శ్రీ నామ రామాయణం

శ్రీ నామ రామాయణంగా ప్రసిద్ధమైన ఈ సంకీర్తనలో కేవలం 108 నామాల్లోనే మొత్తం రామాయణమంతా ఇమిడి ఉంది.

బాల కాండము:

  1. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్
  2. కాలాత్మక పరమేశ్వర రామ్
  3. శేషతల్ప సుఖ నిద్రిత రామ్
  4. బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్
  5. చండకిరణకుల మండన రామ్
  6. శ్రీ మద్దశరథ నందన రామ్
  7. కౌసల్యా సుఖవర్ధన రామ్
  8. విశ్వామిత్ర ప్రియ ధన రామ్
  9. ఘోర తాటకా ఘాతక రామ్
  10. మారీచాది నిపాతక రామ్
  11. కౌశిక మఖ సంరక్షక రామ్
  12. శ్రీమదహల్యోద్ధారక రామ్
  13. గౌతమముని సంపూజిత రామ్
  14. సుర మునివర గణ సంస్తుత రామ్
  15. నావిక ధావిత మృదు పద రామ్
  16. మిథిలా పురజన మోహక రామ్
  17. విదేహ మానస రంజక రామ్
  18. త్ర్యమ్బక కార్ముక భంజక రామ్
  19. సీతార్పిత వర మాలిక రామ్
  20. కృత వైవాహిక కౌతుక రామ్
  21. భార్గవ దర్ప వినాశక రామ్
  22. శ్రీమదయోధ్యా పాలక రామ్

రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతారామ్

అయోధ్య కాండము:

  1. అగణిత గుణగణ భాషిత రామ్
  2. అవనీ తనయా కామిత రామ్
  3. రాకా చంద్ర సమానన రామ్
  4. పితృ వాక్యాశ్రిత కానన రామ్
  5. ప్రియ గుహ వినివేదిత పద రామ్
  6. తత్ క్షాలిత నిజ మృదుపద రామ్
  7. భరద్వాజ ముఖానందక రామ్
  8. చిత్ర కూటాద్రి నికేతన రామ్
  9. దశరథ సంతత చింతిత రామ్
  10. కైకేయీ తనయార్థిత రామ్
  11. విరచిత నిజ పితృ కర్మక రామ్
  12. భరతార్పిత నిజ పాదుక రామ్

రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతా రామ్

అరణ్య కాండము

  1. దండకావనజన పావన రామ్
  2. దుష్ట విరాధ వినాశన రామ్
  3. శరభంగ సుతీక్షార్చిత రామ్
  4. అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్
  5. గృధ్రాధిప సంసేవిత రామ్
  6. పంచవటీ తట సుస్థిత రామ్
  7. శూర్పణఖార్తి విధాయక రామ్
  8. ఖర దూషణ ముఖ సూదక రామ్
  9. సీతా ప్రియ హరిణానుగ రామ్
  10. మారీచార్తి కృదాశుగ రామ్
  11. వినష్ట సీతాన్వేషక రామ్
  12. గృధ్రాధిప గతి దాయక రామ్
  13. శబరీ దత్త ఫలాశన రామ్
  14. కబంధ బాహుచ్ఛేదన రామ్

రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతా రామ్

కిష్కింధా కాండము

  1. హనుమత్సేవిత నిజపద రామ్
  2. నత సుగ్రీవాభీష్టద రామ్
  3. గర్విత వాలి సంహారక రామ్
  4. వానరదూత ప్రేషక రామ్
  5. హితకర లక్ష్మణ సంయుత రామ్

సుందరా కాండము

  1. కపివర సంతత సంస్మృత రామ్
  2. తద్గతి విధ్వ ధ్వంసక రామ్
  3. సీతా ప్రాణాధారక రామ్
  4. దుష్ట దశానన దూషిత రామ్
  5. శిష్ట హనూమద్భూషిత రామ్
  6. సీతా వేదిత కాకావన రామ్
  7. కృత చూడామణి దర్శన రామ్
  8. కపివర వచనాశ్వాసిత రామ్

రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతా రామ్

యుద్ధ కాండము:

  1. రావణ నిధన ప్రస్థిత రామ్
  2. వానరసైన్య సమావృత రామ్
  3. శోషిత సరిదీశార్థిత రామ్
  4. విభీషణాభయ దాయక రామ్
  5. పర్వతసేతు నిబంధక రామ్
  6. కుంభకర్ణ శిరచ్ఛేదక రామ్
  7. రాక్షససంఘ విమర్దక రామ్
  8. అహి మహి రావణ చారణ రామ్
  9. సంహృత దశముఖ రావణ రామ్
  10. విధి భవ ముఖ సుర సంస్తుత రామ్
  11. ఖస్థిత దశరథ వీక్షిత రామ్
  12. సీతాదర్శన మోదిత రామ్
  13. అభిషిక్త విభీషణ నత రామ్
  14. పుష్పక యానారోహణ రామ్
  15. భరద్వాజాభినిషేవణ రామ్
  16. భరత ప్రాణ ప్రియకర రామ్
  17. సాకేత పురీ భూషణ రామ్
  18. సకల స్వీయ సమానత రామ్
  19. రత్నలసత్పీఠాస్థిత రామ్
  20. పట్టాభిషేకాలంకృత రామ్
  21. పార్థివకుల సమ్మానిత రామ్
  22. విభీషణార్పిత రంగక రామ్
  23. కీశకులానుగ్రహకర రామ్
  24. సకలజీవ సంరక్షక రామ్
  25. సమస్త లోకాధారక రామ్

ఉత్తరా కాండము:

  1. ఆగత మునిగణ సంస్తుత రామ్
  2. విశ్రుత దశకంఠోద్భవ రామ్
  3. సీతాలింగన నిర్వృత రామ్
  4. నీతి సురక్షిత జనపద రామ్
  5. విపిన త్యాజిత జనకజ రామ్
  6. కారిత లవణాసురవద రామ్
  7. స్వర్గత శంభుక సంస్తుత రామ్
  8. స్వతనయ కుశలవ నందిత రామ్
  9. అశ్వమేధ క్రతు దీక్షిత రామ్
  10. కాలావేదిత సురపద రామ్
  11. అయోధ్యక జన ముక్తిద రామ్
  12. విధిముఖ విభుధానందక రామ్
  13. తేజోమయ నిజరూపక రామ్
  14. సంసృతి బంధ విమోచక రామ్
  15. ధర్మస్థాపన తత్పర రామ్
  16. భక్తిపరాయణ ముక్తిద రామ్
  17. సర్వచరాచర పాలక రామ్
  18. సర్వభయామయ వారక రామ్
  19. వైకుంఠాలయ సంస్థిత రామ్
  20. నిత్యానంద పదస్థిత రామ్
  21. రామ రామ జయ రాజా రామ్
  22. రామ రామ జయ సీతా రామ్