శ్రీతులస్యుపాఖ్యానము/ఆఱవయధ్యాయము
శ్రీరస్తు.
శ్రీతులస్యుపాఖ్యానము.
[బ్రహ్మవైవర్తపురాణము ప్రకృతిఖండంబున నాఱవయధ్యాయమునందలి పదునాఱవ శ్లోకము మొదలుకొని యాయధ్యాయము తుదముట్ట నీతులస్యుపాఖ్యానముతో సంబంధించినకథ యగుటంజేసి యది పద్యరూపము గా రచియించి దీనిలో చేర్చియున్నాను.]
—* శ్రీవైకుంఠ నగర వర్ణనము. *—
శా॥ శ్రీకంఠాంబుడసంభ వాదివినుత శ్రీ భాసురం బై లస ద్రాకానాధ సహోదరీనిలయ మై రా కేందుకోటి ప్రభా స్తోకం బై సనకాదియోగిహృదయస్తోమంబులం బొల్చునా పై రుంకం బలరారుచుండు భువన వ్రాతోర్ధ్వ దేశంబునఁ . చ|| అందు వసించుపూరుషు లహస్కరకోటివిదీ ప తేజసుల్ మందరధారి రూపు లతిమాన్యచరిత్రులు భక్తియుక్తి శ్రీ చందనగంధి ప్రాణవిభు సారసలోచను నెల్ల కాల మిం పొంద న హైతుకంబు గ మహోన్న తిఁ గొల్చుచునుందు రాళతో . ఉ|| ఆగమగోచరుం డయినయాభగవంతుఁడు ధరరూపుఁ డి చ్ఛాగతి నాత్మ భక్తజనసంతతిఁ గావ విశుద్ధ సత్వతా శ్రీగత మైన మూర్తిని ప్రసిద్ధము గాఁ X ధరించి పొల్చు నా నాగవరా 2.వైరి పృత నాపతి ముఖ్యులు గొల్వ నయ్యెడ . సీ!! శ్రీహరి పాదాబ్జ సేవచేఁ గాంచిన మరకత హేమవిమానగణము నారోహణము చేసి యతిభ క్తి శ్రీహరిఁ బాడుచుఁ దద్గుణ ప్రకరజలధి మగ్న మానసు లయి మహిళాజనంబులలలితశృంగారవిలాసములకు బలితంపునునుగబ్బిబటువుగుబ్బలచక్కఁదనమునకును బృహత్కటిత టముల విప్పుదనమునకును దా మొ కప్పుడైన | మదిఁ గెలంగి రజోగుణమలినభావ
మొందక య యుండుము క్తులబృందమచటఁ గ్రందుగఁజరించునాపురం జమునను . పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/6 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/7 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/8 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/9 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/10 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/11 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/12 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/13 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/14 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/15 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/16 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/17 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/18 శ్రీరస్తు.
శ్లో| శ్రీమద్యశోదాత్త జాతం తార్తిహరణోద్యమం. |
వం చేరాధాకుచాభోగకుంకుమాంకితవక్ష సం
[ఇచట . నీగుఱు తుండులము మొదలు ఈగుఱుతు మరల వేసియుండుస్థలము దమక నుండుకథ పద్యరూపముగ వ్రాసి యింతకుముందు జేర్పబడినను ఆది కొందఱకు సుఖబోధము కా దని మరల వచనరూపంబుగ వ్రాసి యిందు జేర్చియున్నాను]
శ్రీనారాయణమహర్షి నారదుని కిట్లనియె, ఓనారదా పురాతనం బగునీకథ నీకుం దెల్పెదను. వినుము. ఆకథను స్మరించుకొన్న మాత్రాన సర్వపాపంబులు ను బాసిపోవును. శ్రీవైకుంఠంబునుదు లక్ష్మియు సరస్వతియు గంగ యు ననువారు మువ్వురు భార్యలు నారాయణునికిం గలరు. వీరు మువ్వురు ను సమాన ప్రేమగౌరవంబులు గలిగి సంతతము శ్రీహరి సన్నిథియందుఁడుదురు. ఒకప్పుడు గంగాదేవి కామంబు మేరమీజి నాధుండగునారాయణునిమోము బెళుకుఁ జూపులఁ జిఱు నగవుతోఁ గనుంగొనియె. ఆగంగా దేవి మోముఁ గాంచి ప్రభు వగు నారాయణుండు నలఁతినవ్వు నవ్వెను, అది గనుంగొని లక్ష్మీ దేవి యోర్చుకొనియుండెను. సరస్వతి యోర్చుకొనక యాగ్రహంబుర జెందె. లక్ష్మీదేవి సత్వరూపిణి గాన నప్పుకొనుచు నాసర స్వతికిఁ గోప శాంతి గల్గునట్లు బోధించెను. ఆ సరస్వతి, పరవశ యయినదిగాన శాంతిం జెందక కన్ను లందు మొగంబు నందు రక్తకాంతులు మీఱఁగోప వేగంబున నొడలు కంపంబునొందమాటిమాటికి నధరము స్పురియింపఁబటంగాంచియిట్లనియె. ॥సరస్వతీ॥ యోగ్యుఁడు నుత్తముఁడునుధర్తి పుండునునగుభర్తకుఁ గామినులందఱయందు సమ మైన ప్రీతి యుండును. ఖలుం డగువానికి నట్లుండక విపరీతం బైక నంబడుచుండు. ఓగదాధ రా నీకు గంగా దేవియందధిక సౌభాగ్యం బుండునట్లు తోఁచుచున్నది. ఓప్రభూ కమలా దేవియందును తత్తుల్య సౌభాగ్యం బున్నట్లు నీవు దలం చెదవు. నాయం దది లేదు, లక్ష్మీదేవికి గంగతో సుసమ్మతం బగుప్రీతి గలదు. ఆ ట్లగుటం జేసియే యాహరిప్రియ యీవిపరీతంబున సహనంబుఁ గైకొనియున్నయది. దుర్భగ నగునే నియ్యెడ జీవించుటచే నేమి ఫలంబు. ఎవ్వతే భర్తృప్రీతివంచితయో దానిజీవనము నిష్ఫలంబు. నిన్ను సత్వరూపుఁడ వనియు సర్వేశ్వరుఁడ వనియుం జెప్పెడిమనీషులు మూర్ఖులు. వారు వేదజ్ఞులు గారు. నీబుద్ధి వారలకు విజ్ఞాతంబు గాదు. అని యిట్లు పల్కిన సరస్వతివచనంబులు విని క్రోధసంయుత యగునాయమం గనుంగొని శ్రీహరి తనమానసంబున నాలోచించి యాసభ వాసి వెలికిం జనియె. ఇట్లు నారాయణుండు సనినయనంతరము గంగపై రోసగించి రాగాధిష్ఠాతృదేవత యగునాసరస్వతి నిర్భయమై శ్రవణపరుషంబుగ నిట్లనియె. ఓలజ్జావిహీనురాలా నీ కింతకామంబు తగునటవే? భర్త నీయం దనురక్తుం డై యున్నవాఁ డని గర్వించెదవా యేమి? లేక నీసౌభాగ్యంబును మా కధికంబుగ నెఱింగింపం గోరెదవా? ఆహరి సూచుచుండునప్పుడ నీమానంబును చూర్ణంబుఁ గావించెదను. ఓకాంతా యాతండు నీ కేమి సేయం గలండొ? చూచెదను. అతఁడు నాకును ప్రాణనాయకుండ యగు. అని యిట్లు దూషించి గంగాదేవిశిరోజంబులు పట్టి తిగియ నుద్యమింప నాసరస్వతికిని గంగకును మధ్యప్రదేశమున నిలిచి లక్ష్మీదేవి వాణిని నివారించెను. అప్పుడు సరస్వతి మహాకోపవతియై యాలక్ష్మి నిట్లు శపియించె. ఓలక్ష్మీ నీ విట్టివిపరీతంబుఁ గనుంగొని యేమియుం జెప్పక సభామధ్యంబున వృక్షంబువలె నిలిచి నదివలె నడ్డగించుచుండెదవు గాన నీకు వృక్షరూపంబును నదీస్వరూపంబును సిద్ధించుఁగాత. సందియము లేదు. అని యిట్లు శపియించిన నాసరస్వతి పల్కులు విని యాలక్ష్మి మరల నామెను శపియింప లేదు. కోపించుకొన లేదు. మఱి యామె దుఃఖించుచు వాణిని కరంబునం బట్టుకొని యయ్యెడన నిలిచియుండెను. అప్పుడు కోపంబు మొగంబున నినుమడింపఁ పైపై మించుచుండునావాణిని గనుంగొని గంగాదేవి లక్ష్మీదేవితో ని ట్లనియె. ॥గంగ॥ ఓపద్మాలయా యిది మహూగ్ర యై కానంబడుచున్నది. ఇది నన్నేమి సేయంగలదో చూతము. ఈవాగధిష్ఠాతృదేవత వాగ్దుష్ట. దీనికిం గలహంబునందుఁ బ్రియంబు గలదు. ఈదుర్ముఖి తన శక్తికొలందిగను తన యోగ్యతకొలందిగను నాతో వివాదంబు సేయనిమ్ము. ఓసతీ యిది స్వబలంబును పరబలంబును విశదీకరింపం దలంచెడిని. మీర లందఱు ను మాయిర్వురకుం గలప్రభావంబును పరాక్రమంబును దెలిసికొనుఁడు. అని యిట్లు సెప్పి యాగంగాదేవి వాణి కివ్విధంబున శాపం బొసంగెను. ఓలక్ష్మీ యెవ్వతె నిన్ను శపియించెనో యది - నదీరూపంబుం జెందుంగాత. అది పాపిష్ణు లుండుమర్త్యంబు క్రిందికిం బోయి కలియందు వారలపాపాంశములను బొందుచుండుంగాత. అని చెప్పిన గంగాదేవివచనములు విని సరస్వతి గంగాదేవిం గాంచి యోసీ నీ వ భూమికిం బోవఁగలవు. పాపిష్ఠుల పాపములం బొందఁగలవు. అని శపియింప నాసమయమున భగవంతుండు చతుర్భుజు లగునలువురుపార్షదులలో నయ్యెడ కేగుచెంచి సరస్వతిని కరమున బట్టుకొని పకస్థలమునం జేర్చుకొని యాసర్వజ్ఞుం డావాణికి బురాతనం బయినజ్ఞానంబు నుపదేశించెను. ఆప్రభువు వారలకుం గలిగిన శాపమునకు ను గలహమునకు ను గలరహస్యంబును వారలకెఱింగించి దుఃఖావేశవివశ లయియుండునాకాంతలకు సమయోచితంబు లగువచనంబుల నిట్లనియె. ॥భగవంతుండు॥ ఓలక్ష్మీ నీవు నీకలచే ధర్మధ్వజుని గృహమునకుఁ బొమ్ము. భూమియం దాతని కయోనిసంభవ యగుకన్యక గాఁగలవు. అందు దైవదోషముచేత నీవు వృక్షత్వమును జెందఁగలవు. మదంశసంభవుం డగుశంఖచూడుఁ డనుదావనాధునికిఁ గామిని వై యనంతరము నాకుం బత్నివిగాఁగలవు. నిక్కువము. భారతమునందుఁ ద్రైలోక్యపావని యగుతులసి యనం బరగెదవు. నీవు నీభారతీ శాపమున నీకలచేతఁ బద్మావతీనది వై భారతమునం బ్రవహింపుము. శీఘ్రముగఁ బొమ్ము, ఓగంగా యసంతరము నీవు భారతీశాపముచేత విశ్వముఁ బావనము సేయునట్టిదానవై దేహధారులపాపముల దహింప భారతమునకుం జనుము. సుదుష్కరం బయినభగీరథునితపముచేత భారతమునకుం గొంపోవంబడి మహీతలమున నతిపూత వై బాగీరథీ సమాఖ్యం బడయం గలవు. ఓప్రియురాలా నాయాజ్ఞ చేత నీవు మదంశసంభవుం డగుసముద్రునికిని నాకలచే జనియించెడు శంతనుమహీపతికిని దయితవు గాఁగలవు. ఓభారతీ గంగాశాపముచేత నీవు నీకలచే భారతమునకుం జనుము. ఓవాణీ చవతులతో నాడినకలహమునకు ఫలమనుభవింపుము. నీవు స్వయము బ్రహ్మసదనమునకుం బొమ్ము. ఆతనికిం గామినివి కమ్ము. గంగ శివాలయమునకుం జనుంగాత. ఇయ్యెడఁ పద్మయే యుండుఁగాత. ఈ లక్ష్మీ మిగులఁ బతివ్రత. మహానుభావురాలు. మంచి శీలముగలది. ధర్మము ప్రవర్తింపం జేయునది. ప్రతివిశ్వముల నామె కలాంశసంభవ లయినయందఱుకాంతలు ను ధర్మిష్ఠలయి పతిప్రతలయి శాంత స్వరూపమును, సుశీలము ను గలవా రై యుందురు. మువ్వురు భార్యలు మూఁడుశాలలు మువ్వురుభృత్యులు మువ్వురు బంధువులు నిజముగ వేదవిరుధ్ధములు. వీరలు మంగళప్రదులు గారు. ఎవ్వారి గృహమున స్త్రీ, పురుషునిపగిదిఁ బ్రవర్తించు. ఏగృహస్థుఁడు స్త్రీవశుఁ డై యుండు. అట్టివారిజన్మము నిష్ఫలము. వారికిఁ బ్రతిపదము నశుభము గల్గు. స్త్రీ, ముఖదుష్ట యగునేని యు యోనిదుష్ట యగునేని యుఁ గలహప్రియ యగునేని యు నట్టిదానిభర్త యరణ్యమునకుఁ బోవజను. గృహమునకంటె మహారణ్యము వర మై యుండు. ఆయరణ్యమున వారలకు జలములు ను స్థలములు ను ఫలములును సంతతము సులభములు. క్రూరనార్యధిష్ఠిత మయినయింట నవి సులభములు గావు. పురుషులకు దుష్టస్త్రీల సన్నిధియందు వాసము బహుదుఃఖావహం బై యుండు. అంతకంటె నగ్నియం దుండుట యుత్తమము. హింసకజంతువులదగ్గఱ వసించుటసుఖకరము. ఓవరాననా పురుషులకు వ్యాధిజ్వాల విషజ్వాల యు ను శమము లనవచ్చు. దుష్ట స్త్రీల ముఖజ్వాల మరణమునకం టె నఃకఠోరమై యుండు. స్త్రీజితుం డగు పురుషునిజీవితము నిష్ఫలము, నిక్కము, వాఁ డొనరించినకర్మము ఫలము నొసంగదు. హౌఁ డియ్యెడ నంతట నిందితుం డై పరమున నర కమునొందు, యశఃకీర్తి విహీనుం డగు. వాఁడు జీవించియున్న ను మృ తుండయగు. అగ్ను లు ను చవతులు నొక్క యెడ నుండిన శ్రేయము చెడు, ఒక భార్య గలవాఁడు సుఖముఁ బడయు, పెక్కండ్రు భార్యలు గలవాని కొకప్పుడు ను సుఖము లేదు. ఓగంగా నీవు శివాలయమునకుం బొము, ఓ సర స్వతీ నీవు చతుర్ముఖునియింటికిం జనుము. సుశీల యగు కమలాలయ యియ్యెడ నాయింట నుండుఁగాత. ఎవ్వనిపత్ని సుఖసాధ్య యయి సుశీలము గలిగి పతివ్రత యైయుడు. అతని కిహంబున స్వ ర్గసుఖము ను పరము న ధర్మ మోక్షములు ను గలుగు. ఎవ్వనికిఁ బతి వ్రత పల్ని యగునో! వాఁడు ము కుండు ను శుచి యు సుఖి యు నై యుండు. దుశ్శీలముగలది యెవ్వనికిఁ బత్ని యగు; వాఁడు జీవన్ళు తుండు అశుచి దుఃఖి యు నై యుండు. ఓనొరదా యిట్లు వచియించి జగత్పతి యూరకుండ నాలక్ష్మీ వాణీగంగ లొండొరుల నాలింగనము చేసికొని పెద్ద పెట్టున నేడిచిరి. ఇట్లు కొంతతడవు రోగనము చేసి యాకాంతలు శోకమునం గన్ను ల బాష్పము లురుల నంగములు వడంక భయము పై కొనం జేయునది యెఱుంగక చింతాసం తాపదంతురిత స్వాంత లై యాలో చించి క్రమముగ నాజగత్పతి కి ట్లనిరి. అందు సర స్వతి యోనాథా నాయపరాధము క్షమింపుము. దుష్టురాల నగునన్ను దండింపుము, ఎట్టి స్త్రీ లైన నుత్తమ కాంతునిచేఁ బరిత్య క్త లయి రేని యెయ్యెడ జీవింపఁగలరు. యోగము చేత భారతమున దేహత్యాగముఁ జేసికొని యెదను. అత్యుచ్ఛితుఁ డగువాఁడు నిశ్చయముగ నిపాతము నొందునుగదా?అని చెప్పిన గంగ యిట్లనియె, ఓజగత్పతీ యేయ పరాధ ముచేత నన్ను నీవు పరిత్యజిం చెదవు. నేను దేహ త్యాగ మొనరించె దను నిర్దోష యగుదానిం జంపిన పాపము నీవు జెందెదవు, సంసార మున - స్వండు నిర్దోష యగు కామినిం బరిత్యజించు; " కల్పకాలము వాఁడు నరకి మున నుండు. సర్వేశ్వరుండ వగునీ కేమి? అని చెప్పిన లక్ష్మీ దేవి యిట్లనియె, ఓనాథా నీవు సత్త్వస్వరూపుఁడవు. నీకుం గోపమె ట్లుగలై. ఔరా యిది యాశ్చర్యము. భార్య లవిషయమున ననుగ్రహ మొనరింపుము. ఉత్తముఁ డగుపతికి నోర్సు వరము గా దె? భారతీ దేవి శాపమున నేను నాకల చే భారతమునకుం జని యెద సేని యయ్యెడ నెంతకాల ముండంగలను. నీ పాదారవిందముల మరల 'నెప్పుడు గాంచం గలను, పాపిష్ఠులు నాయందు స్నానము సేయ నవగాహన మొనరించి తమపాపముల నాకర్పింతురుగదా? ఆ పాషముల నేకాగణమును బాసి నీ పదములఁ జెందెదను. ఓయచ్యుతా నేను నాకలచే ధర్మధ్వజునికి గూఁతు రై తులసియనఁ బరఁగి నీపాదారవిందముల 'నెప్పుడు గాంతు ను. ఓకృపానిధీ నేను వృక్ష రూపిణి నయి దానిక ధిష్టాన దేవత నయ్యె దనుగా దే! అట్టిన న్నెపు డుగ్ధరింప గలవు. అది నాకుఁ దెల్పుము. సరస్వతీ దేవిశాపము చేత గంగా దేవి భారతమునకుం జనియె నేని శాప పాపవిము క్త యయి యా దేవి ని న్నె ప్పుడు జెందఁగలదు. సరస్వతీ దేవి గంగా శాపము చేత భారతమునకుఁ జనియె నేని శాప వినిర్ముక్త యయి నీపదము నెప్పుడు చెందఁగలదు. ఓనాథా ఆ వాణిని బ్రహ సదనమునకును గంగను శివసదనమునకును బొ మని చెప్పినవచనమును క్షమింపుము. అని యిట్లు పల్కి కమలా దేవి తన కాంతుని పాదములు పట్టుకొని నమస్కరించి తన కేశ భారమున నాతని చరణములు బంధించి మాటిమాటికి రోదనము సల్పెను. అప్పుడు పద్మ నాభుఁడు పద్మాలయా దేవిని తనవక్షమున సుని చికొని స్తి తసుధామధుర మయిన మోమునఁ బ్రసన్న త్వము దొఁప భక్తానుగ్రహకాతరుఁ డయి యిట్లనియె. ॥నారాయణుఁడు॥ ఓసురేశ్వరీ నీ చెప్పి నవచనమును నా చెప్పిన వచనమునుభం శమునొందక సమమైయుండునట్లుగ నాచరించెదను. ఆక్రమము వినుము. భారతీ దేవి తనకలచే సరిద్రూపము: దాల్చి భారతమునకుఁ జనునది. ఆవాణి తనయద్ధాంశము చేత బ్రహ్మ సదనమునకుం జనునది. ఆ సరస్వతి స్వయము నాగృహమున నుండఁ జను. ఆగంగ త్రిభువనములను పవి త్రములు సేయుటకు భగీరథుని చేఁ గొంపోవఁబడి భారతమునకుఁ జనం గలదు. ఆగంగ స్వయము నాయింట నుండఁజను. అయ్యెడన యాగంగ దుర్లభ మయినచంద్రమౌళిశిరముం బొంది యామె స్వభావమునఁ బూత యయ్యు నంత నతిపవిత్రురా లగును. ఓకనులాలయా నీపు నీకలాం శాంశముల చేత భారతమునకుఁ జనీ పద్దావతి యనుసరి ద్రూపముసు, తులసి యను వృక్ష స్వరూపమును దాల్పుము. సరిద్రూపములు దాల్చిన మీకుఁ గలియందు సైదు వేల యేండ్లకు విమోక్షణమును మరల మద్గృహప్రాప్తి యుఁ గలుగును. సర్వశ రీర ధారులకును విపత్తి సంపద లకు హేతుభూత మై యుండు. ఓపడ్డా సంసారమునందు విపత్తి వినాగా నెవ్వరికి మహిమము గల్గు? నామంత్రము నుపాసించు సాధు వులు స్నానము సేయుట క వగాహన మొనర్చుటం జేసి మీకుం బాపిష్టుల సంస్పర్శమువలన నైన పాపములు దొలఁగు. ఓసుందరీ పృధివి యందుం గలయ సంఖ్యాతము లగుతీర్థములు మద్భక్తజనులదర్శనస్ప ర్శనములవలనఁ బూతము లగును. ఓసతీతిలకమ ' మదీయమంత్రము ను పాసించుభ క్తులు భారతమును స్రవిత్రము సేయ నందు సంచరించు చుండుదురు. వారు మహాపవిత్రులు. అతిమనోహరులు,నాభ క్తులెచ్చో టనుండుడి)రో? వార లెచ్చోటం బాదములు గడుగుకొనుదురో? ఆచోటు సుపవిత్ర మగుమహాతీర్థ మయి వెలయు,నిజము. స్త్రీని జంపిన వాఁడైనను గోఘ్నుఁడైనను కృతఘ్నుడై నను బ్రహహత్య యొన రించినవాఁడైనను - గురుతల్పగుండై నను నాభక్తుల స్పృశించుట చేతను దర్శించుట చేతను మహాపవిత్రుఁడై జీవనుక్తుఁ డగును, ఏకాద శీవ్రతము ననుష్ఠించనివాఁడయ్యును సంధ్యావిహీనుండయ్యును నాస్తి కుండయ్యును నరఘాతియయ్యుం బరిపూతుం డగును, శస్త్ర జీవియు ధావకుండును శూద్రయాజగుండును వృషవాహుండును మద్భక్తజన స్పర్శనదర్శనములఁ బూతత్వము నొందు, విశ్వాసఘాతియు మిత్రఘా తియు మిధ్యాసాత్యము సెప్పినవాడును స్థాప్యము హరించిన నాల డును మద్భ క్తస్పర్శదర్శనము లవలనఁ బూతు లగుదురు. మద్భక్త స్ప ర్శదర్శనమువలన ఋణగ్రస్తుండును వార్ధిషి కుఁడును జారజుఁడును పుంశ్చలీపతియు పుంశ్చలీపుత్రుంకును పవిత్రు లగుదురు. శూద్రుల యిండ్లలో వండువాఁడును దేవలుఁడును గ్రామయాజకుఁడును అదీ క్షితుఁడును అశ్వత్థవృక్షమును ఖండించిన వాఁడును నాభ క్తుల నిందిం చువాఁడును నివేదనము సేయక భుజించువిస్రుఁడును నాభ క్తులఁగాంచి నను స్పృశించినను పరిపూతత్వ బు నొందుదురు. తల్లిని తండ్రిని భార్యను బ్రోతలను కుమారుని కూఁతును గురుకులమును భగినిని వంశ హీనుం డగుభాంధవుని శ్వశ్రూశ్వశురులను స్వీకరింపనివారలును దేవ ద్రవ్యావహారియు విప్రద్య వ్యాపహారియు లాక్షాలో హరసముల విక్ర యించువారలును కన్య కావిత్రయము సేయువాగును శూద్రశవముల దహించువాఁడు నుమహాపాతకులు, అట్టివారును నాభ క్త జనుల దర్శసస్ప ర్శనములవలనఁ బూతత్వముఁ జెందుదురు' అని చెప్పిన విని లక్ష్మీ దేవి యిట్లనియె. ఓభక్తానుగ్రహకారకుఁడా భక్తులలక్షణముఁ దెల్పుము. వారలసందర్శనము చేతను సంస్పర్శము చేతను నరాధములు సయితము తక్షణమునఁ బరిపూతు లగుదురుగ దా? హరిభక్తివిహీనులును ధూర్తు లును మహాహంకార సంయుతులును ఆత్మ స్తుతిపరాయణులును శరు లును సాధునిందకులును నరాధములు.ఎవ్వారు స్నానము సేయుట కవ గాహనము రచించుట చేత సర్వతీర్థములు పావనము లగునో? ఎవ్వారి పాదోదకమువలనను పాదరజమువలనను భూమి పరిపూత యగునో? భారతమున నెవ్వారిదర్శనస్పర్శనములను దేనతలుసయితము కోరు దురో? అట్టివైష్ణవులసమాగమము ఎల్ల వారికిని బరమలాభ మయి యుండు, ఆమయము లగుతీర్ధములును మృచ్ఛిలామయము లగు దేవత లును విష్ణుభక్తులవ లెఁ దక్షణమునఁ బావనము సేయ లేరు, వారు బహుకాలమునకుఁ బరి పూతులం జేయుదురు. అని యిట్లు లక్ష్మీ దేవి చెప్పిన వచనములు విని లక్ష్మీ కాంతుఁడు మందహాసముతో నిగూఢ మగుతత్త్వము సెప్ప నుపక్రమిం చెను. || నారాయణుఁడు!! ఓలక్ష్మీ భక్తులలక్షణములు శ్రుతులందుఁ బురాణములందు గూఢము లై యుండు. అవి పుణ్య స్వరూపములు , పాప సంహారకములు. సౌఖ్యద ములు. భక్తిముక్తి ప్రదములు. సారభూతములు. గోపనీయములు. ఖలులకుఁ జెప్పఁగూడనివి. నీవు పవిత్రవు. ప్రాణతుల్యురాలవును గానం దెల్పెదను. వినుము. ఎవ్వనిశ్రవణమునందు గురుముఖమువలన విష్ణు మంత్రముప్రవేశించునాయాతనిని పవిత్రఁ డగునరో త్తముఁ డని వేద వేదాంగములు వల్కు చున్న వి. అట్టివానిపూర్వపురుషులు నూర్వురు తమకులమున నట్టిపవిత్రుండు జన్మించినమాత్రము చేత స్వర్గమున నుండినను నరకముననుండినను వానిం బాసిముక్తి బొందుదురు..ఎవ్వ రె వ్వరే యేయోనులందుజన్మమునొందియుం డెదరో ? ఆయా పురుషులు సయితము కాలమున పూతత్వమునొంది జీవనుక్తులయి శ్రీహరిపదమును జెందెదరు. మదీయమయినభక్తి గలిగి మదీయ మయిన పూజయంగు నియు క్తుఁ డగుచు మదీయములగు గుణములు ధ్యానించుచు నాగుణ ములను ” థించుచు సతతము మన్నిష్టులై నాగుణములు విన్న మా తాన నానందములును పులకలును వెలుంగ గద్గదాక వొడమినకంగ మును అనం చాళువులు ప్రవహించు నేత్రములును గత్తెడువారు నాభక్తు లు, వారలు సుఖమును సాలో క్యాది మోక్ష చతుష్టయమును బ్రహత్వ మును అమరత్వమునుగోరరు. వారలు మత్సేవనము నే గోరుదురు వారు ఇంద్రత్వమును, మనుత్వమును సుదుర్లభమైన దేవత్వమును స్వర్గ రాజ్యాది భోగములును స్వస్న ము న నై నను వాంఛింపరు. బ్రహ్లాదు లగు దేవతలు వినాశమునొందుదురు. కల్యాణ మగుమద్భక్తి గలవాఁడు నాశము నొందఁడు. మద్భక్తులు సుదుర్లభ నుయిన భారత భూజనము నందీ భారతమునం బరిభ్రమించెదరు. ఆనరులు భూమిని పావనము గావించి నాయాలయమున కేగుదెంచెదరు. ఓపద్మా యిది "సర్వము నీ కెఱింగించితిని. యథోచితముగఁ బ్రవ ర్తింపుము. అనిన నా కొంత లా హరియాజ్ఞానుసారముగ నడిచిరి..!
ఇది బ్రహ్మవైవర్తమహాపురాణమునందు ప్రకృతిఖండంబున
నారాయణనారదసంవాదంబున సరస్వత్యుపాఖ్యాన
మనునాఱవయధ్యాయము.