సరస్వతీ దండకం
జయ జయ జనయిత్రీ కళ్యాణ సంధాత్రీ|
గాంధర్వ విద్యా కళాకంఠనాళాం త్రివేదీవళీం|
సార సాహిత్య నిర్విత్తతప్రోల్ల సద్రుక్తరంగాం|
మానసాల్లోల హేమాంబు జాసీన రావే|
చతుర్వేద షట్చాశ్త్ర సంపర్క సంభూత సౌందర్య సంప్రాప్త నిస్తంద్ర సాంద్ర ప్రతిష్టాభిరామా|
సురామా| రమా| కోమలాశీస్సుధా ధన్యధామా|
జ్యోతిషాహార దండేన తారోదయ స్పూర్తి విద్యోత మానేన విబ్రాజితా|
మాత్మ పక్షాను రాగాన్వితాభ్యాం|
మత్స్య పద్మాది సంరక్షితం పాణిపద్మం త్వదీయం| పురాణం||
శిరస్తావకం నిర్మలం ధర్మశాస్త్రం|
సురానీక నిత్యార్చనానీత మందార మాణిక్య దామోజ్వలత్కంఠసీమ| దయాధామ||
రావే పయోజాసనాస్యాబ్జ సంభావితా|
సంస్కృత ప్రాకృతాంధ్రాది భాషా చకోరాక్షి సంసేవితా|
భవ్య సంగీత సాహిత్య దిగ్వాప్త సత్కీర్తి సౌరభ్య సంపూజితా|
వీణపై శుద్ధ కళ్యాణి వాయించుచో నిన్ను దర్శించు గేర్దోయి జోడింపగా ఎంచు నన్నింక రక్షింపరావే|
విద్యామయీం| త్వాంభజే| భగవతి| గుణదీర్గ భావోద్భవాం|
సంతతిం సంథదానం|
కవీశానులేనాడో నీ దివ్య రూపంబు నూహించి వర్ణించి సమ్యగ్రసాంబోధి దేలించి మెప్పించి
విఖాతులై పోల్చిరీనాడు సామర్ధ్య హీనుండనయ్యున్ మదిన్నీకు కైమోడ్చి కావించితీ దండకంబున్|
పవిత్రాంతరంగుండనై భారతీ| నన్ను రక్షింపరావే|
శరత్కాల పూర్ణేందు బింబాననా విద్యా ప్రధానమ్ము కావింతువంచున్ సదా నమ్ముదున్|
శారదా నమస్తేస్తు సాకారతా సిద్ధి భూమ్నే| నమస్తేస్తు కైవళ్య కళ్యాణసీమ్నే|
నమస్సర్వ గీర్వాణ చూడామణి శ్రేణి శోణ ప్రభాజాల బాలా తపస్మేర పాదాంబుజాయై|
నమస్తే శరేణ్యే నమస్తే వరణ్యే|
నమశ్శర్మదాయై నమో వర్మదాయై|
నమశ్శాశ్వతాయై నమో విశ్రుతాయై|
నమశ్శారదాయై నమస్తే నమస్తే నమ:||