శివలీలావిలాసము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
శివలీలావిలాసము
ప్రథమాశ్వాసము
ఇష్టదేవతాప్రార్థనము
| 1 |
క. | మగనిసగమేన నెలకొని, ముగురంబలయందు నాదిమూలం బగుచున్ | 2 |
ఉ. | శ్రీరమణీరమేశ్వరులఁ జిత్తమునం గదియించి భారతీ | 3 |
కవివంశాభివర్ణనము
సీ. | కౌండిన్యగోత్రవిఖ్యాతుండఁ గూచిమంచ్యన్వయాంభోధినీహారకరుఁడ | |
తే. | దెందులురి లింగనారాధ్య దేశికేంద్ర, దత్తమాహేశ్వరాచార్యవృత్తిరతుఁడ | 4 |
సీ. | ప్రౌఢి మై రుక్మిణీపరిణయంబును సింహశైలమాహాత్మ్యంబు నీలపెండ్లి | |
| సారంగధరనరేశ్వరచరిత్రంబు సప్తార్ణవసంగమాహాత్మ్యకంబు | |
తే. | మంచితక్షేత్రకథనంబు మఱియుఁ బెక్కు, శతకదండకసత్కృతుల్ ప్రతిభఁ గూర్చి | 5 |
వ. | ఇట్టి నేను మదభీష్టదైవతం బైనకుక్కుటేశ్వరశ్రీమన్మహాదేవునకు నంకితంబుగా | 6 |
షష్ఠ్యంతములు
క. | సర్గాపసర్గఫలదని, సర్గునకున్ భర్గునకుఁ బ్రశమితమహాంహో | 7 |
క. | అంభోజాసనమదసం, స్తంభునకున్ శంభునకు నుదంచితకరుణా | 8 |
క. | సర్వసుపర్వకదంబక, పూర్వునకున్ శర్వునకును భుజబలలీలా | 9 |
క. | బాణాదిభక్తజనసం, త్రాణునకున్ స్థాణునకు నుదంచదుదన్వ | 10 |
క. | సామజదానవదర్పవి, రామునకున్ సోమునకును రజతమహీభృ | 11 |
క. | పురదైతేయస్మరసం, హరునకు హరునకు నిరంతరాత్యంతదయా | 12 |
వ. | సమర్పణంబుగా నారచియింపం బూనిన శివలీలావిలాసం బనుశృంగారరసప్రబం | 13 |
కథాప్రారంభము
గీ. | హస్తిపురమున నొక్కనాఁ డర్జునుండు, భీష్ముఁ గన్గొని మ్రొక్కి సంప్రీతిఁ బలికెఁ | 14 |
క. | నీ వెఱుఁగనిపుణ్యకథల్, క్ష్మావలయమునందు లేవుగద యేవైనన్ | 15 |
ఆ. | శివుఁడు గంగ నేల శిరమున నిడుకొనె, గంగ విష్ణుపాదకమలమున జ | 16 |
వ. | అదియునుం గాక. | 17 |
గీ. | గంగఁ గొందఱు జాలరికన్నె యనుచు, నెన్నుచుండుదు రమ్మాట యేర్పడంగ | 18 |
గీ. | అనిన గాంగేయుఁ డప్పాండుతనయుఁ బలికె, వత్స నే మున్ను నారదువలన విన్న | 19 |
ఆ. | మొదలఁ గమలగర్భుఁ డుదకంబుల సృజించి, వీర్య మందులోన విడిచె నది స | 20 |
వ. | అయ్యండంబునందుఁ జరాచరాత్మకం బైనసకలప్రపంచంబు సృజియించి వృద్ధిఁ | 21 |
గీ. | మూషికాసురుఁడను సురద్వేషి యొకఁడు, దూఱి యయ్యండమున కొకతూటు వొడిచె | 22 |
క. | ఆవెల్లి జగము లన్నియు, వేవేగ న్ముంచి జంతువితతికి నెల్లన్ | 23 |
గీ. | జగదుపద్రవశాంతికై తగిలి మున్ను, కాలకూటంబుఁ గంఠభాగమున నిడ్డ | 24 |
గీ. | అపుడు గంగ మహేశుజటాగ్రవీథి, బట్టఁజాలక యుప్పొంగి పైకిఁ బొరలి | 25 |
గీ. | హరియు నయ్యెడ మూషకాసురు వధించి, తనపదాంగుష్ట మబ్బిలద్వారసరణి | 26 |
వ. | ఆప్రవాహంబు సకలభువనంబులఁ బవిత్రంబుగా గంగాభవాని యేకార్ణవం | 27 |
క. | తన కెదు రెవ్వరు లే రని, మునుకొని గర్వాతిరేకమునఁ బలికినన | 28 |
గీ. | ఆఁడుదానవు నీ కిట్టు లబ్బురంపు, గర్వ మేటికి నాచేతఁ గమలసంభ | 29 |
క. | భూచక్రంబున కిప్పుడె, వే చని నీ వందు మత్స్యవిక్రయవృత్తిన్ | 30 |
గీ. | అనిన నళుకొంది గంగ యోయనఘచరిత, తప్పు సేసితి లొంగి నీదయ దలిర్పఁ | 31 |
క. | నావుడు శంకరుఁ డిట్లను, నీ వటువలెఁ గొన్నినాళ్లు నిలిచిన పిదపన్ | 32 |
వ. | అని పరమేశ్వరుం డానతిచ్చిన నట్లనె గంగాభవాని దాసకులకన్యాస్వరూ | 33 |
సీ. | శంఖదేవుం డనుజాలరిగేస్తుండు దనబంధువుల దానుఁ దవిలి యొక్క | |
గీ. | నెద్ది తప మేల చేసెద విచట నిట్లు, సరసిజానన నాకు నీచందమెల్లఁ | 34 |
గీ. | తండ్రి విను మేను గంగను దక్షహరుఁడు, నన్ను నొకకారణమున డెందంబులోని | 35 |
గీ. | తల్లి యైనను విను మఱిఁ దండ్రి యైన, నీవె కా నింక నన్యుల నే నెఱుంగ | 36 |
| అమ్మ నీ వేమి గోరిన నట్ల సేతుఁ, గలవు మాయింట సకలభాగ్యంబు లిపుడు | 37 |
క. | రావమ్మ భువనపావని, రావే నాముద్దుబిడ్డ రావె లతాంగీ | 38 |
వ. | అని యపుత్రకుండు గావునఁ బెన్నిధానంబు గన్న పేదచందంబున దైవంబు | 39 |
ఆ. | పెరుఁగుఁ బాలు జున్నుఁ బెల్లంబు నెయ్యి కొబ్బరి యనఁటిపండ్లు పనసపండ్లు | 40 |
వ. | అట్లు పెనుచుచున్నయెడ. | 41 |
ఉ. | అంగదముద్రికావలయహారలలాటిక లెమ్మె నెమ్మెయి | |
| ల్బగరుగిల్కుటందియలు బాళిగ నంఘ్రుల ఘల్లుఘ ల్లనన్ | 42 |
సీ. | బొమ్మపెండ్లిండ్లు సొంపుగఁ జేసి గుజ్జనగూటియామెత లనుంగులకుఁ బెట్టు | |
గీ. | బోటులను గూడి కిన్నెరమీటు నింపు, నాటుకొలుపుచు జిలిబిలిపాట పాడు | 43 |
వ. | అట్లు క్రీడింపుచు దినదినప్రవర్ధమాన యగుచున్నంత. | 44 |
సీ. | నిద్దంపుసోగపెన్నెరులు వేసలికందె నెదఁ జిన్నిచన్నులు కుదురులెత్తెఁ | |
గీ. | నడలఁ గడలేనిమురిపెంబు గడలుకొనియె, మెఱుఁగుచెక్కులతళతళల్ దుఱఁగలించెద | 45 |
వ. | అట్టి నవయౌవనారంభంబునఁ జీనిచీనాంబరానర్ఘమణివిభూషణసుగంధతాంబూ | 46 |
సీ. | సిరులకు మన్కి యై చిరసుఖాకర మైన కైలాసశైలశృంగంబునందు | |
గీ. | దవిలి కొలువంగ గిరిరాజతనయఁ గూడి, యనుపమానర్ఘరత్నసింహాసనమున | 47 |
వ. | అయ్యవసరంబున. | 48 |
సీ. | మినువాక తెలినీరు నినిచినకుండికఁ బసిఁడిచాయలఁ గేరుపల్లజడలు | |
గీ. | గలిగి భవభర్గ చంద్రశేఖర మహేశ, హర మహాదేవ సాంబ శంకర గిరీశ | 49 |
గీ. | అ ట్లరుగుదెంచి దివిజసంయమివరుండు, భక్తి దైవార నమ్మహాప్రభునినగరు | 50 |
సీ. | రాకేందునీకాశరమ్యగాత్రమువాని రమణీయఫణిభూషణములవానిఁ | |
గీ. | బ్రథితభువనోద్భుతోరువైభవమువాని, ఘనతరానందహృదయపంకజమువాని | 51 |
క. | అటువలెఁ బొడఁగని కేల్గవ, నిటలస్థలిఁ జేర్చి సంజనితకౌతుకవి | 52 |
సీ. | భసితాంగరాగాయ భక్తానురాగాయ పాలేక్షణాయ తుభ్యం నమోస్తు | |
గీ. | భావభవసంహరాయ తుభ్యం నమోస్తు, భవసరన్నావికాయ తుభ్యం నమోస్తు | 53 |
వ. | అని నమస్కరించి వెండియు. | 54 |
సీ. | జయజయ కైలాసశైసనికేతన జయజయ దేవతాపార్వభౌమ | |
గీ. | జయ పురందరహరివిరించనముఖాఖి, లామరస్తోమముకుటాంచలాంచితాబ్జ | 55 |
క. | పరమేశ నిన్నుఁ బొగడఁగఁ, దరమే శేషునకు హరిపితామహబలసం | 56 |
సీ. | మహిమ మీఱఁగ సర్వమంత్రరాజం బైనగాయత్రి కీవె పో నాయకుఁడవు | |
గీ. | జలజగర్భుండు మొదలగు జంతువులకుఁ, బతి వగుటఁ జేసి నీకె విశ్రుతము గాఁగ | 57 |
మ. | కరికిన్ మర్కటకీటపోతమునకుం గాలాహికిన్ మూలపో | 58 |
గీ. | శ్వేతుఁడు మృకండుసూనుండుఁ బ్రేతనాథు, చేతఁ గడ లేనియిడుమలఁ జిక్కి పొక్కి | 59 |
క. | హరి తననయనాబ్జముతోఁ, దొరలఁగ నొకవేయివికచతోయజముల నీ | 60 |
క. | సురదనుజు లబ్ధిఁ దరువగ, గరళము ప్రభవించి జగము గాల్పఁగ దానిన్ | 61 |
గీ. | భైరవాకృతియును వీరభద్రమూర్తి, శరభసాళువరూపంబు సరవిఁ దాల్చి | 62 |
సీ. | గడితంపుటపరంజిగట్టుసింగిణి విల్లు గాలిబోనపుఁదిండికాఁడు నారి | |
గీ. | గాఁగ దిగప్రోళ్లు బలితంపుఁగడిమిఁ గూల్చి, జగము నావడి యుడిపి నిశ్ళంక నలరు | 63 |
సీ. | పులికరాసంబును బూదిగంధంబును బుఱియకంచంబును బునుకుపేర్లు | |
గీ. | గలిగి వెలుఁగొందు నీమూర్తిఁ దలఁపునందు, నిలిపి యేప్రొద్దుఁ గొలుతు న న్నెలమిఁ బ్రోవు | 64 |
గీ. | వేయినోళ్లను మఱి రెండువేలనాలు, కలు గలుగుశేషునకునైన నలుమొగముల | 65 |
గీ. | అని నుతించుమునీంద్రు గని శివుండు, సారకరుణామృతార్ద్రసుస్వాంతుఁ డగుచు | 66 |
క. | మునివర సకలజగంబులు, ననివారణముగ జరింతు వచట నచట నీ | 67 |
క. | ఏయేజగములఁ జూచితి, వేయేదేశములు గంటి వేయేపురముల్ | 68 |
గీ. | అనిన నారదుం డిట్లను నభవ సకల, భువనములఁ జూచుకొనుచు నేఁ బోయిపోయి | 69 |
సీ. | బహురత్నవిరచితప్రాసాదములచేత రమణీయమణిగోపురములచేత | |
గీ. | విమలపద్మాకరోద్యానసమితిచేత, గంధగజరాజధేనుసంఘములచేత | 70 |
చ. | అసమశరోపమానసముదంచితవిగ్రహఁ గంటి నందుఁ గ్రొ | 71 |
ఉ. | అన్నులమిన్నులం ద్రిభువనాంచితరూపవిలాసమాన్యులం | 72 |
ఉ. | కొమ్మలు సాటియే మరునికొమ్మకరఁబునఁ గ్రాలుజాళువా | 73 |
చ. | కులుకుమిటారిగబ్బిచనుగుబ్బలసౌరు జగానిగారపుం | |
| గలికిపిసాళివాలు తెలిగన్నులతీరు గణింప మాయురే | 74 |
సీ. | చిన్నారిజాబిల్లి కన్నెగేదఁగిపువ్వు వెన్నెలతెలినిగ్గువన్నెలగని | |
గీ. | చికిలినిద్దంపుటద్దంబుపికిలిబెండు, మగువతలమిన్న వెలలేనిమానికంబు | 75 |
సీ. | సతిమోమునకు నోడి చందమామ కృశించి వెలవెలనై బైట వ్రేఁగుచుండెఁ | |
గీ. | దరుణినునుజెక్కులకు నోడి దర్పణములు, మైల వాటిలఁ గొంతఁ గన్మాసి యుండె | 76 |
సీ. | అలికులవేణిశైవలరోమవల్లరి సారసవదనకల్హారపాణి | |
గీ. | యగుచు భువనాభిరామవిఖ్యాతి నెపుడు, వెలయుచున్నట్టి యాఘనవేణితోడ | 77 |
క. | పొడవుగ నెగసి తళు క్కని, పొడ చూపి యదృశ్య మగుచుఁ బోవుమెఱుంగుల్ | 78 |
సీ. | ఇది కీలుఁజడ గాదు చదువుపల్కుహుమావజీరునివాఁడికటారు గాని | |
గీ. | యిది వలపుకెంబెదవి గాదు మదనభూప, కరవిరాజితపద్మరాగంబు గాని | 79 |
సీ. | కలికివాల్గన్నులఁ దిలకించి చూచిన వెడవింటిదొరబాణవృష్టి గురియుఁ | |
గీ. | కచకుచకటిభరంబుచేఁ గౌను వడఁక, నూత్నచామీకరామూల్యరత్నఘటిత | 80 |
ఉ. | సుద్దుల కేమి నాపలుకు సూనశరాంతక చిత్తగింపు మ | 81 |
ఉ. | ఆలతకూన యాలలన యాలవలీదళకోమలాంగి యా | 82 |
గీ. | గంగ యనుపేరు దన కెసఁగంగ భువన, మంగళాకృతిఁ బొల్చునయ్యంగనాల | 83 |
గీ. | అని మునీంద్రుఁ డెఱింగిఁప నభవుఁ డపుడె, కొలువు చాలించి యెల్లవారలను బోవఁ | 84 |
సీ. | జడలు చిక్కులు వాపి నడునెత్తి సిగ వైచి తావిసంపెఁగపూలదండఁ జుట్టి | |
గీ. | కేలఁ జారుకపాలంబు గీలుకొలిపి, మేన నవగంధసారంబు మెదిచి పూసి | 85 |
వ. | అట్లు జగన్మోహనోకారజంగమాకారంబు | 86 |
మ. | కనియె న్నీలగళుండు బిల్వబదరీఖర్జూరజంబీరచం | 87 |
సీ. | కలకంఠకులకంఠకాకలీధ్వానము ల్చెలఁగి దిక్వలయంబు చెవుడు పఱుప | |
| బ్రమదనృత్యన్మత్తబర్హిణారావంబు లవిరతశ్రుతిపుటోత్సవ మొనర్ప | |
గీ. | ఘనమరాళారవంబులు గ్రమ్ముకొనఁగ, బంధురసుగంధగంధిలగంధవాహ | 88 |
వ. | అందు. | 89 |
సీ. | తావులీనెడుగుజ్జుమావిమ్రాకులచెంతఁ బెనఁగొన్న గున్నసంపెఁగలసజ్ఙఁ | |
గీ. | నందముగఁ బొల్చునిద్దంపుఁజందమామ, ఱాలఁ గట్టినజాళువామేలితిన్నె | 90 |
వ. | అయ్యవసరంబున. | 91 |
సీ. | కురులు చిక్కులు విప్పి కొప్పు విప్పుగ దిద్ది యసదుకస్తురిబొట్టు నొసలఁ బెట్టి | |
గీ. | హారకేయూరకటకమంజీరకాంచి, కాంగుళీయకకర్ణపత్రాదివివిధ | 92 |
గీ. | నెచ్చెలులఁ గూడి వేడుక లచ్చుపడఁగ, నొచ్చె మొదవనిహాళిమైఁ బెచ్చు పెరిఁగి | 93 |
క. | చొచ్చి ఝణంఝువునినదస, ముచ్చయరంభాసమానమోహనకటకో | 94 |
చ. | చిలుకలఁ దోలి కోయిలలఁ జిందరవందర గాఁగ నేలికే | 95 |
గీ. | కప్పురము రేఁచి లతికానికాయ మూఁచి, పాదపము లెక్కి తియ్యనిపండ్లు మెక్కి | 96 |
సీ. | కనకాంగి నీనాసికకు జోక యగువీఁకఁ గనుపట్టుచున్నవి గంధిఫలులు | |
గీ. | ముగుద నీదంతముల కెన యగుపొగరున, మురువుఁ జూపుచు నున్నవి మొల్లమొగ్గ | 97 |
ఉ. | అప్పుడు జంగమేశ్వరుఁ డొయారము దద్దయు మీఱ వేడ్కతో | 98 |
సీ. | చిన్నారిమోమునఁ జిలుగుచెమ్మటఁ గ్రమ్మఁ గొనబాఱుపువ్వులఁ గోయుదాని | |
గీ. | నీటుమీఱంగ జిలిబిలిపాటఁ బాడి, బోటులకు సంతసం బెదఁ బూచుదాని | 99 |
చ. | కని యెనలేనికూర్మి మదిఁ గ్రమ్మఁగ నమ్మగ మిన్నమిన్నకా | 100 |
క. | అన్నుల నెందఱినేనియుఁ, గన్నులఁ జూచితిమి గాని గరుడాహిమరు | 101 |
గీ. | సకియనెమ్మోము పున్నమచందమామ, కలికికన్నులు వాలుగగండుమీలు | 102 |
గీ. | కలికి పదియాఱువన్నెబంగరుసలాక, గావలయు నెద్దిరా యట్లు గాక యున్న | 103 |
చ. | పగడము బంధుజీవకముఁ బంకజరాగము దాసనంబు లేఁ | 104 |
చ. | మొలకమిటారిగుబ్బలును ముద్దులు గారు మెఱుంగుచెక్కులుం | 105 |
సీ. | గజనిమ్మపండుల గజిబిజి యొనరించి మాలూరఫలములఁ గేలిసేసి | |
గీ. | మేలిరతనంపుబలుబొంగరాలఁ దెగడి, కనకధాత్రీధరేంద్రశృంగములఁ గేరి | 106 |
గీ. | బాలికామణిపెన్నెరుల్ బారెఁడేసి, చేడియలమిన్నకన్నులు చేరెఁడేసి | 107 |
చ. | నిలుకడఁ గన్నకార్మెఱుఁగు నిద్దపుఁబల్కుల నేర్చుకొన్నక్రొం | 108 |
ఉ. | అద్దిర నాకు దీనినెన రబ్బిన గొబ్బున గుబ్బదోయిఁ జే | 109 |
క. | అని పలుకుచు మెల్లన య, వ్వనితామణిఁ జేర నరిగి వలపులు నిగుడన్ | 110 |
క. | ఎవ్వితవు నీవు దవ్వుల, బువ్వులఁ గోయంగ వచ్చి పొలుపారడులే | 111 |
క. | కామునిఁబూజ యొనర్పన్, హైమవతీరమణునకు సమర్పణ యిడనో | 112 |
క. | కొమ్మలను గూడి క్రొవ్విరి, కొమ్మలపై నిమ్ముమీఱఁ గూరిమిమరునా | 113 |
క. | చెంగల్వలు వలెనో గొ, జ్జెంగులు గావలెనొ మంచిచేమంతులు సం | 114 |
క. | కొమ్మా కొమ్మా యిదె విరి, కొమ్మ కర మలసి సొలసి కోసితి నీకై | 115 |
క. | జిలిబిలిచెమ్మట మోమున, నలుముకొనం బొదలవింట నలసెద వేలా | 116 |
క. | నను లాఁతివానిగా నె, మ్మనమునఁ దలఁపంగఁ జనదు మానిని వేడ్కన్ | |
| నునుగప్పురంపువిడె మిది, గొనుమా యనుమాన ముడిగి కువలయనయనా. | 117 |
వ. | అనిన నేమియు మాతాడక గంగ యూరకుండినఁ దత్సఖీజనంబు లజ్జంగమ | 118 |
క. | ఎవ్వఁడవు రోరి నీ విపు, డివ్విధమున నాము మీఱి యేకతను వనిం | 119 |
క. | ఏరా గారా మారఁగ, నారాటం బెత్తి హత్తి యబలలఁ జెనకన్ | 120 |
వ. | అనిన వారివచనంబులు సరకుఁగొనక వెండియు జంగమేశ్వరుండు గంగం | 121 |
గీ. | పువ్వుబంతు లొసఁగవే పువ్వుఁబోఁడి, చిగురుటాకైన నీగదే చిగురుఁబోఁడి | 122 |
సీ. | కిన్నెర మీటి కన్గీటి సన్నలు సేయుఁ బకపక నగి యేలపదముఁ బాడుఁ | |
గీ. | దివిరి బతిమాలి దిక్కులు దిరిగి చూచు, నవలి కరుగుదోఁ ద్రోవ కడ్డవడి నిలుచు | 123 |
క. | క్రొమ్మావికొమ్మచివు రదె, కొమ్మా కొంగేల నందుకొమ్మా యని మే | 124 |
వ. | ఇత్తెఱంగున హొరంగునం జెలంగి మెలంగుజంగమపుంగవుం గనుంగొని యంగనా | 125 |
క. | మున్నెప్పుడుఁ గొమ్మలతో, నెన్నికగాఁ దిరిగినాఁడ వేమి బళా మేల్ | 126 |
క. | కొంచక ము న్నెందఱి భ్రమ, యించితివి గదా చెలంగి యీ వేసమునన్ | 127 |
సీ. | కరతాళగతు లెసంగఁగఁ దందనా ల్వాడి చొక్కుచుఁ జిందులు ద్రొక్కె దేమి | |
గీ. | కడిఁదియొయ్యార మేపార నడరి మంచి, విరులబంతులఁ దెమ్మని వేఁడె దేమి | 128 |
క. | అన విని జంగమఱేఁ డా, ననబోఁడుల నీసడించి నగుచుం గన్యా | 129 |
ఉ. | అంగన నిన్నుఁ గంటి నెఱియం గనుపండువు గాఁగ నేఁడు నీ | 130 |
క. | వెండియుఁ బైఁడియు నాయెడఁ, గొండలవలె నుండు మెండుకొని యెప్పుడు నో | 131 |
గీ. | ఎంతకన్నను నీడక న్నెఱుఁగకుండ, గరిమ నుండుదుఁ దలపువ్వు గందకుండ | 132 |
గీ. | అంబుజాక్షి కుబేరునియంతవాఁడు, బలియుఁ డొక్కఁడు చెలికాఁడు గలఁడు నాకు | 133 |
క. | మేనెల్లఁ దెల్లఁబాఱెను, గానంబడ దిప్పు డొక్కకన్నులకంబుల్ | 134 |
గీ. | అన్న మెన్నడు నెఱుఁగ నీయానఁ గన్ను, దెఱవ వెఱతును మంటచేఁ దెఱలుచుండు | 135 |
క. | పులికిని భూతంబునకున్, బలితపుమత్తేభేమునకుఁ బామున కెదలోఁ | 136 |
శా. | రావే మత్తచకోరచారునయనా రావే జగన్మోహినీ | 137 |
క. | మారుని నే మును గెలిచితి, వైరము దీర్పంగఁ బూని వాఁ డిపు డెదిరెన్ | 138 |
సీ. | కొమ్మ కొమ్మని కమ్మకెమ్మోవిపానకం బెమ్మెతో గ్రాలంగ నియ్యరాదె | |
గీ. | చిల్కుచిల్కునఁ దేనియల్ చీలుకఁ గులీకి, పలుకఁగారాదె సిగ్గు నిప్పచ్చరముగఁ | 139 |
క. | అగ్గలపువలపుసొలపులఁ, బెగ్గిలి నిను వేఁడుకొనెదఁ బ్రియమారఁగ నన్ | 140 |
క. | న న్నన్యుం గా నెన్నక, సన్నకసన్నగను గోర్కె సమకూర్పవె నీ | 141 |
వ. | అని యనేకప్రకారంబులఁ బ్రార్థించిన నమ్మించుఁబోఁడి యించుక తల వంచి | 142 |
క. | జంగమదేవర వని యొక, భంగిం దాగితిమి గాక బాపురె నిన్నున్ | 143 |
క. | అఱమఱ లేటికి మాతో, మఱిమఱిఁ గొఱగాని వెడఁగుమాటలు పలుకన్ | 144 |
చ. | సరిసరి మంచిజాణవె విచార మిఁ కేటికి నన్యకామినీ | 145 |
క. | తిరుసుక దినునీ వెంతెర, కర మరుదుగ నుదుటఁ గన్ను గలవాఁ డైనం | 146 |
క. | కావరమున మాచెలిపై, నీవిధమునఁ గన్ను వేసి యెలవించెద హా | 147 |
వ. | అనిన నజ్జోగిరాయండు వారల కి ట్లనియె. | 148 |
మ. | పలుచందంబుల వేఁడుకొన్న నకటా బాలామణిం గూర్పకే | 149 |
మ. | కలకంఠంబులు శారికల్ శుకములుం గాదంబముల్ భృంగముల్ | 150 |
వ. | అని పలికి వెండియు గంగం గనుంగొని. | 151 |
క. | ఉన్నవిధంబున వేఁడిన, సన్నక నన్నుఁ గనుకోర్కె సమకూర్పక హా | 152 |
క. | తాఱుచుఁ బూపొద లెల్లను, దూఱుచు బలితంపుఁజెట్లతుది కెక్కి వడిం | 153 |
క. | పలుమఱుఁ బతిమాలిన లోఁ, గలఁక వహించుకొని లోతు గనఁబడనీ కీ | 154 |
క. | విను విను నాపలు కిప్పుడు, వనజాకముఖీలలామ వాలెము నాతోఁ | 155 |
గీ. | అనినఁ జిఱునవ్వు లోలోన నడుచుకొనుచు, గంగ తనతళ్కుక్రొవ్వాడికలికిచూపు | 156 |
క. | భళిభళి సర్వజ్ఞుఁడవే, పలుకుల కింకేమి లాఁతిపడుచులవెంటన్ | 157 |
గీ. | పరసతీలోలుఁడవు నీవు బాళి మీఱ, నచలసంస్థితి సానుల నంటి తిరుగఁ | 158 |
గీ. | అని పలుకుచున్నచోఁ జెలు లద్దిరయ్య, జోలెజంగంబు నీ కింతజోలి యేల | 159 |
క. | అత్తఱి జంగమరాయఁడు, చిత్తము తత్తరముఁ జెందఁ జిడిముడి పడుచున్ | 160 |
వ. | చని యొక్కవివిక్తదేవతాగారంబున నుపవిష్టుండై యుండె నని సవ్యసాచికి గాం | 161 |
ఆశ్వాసాంతము
మ. | శరదిందూపమదేహ నిర్జితవిపక్షవ్యూహ కైలాసభూ | 162 |
క. | కరుణావరుణాలయ గిరి, శరణా శరణాగతార్తజనఘనభయసం | 163 |
మాలిని. | పురదనుజవిభంగా భూషితోద్యద్భుజంగా | 154 |
గద్యము. | ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితా | |