పీఠిక.

లోకమునందు అద్ద్వైతమతావలంబులగు సకలసజ్జనులకు వేదాంతాధ్యయనమం దాసక్తిగలిగియుండియు తత్సాధకగ్రంథములలో త్రిగుణాత్మకతత్వాదులు క్రమముగా తెనుగు టీకాసహితముగా లేనందుచే పరతత్వంబు లింగుల దుజ్గేయంబుగా నుండుట వలన మోక్షసాధకంబగు నీ విద్య దురవగాహం బని కొందరు ప్రారంభించకనే యున్నారు. కొందరు కొంతకాలము వరకు జదివియు సాధకగ్రంథములు సుశబ్దముగా నుండని హేతువచేతనే వేదాంతవిద్యయందు స్వల్పజ్నానవంతులై పరతత్వనిరూపణయందు సందేహము గలవారలై యున్నారు. మేధావంతు లగు మరికొందరు అట్లు దుజ్గేయములుగానున్న గ్రంథములనే మిగుల కష్టముతో చిరకాలము పఠించి అందు సకలతత్వంబులను వాని స్థానధర్మకర్మంబు లన్నియు నెరిగి పరతత్వస్వరూపులై యున్నారు. ఇట్లనేక హేతువులచేత నీవిద్య బహుకష్టసాధ్యముగా నున్నది. గాన, సుజనులకు శ్రవణాదులు చేసిన కొంతకాలమునకే కరతలామలకమువలె సనాయాసంబుగా పరతత్వ స్వరూపంబు దెలియగలందులకు విశిష్టశిష్ట జనానందకరముగా సద్గురు కారుణ్యమున వేదాంతశాస్త్రంబు చక్కగా పరిశోధించి అందుగల సకలతత్వంబులను క్రమసంఖ్యలుగా నేర్పరచి ఆతత్వంబుల రూప నామ గుణ స్థానాది దైవకర్మములు సంక్షేపంబైయుండునటుల వచనకావ్యంబుగా రచియించి విశేష్జ్ను లగు మహాత్ముల సహాయ్యముచేత సకలతత్వార్థదర్పణ మను నామముచే ప్రసిద్ధిపరచబడియెను.