శ్రీరామనామమే
ప శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది
శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది
చ 1)ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము
జేరకుండ నాపదలను చెండేనన్నది ||శ్రీరామ||
2)దారి తెలియని యమదూతల తరిమేనన్నది శ్రీమన్నారాయణ దాసులకు చెలువైయున్నది ||శ్రీరామ||
3)మాయావాదుల పొందు మానుమన్నది -యీ కాయ మస్థిరమని తలపోయుచున్నది ||శ్రీరామ||
4)వదలని దుర్విషయ వాంచ వదలమన్నది -నా మదిలో హరి భజన సంపత్కరమైయున్నది ||శ్రీరామ||
5)ముక్తిమార్గమునకిది మూలమన్నది -వి రక్తుడు భద్రాచల రామదాసు డన్నది ||శ్రీరామ||