శ్రీ రామాయణము - నాలుగవసంపుటము/పీఠిక


పీఠిక




          మదరాసు రాష్ట్రీయ ప్రభుత్వమువారి సమాదరణమున తంజపూరి సరస్వతీ మహలు గ్రంథాలయమువారి పక్షమున ప్రకటిత మగుచున్న కట్టా వరద రాజు ద్విపద రామాయణము నందలి నాలుగవ సంపుటమగు యుద్ధకాండము నేటితో ముగిసినది. దీనితో నా గ్రంథముద్రణము సంపూర్తియైనది. ప్రభుత్వమువారు ప్రకటించిన ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారము తెలుఁగు గ్రంథములలో గాని, తంజావూరి సరస్వతీ మహలు తెలుఁగు గ్రంథములలో గాని దీనిని మించిన గ్రంథము లేదు. ఇది నాలుగు సంపుటములలో వెలువడినది.
వాని వివరము. పుటలు మొదటి సంపుటము - బాల అయోధ్యా కాండములు 687
రెండవ సంపుటము - అరణ్య కిష్కింధా కాండములు 535
మూడవ సంపుటము - సుందర కాండము 216
నాలుగవ సంపుటము - యుద్ధ కాండము 544
                                                                ________
                                                                 1982
 పీఠికాదులు 128
                                                                 ________
                                                                 2110

        సంస్కృత వాల్మీకి రామాయణమున నాఱుకాండలును, నేనూరు సర్గలును నిరువది నాల్గువేల శ్లోకములు నున్నట్లు వరదరాజే బాల కాండ 32 పుటలో నిట్లు చెప్పియున్నాడు.

        "కతలమీరుచు నాఱుకాండముల్ గాగ
         జతఁగూర్చి యేనూరు సర్గముల్ గలుగ

............ పదినాల్గు వేలు
సదమల గ్రంథవిస్తరమై యెసంగ
నొనరించి పైకథ లుత్తరకాండ
మునఁజెప్పె వాల్శీకిమునినాథుఁ డపుడు"
                                     770-776 పంక్తులు

       ఇందుత్తర కాండమునకు తెనుగు లేదు- తెనుఁగు భాషలో రామాయణ కథా రచన ప్రారంభమైన కాలమునుండి, ఉత్తర కాండము వేఱుగా రచిత మగుచుండెను. ఇరువది నాలుగు వేల శ్లోకములుగల మూలకథ, చతుర్వింశతి గాయత్రీ మహామంత్రవర్ణసంపుటీకరణ మగుటయే యుత్తరకాండ వేఱుపడుటకు కారణమని యూహింపవచ్చును. తక్కిన యుత్తర రామాయణ పద్యకృతియు, కాచవిభుడు, విఠలరాజుల ద్విపద యుత్తర కాండమును, పై యభిప్రాయమును బలపఱచుచున్నవి. కడచిన శతాబ్దిలో యథావాల్మీకములగు రామాయణ రచనలు ప్రారంభమైన నాఁటనుండియు నీ పథకము మాఱినది. శ్రీ గోపినాథము వెంకటకవిగారు షట్కాండలు మాత్రమే తెనిగించిరి. ఆవెనుక శ్రీ వావిలికొలను సుబ్బరావు పంతులుగారును, జనమంచి శేషాద్రిశర్మగారును నుత్తరకాండము గూడ నాంధ్రీకరించిరి. శ్రీపాదవారి శ్రీకృష్ణ రామాయణమున గూడ నుత్తరకాండము గలదు.

        కేవలము గ్రంథసంఖ్య చేతనేకాక, సాహిత్యదృష్టితో పరిశీలించినచో ప్రభుత్వ ప్రకటితములైన గ్రంథములలో

నీ రామాయణము మిక్కిలి విశిష్టతగలది. ఇది దేశి సాహిత్యమున ప్రధానముగా విలసిల్లిన ద్విపద కవితా శాఖకుఁ జెందినది. దాక్షిణాత్య సాహిత్యములో తెనుగునకు గల ప్రత్యేకతను నిరూపించు రచనలలో ద్విపద యొకటి. పేరు సంస్కృతమైనను, సంస్కృతమున నీ రచన లేదు. ద్రవిడ కర్ణాట భాషలలో లేదు. కన్నడులకు త్రిపద, షట్పద, ప్రియమైన పదచ్ఛందస్సులు. తెనుఁగున నైహికాముష్మిక ద్విపద హేతువుగ నీద్విపదను దిద్ది తీర్చిన మహాకవి పాల్కురికి సోమనాథుఁడు. గేయరూప మగు జానపద వాఙ్మయమునుండి, యీ ఛందస్సు నుద్ధరించి, దీనికి మహాకావ్య ప్రతిపత్తి గడించి ద్విపద వాఙ్మయమునకు శ్రీ కారము చుట్టిన వాఁడు సోమనాథుఁడే ! ఆతఁడు రచించిన బసవపురాణ పండితారాధ్య చరిత్రములు ద్విపద వాఙ్మయములో ప్రాథమికములు. ఆ వెనుక రంగనాథ రామాయణము, ఉత్తర కాండమును వెలసినవి. మడికి సింగన భాగవత దశమస్కంధ ద్విపద, గౌరన ద్విపద రచనలు, పిడుపర్తి బసవన ద్విపద రచనలు శ్రీనాథ యుగమునాటివి. ఇందు చాలభాగము వీర శైవమునకుఁ జెందినవి. శ్రీ కృష్ణ దేవరాయ యుగముతో వైష్ణవ మతముతో ద్విపద వాఙ్మయమున ద్వితీయ ఘట్టము ప్రారంభమైనది. తాళ్లపాక చిన్నన్న,దోనూరి కోనేరు కవుల ద్విపద రచనలు ప్రకాశించిన కాలమిదియే. ఈ యుగమునకు వెనుక వెలసిన వైష్ణవ ప్రపత్తిగల ద్విపద కావ్యములలోను రామాయణ ద్విపదలలోను నొక ప్రత్యేక విశిష్టత గడించిన దీ వరదరాజు రామాయణము.

వరదరాజు రామాయణమున ద్విపదసంఖ్య లెక్కించిన వాఙ్మయమునందలి ద్విపద కావ్యములలో నిది యగ్రస్థానము వహించును. ద్విపదసంఖ్యా వివరణము.

 1. బాలకాండము 5 8 4 6
 2. అయోధ్యా కాండము 1 0 7 8 8
 3. ఆరణ్యకాండము 6 5 1 8
 4.కిష్కింధాకాండము 6 2 4 8
 5. సుందర కాండము 5 3 8 0
 6. యుద్ధ కాండము 1 2 4 1 0
                              ౼౼౼౼౼౼౼౼
                              4 7 1 4 0
                              ౼౼౼౼౼౼౼౼

ద్విపద పంక్తులు అనగా 23170 ద్విపదలు. దీనినిబట్టి చూడగా వరదరాజకవి మూలమున నున్న 24 వేల శ్లోకములకు నించుమించు సరిగా ద్విపదలను రచించెనని చెప్ప నొప్పును.

            రంగనాథ రామాయణము,
            వరదరాజు రామాయణము,

వరదరాజు రామాయణ ముద్రణ ప్రారంభము నుండియు నా పీఠికలలో నాంధ్ర విశ్వకళా పరిషత్తువారు ప్రకటించిన రంగనాథ రామాయణమునందలి యనుబంధములలోని ద్విపదలకు వరదరాజు రామాయణమునగల సంవాదములను చూపుచునే యున్నాను, ఈ యుద్దకాండమున కూడ నట్టివి గలవు. వరదరాజు రామాయణము యుద్ధ కాండము 90 పుట.

       "నవరత్న కటక మండన మండితంబు
        వివిధోర్మికామణి విసృమరాభంబు

నుర్వీతనూజా మృదూపధానంబు
గర్వితాహిత భిదాకాల దండంబు
ఘోరప్రతాప కుంకుమ చర్చితంబు
సారంగమద లేప సంవాసితంబు
నిరత మహాదాన నిపుణ తారకము
ధరణీభరధురీణతా సమంచితము
                                                     (2035-2043 పంక్తులు)
రంగనాథ రామాయణము (అనుబంధము)
                                                   1. యుద్ధకాండము 677 పుట

"నవరత్నకటక మండన మండితంబు
వివిధోర్మికామణి విపుల రావంబు
నుర్వీతనూజా మృదూపధానంబు
గర్వివాహితభిదా కాలదండంబు
ఘోరప్రతాప కుంకుమ చర్చితంబు
సారంగ మద లేప సంవాసితంబు
నిరతమహాదాన నిపుణ తానకము
ధరణీభరణ ధుర్యతాసమంబగుచు

వరదరాజు,

తప్పించుకొనిపాఱె తమ విభీషణుఁడు
చుప్పనాతిని ముక్కు సురియచేఁ గోసి
నా పాపమునఁ బాఱెనపుడు నీమఱది
వాపోవుచును జాంబవంతుండు పఱచె

జివ్వఁజాలించి వచ్చిన త్రోవప్రజలు
నవ్వఁగఁ బరువెత్తి నలినాప్తసుతుఁడు
ఊరక యంగదుం డూడని బాఱె
దారిఁదప్పినఁ బోయెఁ దారుఁడు దీసి
పోక నిల్చి సమీరపుత్రుండు వడియె
మోకాళ్లువిఱిగి రాముని బాయలేక
కుముదుఁడు తలతెగఁగొట్టినఁ బడియె
సమసె మైందుఁడు నీఁగి చనియె నలుండు
నీలుఁడు శరభుఁడు నిలిచిపోరాడి
వ్రాలిరి మేనులు వ్రయ్యలై భువిని
పనసుఁ డెఱింగి దబ్బఱవచ్చె ననుచుఁ
బనసచెట్టును బోలి బ్రమసితానిలిచెె
నాలంబులోన గవాక్షుండుఁ గూలె
చేలకయ్యము చేసి శతవలి మడిసె
నెత్తురుఁ గ్రక్కుచు నెగ్గె సుషేణుఁ
డుత్తరంబున ధూమ్రుడుదధి లోఁబడియె
చేయెత్తిమ్రొక్కఁ గూల్చిరి దధిముఖుని
మాయచేఁ గేసరిమై డాసిపోయె
సేతువు చూడవచ్చిన కపులెల్ల
భీతిచే నిల్లాండ్ర బిడ్డలఁ దలఁచి
ముగిసె కార్యంబని మొదలి టెంకులకుఁ
దగఁ దొట్టి పాఱిన దైత్యులు తఱుమ 2952-2977


రంగనాథ రామాయణము (అనుబంధము 1, పుట 678)

ద్వి. ... ... వగచుచునుండఁ
     దప్పించుకొని పాఱెఁ దా విభీషణుఁడు
     చుప్పనాతికి ముక్కుసురియ చేఁ గోయు
     నాపాపమునఁ బాఱెనపుడు నీమఱఁది

వాపోవుచును జాంబవంతుండు పఱచె
నూరక యంగదుం డూడంగఁ బాఱె
దారి తప్పునఁ బోయెఁ దారండు భీతి
నీలుఁడు శరభుండు నిలిచిపోరాడి
వ్రాలిరి మేనులు వ్రయ్యలై జగతిఁ
బోకనిల్చి సమీరపుత్రుండు వడియె
మోకాళ్ళు విఱిగి రామునిఁ బాయ లేక
నెత్తురుఁ గ్రక్కుచు నేఁగె సుషేణుఁ
డుత్తరంబున ధూమ్రుఁ డుదధిలోఁ బడియె
చేయెత్తి మ్రొక్కఁ గూల్చిరి దధిముఖుని
మాయచేఁ గేసరిమై డాచిపోయె
కుముదుండు తలఁ దెగఁగొట్టినఁ బడియె
సమసె మైందుఁడు వీగి చనియె నలుండు
పనసుఁ డెఱింగి దబ్బఱవచ్చె ననుచుఁ
బనస చెట్టునుఁ బోలె బ్రమసి తానిలిచె
నాలంబులోపల నఖిలవీరులునుఁ
గూలుటయునుఁ జూచి కూడిన భీతిఁ
జివ్యఁ జాలించి వచ్చిన కపులెల్ల
నవ్వంగఁ బఱువెత్తె నలినాప్తసుతుఁడు
సేతువుఁ జూడవచ్చిన కవులెల్ల
భీతిచే నిల్లాండ్రఁ బిడ్డలఁ దలఁచి
ముగిసెఁ గార్యంబని మొదలి టెంకులకుఁ
దగఁగొట్టఁ బాఱిరి దైత్యులు దఱుమ

వరదరాజు.

హీరకిరీటంబు హేమాంబరంబు
గారుత్మతోత్పల గ్రైవేయకంబు
రత్నకుండలములు రాజీవరాగ
నూత్న మంజీర మనోహరాంఘ్రులును
మౌక్తిక తూలికల్ మాణిక్యకవచ
సక్తమైమించు విశాల వక్షంబు
మరకత కేయూర మంజు బాహువులు
నరుణపక్షంబు చంద్రాననాబ్దంబుఁ
గురుణావలోకముల్ కంబు కంధరము
నరుణపల్లవ కోమలాగ్రహస్తములు
దుందుభిస్వనము లత్తుక చాయమేను
మందరమేరు సమాన గాత్రంబు
లలితోర్థ్వపుండ్రలలాట పట్టికయు
సెలవులఁ దేఱెడు చిఱునవ్వుఁ గలిగి
భానుకోటిప్రభా భవ్యతేజమున
నానంద కరమూర్తి నవతరించితివి 4504-4520

రంగనాథ రామాయణము - (అనుబంధము 1 పుట 679.)

ద్వి.
భానుకోటిప్రభాభవ్య తేజమున
నానందకరమూర్తి యమరులు పొగడ
హీర కిరీటంబు హేమాంబరంబు
గారుత్మతోజ్జ్వల గ్రైవేయకంబు

రత్న కుండలములు రాజీవరాగ
నూత్న మంజీరమనోహరాంఘ్రులును
మౌక్తిక మాలికల్ మాణిక్యకవచ
సక్తమై మించు విశాలవక్షంబు
మరకతకేయూర మంజుబాహువులు
నరుణపక్షములు చందాననాబ్దంబు
కురణావలోకముల్ కంబుకంథరము
నరుణపల్లవ కోమలాగ్రహస్తములు
దుందుభిస్వనము లత్తుకచాయమేను
మందరమేరు సమానగోత్రంబు
లలితోర్ధ్వపుండ్ర లలాటపట్టికయు
సెలవులఁ దేఱెడు చిఱునవ్వులొలుక

ఇంకను మఱికొన్ని గలవు - విస్తరభీతి నుదహరింపనైతిని.

పై యుదాహృతులను పరిశీలించిన రంగనాథ రామాయణ ప్రతులలో వరదరాజు రామాయణమునందలి పంక్తులు యథామాతృకముగాఁ జేర్చబడినవని స్పష్టమగుచున్నది. కాబట్టి రంగనాథ రామాయణ పరిష్కర్తలనుబంధములలో చేర్చినవి కొన్ని నరద రాజు రామాయణమునందలి పంక్తులవలె, తాళ్ళ పాక అన్నమయ్యగారి రామాయణమునందలి పంక్తులుకూడ చేరి నవను నా నిశ్చితాభిప్రాయము నీవఱకే తెలిపియున్నాను. (చూడుడు సుందరకాండ పీఠిక పుట 17) ద్విపద రామాయణములు వరదరాజకృతికిముందు వెలసినవి రంగనాథ, అన్నమయ్యల రామాయణములే యైయున్నవి. వానిలో రెండు గ్రంథములనగా రంగనాథ వరదరాజ కృతులు పూర్తిగ మనకు లభ్య


మైనవి కావున మూఁడవగ్రంథమగు నన్నమయ్య కృతి తాళపత్ర గ్రంథముల నా మూలాగ్రముగ పరిశోధించిన మనకు లభింప గలదని చెప్పనొప్పును. వాఙ్మయ పరిశోధకు లట్టిపనికిఁ గడంగినచో నేటి రంగనాథ రామాయణమును గూర్చిన పెక్కు సమస్యలు, చిక్కులు విడిపోవుననియు గ్రంథము నిజస్వరూపము, విశిష్టత తేటపడఁగలదని నాయొక్క దృఢమగు నమ్మకము.

| ఈ యుద్ధకాండమండలి గచన కూడ తక్కిన కాండముల యందువలె జాతివార్తా చమత్కార విలసితమై, సంస్కృతాంధ్రపద సమబంధురమై వెలయుచున్నది. రచనారీతి యాది నుండి యంతమువఱకు నిమ్నో న్నతములుగా లేక నొకేరీతిని కమ్మచ్చులోని తీగ విధమున సాగినది. రంగనాథ రామాయణమున కథా కథనమే ప్రధానముగనున్నది. కాని వరదరాజు రామాయణమున కథా కథనమేకాక కమనీయ కవితారచన కూడ కలదు. రచనయందు రెండింటికిగల తారతమ్యమును గ్రహించుటకు సమానమగునొక ఘట్టము నుదాహరించు చున్నాను.

ఇంద్రజిత్తు ద్వితీయ యుద్దము

ద్వి.
ఆసమయంబున నాదానవుండు
భాసురంబుగఁ దనప్రభఁ గాననీక
యాదివినుండి దివ్యాస్త్రంబు లేయ
నాదానవుని దెస కగచరలెగసి
యగములు నైవంగ నవిద్రుంచి గుండె
లగలించి పెక్కండ్ర నవనిపైగూల్చి

వేగంబు యొక్కొక్క విషమబాణమున
నేగురఁ దొమ్మండ్ర నేడ్గుర నేసె
మఱియునుఁ గడిమిమై మర్కటేశ్వరులు
నెరయంగ గిరిధరణీజంబులెత్తి
యా యింద్రజిత్తుపై నడరింప నతఁడు
సాయకంబుల వాని చతురుఁడై ద్రుంచి
పదునెనిమిది తీవ్ర బాణంబు లేసె
మదమెల్లఁజెడ గంధమాదనుఁ గడిమి
దీపింప నలుఁ దొమ్మిదిట రూపుమాపె
నేపారమైందుని నేడింట నొంచె
గదిసి పంచకమున గదుఁ బొలియించె
పదియింట భల్లూకపతి మేనుపించె
నూటను హనుమంతునొప్పించి మించె
మూట గవాక్షుని మొగిగాడ నేసె
శరభుని నేడింట శతబలిఁ బదిట
సరినెన్మిదిట హరు, సన్నాహుమూట
నరుదుగా తక్కిన యఖిల యూధపుల
వరదివ్య శస్త్రాస్త్ర వర్షంబుగురిసి"

ఈ సందర్భమున వరదరాజెంత మనోహరముగా రచియించి యున్నాడో చూడుడు.

'అసురేంద్రసుతుఁడు బ్రహ్మాస్త్రప్రభావ
లసమాన తేజోవిలాసియై లాసి
నెఱయించు నొకచోట నీలమేఘములు
గురియించు నొకచోట ఘోరాస్త్రవృష్టి

మలయించ నొకచోట మంచు పెందెరలు
పొలయించు నొకచోట భుగభుగ బొగలు
వినుపించు నొకచోట విలు నారి మ్రోత
కనిపించు నొక చోట కాంచన రథము
చెలఁగించు నొకచోట సింహనాదములు
నెలకొల్పు నొకచోట నేమికాధ్వనులు
నడరించు నొకచోట హయ హేషితములు
జడియించు నొకచోట శక్తులువైచి
విసివించు నొకచోట విలుకేలఁబూని
నసముంచు నొకచోట నాకృతిఁ జూపి
యీవేల నెలయించె నింద్రజిత్తుండు ” (8009-8024)

ఇచట యింద్రజిత్తుయొక్క యస్త్రవిద్యా నైపుణ్యము చక్కగా ప్రదర్శితమైనది.

నేడు వరదరాజ రామాయణము పూర్తిగా లభ్యమగు చున్నది గాన, సాహిత్య విమర్శకాగ్రేసరులగు విద్వాంసులు, రంగనాథ రామాయణము తోడను, మూలము తోడను, దీనిని పఠించి విమర్శనములు వెలయింతురుగాత !

తక్కినకాండ లందువలెనే నిందును వరదరాజు రచనము మూలానుసరణముగనే యున్నది.
నేఁడు భాస్కర రామాయణము, రంగనాథ రామాయణములలో గానవచ్చు. కైకసి వృత్తాంతము, సులోచనా వృత్తాంతము, రామేశ్వరమున రామలింగప్రతిష్ట మున్నగునవి రామాయణమునఁ గానరావు. వైష్ణవమతము ' వ్యాపించిన వెనుక రచితమగుట చేతనో,

వరదరాజు వైష్ణవప్రపత్తి గలవాడగుట చేతనో శ్రీరాముఁడు రామలింగ ప్రతిష్ట చేయుటకు మారుగా విభీషణునికి శ్రీరంగశాయి నొసంగెనని యిట్లు చెప్పియున్నాడు.

"చాల చింతిలి విభీ - షణుఁడు పాదముల
వ్రాలి యో దేవ! నీ - వాఁడనై యిచట
నుందు నింతియెకాని , యొండెడకేఁగ
నెందుకు లంక నా కేల ? పోననిన
నెందుచే నీతనిఁ - దృప్తునిఁ జేతు
నెందుల ననుబాయఁ - డితడని యెంచి
తనమారు తనకుల - ధనము పూర్వమున
మనపుత్రుఁ డిక్ష్వాకు - మనుజేశ్వరుండు
నిలిపిన మాపాలి - నిక్షేపమీవు
కొలువుము లంకకు - గొని పొమ్మటంచు
సజ్ఞతో శ్రీరంగ - శాయినొనంగ
నజ్జ చేసుక య - మ్మహాను భావుండు
గైకొని లంకకుఁ - గదలి పోవుటయు 12302-12314

రంగనాథ రామాయణమున రామలింగేశ్వర ప్రతిష్టను గూర్చి చెప్పఁబడినదిగాని వైష్ణవమత ప్రతిపాదకమగు పైయంశము చెప్పఁబడ లేదు. కావున రంగనాథ రామాయణము కేవల వైష్ణవ భక్తిని ప్రకటించుటకు రచిత మైనదని ఘంటాపథముగఁ జెప్పలేము, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వాru ప్రకటించిన రంగనాథ రామాయణమునందలి యనుబంధము రెండింటిలో రెండవదానియం దీ క్రింది పంక్తులు గలవు.

ద్వి. అంత విభీషణుఁ డారాముఁజూచి
     యెంతఁగు భక్తితో నిలఁ జూడీ మొక్కి

దేవ ! యిచ్చట నే మీదివ్యశ్రీపాద సేవఁ జేయుచునుందుఁ జనఁగ నేనొల్ల మనుజేశ నామది మట్టినిల్వదచట యనవుడు రఘు రాముఁ డతని కిట్లనియె * ఆరయ మాస్వామి యగుచున్న యట్టి శ్రీరంగధాము నిచ్చెద నీవుగొమ్ము పోయి నీవందు నెప్పుడు పూజ సేయు మాయందు భక్తియు మజువకు మెపుడు ననుచు శ్రీరంగనాయకు నిచ్చె వేడ్క ననలొ త్త శ్రీరంగనాయకుఁ గొనుచు: జనియే లంకకు........ 842 పుట పై దానిని పరిశీలింపగా శైవులు శివప్రతిష్ట * రాముఁడు చే సెనని చెప్పగా వైష్ణవులు శ్రీరంగనాథుని ప్రతిష్టిం చేనని మూలరామాయణమున నీఘట్టమును ప్రకి ప్తము చేసిరా యను సం దేహము కలుగు చున్నది. ఇందు చేత నే శ్రీరంగ మహాత్మ్య మున రామాయణ కథ ప్రసక్తమగుచున్నది. సంస్కృత రామా యణమునకు గోవిందరాజుల వారు వ్రాసిన విశిష్టాద్వైత పర మగు వ్యాఖ్యగూడ వీని రచనకు దోహదమునొసంగి గుండ వచ్చును.

  • శివలింగ ప్రతిష్ఠ చేయుటవలస శ్రీరాములవారికి రావణుని చంపినందువలస గలి)న బ్రహ్మహత్యా దోషము నివారణ మైనదని శైవగ్రంథములు వాకొను చున్నవి. • ఆత్రపూర్వం మహాదేవ ప్రతిష్ఠామక రోద్విభుః అను వాల్మీకి రచ నమే దీనికి మూలము. వరదరాజు రామాయణమున కొన్ని పట్టుల వాల్మీకము నందు లేని కథలుకూడ నున్నవి. అందొకటి. ఇంద్రజిత్తు నాగ పాశముల చే బంధించిన పుడు సోరదుఁ డే తెంచి రాముని స్తుతి యించి నీ వాహనమైన గరుడుని స్మరించినయెడల నాతఁడిచటికి చను దెంచిన మాత్రన సోగా ప్రబంధము తొలఁగునని యుప దే శించి: ట్రీ రామాయణమున నున్నది. ఇది వాల్మీకమున లేదు. కాని రంగ నాథ భాస్కర రామాయణములం దున్నది. మూల మున లేకున్నను వైష్ణవ ప్రప త్తివలన నరదరాజు దీనిని చేర్చి యుండవచ్చును,

| వాల్మీకమున ప్రక్షిప్తములైన యీ క్రింది కథాంశములు భాస్కర రంగనాథ రామాయణములలో గానవచ్చు చున్నవి.

లక్మణుఁడు రావణుని శ క్తిచే నిహతుఁడై మూర్చనొంది యుండ సు మేణు నాజ్ఞచే సంజీవిపర్వత ముఁ దెచ్చుటకుఁబోయిన హనుమంతుఁడు మార్గమధ్యమునందు మాయామునియైన కాల నేమి యాశ్రమమును బోడఁగాంచుట, ఆ యాశ్రమము నందున్న సరస్సులో శాపముచే మొసలియై పడియున్న ధాన్యమాలిని జంపీ శాపమోక్షమొనర్చట మొదలగు కథాంశములును మున్నగు విషయములు,

శుక్రాచార్యోపదేశము చే రావణుఁడు పాతాళహోమ మొనర్చుట-ఇవి వరదరాజు రామాయణమున లేవు.

రావణవధ సమయమున రామునికి విభీషణుడు చేసిన యువ దేశము వాల్మీకమునందు లేదు. ఈ యంశ మథ్యాత్మ రామా యణమునుండి గ్రహింపబడినది. భాస్కర రంగ నాథ రామా యణములందిది గలదు. పై కథా సందర్భములనుపట్టి చూడగా, యథా వాల్మీకమని వరదరాజు వ్రాసినను, తనకు ముందుగానే వెలసిన రామా యణములయందు పై కథలుండుట చేతను నవి ప్రజల యాదరణకుఁ బాత్రనులగుట చేతను, నాతఁడు, నేడ వాల్మీకములని యనుకొనుచున్న వానిని గూడ తన గ్రంథ మునఁ జేర్చెనని యూహింపదగియున్నది. అవి కావ్యమునకు శోభ గూర్చినవేగాని, వేఱువిధముగా లేవని పాఠకలోక మున కీవఱకు పరిచితమే.

వరదరాజుయొక్క యాంధ్రీ కరణ రీతీని జూపుట కీదిగువ కొన్ని శ్లోకములను వాని ద్విపదలను నొసంగుచున్నాను.

ధ్వతిప్రవాళ ప్రసహాగ్ర్యపుష్పస్త పోబల శ్శౌర్యనిబద్దమూలః
రణే మహాన్ రాక్షసరాజవృక్ష స్సమ్మర్దితో రాఘవమారుతేన
తేజోవిషాణః కులవంశవంశః కోపప్రసాదాపర గాత్రహస్త
ఇక్ష్వాకుసింహావగృహీత దేహస్సుప్తః క్షితో రావణగంధహస్తే
పరాక్రమోత్సాహ విజృంభితార్చిర్నిశ్వాస ధూమస్వబల ప్రతాపః
ప్రతాపవాన్సంయతి రాక్షసాగ్నిర్నిర్వాపితో రామపయోధ రేణ


"ధైర్యమ్మునిగుడ మొత్తము నసమాన
శౌర్యంబు పేరును శారీరబలము
ప్రసవసంపదయుఁ దపశ్శక్తిపేర
నెసగుచేవయుగల్గి నీవనునట్టి
సంపూర్ణ ఫలమహీజము రాముపేరి
ఝంపాసమీరమిచ్చటఁ గూలఁద్రోచె.
క్రోధగాత్రము కాంతగుణతుండ మహిత

యోధ నిర్మధన శౌర్యోరుదంతములు
తపమును దమము మాత్సరశత్రు నిగళ
కపటాసురులు కొలిగడలు వారలుగ
తనరునీపేరి గంధగజంబుగూలె
జనకజరమణ కేసరి నెదిరించి,
క్రోధనిశ్వాస సంకులధూమ నిర్ని
రోధకమతి శౌర్యరూపహేమములు
బలమును వేఁడిమిఁ బరఁగనీపేర
విలసిల్లు దుస్సహ వీతిహోత్రుండు
చల్లనారెను రామ జలధరనిశిత
భల్లదృష్టిని దైవబలము లేకునికి"
 

యుద్ధకాండ (10891-10410)

ఛందోవ్యాకరణాంశములు

ఈ ద్విపద కావ్యము చిన్నన్న చెప్పిన ద్విపదలక్షణము ననుసరించి రచితమైనది. ఇందు ప్రాసయతులుగాని, పాదాం తమునందును పద మధ్యమందును విఱుఫులుగాని లేవు. ఏపాద కాపాదము విడివడియేయుండును.

ఇందు మూడు చోట్ల దీర్ఘ పూర్ణ బిందు ప్రాసము- అనగా దీర్ఘముమీద నియతముగాఁ గాఁదగిన యర్థబిందువునకు పూర్ణ బిందువు వచ్చుట. దానితో సిద్ధబిందు శబ్దముల ప్రాస నుపయోగించుపద్ధతి గలదు.

పుట పంక్తి
42 941 కోంతీ కూ టు వ మూకఁ గొలుపంగవట్టి, కాంతరమున జనకసుతావరుండు
320 7249 తాండికాండముల నాధర్వణోక్తముగా, నేండు నూర్లాహుతులిచ్చి తావేల్చి
378 8607 తోంచెను వానికి దుర్నిమిత్తములు, కొంచెఁ బాఱెెడు నిక కొఱగాఁడు వాఁడు

ఈ ప్రాసము శివకవులయందే యుండుననుట సరికాదు. అహోబలపతి తన కాళిందీకన్యా పరిణయమున కూడ నిట్టి ప్రాసల నుపయోగించినాడు. “కాంతకు మదిఁ బుట్టిన తల పోంతలతో"

ఇంకను యన్వరాజ్యము. జవ్వనులు నిట్టి ప్రాసయుగలదు. మిగిలిన విశేషణముల నిందుతో బొందుపఱచుచున్నాను.

పుట పంక్తి
16 346 బళనంబుల
47 ఉక్కళంబుల
19 404 రుజముఁ గోల్వోక
మాలూరఫలములు - కుచముల పోలిక
23 510 యక్షులఁ దొంపరలాడి
25 522 తెత్తు మాట మాత్రముగాదు మాటమాత్ర

మున చూ. నీవాడుట శూలికిన్ మనము వాడుటగాదెతలంపనంబికా అంబికాశతకము

32 713 సైన్యములు - ముత్తికవేయక


42 941 కోంతి కూటువమూకఁ గో లు పం గ వట్టి
కాంతారమున జనక సుతావరుండు (పూర్ణ బిందుప్రాసము)
47 106 కోరికల్ - దఱంగ కుక్కుటవృత్తి
చేరమించిన నీకుఁ జెల్లకున్నదియే
చూ నిర్వచన-తామ్రచూడా సంగతీ నెంగిలి గావించె
53 1216 వట్టిగీరుబున రావణుఁ జూచి
57 1313 హస్తిగీతలివిసుమా
66 1504 చంకదుడ్డు - శరణార్థి
75 1718 గలభిరానేల
82 1871 పాపంబు...తావు - వ - ప - ప్రాస
85 1921 కయ్యంబునకు మీఱి కాలుద్రవ్వేరు-ద్రవ్వినారు వ్యవహారికము
91 2049 తానిలఁడయ్యె - తానిలువఁడయ్యె
100 2250 దక్షిణ సితమ వసించె
102 2304 వాపోవుచున్నవి వరుదుగ - వ్యర్థముగ చూ. కాశీ. వరుజయ్యెం
132 2932 రాముని నిర్భాగ్యురాలవై నీవు - రాగమ సంధివడి
144 3180 అతనివల్ల ప్రోవాశించువారు - ప్రోగు అన్నము
చూ. ప్రోగుఁబడి పెద్దఱికంబు ఉ. హరి
156 3458 మూయ్యీడు వేల్పుల ముద్దుల గుమ్మలు
158 3506 పిడమిపై మఱలఁబడి - పిడమి - పృధివీ శబ్ద తద్భవము
179 3981 చేఁజేత ననుభవించితిరి (చూ, తిక్కన) చేసేతన్ పృధివీశులందుకొన చేసెన్

(ఇదిప్రాసలోనున్నవి)

207 4632 మిన్నున వారిపై మిణుం గురు ల్ రా లె మింటను అని యుండవలెను. చూ

విన్ను న నేఁగు తారల. (యయాతి)

212 4748 సగమదంబుగను ముష్టాముష్టి పె నఁ గి ముష్టాముష్టి యతి నిర్థారకము
220 4942 కోతులపైకంబునవ్వ - పై కంబు - సమూహాము
251 5640 తోడితెండన - చేడోయి - దోయి రూపొంతరము
646 కంజాయ కెంజాయ - కన్ను శబ్దమునకు సమాసమున బిందువు
254 720 కన్నళవు
259 840 ఆయతించు
266 5949 పుడమి కానుపు వల్లభుఁడు
275 6275 పారవేయుదమొక్కపరిగనందఱము-(ఒక్కసారిగా నందఱము)
281 6344 అస్రముల్ గ్రక్కె - నెత్తురులు
325 వలుదవెనున - మేనను-అని యుండఁదగును
299 518 పచ్చినెత్తురుఁ ద్రావి, బౌళిపట్టుటయు
________________

846 367 378 B90 10222 290 743 తనకీడు లేదని దలచి కావించు తనకీడు సేత లఁ దరియింపవల 8207249 తాండికాష్టముల నాథర్వణోక్తముగ నేండునూర్లాహుతు నిచ్చి తావేల్చి 7847 గరివించినారు రాఘవులు , 8846 దురములో రావణు చిత్త మెఱంగ నే 8807 తోంచెను వానికి గుర్ని మీ త్తములు కొంచఁ బాతెడునిక గోజుగాఁడువాఁడు 8890 యవ్వరాజ్యము మమ్ము నఖల బాంధవుల జవ్వనులను బాసి చననీకుఁ దగునె 401 9150 వారితో రఘుపతి వచ్చినయట్టి 447 వారతల్ వినిఅల్లెతో సంధించునాగ్రహంబునకు హల్లోహలంబు లై 461 515 తము ? ననాథల జేయఁ - దలఁచి రాఘవుని వనిత ననాథగా వగచి తెచ్చితివి. ఇది తను ననాథను జేయఁదలచి యన్న సరిపోవును. 11222 నిచ్చకల్యాణముల్ - నిజగృహంబులను పచ్చ తోరణములు పరగ నుండుడురు వనచర ప్రభులకు వహు లేరుపఱచి నగరి సంప్రతి కరణంబులచేత మూటికి వగలు నర్థవణ చదువంగ 510 11631 జరుపుచున్న దె కవుసల్య యానగరి 510 868 ఘన మైనయుంబళికను సగఁ బాలు 1206 వింజమాకిడిన 492 503 11471 623 పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/37 పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/38 పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/39 పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/40