సకలనీతిసమ్మతము/తృతీయాశ్వాసము
శ్రీ
సకలనీతిసమ్మతము
తృతీయాశ్వాసము
క. శ్రీశవాణీశరుద్రా
ణీశసురేశాదిసకలదివిజార్చితదో
షాశాపాశరజాది
క్లేశరహితపదసనాథ కేశవనాథా. 643
షాడ్గుణ్యము
క. చన వెఱిఁగి నడయవలయును
వినయోచితవృత్తి సంధివిగ్రహయానా
సనసంశ్రయణద్వైదము
లను షాడ్గుణ్యంబు పతి నిజామాత్యులతోన్. 644
కుమారసంభవము
వ. తత్ప్రకారం బెట్టి దనిన. 645
సీ. తనసమానం డగు ధరణీశుపాలికి
గూఢచారులఁ బంచి కొలఁది యెఱిఁగి
చెలిమి యేర్పడఁగ లేఖలు పుచ్చి
క్రమ్మఱ నతనిలేఖలు విని యాదరించి
పావడంబులు రాయబారులచే నంపి
యతఁడు పుత్తెనిచిన ననుభవించి
..............................................
.............................................
ఆ. తగినబాస చేసి తాను నాతఁడు గని
వేడ్కఁ దాను నతఁడు వియ్య మంది
యతఁడు దనకుఁ దాను నతనికి నై కూడి
సఖ్య మాచరింప సంధి యయ్యె. 646
సీ. పరభూమిరాజు దుర్బలుఁ డైనతఱిఁ
దనమన్నించువారిని జెన్ను మిగుల
బసులుదెచ్చియు గడిపల్లెలు పొడిచియుఁ
జిచ్చులు వైచియుఁ జెఱలు గొనియుఁ
దెరువాటు లడిచియుఁ దెక్కలు దాఁకియు
నూళ్లు గాల్చియు పైరి నొలిచికొనియు
బందులు పట్టియుఁ దొందడి చేసియుఁ
గన్న గాండ్రను బంచి కలిమిగొనియు
గీ. కొలుచుఁ జేలును దోఁటలు కొల్లగొనుచు
బ్రతుకుఁ డని దాను జతురంగబలముతోడఁ
బగఱపైఁ జని దేశంబు పాడుచేసి
వెఱవు పుట్టించుచునికియ విగ్రహంబు. 647
సీ. సంతోష మొదవ వసంతకాలంబున
శుభవేళ శకునంబుఁ జూచి కదలి
పొలవరుల్ ముందటఁగెలఁకులఁబిఱుఁద రా
నియమించి సుసరంపు బయలుఁదెరువు
గైకొని రథములుఁ గరులు నశ్వంబులుఁ
దాను వ్రేఁకపుముట్లు తగినవారు
వడుముగాఁ జని పూరుపుడకలు నీళ్లును
గలమేలుచోటఁ గావలి యొనర్చి
ఆ. గొల్లెనలుసు దెరలు జల్లడ దట్లువా
నమ్ములు మఱి వలయునభిమతములు
బలిమి మిగులఁ గదిసి పదతుపై నరుగుట
యాన మనఁగఁ బరఁగు మానవేంద్ర. 648
సీ. బలు వగుదుర్గంబు పాటించికొని యాప్త
చరులచూపులఁ బరుసంబు చూచి
మతిమంతు లనఁదగుమంత్రివర్గముఁ బంచి
యధికులతో నెయ్య మందఁగూడి
తనయంతవానిని దళవాయిగాఁ జేసి
చతురంగబలముతో నతనిఁగూర్చి
పగవారిభూములపై దండు పంపుచు
భవ్యవస్తువులు గప్పములు గొనుచు
ఆ. నాత్మరక్ష మేర యన న్యాయవర్తులఁ
దనకు నెగ్గు సేయఁ దలఁచువారి
మద మడంచి యెందుఁ గదలక యుండుట
యాసనం బనంగ నతిశయిల్లు. 649
సీ. ఎల్లగుణంబుల నెక్కుడు నేర్పును
సాహసంబును లావుఁ జలము గలుగు
పగరాజు లిరువురు బలసమేతంబుగాఁ
గడిమిమైఁ బై నెత్తి విడియుటయును
గలఁగక తొలఁగక కార్యంబుతోడన
మదము బెరయ సేన కెదుర నడచి
(యొరు)భేదముగఁజేయ నొయ్య నవ్వలివాని
నొకరునితో నెయ్యమొనరఁగూడి
ఆ. యతఁడు దాను నున్నయతఁడు ద న్నేమఱి
యున్నచోటఁ బొడిచి యుక్కడంచి
సొమ్ముల నడరియును జూఱలు గొనుటయు
సంశ్రయంబు (నాఁగ జగతిఁ బరఁగు). 650
సీ. వైద్యులు వంటలవారు సావాసుల
దాసులు...................వాహనాధి
కారులు నంగరక్షకు లాదిగాఁ బరి
జనులకు వేర్వేఱ ధనము లొసఁగి
గరళాననాదుల.....................
............................................
........................................
............................................
గీ. .......................................
బనచి యందులోఁ గలిగిన బలియుపేరఁ
గల్లలేఖలు వ్రాయించిఁ గళ్ళబట్టి
వడఁగఁ బంచుట ద్వైధి నాఁబరఁగు నధిప. 651
వ. సామ ............ ..................తరంబున నాఱుదెఱుంగులుగా రచియించి ప్రయోగింపవలయు నది సంధివిగ్రహయానాసనసంశ్రయద్వైధీభావంబు లనఁబడు ....................
........ ..................... థి యపకారంబు సేయుట విగ్రహంబు దండెత్తుపోవుట యానం బుపేక్షించుట యాసనంబు పరునిఁ గొలుచుట సంశ్రయణంబు .......... .................. బనంబడు నీనియందు. 652
నీతిసారము
సీ. సన్నపువానికి సంధికార్యం బతి
బలునకు మర్యాద గలిగెనేని
విధియించుకొను .....................
.....................................
..................................జను టొప్పు
నుద్ధతి తనభూమి కొందదేని
సముఁ డైనవాని కాసనమైన నుచితంబు
తలఁచుకార్యము మీఁదఁ దగిలెనేని
ఆ. శక్తిహీనుండు...................................
.....................................................
.....................................................
ద్వైధ మయ్యిరువురకును మైత్రి యెసఁగదేని. 653
అష్టాదశవ్యసనములు
క. పది కామజంబు లెనిమిది
.......................................................
....................................
..................వలవఁ బాయంగవలయున్. 654
క. పరివాదాక్షాఖేటక
పరబాక్యత్రిక వధూకపానాష్టమద
స్ఫురణవృతార్థులు పృథ్వీ
శ్వర ..... ................ ............. (?) 655
క. ..........................
..............రవచనదూషణము లనం
గా నేఁ డతిశయదోషా
స్థానము లష్టాదశవ్యసనములలోనన్. 656
క. కామభవవ్యసనం బ
...............................................
.............................
ద్దామక్రోధోద్ధితోన్మదవ్యసనములన్. 657
పురుషార్థసారము
క. వనితాశక్తియుఁ దానం
బును జూదము వేఁట యర్థము[న దూషణ మొ
ప్పనిదండమ్ముని వాక్కున
ఘనపరుషిత వ్యసనసప్తకం] బనఁ బరఁగున్. 658
నీతిసారము
వ. అట్టివ్యసనంబులు సహజాగంతుకభేదంబుల లెండుదెఱంగు లందు సహజంబుల గుర్వాజ్ఞాధర్మశాస్త్రంబుల నూతనపుణ్యోఖ్యానంబు లాకర్ణించియు నుపశమింపఁ జేయునది. 659
సీ. స్త్రీ సేవ ఘనమైనఁ జెడు దేహధనములు
పానాభీరతి మతిభ్రష్టుఁ జేయుఁ
దల్లి చచ్చినను జూదరి లేచిపోవండు
మృగచోరబాధలు మృగయఁ గలుగు
ధన మప్రయోజనదత్తమై ధనపతి
కైనఁ బేదఱికంబు నావహించుఁ
బలుకుప్రల్లదమును బరుసనిశిక్షయుఁ
బగసేయు ధరఁ గల ప్రజల నెల్లఁ
ఆ. గాన వీని విడువు గడఁకమై మఱియును
ధనము యశము ప్రాణమును హరించు
సాహసంపుఁబనుల చక్కటిఁ బోవక
పాటి యనక యుండ బ్రతుకవలయు. 660
అజ్ఞాతము
క. ఏకమృగభూవినోద
వ్యాకులుఁ డగునేనిఁ దతి పురాంతికభూమిన్
శ్రీకరమృగయారణ్యము
గైకొని చెయింపవలయుఁ గడుసౌఖ్యముగన్. 661
వ. అది యెట్లనిన. 662
సీ. నగసమీపంబున నదిపొంతనేనియు
బహుజలశాద్వలప్రకటభూమి
నిడువు వెడల్పును నెళి యర్థయోజన
సమ్మతమై కడుఁ జదరముగను
మృగలంఘనీయమై యోగి నన్యదుర్గమై
యురుపరిఖాచక్ర మొప్పు మిగులఁ
గంటకోత్కరలతికాగుల్మశూన్యమై
వరవిషపాదవర్జితముగ
గీ. జ్ఞాతపూర్వంబులై మనోజ్ఞంబు లగుచు
సురభిఫలపుష్పగంధముల్ విరళములును
స్నిగ్ధనీలఘనచ్ఛాయముగ్ధములును
నైనతరువులయది మృగయావనంబు. 663
సీ. పాంసుప్రపూరితబహురంధ్రకందర
క్ష్మాతలనాదిసమంచితంబు
స్థాణువల్మీకపాషాణాదివిదళన
భూరిసమీకృతభూతలంబు
శోధితగ్రాహవిశుద్ధజలంబును
ననతిగంభీరజలాశయంబు
మహితనానావర్తమధురవిహారంబు
నగణితవిహగసమాశ్రయంబు
గీ. చారుసంఘాత్యమృగపరిపూరితంబు
ననుపమహస్తినీకలభాన్వితంబు
భగ్నదంష్ట్రానఖవ్యాఘ్రబంధురంబు
ఛిన్నశృంగవిషాణిసంపన్నతలము. 664
సీ. పరిఖాతటంబునఁ బరిమళబహుళ
ప్రసూనపల్లవపరిశోభమాన
మై సుఖసేవ్యలతాపూర్ణ మగువన
రాజిమై నెంతయు రమ్య మగుచు
వెలుపల నతిదూరవిస్తృతస్థలమున
నపగతభూరుహం బగుటఁ జేసి
యనుదినశత్రుసైన్యాగమ్యభూమియై
నిజమనఃప్రీతిసందీపనంబు
గీ. వనమృగాస్వాంత వేదులు ఘనదృఢాత్ము
లనుపమానైకదుష్కరాయాససహులు
నైన యాప్తులచే రక్షి తాఖిలంబు
నగువనం బొప్పుఁ బతికి విహారమునకు. 665
క. విజితశ్రముఁ డగు మృగయుఁడు
నిజరాజవిహారమునకు నిపుణతను మృగ
వ్రజమున్ దద్వనభూమికి
నిడముగఁ గొనివచ్చి వచ్చి నింపఁగవలయున్. 666
చ. రమణ ననన్యకార్యవిధురంబుగ నేఁగి ప్రభాతవేళ సం
క్రమణసమర్థుఁడై విహృతికాంక్ష మితాప్తభటాలి గొల్వ భూ
రమణుఁడు తద్వనస్థలిఁ జొరన్ వెలిఁ జుట్టును సైన్యముల్ పరి
భ్రమణము లేక నిల్చునది బంధురలీల విదూరసంస్థలన్. 667
మ. మృగయాయానగుణంబులన్ బడయు సంప్రీతిన్ బ్రజాధీశుఁ డీ
మృగయాక్రీడనసద్విధిన్ (గుశలియై మేకొన్నఁగా కన్యథా
మృగయుంబోలె యథేచ్ఛ దుర్గవనభూమిం జొచ్చి వేఁటాడినన్
వగలం బొందఁడె శత్రుతత్త్వవిపదధ్వక్లేశవిభ్రాంతుఁడై). 668
కామందకము
మ. మృగముల్ చావకయున్నఁ దాఁ బ్రవణతన్ మేకొన్నఁ గాకున్నఁ దా
మృగయాజీవికితారజాతవిధురామీరన్మనోజ్ఞాతుఁ డై
మృగయాదోషముఁ బొందుఁ గాన పతి యిమ్మైఁ బోవలేదే ...
.............................................యిమ్మెయిన్ (?) 669
అజ్ఞాతము
వ. మఱియు ద్యూతవ్యసననిరూపణము. 670
సీ. అధికధనం బైన నప్పుడై చెడుటయు
మునుకొని లజ్జావిముక్తతయును
నిస్సత్యసంస్థితి నిష్ఠురకర్మంబు
కడుఁ గ్రూరవాక్ఛస్త్రఖండనంబు
కోపము ధర్మవిలోపంబు కర్తవ్య
వివిధకర్మక్రియావిముఖతయును
సత్సమాగమసుఖాస్వాదవిచ్ఛిత్తియు
సంతతదుర్జనసంగతంబు
గీ. అర్థనాశము నిత్యవైరానుబంధ
మమితనిత్యార్థములును నిరాశతయును
గడనసత్యార్థములచోట ఘనతరాశ
లనుగతక్రోధసంతాపహర్షములను. 671
సీ. ప్రతిదినంబును గ్లేశభాజనమై యున్కి
విసువ కెప్పుడు సాక్షి వెట్టుటయును
స్నానాదిగాత్రసంస్కారభోగములందు
నవరతంబును నరయవలయు
నవ్యయవ్యాయామ మంగదౌర్బల్యము
విపులశాస్త్రార్థగవేషణంబు
క్షుత్పిపాసాపరిశోషణక్లేశము
హవనాదివేగనియంత్రణంబు
ఆ. నివియు నాదిగా ననేకదోషంబులు
జూదమందుఁ గలుగఁ జూచినట్టు
జనులు సెప్పుచుండ వినఁబడు నెప్పుడు
గాన జూదమాడఁ గాదు పతికి. 672
క. రెండవసురేంద్రుఁ డగున
ప్పాండుసుతాగ్రజుఁడు మున్ను పటుమతియుతుఁడై
యుండియు జూదంబున మ
గ్నుండై పట్టంపుదేవిఁ గోల్పడి చెడఁడే. 673
క. జూదవ్యసనంబున మ
హోదయ మగు రాజ్య మెల్ల నోటువడి ప్రియం
బేది కళత్రము దొఱఁగి య
నాదరకర్మమునఁ గొలువఁ డా నలుఁ డన్యున్. 674
క. రుక్మాచలసమధైర్యుఁడు
రుక్మద్యుతిదేహుఁ డధికరూఢబలుం డా
రుక్మియు జూదంబున నా
రుక్మగజాశ్వముల నోడి రూపఱి చెడఁడే. 675
ఆ. దంతవక్త్రుఁ డనఁగఁ దనరు కాశికరూశ
దేశపతి యథేచ్ఛఁ దెఱఁగుమాలి
పరఁగ జూదమునను బలభద్రుచేతఁ దా
బండ్లు డుల్లనాటుపడఁడె మున్ను. 676
ఉ. జూద మనర్థహేతు వగు జూదము మైత్రికి మూలహాని యౌ
జూద మమందచిత్తమున క్షోభము పుట్టు ననాత్మపక్షసం
భేదము పుట్టుఁ గానఁ బతి బేలయి జూద మొనర్చు టొప్ప దా
హ్లాదము నున్మదోద్ధతజనాదరమునన్ బరివర్జ్య మెమ్మెయిన్. 677
సీ. కార్యగతిక్రియాకాలాతిపాతము
పృథులధర్మార్థ సంపీడనంబు
సంతతాభ్యంతరసంపాతవివశుఁడై
కుందుటఁ బ్రకృతిప్రకోపనంబు
యువతిపక్షముచేత నొగి రహస్యవిభేద
మరయఁగ గార్యక్రియాప్రియంబుఁ
దనర నీర్ష్యామర్షజననముఁ గ్రోధంబుఁ
జాలవిరోధంబు సాహసంబు
ఆ. నివియు మొదలు గాఁగ నిన్ని దోషంబులు
ద్యూతమందుఁ గలుగు దోషములును
అంగనావ్యసనమునందు నిన్నియుఁ బుట్టుఁ
గాన యది భజింపఁ గాదు పతికి. 678
గీ. కామినీజనముఖవిలోకనమునందుఁ
దమకపడియెడు నల్పచేతసుల కెపుడు
యౌవనముతోడఁ గూడ సమస్తమైన
యీహితంబులు లయ మంద కేల తక్కు. 679
పానవ్యసనము
సీ. వమనంబు విహ్వలత్వంబు సంజ్ఞానాశ
వర్తనలీల వివస్త్రతయును
బహువిధాబద్ధదుర్భాషావిశేషము
ననితరాకారణహననములను
యుఱక ప్రాణగ్లానియును సుహృన్నాశముఁ
బ్రజ్ఞామతిశ్రుతభ్రాంతి మఱియు
సద్వియోగంబు నసజ్జనయోగంబు
సతతకృతానర్థసంగ్రహంబు
గీ. స్థలనవేపథుతంద్రావికారములును
జిరతరాత్యంతకాంతానిషేవణంబు
లాదిఁగా గల దోషంబు లఖిలసద్వి
నిందితంబులు పానంబునందుఁ గలుగు. 680
క. శ్రుతశీలబలోపేతులు
నతిప్రతాపులును నైన యంధకవృష్ణుల్
అతిపానదోషవశమున
హత మంది యడంగి రనిన నన్యులవశమే. 681
ఆ. యోగిజనవరేణ్యుఁ డున్నతగుణశాలి
భృగుసమానబుద్ధి భృగుసుతుండు
శుక్రుఁ డకట పానశూరుఁడై తనచే టె
ఱుంగలేక కచుని మ్రింగఁ డయ్యె. 682
క. పానమదాంధుఁడై పనిఁ
బూని మదింపంగఁ జేయు పొం దెఱుఁగఁ డొగిన్
గానఁ బతి పానసంగతి
మానంగావలయు విజితమానసుఁ డగుచున్. 683
కామందకము
వ. ఇట్లీకామవ్యసనచతుష్కంబునందలి తారతమ్యం బెట్టి దనిన. 684
క. స్త్రీపానంబులకంటెను
భూపతిఁ జెఱుపంగ జూదమును వేఁటయుఁ దా
నోపు లఘుమాత్రమేనియుఁ
బై పడి సేవించెనేని పండితుఁ డైనన్. 685
ఆ. మాత్రతోడఁ బనమానినీవ్యసనముల్
జరుపు టొప్పు నెన్ని చందములను
నింతయైన చేఁత యెగ్గగుఁ గావున
వేఁటజూదములను విడువవలయు. 686
క. ఈసప్తవ్యసనములకు
నోసరిలుట లెస్స విడువనోపఁడయైనన్
వ్యాసక్తి వలదు వేఁటయు
నాసవపానమును నింద్య మని రాపతికిన్. 687
మదీయము
మంత్రరక్షణార్థములు
ఉ. రాజితమంత్రబీజము ధరావలయేశ్వరు రాజ్యలక్ష్మికిన్
బీజము గాన మంత్ర మవనీపతి రక్ష యొనర్చు టొప్పు నా
యోజ ఘటింపఁడేని నతఁ డొక్కట నాశముఁ బొందు నట్టిని
భ్రాజితమంత్రరక్షఁ దగురా జనపాయసుఖంబు గైకొనున్. 688
అజ్ఞాతము
క. రాజులకు విజయమూలము
రాజితతంత్రంబు సుస్థిరంబుగ దానిన్
రాజాన్వయ రక్షింతె ధ
రాజనులకుఁ గర్ణగోచరము గాకుండన్. 689
ఆ. కార్య మెట్టిదియును గాసియౌ మంత్రంబు
దలఁప నొరులచెవులు సిలికెనేని
కాన నాల్గుసేవుల నూనంగ రక్షింప
వలయు నెఱుక గలుగువారు ధరణి. 690
సభాపర్వము
క. ఆప్తు లెఱింగిన నాప్తుల
యాప్తు లెఱుంగుదురు తత్తదాప్తశ్రవణ
ప్రాప్త మగుచుండుఁ గావున
నాప్తపరంపరల మంత్ర మవియున్ బతికిన్. 691
బద్దెననీతి
ఆ. మిత్రునకును గొంత పుత్త్రునకును గొంత
సచివునకును గొంత సద్భటునకుఁ
గొంత సతికిఁ గొంత గుప్తంబు సేయంగ
వలయు నెడలు కొన్నిగలిగియుండు. 692
ఆ. చారణునకు వందిజనునకు భటునకు
నెరయ రక్షకులకు నీచులకును
మాలికులకును జనదు మంత్రంబు సెప్పంగ
వేగప్రకట మొందు వీరిచేత. 693
అజ్ఞాతము
ఆ. ఆప్తసమ్మతముగ నఖిలకార్యంబులుఁ
జేయువారి కెపుడుఁ జేటు లేదు
ఆప్తుగా నెఱుంగ కాడిన మంత్రభే
దనము నొంద కేల తక్కనేర్చు. 694
ముద్రామాత్యము
క. ఆప్తు నవివేకి నొల్లర
నాప్తుని విద్వాంసు నొల్ల రార్యులు మంత్ర
వ్యాప్తికి మంత్రి వివేకియు
నాప్తుఁడు గావలయు దశదిశాభరణాంకా. 695
బద్దెననీతి
సీ. నిర్గవాక్షంబును నిస్తంభసంశ్రయ
మరయ నిర్భిత్త్యంతరాశ్రయంబు
నగునెడ హర్మ్యాగ్రమందు నరణ్యంబు
నందును నవిలక్షితాత్ముఁ డగుచు
మనుమతద్వాదశమంత్రిమండలమైన
సురమంత్రిమతమంత్రిషోడశంబు
కవిమతవింశతికంబైన మఱి యథా
సంభవం బైనను సచివసమితి
ఆ. తనదుచుట్టుఁ గొలువఁ దవిలి యథా
శాస్త్రమార్గవృత్తిఁ గార్యమంత్రచింత
యమరఁ జేయవలయు నాహితచిత్తుఁడై
బుద్ధివృద్ధికై సుబుద్ధి యగుచు. 696
క. మఱి వేఱు వేఱ తా ని
ద్దఱతోడన కార్యచింత తగఁ జేయుచుఁ దా
రెఱిఁగించిన మతభేదము
లెఱుఁగుచు హిత మెఱుఁగవలయు నేచందమునన్. 697
ఉ. మంత్రబలాఢ్యు లైన నిజమంత్రులచేతఁ బ్రవృత్తమైన యా
మంత్రము నిష్ఠఁ దాన పలుమాఱు మదిం దలపోసి చూచి దు
ర్మంత్రము గాకయుండఁ దనరం దనకార్యము సిద్ధినొంద స
న్మంత్రవిధిజ్ఞుఁ డైన నరనాయకుఁ డెప్పుడు చేయఁగాఁదగున్. 698
సీ. ధరణీశుఁ డెప్పుడు తద్జ్ఞులయాజ్ఞలో
మెలఁగుచుఁ దనయాజ్ఞ మెలఁగు జనుల
నొకనినైనను నప్రియోక్తులఁ బలుకక
కార్యంబు దలపోయఁ గడఁగు నెపుడు
మించినపలుకు గ్రహించుటకై సర్వ
జనులవాక్యంబులు వినఁగవలయు
నేచి మదోద్వృత్తి నేదియు నెఱుఁగక
చేయంగఁ దగుపనుల్ చేయునపుడు
ఆ. మంత్రజనుల మీఱి మంత్రరహితుఁడైన
యతని నొక్కపెట్ట యహితవరులు
చిక్కువడఁగ నడఁచి సిరియును రాజ్యంబు
నలమికొండ్రు బుద్ధిబలము కలిమి. 699
ఆ. హితము నడఁపుచును నహితుల నడఁపక
పొదల విడుచు టేమి బుద్ధి దలఁప
గోరఁ డిదుమవచ్చుకొనయైన ముదిసినఁ
బరశుధారఁ గాక పాపఁదరమె. 700
నీతిసారము
క. పని యైనమీఁదనేనియుఁ
దను నన్యు లెఱుగకుండఁ దాన విచారం
బునఁ గొనఁగవలయుఁ గార్యము
వినుతనిగూఢక్రియావివేకస్ఫురణన్. 701
ముద్రామాత్యము
గీ. మంత్రు లాత్మప్రయోజనమహితబుద్ధి
దీర్ఘనిగ్రహ మొనరింపఁ దెలియలేక
కళవళించినయేని రా జలవు దఱిగి
పొసఁగు మంత్రులపాటికి భోగ్యుఁ డగుచు. 702
మ. నయశాస్త్రజ్ఞులు శుద్ధకర్ములును సన్మార్గప్రవృత్తాత్ములున్
జయశీలాఢ్యులునైన పూర్వులమహోసన్మార్గము న్మాని దు
ర్జయుఁడై మంత్రవినిర్ణయం బెఱుఁగ కున్మాదించి పైఁబడ్డ దు
ర్జయవిద్విట్ధరఖడ్గధారకు వెస న్గ్రాసంబు గాకుండనే. 703
ఆ. నీతిపథముఁ దప్పి నెఱి వేగపడి చేయు
నతఁడు దుఃఖఫలంబు ననుభవించు
క్రిందుమీఁ దెఱింగి కృతకార్యుఁ డగువాఁడు
సేయుకార్యమెల్ల సిద్ధిఁ బొందు. 704
వ. అజ్ఞాతవిజ్ఞానంబును నిశ్చయంబు నర్థద్వైధసందేహవిచ్ఛేదంబును నశేషదర్శనంబును నన మంత్రంబును నాలుగురూపంబులై యుండుఁ దత్ప్రకారం బెట్టిదనిన. 705
సీ. దేశకాలాంతరస్థితి నెఱుంగఁగరాని
పనివెంట విజ్ఞాన మనఁగఁ జెల్లు
నెఱిఁగిన పని బుద్ధి నెంతయు నూహించి
నెఱితథ్య మెఱుఁగుట నిశ్చయంబు
ఇరువురపై నెత్తి యరుగంగవలయుచో
హితమంత్రివరుల నూహించి చూచి
అందులో నొకనిపై నరుగ నిశ్చయ మొగిఁ
జేఁత సందేహవిచ్ఛేదనంబు
గీ. అడఁగు శత్రువుపై నెత్తి యరుగునపుడు
సంధివిగ్రహములయందు సంధి యధిక
మట్టిసంధియు భేదంబునంద యైనఁ
దనరు ననుట యశేషసందర్శనంబు. 706
క. నరపతులకు నెక్కాలముఁ
బరికింపఁగవలయు మంత్రపంచాంగములన్
వరనీతిజ్ఞులమతమున
వెరవుగ వివరింతు దాని విధ మె ట్లనినన్. 707
గీ. పటుసహాయము సాధనోపాయములును
దేశకాలవిభాగవిధిజ్ఞతయును
ఘనవిపత్ప్రతీకారంబు కార్యసిద్ధు
లనఁగ నొప్పగు మంత్రపంచాంగకములు. 708
సీ. దుర్గకృత్యమునకుఁ దొలుత సహాయాధి
కారులు పనిసేయు భూరిజనులు
పరశుకుంతాదులు బలుసాధనంబులు
నడుభూమి గడు నొండెఁ గడఁగి దుర్గ
మొనరించుటయు గ్రీష్మమున నిష్టకాదులు
వర్షకాలము కారువర్గకృత్య
మోలిఁ జేయుట దేశకాలవిభాగంబు
లాధర్వసామభేదాద్యుపాయ
ఆ. విధుల నాపదలకు వెస శాంతి నంతవి
ఘ్నప్రతిక్రియ యనఁ గలము వెలుఁగు
కార్యసిద్ధిఫలము లార్యులు మంత్రపం
చాంగ మందు దీని నండ్రు ప్రీతి. 709
సీ. శాశ్వతబుద్ధిమై జరుగు నాతనిబుద్ధి
యమర నౌత్పాదికి యనఁగఁ బరఁగు
శాస్త్రంబువలనఁ దా సంభూత మగుబుద్ధి
ఘనశాస్త్రసంభవం బనఁగఁ బరఁగు
జ్ఞానవృద్ధులతోడి సంసర్గ మగుబుద్ధి
సాంసర్గి యనఁగఁ బ్రశస్త మగును
మును పల్కి మఱియుక్తి యొనరింప
బుద్ధియై నది పరిణామిక యనఁగవలయు
గీ. నిట్టిబుద్ధులు నాలుగు నెసగు మంత్రి
శక్తి కరయ నాధారమై చనుటఁ జేసి
నీతిమంతులు సెప్పుదు రాతతముగ
రాచకృత్యంబు లివి యని రాజితముగ. 710
ఉ. మంత్రవివేకి యౌనతఁ డమందజయంబునఁ బొందు నెంతయున్
మంత్రవిహీనుఁ డైన నవమానముఁ బొందు సమర్థుఁ డేని దు
ర్మంత్రు నరాతు లోర్తు రౌగి రాక్షసు లధ్వరశీలునట్ల స
న్మంత్రుని నోర్వరా దగుట మంత్రవరుం డగు టొప్పు నెప్పుడున్. 711
కామందకము
ఉ. నీతిపథంబునన్ బ్రతుకనేర్చుట యుత్తమబుద్ధి కార్యసం
జాతములై కరం బలరుసంపద నొందుట మధ్యవృత్తి య
స్ఫీతము లైన బారవహజీవనముల్ తలపం గనిష్ఠముల్
నీతికి బాహ్యులైన ధరణీవర మెత్తురె వారి నుత్తముల్. 712
విదురనీతి
గీ. సూక్ష్మబుద్ధి జనులచొప్పున వర్తించు
వాని కాప్తజనవిహీన మైన
తఱి విచారమునకుఁ దక్కటుజను లేల
తనకుఁ దాన బుద్ధి గనఁగవలయు. 713
చ. కినుకను దుష్టవేదన మొగిం గొను టెంతయు దుష్కరంబు గా
కనుపమనీతికోవిదుల కారయ నెందు నసాధ్య మొందునే
ఇనుమును నీరుగాఁ గరఁగరే మదకుంజరమస్తకంబునం
దొనర మదంబు వెట్టరె సమున్నతవృత్తి నుపాయసంపదన్. 714
ఆ. పెద్దయయిన యినుపముద్ద దా నొకలేఁత
తీవనైన నెట్లు త్రెంపనేర్చు
నల్పమైన నదియు నతిశితధారచేఁ
ద్రెంప నోపు నెంతదృఢమునైన. 715
క. నీరున ననలం బాఱుట
నారయ లోకప్రసిద్ధ మయ్యనలముచే
నీరు గడు దోష మొందదె
చారుతరోపాశక్తిసంపదవలనన్. 716
ఆ. అంధకారంబునప్పుడు నడఁగిపోదు
దినపతేజంబునప్పుడు తిరిగి రాదు
యెట్టిమఱుఁగైనఁ గాన్పించు నెచట నున్నఁ
జారుతర మైనయట్టి విచారదృష్టి. 717
ముద్రామాత్యము
క. వాయువు దూఱనిచోటును
దోయజబాంధవునిరశ్మి దూఱనిచోటన్
ధీయుతులబుద్ధి దూఱు ని
రాయాసంబును గార్య మగుఁ దుద్బుద్ధిన్. 718
క. ధారుణి నెయ్యది యైన వి
చారము వెలిగాఁగఁ దొడరి సాహసకృత్యం
బూరక యెవ్వఁడు చేయును
నారయ వాఁ డొందు నపజయంబును నెపుడున్. 719
క. ఆతతరథకరితురగప
దాతిసమూహములచేత దారుణశస్త్ర
వ్రాతముచేత నసాధ్యము
లై తక్కినయవియు బుద్ధి కగు సాధ్యంబుల్. 720
క. హితులును బటుశాస్త్రజ్ఞులు
నతిచతురులు నమలమతులు నగువారియస
మ్మతమునఁ జేసిన కార్యము
హితములు గానేర వందు రెన్నఁడు పిదపన్. 721
క. తెలిపి యుపాయాపాయం
బులవలనను బెద్దకాలమునకును మఱిరాఁ
గలమేలును గీడును మన
సుల కప్పుడె తోఁప బుధులు సూపుదు రరయన్. 722
క. తనకంటెను ధీమంతుని
యనుమతమునఁ జేయవలయు నలవడ నరుఁ డే
పనులైన నట్టిపనులని
కనుఁగొన మఱి హాని రావు కావున జగతిన్. 723
పంచతంత్రి
క. మునుమతి పనుల విచార
మ్మున మే లనిపించుకొన్న పురుషుని మతియున్
జనుఁ జీర నేకతమునకుఁ
జను నధమునిఁ జీరనే విచారంబునకున్. 724
క. సాలీనిని నగసాలిని
మాలని బరికత్తివాని మంగలిఁ జాకిన్
ఆలోకించిన పతి వి
ర్మూలత నేటఱితిభూజముంబలెఁ బోవున్. 725
ఆ. తగిలి బయలు నైన మిగులఁ గొందఱు సేయఁ
గార్య మెట్టిదైన కడఁక గలదు
పెక్కుపూరి గూడఁ బెనచినత్రాటిచే
ఘనమదావళంబు గట్టువడదె. 726
క. పలువురు నేర్పరు లగువా
రలవడ నొకచోట నుండి యందఱుఁ దమలో
పలఁ జర్చ చేసి పిదపన్
బొలుపొందఁగఁ జేయు పనులు పొరయవు హానిన్. 727
నీతిసారము
క. వెరవునఁ గార్యము సేయక
యురువడి మొక్కళముసేఁత యూహింపంగాఁ
దరమైన తఱుము వెట్టక
కరమునఁ బెనురాయి ద్రోవఁ గడఁగుట గాదే. 728
నీతిసారము
క. అరయ శక్యాశక్యవి
చారము గావింపవలయు సన్మతి గాదే
వారణము కొండ డీకొని
యూరక నిజదంతభంగ మొందుట గాదే. 729
కామందకము
ఉ. అప్పటికిన్ వినన్ విషములైనను మీఁదను దామసంబుగాఁ
జెప్పెడివారుఁ జెప్ప విని చేయఁగనోపెడువారుఁ బెద్దయుం
జెప్పఁగ లేరు విలసిల్లుప్రియంబుల నంతకంత నె
ల్లప్పుడుఁ జెప్పువారలు ననంతమురాకలఁ జెప్పనేటికిన్. 730
పంచతంత్రి
క. సన్నపువాని విచారము
సన్నపుఁ బనులందుఁ గాక చతురం బగునే
ము న్నెన్నఁ డైన విందుమె
చెన్నుగఁ జల మూదిఁ రణము సేసినవారిన్. 731
ముద్రామాత్యము
ఆ. అర్థిఁ దీపు లైన యాహారములు గొను
టయును దెరువు నడచుటయును నిద్ర
నొందుటయును గార్య మూహించుటయుఁ జాల
నిక్క మొక్కరునకు నీతి గాదు. 732
పంచతంత్రి
ఆ. కమియఁ బండుమున్ను కాయఁ గోసినఁ జని
చేటె కాదు విత్తుచేటు గలుగు
పక్వమైనఁ గొనిన ఫల మిచ్చుఁ జెడదు బీ
జంబు కార్యసిద్ధిచంద మిట్లు. 733
ఉ. ఆతతనీతి మేలునకునై యొనరింపగ దైవ మొక్కకీ
డాతరువాతణ జేయుటకు నక్కొఱగామియు శాంతి సెందఁగా
నీతియె చేయఁగావలయు నెక్కుడు నేర్పరు లైనవారు వి
ఖ్యాతి గనంగ నొక్కయెడఁ గారిన నగ్గిన కాఁపమానదే. 734
విదురనీతి
వ. మఱియు రాజునకు సర్వకార్యంబులు మంత్రపూర్వకంబు గావున బుద్ధిసహాయులం గూడుకొనియుండవలయు, బుద్ధిసహాయులు ధనార్జకులు రణశూరులు నాదియగు కార్యపురుషులు కార్యకాలంబ కూర్తు మనుట గృహదాహం బగు వేళ నూతి కుపక్రమించుట, వారికి వలయు ధనంబు లిచ్చుట సుత్రేత్రంబున విత్తనం బిడియనట్లు, విభవం బెంత గల్గినను భోజనసహాయులు గల్గుదురు గాక కార్యసహాయులు గల్గనేర్తురే? మఱియు మూర్ఖుండు కార్యసహాయుం డగుట యంధుం డంధునకుఁ దెరువు చూపినయట్లు, వారివలన నొక కార్యంబు గల్గిన నది కాకతాళంబును ఘుణాక్షరన్యాయంబును నగుఁ గాని యథార్థంబు కాదు. రాజు చేపట్టిన మూర్ఖైనఁ గార్యవేది యగు ననందగదు; శివుండు గళంబున ధరియించిన కాలకూటం బమృతం బగునె? అది యంతియ కాదు. మూర్ఖునందుఁ గార్యం బిడుటయె తన్నుఁ జంపురక్కసుఁ దాన సృజియించుకొనుట. ఆ ఫలంబులు నల్పఫలంబులు – సమాయవ్యయంబులు దురంతంబులు హానికరంబులు నగు పనులు విచారయోగ్యంబులు గావున విఘ్నభయంబునఁ గార్యంబు విడుచుట తొడుకు గలుగు నని యారంభంబు విడుచుటయును అజీర్ణం బగునని యాహారం బుజ్జగించుటయును, దూరభీతత్వంబు నాసన్నశూరత్వంబు మహాపురుషగుణంబులు; దూరశూరత్వంబు నాసన్నభీతత్వంబుఁ గాపురుషగుణంబులు. మయూరంబపోలెఁ బ్రియోక్తులఁ బలుకుచు శత్రుసర్పంబుల నడంపవలయు. జలంబులం బోలె భూభృద్భేదనంబు సేయనోపియ మృదువు గావలయు; కాలువఁ దెచ్చు కాష్ఠంబులు దలమోచినచట్లు వైరలయెడ నోరుపు గలిగి జయింపవలయు. నదీప్రవాహంబు పడఁద్రోయవలయు తీరద్రుమతృణంబులకుఁ బాదప్రక్షాళనంబు సేయునట్లు చెఱుచునంతకు శత్రులయెడ సామంబులే పలుకవలయు; నల్పాధికకార్యంబులం దేక యత్నంబు సేయునది; తృణభూరుహంబులు గొనిపోవునప్పుడు నదీవేగం బొక్కటియకాదే. మేలైనను గీడైనను తలఁచినది సేయునంతకు హృతయంబు బయలుసేయవలవదు. పరుల విశ్వసించి మర్మంబు సెప్పుట తన్నుఁ గోలుపోవుట. చాపలంబున భయంబున నాలస్యంబున నవివేకంబున లోభంబున వేగిరపాటున నుత్సుకత్వంబునఁ గార్యంబు సెడుఁ దద్విపరీతం బైనను నగు. ఎవ్వరి కెట్లు ప్రియం బట్లు చేసి కార్యంబు గొనుట యుచితంబు. పంకిలం బగు మడువున నిడినఁగాక మొగలికర్పూపకర్దమంబునఁ బూచునే? నీచు లెక్కరానిచెట్టునుబోలె దండప్రయోగంబునంగాని ఫలం బిడరు; అతిక్రోధి యయిన యతని కైశ్వర్యం బగ్నియందుఁ బడిన లవణంబునుంబోలె నదరులఁ బడి విశీర్ణంబగు. నేరకున్ననైనఁ దనవారిం బరుల సొమ్ముఁ జేయంజనదు. ఎదిరిసత్వం బెఱుంగక కలహించుట శలభం బగ్నిలోఁ బడఁ బగగొనినయట్లు మఱియును.
అజ్ఞాతము
క. పొడమదు చేయని కార్యము
పొడమక యుండంగఁ గప్పిపుచ్చెద మన నె
న్నఁడు రాదు చేతఁ గలిగిన
వెడమలయపు మనుజు లేల వేల్పులకైనన్. 736
కేయూరబాహుచరిత్ర
ఆ. హితునియందునేని యెగ్గు నాపాదించి
వెనుక నాప్తుఁ జేయ వెరవుపడునె
విమల మయ్యెనేని విఱిగినపటికంపు
వలయ మేల నదకవచ్చుఁ బిదప. 737
మిత్రనీతులు
గీ. త్యాగదుర్జయజ్ఞానసత్త్వాధికుండు
నాత్మపక్షోన్నతుండు ప్రియంవదుండు
ఆయక్షతముఁ డద్వైధుఁ డమలవంశ్యుఁ
డైన సుజనుండు మిత్రుఁడై యమరవలయు. 738
కామందకము
క. ఎనయ శుభాశుభఫలమున
కనయము విశ్రమముఁ బ్రోపు నగు మిత్రుండై
వనజజుఁ డిట్లు సృజించు నె
యనుపమమిత్రాక్షద్వయ మను నమృతమున్. 739
క. మిత్రుం డర్థముఁ బ్రాణక
ళత్రములకు సిగ్గు మదిఁ దలంపక మును నా
మిత్రుండు మాట మాత్రమె
మిత్రత్వము దలఁచిచూడ మిత్రనిధానా. 740
క. చెలువార మిత్రసంపద
గలవారి కసాధ్య మొకఁడు గల దనఁ గలదే
తలఁప నిది గాన పురుషుఁడు
చెలుములు సజ్జనులతోడఁ జేయఁగవలయున్. 741
క. కుడుచుట కుడువఁగఁబెట్టుట
యడిగిన నిడు టడిగికొనుట యంతఃస్థం బే
ర్పడ నెఱుఁగుట యెఱిఁగించుట
కడుమైత్రికి లక్షణములు గనుగొన నాఱన్. 742
క. పెనులేమియైన విడువమి
యును గుహ్యము సెప్పుటయును నొకయాపద పొం
దినయప్పు డడ్డుపడుటయు
మనమునఁ దలపోయఁ బరమమైత్రికి ఫలముల్. 743
ఆ. ఒకతల్లి కొప్ప నుదయంబుఁ బొందిన
బాంధవంబుకంటె బహుగుణముల
వసుధ నెన్ని చూడ వాగ్జాతబాంధవం
బధిక మండ్రు చూవె యార్యులెల్ల. 744
ఆ. ఆతురమున కైన యాతఁడె చుట్టంబు
నరసి ప్రోవఁజాలు నతఁడు తండ్రి
అరయ నమ్మ మెలఁగు నతఁడె మిత్రుఁడు తన
మదికిఁ బ్రియము సేయు నదియె తల్లి. 745
క. ఆపదలు వచ్చి పొందిన
నోపికమైఁ బరఁగు మిత్రుఁ డొక్కఁడె తక్కన్
బ్రా పగుదు రున్నవారను
నీపలుకు వినంగఁ జెవుల కింపిద మగునే. 746
క. పరిపూర్ణుఁ డయ్యుఁ బురుషుఁడు
పరమసుహృత్తులన యాసపడవలయు మదిన్
బరిపూర్ణుఁ డయ్యు నంబుధి
పరగఁగ శశిపొడుపు నాసపడఁడే యెపుడున్. 747
ఆ. ఎవ్వఁడైన నొక్క యెడరు పుట్టినయప్పు
డైనవాఁడె మిత్రుఁ డరసిచూడ
నేచియున్న యప్పు డెవ్వారు నేటికి
శత్రుఁ డైన నపుడు మిత్రుఁ డగును. 748
ఆ. అధికశోక మొదవి యానంద మైనను
నిష్టజనునిఁ జూచు నెప్పు డెవ్వఁ
డతని కెల్ల దుఃఖ మది క్రొత్తయేకాని
మాననేర దెట్టివారి కైన. 749
ఆ. అర్థి నేలికకును నఱలేని సఖునకు
వలయు నంగనకును వరభటునకుఁ
జెప్పవలయు మఱుగు సేయక యెట్లైన
మాను నెట్టి దుఃఖ మైనఁ బిదప. 750
పంచతంత్రి
క. కానలు దరికొను పావకుఁ
డైన ప్రభంజనుఁడు మిత్రుఁ డల్పతదీపం
బైన శిఖి నార్చుఁ గావున
హీనుం డగువాని కెందు నెక్కడి మిత్రుల్. 751
నీతిభూషణము
క. చెలిచుట్టంబు లడంగిన
నొలసినతఱి బుద్ధిమంతుఁ డొకమార్గమునన్
దొలఁగింపకున్న నాతఁడు
బలుపాపము నొందు మనువు పలు కిది మొదలన్. 752
క. పని వడియ తానె వచ్చినఁ
గనుకొని పెడమొగము వెట్టు కష్టుని గేహం
బునకు మఱి పోవు మర్త్యుం
డెనయఁగ శృంగములు లేని యె ద్దనఁగఁదగున్. 753
క. గొనమొండె దోసమొండెను
నొనరం గని రెంటియందు నొక్కఁడు సేయన్
గనఁజాలని నరునింటికిఁ
జనుగంటెను నొండురోఁత జగమునఁ గలదే. 754
ఆ. ఉల్ల మెఱుఁగనీని కల్లరితోఁ జేయు
మైత్రికంటె మేలు మర్కటంబు
తోడనైనఁ బాముతోనైనఁ బెబ్బులి
తోన చేయవచ్చుఁగాని తుదకు. 755
పంచతంత్రి
ఆ. కనకకలశభాతి ఘనుతోడి చెలిమియు
నవియ దవిసె నేని యదకవచ్చు
కష్టుతోడి చెలమి కడవకంటెను వేగ
మవియు నవిసె నేని యదకరాదు. 756
ఆ. కారణంబు గలిగి కలుషంబుఁ బొందిన
వాని శాంతుఁ జేయవచ్చుఁ గాని
కారణంబు లేక కలుషించువానిఁ గా
రాదు శాంతుఁ జేయ బ్రహ్మకైన. 757
ఆ. తగిలి యెవ్వఁ డుర్విఁ దనకంటె బలవంతుఁ
డైన శత్రు మిత్రుఁ గాఁగఁ జేర్చు
కొను నతండు విషము దనకుఁదాఁ దిన్నవాఁ
డగు దలంపు సందియంబు లేదు. 758
క. ధనమును బ్రాతశ్ఛాయయు
వనితాజనయౌవనంబు వండిన యన్నం
బును గడు మూర్ఖస్నేహం
బును నిల నవి యల్పకాలభోగ్యము లరయన్. 759
క. దూరము వ్యవసాయకులకు
భారంబు సమర్థులకును భాసురవిద్యా
పారగులకును విదేశము
వైరము ప్రియవాదులకును వసుమతిఁ గలదే. 760
ఆ. అతివివేకి భక్తి నడిగిన నే మేనిఁ
జెప్ప దాన నేమి సేగి గాదు
వసుధ నెఱుకలేనివానికిఁ జెప్పుట
యడవిలోన నేడ్చినట్లు సుమ్ము. 761
చాటువు
అనసూయత
క. వినుతచరిత్రులచరితలు
గని విని హర్షించెనేని గనఁ దత్కృతపు
ణ్యనికాయసదృశఫల మది
యనసూయతఁ బోలె ధర్ము వవనిం గలదే. 762
క. గుణలగుణంబులఁ బొగడుచు
గుణియౌ నతిలోభ ముడిఁగి గుణుల సముద్య
ద్గుణములు నిందించినఁ దన
గుణములు సెడుఁ గాక వారి గుణములు సెడునే. 763
క. పరగుణములు సైరించెడు
నరుఁ డుద్యోగించునది గుణంబులు వడయన్
బర గుణము లడఁపఁజూచుట
ఖరకరకిరణములఁ జేతఁ గప్పుట కాదే. 764
పురుషార్థసారము
ఉ. శ్రీగలవానిఁ బేదయుఁ బ్రసిద్ధపతివ్రతఁ జెడ్డయింతియున్
జాగిని వజ్రలోభియు సుజాతి విజాతియు ధర్మనిర్మలో
ద్యోగిని బాపకర్ముఁడును నొప్పెడువానిఁ గురూపుఁడున్ విశే
షాగమవేది మూర్ఖుఁ జెడనాడుచు నుండుట నీతినైజముల్. 765
పంచతంత్రము
దండయాత్ర
సీ. తనయమిత్రామిత్రధనభూమిసాధనం
బరయంగ దూరకార్యానుకరణ
మాత్మసైన్యపరిగ్రహములందు రక్షయుఁ
బరధీరపరచక్రభంజనంబు
దండంబుచే నివి తగ నుద్భవిల్లు నా
దండోపహతిఁ బతి తాన పొలియు
దండబలాఢ్యుఁడై యుండు భూవరునకు
నరులైన మిత్రుల యగుదు రెలమి
ఆ. దండబలసమగ్రదరాపధికుం డగు
భూవరుండు సకలభూతలంబు
నాక్రమించి తాన యనుభవించుచు నుండుఁ
గాన దండబలము కలుగవలయు. 766
చ. వ్యసనము చెందఁడే వ్యసనియై రిపుఁ డూర్జితుఁ డైన నోర్వఁగా
వసమగు నేని యాత్మహితవాంఛితముల్ మడియించె నేనియున్
గసమస మొప్పఁగా విమతకర్కశపీడనకర్మశక్తియున్
బొసఁగినయేని రాజు పరభూమికి నాత్మ యొనర్ప నొప్పగున్. 767
అజ్ఞాతము
క. ధనమును సైన్యము మిక్కిలి
తనకుం గలయపుడ వలయు దండోద్యోగం
బొనరింప నట్ల సేనా
ధనబలునకుఁ గలుగు సకలధాత్రీతలమున్. 768
పంచతంత్రి
గీ. మహితనయమార్గశక్తియ మంత్రశక్తి
చారుధనదండములు ప్రభుశక్తి యయ్యె
సత్త్వసంచార ముత్సాహశక్తియయ్యెఁ
ద్రివిధశక్తియుతుండు నిర్జించు రిపుల. 769
సీ. పితృపితామహసమర్పిత మైన ధనమును
భూరిబలఖ్యాతిపౌరుషంబు
బహువిధయోధసంబాధంబు బహుజన్య
కుశలము బహుశస్త్రకోవిదంబు
కుశలావృతంబు నకుంఠితక్రియయును
నీరాజితతురంగవారణంబు
అన్యోన్యమిత్రతాధన్యప్రచారంబు
సమయసముత్సాహసంగతంబు
గీ. అమితదీర్ఘప్రవాసనిరంతరప్ర
యాసదుఃఖకృతశ్రమభాసురంబు
నవ్విధంబును క్షత్రియోదగ్రసుభట
బహులమును నివి దండసంపద్గుణములు. 770
కామందకము
క. అభిమతనయశాస్త్రస్థ
ప్రభుమంత్రోత్సాహశక్తిపరుఁడై ధాత్రీ
విభుఁ డరివరుల జయించుచు
నభయమ్మున నేలవలయు నఖిలావనియున్. 771
పురుషార్థసారము
క. దవ్వులనె యుండి శాత్రవు
లెవ్వనితేజమున కులుక రెక్కాలము వాఁ
డివ్వసుధ తల్లి యొప్పెడి
జవ్వన మది సెఱుచుకొఱకు జనియించు టగున్. 772
ఆ. శత్రుశోణితమున శాత్రవకామినీ
చారునయనబాష్పసలిలములను
నవనిఁ దడపఁడేని యారాజులావును
జీవనంబు వేఱ చెప్పనేల. 773
బద్దెననీతి
క. ప్రవిమలవిక్రమపరుఁ డగు
నవనీశ్వరు నంకతలమునందు రిపు శ్రీ
దవిలి కుటుంబిని పోలిక
నవిరళమై యుంటు నెపుడు నంచిత మహిమన్. 774
మ. తగ వేపట్టును లేక దుర్వ్యసనియై ధర్మక్రియాహీనుఁడై
తగువారుం బ్రజలున్ విరాగు లగుచేఁత ల్సేయు భూపాలుపైఁ
దగ దండెత్తిన రాజు గెల్చు నరికిన్ దా దండయై నిల్వఁగాఁ
దగు రా జచ్చట లేక యున్నఁదగు దద్రాజ్యంబునున్ జేకొనన్. 775
క. అనురాగము సద్వృత్తుఁడు
ఘనశక్తిత్రయము దైవికముఁ బౌరుషమున్
ధనమును దన కబ్బిన పతి
ననునది యివి లేని యట్టి జనపాలుపయిన్. 776
నీతిభూషణము
క. ప్రెగడల మనసులు విరసము
లగుగతి నడచురిపురాజ్య మడఁచి విశీర్ణం
బుగఁ దాఁ గలంచి పైకొని
జగతీవర కొనఁగవలయు సౌకర్యమునన్. 777
ఆ. కుడువ నిచ్చుతరియు గురువర కేడించు
నవసరం బెఱింగి యానృపాలు
నిలుపుధీరవృత్తి నిడుదాట బోనిమ్ము
గ్రమ్ముకటులసగ్మ గ్రమ్మిచెఱుపు. 778
ధృతరాష్ట్రనీతి
క. విమతుల కాపదలు ప్రమా
దమునం దొరకొనినయపుడ తగుఁ బైఁజని వి
క్రమమెల్లఁ జూపునది సిం
హముగతి నరి యల్పుఁ డధికుఁ డగుకాలమునన్. 779
నీతిసారము
క. అరియాప్తులు దనుఁ గూడిన
నరి కాప్తవిరోధ మైన నరి యొక్కెడ నొం
డరిచే డస్సినయత్తఱిఁ
బరిగొని యరిలక్ష్మి భూమిపతి గొను మాత్రన్. 780
క. ఇవియెల్ల శత్రుజయమున
కవసరములు గాఁగ నెఱిఁగి యాత్రోత్సకుఁడై
తివిరెడి భూపతి రిపునృప
నినహముఁ బొలియించు సమయనిర్భరవృత్తిన్. 781
పురుషార్థసారము
క. తనసత్త్వము రిపుసత్త్వము
మనమునఁ దర్కించి శత్రుమర్మజ్ఞులుఁ దా
నును జెనకఁ జనిన విజయ
మ్మును నరు దిట తనదుదేశమును గోల్పోవున్. 782
పంచతంత్రి
ఆ. వినుతులావెఱింగి వెఱ పేఁది తొడరుట
మిడుత లగ్గిమీఁదఁ బడినయట్లు
తోడు లేక నధికుఁ దొడరుట యంబుధిఁ
గలము లేక యీదఁగడఁగినట్లు. 783
నీతిసారము
క. ఉపచయ మెంతయుఁ దనకై
యుపచయము విరోధి కైనయవసరమునఁ బై
నృపులెత్తి యశ్రమమునం
దపరాజితలీలఁ గొను జయంబును ధరయున్. 784
పురుషార్థసారము
చ. మునుకొని దేశకాలబలముం దగ దైవబలంబుఁ గల్గఁగా
మొనసి విశేషమూలబలము న్నిజబాహుబలంబు నచ్చి పైఁ
జని రిపులన్ జయింతు రని శత్రుల కిన్నియుఁ గల్గియున్నచోఁ
జెనయక దానమానములఁ జేసి జయింతురు నీతికోవిదుల్. 785
ముద్రామాత్యము
ఆ. ఒనర ఘనునిఁ జంపు నుత్సాహశక్తిసం
పన్నుఁ డైనవాఁడు సన్నమైనఁ
గడఁగి యలఁతియైన కంఠీరవం బేచి
దొడ్డయైనగజముఁ ద్రుంచినట్లు. 786
చ. అతులబలాఢ్యుఁ డైననరుఁ డాఱడిదేశము కేఁగియున్ స్వదే
శముననపోలె నొప్పి మను శాతనఖంబులశక్తియై యర
ణ్యములకు నేఁగినం దివిరి యచ్చటిసింహము కుంభికుంభమాం
సమ తినుఁగాక యాఁకొనిన చక్కటిఁ బూరికి నఱ్ఱు సాదునే. 787
ఉ. దైవవశంబునం గలుగు దండ మవగ్రహతీవ్రరోగపీ
డావలి యెట్టి దేశమునైనను గాలబలాపకృష్టమై
కేవల మట్టివేళఁ బరికించుచు నల్పకుఁ డేల దండయా
త్రావిదుఁ డైన గెల్వఁడె యరణ్యసురక్షిత దేశమేనియున్. 788
క. తనచేతఁగాని కా దను
పనికిం బ్రతినిధిగ నన్యుఁ బనిచిననుం దీ
రునె యౌషధంబుమా ఱిది
యని మూల్యం బిడిన రోగ మరుగుట గలదే. 789
పంచతంత్రి
క. తనచేతఁగాని కాదను
పనికిం బ్రతినిదిగ నన్యుఁ బనిచిననుం దీ
రునె యౌషధంబు మా ఱిది
యని మూల్యం బిడిన రోగ మరుగుట గలదే. 790
నీతిభూషణము
క. వివిధకళాకోవిదుఁడై
సవినయుఁడై యీగి గలిగి సంగరజయుఁడై
నివుడనినృపతులఁ బొందునె
యువిదయుఁ గీర్తియును నౌభళోత్తమకందా. 791
నీతితారావళి
మ. ఘనబాహాబలుఁ డైన శాత్రవునిపైఁ గార్తిక్యచైత్రంబులన్
జను టొప్పు న్మఱిదాడివోవ నెపుడైన న్మేలు శత్రుండు దా
ననయంబునన్ వ్యసనం బొకంటఁ బడ యుద్ధాసక్తిమై నున్కిఁదా
వినునే నత్తఱి భేదమందు హతుఁ గావింపన్ దగున్ జయ్యనన్. 792
పంచతంత్రి
మ. పరిపాకాగతసస్యమున్ వ్యపగతాంభఃపంకసారంబునున్
ధర సంపుల్లరసాలకంబు నగు యాత్రాయోగ్యకాలంబునన్
ధరణీనాథుఁడు దాడిరూపమున సన్నాహంబుమై నేఁగినన్
బరిపంథిక్షితిపాలకుల్ నిజపదాబ్జద్వంద్వముం జేరరే. 793
క. దేవబ్రాహ్మణపూజలు
గావించి ప్రశస్తతారకాగ్రహబలుఁడై
కేవలతద్భేదయుతుం
డై విభుఁ డభియాతిమీఁది కరుగఁగవలయున్. 794
కామందకము
క. పరవిద్యాచ్ఛేదకులై
యురుసురపతిమంత్రతంత్రహోమక్రియలన్
బరబలసంక్షోభరణా
కరు లగు మాంత్రికులు పతికిఁ గలుగఁగవలయున్. 795
క. ప్రతికూలవేళ లెఱుఁగుచుఁ
బతినృపరాశ్యాదు లెఱిఁగి పతిరాశిఫల
జ్ఞత యొఱు లెరుంగకుండఁగ
సతతము రక్షింపవలయు సాంవత్సరికుల్. 796
పురుషార్థసారము
ఆ. మఱి యుదాత్తజనులు మహితవ్యసను లైన
నధికశక్తియుక్తుఁ డైన పతియు
నెత్తి చన నశక్తుఁ డెన్నివిధంబులఁ
బక్షవికల మైన పక్షివోలె. 797
క. అపజయముకంటెఁ గష్టము
నుపమింపఁగ జయముకంటె నొప్పును వసుధా
ధిపులకు లే దట్లగుటన్
గపటోపాయమునైనఁ గార్యము వలయున్. 798
క. గాంగేయు ద్రోణు రాధే
యుం గపటంబునన్ గెల్చుయును బాండవు లు
ర్విం గడు నుతి కెక్కిరి
రణరంగజయం బఖిలదోషరాశిం గడుగున్. 799
కామందకము
ఆ. ఆత్మరక్షణార్థ మరుల జయించిన
పాప మొంద దది శుభాకరంబు
కాన కోప ముడిఁగి కడుఁ దమ కింపక
గూఢబుద్ధి జయము గొనగవలయు. 800
ముద్రామాత్యము
క. తా నెంత శూరుఁ డయ్యు న
నూనపరాక్రముని నొక్కయూఁకునఁ జెఱుపం
గా నేరవలయు వాఁడున్
దానును దలపడియేని తానో వాఁడో. 801
క. ఒఱవపనఁ దనయాజ్ఞకు లోఁ
బఱచుట తగుఁగాక నధికబలవంతులకున్
మఱువైన దేశముల్ తెగఁ
జెఱచుట పగతురకుఁ దెరువు సేయుట గాదే. 802
క. గడి నున్న సదృశబలుతో
నొడఁబడియుండునదిగాని యోపక వానిన్
గడునధికుఁ దెచ్చి చెఱిచిన
చెడుఁ దానుం బొరుగునింటఁ జిచ్చిడిన క్రియన్. 803
క. ఇమ్ముగ దవ్వులచుట్టము
నమ్మి సమీపస్థుఁ బగగొనంజన దటుపా
ర్శ్వమ్మున ఫణి గఱచిన దూ
రమ్మునవేఁజెట్లు దీర్పారా వేర్చువడిన్. 804
క. ఒఱపైన పొరుపుదేశము
చెఱచు సమీపస్థుఁ డతని చెలిమియు వే చే
కుఱఁబట్టు టవసరము గా
నుఱుమిత్రుం జేయవలయు నుర్వీశునకున్. 805
పురుషార్థసారము
క. బలియునకుఁ దనకు నడుమై
నిలిచిన సామంతుఁ జెఱుప నేరమి వచ్చున్
పులిబోను తలుపు దెఱచినఁ
బొలియింపదె మీఁద నుఱికి పురుషనిధానా. 806
శ్రీరామాయణము
శకునజ్ఞానము
సీ. ప్ర(బలభూతావేశ) భంగిమై నుద్భూత
బహురోగసంకటోపద్రవంబు
ఆకస్మికోద్వేగ మతిరజోనీహారచటుల
వాతోద్ధూతసంవృత్తియును
వ్రేఁకమై ధ్వజ మొక్కవెర వేది విఱుగుట
ద్రోహ మొండొరులపై దొరయుచేఁత
విస్వరబహుతూర్యనిస్వన ముద్భవ
త్త్రాసదీర్ఘోల్కాదిదారుణంబు
గీ. ఆయుధంబులమంట లుదగ్ర మగుట
యప్రదక్షిణ మైనశివారుతంబు
కాకగృధ్రాదివనపక్షిభీకరంబు
రక్షినిర్భరవృత్తియు రక్తవృష్టి. 807
శా. క్రూరోత్పాతదుర్గ్రహావృతనిజక్షోణీశనక్షత్రమున్
సారాదిత్యకబంధబంధనము నశ్వవ్రాతభేదంబునున్
దూరీభూతమదాంబుశీకరకరోద్భూతంబు ముఖ్యంబుగా
నారూపం బగు వైకృతం బొదవ భూపాలప్రణాశం బగున్. 808
సీ. అఖిలజనస్తోమహర్షంబు సమ్మతి
నిర్మలదుందుభినిస్వనంబు
భూషితగంధర్వహేషారవంబును
మాతంగబృంహితమంగళంబు
పుణ్యచతుర్విధభూరినాదము శుభ
గీతనృత్యములుఁ బ్రఖ్యాతజయము
నిరుపమద్రవ్యంబు నీరజోవృష్టియుఁ
గడుఁ బ్రదక్షిణగతగ్రహగణంబు
గీ. అనుదితోత్పాతములును విహంగసంఘ
మధురరవమును ననులోమమారుతంబు
పొలుపు మీఱఁగ నివియును భూపతులకు
నధికమిత్రబలాభ్యుదయాన్వితంబు. 809
సీ. దక్షిణానిలముఁ బ్రదక్షిణాగ్నియును నధ్వ
సంతతోత్సాహంబు సాధువాద
చారుమంగళపాఠకారవంబు సుహృష్ట
పుష్టజనంబును బొలుపు మిగుల
నతిమనోహరముగా నరసిచెప్పిన శుభ
కలితలక్షణములు గలిగియున్న
యట్టివేలంబు ప్రఖ్యాతమై పొలుపొందు
నతిశుభమై యుండు నధికశత్రు
ఆ. జయము గలుగు నట్టిచంద మొందఁగ
విపరీత మయ్యెనేని ............ గదిరి
యపజయంబు నొందునట్టి చందములెల్ల
నెఱిఁగి నృపతి నిశ్చయింపవలయు. 810
క. ఇప్పగిది శుభాశుభములు
తప్పక చెప్పెడినిమిత్తతత్త్వస్థితిఁ దా
నొప్పగు భూపాలకులకు
నెప్పుడుఁ బరికించునది సమీహితబుద్ధిన్. 811
ఆ. తగుసహాయసంపదయును బ్రజ్ఞానంబు
సత్త్వవృద్ధి దైవశక్తియుక్తి
సముచితోద్యమంబు సద్వ్యవసాయంబు
గలుగునేని కలుగుఁ గార్యసిద్ధి. 812
కామందకము
చ. ఘనతృణధాన్యమిత్రజలకాష్ఠజలంబులనెల్ల నెమ్మెయిన్
బొనరగఁ గూర్చికో కెడరు పొందగఁ జేసిన హాని పుట్టు వీ
డున కటు గాన భూపతి పటుస్థిరబుద్ధి తృణాదిరక్షణం
బనువునఁ జేయు టొప్పగు నిరంతరముం గడు నప్రమత్తుఁడై. 813
అజ్ఞాతము
మ. పరగన్ భూపతి యిట్లు దండు విడియింపన్ యోగ్యమౌ సేనకున్
వెరవారంగ శుభాశుభంబులు గడు న్వీక్షించు టొప్పారు ని
ట్లరికి న్మేలును గీడుఁ జూచి యరిసైన్యం బల్పమైనన్ శుభం
బరియం దొందకయున్న నుద్యమము సేయన్ మేలగున్ యాత్రకున్. 814
కామందకము
వ. మఱియును. 815
క. ఘనబలనిహితుల శూరులఁ
దనగృహమున దుర్గములను దగ నిడి యుదకం
బును సస్యములును గలపథ
మున రిపుకై యేఁగవలయు మోదముతోడన్. 816
క. తనుఁ దనదేశము దుర్గము
ననువుగ రక్షింప నోపునాప్తులఁ దగుచో
నునుపక దండెత్తుట మొల
మునుగలవస్త్రంబు మస్తమునఁ జుట్టు టగున్. 817
క. ఇరుదెఱఁగు యానంబుల
నరయంగాఁ బ్రాణరక్షణార్థం బొకఁడున్
దుర మొనరించుట నొకఁడును
భరపడు నివి యుభయయానభంగులు జగతిన్. 818
నీతిసారము
సీ. కరిరథభటఘోటకవ్రజారోహణ
కుశలుండు ధర్మార్థకుం డరోగి
సంచారదూతప్రచారజ్ఞుఁ డల్ప
శరీరుండు రాత్రిప్రచారనిపుణుఁ
డరిసైన్యభంజనుఁ డాత్మసేనాధీన
పరనయస్తంభనోపాయదక్షుఁ
డధ్వానశీతాతపాత్యుగ్రతరవృష్టి
గురుభయగ్లాన్యాదివిరహితుండు
గీ. సమరసాధ్యనిశ్చయుఁడు మల్లయుద్ధ
నానాయుధానేకలయుద్ధజయుఁడు
నైన దళవాయి నేలిన యతఁడు రాజు
ఘనకళాభోజ యబ్బయకందరాజ. 819
చాటువు
క. కులవిద్యాచారంబులు
బలగము కార్యంబు హితవు బ్రభుతయుఁ జలముం
గలిగి శుచి యైనవానిని
దళవాయిం జేయవలయుఁ దంత్రానుమతిన్. 820
నీతిసారము
గీ. అట్టి సేనాధిపతి సదోద్యమముతోడ
సేనఁ బ్రోవంగవలయు దివానిశంబు
అట్టి వనదుర్గభయముల నడపవలయు
సైన్యసన్నాహవిభవంబు చాల నొప్ప. 821
కామందకము
క. పరిగొని శీఘ్ర మరాతులఁ
బరిమార్పఁగ నొదవుఁగాని పట్టులఁ గడు ని
ర్భరముగఁ దొలంగి యప్పుడ
యరివర్గము ముట్టి చంప హయములు వలయున్. 822
పురుషార్థసారము
క. అశ్వములు గలుగు రాజుకు
విశ్వంభర చేతనుండు విమతుల మనుభూ
మీశ్వరు లెవ్వరు వెఱతురు
శశ్వద్ధాటీవిహారసామర్థ్యమునన్. 823
నీతిసారము
క. దూరమున నున్న రిపులం
జేరంగా వేగ మరుగఁ జేరినమొనలం
బొరఁ బతి వలసెనేనియు
వీరాధిష్టితతురంగవితతి ఘటిల్లున్. 824
క. దురమున ఘోటకనికరం
బరుదుగ వాహ్యాళిఁ బ్రీతి యలరించుచు మం
దిరముల లక్ష్మీకరములు
హరులకు నేభంగి నొండుయానము లెనయే. 825
పురుషార్థసారము
క. పూజించి తన్నుఁ బ్రోచిన
రాజుం దా నొచ్చి యైన రణరంగజయ
భ్రాజిష్ణుఁ జేయునుత్తమ
వాజి గరం బరుదు లక్షవారణములకున్. 826
కామందకము
క. నాలుగుకాళ్ళును గొనయును
వాలము వదనము విశాలవక్షము దెలుపై
నే లైన యష్టమంగళ
నేలినపతి యేలు నవని యేలెడుపతులన్. 827
శాలిహోత్రము
చ. స్ఫుటపరికల్పితంబు నరిసూదనసంయుగదృష్టమార్గముం
బటుతరదంతఘాత మతిబంధురవీరతమాధిరూఢమున్
గటతటవిభ్రమద్భ్రమరగానసముత్సుక మైన యేనుఁ గొ
క్కటియ వధించు నాజి నరకల్పితషష్టిశతాశ్వయూధమున్. 828
కామందకము
ఆ. పరులు గ్రువ్వినపుడు భటు లెందఱైనను
గదియ లేరు వివిధఘాతములకు
సైప నోపుఁగాన సామజంబులకంటెఁ
గలదె విజయమూలకారణంబు. 829
క. తనరూపము రిపుభయదము
తనయంగము లాయుధములు తనవిక్రమసం
జనితమ విజయము తనయుని
కిని సిరియునికియ యనంగ గిరి కరికెనయే. 830
ఉ. యానము సౌఖ్యకారి యధికారికి రక్ష బలంబు శాత్రవ
స్థానవిరోధినిర్భరత సంఘవిభేదనదార్ఢ్య మొప్పన
న్యూనరయాపహారి మదయోగము నభ్యుదయప్రదంబయౌ
నేనుఁగుబోలెనే విజయహేతువు రాజులకొండు గల్గునే. 831
క. కూరిమి గలిగిన జీతం
బారగ నిచ్చునది గాని హస్త్యశ్వములన్
నేరనివానికి నెక్క న
కారణమున నీగి బుద్ధి గా దధిపతికిన్. 832
అజ్ఞాతము
క. నచ్చి కడుఁ గడిఁదిరిపుతో
నచ్చుగఁ బోరంగ గిరిగుహాపరిఖంబుల్
చొచ్చి రిపుదుర్గములు గొన
వచ్చులె కాల్బలము లేని వసుధేశునకున్. 833
నీతిసారము
సీ. ప్రాఁతబంట్లును (గూలిబంట్లును) మన్నీల
బంట్లును జుట్టపుబంట్లు కార్య
వశత గొల్చిన పగవారిబంట్లును దమ
యడవుల బ్రతికి తో నరుగుదెంచు
బంటును నన నాఱుభంగులబలములు
వానిలోపలఁ బూర్వవంశ్యు లిష్టు
లన్యుల మన్నించు నప్పుడ తనమూల
బంట్లకు నె గ్గగు భంగి వలదు
ఆ. అడుగు విడిచి ప్రాఁత లరుగు నట్లేనియు
విడిచిపోవునపుడు వెనుకవత్తు
రరులు భేదనిరతు లైనను బట్టీరు
ద్రోహములకు నోడుదురును గాన. 834
కామందకము
గీ. ప్రజలోపల నుత్సాహపరత నాయు
ధములు ధరియించువారి కౌత్సాహికంబు
గాఁగ నీఁదగువారలు కడలఁ బనికి
వత్తు రేలిక మన్ననవాసిఁ గోరి. 835
క. ఈయేడుబలములందును
నాయకుఁ డభిమానులైన నరు లని మొనగాఁ
జేయుచు నితరులఁ బిఱు సనఁ
జేయించుచుఁ గొల్లకాండ్రఁ జేయఁగవలయున్. 836
ఆ. మానధనములందు మన్నన యిష్టంబు
తద్దయేని యిచ్చుధనముకంటెఁ
గాన యర్థములకుఁ గడఁగి ప్రాణము లీరు
నరవరేణ్య మన్ననలకుఁ గాని. 837
చ. బలమును బాహుకౌశలము భావము బుద్ధియుఁ గల్గి యాయుధం
బులఁ గడు నేర్చి చొల్లి రణభూములఁ బ్రస్తుతి గన్నబంటులన్
వెలయ నృపాలుఁ డేలునది వింతలఁ బ్రాఁతల కేపరీక్షయున్
వలవదు ప్రోవఁగావలయు వారలె మూలము రాజ్యలక్ష్మికిన్. 838
ఉ. తూలినచోట నర్థముఖదోషము ముట్టినచోటఁ బెట్టుచోఁ
జాలనిచో నజేయు లగు శత్రులు దుర్గము ముట్టియున్నచో
నాలములోనఁ గూడు ప్రజ యన్యబలంబుల కోడి పాఱుచో
నేలినవానిఁ జుట్టుకొని యిల్వడి ప్రాఁతలు కాక దాల్తురే. 839
చ. జనపతి గర్వియై సుభటసంఘము చూడక యుండఁ జేరవ
చ్చిన నడికింప జీవితము చెచ్చెరఁ బట్టఁగ నోపలేమి సె
ప్పిన నలుగంగ మా ఱలిగి బీరముఁ బల్కినఁ జెప్ప నేర్చుఁ గా
కని మొగరించి మించి బఱియంబడు నయ్యడు గాఁగనేర్చు నే. 840
ఉ. కొందఱు మేలమాడుటలు కొందఱ వావులు దీర్చి పిల్చుటల్
కొందఱ ముద్దుసేయుటయు గొందఱ నెయ్యపుఁజూపు సూచుటల్
కొందఱ నాత్మభావమునఁ గొందఱ మన్నన భృత్యరాజి ని
ట్లందఱ నన్ని భంగుల నృపాగ్రణి వశ్యులఁ జేయఁగాదగున్. 841
చ. మొఱపునఁ బోవుగాక మొగమోటమి నిల్చునె రాజుమోము ము
న్నెఱుఁగనిబంట్లువారఁబలె యే మని భృత్యుల నూఱడించుఁ బే
రెఱుఁగని రాజు తాన భటులెల్లను దన్ను నెఱుంగనివారిఁ దా
నెఱుఁగుచుఁ బ్రీతితోడ నిలువందగు రాజనువాని కెప్పుడున్. 842
నీతిసారము
సీ. వానయు సీతును వర్జించి మండువేసవి గాకమున్న సస్యములపంట
లొదవెడితఱి నెత్తనది శత్రుపైఁ బూరిగడ్డియు నీళ్ళులు గలుగుతెరువు
గాఁ జూచి నడచుట కర్జంబు సిడములు గంకటములు బడిగలును విండ్లు
మొదలగు నాయుధములు రథగజహయంబులు సవరణలు నపూర్వభంగి
గీ. నొప్పి యతిభీకరంబులై యుండవలయు
శంఖకాహళపటహవిస్సాణముఖము
లైనతూర్యముల్ మంచివి యగుట లెస్స
యధిప విడిదల సమతల మగుట మేలు. 843
శాంతిపర్వము
సీ. ఎందాఁక ధాన్యంబు లెందాఁక నిజమిత్రు
లెందాఁక నుదకంబు లెసఁగియుండు
నెందాఁక విశ్వాసు లేఁగి యచ్చటివారి
నాప్తుల గావింతు రంతదాఁక
నెందాఁక నీరీతి నితరునిదేశంబు
శుద్ధమార్గం బయి సొంపు మిగులు
నందాఁక విజిగీషుఁ డార్తి జనంబులు
సొంపకుండఁగ నేఁగవలయు నిట్లు
ఆ. గాక ధాన్యమిత్రఘనతోయవిధ్వస్త
జనవిహీనమయ్యుఁ జనియెనేని
అనుగలంబు నొందియరులచేఁ గీడ్పడి
మరలి వచ్చుటెట్లు మనుజవిభుఁడు. 844
క. తనబలముల కనురాగము
జనియింపఁగ ననుదినంబు సత్కారములన్
దనుపుచు గురుయుద్ధంబుల
జనులెల్లను మిగుల డస్సి చనకునికి తగున్. 845
అజ్ఞాతము
క. రిపుభూమి విచారింపక
చపలుండై దూర మరుగుజనపతి రిపుదో
ర్విపులకరవాలధారా
సుపదస్థుం డగు నయత్నసుఖసాధ్యుండై. 846
క. అమితక్షయవ్యయాయా
సము లొదవెడు నట్టియాత్ర సన దొనరింపన్
గ్రమమున రథవాహనధన
సముచితధాన్యములు వ్యయము చాలను నగుటన్. 847
వ. మఱియును. 848
సీ. గ్రీష్మకాలమున నభోష్మశాంత్యర్థమై
యమితజలాధ్వనుం డరుగవలయు
నీరాడకుండిన భూరితాపంబునఁ
గుంజరంబులమేనఁ గుష్ఠమొదవు
స్వస్థానమందును సామజంబులమేనఁ
బ్రబలోష్మ మెప్పుడుఁ బ్రజ్వలించు
నాయాస మొదవినయపు డుష్ణసుఖదమై
నీరు లేకుండిన నేలఁగూలు
ఆ. నీరుద్రావకున్న వారణముల కుష్ణ
తీవ్రవేదనమున దృష్టి సెడును
నితర జంతువులకు నెంతయు దురవస్థ
వొదవకున్నె నీటి పొందులేక. 849
చ. కరివరపంఙ్తికిన్ జలదకాలమ యెప్పుడు నొప్పుఁ దా శుభం
కరమయి మేఘహీన మగుకాలము ఘోటహితంబు గావునన్
అరయగనీతవర్ష నిబిడాతపశీతము గాక సస్యసుం
దరమగు నట్టికాలము మనఃప్రియదం బగు దండయాత్రకున్. 850
కామందకము
ఆ. పరుల గెలువ నేఁగు నరపతియొద్దన
దనము బలము దగిన ధాన్యములును
గలుగు టొప్పుఁగాక కైకొన కెడనెడ
నునిచి సేన నిలిచియుండఁగలదె. 851
నీతిసారము
ఉ. కొన్నిదినంబు లిక్కడ నకుంఠితలీలఁ బథశ్రమార్తియై
యున్నబలంబు గెల్చికొను టొప్పగు నంతియ కాదు శత్రుభూ
మి న్నిజమార్గ మారయక మిన్నక యేఁగుట యేది బుద్ధి యా
యున్నెడఁ జూచి వెళ్ళుజను లున్నర చెప్పుఁడు గూఢచారతన్. 852
ముద్రామాత్యము
యుద్ధదానప్రకారము
క. ఏనుఁగులమీఁద నతిజవ
యానంబులమీఁద నైన యర్థం బెల్లన్
బూని పతియొద్ద నిడునది
మానుగ నర్థంబ రాజ్యమహిమ దలంపన్. 853
క. నూతనకృత్య మొనర్చినఁ
బ్రీతుండై నృపతి యాధబృందము నర్థ
వ్రాతమునఁ దనుపవలయున్
దాతకుఁ బ్రాణంబు లీఁడె తక్కటిజనుఁడున్. 854
సీ. ఆజిలోపల రిపురాజుఁ జంపిన
వాని కొగి నియుతార్థ మీనోపుచుండు
(దానలో నర్థంబు తత్పుత్రు జంపిన
సేనాపతి వధింపఁజెల్లునంతె
పదివేలు వీరాధిపతి జంప సగ మందు
నేనుఁగైన రథంబు నైనఁ గూర్చి
నాశ్వికాధీశ్వరు నడఁగింప నొకవేయు
నందర్థ మాశ్వికహతికి నీగి
ఆ. నగుఁ బదాతిముఖ్యు నాజిలో మార్కొని
బారిసమర మాఱు పణము లీయ)
నితరజనులఁ దలకు నిరువదియును
వారి భోగ మినుమడింప నీగి యొప్పు. 855
ఆ. యుగ్యహేమరూప్యయోగ్యభోగములను
మఱియుఁ దగినయట్టి మహితవస్తు
సమితి నిచ్చి యోధజనులచిత్తం బిగు
రొత్తఁ జేయవలయు నుచితవృత్తి. 856
ప్రయాణవ్యసనపరీక్ష
క. మకరవ్యూహం బొండెను
వికటాస్యం బైన యట్టి వీరాననసూ
చికయైనఁ బన్ని చనునది
ప్రకటితశౌర్యమున నెదుర భయ మొదవునెడన్. 857
క. వెనుక భయ మైన శకటము
దనరఁగఁ బార్శ్వముల నైనఁ దగ వజ్రముగా
మొనచేసి నడచునది యెం
దును భీతి దనర్ప సర్వతోభద్ర మగున్. 858
సీ. కందరోన్నతశైలగహననదీతట
సంకటాయతపథశ్రాంతజనుల
క్షుత్పిపాసాపరిశోషితాత్ముల రోగ
దుర్భిక్షమరణాదిదుఃఖితులను
రిపువిద్రుతుల భూమిరేణుపంకచ్ఛన్న
జనముల బెదిరిపోయిన జనంబుఁ
బోక నిల్చిన నిద్రఁబొందిన భోజ
నవ్యగ్రత నొందినయట్టి జనులఁ
గీ. జననభూమిష్టజనుల నసంస్థితులను
నగ్నివర్షాధికవ్యసనాధికులను
జేరి నిజసైన్యజనుల రక్షింపవలయు
జనవిభుఁడు .......................... 859
ఆ. ................................................
.................................................
యిట్లు దేశభేద మెఱిఁగి బలాఢ్యుఁడై
యాత్ర సేయు పతి జయంబు నొందు. 860
ఉ. రాత్రిమెయి న్నిజాప్తభటరక్షితుఁడై సతియోగముం దృణా
మాత్రము నిద్రసేయుచుఁ బ్రమత్తగజేంద్రతురంగఘంటికా
చిత్రనినాదఘోషములచేఁ దగ మేల్కని యెపు సత్క్రియా
పాత్రుల నాదరింపఁదగుఁ బన్నుగ మేల్కనియున్నవారలన్. 861
ఉ. శత్రుజనాంతపాలునికి స్వల్పమ యిచ్చుచు నాసవెట్టుచున్
మిత్రునిగాఁ నొనర్చుచు నమిత్రధరిత్రికిఁ బోవు రాజు దా
శాత్రప్రభూమినిం గలుగు చారుపదార్థములెల్లఁ బుణ్యచా
రిత్రత నల్లనల్లన హరించుట యొప్పు నిగూఢవృత్తిమై. 862
ఆ. తాను బలము సాధుతనమున నడిచినఁ
బరుల కూర కేల భయము పుట్టు
నగ్ని చల్లనైన నందఱుఁ ద్రొక్కరే
కడుఁ బ్రతాపి గాక కలదె జయము. 863
చ. మనుజుల కందరాని నియమంబు తదాప్తులు సుట్టునున్కియున్
వెనుకకుఁ ద్రోవ రేమియు నివేశితమంటపపూర్వరాగమున్
జనదు నివాసభూమి కగుచందును జుట్టును సేయుశూరులన్
జన నియమించి మార్గములు సర్వము గట్టఁగఁ బంచు టొప్పగున్. 864
కామందకము
క. విడిదల విడియఁగ నూఁతులు
నడబావులు నిమిషమున నొనర్చుచు నచ్చో
నెడనెడ నెనరునఁ బొడిచిన
కడుధీరత నిల్చి యధికగర్వోన్నతుఁడై. 865
ముద్రామాత్యము
క. మునుసుద్దులకుం బనిచిన
జను లగ్గిం బొగల దూర్యశబ్దవిశేషం
బును నానవాలుగాఁ గొని
చనుదేఁదగు మొనకు నచటిచందముఁ జెప్పన్. 866
నీతిసారము
క. అరిపై నరిగి నృపాలుం
డరిపురనికటస్థలముల ననుగుణభూమిన్
బరకించి సకలసైన్యము
చరమిడి విడియింపవలయుఁ దద్జ్ఞుం డగుచున్. 867
సీ. అభియాతి రిపుమీఁద నరిగి యచ్చోసమ
స్థలమైన యెడ శుచిబలము మెఱసి
అధికసంకీర్ణంబు నతివిస్తృతము గాక
రవిసోమవీథుల రమ్య మగుచుఁ
జతురశ్రమై వాస్తుసమ్మతంబై పరి
ఖాంకమై యట్టళ్ళ నమరి నాల్గు
ధరణీతలంబుగా ద్వారముల్ నాలుగు
బాగుగా నిర్మించి లాగుఁ జూచి
ఆ. యడర నర్ధచంద్రునాకృతి నొండేని
నొండె దీర్ఘమొండె మండలంబు
నైనయదిగ వెలయనధిపతి దనవీడు
విడియఁజేసి తనకు వెరవుతోడ. 868
వ. అట్టిశిబిరస్థలంబులు నవభాగంబులు గావించి యందు మధ్యభాగంబు తొమ్మిదిభాగంబులు గావించి తన్మధ్యభాగంబు వాస్తుపురుషహృదయంబు గావున నచ్చోటు పరిహరించి యం దుత్తరభాగంబున. 869
క. మానుగ జనపతి మధ్య
స్థానంబున రాజగృహముఁ దగఁ జేసి వెసన్
దా నర్థగృహం బం దొగిఁ
బూని రచియింపగవలయు బుద్ధిప్రౌఢిన్. 970
క. మౌలభృతశ్రేణిసుహృ
జ్జాలాహితవన్యసైన్యషట్కము నవనీ
పాలునగృహంబు చుట్టును
బోలన్ విడియింపవలయు భూపతి వారిన్. 871
చ. తిరుగక పంతమున్ మెఱసి తేఁకున పంతము గొన్న శూరులున్
బరుసనికుక్కలుం గలుగుబంట్లను బన్నయెడం బ్రతీతిగాఁ
దిరిగిన యట్టివారల నతిస్థిరచిత్తుల లోభదూరులన్
బరగఁగ నిల్పఁబోలు నరపాలుఁడు వేలముచుట్టు నుండగన్. 872
క. పేరుగల కుంజరంబులు
వారువములు భూమిపతినివాసము పొంతన్
వారక నిజాప్తరక్షో
దారములై యుండవలయుఁ దమతమ యెడలన్. 873
క. అంతర్వాసికసేన ని
రంతరసన్నాహమున సదాయతగతి భూ
కాంతుఁ బరిరక్ష సేయుచు
సంతతమును వలయు జాముజామున నిలువన్. 874
ఆ. సంగరైకయోధసన్నద్ధగజమును
వాయువేగి యైనవారువమును
నుండవలయు నెపుడు నుర్వీశుమందిర
ద్వారభూమిఁ గడు నుదారశక్తి. 875
ఆ. కొంతసేన గూడుకొని సైన్యపతి రాత్రిఁ
గడుప్రయత్నపూర్వకంబు గాఁగ
నాలయంబు వెలి నిరంతరసన్నాహ
సరభసమునఁ జుట్టుఁ దిరుగవలయు. 876
క. పరసైనికప్రచారము
పరికింపఁగవలయు శీఘ్రపటుసత్త్వగుణా
కరు లగు రాహుతు లొగి న
ప్పురసీమాంతఃప్రచారముల నెల్లపుడున్. 877
ఉ. తోరణమాల్యముల్ పవనధూతపతాకయుఁ గల్గుయంత్రిత
ద్వారముల న్నిజాప్తజనతాపరిరక్షణ మొప్పఁ జెప్ప నె
వ్వారికిఁ జొచ్చి రా వెడల వచ్చుట లేక యరాతిదూతసం
చారము రాజశాసనవశంబున నయ్యెడ నిల్చు టొప్పగన్. 878
క. ఆతతకలకలహాస్య
ద్యూతములకుఁ బానములకుఁ దొలఁగి జనంబుల్
ఏతఱినిజకార్యోన్ముఖు
లై తనరఁగవలయు మిగుల నాయిత మొప్పన్. 879
మ. పరిఖాచక్రపథస్థలి న్నిజచమూపఙ్క్తిప్రచారార్థమై
ధరణీభాగము గొంత మాని యితరస్థానంబులం దెల్లచోఁ
బరసైన్యప్రవిఘాతబాధ మొనరింపంజాలునచ్చట్టునం
బరగుం గంటకశూలవల్లభచయమున్ బ్రచ్ఛన్నరూపంబుగన్. 880
క. తరుగుల్మశిలలు సానువు
లరయఁగ వల్మీకనిమ్నతాదులు బాహ్యాం
తరమిత్రకరణములచేఁ
బరగఁగ వ్యాయామభూమి పరికింపఁదగున్. 881
సీ. వాహినీవ్యాయామవరభూము లెంతయు
నిచ్ఛానుకూలత నెలమి మిగుల
విమతుల కటుగాక విపరీతమగునెడ
లుత్తమస్థలములై యొప్పుమిగులు
నెదిరికిఁ దనకును నేకరూపం బయి
మానగునయ్యెడ మధ్యమంబు
పరచమూవ్యాయామపర్యంతమై తన
కటుగాక తక్కిన నధమ మయ్యె
ఆ. గాన యుత్తమంబు గైకొనునట్టిది
యైనచోటు మధ్య మనఁగ నొప్పు
నధమ మైన బంధనాగారసదృశంబు
గాన యది భజింపఁ గాదు పతికి. 882
కామందకము
చ. నగరము లంక దుర్గము ఘనం బన నొప్పు త్రికూటశైల మ
య్యగడిత వార్ధి యోధులు సురారులు శ్రీలు కుబేరుపెన్నిధుల్
నెగడిన నీతిశాస్త్రములు నిచ్చలుఁ జెప్పెడివాఁడు శుక్రుఁ డీ
జగమున నట్టి రావణుఁడుఁ జచ్చెన కాక మనంగ నేర్చెనే. 883
మ. చెలువం బేది యరణ్యవాసగతులై శ్రీరాముఁడున్ బాండవే
యులు చేబొందిరి వృష్టివీరు లురుదైత్యుం డైన లంకేశుఁడుం
గలఁగె న్మర్త్యులచే నలంగె నలుఁ డీకష్టంపురాజ్యంబుకై
తలపోయం గడుదుఃఖహేతు విది వ్యర్థం బొప్ప దాసింపఁగన్. 884
క. ఆరాజ్యమునకు రాజులు
ధారుణిలోఁ దండ్రి నన్నఁ దమ్ముని సుతులన్
దారు వధింతురు గావున
దూరమునన యడఁగి చూచి తొలఁగఁగవలయున్. 885
పంచతంత్రి
గీ. పరుఁడు తనకుఁ దగనిపాటు సంబంధంబు
గలుగఁ జూచికాని కలయవలదు
చేరినపుడ తన్నుఁ జెఱిచినయాతఁడ
యయ్యెనేమి పగతుఁ డయ్యెనేమి. 886
ఆ. బలియుఁ డెత్తిరాఁగ బలహీనుఁ జేరుట
దంతియెదుర నుఱిమితప్పఁబాఱు
వఱదఁ బోవువాని వఱదఁబోయెడివాఁడు
పట్టు టాత్మసమునిఁ బట్టియునికి. 887
ఆ. వలయు నాశ్రయింపఁ బలువురిఁ బెక్కండ్రు
జేరినతని కెపుడు చేటు లేదు
పిల్లవెదుళు లొప్పఁ బెనగొన్న వెదురొంటి
వెదురువోలె వశమె వేగ నఱక. 888
క. ఒక్కరుని నాశ్రయించిన
పెక్కుండ్రును జత్తు రొక్కపృథుబలయుతుచేఁ
బెక్కు మహీరుహములు ధర
నొక్క మహానలము చేతనొఱఁగినమాడ్కిన్. 889
ఆ. జగతిఁ బొగడ నెగడు సజ్జనాశ్రయమున
నెవ్వఁడుండె నెనకమెసఁగుపెంపు
జలజపత్రయుక్తజలము ముక్తాఫల
శ్ర వహించినట్టి చెలువు దోప. 890
క. పెనుగజము ద్రుంచునక్రము
కననెలవున నుండి నెలవు దప్పిన మఱి తా
శునకంబుచేతఁ జచ్చుం
దననెలవున హీనుఁడైనఁదగ ఘను నోర్చున్. 891
క. కాకములఁ ద్రుంచు రాత్రియు
ఘూకము కాకంబు పగలు ఘూకచయంబున్
జేకొని త్రుంచుం గావున
గైకొనఁగా వచ్చుఫలము కాలముతోడన్. 892
క. దరినుండి తిగుచు శునకం
బురువడి నక్రమును నక్ర ముదకస్థితమై
బొరిఁబొరి నేనుఁగుఁ దిగుచుం
బరవసమునఁ గాన దేశబల మొప్పు ననిన్. 893
కామందకము
ఉ. మానుగ శత్రునైన నభిమానము సేయక చొచ్చివాఁడు దన్
హీనము గాఁగఁ బల్కిన సహించుచుఁ బ్రాజ్ఞుఁడు శక్తియుక్తియున్
గానఁబడంగనీక పొసఁగం ధృతిపెంపును గప్పికొంచు నిం
పూనఁగ వారి గెల్వవలయుం దనకార్యము లైనయంతకున్. 894
పంచతంత్రి
క. అరివధకుం దగునంతకు
ధరణీశుం డోర్వవలయుఁ దక్కువ యైనన్
నరుఁ డాఁటదయ్యు నుండఁడె
హరి గొల్లఁ డనంగఁ బడఁడె యనువగుదాఁకన్. 895
నీతిభూషణము
క. పగ యడఁప దలఁచునాతఁడు
పగతుని పగవానిఁ గూడి .................
......................................
....................................................... 896
గీ. వేఱయొకచోట వలయొగ్గి వేఁటకాఁడు
తొలఁగియుండు మృగంబులఁ ద్రుంచుపగిది
రూపుసూపక శత్రువు రూపుఁ గూల్చు
టిదియె నయమార్గ మిట్లు జయింపవలయు. 897
ముద్రామాత్యము
క. బలవంతునైన నాతని
బలమది మానవుల మిగులఁ బ్రకటింపమియుం
దలఁప శమీకాష్ఠములోఁ
గలదను ననలంబువోలెఁ గైకొన రెందున్. 898
క. బలమును గుణమును శీలముఁ
జలమును సత్త్వంబు సాహసంబును ధృతియున్
గలుగని పురుషుని నవనీ
స్థలిలోపలఁ దృణము గాఁగఁ దలఁతురు మనుజుల్. 899
పంచతంత్రి
క. ధీరుఁడు ముట్టినఁ దొల్లి వి
చారించిన తలఁపు మఱచు శస్త్రాస్త్రకళల్
నేరఁడు మెఱయం గావున
శూరుఁడు గావలయు నృపతి సుస్థిరగతియై. 900
పురుషార్థసారము
ఆ. తలఁచి చూడ రిపుఁడు తనకంటె ఘనుఁడైనఁ
దనరఁ దన్ను దాఁచికొనఁగవలయు
వానికంటె ఘనుఁడు తానైన మరి శర
జ్జలజరిపుఁడుబొలె వెలుఁగవలయు. 901
క. కోపించి రిపుఁడు రిపునకు
రూపింపక తొలఁగు టతనిఁ ద్రుంచుటమీఁదన్
ఏపారగ్రుంగి సింహం బేపున
మదగజముఁ జంప నెగసినమాడ్కిన్. 902
క. చేరువకు భూరిబలుఁ డగు
వైరిమహీనాథుఁ డెత్తివచ్చిన నైనం
ధీరత యప్పుడ డింపని
భూరమణుని కాడొకండు వొందకయుండున్. 903
క. పగతుప్రతాపము గనుగొని
మగటిమి దెగఁదునిమి పుచ్చు మనుజేశుఁడు దాఁ
దగరపుఁదొడవునుబోలెను
జగమునఁ బూజ్యుండు గాక చను నెల్లెడలన్. 904
ఆ. పగఱపయి నొకండు పాటించి నడవంగ
వెఱచి తనదునెలవు విడుచు నెవ్వఁ
డతని కారణమున నతనిఁ గాంచిన తల్లి
వంధ్య యనఁగఁబడు ధ్రువంబుసుమ్ము. 905
క. హీనునకు ఘనునిచేఁ గీ
డైనను దేజంబు సమదహస్తికి నగముల్
మానుఁగఁ గోరాడం దగ
గాని యగుం గొమ్మలేమి యది యొచ్చెంబే. 906
ఆ. హీనుఁ డధికుచేత నీల్గుట యొచ్చెమే
మహితయశము కాక మదముకొఱకు
గండతటము ద్రొక్కి గజకర్ణహతిఁ దేఁటి
యీల్గెనేని యొచ్చె మేమిగల్గు. 907
క. ఘనమును గడుహీనంబును
ననఁగలదె కరీంద్రుఁ డెంత హరి యెంతి కరిన్
దునుమాడును హరిశాబము
ఘనమేటికి మనసు పెద్ద గలవారలకున్. 908
క. నిర్విషము చేసి పడగన్
దర్వీకరములకుఁ జూప దా కావున దో
ర్గర్వంబులేనివానికి
నుర్విం బెను విషయమైన నొక్కటి వలయున్. 909
క. కపటపులేఖలఁ బంపియు
విపులార్థచయంబు లెపుడు వెదఁజల్లియుఁ ద
ద్రిపుపక్షముఖ్యపురుషులఁ
గుపితుల దమసొమ్ముచేసికొనఁదగు వేగన్. 910
పంచతంత్రి
ఆ. దొడ్డవానితోడఁ దొడరి యూరకయుంట
కసపుకుప్పఁ జిచ్చు గలుగఁబెట్టి
దానిక్రిందఁ గాలఁ నిద్రపోయిన
వానిభంగి గాదె వసుధలోన. 911
నీతిసారము
క. ఘనుఁ డెత్తి వచ్చి విడిసిన
తన కోటయె హీనుఁ డెలమి తగుసుహృదుల రాఁ
బనిచిన యుక్తం బగువా
రును దానును దోల నదియుఁ గ్రొవ్వియ చచ్చున్. 912
మ. తనకున్ గెల్వఁగరానిపక్షమున వే తా వైరిఁ బోకార్చఁగా
ఘనశత్రుం దలపెట్టఁగావలయు వేగం బొప్ప నీతిజ్ఞుఁ డె
ట్లనినన్ వాఁడును బోరఁగా నిహతుఁ డౌ నట్లైన నప్పిమ్మటన్
దనవైరంబు నడంగదయ్యె దొడలుండన్ ......కున్ సైన్యముల్. 913
ఆ. ఒలియుఁ డగుశత్రుచేతనఁ బలియుఁ డనఁగఁ
బేర్చుశత్రునిఁ బచ్చి వైపింపవలయు
మూలనాశంబుగాఁ దన్ను మోవకుండఁ
బెలుచ ములుముంటఁ బుచ్చి వైపించినట్లు. 914
క. పొగడఁదగుసహజసత్త్వుం
డగు నెవ్వఁడు వాఁడు వొలియఁ డహితులచేతన్
జగతిమణిదీపశిఖ కడు
నిగుడుం గా కడఁగిపోవునే పెనుగాలిన్. 915
పంచతంత్రి
క. వెఱపించి చూచి యెందును
వెఱవకయున్నతనిఁ జేర వెఱతురు మదిలో
వెఱచినఁ దాఁ బైపడగాఁ
నుఱుకుం గుక్కయును గ్రోతియును బగవాఁడున్. 916
పురుషార్థసారము
చ. విను మును నీతియుం గలదు వేయును నేటికి దర్ప మేర్పడన్
అని యొనరింపఁ గావలయు నారగ నుత్తమునందు సామమున్
బెనుపఁగ శూరునందుఁ గడుభేదము నల్పునియందు దానమున్
విను సమునందుఁ బౌరుషము నేర్పునఁ జేసిన జాల మే లగున్. 917
పంచతంత్రి
క. తా నరులు వచ్చు తెరువున
మానుగఁ గలచెఱువులందు మడువులయందున్
బూని ఘనగరళతరళము
గా నొనరింపంగవలయుఁ గడువేగమునన్. 918
ముద్రామాత్యము
గీ. ఎత్తినప్పుడు విడియుచో నిఱుకటంపుఁ
దెరువునందును నడ చెడి తిరుగఁబట్టి
నట్టియెడ నిద్రపోయెడునవసరమున
శాత్రవుల బిట్టు పైఁబడి చంపవలయు. 919
వ. ఇ ట్లుభయబలంబులుఁ గదియునప్పుడు. 920
సౌప్తికపర్వము
క. ముందటను భటులు భటుల పి
ఱుందను రథములును నప్పిఱుందను హయముల్
బొంద నటపిఱుద గజములు
నందంబుగ నిట్లు మిశ్ర మచలం బనఁగన్. 921
కామందకము
క. వికటపటుశూలకళితా
శకటోద్భటగజఘటాదిచక్రవ్యూహ
ప్రకట మొనరింపఁగాఁ దగు
నకుటిలభుజదర్ప మొప్ప నాహవభూమిన్. 922
ముద్రామాత్యము
సీ. గట్టును జెట్టును మిట్టయు బల్లంబుఁ గలిగినచోటు కాల్బలమునేల
వినుము నీళ్ళును రొంపియును లేక సమవిశాలము నైనచోటు గుఱ్ఱములనేల
క్రమ్మి గ్రుంగక గదగదగువంపులు గలుగమి నొప్పుచో టరదములనేల
యెడనెడ మ్రాఁకులు మడువులు గలచోటు కురునాథ యెఱుఁగుము కరులనేల
ఆ. యేబలంబు దనకు నెక్కుడు గలుగు న
బ్బలమునేల పోరు గలను గాఁగ
నినుఁడు శశియు గాలి వెసుకగా మొన నడ
పించి పొదువ సంభవించి జయము. 923
శాంతిపర్వము
చ. హరుమెడ నున్నసర్పము గణాధిపునెల్క గ్రసింపఁజూచు న
య్యురగము ద్రుంప షణ్ముఖమయూరము సూచు గజాస్యుఁ జంప నా
గిరిసుతవాహనం బయిన కేసరి చూచు నటేల యిమ్మహే
శ్వరుపరివార మిట్లనినఁ గన్గొన నన్యులు మాననేర్తురే. 924
పంచతంత్రి
క. మొన కొక్క శౌర్యభూషణుఁ
జను నధిపతిఁ జేయ సమరసమయంబున వా
రును దళవాయికి నొఱపై
చనఁదగుఁ జనకున్న భేదశంకయుఁ బుట్టున్. 925
క. మొనసేయ నేరకుండిన
మును శూరులు నడవఁ దొల్లి మొనయును రాజున్
వెనుకొనకయున్నఁ బిఱుకుల్
మొన నొకరుఁ డున్న జయముఁ బొందఁగ వశమే. 926
ఆ. నిబ్బరంపుఁదాఁకు నిలువక రిపుసేన
దిరుగు మంద మైన విరుగుఁ దాన
కడవఁ గుజువ దాఁకునెడనైన వేగంబు
గలిగియునికి నిలుచుఁగాదె యిట్లు. 927
నీతిసారము
క. నెఱబిరు దొకండు నిలిచిన
బిఱుకులు నఱుముదురు వాని బిరుసున కని సు
క్కఱి యొకఁడు విఱిగెనేనియుఁ
బఱిపఱియై సేనయెల్ల భంగము నొందున్. 928
పంచతంత్రి
ఆ. రాజరాజవంశభూజనపతు లీల్గి
రకట మంత్రి దొలఁగి యలికినాఁడు
ఏది పనుపు సేయ నిటు నిల్వఁబోలదు
రాజులేనికయ్య మోజపడునె. 929
ముద్రామాత్యము
క. జడియక మును నడిచిన భటుఁ
డడుగడుగున కశ్వమేధయాగఫలంబున్
బడయును వెనుకకు నొదిగినఁ
బడు దుర్గతి నండ్రు సమరపతనుల కెల్లన్. 930
క. నరులకు నెచటికి నరిగిన
మరణము నిజ మగుట యెఱిఁగి మనుజుఁడు సమర
స్ఫురణంబు విడిచి వెనుకకు
నరిగిన నపకీర్తి దక్క నన్యము గలదే. 931
ఆ. చచ్చు నూర కొకఁడు జావఁ డొక్కఁడు పోటు
లెన్ని సోఁకియైన నింత యెఱిగి
మున్ను నడచి కీర్తిఁ జెన్నఁగు టొప్పదే
దైవఘటన కేల తలఁక నరుఁడు. 932
నీతిసారము
గీ. సమర మొనరించినంతనె చావురాదు
పాఱిపోయినంతనే బ్రతుకు లేదు
యెటులఁ బోవుప్రాణ మిచ్చియు రణమున
పతిఋణంబు తీర్పఁ బాఁడిగాదె. 933
ఆ. చచ్చెనేని యోగిచాడ్పున ముక్తికి
పాఱిపోయినయంతనే బ్రతుకు లేదు
బ్రతికెనేని యుభయబలములుఁ బొగడంగ
నుండు సమరకేళి యొప్పదెట్లు. 934
మార్కండేయము
వ. మఱి యుద్ధంబు నిరూపింతు నదియును సంకులద్వంద్వైకాకిభేదంబు లన మూఁడు దెఱంగు లందు ద్వంద్వైకాకియుద్ధంబులు మత్సరగ్రస్తులగు వీరభటులపని గాని రాజకృత్యంబులు గావు. సంకులంబునకుఁ గరికోటచతురంగయుద్ధంబు లన మూఁడు భేదంబు లందును జొచ్చిపోయి పోరుట కరియుద్ధంబు, దుర్గంబుమీఁద విడిసి పోరుట కోటయుద్ధంబు, బయలం జతురంగబలంబులం బన్ని యుద్ధంబు సేయుట చాతురంగంబనంబడు. నివి క్రమంబున నధికునందును హీనునందును నధమునందును బ్రయోగించునది, యధికుం డెత్తినఁ గార్యోపాయంబున వేలంబు సొచ్చి పొడుచుటయు ననువైన దుర్గంబు కల్లకోటగోడ గొనుటయు సంధికి నుపాయంబులు; హీనుండగువాని దుర్గంబుమీఁద విడిసి మహాయత్నంబున బహుయంత్రతంత్రకార్యంబుల గొనుట యుచితంబు, సముతోడ బయలఁ బోరునప్పుడు బలు వెఱుంగని నరుగొంత మిగులం జూచి కాని యుపక్రమింపవలదు దైవమానుషంబు కలిమి యధికశక్తి యనంబడు. చతురుపాయషాడ్గుణ్యవేదియు బలశక్తిసంపన్నుడును నూతనానితరసాధనోపేతుండును నయ్యును బయల నధికుతోడ యుద్ధంబు సేయుట కొండతోడఁ దగరు దాఁకినయట్ల యపజయంబు సిద్ధంబు. సముం దొడరినఁ బచ్చికడవ పచ్చికడవం దాఁకినయట్లు జయం బసాక్షికంబు. శూరుండు నుపాయవేదియునైనవానిని వాఁ డల్పుండైనను మిత్రుఁ జేయునదిగాని తెగవలదు, శూరబలం బల్పంబయిన గెల్చునుపాయవేది శూరుండు గాకయు గెలుచు ననిన వేఱ చెప్పనేల. పరుండు సాధ్యుఁడు గా నిశ్చయించి యతని సహాయుల నుపాయంబునఁ బాపి యతనిదాయాదుల నేమి యిచ్చియైనఁ దొలగించి మఱియు ననేకప్రకారంబుల నదృష్టదూరార్థసాధకం బగు ప్రజ్ఞాశస్త్రంబులన యుద్ధంబు సేసి యింక యిట్లనియున్న హాని యగువేళ నాసన్నదృష్టార్థసాధకం బగు శస్త్రయుద్ధంబు సేయునది. కార్యవేళ యెఱుంగ కుపక్రమించుట నీరు గానకమున్నె చెప్పు లూడ్చినట్లు. అవశ్యంబునం గెలుచువానికి దైవబలంబును గలుగు. అని యెల్లసంధులఁ గాక శకున స్వరభూమి గ్రహాదిబలంబులు గలవేళన యుపక్రమింపవలయు. పొడుపునకుఁ బిఱుకులం గూర్చిన బలంబు లెల్ల వెఱతురుయ శూరులకైనను దాఁకుదలతెచ్చుట జయకారణంబు. మున్ను రణంబునఁ గని యెఱుంగనివారు పరులసామర్థ్యం బెఱుఁగకైనను సర్వపదావిరుద్ధంబుననైనను వీరాలాపంబులు పలికిన నమ్మవలదు. మఱియును. 985
ఆ. ఆహవేచ్ఛలేనియతని నాయతపాటు
లేనివాని భీతుఁ డైనవాని
యుద్ధకృత్య మొల్ల కున్నవానిని జంపి
నతనిఁ బొందు బ్రహ్మహత్య యనిరి. 936
క. యుద్ధమున గెల్చి రిపుచే
నెద్ధన మెవ్వాఁడు దెచ్చె నేర్పడఁ బతి యం
దుద్ధారము గొన కాతని
కద్ధన మంతయును నిచ్చునది ధర్మమతిన్. 937
క. ఇత్తెఱఁగు దెలిసికొని దం
డెత్తి చననిరాజు పరమహీశుల సిరు లు
ద్వృత్తిగొను నెట్లు సేకొను
గృత్త్రిమనయమతము లేక కేశవనాథా. 938
మదీయము
ఆ. సింహవృత్తిఁ దాల్చి చేకొనవలయుఁ దా
సద్వివేకనృపతి శత్రులక్ష్మి
నధికదుర్వినీత లగు కామినులఁ గచ
గ్రహణ మమరఁ జేసి కవసినట్లు. 939
పంచతంత్రి
కూటయుద్ధము
క. లలితమణికూటశోభా
కలితప్రత్యర్థిమస్తకస్థలవీథిన్
లలి వామపాద మీడఁడేఁ
భొలుపుగఁ బరవీరలక్ష్మి బొందఁగ వశమే. 940
క. భూరిప్రయత్నములచేఁ
బ్రేరిత మగు చిత్తహస్తిఁ బృథుసత్త్వమునన్
భూరమణుఁడు మురారి
క్ష్మారుహములఁ బెఱుక కెట్లు గైకొను శుభముల్. 941
క. హేలాకృష్ణసుతీక్ష్ణత
రాలోలకరాళమండలాగ్రమరీచి
వ్యాలీఢబాహు స
మాలంబన సేయు లక్ష్మి యభిసారికయై. 942
క. అనుకూలదేశకాలం
బును శత్రుప్రకృతిభేదమును ఘనబలముం
గని చనఁ బ్రకాశయుద్ధం
బొనరు నొనరకున్నఁ గూటయుద్ధం బమరున్. 943
గీ. కందరప్రయాణార్యవస్కంధవేళ
గని యభూమిష్ఠుఁ డగువానిఁ (గలఁచియైన
నతఁడు భూమిష్ఠఁ డగునేని) నట్టియెడన
జనుల భేదము చేసియేఁ జంపవలయు. 944
గీ. భగ్నమైనట్లు ద్రిమ్మఱి పాఱుతెంచు
వనచరాదుల వెనుకొని వచ్చువాని
నుఱక పాశాపకృష్టుని నొడుచుపగిది
యడరి సుభటులచేత నుక్కడపవలయు. 945
సీ. ముంద ఱేమఱక సముగ్రత నరుదేర
నెక్కుచుఁ దిమురుచు నేమఱించి
పటువైరిసైన్యంబుఁ బంచి యుదగ్రత
దక్కింపవలయుఁ దా నొక్కదెసను
వెనుకనైనను బంచి వికలము గావించి
కడుకొని యెదుర నే పడఁవవలయు
నొకకెలంకున యుద్ధ మొనరించి వేఱొక
కెలఁకునఁ దాఁకి స్రుక్కింపవలయు
గీ. నెదుర విషమస్థలం బైన నెగిచి వెనుక
వెనుక విషమస్థలం బైన వేగ యెదురఁ
దాఁకి గెలువంగవలయు నుదగ్రగతిని
నిరుగెలంకుల నిట్లు జయింపవలయు. 946
క. బవరము దూష్యామిత్రా
టవికుల మును దాఁకి కడుదృఢంబుగఁ జేయన్
దివుటను వేసటపడు శా
త్రవుని నిరాక్రందు నుక్కు దక్కింపఁదగున్. 947
క. తొలితొలి దూష్యామిత్రులు
దలపడి నీల్గుటయు నతఁడు దనజయమునకున్
లలి నమ్మియుండ నొక్కటఁ
జలమఱఁ బైఁబొదువవలయు సత్త్వాధికుఁడై. 948
క. విడిదలయు నిజపురంబును
గడిపల్లెలు సస్యగోనికాయాదులు దా
వడిఁ బొడిచి కలఁచి కలఁగెడు
నెడరున నేపడరఁ బొడుచు టెంతయు నొప్పున్. 949
క. బలుబలము గొందు వేఱొక
నెలవున నిడి యడఁగియుండ నిజశిబిరముపై
లలిఁ బొడిచి తిరిగి యరిగెడు
బలముపయిం బొదువవలయుఁ బటుసింహగతిన్. 950
ఆ. విమతు లెల్ల ప్రొద్దు వేఁటలాడెడువానిఁ
దొడరి యట్టిచోన త్రుంపవలయుఁ
బసులఁ బట్టి యరుగఁ బఱతెంచు నాదటఁ
ద్రోవగడ్డియైనఁ ద్రుంపవలయు. 951
మ. సమరస్కందభయంబు పెక్కువ నిశన్ సంజాగరశ్రాంతిమైఁ
గమియ న్నిద్రకు నాససేయుఁ బవ లుగ్రస్ఫూర్తిమైఁ దాఁకియున్
అమరంగాఁ బగ లాయితం బయినచో నామాపు పైఁ బాఱియున్
గ్రమసంసుప్తబలంబు రాత్రిమెయి స్రుక్కం దాఁకి కూల్పందగున్. 952
మ. చరణత్రాణసదానివారణమహాస్తంబేరమశ్రేణిచే
క్షురికాత్యుగ్రజనప్రవీరసుభటస్యూతంబుచే నొండె న
చ్చెరువంద న్నడురేయు సౌప్తికరణశ్రీ లీలమైఁ జొచ్చి భీ
కరభంగిం బరిమార్పగావలయుఁ దత్కల్పాంతకక్రీడలన్. 953
క. ప్రాలేయతిమిరగోగణ
శైలవనశ్వభ్రతావిశాలనదీజం
బాలచ్ఛిద్రములన్నియుఁ
బోలఁగ సత్రములయెడలు పోరులచోటుల్. 954
ఆ. అప్రమత్తుఁ డగుచు నహితుల నెబ్భంగిఁ
దా జయింపవలయుఁ దద్విధమున
నరులు దన్ను నోర్తురనుశంకమెయిఁ దత్ప్ర
చార మరయవలయుఁ జరులవలన. 955
ఉ. ఒక్కటఁ గూటయుద్ధమున నుక్కఱ శత్రు వధించినన్ జయం
బెక్కుడు గల్గి పాప మొకయించుక పొందదు నిశ్చయంబు పే
రుక్కున ద్రోణసుతుఁ డుఱ కొక్కయెడ న్నడురేయి నిద్రమైఁ
జొక్కిన పాండునందనులఁ జూచి వధింపఁడె సౌప్తికక్రియన్. 956
కామందకము
కార్యత్వరితరీతులు
క. ఆద్యావస్థనె నృపతులు
ఛేద్యులఁ జెఱుచునది తడవు సేయుటయు నఖ
చ్ఛేద్యము ముదిరి కుఠార
చ్ఛేద్యం బగు నండ్రు నీతిసిద్ధాంతవిదుల్. 957
బద్దెననీతి
క. ధీయుతులమాట లప్పుడ
సేయక మోహమునఁ దడవు సేయునతఁడు దా
నాయెడ దా శేరకుగతి
వేయును జెప్పంగ నేల వేగమె పొలియున్ 958
పంచతంత్రి
క. డెందమునఁ దెలిసియును జే
యం దెంపరి గాకయుండు నాతని తలపో
తం దీరునె యవకార్యము
మం దెఱిఁగినమాత్ర తెవులు మానుట గలదే 959
నీతిభూషణము
క. పదను దొరకొనుడుఁ జెచ్చెర
వదలక వెదబెట్టు హలికవర్గముకరణిన్
బదను దొరకొనుడుఁ జెచ్చెర
వదలక కార్యంబు దీర్పవలయుం బతికిన్. 960
బద్దెననీతి
క. స్వపరహితకార్యకర్మము
నిపుణుండై వేగ చేయ నేరకయున్నన్
విపరీతస్థితికాలము
కుపితంబై తత్ఫలంబు కొనిచనుఁ బిదపన్. 961
చాటువు
అధికారముల సయోధ్యప్రకారము
ఉ. గండతలంబులం బెలుచఁ గ్రమ్ములసన్మదవారికై యశుల్
పిం డరుదెంచి యంటి కడుఁ బ్రేమబలాయతమూర్తు లయ్యు వే
దండవిభు ల్సహించి తమదర్పము సూపక చూచినట్ల హీ
నుం డగువాని కల్గునె ఘనుండు దలంప ధరాతలంబునన్. 962
క. కులగిరులు పెఱుకు సత్త్వము
గల పురుషుఁడు తృణముఁ బెఱుకఁగడఁగునె మదిలోఁ
దలపోయ నట్లపోలెను బలహీనున
కరుగఁజొరఁడు ప్రబలుం డెపుడున్. 963
ఆ. అరుల బలుని నబలుఁ డనిలోన నలిగినఁ
జేట కాని యొకటిఁ జేయలేఁడు
సనగగింజ పెటిలి చనుఁగాక మంగలం
బనియఁ జేయఁగలదె యరయ నెందు. 964
గీ. వఱలుమైత్రివివాహోత్సవమ్ము సేయ
సిరులు నెఱుకలు సమమైన పురుషు లెవ్వ
రరయ వారికిఁ దమలోన నమరుఁగాని
మునులకును నీచులకుఁ బొందు గలుగదెందు. 965
గీ. కదియ నోరికి దళమైన కడియ కాని
వెగ్గలము గొన గ్రుడ్డులు వెలికి నుఱుకు
కాన యభియాతిజయకాముఁ డైనవాఁడు
చేత నయ్యెడుపని గాని చేయవలదు. 966
పంచతంత్రి
ఆ. ఎదిరివాని సత్త్వ మెఱుఁగక పైఁబడి
సీయదగదు గాక చేసెనేని
నతఁడు గీడువొందు నల టిట్టిభముచేత
నబ్ధి గీడు వొంది నట్ల వోలె. 967
చోరనీతులు
క. మ్రుచ్చిలుటయుఁ బాతకముగ
మ్రుచ్చిలమియు ధర్మముగను మున్నుపదేశం
బిచ్చిరి పూర్వమునీంద్రులు
మ్రుచ్చిలకుండునది యెరుల మొల్లములు జనుల్. 968
క. ధనమునకు బ్రాణమమ్ములు
ధనమునకేఁ బ్రాణ మీగి దలఁప జనులకున్
ధనమది ప్రాణుల ప్రాణము
ధరహారిత ప్రాణహారితకుఁ దక్కువయే. 969
క. ప్రాణిదయఁ జేసి చోరుని
ప్రాణములకుఁ దెగని భూమిపతి కాజ్ఞలచేఁ
బ్రాణులనేకులు విగత
ప్రాణులుగాఁ జూచునది కృపాభావమొకో. 970
క. ఖలునొకని జంపమియె సా
ధులఁ బలువురఁ జంపినట్ల దొర కొనినను గ్రో
ల్పులిఁ జంపసునికి చాలదె
చలమున గోసమితి వేఱ చంపఁగ నేలా. 971
క. భూవరుఁడు కూర్మి గలిగినఁ
బ్రోవందగు జనవుగలిగి భూప్రజకహితో
ద్భావియగు మ్రుచ్చు గావం
గా వచ్చినవాని మ్రుచ్చుగాఁ దలఁపఁ దగున్. 972
శత్రునపనమ్మికనీతులు
ఆ. అబలుఁ డైనఁ జిక్కఁ డతిబలుచేతను
నెదిరి కెపుడు మర్మ మీనివాఁడు
మర్మ మిచ్చెనేని మదియెంత బలవంతుఁ
డైనఁ జిక్కునొక్క యబలు చేత. 973
ఆ. దేవగురుని బోలు ధీమంతుఁ డైనను
వేగ మొరుల వలదు విశ్వసింప
విమల యశము సుఖము విత్తంబు వృద్ధియు
వర్ణనీయ జయము పడయువాఁడు. 974
క. అమరులకైనను విశ్వా
సము వెలిగాఁ జెఱుపరాదు శత్రులవిశ్వా
సముననకాదే దితి గ
ర్భము శక్రుఁడు సొచ్చివ్రచ్చి పాఱఁగవైచెన్. 975
ఆ. పగతుఁడైన నపుడు భయమంది యింటికి
నేఁగు దెంచునప్పుడెవ్వఁ డతనిఁ
జులుకఁ జంపఁజూచు సొలవక తత్పాత
కంబు బ్రహ్మఘాతుకంబు సమము. 976
క. పలుకులు తేనియతేటలు
దలపడి మును చేసికొను మతంబున శత్రున్
జలము గొని చెఱుపఁగడుఁదగు
నలసితిమిది మిగుల కఠిన మనక నయాఢ్యున్. 977
క. తనకార్యం బగునంతకు
గొనగొని తాఁగానియట్ల కూడి మతిం గీ
డొనరింపవలయుఁ బరునికి
వనమునఁ జతురకుఁడు వోవె వలనేర్పడఁగన్. 978
ఆ. నయము మీఱవాక్కు నవనీతసదృశంబు
మానసంబు ఱాసమంబు చేసి
కొని చరింపవలయు ననయంబు దనశత్రు
కుల మడంచు నంతకును నెఱింగి. 979
క. నమ్మకచేసిననైనను
నమ్మంగావలవ దహితు నయమార్గజ్ఞుల్
నమ్మించెననుచు వృత్రుఁడు
నమ్మిక దాఁ బొలిసె నాకనాయకుచేతన్. 980
ఆ. దేవగురుని బోలు ధీమంతుఁడైనను
నమ్మవలవ దహితు నమ్మవల
దతులయశము మిగుల నాయువువృద్ధియు
భూరిసౌఖ్యములును గోరువారు. 981
క. అలఁతియగు తెఱపిగనినను
నలవడ భేదించి చొచ్చునల్లన పిదపన్
జెలువుగని చెఱుచు శత్రుఁడు
పొలుపగు వృక్షమును వారిపూరముపోలెన్. 982
క. గురుమత మెవ్వరి నమ్మమి
పరమాప్తుల గూడి సేత భార్గవుమత మి
ద్ధర విష్ణుశర్మ మతమిది
గురుదిరమతి సేనదీర్చుకొని యరిఁదగులన్. 983
క. మునుమున్ను ప్రీతితోడన్
జని లోపలఁ డొచ్చి పిదప సకలంబునుఁ జై
కొనుదాన శత్రుఁ డల్లన
చనుబో జారాంగనలకు జారుఁడు పోలెన్. 984
ఆ. ఎదిరి వాని కులము హృదయంబు బలమును
ముట్ట నెఱిగి కొనక మున్ను మున్ను
చెలిమి సేయఁ జనదు చేసిననొప్పదీ
పలుకు దేవగురుని పలుకు సుమ్ము. 985
గీ. జగతిలోపల వేదపారగుల చేత
బ్రహ్మహత్యాది దుస్తరపాపములకుఁ
దలఁచిచూడంగ నిష్కృతిఁ గలుగుగాని
వినుము నిష్కృతియనఁ గృతఘ్నునికి లేదు. 986
క. విను మెవ్వఁడేని తనుని
చ్చిన వానికిఁ బిదపఁ గీడు సేయునతఁడు స
చ్చినయప్పు డతని మాంసము
గని కాకము నైన రోయుఁ గబళింపంగన్. 987
ఆ. యానపానభోజనాసనశయనంబు
లందు రంధ్ర మొక్కటైనఁ దెలియఁ
గనిననైనఁ జొచ్చి కడతేర్చు నదిగాన
వైరియొద్దివాని వలదు నమ్మ. 989
పంచతంత్రి
క. ఖలుసంగతి గూడిన ని
ర్మలచిత్తుండైనఁ జేయుఁ బ్రతికూలుండై
యలనూనియ కర్పూరము
గలసిన విషమైనయట్లు కందామాత్యా. 989
నీతితారావళి
క. వడిదునిమివైవఁ దన కగ
పడునంతకు శత్రునెడ గపటభక్తి దగున్
కడుగదె నదీప్రవాహము
వడిద్రిప్పగ వలసి యంఘ్రిపముపాదంబుల్. 990
అజ్ఞాతము
ఆశ్వాసాంతము
క. పంచేషుజనకరిపుగజ
పంచాననపాంచజన్యభాసితహస్తా
పంచానన నారీముఖ
సంచితవాగ్విజితపాదసరసిజయుగళా. 991
క. మురళీఘననాదామృత
తరళీకృత యోగిహృదయతామరస మహత్
ఖురళీమల్లవిమర్దన
విరళీకృతజననమరణ విశ్వాతీతా. 992
మాలిని. స్ఫురదురుశుభకీర్తి! భూరి విజ్ఞానమూర్తీ!
గురుతరగుణశీలా! గోపికాచిత్తలోలా!
సరసిజదళనేత్ర! సత్యభామాకళత్రా!
విరళితభవపాశా! విశ్వలోకప్రకాశా. 993
గద్యము ఇది శ్రీ సరసింహవరప్రసాదలబ్ధకవితావిచిత్ర భారద్వాజగోత్ర పవిత్రాయ్యలామాత్య పుత్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతంబైన సకలనీతిసమ్మతం బను రాజనీతిశాస్త్రంబందు రాజుల కవశ్యకర్తవ్యంబగు సంధి విగ్రహయానాసనసమాశ్రయ ద్వైధిభావంబు లను రాజషాడ్గుణ్యంబులును, మంత్రిరక్షణకార్యాకార్యవిధంబును, మిత్రామిత్రవివేకంబును, నుపాయవికల్పంబును, దండయాత్రావిధంబును, జతురంగబలప్రకారంబును, బ్రయాణప్రయత్నంబును, దత్తచ్ఛకుననిశ్చయంబును, యుద్ధదానవివరణంబును, నీతిస్కంధమూలప్రకారంబును, బ్రత్యర్థిరాజబలాబలచింతనంబును, నుభయబలవ్యూహారచనచాతుర్యంబును, గరికోట చతురంగాయోధననిశ్చయంబును, గార్యత్వరితక్రమంబును, అధికాధముల సయోధ్యావిధంబును, జోరనీతిప్రకారంబును, నవిశ్వాసపరిశీలనప్రకారంబు నన్నది తృతీయాశ్వాసము.