సహాయం:దిద్దుబాటు సారాంశం

వ్యాసాన్ని దిద్దుబాటు చేసే పేజీలో ప్రధాన దిద్దుబాటు పెట్టెకు దిగువన కింద చూపిన విషంగా ఉండే చిన్న సారాంశము పెట్టెను చూడవచ్చు:

దిద్దుబాటు సారాంశం టెక్స్టు బాక్సు

సారాంశం రాయడం మంచి అలవాటు. మీరు చేసిన దిద్దుబాటుకు సంబంధించిన సారాంశం రాయడం వలన, ఏం మార్పులు చేసారో ఇతర వికీపీడియన్లకు తెలుస్తుంది. మీ అభిరుచులలో "సారాంశం ఏమీ లేకుండా భద్రపరచబోయినపుడు నాకు చెప్పు" అని సెట్ చేసుకుంటే మరీ మంచిది.

లక్షణాలు

మార్చు

సారాంశం పెట్టెలో 200 కారెక్టర్లు పట్టే ఒక లైను రాయవచ్చు. అంతకంటే ఎక్కువ రాసినా మొదటి 200 కారెక్టర్లే కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు 205 కారెక్టర్లు రాసారనుకోండి.. చివరగా రాసిన 5 కారెక్టర్లు, అవి లైను చివర రాసినా, మధ్యలో రాసినా కనబడవు.

సరిచూడు మీట నొక్కినపుడు సారాంశపు మునుజూపు కూడా చూడవచ్చు.

సూచనలు

మార్చు

సారాంశం పెట్టెలో తప్పక రాయండి. ఇదొక ముఖ్యమైన మార్గదర్శకం. అసలు లేనిదాని కంటే కొద్దిపాటి సారాంశమైనా నయమే. వ్యాసంలోని టెక్స్టును కొంత తీసేసిన సందర్భంలో సారాంశం మరింత ముఖ్యం; అది లేకపోతే మీ ఉద్దేశ్యాన్ని అనుమానించే అవకాశం ఉంది. అలాగే ఒక మార్పును గురించి రాసి వేరే ముఖ్యమైన మార్పును గురించి రాయకపోతే కూడా అటువంటి అవకాశమే ఉంది; "ఇంకా ఇతరత్రా" అని చేర్చండి, సరిపోతుంది.

సరైన సారాంశాలు రాయడం వలన, సంబంధిత మార్పును పరిశీలించాలసిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని సభ్యులు నిర్ణయించుకోవడం తేలిక అవుతుంది. సారంశం చూడగానే సభ్యుల్లో కుతూహలం రేగడం జరుగుతూ ఉంటుంది. చిన్న మార్పులకు కూడా తగు సారాంశం ఉంటే మంచిది.

వ్యాసంలో ఏదైనా చిన్న చేర్పు చేసినపుడు, ఆ చేర్పు మొత్తాన్ని సారాంశంలో పెడితే పెద్దగా శ్రమ లేకుండానే, బోలెడంత సమాచారం ఇచ్చినట్టవుతుంది. దానికి ముందు '++' అని చేర్చారనుకోండి.. సదరు టెక్స్టును యథాతథంగా చేర్చినట్లుగా అర్థం అవుతుంది. ఏమి చేర్చారో తెలిసిపోయింది కాబట్టి, మరేదైనా మార్చేందుకు తప్ప సభ్యులు ఆ పేజీకి వెళ్ళకపోవచ్చు. దీని వలన సభ్యుల సమయం ఆదా అవుతుంది, సర్వర్లపై భారమూ తగ్గుతుంది.


మీరు చేసిన చేర్పు 200 కారెక్టర్లకు మించినదైతే, అది సారాంశం పెట్టెలో పట్టదు. కాబట్టి, మొదటి 200 కారెక్టర్లు కనబడి మిగతా భాగం కనబడదు. కనబడే 200 కారెక్టర్లు సారాంశంగా సరిపోతుంది. అయితే ఇప్పుడు సారాంశానికి ముందు '++' కాక '+' మాత్రమే రాయాలి.

సారాంశం పెట్టెలో ఒకలైనులో ఉన్న టెక్స్టును మాత్రమే కాపీ చెయ్యగలరు. రెండు మూడు లైన్ల నుండి కాపీ చేసి పేస్టు చెయ్యాలంటే, ఒక్కో లైనిను విడివిడిగా పెట్టాలి. వాటి మధ్య new line కారెక్టరైన '/' పెడితే సరిపోతుంది.

సారాంశం పెట్టెలో సారాంశంతో పాటు, ఆ దిద్దుబాటు ఎందుకు చేసామో కూడా రాయాలి. మరీ ముఖ్యంగా ఏదైనా టెక్స్టును తొలగించినపుడు, ఇది చాలా అవసరం. మీరిచ్చే వివరణకు సారాంశం పెట్టె సరిపోనపుడు, ఆ వివరణను చర్చ పేజీలో రాసి, సారాంశం చర్చాపేజీలో ఉంది అని సారాంశం పెట్టెలో రాయాలి.

ఓ సారి పేజీని భద్రపరచాక, సారాంశాన్ని మార్చలేరు. కాబట్టి గుణింతాల తప్పులు లేకుండా చూసుకోవాలి.

సారాంశంలో రాయవలసిన ముఖ్యమైన సమాచారాన్ని మరచిపోయి పేజీని భద్రపరిస్తే, మళ్ళీ ఓ డమ్మీ దిద్దుబాటు చేసి, మీరు రాయదలచిన సారాంశాన్ని రాయాలి.

దిద్దుబాటు సారాంశం కనిపించే చోట్లు

మార్చు

కింది స్థలాల్లో దిద్దుబాటు సారాంశం నల్లటి ఇటాలిక్ అక్షరాల్లో కనిపిస్తుంది:

  • పేజీ చరితం - మీరు దిద్దుబాటు చేసిన పేజీలో జరిగిన మార్పు చేర్పుల జాబితా
  • సభ్యుని రచనలు - మీరు చేసిన దిద్దుబాట్లన్నీ
  • వీక్షణ జాబితా* - వీక్షణలో ఉన్న పేజీల్లో జరిగిన మార్పు చేర్పుల జాబితా (లాగిన్ అయి ఉన్న సభ్యులకు మాత్రమే)
  • తేడా - రెండు దిద్దుబాట్ల మధ్య ఉన్న తేడాలను చూపిస్తుంది
  • ఇటీవలి మార్పులు - ఇటీవలి మార్పులన్నీ
  • సంబంధిత మార్పులు - మీరు దిద్దుబాటు చేసిన పేజీకి లింకయి ఉన్న పేజీల్లో జరిగిన ఇటీవలి మార్పులు
  • కొత్త పేజీల జాబితా: పేజీ సృష్టికి సంబంధించిన దిద్దుబాటు సారాంశాన్ని చూపిస్తుంది.

* మెరుగైన వీక్షణ జాబితా వాడి, పేజీలో జరిగిన చివరి మార్పు మాత్రమే కాక, ప్రతీ పేజీలో జరిగిన అన్ని ఇటీవలి మార్పులను చూడవచ్చు.

సాయిరాం నిలురౌతు దాసరధిపురం .కొత్తూరు మందలం రాజారావు దామొదర్ కనకదుర్గా షివలయం

పొడిపదాలు

మార్చు

అనుభవజ్ఞులు సారాంశాల్లో పొడిపదాలు వాడుతూ ఉంటారు. ఉదాహరణకు, వెనక్కు తీసుకుపోవడాన్ని ఇంగ్లీషులో rv అని అంటారు. ఇలాంటి పొడిపదాలు, పొట్టి పదాలను వివేచనతో వాడాలి. అందర్తికీ అర్థమయ్యేటట్లు ఉండాలి.

అన్వేషణ

మార్చు

వికీమీడియా అన్వేషకము దిద్దుబాటు సరాంశాలను వెతకలేదు. బయటి సెర్చి ఇంజన్లు కూడా వాటిని ఇండెక్సు చెయ్యవు.

ఫైలు అప్ లోడు సారాంశం

మార్చు

ఫైలును అప్ లోడు చేసేటపుడు అప్ లోడు సారాంశం ఇవ్వవచ్చు. దీని వలన బహు ప్రయోజనాలున్నాయి:

  • అప్ లోడు లాగ్ లో వచ్చే ఆటోమాటిక్ సారాంశంలో రెండో భాగంగా ఇది కనిపిస్తుంది. (మొదటి భాగం - ఫైలు పేరు)
  • బొమ్మ చరితం లో
  • బొమ్మ యొక్క ఫైలు పేరు కొత్తదైతే:
    • కొత్తగా సృష్టించబడే బొమ్మ పేజీకి దిద్దుబాటు సారాంశంగా
    • బొమ్మ పేజీలోని దిద్దుబాటు చెయ్యగల భాగంలోని చ్వికిటెక్స్టుగా. దీనిలో కింది సంభావ్యతలుంటాయి:
      • బొమ్మను క్లుప్తంగా వివరించు
      • అంతర్గత, బయటి లింకులు ఇవ్వడం
      • మూసలను పిలవడం
      • బొమ్మ ఉండే ఒకటి లేదా రెండు వర్గాలను చూపడం

అప్ లోడు సారాంశం సామర్థ్యం 250 కారెక్టర్లు కలిగిన ఒక లైను; అప్ లోడు లాగ్ సామర్థ్యం ఫైలుపేరుతో కూడా కలిపి 255 కారెక్టర్లు కాబట్టి, సారాంశంలోని చివరి కొంత భాగం అప్ లోడు సారాంశంలో కనబడదు.

విభాగం దిద్దుబాటు

మార్చు

"+" గుర్తును నొక్కి చర్చాపేజీకి కొత్త విభాగాన్ని చేర్చేటపుడు, ఆ విభాగపు పేరే సారాంశంగా అవుతుంది. ఉన్న విభాగంలో దిద్దుబాటు చేసేటపుడు, సారాంశం మొదట్లో విభాగం పేరు /* , */ అనే గుర్తుల మధ్య ముందే చేరి ఉంటుంది. ఉదాహరణకు /* బయటి లింకులు */. ఈ టెక్స్టు తరువాత దిద్దుబాటు వివరాలను చేర్చాలి. (మీరు రాయదలచిన సారాంశం బాగా పెద్దదై, విభాగం పేరు పోగా మిగిలిన కారెక్టర్లు సరిపోకపోతే, విభాగం పేరును తీసివెయ్యవచ్చు.)

ఆ సారాంశాన్ని చూసేటపుడు, విభాగం పేరు బూడిద రంగులో కనబడుతుంది. దాని పక్కనే ఓ చిన్న లింకు ఇలా ఉంటుంది: బయటి లింకులు. ఈ బాణం గుర్తును నొక్కి సదరు విభాగానికి నేరుగా వెళ్ళవచ్చు. ఒకవేళ ఆ విభాగాన్ని తరువాత తొలగించి ఉంటే, ఆ పేజీకి వెళ్తుంది.

ఉన్న విభాగాన్ని దిద్దుబాటు చేస్తూ ఓ కొత్త విభాగాన్ని (పాత విభాగానికి ముందు గాని, తరువాత గానీ) సృష్టిస్తుంటే, /* , */ ల మధ్య ఉన్న టెక్స్టును తొలగించండి. /* */ సిన్టాక్సు వాడి బహు విభాగాలకు లింకులు ఇవ్వవచ్చు. – ఒకే సారి అనేక విభాగాలలో దిద్దుబాట్లు చేస్తున్నపుడు ఇది ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు, సారాంశం:

/* సింగినాదం */ పరీక్ష /* జీలకర్ర */ పరీక్ష 

ఇలా కనిపిస్తుంది:

→సింగినాదం పరీక్ష →జీలకర్ర పరీక్ష

"వ్యాఖ్యను పంపండి" విశేషం

మార్చు

చర్చాపేజీలో కొత్త తీగను మొదలు పెట్టేటపుడు, "వ్యాఖ్యను పంపండి" అంశాన్ని వాడవచ్చు.చర్చ లింకుకు పక్కన ఉన్న + గుర్తును నొక్కండి. ప్రధాన ఎడిట్ పెట్టెకు పైన, "విషయం/శీర్షిక" అనే పెట్టె కనిపిస్తుంది. ఈ పెట్టెలో టైపు చేసే టెక్స్టు ప్రధాన ఎడిట్ పెట్టెలో రాసే టెక్స్టుకు కొత్త శీర్షిక గాను, దిద్దుబాటు సారాంశం గాను కూడా కనిపిస్తుంది.

ఆటోమాటిక్ సారాంశాలు

మార్చు

కొన్ని సందర్భాల్లో దిదుబాటు సారాంశం లేకుండా దిద్దుబాటును భద్రపరచినపుడు, దానికి ఓ ఆటోమాటిక్ సారాంశం చేరుతుంది. విభాగంలో దిద్దుబాటు చేసినపుడు చేర్చే సారాంశం కంటే ఇది భిన్నంగా ఉంటుంది.

Situation Page Text
దారిమార్పు ద్వారా పేజీ సృష్టిస్తున్నపుడు, లేదా మారుస్తున్నపుడు
(దారిమార్పు లక్ష్యం పేజీతో '$1' ను మారుస్తున్నపుడు)
మీడియావికీ:Autoredircomment [[WP:AES|←]]Redirected page to [[$1]]
పేజీలోని టెక్స్టు మొత్తాన్ని తీసేస్తున్నపుడు మీడియావికీ:Autosumm-blank [[WP:AES|←]]Blanked the page
పేజీలోని టెక్స్టును చాలావరకు తీసేస్తున్నపుడు, లేదా ఓ పొట్టిపేజీలో దిద్దుబాటు చేస్తున్నపుడు
(పేజీ టెక్స్టుతో '$1' ను మారుస్తున్నపుడు)
మీడియావికీ:Autosumm-replace [[WP:AES|←]]Replaced content with '$1'
కొత్తపేజీ సృష్టిస్తున్నపుడు (పేజీ టెక్స్టుతో $1 ను మార్చినపుడు) మీడియావికీ:Autosumm-new [[WP:AES|←]]Created page with '$1'

ఒక్క దారిమార్పు సందర్భంలో మాత్రం, ఈ ఆటోమాటిక్ సారాంశం చక్కగా సరిపోతుంది. మిగిలిన సందర్భాల్లో, ఇది సభ్యుడు/సభ్యురాలు రాసే సారాంశానికి ప్రత్యామ్నాయం కాదు. అంచేత పై సందర్భాల్లో కూడా సారాంశాలు రాయాలి. సారాంశపు ప్రాముఖ్యత తెలియని కొత్తవారు దిద్దుబాట్లు చేసినపుడు, ఇవి ఉపయోగపడతాయి.

వికీటెక్స్టును చూపించే విధానం; URLలు

మార్చు

సారాంశంలో రాసిన అంతర్గత లింకులు, పైపు లింకులు, అంతర్వికీ లింకులు, వంటివి లింకులుగానే కనిపిస్తాయి. వాటిని <nowiki> , </nowiki> ల మధ్య పెట్టినా రెండరయి కనిపిస్తాయి.

ఇతర వికీటెల్స్టు కోడు రెండరు కాదు.