శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల/ఎఱ్ఱాప్రెగ్గడ
౨
ఎఱ్ఱాప్రెగ్గడ
ఈతఁడు 14.వ శతాబ్దనువాఁడు. తండ్రి సూరనార్యుఁడు. తల్లి పోతమాంబ. జన్మస్థానము నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు. ఈతఁడు పోలయ వేమారెడ్డియాస్థాన కవీశ్వరుడుగా నుండెను. ఇతనికి శంభు దాసుఁడు, లేక ప్రబంధపరమేశ్వరుఁడని బిరుదు గలదు. భారతారణ్య పర్వశేషము, నృసింహపురాణము, హరివంశము, రామాయణము లీతని కృతులు. ఈ స్తుతిపద్యములు నృసింహపురాణములోనివి. బ్రహ్మాండ పురాణో క్తమయిన శ్రీ నరసింహావతారకథ యిందలి యితివృత్తము, ఈ గ్రంథము అహోబిల నరసింహస్వామికంకిత మీయఁబడినది.
కం!! అందంద చాగి మొక్కుచు
బృందారకు లధికభ_క్తి భీతవికాసా
నందంబులు డెందంబుల
సందడి గొన మస్తక ప్రశస్తాంజలులై.
కం! ఆవిశ్వరూపరూపము
భావించుచుఁ దత్పభావభంగుల మది సం
భావించుచుఁ దత్పరమతు
లై వినుతింపంగఁ దొడఁగి రప్పరమాత్మున్.
ఉ| శ్రీవసుధాకళత్ర ! యతసీసుమనోతిమనోజ్ఞగాత్ర ! మా
యావిహితత్రిలోక ! నిగమార్థవివేకవిపాక ! భవ్యసం
సేవక సౌమ్యమానసవశీకృతరూప ! భవాంధకారని
ర్థావనదీప ! దీప్త నవతామర సేక్షణ ! విశ్వరక్షణా !
చ|| భవ దురునాభిరంధ్రభవపద్మరజఃపరిమాణపాకసం
భవుఁడు విధాత తద్విమలభావకళాకణమాత్ర వైభవో
ద్భవము జగంబు తద్వివిధ భంగిక సర్గములోన నొక్క_రుం
డివి యని నిశ్చయింప గలఁడే ! భవదీయ గుణంబు లచ్యుతా :
ఉ!| ఎందును నిన్నుఁ గస్న జనులెందును గల్గరు వెండి యెద్దెసం
జెందవు నిన్ను నెద్దెసల జెందని క్రించు లభ_క్తి నొక్కటన్
బొందు గొనంగఁ జాలు కృతపుణ్యులు గల్గినఁ జాలు వారికిన్
బొందగునీలసత్కరుణ పుణ్యయశోమహానీయ మాధవా !
శాIIవిన్నంజాలు భవన్మహత్వము భగద్విజ్ఞానసర్గోష్టి కో
నున్నంజాలు భవత్పదాంబురుహ సేవోత్సాహసంపన్నులం
గన్నంజాలు భవత్పమంచిత జగత్కల్యాణనామంబుఁ బే
ర్కొన్నంజాలు నరుండు శాశ్వతశుభారూడుండు లక్ష్మీశ్వరా !
ఉ|| అక్షరయోగయుక్తులు సమంచితసత్యదయానురక్త లా
లక్షితసర్వధర్ములు విలంఘితకర్ములు బుద్ధికల్పితా
పాక్షరవాక్యరూపులు నిరాకృతకోపులు సంయమక్షమా
శిక్షితు లక్షయుల్ నిను భజించు మహాత్ములు నీరజోదరా !
చII తమతమ పూర్వవాసనలఁ దత్పరులై వివిధాగమోక్త కృ
త్యములు వహించె భవ్యపరతత్వము నయ్యయి సంజ్ఞలం బ్రయ
త్నమునఁ దలంచు సంయతమనస్కుల కెల్లను జేరుచోటు శ్రీ
రమణ భవత్పదంబు సుచిరస్థితి నేళుల కల్టిచాట్పునన్.
ఉ11 విద్యలకెల్ల నాద్యుఁడును వేద్యుఁడు న్పై తనరారు నిన్ను న
భ్యుద్యత కర్మరూపముగ నుల్లమునం దలపోసి యెంతయుం
జోద్యపు భ_క్తి యజ్ఞపురుషుండని పూనిభజింతురెందుఁ దై
విద్యులు నాకలోకపదవీపదదీ(?) ప్ర త్రిలోకనాయకా.
శాI| దృష్టాదృష్టఫలస్పృహావిముఖులై దిక్పూర్వతత్త్వక్రియా
సృష్టిం బ్రస్ఫుటతీవ్రబోధనము ను త్సేకించి యవ్యక్తసం
సృష్టికా లైూసి నిరస్తమైకృతు నుదాసీనాత్ము షడ్వింశు వి
స్పషైశ్వర్యుని నిన్ను సాంఖ్యు లెలమికా భావింతు రాత్మేశ్వరా.
చu యమనియమాభివర్ధితము లై మగడంగ మనశరీరముల్
శమితముగా మరుచ్చయము సంతతజీవపరాత్మతత్త్వరూ
పములు విభేద మై మఱపు పాటిలి కాలముఘ్రంగి యోగివ
ర్గము గను చిత్సఖానుభవగర్వము సర్వము నీవ కేశవా.
చ|| పరగు పదార్ధపంచకము పాశములై తనుఁ జట్టఁ దూలుచున్
దిరిగెడు జీవుఁడుకా బళువు దేశికపుణ్యకటాక్షవీథిఁ ద
త్పరమతిఁ జేరఁగా నపరబాధము_క్తి శుభంబు నిచ్చు నీ
శ్వరుఁడుగ నిన్నెఱుంగుదురు శైవులు శాశ్వతచిన్మయాత్మకా.
ఉII దాస్య మొకండునుం బరమధర్మముగాఁ గొని యన్యధర్మ మా
శాస్యముగా గణింపక యసంశయనిశ్చశభ_క్తిసంతతో
పాస్యు నశేషభవ్యపురుషార్థభవైకవిధాయి నిన్న నా
లస్యతఁ బాంచరాత్రులు దలంచి భజింతురు భక్తవత్సలా.