సప్తశైల విశాల పన్నగ
ఈ పాటను వేటూరి సుందరరామమూర్తి శ్రీఏడుకొండలస్వామి చిత్రంకోసం రచించారు. సంగీతం చేసింది ఇళయరాజా. గానం చేసింది ఎస్.పి.బాలసుబ్రమణ్యం.
సప్తశైల విశాల పన్నగ ఫణి ఫణాగ్ర విభూషణం
దుష్టదానవ శోషణం శిష్ట జన పరిపోషణం
తంనమామి విధాతృవందిత పాదపంకజ చారణం
స్మరామితం శనిపాలనం సూర్యచంద్రవిలోచనం ||
శంకరార్చిత శంకరం శ్రీకరం శివంకరం
భూత భౌతిక వర్తమాన త్రికాలపీడా సంహరం
సర్వతనుగత దేవతాత్మక మందిరం శుభసుందరం
పాహిమాం పాపాపహం పతితజీవన పావనం ||
మాం క్షమస్వ మహీజనార్చిత మాధవా రమాధవా
దేహిమాం తవ దర్శనం శ్రీకరాగ్ర సుదర్శనం
మత్తమంద తమోవిదార విశుద్ధ కాంతి నిదర్శనం
దేహిమే దేవాదిదేవ దివ్యహస్తాలంబనం
సర్వకిల్బిష నాశక శ్రీ కలౌ వేంకటనాయక
అవధారు మామక దండకం నవగ్రహోజ్జ్వల దీపక
నాయకా దీపకా వేంకటేశ్వర నాయకా||