చేత

విందుగా నెన్నడు -వెస జూడ లేదు
యెగుభుజమ్ముల వాడు - మృగరాజునడుము
నడచి పుచ్చుకొనునె - న్నడుముగల వాడు
గరగరని వాడు చ - క్కని వాడు నతడు
గొప్ప కన్నుల వాడు - కోదండ గుణకి
ణాంకంబు లౌ బాహు- లమరినవాడు
వెన్నున మచ్చ గల-విభువంబు వాడు
బవిరి గడ్డము వాడు - పన్నిదం బిడిన
వెన్ను పగడ సాల - వెసనాడ వచ్చు
చిగురొత్తు చెంద్రిక - చెలగు పాదములు
నని విధం బెఱిగింప- నంతటనరుడు
నీవు గుణాడ్యవు - నీ కెవ్వర్ రెదురు
శ్రీ హరి చెల్లెలౌ -శృంగార వతివి
యేవున నీ భాగ్య - మేమన వచ్చు
నీవు కిరీటికి- నెలతవై తేని
భావింపనాతని - భాగ్యమేకాద
పూనినీ వడుగగా- బొంక నేమిటికె
మానిని నేనె పో - మఱి యర్జునడును
నన్ను మన్నించిమీ- యన్నశ్రీకృష్ణు
నిన్ను నాకీవలసి - పననెనీవిధము
నీకోర్కి నాతలపు - నిగమగోచరుడు

చేకొని సమకూర్చు - చింత యేమిటికె
అరయ గంధర్వ క - ళ్యాణమ్ము రాజ
వరులకు తగునండ్రు - వరధర్మ పరులు
అనుచు తమకమ్ముతో - అస్తడు చేయి చాప
ఘనమైన సిగ్గుతో - కాంత యిట్లనెను
తల్లియు తండ్రియు - తగిన బాంధవులు
బల్లిదు లన్నలు - పాయ కున్నారు
వారి యనుజ్ఞచే- వర్తించు మిచట
నీలాగు పనులైన - యిందఱు నగరి
హరి నీకు నిచ్చట - అనుమాన మేల
తెరలి యేనుగునెక్కి - దిడ్లు దూరెదరె
అని చెప్పి తా నగరి - కతివ పోయినను
మునియు లతాగృహ- మ్మున కపుడు చెనియె
మదనునిచే జిక్కి - మత్తాక్షి రాక
కెదురైదురై చూచి - యిట్లని పలికె
యింతికి నాపేర - దేల చెప్పితిని
కాంతయు లోనికి -గ్రక్కున బోయె
మరుని పుత్తడి బొమ్మ- మరలె నాచేతి
పరిచర్య లొనరించ- భాషించ దొక్కొ
సుందరి పాదాల - యందియల మ్రోత
విందునో వీనుల - వెరగందు నొక్కొ

తెలిసోగ కన్నుల - తెలియగ లేమ
సొలయక తా జూడ్కి - చూచునో లేదో
కొమ్మలతో గూడ - గుజ్జన గూళ్ళు
అమగువ వడ్డించ - హర్షించ దొక్కొ
యేమి చేయుదు నిట - కొంకొకసారి
కామిని చనుదెంచి - కరుణించ దొక్కొ
మామ కావలెనని - మన్నించి రాడ
కాముడు దన్నువే - కారించ దగున
ఉన్న మా తల పెల్ల - నుర్వీధరుండు
దన్నుగా తనమతిని - భావించ దెలిసె
ఘనమందిరములకు - గ్రక్కున వచ్చి
ఎలమి రుక్మణి జూచి - యిట్లని పలికె
నెలతనీ మరదలు - నేదు సన్యాసి
బలభేది సుతుడౌట - పరికించి తెలిసె
మలయుచు వచ్చి తన - మందిరమ్మునకు
తలకొన్న సిగ్గుతో - దా జేర దాయె
అరసి యన్నము బెట్టు - మనుచు నియమించి
గారిది వినోదముల్ - చూచుచు నుండె
అంత నక్కడ మఱి - యాసుభద్రయును
చింతించి చెక్కిట - చెయిబూని యుండి
మదిలోన తలపోసె - మగువ యిట్లనుచు

యింద్ర నందనుడు మ - హీంద్రస్తుతుండు
చేరి వినయమ్మున - చెట్ట బట్టినను
విడిపించు కొని మఱి - వేగ బోయితిని
ఎలమి నాతని మన - సెట్లుండె నొక్కొ
కాక దా నొడ బడితె - కడుచుల్క దనమ
యీ కడ నందఱి- కెన్నిక కాద
యెఱుగడా నాకేల - యింత చింతించ
నిరవైన యీ పెండ్లి - యీడేర్చు తకకు
అనుచు చింతింపుచు - సతివసుభద్ర
హంస తూలిక పాన్పు - నందు పవళించె
ముత్యాల చెఱగుతో - మునుకు తాబెట్టె
అయంబుజాక్షియు - నచటి కరుదెంచి
ఆ మరదలి జూచి - యటు నవ్వి పలికె
కనులేఅ మూసేవె - కలహంస గమన
శిరనేల వంచేవె- సింహేంద్ర మధ్య
వాలు కన్నులనీరు - రాల నేమిటికె
వనిత సన్యాసిని - వలపించు కొంటి
రామావతారాన - రమణిరో నీవు
శాంతయ ను పేరుతో - సహజాత వైతి
అల ఋశ్యశృంగుని - అటు లోను జేరి
వలవేసి కొంటివే - వనితరో నీవు

దేవేంద్ర సుతు దృష్టి -తెగువతో తాకె
దృష్టి తీయింతుమే - తెలివి రా నీకు
తెగనాలు కన్నుల -దృష్టించి చూడ
ఆతని చేతనె కాని - అది మాన దనెను
చిటిమిటి కోపాన - చెలియ సుభద్ర
కర కంకణములచే - కాంతి శోభిల్ల
ఆరుక్మిణమ్మను - అవలికి ద్రోసె
గట్టిగా ముసుగిడి - కాంత యిట్లనెను
యింతి నీపలికిన - యీ పలుకు లన్ని
త్రైలోక్య పతితోడ - తా విన్నవింతు
అనిన మరదలి జూచి - అతివ యిట్లనెను
యిప్పుడే చెప్పవే - యిభ రాజగమన
మీయన్న మము గూర్చి - మించ నాడు నటె
జలక మాడుదు లేవె - పుత్తడి బొమ్మ
వెలది నీకును పెండ్లి - వేగ జేయుదుము
అని చెప్పి వైదర్భి - యరుదెంచె నంత
నందమౌ నిందిరా - మందిరమ్మునకు
ఆ యింతి పెట్టె నా - యా సొమ్ము లన్ని
తాటంకముల కాంతి - డవళింప గాను

మొల నూళ్ళ ఘంటలు - మొల్లముగ మ్రోయ
నొయ్యనె తనవడు - మూగాడిగాను
ఇంతి పయ్యెద లోన- నేకాంతమునను
ఆ చక్ర వాకములు -జతివ హారములు
కొమరార కొప్పులో - గొజ్జంగి దండ
నటనతోవీపున - నాట్య మాడగను
జాఱు పయ్యెద కొంగు - చక్క ద్రోయుచును
ఉరిది ముత్యపు సరులు - నుయ్యాల లూగ
ఆది నారాయణుం- డఖిలాండ నాథు
డండజపు పానుపున - అతడుండ తెలిసి
కోవెల ల్స్వరముతో- కొమరాలు పోయి
చిలుక పలుకులతోను - చెలి విన్నవించె
పుండరీకాక్షుడా - పురుషోత్తముడ
మురవైరి వందిత - మువ్వగోపాల
నారదగ్వినుత యా - నందముకుంద
మత్స్యావతార నా - మనవి చేకొనుము
యింత కార్యం బని- యెఱుగని యట్లు
కవ్వడి నేచుట - కామ ధర్మంబె
అని చెలి యున్న వృ - త్తాంత మంతయును
నెఱిగించె కృష్ణున - కెలమి రుక్మిణియు
హరి వారి తల వంత - వంతేయు దెలిపె

వరుసతో దేవకీ - వసుదేవులకును
సారణ ప్రద్యుమ్న-సాత్యకులకును
ఆరూఢి నుద్ధవు - డప్పు డాతెఱగు
ఆయింద్ర సుతునకు -ఆ సుభద్రకును
నెయ్యమి కలగుట - నేర్పున దెలిసె
చయ్యెనె తన కోర్కె - సమకూడె ననుచు
తొయ్యలి నపుడు పా - ర్థున కియ్యదలచె
ఆయచలమ్మున -యాదవు లెల్ల
భూరి మహోత్సవ - మ్ములు చేయు చుండ్రి
ద్వారకలో సుభ - ద్రా కన్య యుండె
బలరామ కృష్ణులు- పర్వతమ్మునకు
చేయించు చుండిరి - చెలగి యుత్సవము
తమ యన్న కృష్ణుని - తలచెసుభద్ర
అమరేంద్రుని దలంచె - అర్జును డపుడు
అంతట శచి తోడ - అమరపతి వచ్చె
అచట ముత్తైదువ - లాయరుంధతియు
శచి రుక్మిణీదేవి - సత్య భామయును
సంపంగి తైలము - చక్కగా నంటి
జలక మిద్దఱికిని - పరుగున దీర్చి
దివ్య వస్త్రమ్ములు -దివ్వగంధములు

దివ్యమూల్యమ్ములు- దివ్య భూషలును
ధరియించి రపుడు వా - ద్యధ్వనులెసగ
గరుడ గంధర్వులు - గానముల్ సేయ
అలవడ బరగిన - ఆశంభురాణి
నతివ పూజించిన - నాయ రుంధతియు
మృగనాభి వాసనల్ - మొగి గుబుల్ కొనగ
జనులెల్ల పెనగొని - చౌకళింపుచును
అందముగ మృగమధ్య - లమర బాడుచును
కల్యాణ వేదికి - కడు వేగ రాగ
నాదరాన సుభద్ర - కాయర్జును నకు
వేదోక్తముగ పెండేలి - విష్ణుండు చేసె
అనయమ్మున - నమర వల్లభుడు
భాసురమణియమ - బహు భూషణములు
ఘన మకుటమ్మున్ము - కవ్వడి కొసగి
అనురక్త చిత్తుడై - హరి వీడు కొనిన
అపుడు సుభద్రయు - నయర్జునుండు
శచికి దేవేంద్రునకు - సభక్తి మ్రొక్కె
మ్రొక్కిన యిరుగుర - మొగి లేవనెత్తి
ఆశీర్వదించి యా యమరేద్రు డరిగె
నిర్జరుల్ తామును - నిజపురికి నేగ
అర్జును జూచి కం - నారి హర్షించ

అప్పుడు కవ్వడి - యా సుభద్రయును
హరి పాద పద్మముల్ - హర్షమున మ్రొక్క
కడు గారవమ్మున - కౌగిట జేర్చి
కడలేని యక్షమ - కాండము లొసగె
రయహయంబుల హేమ - రథమును నొసగె
హరియు రుక్ంఇణి సూచి - అప్పు డిట్లనిరి
అలరెడి వేడుకల - ననుగు మరదలిని
హోమ పీఠమ్మున - మనిచిరి వారు
అక్షతల్ శిరసుపై - నాయిర్వురుంచి
ముత్య రత్నమ్ములు - ముగుద యొడినిడిరి
సిగ్గు మురిపెమ్మున - చెలియ సుభద్ర
వద్దికి చనుదెంచె - వదిన ముందఱికి
పుత్తడి బొమ్మ వలె - పొలతి సుభద్ర
వదిన పాదములపై - వ్రాలుచు మ్రొక్కె
మ్రొక్కిన మరదల్ని - మొగి గౌగిలించి
అక్కున జేర్చుకొని - అతివ యిట్లనెను
అడల నేమిటికె మా - యమ్మ సుభద్ర
అత్తయు నీకు మే - నత్తయు గాన
వింత వారెవ్వారు - వీరి లోపలను
బావమఱదులు చాల - భక్తి గలవారు
నిను విడిచి మీయన్న - నిమిష మేనియు ను

బిలువ రిప్పుడె నిన్ను - బిలిచి తెచ్చెదరు
తల దువ్వ నిప్పిడే - తా బిలుచు గాని
యిచటికి బోయి రా - యిభరాజగమున
నానదినె యుండ వే - నా ముద్దు చిలుక
అని బుజ్జగించేటి - అసమయమున
ఘన కోటి సూర్య ప్ర - కాశమ్ము భాతి
మకుటమ్ము ధరియించె - మఱియు నర్జునుడు
నిచ్చేసె నంతలో - విజయు డా సతికి
నచ్చిక దండ ప్ర - ణామమ్ము జేసె
నీర జాక్షుని రాణి - నిత్య కళ్యాణి
దారిద్ర్యనాశిని - దయగల తల్లి
పాందునందనులుకు - ప్రావవై యెపుడు
కృప జూచి రక్షించు - కువలయ నేత్ర
మన్మథుని గన్నట్టి - మరువంపు మొలక
మమ్ము కటాక్షించు - మాధపు రాణి
అనుచు ఫల్గునుడు త - న్నతిభక్తి తోడ
స్తవము జేయుచు నున్న - కువలయ నేత్ర
మకుటమ్ము వట్టి క - వ్వడి లేవనెత్తె
సత్య కృపాచార్య - సత్య సంపన్న
సత్యము దప్పని - సర్వజ్ఞ నరుడ
చెలువతో సధ్బక్తి - శ్రీ కృష్ణు సేవ

కలిగుండు నీవెల్ల - కాలంబునందు
ననుచు దీవన లిచ్చు - నానమయమున
నక్కున జేర్చుకొని - అతివ కిట్లనెను
చనవిచ్చినాడని - సకియరో నీవు
పలు మాట్లకును నెట్లు - పాలుపడవద్దు
పొలతి నమ్మగరాదు - పురుషుల నెపుడు
పలురీతి కృష్ణ స - ర్పమ్ములై యుండ్రు
కొంచక కృష్ణకు - కూర్మితో నుండు
వంచన సేయకు - వనిత యెప్పుడును
అనుచు బుద్ధులు చెప్పి - అనుగు మరదల్ని
అర్జును చేతి కొ -- య్యన నప్పగించి
కోరిక కొనసాగె - కొమరాల నీకు
ఇంద్రనందను గూడి - యేగు మాయమ్మ
అస్రుగు మి నీవని - అస్తని వీడ్కొలిపి
నరసఖుడేగె నం - తర్ద్వీపమునకు
అస్రిగిన పిమ్మట - నపుడు కవ్వడియు
దేవకీ వసుదేవ - దేవులకు మ్రొక్కి
వారిదీవన లంది - వనితను తాను
చయ్యన చనుదెంచి - సత్య భామకును
వరభక్తితో మ్రొక్కె - వనితయు తాను
అన్న అర్జునడి యీ - అతివతో గూడి

ఘను వీరు పుత్రుని - గాంచు వేగముగ
అనుచు దీవన లిచ్చి - అతివ యాక్షణమె
అరుగుమి నీవంచు - నతిని వీడ్కొలిపె
నరి సఖుండరిగె - నంతర్ద్వీపమునకు
అనిపిన పిమ్మట -నపుడు కవ్వడియు
రథముపై నునుచుకొని - రమణిని నపుడు
పోయేటి వేళలో - పురి గాచి యున్న
ఆయుధవాహకు - లారీతి నైరి
ప్రవరసేనుడు కృత - వర్మ యాదిగను
శౌర్యమున నాసవ్య - సాచి నడంప
నోరోరి పాండవ - యుద్దండవృత్తి
మారమ కృష్ణులే - మఱి లేమి చూచి
యీలేమ తోడ్కొని - యెందు బోయెదవు
తాలాంకు శౌర్యము - తలపవే మదిని
పొలతి నీవెత్తుకొని - పోయితి వేని
బలునారస్వమ్ముల - బదవేతు మనిరి
ఘన గిరి తటుల నం - దనవనంబునను
కనిసి బాణమ్ములు - క్రిక్కిఱియ నేసె
రమణి సుభద్ర సా - రథ్యంబు సేయ
అమరేంద్రనందను - దాసయమయున
కడు కో-అస్మున దన - కాండములచేత

చెనకి వారల నెల్ల - చీకాకు జేసె
ఇంతిని దోడ్కొని - ఇంద్ర ప్రస్థ్ముకు
సంతోషమున జనె - సవ్య సాచియును
శౌర్8ఇని కనుగొని - సంకర్షణుండు
నీరజోదరుడును - నీలాంబరుడును
ఘన భరితాంబర - కనకాద్రి విభుడు
నేర్మితో చను దెంచె - నీల వర్ణుడు
బలుతమ్ము చూచి బల - భద్రు డిట్లనియె
యేమి కార్యము గల్గె - యిందాక నీకు
మాన వెన్నటికిని - మందె మేలములు
అహోగ్రుడై మించు - నన్నను జూచి
కపట నాటక ధారి - కప్పె నొక మాయ
నాగ మల్లియ తీగ - నవ మల్లె తీగె
కలసి పెనగు చున్న - కడువింత జూపె
నచటి సభాస్తారు - లాసమయమున
పచరింప నర్జును - బహు పరాక్రమము
విజయ నిర్ఘోషస్ముల్ - భేరీర నంబు
రామాది యాదవ - ప్రక్రముల్ గొలువ
మదిలోన నుబ్బింత - బెదరైన గొనక
పనివినె నరుడు సు - భద్ర దోడ్కొనుచు
పొదలిన వేడ్కల - బోయెగా కేమి

అటు పట్టి తెచ్చేము - యిటు మమ్ము బనుపు
మిదెయని చారులు - నీవిధి బలుక
విని వారి నందఱి - వేగ వారించి
బలభద్రుతో నిట్లు - పలికె శ్రీ కృష్ణు
డనఘుడు ధర్మజ్ఞ - డతి నీతి పరుడు
తన మేన మరదలి - తాను గొంపోయె
వలదని యెవరికి - నారింప వశము
బలవంతు డాతడు - బహుశస్త్ర వేది
అటుగాక ద్రోణుల - కనుగు శిష్యుండు
కదనములో వాని - కదియంగ దరమ
యెదిగిన కన్య మన = యింటిలో నున్న
మనము చేయక యున్న - మగువ బెండ్లాడె
తలవ నీపనులకు - ధర్మమా యనిన
నబ్జాక్షు మాట కం = తౌను గాదనక
తాలాంకు డప్పుడు - తలయూచి యుండె
తల్లియు దండ్రియు - తగిన బాంధవులు
బల్లిదు లన్నలు - పాయ కుండంగ
నొక పేద వలె పాయ - నువిద సుభద్ర
సుదతి నీరీతిగా - చూచు చుండుదుగ
అని వెడబాటుగా - నన్నతో జెప్పి
అనుగు చెల్లిలికిని - ఆరణముల్ గొంచు

లక్ష గుఱ్ఱమ్ములు - లక్ష యేనుగులు
అక్షీణ బహుబలు - లగు విరభటులు
రమ్య కాంచన మణీ - రథ సహస్త్రములు
సౌందర్య వంతులైన - సతి సహస్త్రములు
అన్నయు తముడు - నతి మోదమునను
ఆరణమ్ము దెచ్చిరిం - యాతి శీఘ్రమునను
వనితతో చనుదెంచి - వరు డర్జునుండు
వావిరి నాదైవత - వనములో నుండ
అచటికి చను దెంచి - రన్నయుం దాను
నరణ్మ్ము లిచ్చిరి - ఆ దంపతులకు
అప్0ఉడు సుభద్రయు - నా యర్జునుండు
ఆ రామ కృష్ణులకు - నతి భక్తి మ్రొక్క
మ్రొక్కిన యిరువుర - మొగి లేవనెత్తి
విజయుడవుగమ్మంచు - వేడ్క దీవించ
విజయు డంతట వారి - వేడె బూతంచె
సంతోష చిత్తులై - చనిరి ద్వారకకు
అపుడు సుభద్రయు - నర్జును గనియె
యీ చందమున నన్ను - నీక్షించి కృష్ణు
యేమని పలుకునో - యీ రసమ్మునను
ఆ పలుకు లన్నియు - నటి తాకు నేమొ
గోపాల సతులతో - కూడ నన్నునుపు

మనిన సంతోషించి - యాయింతి కనియె
ద్రౌపదికిని మ్రొక్కి - తరుణి పొమ్మనిన
వనిత ప్రవేశించి - వచ్చె నవ్వేళ
కుంతికి కృష్ణకు - కూర్మి మ్రొక్కినను
సంసం బలర పాం - చాలి యిట్లనెను
వనిత నీ పతి వీర్ - వరు డయ్యనేని
ఘన వీర పుత్రుని - గాంతు వీ వనెను
అంత దీవన లిచ్చి - యపుడు పాంచాలి
సంతోషమున నుండె - నకియతో గూడి
అపుడు ధనంజయుం - డా యింద్రపురికి
వచ్చి ధర్మజునకు - వరభక్తి మ్రొక్కె
తల్లికి సాష్టాంగ - దండ మ్మొనర్చె
వాయునందనుంకు - వందనము చేసె
తనకు మ్రొక్కిన యట్టి - తమ్ముల నెత్తి
కడు మోదమున తన - కౌగిట జేర్చె
నతివ పాంచాలిని - నక్కున జేర్చె
అంతట ధర్మజుం - డతి మోచమునను
దోగుచు7 బాంచాలి - తో నిట్లు పలికె
పార్థునకును మా సు - భద్ర కీ ప్రొద్దు
శోభన మగు గాన - చూడు వేదుకన్
నానతి గైకొని - యపుడు పాంచాలి

వేవేల యత్నముల - విందు తగ జేసె
నొప్పైన బంగారు - టుప్పరిగ లోను
కప్పుర వాసనల్ - గ్రమ్ముకొనంగ
సాంబ్రాణి ధూమములు - సఖి తాను వేసి
చిత్రముల్ నిర్మించె - చెలియ యంతటను
దిక్కుల మాణిక్య - దీపముల్ వెలుగ
నిలువు టద్దమ్ముల - నెలత చెక్కించె
వెయ్యి దీపమ్ములు - వెలుగంగ నందు
గవుసెనల్ దీయించె - గాజు కంబముల
బంగారు తరి కోళ్ళ - పట్టె మంచమ్ము
అంగన వెలయించి - యమరించె సెజ్జ
సన్న విరిమల్లెలు - జాజి మల్లెలును
బొండు మల్లెలు చాల - నిండ బరపించి
యిరుదెసల్ తలగడ - లిమ్ముగా దాసి
బంగారు సురటి దా - పణతీ వెట్టించె
పంకించి బాగాలు - బరణులం బోసి
గాలించి సున్నము - కాయ బెట్టించె
పండు టాకులు దెచ్చి - పణతి ముడిపించి
మదిరాక్షి యునిచెను - మఱియు నచ్చటను
చాఱపప్పు గనగ - సా లానవాలు
శ్రీ సుగంధమ్ములు - చిటి బెల్లములును

చెఱుకు బిళ్ళలు మంచి - చిఱుదిండి నరకు
పసిమి మామిడి పండ్ల - రసముల విసికి
పసిపచ్చ గిన్నెల - పాలు నే నినిచి
పలు వన్నె గిండ్లతో - పన్నీరు నించి
బంగారు చెంబుల - పానక మునిచి
బుంగల దింపించి - గంగోదకములు
పలుకు చిల్కల నుంచి -పందరమ్ములను
ఈరీతి పనులెల్ల - నింతి తగ జేసి
చనుదెంచె పాంచాలి - సంభ్రమమ్మునను
భద్రేభగమనసు - భద్ర రమ్మనుచు
చేడె శృంగారమ్ము - చేయంగ దలచె
పన్నీట స్నానంబు - బాగుగా నార్చి
తఱిబోసి కట్టించె - ధవళ వస్త్రమ్ము
విసనకఱ్ఱల గాలి - వీచె నిరుదెసల
పొసగగా తడి యార్చె - పొలతి శిరస్సు
ధూప వాసనల లో - దులిపి యల్లార్చి
గొజ్జంగి రేకులు - కొప్పున దుఱిమె
నొడ్డాణమును బెట్టె - నూగాడు మొలను
బిళ్ళల మొలనూళ్ళు - బిగిసి మ్రోయగను
ఘంటల మొల నూళ్ళు - ఘల్లున మెరయ
కంఠ హారమ్ములు - కౌస్తుభ మణులు

కాలిపెండెము గూర్చె - ఘనత తోడు తను
అందెల దిద్దె నా - యతివ సుభద్ర
తళుకు మించిన నంది - దండల పైని
నెలవంక తాయితల్ - నెఱి పుట్ట గట్టె
శ్రీ కారములతోడ - చెలగాడు చెపుల
కమలాక్షి పంజుల - కమ్మలె పెట్టె
సొమ్ము లిన్నిటి మీద - శోభిల్లు నట్టి
మూడు వేలుంజేయు ముక్కఱ పెట్టే
కుంకమ గంధము - కూర్చె నా యింతి
దోవకస్తురి బూసె - కొమరాలి మేన
ఆనవాల్ పాయసం - బావుల నేయి
పొలతు లందఱు గూడి - సొత్తారగించి
పచ్చివౌ పోకల - పండు టాకులను
వెచ్చగా పప్పర - వీడెమ్ము జేసె
గరిమతో రాచిల్క - కంకణమ్మునను
రాజసమ్మున నునిచె - రమణి సుభద్ర
ఝుణఝుణత్కారమై - పణతులిద్దఱును
జోడు చిల్కల వలె - శోభిల్లి రపుడు
అక్కడ ధర్మజుం - డర్జునునకును
అతిర కితోనలం - కృతులు సేయించె
సవ్య సాచిని జూచి - నన్న గావించె

శయ్యాగృహమునకు - నొయ్య బొమ్మనుచు
వెస సన్న పాదార - విందములు మ్రొక్కి
పానుపు కడకేగి - పార్థు డంతటను
యెదురు సూచు చుం నుండె - నింతి రాకలకు
మఱచిన తన్నింత - మఱవనీ కుండ
పచ్చని వింటి వా - డెచ్చరించుచును
వేదన కలవిచ్చు - విరహాగ్ని చాయ
ప్రోది చేసినయట్లు - పొదలె చంద్రుండు
అప్పుడాద్రౌపది - అతివతో ననియె
పట్నమ్ములో వారు - ప్రహరి దిరిగెదరు
పడతిరో పదునాఱు - ఘడియ లటు చనెను
సజ్జకు జనుమన్న - సకియ యప్పుడును
సిగ్గున్ మురిపెమున - చెలియ సుభద్ర
అడుగు లోడకయుండి - అటు కొంత సేపు
కూరిమి గలవాడు - కొమరాల నీకు
మేలిమి గలవాడు - మేనత్త కొడుకు
నాల్గు నెలల భిక్ష - మే ల్గల్గబెట్టి
యిప్పుడిటువలె సిగ్గు - లేటికే సుదతి
అనుచు సుభద్రను - అతివ తోడ్కొంచు
విజయుని పాంపున - వేడ్కతో నుంచె
తలుపు మూసికొని - తరుణి యేతెంచె

తలపోసె మనసులో - తాళంగ లేక
యేమి వస్తువులైన - నియవచ్చు గాని
ప్రాణేశు నిచ్చి మరి - బ్రతుకంగ రాదు
అఖిలాండ కోటి బ్ర - హ్మాండనాయకుని
చెల్లెలు గనుకనే - నొల్ల ననరాదు
అదిగాక సభలోన - ఆ కౌరవులకు
మాన భంగము గల్గు - హీన కాలమున
మాన ధన మొసగిన - మాహత్మ్యశాలి
అటువంటి శ్రీకృష్ణు - కనుగు చెల్లెలట
అని మఱి తలపోసి - అతివ మోదించె
కేళికాగృహములో - క్రీయియు నపుడు
పరిహాసముగ ననియె - పణతితో నగుచు
కాడు చెయి బట్టిన - నాతిరోనీవు
విడిపించి లోపలికి - వేగ బోయితివి
యిపుడెందు బోయెదే - యిభ రాజగమన
కనుక సంతోషమ్ము - గానుండ తగును
ఓడక వచ్చి నా - యెద్ద గూర్చుండు
మన మఱి సుగ్గున - వనిత సుభద్ర
మగువ తా దివ్వెల - మాటుకే చనెను
కొనలు నిక్కగ వేయు - కుసుమాశ్రములన
బొమలు నిక్కగ వల - పుల చూపు చూచె

అల మోహనాంగుడు - న్నటు జూచె దెలిసి
లజ్జించి దిగ్గన - రమణి శోషించె
నిబ్బరి తనమున - నెలత చెయివట్టి
అబ్బురమ్మున కౌగి - టదుముకొని తెచ్చె
తోయ్యలిని తొడలపై - నెయ్యమున నునిచి
పొన్న పువ్వుల దండ - పొలతికి జుట్టె
కుంకుమ గంధమ్ము - కోమలి కలది
బంగారు సురటి చే - పట్టి కిరీటి
అంగనకు విసిరె - నతి ముదమ్మునను
ప్రాణేశు పాదములు - పణతి తగ నిత్తె
యెల్ల లోకమ్ములు - నేలిన యట్టి
వల్లభుతోడనె - వనిత పుట్టితివి
నీపాదముల సేవ - నే జేయ వలెను
మాపాదముల నొత్తం - మగువ నీకేల
యంతటి వాడైన - యాగజేంద్రుండు
మావటీనికి క్రింద - మణి గుండ లేద
పురుషోత్తములతోన - పుట్టితివి గనుక
బుద్ధులకు కొదవటే - పొలతిరో నీకు
అనుచు తేనియబోలు - సతీ వలల్కాని
పానకంబులు త్రాగి - పండ్లారగించి
కర్పూర వీడెములు - కడు నర్థి జేసె

అటు మేను లుప్పొంగె - ఆదంపతులకు
తలపులు పులకించె - నెలత కుంబతికి
ఆసుభద్రాదేవి - ఆ యర్జునుండు
సంతోషమున నుండ్రి - సర్వ కాలమ్ము
అవనిలో తాళ్ళపాకాన్నయ్య గారి
తరుణి తిమ్మక చెప్పె - దాను సుభద్ర
కళ్యాణ మను పాట - కడు మంచి తేట
పలుకుల, నీపాట - పాడినా విన్న
శ్రీ హరి వారికి - చేరువై యుండు
నానాట పాపములు - నాశనం బౌను
ఆప్తులు బంధువు - లను బొందగలరు
సప్త సంతానములు - సమ కూర గలవు.


సంపూర్ణము.

............................................................

తిరుమల తిరుపతి దేవష్తానం ప్రెస్. తిరుపతి..... కా. 350

This work is in the public domain in countries where the copyright term is the author's life plus 70 years or less.


It is not necessarily in the public domain in the United States if published from 1923 to 1977. For a US-applicable version, check {{PD-1996}} and {{PD-URAA-same-year}} for relevant use.