సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/చివరి అట్ట
SUPRASIDDHULA JEEVITHA VISESHALU
JANAMADDHI HANUMATH SASTRI
పేరు: | జానమద్ది హనుమచ్ఛాస్త్రి |
జననం: | 5-9-1926 - రాయదుర్గం, అనంతపురం జిల్లా |
జననీ జనకులు: | జానకమ్మ- సుబ్రమణ్య శాస్త్రి |
విద్యాయోగ్యతలు: | ఎం.ఏ (ఆంగ్లం) ఎం.ఏ(తెలుగు) బి.ఎడ్ -రాష్ట్ర భాషా విశారద |
ఉద్యోగం: | ప్రభుత్వ విద్యాశాఖలో అధ్యాపకుడుగా - స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్ గా, కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా,1946-1984 |
ముద్రిత రచనలు: | మా సీమకవులు, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి-కన్నడ సాహిత్య సౌరభం , గణపతి - వినాయకుని గురించిన పరిశోధనాత్మక గ్రంథం (కన్నడం నుండి తెనిగింపు), మనదేవతలు, రసవద్ఘట్టాలు, దేవుని కడప, విదురుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.భీమరావ్ అంబేద్కర్, సి.పి.బ్రౌన్ చరిత్ర .
వివిధ దినపత్రికలలో 2 వేలకు పైగా వ్యాసాల ప్రచురణ. అనేక సాహిత్య సదస్సులలో ప్రసంగాలు-పత్ర సమర్పణ. అయ్యంకి అవార్డు స్వీకారం, కవిత్రయ జయంతి పురస్కారం రెండుసార్లు. మరెన్నో సత్కారాలు పొందారు. |
"శ్రీ హనుమచ్ఛాస్త్రి ఎంతో శ్రమపడి విషయ సేకరణ చేసుకున్నాడు. ఆయన ఏ పనిచేసినా ఓర్పుతో సర్వ విషయ సేకరణ చేసేది ఆయన ప్రత్యేకత. 'ఏదో చేస్తిలే 'అనే ఆత్మవంచన చేసుకోడు తాను వ్రాసే విషయంపై ఎంతో సానుభూతితో గుణదోష వివేచనను మరువని వివేకంతో కలం కదిలిస్తాడు."
-డా. పుట్టపర్తి నారాయణాచార్య
ISBN:81-7098-108-5
Cover printed at Sri Balaji Art Printers, Chikkadapally, Hyd-20.