శ్రీశివ
శివతత్త్వసారము
(కంద పద్యములు)
క. |
శ్రీపతి వాక్పతి ముఖ్య మ
హాపురుషులు [1]నెరఁగనోప - రతి వాఙ్మనస
వ్యాపారమైన నీ నిజ
రూపము నే నిట్టిదని నిరూపింతు శివా![2]
| 1
|
క. |
ఒందంగ శివుని తత్త్వం
బందఁగ విజ్ఞానమే క-మజమణు చరమా
నందం బనియెడుఁగాని య
నిందితముగ నిట్టిదనఁగ - నేరవు శ్రుతులున్.[3]
| 2
|
క. |
ఇది గా దది గా దనియెడి
మొదలఁ బృథివ్యాదులైన - మూర్తుల నెల్లం
జదువుచు శివు నిన్నెఱుఁగక
వెదకుచు నున్నవి సమస్త - వేదాంతములున్.[4]
| 3
|
క. |
వాడేమి "యనంతావై
వేదా"యను వేదములు [5]వివిధ వివరములున్
వాదిడి వెదకెడి నన్న మ
హాదేవా! నిన్నెఱుంగ నన్యుల తలమే?[6]
| 4
|
క. |
నీ మూర్త్యాత్ముల నీ వని
ప్రేమముతోఁ గొలుతురెంత పెద్దలు నీ త
త్త్వామేయరూప మెఱుఁగుట
సామాన్యము [7]గాఁగఁజేసి సర్వానందా![8]
| 5
|
క. |
హరి సరసిజభవులాదిగఁ
బరమమునీంద్రులకు నెఱుఁగ భరమగు నీ ని
ర్భభూరిమహిమ వొగడఁగ
నరు లెంతటివా రనాథనాథ! మహేశా![9]
| 6
|
క. |
స్తుతనిజగుణకథనమునకు
నతిశయగుణకథన[10]మండ్రు రన్నిజగుణసం
|
|
|
గతి మున్నెఱుఁగక శివ! భవ
దతిశయగుణకీర్తి సేయ నెలవియె రుద్రా![11]
| 7
|
క. |
స్తుతియును నిందయు లోక
త్రితయంబున నీకు లేమి దెల్లంబగుటన్
మతిఁ దమకుఁ గృతార్ధత్వ
ప్రతిపత్తికి మిమ్ము జనులు బ్రణుతించు రజా![12]
| 8
|
క. |
ఓడక నినుఁ బొగడఁగ నా
యీడగుఁ గాదని తలంప కే వేదుఱనై
చూడవె పొగడెద [13]ననియెడు
వేడుక కారణముగాఁగ వెఱవక రుద్రా![14]
| 9
|
క. |
నే నొక నికృష్టమనుజుఁడ
మానసవచనాతిదూర మహనియ్యమహ
త్త్వానంద! నిన్నుఁ బొగడఁగ
నే నెంతటివాఁడ సురమునీంద్రవరేణ్యా![15]
| 10
|
క. |
పన్నుగ లజ్జింపక శివ!
నిన్నే బొగడెద ననంగ నేర్తునే దేవా!
|
|
|
విన్నపము వినుము సకలజ
గన్నాథ! యనాథనాథ కరుణాంబునిధీ![16]
| 11
|
క. |
దురిత హరమనియు శుభములు
దొరకొను ననియును దలంచి దురితారి! భవ
చ్చరణాబ్జభక్తి లలనా
పరవశభావమున నిన్నుఁ బ్రణుతింతు శివా![17]
| 12
|
క. |
గతదేహేంద్రియ [18]నిత్యా
స్వతంత్ర సర్వజ్ఞ విమల సర్వై గతైకా
ప్రతిమ సదానందాత్మక
మతి సూక్ష్మము నీ స్వరూప మతిలోకశివా![19]
| 13
|
క. |
సర్వేశ్వర! షట్త్రింశ
త్సర్వోపరిగతజగత్ప్రభవ హేతు జగ
న్నిర్వాణ సోమరూప మ
ఖర్వ మహత్త్వంబుఁ బొగడఁ గడునరిది శివా![20]
| 14
|
క. |
సరసిజభవ సరసిరుహో
దరులకు నటమీఁది మూఁడు దానధికము ము
వ్వురు నియమకారు లవ్వా
రరిది జగత్కర్త బాధ్యు లతిమహిము లజా![21]
| 15
|
క. |
శ్రీమత్సదాశివేశ్వర
నామ భవద్ధామముల మనంబునఁ దలఁపం
గా మఱి వాక్కునఁ బొగడం
గా మాకలవియె సమస్తకామాతీతా![22]
| 16
|
క. |
సర్వేశ్వర : కావున భవ
దర్వాచీనస్వరూపుఁ డనఁదగు శ్రీమ
త్పర్వతపుత్రీపతి మ
ద్గీర్విభవము శక్తి కొలదిఁ గీర్తింతు శివా![23]
| 17
|
షష్ఠ్యంతములు
క. |
జయమగు వేదంబులకును
జయమగు బంచాక్షరికిని జయమగు నిటలా
శ్రయమగు భసితంబునకును
జయమగు మాహేశ్వరులకు సంతతము శివా![24]
| 18
|
క. |
జయమగు శివమార్గమునకు
జయమగు శివసంహితలకు జయమగు గ్రీడా
|
|
|
మయులగు ప్రమథగణములకు
జయమగు వేదాది ధర్మచరితులకు శివా![25]
| 19
|
క. |
శివమగు ధార్మికనృపులకు
శివమగు గోబ్రాహ్మణులకు శివమగు మఱియున్
శివనిందావిరహితులకు
భువనత్రయజనుల కెల్లఁ బుణ్యంబు హరా![26]
| 20
|
పశుపాశపతిజ్ఞానము
క. |
జ్ఞానము పశుపాశపతి
జ్ఞానమయుని యట్లెఱుంగఁజాలని జడు ల
జ్ఞానులు వారల తత్త్వ
జ్ఞానము లజ్ఞానములు విచారింప శివా![27]
| 21
|
క. |
పతి రుద్రుఁడు పశువుల కని
శ్రుతి చెప్పుచు నునికిఁ జేసి రుద్రుఁడు పతి త
క్కితరులు పశువులు పొమ్మని
మతిలో నెఱిఁగితి శ్రుతిప్రమాణమున శివా![28]
| 22
|
క. |
పూని యతద్గుణ సంవి
జ్ఞాన బహువ్రీహి మాన్పఁ జనుదెంచిన యణ్
|
|
|
మానిత షష్ఠీతత్పురు
షానూనసమాన మెఱుఁగ రజ్జులు రుద్రా![29]
| 23
|
క. |
జీవు లనేకులు పశువులు
భావింపఁగఁ బ్రకృతి వికృతి బంధము పాశం
బావృతములనం బశువులు
నీ వా రెంటికిని బతివి నిరుప మహేశా![30]
| 24
|
క. |
పశుపతియ పాశములఁ దన
పశువులకును బంధమోక్షపద్ధతి సేయం
గుశలుఁడుగా కవి యొరులకు
వశవర్తులె? నేర్పు గలదె వారికి రుద్రా![31]
| 25
|
క. |
పశువులట! జీవరాసులు
పశుపాశంబులకు నీవ పతివఁట! శివ! నీ
|
|
|
వ శరణ్య మనంబశు దు
ర్వశభవ పాశములు తెగక వచ్చునె యెందున్.[32]
| 26
|
క. |
బ్రహ్మోక్త సమస్త హరి
బ్రహ్మాది పిపీలికాంతపశువుల కెల్లన్
బ్రహ్మోపేంద్రయశోహర
బ్రహ్మేశ్వర రుద్ర నీవ పతి వతిలోకా![33]
| 27
|
క. |
వేదోక్తమార్గమున న
త్యాదరమున నిన్నుఁ గొలిచి యప్పశువులు నీ
చే దేహపాశబంధ
చ్ఛేదంబున ముక్తులగుట సిద్ధము రుద్రా![34]
| 28
|
క. |
గోపతికృతమున భవపా
శాపేతములైన పశువు లట్ల భవత్ పా
శాపేతులైన పశువులు
ప్రాపింతురు మోక్షసుఖము పశుపతి నీచేన్.[35]
| 29
|
క. |
త్రిమలకృత దుఃఖ సంసా
ర మహాబ్ధి నిమగ్నజీవరాసులు నీ యు
|
|
క. |
త్తమ కారుణ్య వశంబున
విముక్తులై నీవపోలె వెలుఁగుదురు శివా![36]
| 30
|
అద్వైతమతఖండనము
క. |
జ్ఞానజ్ఞేయజ్ఞాతృని
దానత్రయమున బాధితప్రత్యయమై
నానాగతి నవగతమగుఁ
గాన జగద్భేద మెన్నఁగా సిద్ధ మజా!
| 31
|
క. |
భేదము దృష్టాదృష్టని
పాదకమై వైదికోక్తపథదర్శనసం
పాదన సమర్ధ మగుటను
భేద మదర్శనము ప్రమితి పిండితము శివా?[37]
| 32
|
క. |
భేదము సిద్ధంబగుడు వి
భేదకసిద్ధియగుఁ దద్విభేదకసిద్ధిన్
వేదోక్తకర్మ దశలం
చాదరమగుఁ దత్ఫలప్రదారాధ్యగతిన్.
| 33
|
క. |
ఆరాధ్యుడైన యీశ్వరు
నారాధించుటయ స్వర్గ మపవర్గము ధా
త్రీరాజ్యాదిసుఖంబులు
బోరన గర్మానురూపముల జనుల కగున్.
| 34
|
క. |
ప్రత్యక్షజగద్భేదము
సత్యంబై తోచుచుండ శబ్దంబునఁ ద
త్ప్రత్యక్షబాధ యగునని
యత్యనుచితవృత్తి నడుతు రద్వైతు లజా![38]
| 35
|
క. |
అమరఁగఁ బ్రపంచమిథ్యా
త్వమ సెప్పెడు వాది మున్ను దానికి సద్భా
వము దా నెఱుఁగక మిథ్యా
త్వ మనాశ్రయ మెట్లు జెప్పఁ దలపోయు శివా!
| 36
|
క. |
మానము చేత గృహీతము
గాని ప్రపంచ మ్మెఱుంగఁ గడు దుర్ఘటమౌ
మాన గృహీతము తథ్యమ
తా నెన్నఁడు మిథ్యగాదు తలపోయ శివా!
| 37
|
క. |
ఉత్తరశుక్తిజ్ఞానని
వృత్తంబగు శుక్తి రజితవేదనము క్రియన్
వృత్తజగద్భేదము చెడు
నత్తఱి నద్వైతు లెన్న రండ్రు మహేశా!
| 38
|
క. |
నిర్వచనీయము లేక య
నిర్వచనీయంబు గలదె? నిర్వచనీయా
నిర్వచనీయోత్పత్తి న
సర్వాద్వైతంబు చెడదె సర్వానందా!
| 39
|
క. |
జీవుఁడు శివుఁడను వాక్యము
భావింపఁగ నైక్యమునకుఁ బ్రతిపాదకమే
|
|
|
జీవుఁడు నీ పశుభృత్యుఁడు
గావున నీ వాఁడవేఱు గాదనుట శివా!
| 40
|
క. |
జీవునకు బంధమోక్షద
శావస్థలు గలవు నీకు నవి లే వగుటన్
జీవునకు నీకు నైక్యము
భావించుట ముఖ్యవృత్తి బాధకము శివా!
| 41
|
క. |
పరమేశ్వర్మ! నీకును మఱి
పరమక్లేశాత్ములైన పశుజీవుల కం
తరము మహాధాత్రీధర
పరమాణుల యంతరంబు భావింప శివా!
| 42
|
క. |
ఆత్మ నిరాకారుం డని
యాత్మన మది వెండి జగదుపాదానముగా
నాత్మీయ బుద్ధిఁ జెప్పెడి
యాత్మాద్వైతులు విమోహితాత్ములు రుద్రా!
| 43
|
క. |
మాతయు మానము మేయము
బ్రాతిగ మిథ్యయని పల్కు పాతి కులాత్మా
ద్వైతులు ప్రమాణశూన్యులు
నీతి యెఱుంగుదురె తత్త్వనిర్ణయము శివా!
| 44
|
క. |
తనకంటె వేఱ యీశ్వరుఁ
డన లేఁడని పలుకు నట్టి యద్వైతవిమూ
ఢునకును లోకాయతునకు
వినఁగా భేదంబు గలదె విష్ణువరేణ్యా!
| 45
|
క. |
ఏన పరమేశ్వరుఁడ న
జ్ఞానంబున నిన్ను నెఱుఁగఁజాలన యను వి
|
|
|
జ్ఞానవిహీనాత్ముల (చెడు)
[39]పానలు వో విడిచి నిన్నె భజియింతు శివా!
| 46
|
క. |
జ్ఞానస్వరూపుఁ డీశ్వరుఁ
డేనిసి వితర్కింప నట్టి యీశ్వరునకు న
జ్ఞానము దొరకొనఁ దని తా
ర్కాణం బదియేల చేయ రద్వైతు లజా!
| 47
|
క. |
తా రద్వైతులు సచ్చి
త్కారణ సర్వజ్ఞ సర్వగత నిత్య నిరా
కారుఁడని చెప్పి వెండియ
కారణమ యవిద్య నీకుఁ గల్పింతు రజా!
| 48
|
క. |
కలదన నోపక లేదని
పలుకఁగ నేరకయు మూకబధిరులక్రియ ని
మ్ముల నద్వైతులు తమలో
పల వగతురు భువనభిన్నభావమున శివా!
| 49
|
క. |
ఆరాధ్యుం డారాధకుఁ
డారాధక మనఁగ లేని యద్వైతదురా
చారకృతసర్వశూన్యా
కారస్థితి నేమి సేయఁగా వచ్చు శివా!
| 50
|
క. |
పాతకము సకలనాస్తిక
జాతనివాసంబు సర్వసంకర మాత్మా
ద్వైతం బనఁగా జగదు
త్పాతము దొరకొనునె యిట్లు పరమానందా!
| 51
|
క. |
నిత్యమహాజనదూష్యము
ప్రత్యక్షాదిప్రమాణబాధాబాహ్యం
బత్యనుచిత మద్యైతము
కృత్యాకృత్యాదిశూన్యకీటకము శివా!
| 52
|
క. |
అద్వైతమ్ము పురాతన
విద్వన్మునివరుల కెల్ల విద్విష్టము సా
క్షాద్వేదోక్తము గామిని
సద్విద్వద్ద్వైతులకు నసహ్యంబు శివా!
| 53
|
క. |
ప్రాజ్ఞులు వేదజ్ఞులు లో
కజ్ఞులు చేకొండ్రె [40]గతశిఖాగాయత్రీ
యజ్ఞోపవీతనాస్తికు
లజ్ఞులు చేకొండ్రుగాక యద్వైత మజా!
| 54
|
క. |
స్వేచ్ఛాచారులు మిథ్యా
విచ్ఛేదనవేదశాస్త్రవిప్లవవాదుల్
ప్రచ్ఛన్నదోషు లజ్ఞా
నాచ్ఛాదితదుష్టచిత్తు లద్వైతు లజా!
| 55
|
క. |
కమలాక్ష కమలగర్భ
ప్రముఖాఖిల సురలు మునులుఁ బాశుపతులు భ
స్మమయాంగజటారుద్రా
క్షమాలికాధరులు కాని కా రద్వైతుల్.
| 56
|
క. |
పాతక యధేష్ట దుష్ట
వ్రాత జగద్విప్రలంభవాదమ కా క
ద్వైతము శిష్టవ్రాతగృ
హీతమె కలికాలకలుషహేతువ కాదే!
| 57
|
క. |
ము న్నద్వైతవ్యామో
హోన్నతిని సనత్కుమారుఁ డుష్ట్రం బయ్యెన్
మన్నింపక దూర్జటి నని
యెన్న న్వినరయ్య నందికేశ్వరుచేతన్!
| 58
|
క. |
ప్రీతిం దన కూఁతున క
ద్వైతమహామోహయుక్తి వనజజుఁ డతికా
మాతురుఁడైఁ త్రెళ్ళఁడె వి
ఖ్యాత మృగవ్యాధ రుద్ర కరశర నిహతిన్.
| 59
|
క. |
వెండియు నభేదమతిఁ గన
కాండజుఁ డీశ్వరుఁడ నేన యనవుఁడు సద్యః
ఖండిత పంచమ శిరమును
రుండలబుగఁ జేసెఁ గాలరుద్రుం డతనిన్.
| 60
|
క. |
ముందటి జలజాసన త
న్నందనులన చెప్పనేల నాస్తిక్యము మై
నెందఱు సెడ రద్వైతులు
కొందలమున దుష్ప్రబోధ కుత్సితవృత్తిన్.
| 61
|
క. |
నీ యైశ్యర్యాద్వైత మ
నీయద్వైతమని దుర్వినీతులు కొందఱ్
|
|
|
పాయక వేదాంతాభి
ప్రాయముఁ గడుఁ దప్పఁ జెప్పి పఠియింతు రజా![41]
| 62
|
క. |
సర్వము నీ యాధీనమ
సర్వేశ్వర! కాన గుణవిచారితవృత్తిన్
సర్వంబు నీవ యను శ్రుతి
నిర్వాహము బొంద నేర్చు నిత్యానందా!
| 63
|
క. |
అద్వైతైకస్థితి నీ
యద్వైతమ గాన యీశ్వరాద్వైతము స
ర్యాద్వైత మనఁగ వేఱు జ
గద్విపరీతమగు తత్త్వగతి గలదె శివా!
| 64
|
క. |
ఇది గాదని శ్రుతి చెప్పిన
నది గ్రమ్మఱన నీ స్వరూపమని చెప్పెడి దు
ర్మదులగు మాయావాదుల
చదువులు వోవిడిచి నిన్నె వదలెద రుద్రా!
| 65
|
క. |
మాయావాదుల ముందఱ
మాయావాదు లటె వారిమార్గముఁ గీడి
|
|
|
స్సీ యని యొల్లక రోసి 'శి
వాయ నమో' యనుచు నిన్నె వలగొండ్రు శివా![42]
| 66
|
జగత్కర్తృవిచారము
క. |
ఏ నిశ్చయపరుఁడను నీ
శానుఁడు నా స్వామి యనుచు సంతతమును సం
త్రాణగతి స్వామి భృత్య
జ్ఞానంబున నిన్నె గొల్తు సర్వానందా!
| 67
|
క. |
క్షణిక మచేతన మది ని
గ్గుణము జగత్కార్యకరణకుశలం బగునే
గణనాతీతమహాగుణ
గణకృత్యవిహీనమైన కర్మము గలదే!
| 68
|
క. |
పరికింప నచేతనములు
పరమేశ్వర మది ప్రధాన పరమాణ్వాదుల్
పురుషుఁడు చేతనుఁ డయ్యును
కర మజ్ఞుఁడు గాన కర్త కాఁజాలఁ డజా!
| 69
|
క. |
అవయవయుతములు గావున
నవీన ప్రముఖంబులగు మహాభూతంబుల్
వివిధ వితర్క విచారణ
సవశ్యమును గార్యములు మహామహిమ శివా!
| 70
|
క. |
శ్రీనాథవంద్య! కర్తృవి
హీనంబై యున్న కార్య మెందును గలదే
కాన జగత్కార్యమునకు
గాన ప్రియ! నీవ యాదికర్తవు రుద్రా!
| 71
|
క. |
కర్మ మచిత్తని కర్తయుఁ
గర్మాధీనుఁ డని విడిచి కర్మల మొదలం
గర్మఫలదాయి నిన్ను న
కర్మాధీనస్వతంత్రుఁ గని కొలుతు శివా!
| 72
|
క. |
శ్రుతిబాహ్యంబులు గావున
సతతంబును జైన బౌద్ధ చార్వాకుల దు
ర్మతములు వట్టక పట్టితి
శ్రుతి సార భవన్మతంబు సుమతి మహేశా!
| 73
|
క. |
కమలజ కమలోదర రు
ద్ర మహేశ్వర శాంత్యతీత తత్త్వాధిపతి
ప్రముఖోర్ధ్వబిందునాద
క్రమతత్త్వా! నిన్ను [నెట్లు] గని కొల్తు శివా!
| 74
|
క. |
నె(ఱ)సిన గురుప్రసాదము
వ(ఱ)లఁగ జగదేక సకలవల్లభు డాదిం
గ(ఱ)కంఠుఁడ వేల్పని ని
న్నె(ఱి)గితి నీ మహిమ యెఱుఁగ నేమియు రుద్రా!
| 75
|
క. |
అండంబులు గావింపను
వెండిఁ బ్రతిష్ఠింపఁ జె(ఱు)ప విష్ణ్వాదులు ను
|
|
|
ద్దండితశక్తిసమేతులు
చండీశ్వర వరద! నీ ప్రసాదమున శివా!
| 76
|
క. |
కీర్తింపఁగ లోకములకుఁ
గర్తలు విష్ణ్వాదులయ్యు గా రాది మహా
కర్త భవత్ప్రేరితులై
వర్తిల్లుట గారణముగ వారలు రుద్రా!
| 77
|
క. |
నారాయణాదులకు సం
సారిత్వము దెల్ల మెల్ల శాస్త్రంబులఁ ద
త్కారణమునఁ దత్కృతము వి
చారింప భవత్కృతంబు సర్వానందా!
| 78
|
క. |
ఆర్యేశ్వర! తమ చేసెడి
కార్యము లందెల్లవారు కర్తలు గారే
కార్యకరణత్వమాత్ర న
వార్యజగత్కర్త లనఁగవచ్చునె వారిన్.
| 79
|
క. |
తన తెగిన తలయు మడిసిన
[43]తనయునిఁ బుట్టింపఁ గావఁ దారోపని యా
వనజాసన కేశవులకు
జననస్థితికర్తృతాదిశక్తులు గలవే![44]
| 80
|
భవానీశబ్దవివృతి
క. |
ప్రవితత షట్త్రింశత్త
త్త్వవితానంబులకు నుద్భవస్థానం బై
|
|
|
నివుడు రజోగుణ సంగతి
భవుఁడను నామంబు నీకుఁ బరగు మహేశా![45]
| 81
|
క. |
మడి యిల్లు తత్త్వముల వెనుఁ
బడక నిజాజ్ఞాప్రశస్తి భావింపఁగఁ జొ
ప్పడు సాత్త్వికగుణసంగతి
మృడుఁడను నామంబు నీకు మేలిల్లు శివా!
| 82
|
క. |
పరపగు తత్త్వములుఁ జరా
చరవితతులు సంహరింపఁజాలిన యతిభీ
కరతామసగుణసంగతి
హరుఁడను నామంబు నీకు నమరు మహేశా!
| 83
|
క. |
పరమస్వతంత్ర నిర్మల
పరమానందాత్మ పరమభట్టారక ని
స్తర నిస్త్రైగుణ్య మహ
త్తరరూపంబున శివాభిధానం బయ్యెన్.
| 84
|
జగత్కర్తృలక్షణము
క. |
పరమస్వతంత్రుఁడై, య
క్షరుఁడై, సర్వజ్ఞుడై, వికారరహితుఁడై,
కరుణాకరుఁడై, స్థిరుఁడై
వరద! జగత్కర్త యుండవలదె మహేశా!
| 85
|
క. |
పరివిశ్రుత సచరాచర
భరితానేకాండమగుఁ బ్రపంచంబులకున్
|
|
|
బరమస్వతంత్ర శంకర
కరుణాకర నీవ యాదికర్తవు రుద్రా!
| 86
|
క. |
భువనోత్పత్తి స్థితి లయ
వివిధవ్యాపారముఖ్యవిభుఁడవు పశుబం
ధవిమోక్షదక్షుఁడవును [46]వ
రవరప్రదుఁడవును నీవె రాజాభరణా!
| 87
|
క. |
పరమాత్మ పరబ్రహ్మము
పరమేశ్వరుఁ డనఁగ నామపర్యాయంబుల్
హరునికి మ(ఱి)యుఁ దత్త్వాం
తరవాచకములని పలుకఁదగదు మహేశా!
| 88
|
క. |
పరమాత్మ పరబ్రహ్మము
పరమేశ్వరుఁ డనఁగ హరియుఁ బ్రహ్మయును బరా
పరవిభులు గారు శాస్త్రము
లరయఁగ జీవాత్ము లగుట నందఱు రుద్రా!
| 89
|
క. |
పర శబ్దంబున కర్థం
బరయఁగ నుత్కర్ష మంద్రు రయ్యుత్కర్షం
బొరులకు గలుగునె శివ! నీ
కరణి మహాదేవుఁ డొరుఁడు గలఁడే జగతిన్.
| 90
|
క. |
ఖరకర పద్మజ రుద్రాం
బురుహోదర ముఖ్య దివిజపుంగవ సచరా
చరభూతనికర పంచా
వరణంబులు గొల్వ నుండువాఁడవు రుద్రా!
| 91
|
క. |
ఏమని చెప్పుదు శంకర !
నీ మహిమాడంబరంబు నిఖిలాజాండ
స్తోమములు బ్రకృతి నీ యి
చ్ఛామాత్రనె పుట్టునటె యసంఖ్యాతములై.
| 92
|
క. |
త్రిమలములును రాగద్వే
షములును [జన్మంబు] గర్మసంస్కారంబుల్
గమనాగమకాదులు నను
సమస్తమును లేవు నీకుఁ జంద్రాభరణా!
| 93
|
క. |
పతి సదృశాదిక తాప
త్రితయ గుణత్రితయ జన్మ మృతి సుఖదుఃఖ
క్షతవృత బంధ[న]మోక్ష
స్తుతి నించాదులును లేవు ధూర్జటి! నీకున్.
| 94
|
క. |
ఓలిన దేవ! యవిద్యా
కాలకళానియతి వికృతి కార్యా కార్యాం
భీలాబాంధవ బాంధవ
మాలాబంధములు లేవు మఱి నీకు శివా!
| 95
|
క. |
అంచితమతి నెవ్వరు ని
ర్మించిరె గుంచిత సురలు [47]నివృత్త్యాదికళా
పంచకసంచితమైన ప్ర
పంచము నీ యట్ల రుద్ర! పరమానందా?
| 96
|
క. |
వేదాద్యష్టాదశవి
ద్యాది మహాకర్త నీమహత్త్వము వొగడన్
శ్రీదయితావల్లభ వా
ణీదయితావల్లభులును నేరరు రుద్రా!
| 97
|
క. |
స్వర్గాపవర్గసుఖము ని
రర్గరళసామ్రాజ్యసుఖము నాత్మజవిద్యా
వర్గాది లోకసుఖములు
భర్గ! భవత్పాదభక్తి ఫలములు రుద్రా!
| 98
|
శివభక్తి వివరణము
క. |
ఒక్కం డీశ్వరుఁ డని మరి
నిక్కముగా నెఱిఁగి భక్తినిష్ఠావృత్తిన్
ముక్కంటి! నిన్నుఁ గొలిచిన
దిక్కక [48]దొరకొనె సమస్తదివ్యసుఖంబుల్.
| 99
|
క. |
భక్తి నినుఁ గొలువవలయును
భక్తియు ధర్మువునఁ గాని ప్రభవింప దతి
వ్యక్తముగ ధర్మువును వే
దోక్తముగ నెఱుంగవలయుఁ దుదిని మహేశా.
| 100
|
క. |
వేదోక్తసదాచారా
పాదనమున నెగడు నట్టి పశువులకు బురా
పాదితదురితక్షయమై
యాదరమున ధర్మ మధిక మగు నీశానా!
| 101
|
క. |
ధర్మాధిక్యంబున నతి
నిర్మలబోధయు విరక్తి నిష్ఠయుఁ గలయ
క్కర్ములకు నీప్రసాదము
పేర్మిని శివభక్తి పుట్టు పృథుభావమునన్.[49]
| 102
|
క. |
శివభక్తి సకలధర్మ
ప్రవర మహాధర్మ మగుటఁ బరికింపఁగ భా
గ్యవిహీనులగు దురాత్ముల
కవశ్యమును సంభవింప దతిలోకశివా![50]
| 103
|
క. |
మానితశివభక్తి శివ
జ్ఞానధ్యానముల నీ ప్రసాదాతిశయా
నూనితగర్మక్షయమై
యానందప్రాప్తిముక్తుఁడౌ మనిషి శివా![51]
| 104
|
క. |
నరసురతిర్యక్సచరా
చరజీవుల కెల్ల భక్తి సంభావన నీ
కరుణ ప్రధానమ ముక్తికి
వరుసన యనలేదు భావవశ్యుఁడ వగుటన్.[52]
| 105
|
క. |
నరకస్థులు స్వర్గస్థులు
నరతిర్యగ్గర్భ యేవన స్థాదిపశూ
త్కరములు భవత్ప్రసాద
స్ఫురణము దొరకొనుడు ముక్తి బొందుదురు శివా![53]
| 106
|
క. |
అరుదుగ భవత్ప్రసాదము
దొరకొను శివభక్తి గాన దుస్తరభవ ని
ష్ఠురదుఃఖసముద్రసము
త్తరణవహిత్రంలు భక్తి దానయ్యె శివా![54]
| 107
|
క. |
నియతమగు సకలపుణ్య
క్రియ లెల్లను భావశుద్ధికిని హేతువు ల
క్షయభాతి భావశుద్ధియు
గ్రియఁగొన నీ పాదభక్తికిని హేతు వజా![55]
| 108
|
క. |
అతిగుహ్యంబుల కంటెను
నతిగుహ్యతరంబు శివుని యందుల భక్తి
స్థితియని మోక్షార్థులు దృఢ
మతిఁ గొలుతురు దేవ! నిన్ను మనుజులు ప్రీతిన్.
| 109
|
క. |
జలజాసనాచ్యుదాద్యమ
రులకును [నిది యిట్టిదని] నిరూపింపఁగ న
గ్గలమగు నీ నిజరూపముఁ
దొలఁగఁక నీ భక్తు లెఱుఁగుదురు సర్వజ్ఞా!
| 110
|
క. |
వసుమతిఁ జిత్రమ జితచి
త్త సంభవా "నకర్మణాన తపసా నజపై!
న్న సమాధి భి" రవ్యయ నీ
యసదృశభక్తికినిఁ బ్రియుఁడ వగు దీశానా!
| 111
|
క. |
[56]వేయేమి తోడఁ బలుకుదు
పాయక నినుఁ గొలుచు నచలభక్తులఁ గని "య
య్యా" యని పిలిచిన నంబి కి
"నో" యని యెఱుఁగీవె తొల్లి యురగాభరణా!
| 112
|
క. |
శివభక్తి లేక చేసిన
వివిధాధ్వరముఖ్యసకలవేదపురాణా
దివిహితకర్మవికాసము
లవి యెల్లను నిష్ఫలంబు లగు నీశానా!
| 113
|
క. |
భక్తియ ముక్తి తెరువు వి
ధ్యుక్తముగ నమేయప్రియచతుర్వేదా 'మ
ద్భక్తశ్చ శుచీ' యను నా
సూక్తిఁ బ్రధానంబుగాఁ బశూత్తముల కజా!
| 114
|
భక్తుల మహిమ
క. |
కొనునది భక్తుని చేతనె
ధన మతనిక యిచ్చునదియు "తస్మైదేయం"
బనియును "తస్మాద్గ్రాహ్యం"
బనియును గలదనిరి వేదభక్తి విధిజ్ఞుల్.
| 115
|
క. |
కథ లేటికి "నచపూజ్యో
యథాహ్యా హ"మ్మనిన విధి యథార్థముగా మ
|
|
|
న్మథమర్దన! నీ భక్తులు
బ్రథితంబుగ నీవ కాఁగ భావింతు శివా!
| 116
|
క. |
అతిమూఢుం దతిపతితుఁడు
నతిదుర్జను డనఁగ వలవ దతిశయభక్తి
స్థితి నెగెడునేని నాతం
డతిపండితు డతిపవిత్రుఁ డతిసుజనుఁ డజా!
| 117
|
క. |
అనయము రుద్రాక్ష విభూ
తినియుక్తుల యిండ్లదిక్కుదెసఁ బోవకుఁడో
యని చాటించును గాలుఁడు
తనపురి శివశాసనుండు ధన్యుం డగుటన్.
| 118
|
క. |
ఒండేమి భక్తి సంగతిఁ
జండాలుండైన భూతి శాసనధరుఁడై
యుండినఁ బూజ్యుఁడె యతనిన్
ఒండనఁగాఁ జనదు భక్తి యోగమున శివా!
| 119
|
క. |
విను పరుసవేది సోకిన
యినుముక్రియ న్నిన్నుగొలిచి యెవ్వండైనన్
ద్రినయన! యుత్తముఁ డనఁబడు
పొనరఁగ శివభక్తుఁ డగ్రపూజ్యుం డగుటన్.
| 120
|
క. |
అవిచారంబున నెప్పుడు
శివశాసనపూజనంబుఁ సేయఁగ వలయున్
శివభక్తులఁ గని జాత్యా
ది విదారము విడువవలయు దృఢభక్తి మెయిన్.
| 121
|
క. |
తెవులును లేమియు భయమును
శివభక్తులకైన యెడలఁ జేకొని రక్షిం
|
|
|
పవలయు బ్రియములు సేయఁగ
నవశ్యమును వెలయు వారి కాత్మ విధమునన్.
| 122
|
క. |
శివశాసనపూజనమున
శివుఁ డెంతయుఁ బ్రీతుఁ డగుటఁ జేసి శివప్రీ
తివిధానము కారణముగ
శివశాసనపూజనంబు సేయఁగ వలయున్.
| 123
|
క. |
శివలాంఛనుఁడగు మా
నవుఁ గనుఁగొని మునిఁగిలేచిన విధమునం జి
త్తవికాస మదర సత్క్రియ
లవశ్యమును జేయవలయు నతిలోకశివా!
| 124
|
క. |
శివశాసనుఁడగు రుద్రా
క్ష విభూతి దృఢాంగుఁ జూచి సన్మతి సాక్షా
చ్ఛివుఁడను నదియ విచారము
శివునాజ్ఞయు నగుట శాస్త్రసిద్ధం బగుటన్.
| 125
|
క. |
కులవిద్యాచారాదులు
దలఁపక నీవలని భక్తితాత్పర్య మెడం
గల మానవుఁడు సమస్తముఁ
గలవాఁడని పూజసేయఁగా వలయు శివా!
| 126
|
క. |
ధరణిఁ గులరూపవిద్యలు
బరఁగి భవద్భక్తి లేని పాలసుఁడు గడుం
బరిమళములేని కుసుమము
గర మొప్పనిభంగిఁ గొఱయుఁ గాఁడు మహేశా!
| 127
|
క. |
ధర నెట్టివాని కనిమొన
బిరుదునక జయంబుగాక పిఱిఁదికిఁ గలదే!
హర! నీభక్తిని దుస్తర
దురితంబులు దొలఁగుఁగాక తొలఁగునె యొంటన్.
| 128
|
క. |
జాత్యాది సూతకంబులు
హత్యాది సమస్తపాతకాదులు శివ! నీ
భృత్యులఁ బొందునె జలములు
నిత్యస్థితిఁ బొంద నేర్చు నే జలజములన్.
| 129
|
క. |
ఎట్టి కడుఁగీడు కులమునఁ
బుట్టియు శివ! నిన్నుఁ గొలిచి పూజ్యఁడ మనుజుం
డట్టిద ధర్మువు రొంపిం
బుట్టియుఁ బద్మంలు సాలఁ బూజ్యము కాదే!
| 130
|
క. |
నీ నిజభక్తుం డంత్యజుఁ
డైనఁ బవిత్రుండు పూజ కర్హుఁడు జగతిన్
"తేనసహ సంపసే” త్తని
గానప్రియ! శ్రుతులు మ్రోయుఁ గాన కపర్దీ!
| 131
|
క. |
మసి కప్పడమునఁ బొరివిన
యసదృశమాణిక్య మెట్టు లట్టుల దుర్జా
తిసమావృతుఁ డయ్యును నీ
కు సదాభక్తుఁడగు మనుజకుంజరుఁడు శివా!
| 132
|
క. |
కులవిద్యాచారాదులు
గలవాఁడే శివుని భక్తి గలవాఁడైనన్
వెలగలదె పసిఁడి గమ్మఁగ
వలచిన విధమున సమస్తవరదాత శివా!
| 133
|
క. |
కులజ కులహీను లిద్దఱు
నెలకొని భవదచలభక్తినిష్ఠావృత్తిన్
వెలసినమీద సమానుల
కులజులుఁ గులహీను లనఁగఁ గూడదు వారిన్.
| 134
|
క. |
ముందటి పసిఁడిన పోలును
సుందరముగ బరుసవేది సోఁకిన యిను మా
నందస్వరూప! శివ! నిను
చెందిన దుర్జాతిఁ దొంటి శ్రేష్ఠమ పోలున్.
| 135
|
క. |
జనపతి శాసనధరులం
గని భయమునఁ గులము రోయకయు సత్క్రియలం
దనుపుక్రియ నిర్విచారం
బున నీ శాసనము వలయుఁ బూజింప శివా!
| 136
|
క. |
గుణవత్పాత్రులఁ బూజిం
చిన శాసనపూజఫలము సేకుఱదని శా
సనపూజ నిర్విచారం
బునఁ గావింతురు భవత్ప్రభూతాజ్ఞ శివా!
| 137
|
క. |
శివభక్తుల నావారే
శివభక్తులవాఁడ ననుచుఁ జిత్తానందో
త్సవగతి నెగడెడు మనుజుఁడు
శివ! నీ వొండొరుఁడు గాఁడు జితసంసారా!
| 138
|
క. |
భక్తుల ప్రసాద మెప్పుడు
భక్తుల నాకేడు గడయు భక్తుల గతి యే
భక్తుల వరవుఁడనని శివ
భక్తులఁ గొనియాడవలయు భక్తులకు శివా!
| 139
|
క. |
భక్తుల దవ్వులఁ గని శివ
భక్తులు వచ్చిరని పొంగి బ్రతికితినని పో
భక్తుల కెదురేగి యథా
శక్తిస్థితిఁ జేయవలయు సత్క్రియలు శివా!
| 140
|
క. |
భక్తుఁడు లోకహితార్ధుఁడు
భక్తిహితార్థుండు శివుఁడు భావింపఁగ నీ
యుక్తి యథార్థమ్మని నీ
భక్తులఁ బూజించవలయు భక్తులకు శివా!
| 141
|
క. |
లోకానుసారికిని శివ
లోకము దొరకొనదుగాన లోకము నెమ్మిం
చేకొనక విడిచి శివ! నీ
లోకము గావలయు భక్తిలోలుఁడు రుద్రా!
| 142
|
క. |
లోకము విడువనివానిని
లోకము విడువదని విశ్వలోకేశ్వర! నీ
లోకముఁ గోరెడు మనుజుఁడు
లోకము వోవిడుచు నీవ లోకముగ శివా!
| 143
|
క. |
గురుఁ డాది దనకు గఱపిన
వెరవునఁ జని మీఁద భక్తి వేదించిన న
గ్గురువుతము గడచి చేసిన
పరవశుఁడై మఱవవలయు భక్తుం దన్నున్.
| 144
|
క. |
హర! నీ భక్తి నిషేధక
చరితలు వోవిడిచి నిన్నె చనఁ గొలిచి నిరం
తరభక్తుఁడై శివైక్యుఁడు
నిరాణ(ళ) యగు పసిఁడివోలె నిలువఁగ వలయున్.
| 145
|
క. |
కలనైన నొండు దైవము
గలదనియెడు పలుకుదక్కి కలఁడొక్కఁడ కే
వల శివుఁడె దైవమని ని
శ్చలభక్తి శివైక్యుఁ డుండు సంతతము శివా!
| 146
|
క. |
పరువడిన "యోన్యదైవ
స్మరణ సకృ" త్తనఁగ నన్యసంస్కరణము నం
దిరువదియెనిమిది గోటులు
నరకంబులఁ బొం దనాథనాథ! మహేశా!
| 147
|
క. |
కర్తయని నిన్ను నెఱిఁగినఁ
గర్తింపఁడు వెండి తన్నుఁ గార్యాకార్యా
వర్తనల గర్త నేనని
కర్త ప్రధానుండు గాన ఘనభక్తుఁ డజా!
| 148
|
క. |
వ్యక్తముగ లింగతనుఁ డను
యుక్తి యెఱుంగుటకుఁ జాల నుత్కృష్ట మగున్
భక్తైకతనుఁడు శివుఁ డను
యుక్తి యెఱుంగుట సమస్తయోగానందా!
| 149
|
క. |
భక్తి కనుదేహభావ
వ్యక్తుడవని నిన్ను నమ్మి వదలక భక్తిన్
భక్తులు నీవని కొలిచిన
భుక్తియు ముక్తియును బడయఁ బోలు మహేశా!
| 150
|
క. |
శివుఁడు పరిపూర్ణుఁడను మది
శివభక్తులు జూచి యతివిశేషప్రీతిన్
వివిధసపర్యలఁ దనిపిన
నవశ్యమును దానఁ బ్రీతి యగు నీకు శివా!
| 151
|
క. |
నిన్నుఁ గని తన్ను జగమును
బన్నుగ మఱవంగవలయు భక్తునిఁ గని యా
నిన్నును మఱవఁగ వలయు జ
గన్నత భక్తుండు నీవ కాఁ దెలిసి శివా!
| 152
|
క. |
జంగమ లింగంబగు భ
క్తుండని పూజింపఁడేని గోటివిధములన్
లింగార్చన చేసిన వృథ
జంగమ ముత్తమము గాఁగ స్థావరమునకున్.
| 153
|
క. |
చూడఁగ శివభక్తునిఁ గని
వేడుకఁ గొనియాడఁ డేని వృథ యాతని మి
థ్యాడంబర దేవార్చన
యోడునఁ బోసిన జలంబుయుక్తి మహేశా!
| 154
|
క. |
శివభక్తులఁ బూజింపక
శివపూజలు గోటివిధులఁ జేసిన వృథ యా
శివభక్తులఁ బూజింపుట
శివపూజలులు గోటివిధులఁ జేయుట రుద్రా!
| 155
|
క. |
క్రియగొన జంగమలింగము
నియతిం బూజింపఁ డేని నిష్ఫలములు స
త్క్రియలునుఁ బూజలు "లింగఁ
ద్వయం సమాఖ్యాత" మనిన వాక్యము మ్రోయున్.
| 156
|
క. |
ఇంటికి భక్తులు వచ్చినఁ
గంటిమి మంటిమని వారి కాళ్ళులు గడుగన్
మంటఁ గని సీతువాసిన
కంటెను దురితములు వాయుఁ గఱకంఠ! శివా!
| 157
|
క. |
రుద్రాక్షభూతిభూషణ
ముద్రాంకితు నెదురుగన్న ముదమున సాక్షా
ద్రుద్రుఁ డని తలఁపఁడేని [57]శి
వా ద్రోహుఁడు నరకగామి యగును మహేశా!
| 158
|
క. |
హరి పద్మజ వాసవ ని
స్తరవిభవములనుఁ దృణీకృతము లనిన మహే
శ్వర! నీ దృఢభక్తులకును
సురనరవిభవంబు లెంతచోద్యములు శివా!
| 159
|
క. |
అసమాణిమాది గుణరస
రసాయనమ్ములును నిఖిలరాజితరాజ్యా
ది సుఖంబులు శివసుఖమున
కసమానము లండ్రు నీ శివైక్యులు రుద్రా!
| 160
|
క. |
ఆకాశము వొడగెగసిన
భూకంపంబైనఁ బంచభూతప్రళయ
వ్యాకుల మైనను మఱచి శి
వైక్యుఁడు నిను విడిచి యొండు లాలింపఁ డజా!
| 161
|
క. |
కులగిరులు జిర్ఱఁ దిరిగిన
జలరాసులు మేరదప్పి చనుదెంచిన నీ
వల నెఱిఁగిన దృఢభక్తుఁడు
చలియింపఁ డపారఘోరసంసారమునన్.
| 162
|
క. |
దిక్కులు వీడ్వడి కలసిన
దిక్కరులు మదంబు డిగ్గి తిరిగిన మఱి నీ
|
|
|
దిక్కెఱిఁగిన దృఢభక్తుఁడు
పక్కండెవ్వరికిఁ గార్యభారమున శివా!
| 163
|
క. |
భూచలము తల్లడిల్లినఁ
బాతాళము బయలువడ్డ బ్రహ్మప్రళయం
బేతెంచిన నీ భక్తుఁడు
చేతులు ద్రిప్సకయ పూజ సేయును రుద్రా!
| 164
|
క. |
వేయేటికిఁ బ్రాణంబులు
వోయినఁ దమతలలు తెగిన భువిభక్తులు ని
న్నాయతమతి నభ్యర్చన
సేయక కుడువరు ద్రిలోకసేవితచరణా!
| 165
|
క. |
ఆయుధములుఁ గుసుమము లగు
నాయబ్టులు మెట్టలగు మహామదగజముల్
వేయేల గండశిలలగుఁ
బాయక నినుఁ గొలుచు నచలభక్తులకు శివా!
| 166
|
క. |
అధమము నత్యుత్తమ మగు
నధర్మమును ధర్మ మగును నాగమనిధి స
ద్విధి యగు నిషేధమునుఁ జం
ద్రధరా! భవదీయభక్తితాత్పర్యులకున్.
| 167
|
క. |
క్షుత్తృష్ణాది విపత్తులు
[58]బత్తళి జలతపనశీతవాతాదులును నే
ద్వృత్తగతిఁ బొంద వెఱచు ను
దాత్తభవద్భక్తియుక్తు లగువారి శివా!
| 168
|
క. |
పరపరివారిత్వము ని
ష్కరుణత్వము నిత్యయాచకత్వము నతిని
ష్ఠురకర్మత్వము నెన్నఁడుఁ
బొరయవు నీ భక్తవరులఁ బురసంహారా!
| 169
|
క. |
మరణ పునర్భవతా దు
శ్చరిత్రతా దుర్ముఖతా.......
పరతంత్రతాదు లెన్నఁడుఁ
బొరయవు నీభక్తవరులఁ బురసంహారా!
| 170
|
క. |
కోరరు మఱచియు స్వర్గ
స్వారాజ్యప్రముఖనిఖిలసంభూతభవా
పారసుఖంబులు శివరస
భూరిసుఖానుభవభక్తపుంగవులు శివా!
| 171
|
క. |
నీ వని యెఱిగిఁన పిమ్మట
నీవ యెఱుంగుదని యుండు నీ నిజభక్తుం
డావంతయు నే ననియెడు
భావనఁ గైకొనఁడుఁ గార్యభారమున శివా!
| 172
|
క. |
నీవని యెఱిఁగిన పిమ్మట
నేవలనికి వ్రాల డొండు లెఱుఁగుఁడు దనకున్
జీవన మెట్లని తలఁపఁడు
భావనఁ గేవల శివైక్యభక్తుఁడు రుద్రా!
| 173
|
క. |
మును రుద్రుఁడు గాని యతం
డనుకీర్తింపండు రుద్రు నర్చనభావ
మ్మునఁ దలఁపఁడు సూడుడు గా
వున శివభక్తుఁడగు మానవుఁడు రుద్రుఁడు గాన్.
| 174
|
క. |
జగదుపకారార్ధముగా
మొగి రుద్రులు రుద్రలోకమున నుండి భువిన్
నెగడి శివభక్తులన
నగణితముగ నవతరింతు రంద్రాదిమునుల్
| 175
|
క. |
మతిఁ జూడఁగ నివ్విధ మీ
క్షితి నిస్సందిగ్ధ మదియు శివభక్తులు వి
శ్రుతముగ మనుష్యచర్మా
వృత రుద్రుల యగుటఁ దత్త్వవేదుల దృష్టిన్.
| 176
|
క. |
కావున భక్తులు ద్రిజగ
త్పావనులు భవాంధతమసపటలవిఘటనో
ద్భావితనిజమహిమార్కవి
భావసుల వినాశు లతికృపాపరు లెందున్.
| 177
|
క. |
మానిసిపై తోల్గప్పిన
యీ నెపమున నున్నరుద్రు లీశ్వరభక్తుల్
మానుసులె వారు లోకహి
తానేకాచారు లీశ్వరాజ్ఞాధారుల్.
| 178
|
క. |
మానుగ నెప్పుడు "మద్భ
క్తానవినశ్యన్తి" యనఁగ దగియుండఁగ నీ
శాన! భవత్కారుణ్యాం
భోనిధి ననుఁ దేల్చి ముక్తిఁ బొందింపు శివా!
| 179
|
క. |
దేవా! నాదుర్గుణములు
భావింవికుమయ్య నీకు భక్తుఁడ "మద్భ
క్తావిగత కల్మషా" యను
నీవచనము నమ్మినాఁడ నిరుపమమహిమా!
| 180
|
క. |
ప్రణుతింప "నమే భక్తః
ప్రణశ్యతి" యనంగఁదగినపలుకునకుఁ దగన్
గణనాథ! భక్తచింతా
మణి! రక్షింపవె యపారమహిమాధారా!
| 181
|
క. |
హరిసరసిజాసనాదులు
సరిగారని చెప్పు వివిధశాస్త్రములెల్లన్
వేరు లీశ్వరభక్తులకును
సరియగుదురె జాతిరూపసామాన్యములన్.
| 182
|
క. |
మండెడు మహాగ్ని నుండెడు
పిండాయస్స్థితిఁ బినాకి పృథుసన్నిధిమై
నుండెడి శివభక్తులతో
నొండొక దుర్మనుజు లెనయె యూహింపంగాన్.
| 183
|
క. |
మ్రొక్కుదురు లింగమూర్తికి
దక్కటిమూర్తులకు మఱియుఁ దమకలనైనన్
మ్రొక్కెదమని తలఁపరు నర
దిక్కుంజరు లనఁగ నెగడు త్రినయనభక్తుల్.
| 184
|
క. |
మడఁతి గొడు కర్థ మిది యని
యెడసేయరు భక్తి నిత్తు రేలినపతికిన్
బడయుదురు మగుడ వానిన
మృడుభక్తులు వలచిరేని మెచ్చించి శివున్.
| 185
|
క. |
మలహరుఁడు జలక మాడిన
జలములు విషములకు మందు శస్త్రవ్రణసం
కులమునకు దీపతైలము
త్రిలోచనుని భక్తులకు నతివిచిత్ర మిలన్.
| 186
|
క. |
తఱిగిన తలలును నదుకును
మఱి కోసిన నాలుకలును మసలక వచ్చుం
గఱకంఠుని భక్తుల కని
యెఱుఁగరె సద్యఃప్రతావు లీశ్వరభక్తుల్.
| 187
|
క. |
పుచ్చిన కన్నులు క్రమ్మఱ
వచ్చును దేహంబు తొడిని వ్రస్సిన పుండుం
జెచ్చెరఁ దేరును భక్తుల
కచ్చెరువుగ శివుని మహిమ నతిశీఘ్రమునన్.
| 188
|
క. |
చేసిన సుకృతము గుడుతురు
భాసురముగఁ గర్ములెల్లఁ బరలోకమునం
జేసి తగఁ గుడుతు రిందుల
నా సకలము నెఱుఁగఁ ద్రిభువనాధిపు భక్తుల్.
| 189
|
క. |
కలఁ డీశ్వరుఁ డను నమ్మిక
కలవాఁడే శివునిభక్తిఁ గలవాఁడైనన్
మలహరు భక్తులఁ బెద్దలు
కులజులు కులహీను లనఁగ గూడదు వారిన్.
| 190
|
క. |
నీచులు నీచులు పరిమిత
వాచులు వాచాలు రాత్మవశు లవశులు స్వే
ష్టాచారు లనాచారు [59]ల
గోచరచరితులు పినాకి కూరిమి భక్తుల్.
| 191
|
క. |
నియతాత్ము లనియతాత్ములు
నయవినయాన్వితులు నయవినయవర్జితు ల
న్వయజు లనన్వయజులు ని
ర్ణయవిరహితమహిము లఖిలనాయకభక్తుల్.
| 192
|
క. |
ఆరయఁ బువ్వులకతమున
నారలు దలకెక్కునట్లు నానావిధసం
సారులు శివభక్తి మెయిన్
వారక యెప్పుడుఁ ద్రిలోకవంద్యుల కారే!
| 193
|
క. |
శ్వపచుండైనను శివభ
క్తిపరుం డగునేని నతఁడ ద్విజవర్యుం డా
శ్వపచునకుఁ గీడు శివభ
క్తి పరాఙ్ముఖుఁడైనయట్టి ద్విజుఁడు మహేశా!
| 194
|
క. |
పలమెడు ప్రత్తికినైనను
గుల మమ్ముడు వోవునట్లు గులమును బలముం
గలిమియు విద్యయు సర్వము
మలహరుఁడగు శివునిభక్తి మహిమయ కాదే!
| 195
|
క. |
ఇవ్వసుమతిఁ గడుఁగమ్మని
పువ్వులలోఁ బుట్టినట్టి ప్రవ్వులు కొఱియే
సర్వజ్ఞభక్తివిరహితుఁ
డెవ్వఁడు నుత్కృష్టజాతుఁ డేటికిఁ గొఱయే!
| 196
|
క. |
కఱకంఠుభక్తి వెలిగాఁ
గొఱగా వెవ్వియును నవియు కొన్నిటినాళ్లుల్
మఱి పిండకూడు పెట్టిన
మెఱయలక్రియ మెఱచు మీస మెదుకుల మెఱపుల్.
| 197
|
క. |
భవభావరజోదూషిత
లవు మనుజుల బుద్ధి వనిత లగణితదినముల్
శివభావపుణ్యజలముల
నవగాహన సేయకున్న నశుచుల కారే!
| 198
|
క. |
పుట్టనని చచ్చి చానని
పుట్టెడు ప్రువ్వులు విధమునఁ బురహరు భక్తిన్
ముట్టని మనుజులు సచ్చుచు
బుట్టుచు నుండుదురు ముక్తిపురి కెడదవులన్.
| 199
|
క. |
పూజింపుఁడు పూజింపుఁడు
పూజింపుఁడు శివుని భక్తిఁ బూజింపుఁడు మీ
రోజసెడి నడవకుండుఁడు
రాజులు రట్టళ్లు నగుట రావెల్లిటికిన్.
| 200
|
క. |
అవిరలనిష్ఠావృత్తిని
భవదీయ్యార్చనలు సేసి పడయు సుఖంబుల్
సవిశేషభక్తి భక్తుల
దవులంగని మ్రొక్కు నతఁడు దానును బడయున్.
| 201
|
క. |
కని మ్రొక్కుఁడు శివభక్తులఁ
గొనియాడుఁడు మీఁద సుగతిఁ గొనవలసిన నొ
ల్లనినాఁ డూరక యుండుఁడు
మనుజులు దెగడకుఁడు వారి మండ్రే యేనిన్.
| 202
|
క. |
అనఘులఁ గేవల భక్తుల
ననుషక్తింగని "సుదూర మపి గన్తవ్య"
మ్మన దర్శించినఁ జాలదె
గొనకొని శివుఁ జూడ వేఱ కోరఁగ నేలా.
| 203
|
క. |
శ్రీలింగదేవు భక్తుల
శీలంబులు మనములోనఁ జింతింపుచుఁ దా
నాలుక కసివోఁ బొగడని
యాలరి జన్మంబు జన్మ మనఁగాఁ దగునే!
| 204
|
క. |
తెగడిన దుర్గతులగుఁ గడుఁ
బొగడిన సుగతులగు వారిఁ బురుషోత్తములన్
జగదేకవిభుని రక్తులు
బొగడరె కృతమతు లగణ్యపుణ్యోదయులన్.
| 205
|
క. |
శ్రీయును గులమును శీలము
నాయువు నష్టమగు నతిరయంబున ముక్తి
శ్రీయుక్తుల శివభక్తులు
బాయక నిందించునట్టి పాపాత్ములకున్.
| 206
|
క. |
ఏ దేశంబున నేపురి
నేదెస వసియించియుండు నిల శివభక్తుం
డా దేశంబున నా పురి,
నాదెస వసియించియుండు హరతీర్థంబుల్.
| 207
|
క. |
శివభక్తుల యుండెడి చో
టవిముక్తక్షేత్ర మండ్రు రధికప్రీతిన్
శివుఁ డెప్పుడు నుండు జగ
త్పవిత్రమగు నదియ సర్వపాపహరంబున్.
| 208
|
క. |
కడుఁ గడిఁది పాపము నరుం
డొడరినయెడఁ దలఁచికొనఁగ దుర్బలుఁడైనన్
మృడుభక్తుల యిండ్లకుఁ జని
తడయక కుడిచినను నీళ్లు ద్రావినఁ బాయున్.
| 209
|
క. |
స్పుటశివతాంత్రికుఁ డపగత
కుటిలాత్మకుఁ డుద్ధరించు గోత్రము నెల్లం
బటుమతి "రజ్జుః కూపా
ద్ఘటం యథా" యనిన సూక్తి గారణ మగుటన్.
| 210
|
క. |
ఓజసెడి నడచు భక్తుల
నోజకు రాఁజేయ శివుఁడ యొడయఁడు నిక్కం
బోజసెడి నడచు భక్తుల
నోజకు రాఁజేయ శివుఁడ యొడయఁడు జగతిన్.
| 211
|
క. |
అధికాపరాధకృతమున
నధమాంత్యుం డెవ్వఁడేని నగు శివభక్తుం
దధికబ్రాహ్మణవిధమున
వధకు ననర్హుండు వేదవాదుల దృష్టిన్.
| 212
|
క. |
భువిఁ బ్రాణదండమునకును
శివభక్తుఁ డనర్హుఁ జెన్ని చేసినఁ దప్పుల్
శివసన్నిధి కారణమున
శివశాస్త్రపురాణవచనసిద్ధాంతగతిన్.
| 213
|
క. |
తారోడక శివశాసన
కారణమున నెట్టిదైనఁ గడుమాన్యులు ని
స్తారార్ధము దమకు శివా
చారస్థితి నడవవలయు శశిధరు భక్తుల్.
| 214
|
క. |
మా కేమీ భక్తుల కని
చేకోక శివాజ్ఞ మీఱి చెడనడచిన నీ
లోకమున మాన్యు లగుదురు
గాకెక్కుదురయ్య శివుని కవిలియ నతగుల్.
| 215
|
శివనిర్మాల్యము
క. |
చవి కొరఁగి లోభమున సం
భవింపకయు నన్న మొండు భంగిన యొండెం
|
|
క. |
దవిలి మలదేహులకు భువి
శివనిర్మాల్యంబు గడునిషిద్ధము గుడువన్.
| 216
|
క. |
ధరణి నభక్తులకు మహే
శ్వరు నిర్మాల్యోపభోగసంస్పర్శన త
ద్ధరణ సమాలోకనపద
పరిలంఘనవిధు లనంతపాపముఁ జేయున్.
| 217
|
క. |
క్షితి నాత్మదేహ మన దూ
షితప్రదేశంబు రోయుఁ జెందఁగ నరుఁ డె
ట్లతని గతి రోయు శివుఁడును
మతి నిర్మాల్యంబుఁ గుడుచు మలయుతుఁ జెందన్.
| 218
|
క. |
నిర్మలపదార్ధ మగుటను
నిర్మాల్యం బనఁగ నెగడు నీ నిర్మాల్యం
గుడుతురు భక్తులు
కర్మక్షయమగుట మోక్షకాంక్షులు రుద్ర్రా!
| 219
|
క. |
గురుకృతశివదీక్ష మెయిన్
విరహితమలదేహులగు పవిత్రులు భక్తుల్
హరనిర్మాల్యము గుడుతురు
పరమేశ్వరునందు దాసభావముతోడన్.
| 220
|
క. |
నిరతిశయభావనిష్ఠా
పరులగు భక్తులకు దాసభావమున మహే
శ్వరనిర్మాల్యము గుడుచుట
పరమశివాచారధర్మపథము ధరిత్రిన్.
| 221
|
క. |
భవదోషవిఘాతార్ధము
శివభక్తుల నియతి నిష్ఠఁ జేకొను భక్తిన్
|
|
|
శివనిర్మాల్యము గుడుతురు
శివశాస్త్రపురాణవచనసిద్ధాంతగతిన్.
| 222
|
క. |
ఆకునుఁ బువ్వును గాయయుఁ
బ్రాకటముగ నన్నపానభక్ష్యౌషధముల్
శ్రీకంఠున కర్పించక
చేకొనుటలు మద్యమాంససేవన గాదే!
| 223
|
శివదీక్షితుఁడు
క. |
విను వేదశాస్త్రములు చది
విన మఱియు నదీక్షితునకు విహితముగాదం
ట నదీక్షితున కభక్తుని
కిని శివలింగంబు ముట్టఁ గ్రియగాదు విధిన్.
| 224
|
క. |
స్వార్థపరార్థశివార్చన
మర్థిని శివదీక్షితునకు నగుఁ జేయఁగ న
త్యర్థము నిరర్థకంబు భ
యార్ధంబు నదీక్షితునకు నర్చన మెందున్.
| 225
|
క. |
వెలగొని యదీక్షితుఁడు దే
వలకుండనఁ బూజచేసి వర్తించుమెయిన్
మలహరుని దీక్షితుఁడు రే
[60]వలకుండును గాఁ దెఱుంగవలయును దీనిన్.
| 226
|
క. |
భవి జన్మాంతరసంస్కా
రవశంబున సహజభక్తిరతి పుట్టి శివున్
|
|
|
ధ్రువముగఁ బూజించు మహో
త్సవునకు నీశ్వరుఁడు గురువు శాంభవదీక్షన్.
| 227
|
క. |
శివుఁడు గురుండుగ భజన
మ్మవిరతదృఢభక్తి జేయు నట్టిశివజ్ఞా
నవిదుఁడు దేవలకుఁడుగాఁ
డవు దీక్షితుఁ డుభయపూజ కర్హుఁడు జగతిన్.
| 228
|
క. |
క్షితి నేకగురునిచే దీ
క్షితులెల్లను భ్రాతలండ్రు శ్రుతులందును ద
త్సుతు లగుటఁ జేసి తద్దీ
క్షితసుతులకు దీక్ష వలయుఁ గృతి యోగ్యతకున్.
| 229
|
క. |
జనకాదులు చేసిన ధ
ర్మనియోజితయైన కన్య మానుగ శివభ
క్తున కీవచ్చు విరోధికిఁ
జన దీయంబడయు భక్తి సన దెడ నుడుగన్.
| 230
|
శివభక్తుఁడు కానిపతి
క. |
శివభక్తుఁడ వగుమని పతి
కవిరతమును బుద్ధిచెప్ప నగు శివభక్తిం
దవిలిన సతి కతఁ డొడఁబడఁ
డవునేనియు నతని మీఱనగు భక్తి మెయిన్.
| 231
|
క. |
పురుషునకు భక్తి లేదని
పురుషేచ్ఛకు నడవజనదు పురహరుభక్తిన్
బరుగు సతి పురుషు మీఱియు
బురహరుఁ గొలుచునది సిత్తమున విడిచి పతిన్.
| 232
|
క. |
పురుష ప్రతికూలత్వ
స్థిరదోషము సతికి దుర్గతిం జేయదు త
త్పురుషుఁ డరక్తుఁడయేనిం
బురుషుని మీక్షియును శివునిఁ బూజించు నెడన్.
| 233
|
క. |
అనసూయయు నాలాయని
యను మునిభార్యయు నిజాధిపాతిక్రమవృ
త్తిని శివునిచే నభీష్టము
లనూనముగఁ దొల్లి పడసి రచలితభక్తిన్.
| 234
|
క. |
స్వాభావికములు దుర్బో
ధాభావము నీదు కరుణ నగు నంతకము
న్నే భంగులఁ బొగడిన శివ!
నీ భక్తుల మహిమ యెఱుఁగ నేర్తురె మూఢుల్.
| 235
|
క. |
విసువక యిది కారణముగ
నసమేక్షణు నచలభక్తి నర్పించుటతో
ససదృశము లన్యధర్మము
లసారములు నీని బోలవం డ్రాదిమునుల్.
| 236
|
క. |
సర్వజ్ఞ! రాజశేఖర!
సర్వేశ్వర! యనుచు నొక పిశాచము బొగడన్
సర్వజ్ఞ! రాజు శేఖర!
సర్వేశ్వర! యనఁడు నిన్ను జడబుద్ధి శివా!
| 237
|
క. |
జడమతు లల్పమ యెఱిఁగెడు
నెడ వారలు శివునిమహిమ యెఱుఁగుదురె మహిన్
జడనిధి వెడల్పు లోతును
కడు నెఱుఁగునె నూతిలోని కప్పలుబుద్ధిన్.
| 238
|
క. |
నెఱిఁ జదువు లెన్ని చదివియు
నెఱుఁగరు జడమతులు శివుని నిట్టిద కాదే
యెఱుగునె వంటకముల చవి
యొఱపుగ మఱియంద మెసఁగుచుండెడి దర్వుల్.
| 239
|
క. |
వేదపురాణము లెఱిఁగి స
దోదితుఁ డగు శివుని నెఱుఁగనోపరు పాపుల్
మేదినిఁ జూచియుఁ బూర్వది
శాదిత్యునిఁ గౌశికంబు లనునవి గనునే.
| 240
|
క. |
మానక చదువులు చదువుచు
చానికిఁ బ్రతికూలుఁడైనవానిని శివు ని
త్యానందు నిన్నుఁ గొల్వని
మానిసి గాడ్దియలు భువి నమాన్యుల కారే!
| 241
|
క. |
ఒకవైష్ణవుఁ డొక మీమాం
సకుఁ డొకచౌధ్ధుండు నొక్కజైనుఁడుఁ ద్రిపురాం
తకు భక్తునట్ల నిజసా
క్షికదృష్టాంతప్రసిద్ధిఁ గీర్తనఁ గనిరే!
| 242
|
భక్తి లేక ముక్తి లేదు
క. |
జ్ఞాని యగువాఁడు భక్తివి
హీనుం డగునేని ముక్తి కెయిదఁడు నృపతి
జ్ఞానము గలిగినఁ బ్రోచునె
మానవపతిఁ గొలువకున్న మానవుని శివా!
| 243
|
క. |
గజశాస్త్ర మెఱిఁగినంతనె
గజాధిరోహణము సేయఁగావచ్చునె? ని
|
|
|
న్నజు సర్వేశ్వరు నెఱిఁగియు
భజియింపక ముక్తి వడయ భారము గాదే!
| 244
|
క. |
ఎడవడని శివజ్ఞానము
దొడరి సమస్తమును విడిచి దురహంకారం
బుడిగి తను మఱచునంతకు
మృడుఁ గొల్వఁగవలయుఁ గ్రియలమెయి నిన్ను శివా!
| 245
|
క. |
వేసరక క్రియాఫలస
న్యాసము గావించి క్రియల నానావిషయ
వ్యాసంగ ముడుగు నంతకు
వాసనమై నిన్నుఁ గొలువవలయు మహేశా!
| 246
|
క. |
క్రియ లుడిగి యోగినని యా
రయ విషయము లుడుగకున్న రాగాంధుఁడు ప్ర
త్యయవిరహితాత్ముఁ డతిపా
వయుతాత్ముం డాతఁ డుభయభ్రష్టుఁడు రుద్రా!
| 247
|
క. |
క్రియ ఒఱిఁగి యెఱిఁగి యుడిగిన
యయుక్తియుక్తుండు పతితుఁ డనఁబడు క్రియ కా
శ్రయమైన యహంకారము
క్రియ గొనఁగా నుడుగకనె క్రియ లుడుగ శివా!
| 248
|
క. |
ఏననియెడు నభిమానము
జానుగ బిరు దుడుగుటయు నిజక్రియలు నుదా
సీనములై పిరు దుడుగును
దానై యుడిగెద ననంగఁ దగదు మహేశా!
| 249
|
క. |
ఉన్నత సముదిత నిజనం
పన్నాభ్యంతర శివైక్యభావానుగతిం
దన్నెఱుఁగ మఱచు నంతకు
బన్నుగఁ బూజింపవలయు బాహ్యమున శివున్.
| 250
|
క. |
పొరిఁ దనకుఁ దానక్రియలవి
నిరంతరాభ్యాసపక్వనిర్ణీంతాతః
కరణ విశుద్ధ శివైక్య
స్ఫురణత జ్ఞాన ప్రలీన బుద్ధికి నుడుగున్.
| 251
|
క. |
ఏనని యెఱఁగుట మఱచి శి
వానందానుభవమగ్నుఁ డగునంతకు ము
న్నే నుడిగెదనని బాహ్యవి
తాన శివారాధనంబు దగ దెడ నుడుగన్.
| 252
|
క. |
అంగంబగు నాభ్యంతర
మంగజహరునకుఁ బ్రధాన మగుబాహ్యం బా
యంగప్రధానములలో
నంగమ సేకొని ప్రధాన మగునే! విడువన్.
| 253
|
క. |
అంగాభ్యంతరవిధమున
నంగజహరుఁ గొలిచి ముఖ్యమగుబాహ్యవిధిన్
లింగాకృతి శివుఁ గొలువని
వెంగలి మానవులకంటె వెడఁగులు కలరే!
| 254
|
క. |
సాంగముగా వేదములకు
భంగిన వేదాంతములకు బ్రహ్మాదులకున్
లింగస్వరూప విరహిత
గంగాధర రూప మెఱుఁగఁగాఁ దలమగునే!
| 255
|
క. |
వనజాసన వనజోదర
సనకాదులు ముఖ్యబాహ్యసంత్యాగము నే
సినవారు గారు తక్కటి
పినుఁగులు బాహ్యంబు విడిచి పెద్దయుఁ జెడరే!
| 256
|
క. |
స్థిరముఖ్యబాహ్యపూజా
కరణము లేదయ్యెనేని గౌణకృతాభ్యం
తరవిధినైనను భక్తిం
బరమేశ్వరుఁ గొలువకునికి పాపము గాదే!
| 257
|
క. |
పరమహిత యథోక్తాభ్యం
తరపూజను విడిచి యేన దైవము నని దె
ప్పరమగు నాస్తిక్యమతిన్
హరుఁ గొలువని నరుఁడు పతితుఁ డనఁబడు జగతిన్.
| 258
|
క. |
అవికల దేవాసుర నర
నివహ సదాపూజనీయ నిత్యోత్సవ స
చ్ఛివలింగ పరాఙ్ముఖ మా
నవసంభాషణము లెల్ల నరకార్ధమగున్.
| 259
|
బాహ్యపూజ చేయవలయును
క. |
ఒడలు గుడి యంతరాత్మను
బడరుండను పలుకు లుడిగి భక్తిని గుడియే
గుడియని లింగమూర్తి య
బడరుండని కొలువకునికి పాతకము శివా!
| 260
|
క. |
వేదోక్తవిహితకర్మ మ
హాదేవార్చనవిహీనుఁడగు పాషండిం
|
|
|
గా దెదురుఁజూడఁ జూచిన
యా దోషము వోవఁజూచునది భక్తులకున్.
| 261
|
క. |
శివసమయంబున కెడరెడు
నవినీతుల రెంత పెద్దలైనను మ్రొక్కన్
శివభక్తులకును దగ ద
క్కువిదారుల మ్రొక్కు లెపుడు గొనఁగాదు శివా!
| 262
|
క. |
కాదప్పుఁ గొనఁగ నప్పిీ
గాదీఁ గొనఁ గాదు గాదు కనఁ దమలో నా
హ్లాదమునఁ బలుకఁగాదు మ
హాదేవపరాఙ్ముఖాత్ములగు పతితులతోన్.
| 263
|
క. |
కాదు సమశయ్య బొందం
గాదు సమాసనమునందుఁ గదియఁ జరింపం
గాదు సహవాసమును మ
హాదేవపరాఙ్ముఖాత్ములగు పతితులతోన్.
| 264
|
క. |
కా దతని వేఁడి కుడువం
గా దతనికిఁ గుడువఁబెట్టఁ గాదు భుజింపం
గా దీఁ గొన దానమును మ
హాదేవపరాఙ్ముఖాత్ములగు చరితులతోన్.
| 265
|
క. |
చేతోజాతవిమర్దన!
భాతిగ నిముఁ గొలువనట్టి పాలసునకు సం
ప్రీతిని గుడువం బెట్టిన
దాతకు యమదండనంబుఁ దప్పదు రుద్రా!
| 266
|
క. |
(జ్ఞానము వైరాగ్యము ననఁ
గా) నించుకలేని నాస్తికస్థితి విషయా
|
|
|
ధీనదురాచారికి యో
గానందము గలుగ నేర్చు నయ్య మహేశా?
| 267
|
క. |
అవిరతనిరతిశయంబుగ
శివయోగరసానుభవవిశిష్టసుఖంబుల్
దవిలిన యోగులు విషయో
ద్భవసుఖలేశంబు మఱచి తలఁతురు రుద్రా!
| 268
|
క. |
నిన్నెఱుఁగుచుఁ దన్నెఱుఁగని
యన్నఁడు శివయోగమగ్నుఁ డనఁబడఁ (డెపుడున్)
నిన్నునుఁ దన్ను నెఱింగెడి
యన్నఁడు శివయోగమగ్నుఁ డనఁబడును శివా!
| 269
|
క. |
ఎడవక యష్టాంగం బై
షడంగమై యొండెఁ బరఁగు శంకరయోగం
బెడ యుడుగ కభ్యసించిన
గడుకొని సంసారవార్ధిఁ గడువఁగవచ్చున్.
| 270
|
క. |
అష్టాంగయోగభక్తి న
భీష్టఫలప్రదుఁడవైన యీశ్వర! నిన్నుం
దుష్టిసనఁ గొలిచి ముక్తి వి
శిష్టసుఖాఢ్యు లగు టరుదె శివయోగాఖ్యుల్.
| 271
|
క. |
శివయోగి దర్శనంబున
నవు గంగాస్నానసమమహాపుణ్యఫలో
త్సవగతి తత్సంభాషణ
సవినయవిధి సకలతీర్ధసత్ఫల మడరున్.
| 272
|
క. |
వేదవిదులైన కోటి మ
హీదేవోత్తములు గుడిచి యిచ్చు ఫలం బా
|
|
|
హ్లాదంబున శివయోగికి
నాదట భిక్షంబు వెట్టి వంతన పొందున్.
| 273
|
క. |
శివయోగి శిరంబుననే
శివుఁ డెప్పుడు నుండునని విశేషప్రీతిన్
శివయోగిఁ జూచి సాక్షా
చ్ఛివుఁడని కడుభక్తిఁ బూజసేయఁగవలయున్.
| 274
|
క. |
ధ్రువముగ సర్వప్రాణుల
నవశ్యమునుఁ జేయకుండునది హింస మదిన్
శివనిందకులగు పాపుల
నవిచారితవృత్తి ...................... నీశానా!
| 275
|
క. |
సంహృతశివ! నీభక్తికి
నంహోమతివక్త్రులైన నప్పుడ ....
..............యనుటకు
............పథము జనకుల నైనన్.
| 276
|
క. |
శివనిందావిషయంబగు
నవమానము సెప్పునట్టి యప్పుస్తకముల్
అవిచారంబునఁ.........
నవుఁ జెప్పెడివానిఁ..............నీశానా!
| 277
|
క. |
శివనిందారతుఁ...
జవ మఱి తత్కారణమున........నీ రెం
దువిధంబుల నీ కారు
ణ్యవశంబున ముక్తిఁబొందు నరుఁ డీశానా!
| 278
|
జీవత్యాగము
క. |
శివ! నీ తదర్ధ మొండెను
శివభక్తార్ధంబ యొండె శివవిద్యాచా
ర్యవిషయ మొండెను జీవ
మ్ము విసర్జించిన నరుండు ముక్తుఁడు రుద్ర్రా!
| 279
|
క. |
పావనమైన శివక్షే
త్రావాసమునందు నొండె నవశనవిధిమై
జీవత్యాగము చేసిన
భూవినుతుఁడు మోక్షపదవిఁ బొందు మహేశా!
| 280
|
క. |
శివతీర్ధములో నొండెను
శివాజ్ఞలో నొండెఁ దాను జీవత్యాగం
బు విధించిన మానవుఁడును
భవత్ప్రసాదమున ముక్తిఁ బడయు మహేశా!
| 281
|
క. |
ఎందును శివార్ధముగఁ మృతిః
బొందిన పుణ్యాత్ము బంధుపుత్రాదులకున్
బొందరు సూతక మతనికి
వందురి పరలోకవిధులు వలదు మహేశా!
| 282
|
క. |
వెండియు శివార్థమృతునికి
నొండొక పరలోకవిధులు నొడఁబడిరే వా
రొండుడిగి యథాశక్తిం
బండుగ సేయుదురు రుద్రభక్తులకు శివా!
| 283
|
క. |
పితృలోక విష్ణులోకము
లతిక్రమించి శివపురికి నరిగెడు భక్త
ప్రతతికిఁ బితృమేధక్రియ
లవిశయముగఁ జేయునాతఁ డజ్ఞుఁడు రుద్ర్రా!
| 284
|
క. |
అంతకరిపుభక్తుని దే
హాంతంబున నతని యర్థ మాగమయుక్తిన్
సంతతి గలిగిన దత్పశు
సంతతి కీఁదగదు శైవసంతతి దక్కన్.
| 285
|
శివాపదారులకు శిక్ష
క. |
సకలామరదైతేయ
ప్రకరసదారాధ్యమానపాదాబ్జ భవాం
తక! నీ భక్తుల దుర్గుణ
శకలంబుల వెదకువాఁడు చండాలుఁ డజా!
| 286
|
క. |
శివ! నిన్నును వేదములను
శివభక్తుల బ్రాహ్మణులనుఁ జెడనాడెడు పు
ణ్యవిహీనుఁ డధోగతిఁ బడి
యవిరళనరకాగ్ని బాధ లందు మహేశా!
| 287
|
క. |
శివభక్తులఁ జెడనాడెడు
నవినీతుఁడు ఘోరరౌరవాగ్నుల బడి యా
రవితారకముగఁ గాలుచు
ధ్రువముగ వాచఱచుచుండు దురితారాతీ!
| 288
|
క. |
వెఱవక నీ గుడిలోపల
గుఱుకొని యాలాపు వెట్టుకొనియుండెడి పా
దఱి జముకూతలు గుక్కలఁ
గఱపింతురు మూఁటకట్లు గట్టి మహేశా!
| 289
|
క. |
ప్రమదాసంగతి చేసిన
నుమిసిన మఱి కాళ్ళు సాచి యుండిన శివగే
|
|
|
హములోన జూదమాడిన
నమితమహానరకబాధ లందు మహేశా!
| 290
|
క. |
పావలుఁ జెప్పులు తొడుకొని
దేవ! శివాలయములోనఁ ద్రిమ్మఱు పాపుల్
వా విడిచి నిగళబంధము
తో వాచఱచును గాలుదురు నరకాగ్నిన్.
| 291
|
క. |
కుడిచిన నీళ్లాడిన మఱి
గుడిలోపల నలుఁగువెట్టుకొన్న నభీష్టం
బడుగఁగ నవ్విన దుర్గతిఁ
బడుదురు బాధలను నధికపాపాత్ము లజా!
| 292
|
క. |
గుడిలో ముద్దట లడిచిన
గుడిలో వెండ్రుకలు వాచి కొనినను నెపుడుం
గడు వెఱవక విహరించిన
గడుసరి నరకాగ్నిశిఖలఁ గాలు మహేశా!
| 293
|
క. |
అతిగర్వోదాసీనత
గతభయుఁడై శివ! శివోపకరణద్రవ్య
ప్రతతులఁ గాళ్లం దన్నిన
నత కడచిన ద్రోహి రౌరవాగ్నులఁ గాలున్.
| 294
|
క. |
మృడ! నీ తోఁటల పువ్వులు
ముడిచిన మఱిగానిఁ గోసి-మూర్కొన్న నరుల్
కడుఁ గ్రాఁగిన సూదులతో
నడవఁగలబడి నరకబాధ లందుదురు శివా!
| 295
|
క. |
శివ! నీ తోఁటల లోపల
శివగృహములలోన నొండు[61]సితమున మూత్రా
ద్యవకార్యంబులు చేసిన
యవినీతుఁడు ఘోరరౌరవాగ్నులఁ గాలున్
| 296
|
క. |
ఉత్తమకులవిద్యాగుణ
విత్తోద్యోగాది సకలవిషయము లెల్లన్
రిత్తయ బుద్ధి దలంప ను
దాత్త భవద్భక్తి లేని యధములకు శివా!
| 297
|
క. |
కులమునుఁ గలిమియుఁ బ్రాయము
గలిగియు మఱి ముక్కు లేని కాంతయపోలెం
గులమును గలిమియుఁ బ్రాయము
గలిగియు శివభక్తి లేని కష్టుఁడు రుద్ర్రా!
| 298
|
క. |
శ్రీరమణార్చిత! దురితని
వారణ! నీభక్తి లేనివారల విద్యా
చారకులరూపసంపద
లారయఁగా నిష్ఫలంబు లన్నియు రుద్రా!
| 299
|
దక్షాధ్వరధ్వంసము
క. |
సురముని వైదికమత సు
స్థిరముగ దక్షప్రజాపతి యొనర్చిన వి
స్తరసత్క్రియ దేవ! భవ
ద్విరహితముగఁ జేసి కాదె! విఫలత నొందెన్.
| 300
|
క. |
వేదములు ప్రమాణములుగ
నాదిన యెడఁబడియు వాని నతకడచి భవ
|
|
|
త్పాదనుతి విడిచి చెడియెను
పాదఱి దక్షుండు వీరభద్రునిచేతన్.
| 301
|
క. |
ఆలరియై శివుఁ బలికిన
పాలసుఁ డని కిలిసి వీరభద్రుఁడు ఫాలా
భీలవిలోచనదహన
జ్వాలల మును దక్షు జన్నసాలను గాల్చెన్.
| 302
|
క. |
భూతములు దర్భత్రాళ్ళను
హోతల మెడ లంటఁగట్టి యూపంబులతో
ద్రేతాగ్నులు యాగాశ్వము
భూతేశ్వర! గంగలోనఁ బోవైచె నజా!
| 303
|
క. |
ఆమిషముం గని రుద్రుని
రోమజ గణపతులు చరు, పురోడాశమహా
హోమద్రవ్యములెల్లను
నీ మహిమంజేసి దక్షునిం జెఱచి రజా!
| 304
|
క. |
ధర్మాది సదస్యులు శివ
ధర్మవిహీనుండునైన దక్షునిసభలోఁ
బేర్మి చెడి భూతములచే
దుర్మదులై కొట్టువడిరి దురితారాతీ!
| 305
|
క. |
ఎలుకల నడచిన విధమున
నలయక దక్షాధ్వరమున కనివచ్చిన పా
ధుల మునుల నడిచి చంపిరి
గలహంబునఁ బెరిగి ప్రమథగణములు రుద్రా!
| 306
|
క. |
కలియుగమున [62]జారులచే
బలిమిఁ గులస్త్రీలు వడ్డభంగిన హర! నీ
కలుషమున నమరవనితలు
వెలయంగా జెడిరి భూతభేతాళురచేన్.
| 307
|
క. |
గోకులమును గోపాలకుఁ
డాకులమునఁ దోలునట్టు లమరుల నెల్లం
జేకొనక తోలి చంపె మ
హాకోపుఁడు వీరభద్రుఁ డతిబలుఁడు శివా!
| 308
|
క. |
మారారిద్రోహు నింటికి
పేరంటము వచ్చి తనుచుఁ బెలుచను గోసెన్
వైరమున నదితి ముక్కును
భారతి నాసికయు వీరభద్రుఁడు రుద్రా!
| 309
|
క. |
ఆలరి దక్షుని నోమున
కేలా చనుదెంచి తనుచు నీశానదిశా
(పాలకులను సురనికరము
శూలముతోఁ బొడిచి చంపఁ జొచ్చిరి రుద్రా!)
| 310
|
క. |
దక్షుశిరంబును రణజయ
శిక్షావిధి యజ్ఞపురుషుశిరమును దునిమెన్
దక్షాధ్వరంబులోఁ బ్రతి
పక్షక్షయకారి వీరభద్రుఁడు రుద్రా!
| 311
|
క. |
నిష్టురముగఁ బ్రమథగణ
ప్రష్ఠుండై నెగడు వీరభద్రుఁడు దారా
|
|
|
జ్యేష్ణునిఁ జంద్రునిఁ బాదాం
గుష్ఠంబునఁ ధరణిఁ బ్రామెఁ గోపమున శివా!
| 312
|
క. |
వడి మృగరూపముఁ గైకొని
చెడి పాఱెడు యజ్ఞపురుషుశిరము దెగన్ వ్రే
ల్మిడిలోన నేసి చంపెను
గడువీరుఁడు వీరభద్ర-ణనాథుఁ డజా.
| 313
|
క. |
స్వాహాపతి భామినియగు
స్వాహాంగన ముక్కు నెడమచనుమొనయు దగన్
సాహనముతోడఁ జిదిమిన
బాహుబలం బొప్పె వీరభద్రునకు శివా!
| 314
|
క. |
స్వాహాపతి జిహ్వ శివ
ద్రోహుని జన్నమున నాహుతులు గొన్నదియన్
ద్రోహమునఁ గోసివైచెను
బాహుబలుండైన వీరభద్రుఁడు రుద్రా!
| 315
|
క. |
పోలఁగ దక్షుఁడు సత్క్రియ
మేలని చేయుటకు నశ్వమేధము గీడై
కోలాహలమయ్యెఁ గ్రియలు
సాలఁగ శివభక్తి లేక సహజములగునే?
| 316
|
క. |
కర్మఫలదాత త్రిజగ
న్నిర్మాత మహేశ్వరుండు నిఖిలపశువ్రా
తమ్ముల కధిపతి యని క్రియ
లిమ్ములఁ జేయునది మనుజు లీశ్వరభక్తిన్.
| 317
|
క. |
ఆ హరి సురేంద్రముఖ్య సు
ధాహారుల నెల్ల నిట్టు లత్యుద్ధతిమై
దేహములు గోసివైచిన
బాహుబలం బొప్పె వీరభద్రునకు శివా!
| 318
|
క. |
ఆహవమునందుఁ దెగి య
య్యాహవనీయాగ్నిఁ బడియె నట విష్ణుశిరం
బాహా! నీ కింకరునకు
బాహుబలం బొపెపి వీరభద్రునకు శివా!
| 319
|
ప్రళయవర్ణనము
క. |
కర్మక్షయంబు గామిని
నిర్మలమోక్షంబు లేమి నిఖిలపశువ్రా
తమ్ముల దుఃఖంబులు గని
నిర్మింతు లయంబు గొంత నిర్వృతికి శివా!
| 320
|
క. |
కరుణాకరుఁడవు గావున
విరచిత బహుజీవరాశి విశ్రామహేతు
స్థిరమల నిఖిలజగత్సం
హరణము గావింతు కరుణ నతిమహిమ శివా!
| 321
|
గణాధిపుల యాటలు
-
క. |
ప్రమథులు రుద్రులు మఱి భూ
తము లనఁగాఁ ద్రివిధమూలదళములతోడన్
సమసుప్తినాథ! నీ గణ
సమూహములు సంహరించు జగములు రుద్రా!
| 322
|
క. |
కుమ్మరి దరిగొల్పిన చి
[63]చ్చుమ్ముల నావమ్ము కడవ [64]లుల్ల దరికొనం
గ్రమ్ముగతి నజాండంబునఁ
బ్రమ్ము భవన్నేత్రవహ్నిప్రళయమున శివా!
| 323
|
క. |
భవదుద్భట నిటలేక్షణ
భవజృంభిత [65]విలయవహ్నిపర్వి జగద్వి
ప్లవహేతువయ్యె బ్రమథుల
కవిరళసుఖహేతువయ్యె నదియె మహేశా!
| 324
|
క. |
లోకంబులు ప్రళయాగ్నిశి
ఖాకలితములై తదగ్నిఁ గాలఁగఁ బ్రమథా
నీకములు వెరిగి యాడు మ
హాకౌముదిఁ దేలియాడు నట్లు మహేశా!
| 325
|
క. |
త్ర్యంబక! నీ ప్రమథగణా
డంబరవిభవంబు గడు నొడంబడ సంహా
రంబును వర్ణన సేయఁగ
లంబోదర షణ్ముఖాదులకు నరిది శివా!
| 326
|
క. |
ససముద్రద్వీపాచల
వసుమతి వడి మీఁది కెగురవైచి సనక్ష
త్రసురావాసాకాశము
వెనఁ గ్రిందికిఁ దివుచుఁ బ్రమథవిభుఁడొకఁడు శివా!
| 327
|
క. |
కడు మండెడు బడబాగ్నిం
దడయక వడి గూడఁ దిగిచి తననుదుటను బొ
|
|
|
ట్టిడికొని యానందంబున
వెడ సోలుచు నాఁడుఁ భ్రమథవిభుఁడొకఁడు శివా!
| 328
|
క. |
సకలసముద్రజలంబులు
నొకగణనాయకుఁడు ద్రాగి హ్రొబ్బని త్రేన్చున్
సకలగ్రహతారకములు
నొక గణనాయకుఁడు వాఱ నూఁదు మహేశా!
| 329
|
క. |
ద్వీపము లేడును జక్ర
వ్యాపారవిధమునఁ ద్రిప్పివైతురు వాఱన్
నీ పంపునఁ గొందఱు బహు
రూపులు గణనాయకులు విరూపాక్ష! శివా!
| 330
|
క. |
యమ మహిషశృంగములు నిం
మహాగజదంతములుఁ బ్రతాపముతోడన్
సమసుప్తి దుస్సికొని నీ
ప్రమథులుఁ దాలములు వేసి పాడుదురు శివా!
| 331
|
క. |
పడవేసి మృత్యుదేవర
మెడ మడమలఁ ద్రొక్కి దాని మెఱసెడి కోఱల్
వడిఁ బెఱికికొని మహోల్కము
లుడుగక త్రిప్పు క్రియఁ ద్రిప్పు నొకగణము శివా!
| 332
|
క. |
వరుణునిమకరము వాయువు
హరిణముఁ గడిచేసి మ్రింగి యాసురముగ ది
క్కరులం దిని త్రేఁచును శం
కర! నీ గణనాథుఁడొకఁడు గడికాఁడు శివా!
| 333
|
క. |
కొందఱు గణపతు లత్తఱి
మందర హిమవత్ప్రధానమహితమహీభృ
త్సందోహంబులుఁ గొని కడు
నందముగా సూడుపట్టె లాడుదురు శివా!
| 334
|
క. |
సుర పర్వతాది ధరణీ
ధర కందుకకేళి సలిపి తత్క్షణమున న
గ్గిరులు వొడిచేసి చల్లుచు
నరుదుగ గణపతులు గొండ ఱాడుదురు శివా!
| 335
|
క. |
పూని వడి దిగిచి యష్టమ
హానాగమ్ములను [66]ముద్రియలుగా వ్రేళ్ళన్
మానుగఁ గొందఱు దాల్తురు
వాని ఫణామణుల రుచులు వఱ్ఱుగ బ్రమథుల్.
| 336
|
క. |
ఆదివరాహము వెరిగిన
యా దంష్ట్రలు వెఱికి తన నిజాస్యంబున సం
పాదించికొని నటించు మ
హాదర్పముతోడ నొకగణాధిపుఁడు శివా!
| 337
|
క. |
మఱి యాదికూర్మపృష్ఠము
దొఱయఁగ వడిఁ బొడిచి యందుఁ గూర్చి ఫణీంద్రున్
నెఱిఁ ద్రిప్పటముగఁ దేరిప్పుచు
వఱలఁగ గణనాథుఁ డొకఁడు వడి నాడు శివా!
| 338
|
క. |
నరసింహుని కంఠంబును
నరుణజటాకేసరంబు లంబికపాదాం
|
|
|
బురుహమణిపీఠమునఁ బొ
ల్పరుదుగ రచియించు నొక గణాధిపుఁడు శివా!
| 339
|
క. |
ప్రమథాధిపతులు గొందఱు
కొమరుగ నొడ్డణము దండ గ్రుచ్చిన భంగిన్
హిమకరమండలమును సూ
ర్యమండలము దండ గ్రుచ్చి యాడుదురు శివా!
| 340
|
క. |
నుఱుమై పఱియలు వాఱఁగ
నఱచేత నజాండభాండ మవియఁగ వ్రేయన్
మఱి బ్రహ్మ యేఁడి యనుచును
వఱలఁగ గణనాథుఁడొకఁడు వడి వెదకు శివా!
| 341
|
క. |
వారిజభవుని కపాలము
గోరి త్రివిక్రముని వీపు కోలెమ్ముతుదిం
జారుగతి నిలిపి ఛత్రా
కారంబుగఁ దాల్చి యాడు గణనాథుఁ డజా!
| 342
|
క. |
చరణంబులుఁ జరణంబులుఁ
గరములుఁ గరములునుఁ బెనఁచి కంఠమున గణే
శ్వరుఁడొకఁడు దాల్పి యాడును
విరించి విష్ణుల సబములు విలయమున శివా!
| 343
|
క. |
వడి నిడుపుగ బెరుఁగుదు ర
ప్పుడ నిడుపుడిగించి గుజ్జుఁ బొడవగుదురు వీ
డ్వడి వలుద త్రుంగు లొల్లక
కడుసన్నము లగుదు రిట్లు గణములు రుద్రా!
| 344
|
క. |
వెగడుగ వసురుద్రాది
త్యగణేశ సమస్తదేవతారాక్షసప
న్నగగణము లన్నియునుఁ జెడి
గగనంబంతయును బ్రమథగణమయ్యె శివా!
| 345
|
క. |
ఆడుదురు జతలు వెట్టుచుఁ
బాడుదురున్ గతులు చేసి పరమానంద
క్రీడాసంగతిఁ బ్రమథులు
కూడి వినోదింతు రిట్లుఁ గొమరుగ రుద్రా!
| 346
|
క. |
లోకాలోకము సురపతి
లోకముతోఁ గూడి బ్రహ్మలోకము మఱి యా
వైకుంఠలోకమునుఁ జెడి
లోకత్రయమెల్లఁ బ్రమథలోకం బయ్యెన్.
| 347
|
శివగణవర్ణనము
క. |
ప్రమథగణంబు లసంఖ్యా
కము లీశ్వర! యెఱుగ వ్రేఁగు దత్సంఖ్యలు వే
దములు "నసంఖ్యాతా" యని
యమరఁగ ఘోషించుచున్నయవి గడలేమిన్.
| 348
|
క. |
సకలకులపర్వతంబులు
నకుటిలగతి గ్రుచ్చి కంఠహారముగా నొ
క్కొకమాటు భవద్గణనా
యకుండుఁ దాఁ దాల్చుఁ బర్వతాభరణుఁ డజా!
| 349
|
క. |
పరివిలయవేళ మేరువుఁ
బరిమాల్చుటఁ జేసి మీరు పాతనుఁ డనఁగాఁ
|
|
|
బరఁగిన గణనాయకుఁడొకఁ
డరు దెవ్వరికైనఁ బొగడ నక్కజుఁడు శివా!
| 350
|
క. |
ఒండేమి సమస్తబ్ర
హ్మాండంబులుఁ బూనపేరులై యుండఁగ ను
ద్దండగతి గ్రుచ్చి యాడఁగ
నండాభరణుఁడన నెగడె నతిబలుఁడు శివా!
| 351
|
క. |
వెండి హరి బ్రహ్మాదుల
రుండము లాభరణములుగ.......
రుండాభరణుఁడు నా నధి
కుండు భవద్గణవిభుండు గురుభుజుఁడు శివా!
| 352
|
క. |
వెండియు నానాకారులు
వెండియు నానాప్రతాపవిక్రమవిభవుల్
దండితదైత్యేంద్రులు వర
[67]గుండప్రియ! నీ గణములు గొందఱు రుద్రా!
| 353
|
క. |
లాలాసుర వక్షస్స్ధల
కీలాల జలప్రవాహకేళీలోలా
భీలత్రిశూలహస్తులు
హాలాహలాంకులు భవద్గణాధిపులు శివా!
| 354
|
క. |
రాజార్ధధరులు నరసుర
రాజామరభయులు రాజరాజసఖులు గో
రాజపతాకులు గేశవ
రాజప్రియ! నీగణములు రాజాభరణా!
| 355
|
క. |
బ్రహ్మాభివంద్యముఖ్యులు
బ్రహ్మకపాలావళీవిరాజితులు వర
బ్రహ్మాకారులు (ధీరులు)
బ్రహ్మేశ్వర! నీ గణాధిపతులు కపర్దీ!
| 356
|
క. |
శ్రీరమణులు సకలజయ
శ్రీరమణులు వేదశాస్త్రశివతత్త్వవిదుల్
నీరాలప్రియ! భోజుమ
హారాజప్రియ! భవద్గణాధిపులు శివా.
| 357
|
క. |
వివిధాబ్ధమహాజలధర
రవులు, గణేశ్వరులు, మలయరాజప్రియ...
.....................గొందఱు
భువనత్రయసుందరులు త్రిపురదహన శివా!
| 358
|
క. |
శ్రీ శ్రీ దిగంబరులు వాక్
శ్రీశ్రతమహిములు జగత్ప్రసిద్ధులు భక్తి
శ్రీశ్రితహృదయాంభోజులు
శ్రీశ్రిత! నీగణము లెపు డజేయులు రుద్రా!
| 359
|
క. |
లంబోష్ఠ లంబనాసిక
లంబోదర లంబనేత్ర లంబశ్రవణుల్
లంబహను లంబజిహ్వులు
నంబాప్రియ! నీ గణాధినాయకులు శివా!
| 360
|
క. |
అజకర్ణు లశ్వకర్ణులు
గజకర్ణ వరాహకర్ణ ఘంటాకర్ణుల్
త్రిజగద్రమణీయులుఁ దెలుఁ
గు జొమయప్రియ! నీ గణములు గొందఱు రుద్రా!
| 361
|
క. |
అజముఖ వరాహముఖులును
గజముఖ మార్ణాలముఖులు గణనాయకు లం
డజముఖులు వెండి యప్పుడు
నిజామరుల కధికతేజు లాశ్చర్యు లజా!
| 362
|
క. |
గోముఖులు వరాహముఖులు
సామజముఖు లుష్ట్రముఖులు సారంగముఖుల్
భీమవ్యాఘ్రముఖులు నా
నాముఖులు భవద్గణాధినాయకులు శివా!
| 363
|
క. |
నానావర్ణసమేతులు
నానారూపధరు లర్ధనారీశ్వరు ల
శ్వానన మహిషానన సిం
హానన శరభాననులు గణాధిపులు శివా!
| 364
|
క. |
ముఖపాదులు పాదముఖుల్
ముఖకుక్షులు కుక్షిముఖులు ముఖహీనులు ష
ణ్ముఖ పంచముఖ చతుర్ముఖు
లఖండవిక్రములు నీగణాధిపులు శివా!
| 365
|
క. |
ద్విముఖ త్రిముఖ గణాధిపు
లమేయగుణు లురుతరముఖ సహస్రముఖు ల్స
ప్తముఖాష్టముఖ నవముఖ ద
శముఖులు నీకింకరులు విచారింప శివా!
| 366
|
క. |
బాహుముఖులు ముఖబాహులు
బాహూదరు లుదరదీర్ఘబాహులు గొందఱ్
బాహూరు లూరుబాహుల
బాహులు బహుబాహు లేకబాహులు ప్రమథుల్.
| 367
|
క. |
బహువక్త్రు లేకవక్త్రులు
బహుదంష్ట్రు లదంష్ట్రు లధికబలసంపన్నుల్
బహునేత్రు లేకనేత్రులు
బహుకర్లు లకర్ణు లెన్నఁ బ్రమథులు రుద్రా!
| 368
|
క. |
బహుజిహ్వు లేకజిహ్వులు
బహుపాదు లపాదు లేకపాదులు గొందఱ్
బహుఘోణులు బహుమేఢ్రులు
బహురూపులు నీగణాధిపతులు కపర్దీ!
| 369
|
క. |
గణుతింపఁగ మఱికొందఱు
గణపతులుఁ గపాలమాలికావిషధరకం
కణచంద్రకలాభూషణు
లణిమాదిగుణాన్వితులు మహాత్ములు రుద్రా!
| 370
|
క. |
పింగళ కపర్ద డమరుక
గంగా భసితాంగరాగ ఖట్వాంగధరుల్
భృంగిరిటిప్రియ! నీ గణ
పుంగవులు సమస్తలోకపూజితులు శివా!
| 371
|
క. |
కంటకనరసింహశిరో
లుంటాకు లినేందువహ్నిలోచను లుగ్రుల్
ఘంటాకర్ణప్రియ! ని
ష్కంటకులు భవద్గణాళి గౌరవమహిమన్.
| 372
|
క. |
నీలగ్రీవులు శుంభ
త్ఫాలాభీలాక్షిదహన భస్మీకృత దు
శ్శీల త్రిపుర మహాసుర
కోలాహలు లెన్నఁ బ్రమథకుంజరులు శివా!
| 373
|
క. |
త్ర్యక్ష! భవద్గణనాయకు
లుక్షేంద్రారోహణులు మహోక్షపతాకుల్
దక్షాధ్వరవిధ్వంసులు
సాక్షాత్పరమార్ధతత్త్వసమ్యగ్జ్ఞానుల్.
| 374
|
క. |
కరినరసింహవ్యాఘ్రా
సురచర్మధరు ల్మహోగ్రశూలధరు ల్భీ
కరపన్నగేంద్రకంకణ
ధరులు భవద్గణము లధికదర్పితులు శివా!
| 375
|
క. |
నారాయణాది సురదను
జోరగమునిమానవేంద్రయూధ సదా లో
కారాధ్య మాన చరణాం
భోరుహులు గదయ్య! ప్రమథపుంగవులు శివా!
| 376
|
క. |
చక్రాసహవిక్రములుఁ ద్రి
విక్రములుఁ గపాలధరులు విధిమస్తకదా
మాక్రాంతోదరు లాజి
ప్ర్రక్రమపాలనులు ప్రమథవర్గము రుద్రా!
| 377
|
క. |
మురవైరి పంకజాసన
శిరోవిభేదకులు సకలశివధర్మవిదుల్
భరితజగదండరక్షా
పరాయణులు భూరిభూజులు ప్రమథులు రుద్రా!
| 378
|
క. |
ధరితశిఖండులు ముండులు
గురు లఘువులు స్థూలసూక్ష్మకుంజరదీర్ఘుల్
పరికింపఁ గామరూపులు
హర! కొందఱు మీగణంబు లతిశాంతాత్ముల్.
| 379
|
క. |
నానానామాంకితులు స
దానందులు [68]సాంబరులు దిగంబరులు మహా
దానవినోదులు ప్రమథులు
నానాసురహరులు ప్రమథనాయకులు శివా!
| 380
|
క. |
[69]వీరాచారాచార్యులు
వీరవ్రతవిదు లవార్యవిక్రములు మహా
వీరావతారు లసములు
వీరేశ్వర! నీగణాళి విష్ణువరేణ్యా!
| 381
|
సద్భక్తుల మహిమ
క. |
స్వేచ్ఛాచారవినిష్ఠితు
లిచ్ఛావ్యాపారముక్తహృదయులు భవపా
శచ్ఛేదనకారణులు ద
యాచ్ఛాదితతనులు నీగణాధిపులు శివా!
| 382
|
క. |
సర్వజ్ఞులు సర్వగతులు
సర్వశుభోదయులు సర్వసంగత్యాగుల్
సర్వపరిపూర్ణు లెప్పుడు
సర్వేశ్వర! నీగణములు శాశ్వతులు శివా!
| 383
|
క. |
గతవిధినిషేధలౌకిక
గతులు మహామతులు పరమకారుణ్యలతా
కృతికరులు సకలసుగుణా
న్వితులు శివజ్ఞానరతులు నీ ప్రమథు లజా!
| 384
|
క. |
అరుదుగఁ బురాణములలోఁ
బరువడి మును సెప్పియున్నభంగి గణాడం
బరవిభవము వర్ణించితి
ధరణీధరవంద్య! నాయథాశక్తి శివా!
| 385
|
కవిప్రార్థన
తన్ను గణములోఁ జేర్పుమని కవి ప్రార్ధన
క. |
దేవా! సంసారాంబుధి
లో వెలువడఁజేసి ప్రమథలోకం బెఱుఁగన్
నా వాఁడు వీఁడు సుండీ
నావే నన్నుంపవే! గణంబుల నడుమన్.
| 386
|
క. |
ఒండేమి మల్లికార్జున
పండితుఁడన నుండుకంటె బ్రమథులలో నె
న్నండొకొ! నీ యాజ్ఞోన్నతి
నుండఁగఁ గాంతునని కోరుచుండుదు రుద్రా!
| 387
|
క. |
పరమేశ్వర! నీ ప్రమథుల
చరితలు సతతమును విన్నఁ జదివినఁ బ్రమథ
స్మరణము చేసిన శుభములు
దొరకొను దురితంబు నెల్ల దొలఁగు మహేశా!
| 388
|
కొందఱు భక్తుల చరిత్ర
క. |
దేవ భవదీయభక్తు లు
మావల్లభభక్తియోగమార్గమ్ములు నా
నావిధము లుండు రవియును
గోవిందాదులకు నెఱుఁగ గోచరమె శివా!
| 389
|
క. |
ఏభంగిఁ దలఁచు భక్తుం
డా భంగిన నీవు నెగడి యవిరళభక్తి
స్వాభావికత్వ పరమ
ప్రాభవవిభవమున నతనిఁ బ్రణుతింతు శివా!
| 390
|
క. |
తనుఁ గన్న తండ్రి తలఁ దెగఁ
దునిమి భవద్భక్తి యుక్తి ధూర్జటి! యొకఁ డ
త్యనుపమగుణ! నీ పదవికిఁ
జనఁడె ప్రసిద్ధంబుగాఁగఁ జండీశుఁ డజా!
| 391
|
క. |
తన కన్ను పుచ్చి యొకఁ డ
త్యనుపమమౌ భక్తి నీపదాంబుజములు నే
ర్పునఁ బూజించి సుదర్శన
మను చక్రము వడసెఁగాదె! యచ్యుతుఁడు శివా!
| 392
|
క. |
శివనిందాశ్రవణమునన్
భవాని తన దేహమాత్మ పావకమునకున్
హవి సేసిగాదె భక్తిని
భవదర్ధాంగమున నుండఁ బడసె మహేశా!
| 393
|
క. |
శివనింద వింటినని ప్రా
ణవియోగాగ్నిని యథారుణాధరుఁడై కా
దె విరాజితగణపదవికి
భువి నెగడెను వ్యాఘ్రపాదపుత్రుఁడు రుద్రా!
| 394
|
క. |
దేవ! నిను వీరభక్తిని
బోవక తనతలలు దరిగి పూజించి వడిన్
రావణుఁడు చంద్రహాసము
దేవేంద్రజయంబు వడసెఁ దెల్లము గాదే!
| 395
|
క. |
చేతులు రెండును దునిమి మ
హాతాత్పర్యమున మిమ్ము నర్చించి జగ
త్పూతముగ మగుడఁ బడయఁడె
భాతిగ నీచేత భట్టబాణుఁడు రుద్రా.
| 396
|
క. |
గొఱియల పా ల్నీమీఁదను
నెఱయఁగఁ బిదుకునెడఁ దంతండ్రి నిష్టురుఁడైనన్
మఱి వానిఁ జంపి నీదయ
గొఱలఁడె గణపదవి గాటకోటఁడు రుద్రా!
| 397
|
క. |
అరుదుగ శివాగ్నిఁ దనయొడ
లురుతరశివభక్తి వీరహోమంబుగఁ జె
చ్చెరఁ గోసి వేల్చి నీదయ
సరి ముక్తికిఁ జనఁడె! వీరశంకరుఁడు శివా!
| 398
|
క. |
కన్నులు రెండునుఁ బుచ్చుచు
మున్నీశ్వర! సోమవారమున హుంగరలోఁ
బన్నుగ శివనాగయ ని
న్నున్నతిఁ బూజించి పడయుచుండఁడె రుద్రా!
| 399
|
క. |
తన కొడుకుఁ దునిమి వంటక
మొనరఁగఁ గావించి నీకు నొప్ప నివేదిం
చినదాన హెచ్చి ముక్తికిఁ
బొనరఁగఁ జిఱుతొండనంబి పోవఁడె రుద్రా!
| 400
|
క. |
కోరి తనశిరము నీపద
నీరజములఁ బూన్చి భక్తి నీలావున జం
బూరి మహాకాళయ్య య
పారైశ్వర్యమును మగుడఁ బడయఁడె రుద్రా!
| 401
|
క. |
మొఱటర వంకయ దనతల
లఱి మెల్వడఁ దఱిగి నీ పదాంబుజములఁ గ్ర
చ్చఱఁ బూన్చి మగుడఁ బడయఁడె?
నెఱయఁగ నిను నమ్మి భక్తి నీచేత శివా!
| 402
|
క. |
శిరము దెగఁగోసి నీ పద
సరసిజములఁ బూన్చి నీ ప్రసాదంబున శం
కర! మూన్నాళ్ళకుఁ గరుణా
కర! గోవిందుడు వడసెఁ గటకమున శివా!
| 403
|
క. |
వరగొండ చక్రవర్తికిఁ
గరుణింప జగత్త్రయప్రకాశిత భక్తి
స్థిరుఁడన బడసెను క్షితి నీ
పురమునకుం బొందితోన పోవఁగ రుద్రా!
| 404
|
క. |
తవిలి తన యూరి యాబా
లవృద్ధముకు మున్ను సొనిపి లాలితముగ నీ
శివలింగముతోఁ గూడఁడె!
శివ! నీదయ నొడయపిళ్ళ శీఘ్రమున శివా!
| 405
|
క. |
ఒక్కఁడ దైవము శివుఁడని
నిక్కము సేయుటకు ముడిచె నిప్పుల చీరన్
స్రుక్కక శ్రీపతి పండితుఁ
డక్కణముగ విజయవాడ నలజమ్మి శివా!
| 406
|
క. |
కడుఁ జోద్యము భక్తులకును
గడుఁ గూర్చట నీదు భక్తి గౌరవమునకుం
గడు మెచ్చి యొడయ నంబికి
నెడవోయితి గాదె! లంజ యింటికి రుద్రా!
| 407
|
క. |
త్ర్యంబకుఁడ దైవమని చి
త్తంబునఁ గడునమ్మి నిన్నుఁ దడయక భక్తిన్
నంబియుఁ గిన్నెర బ్రహ్మయ
యుం బిలిచిన గరుణ వారి కో యనవె శివా!
| 408
|
క. |
అమితదృఢభక్తి నీ దయఁ
గొమరుగఁ బరిజనులతోడఁ గూడనె శివలో
కమునకు దేహముతోడన
రమణీయము గాఁగ మలయరా జరిగె శివా!
| 409
|
క. |
హరలీలాస్తవరచనా
స్థిరనిరుపమభక్తిఁ దనరు దేహముతోడన్
సురుచిరవిమానమున నీ
పురమున కుద్భటుఁడు వ్రీతిఁ బ్రోవఁడె రుద్రా.
| 410
|
క. |
ఒడఁబడ గుమ్మర గుండయ
వడిఁ గడవలు చేసి చఱచు వాద్యములకు న
క్కడఁ బ్రీతి నాడె దెప్పుడు
బెడఁ గడరఁగ నతని భక్తిపెంపునకు శివా!
| 411
|
క. |
నరు లెల్లం జూడ నిజో
దరము ప్రవేశింపఁ గాదె తన కట్టిన యం
బర మొక మూరెడు దోఁపఁగ
నరియమ రా జరిగె ముక్తుఁడై నీ కరుణన్.
| 412
|
క. |
భయము సెడి నిన్ను నమ్మిన
జయమునఁ దరియఁబడి నడచు సాహసమున నీ
దయ నిండి పాఱువది దా
రయ ముడిగెను ముసిఁడి చౌండరాయనికి శివా!
| 413
|
క. |
తనుఁ గని మ్రొక్కిన "దీర్ఘా'
యని పలికినఁ బిదపఁ జచ్చె నాఁటది తగునే
యనఁ బ్రాణము వడసెను వా
రని దయతో ముసిఁడి చౌండరాయఁడు రుద్రా!
| 414
|
క. |
తన లంజయునుం జిల్కయుఁ
దన లంజియ బంధుజనులు దానును జనఁడే!
జనులెల్లఁ జూడ మలహణు
నిను సంస్తుతి చేసి దేవ! నీ పురమునకున్.
| 415
|
క. |
వెలయఁగ నాఁబోతులుఁ దప
సులు మృతులై యెదురురాఁగఁ జూచుచుఁ బ్రాణం
బులు వడయఁడె! నీదయ వా
రల కప్పుడె ముసిఁడి చౌండరాయఁడు రుద్రా!
| 416
|
క. |
పెనిమిటి శివభక్తుడు గా
డని యొల్లక రోసి నిన్ను నడిగిన రాత్రిన్
బనఁబడసె గాదె! శంకర!
గొనకొనఁ బుంస్త్వమ్ము నాఁడు గూఁతురు నీచేన్.
| 417
|
క. |
కెంబాగి బోగిదేవని
వెంబడిఁ జని వచ్చి వీడుపీఠంబుల లిం
గంబులు వడి విప్రులు లీ
లం బొగడఁగ నిట్టి వత్సలత్వము గలదే!
| 418
|
క. |
విన్నపము సలిది యంబలి
మున్నని నివేద్యంబు సూపి మ్రొక్కుచు నీకున్
సన్నుతభక్తిని మాదర
చెన్నయ నీ కరుణ ముక్తి చేకొనఁడె శివా!
| 419
|
క. |
కూడి జగమెల్ల నోపక
యోడిన శివభక్తి మహిమ యుత్కృష్టముగా
నేడర బంకయ చూడఁగ
దేడరదానయకుఁ దలుపు దెఱవవె రుద్రా!
| 420
|
క. |
శంకర! నీ కింకరుఁ డ
భ్రంకషముగ నేత్రవహ్నిఁ బరదైవములన్
బొంక మడఁగింపఁడే! భువి
శంకరబాదాసయ్య నీ ప్రసాదమున శివా!
| 421
|
క. |
కడవఁగ నేరక మ్రొక్కిన
నడుమప్పుడు [70]డుస్సివడ జినప్రతిమ మహిన్
బడియందు వైజకవ్వకుఁ
బొడసూపవె! లింగమూర్తిఁ బుగహర! దయతోన్.
| 422
|
క. |
కడిచేసి వెట్టగాఁ గొని
సడిసనఁ గటకమున సురియ చముడయగారిన్
గడుఁ గరుణించి జగమ్ములు
గెడఁగూడి నుతింప నారగింపవె! రుద్రా!
| 423
|
క. |
తా ముందరఁ జని సూచిన
యామాంసము నీకుఁ బెట్టి యతిశయభక్తిన్
వ్యామోహంబున నీదయ
గా ముక్తికిఁ జనఁడె! యెఱుక గన్నప్పఁ డజా!
| 424
|
క. |
భావనయ భక్తి నీకును
భూవినతుఁడు మేలు కబ్బములు సెప్పి మహా
|
|
|
దేవ! తన దృష్టి శివలో
కావాప్తిం బడసెఁ గాదె! యంబన నీచేన్.
| 425
|
క. |
ఇమ్ముల విపినమ్ముల ని
త్యమ్మును శివలోకమునకుఁ దడయక చనవే
నమ్మిన నీ భక్తుండగు
బొమ్మయ చంపిన మృగములు చోద్యముగ శివా!
| 426
|
క. |
స్థిరభక్తి యుక్తిఁ దృణమున
నరదుగ దా నిలిచి భక్తుఁడను దయఁ గంచిం
గరికాలచోడ నృపతికిఁ
గురియింపవె పసిఁడివాన గోరిన భంగిన్.
| 427
|
క. |
అవిరతదృఢభక్తిం గే
శవరాజు శిరంబునందు సన్నిహితుఁడవై
భువి లింగమూర్తి సేకొని
యవతారము చేయ! మహామహిమ శివా!
| 428
|
క. |
పూని వడి నేడు నాళుల
పీనుఁగునకు వీరభక్తిఁ బ్రీతాత్ముఁడ వై
ప్రాణం బొసఁగితి గాదె ద
యానిరతిం గదిరి రేమణార్యునకు శివా!
| 429
|
క. |
నీపురమునకున్ శివ! నీ
ధూపావసరమున ఘంటతోడనె భక్తి
వ్యాపారంబున నోహిళు
డాపోయెన నంగఁ బోవఁ డయ్యెనె రుద్రా!
| 430
|
క. |
అసమేక్షణ! శివభక్తుం
డసమశ్రేష్ఠుఁడని పలికి యన్యులతోడన్
|
|
|
బొస పోరై బండారువు
బసవఁడు విస మెత్తి త్రావి బ్రతుకఁడె రుద్రా!
| 431
|
క. |
వసుధ నుమేశుఁడె దైవము
ప్రసాదము పవిత్ర మీశుభక్తులె కులజుల్
పొసపోరని బండారువు
బసవన విస మెత్తి త్రావి బ్రదుకఁడె రుద్రా!
| 432
|
క. |
కుసుమశరారీ! శివ! లిం
గసమేతులు దక్కఁ బొందఁ గాదని నిర్మా
ల్.ం సుఖంబని బండారువు
బసవన విస మెత్తి త్రావి బ్రతుకఁడె రుద్రా!
| 433
|
క. |
అల పూరి వీరభక్తికి
నలి నెంతయు మెచ్చి పాండ్యనాయకుకడ కి
మ్ముల నీవ వచ్చి పీఠము
వెలయఁగఁ చేకొంటి కాదె! విష్ణువరేణ్యా!
| 434
|
క. |
స్థిరభక్తి నీకుఁ బాడుచుఁ
బురహర! తన చేతి తాళముల తోడవె చె
చ్చెర మీఁదికి నెగసి భవ
త్పురమునకును శంకరుండు పోవఁడె రుద్రా!
| 435
|
క. |
కొడుకని చేకొని నిన్నును
మడఁది యతిప్రీతి బెజ్జమహదేవి మహిన్
గడకొని యాడిన భక్తికి
నొడఁబడి యాయమకు ముక్తి యొసఁగవె రుద్రా!
| 436
|
క. |
తన గుఱ్ఱము సతులును బరి
జనులునుఁ దనతోడ రాఁగ శాశ్వతభక్తిన్
జనియె భవత్పురమునకును
గొనకొనఁగఁ గుమారసాల ఘూర్జరుఁడు శివా!
| 437
|
క. |
గుడి వడుగు దాఁచి కుంచియ
పొడ సూపక తలుపు వెట్టి పోయిన నీ వ
ప్పుడె తలుపు దెఱచి భక్తికిఁ
బొడసూపవె! కిన్నెరునకుఁ బురసంహారా!
| 438
|
క. |
చోడని యేనుఁగు జంపుచుఁ
జోడని శివభక్తి మహిమ చొప్పడ నీచే
రూడిగఁ గ్రమ్మఱఁ బడయఁడె!
యోడక యిఱుదత్తుఁ డనఁగ నొకభక్తుఁ డజా!
| 439
|
క. |
కడుఁగడు రౌద్రంబున జత
పడు మదగరిఁ జంపి యపుడ పడయడె భువి ను
క్కడఁగియు బిజ్జలుఁ డడుగుడు
మడివలు మాచయ్య భక్తి మహిలోఁ గలదే!
| 440
|
క. |
రావీది యేచి యెక్కిన
మావంతునిఁ జంపి వచ్చు మదకరి దనపై
రా వెఱచి మగుడఁ బాఱదె!
బావురి బ్రహ్మయకు నీప్రభావమున శివా!
| 441
|
క. |
భూతలమున నిది యంతయు
నూతనమని పొగడ నేడు నూఱేండ్లు మనం
డే! తనకు భక్తిఁ ద్రిపురా
రాతీ! సకలేశు మాది రాజయ్య శివా!
| 442
|
క. |
ఎడపక పూజాంతమునన్
చిడిముడిపడి [71]ఘర్ఘరములు సెలఁగఁగ నీ వె
ప్పుడు మెచ్చి భక్తి కాడుదు
వడిఁ [72]జేరమ చక్రవర్తి వాయింప శివా!
| 443
|
క. |
నమ్మిన భక్తుఁడు గన్నడ
బమ్మయ సద్భక్తి మహిమ పరికింపఁగ లో
కమ్ములఁ జోద్యము గాదె! య
[73]ధర్మంబును ధర్మమయ్యెఁ దత్త్వాతీతా!
| 444
|
క. |
పరువడి మఱియు ననేకులు
ధర బాణ మయూర కాలిదాసాది మహా
పురుషులు దృష్ట ప్రత్యయ
వరములు నినుఁ గొలిచి కనిరి పరభక్తి శివా!
| 445
|
క. |
వలయునని దేవ! కొందఱ
నెనకొని పేర్కొంటిఁ గాక నీచేత వర
మ్ములు వెలయఁగఁ బడగిన భ
క్తుల కొలఁ దెఱుఁగుదు ననంగఁ గొలఁదియె నాకున్.
| 446
|
భక్తి మహిమ
క. |
మహిలోఁ గేవల భక్తి వి
రహితములై చేయబడి కరంబును దుఃఖా
వహమై దక్షుఁడు సేసిన
విహితక్రియ లెట్టు లట్ల విఫలంబు లగున్.
| 447
|
క. |
నీ పదభక్తుఁడు సేసిన
పాపంబుం బుణ్యమగు నభక్తులు సేయన్
|
|
|
బాప మగుఁ బుణ్య మైన ను
మాపతి నీ తలఁపె వేదమార్గం బయ్యెన్.
| 448
|
క. |
మొల్లల వైచిన లక్ష్మీ
వల్లభసుతుఁ గాల్పవే! యవారితవృత్తిన్
[74]మొల్లమిగ ఱాల వైచిన
యల్ల గణాధిపున కీవె! యపవర్గ మజా!
| 449
|
క. |
కావున సకలక్రియలును
గేవల భక్తిప్రయుక్తికిని సరిగామిన్
గేవల భక్తియ మేలని
గోవిందవరేణ్యు వరదుఁ గొలువవె! శంభున్.
| 450
|
క. |
వనజాసన వనజోదర
సనకాదుల కెఱుఁగరాని శాశ్వతమహిమన్
దనరిన భక్తికి శంభుఁడు
నొనరఁగఁ గడు మెచ్చి భక్తునొద్దన యుండున్.
| 451
|
క. |
ఈ నిచ్చలు గొనియాడెడు
నానావిధములగు నిత్యనైమిత్తికక
ర్మానుష్టానము నొల్లఁడు
దా నెప్పుడుఁ గూర్చు శివుఁడు దన భక్తునకున్.
| 452
|
క. |
ఫలములు గుఱుతిడి శివపూ
జలు చెప్పెడి చదువులెల్ల శాశ్వతపదవిన్
వెలసిన కేవల భక్తి
స్థలముల వర్ణించి చదువఁ దద్దయుఁ దగునే!
| 453
|
క. |
శ్రీలింగదేవు భక్తుల
కాలక్ష్మీశాబ్జసంభవాదుల పదవుల్
తూలాయమానములు స
ల్లీ శివానంద సుఖవిలీనుల యగుటన్.
| 454
|
క. |
కేవలము శివుఁడు దనకుం
గావలెనని గోరునట్టి ఘనుఁ డెవ్వండే
గేవల మాతఁడ దనకుం
గావలనని కోరునట్టి కాంక్షన శివుఁడున్.
| 455
|
క. |
మరి విధి నిషేధములుగల
చదువులకు స్వామి భృత్య సంబంధమునం
జొదలిన కేవల భక్తికి
నొదసిన కూటంబు గలదె! యూహింపంగాన్.
| 456
|
క. |
ఫలియించు విధినిషేధం
బులవలనను బుణ్యపాపములుఁ దత్కర్మం
బుల నగు నయ్యైలోకం
బులు భోగాంతమున మఱియుఁ బుట్టుగ కలుగన్.
| 457
|
క. |
కావునను విధినిషేధవి
భావనుఁడై యుభయకర్మఫలవిరహితుఁడై
కేవల నిష్ఠం గొలుచుట
భావింపఁగ శుద్ధభక్తిపథము ధరిత్రిన్.
| 458
|
క. |
పరమేశ్వరుఁడగు శంభుఁడ
శరణం బని భక్తి నమ్మి శంకరుఁ గొలువన్
దొరకొను భృత్యాచారము
సరియే! పెఱమంత్రతంత్రజాలము లెల్లన్.
| 459
|
క. |
విధి వేఱ కలదె! భక్తి య
విధి విధిసహితముగ భక్తివిరహితుఁడై తా
విధియించి యశ్వమేధము
విధిపుత్రుఁడు దక్షుఁడైన విధి యెఱుఁగరొకో!
| 460
|
క. |
పృథు విధి నిషేధ లోక
ప్రథితోభయకర్మరాశి బ్రాపించెన్ నీ
"పథవర్తిని [75]తేషాం మమ
యథా తథా" యనుటఁ జేసి యంబారమణా!
| 461
|
క. |
శివునకుఁ దనువును [76]మనమును
శివభక్తులకును మనంబుఁ జిత్తప్రీతిన్
భువి నిచ్చి యెల్లవారికి
శివుఁడను నే ననక యునికి శివభక్తి యగున్
| 462
|
క. |
వెలుపలఁ గడిగిన లోపలఁ
గల చిత్తమలంబు వోవఁగా నేర్చునె! ని
చ్చలు భావశుద్ధిఁ గడు ని
ర్మలమతి శివుఁ గొలువవలయు మానుగ భక్తిన్.
| 463
|
క. |
కత్తిఁ గొని కోసి దేహము
జొత్తిల్లఁగఁ గడిగినను విశుద్ధం బగునే!
రిత్తలు దక్కిన శుద్ధుల్
చిత్తంబున శుద్ధి వలయు శివుఁ బూజింపన్.
| 464
|
క. |
ఒడలఁ గల యవయవంబులు
గడిగిన మఱి వానిలోనఁ గడు నిండిన చేఁ
|
|
|
దుడుగునె దేహము వెలుపలఁ
గడిగిన నది చిత్తశుద్ధి కారణమగునే!
| 465
|
క. |
అంతర్గరచిత్తం బ
త్యంతము దుష్టమగునేని యది మఱి ఘటదృ
ష్టాంతగతి శుద్ది యగునె! ని
రంతరబహుపుణ్యతీర్ధయాత్రాదులచేన్.
| 466
|
క. |
సకలజగత్పతియగు శివు
నికి భక్తులు వీరు నాఁగ నెగడిన పుణ్యా
ధికులం దొండొకదుర్గుణ
శకలంబులు వెదకు పాపజాతులు గలవే!
| 467
|
క. |
అతఁడు స్వరూపసుందరుఁ
డాతఁడె సౌభాగ్యవంతుఁ డాతఁడు గుణవి
ఖ్యాతయశోనిధి నీకు మ
హాతాత్పర్యమున భక్తుఁ డగువాఁడు శివా!
| 468
|
క. |
ఆఁతడ జగత్పవిత్రుం
డాతఁడ సంపత్సమృద్ధుఁ డాతఁడ యారో
గ్యాతిశయార్ధుఁడు నీకు మ
హాతాత్పర్యమున భక్తుఁ డగువాఁడు శివా!
| 469
|
క. |
శివసంస్కారవిహీనుం
డవు మానవుఁ డంత్యజునకు నంత్యజుఁ డరయన్
శివసంస్కారనియుక్తుం
డవు మానవుఁ డగ్రజునకు నగ్రజుఁ డరయన్.
| 470
|
క. |
మాలలఁ గులజులఁ జేయును
బోలఁగ శివభక్తులైన భువి నెఱుఁగరె! మా
నీలగ్రీవుఁడు గులజుల
మాలలఁగాఁ జేయు భక్తి మది లేకున్నన్.
| 471
|
క. |
చెన్నయ మాలఁడు కాఁడే!
మున్ను మహాదేవుఁ గొలిచి ముక్తుండయ్యెన్
జన్నముక శివుని దక్షుఁడు
మన్నింపమిఁ జేసి సచ్చి మాలం డయ్యెన్.
| 472
|
క. |
వేయేమి! దొల్లి ముక్తికి
బోయిరె! విద్యలును వంశములు గలవారల్
బోయము సాలీఁడును మా
కాయజహరుఁ గొలిచి ముక్తి గాంచిరె గాదే!
| 473
|
క. |
వారనియమనియమములకు
ఘోరవ్రతములకు శివుఁడు గూర్పఁడు శివనిం
దారతి విని తను విడిచిన
గౌరీసతి భక్తి యుక్తిఁ గని కూర్చు క్రియన్.
| 474
|
క. |
జపములకుం దపములకును
నుపవాసంబులకుఁ గూర్పఁ డుగ్రుఁడు నిందా
కుపితమతిఁ దన్ను విడిచిన
యుపమన్యుని భక్తియుక్తి కొడఁబడు పగిదిన్.
| 475
|
క. |
కన్ను వడిఁ బుచ్చి పూన్చిన
వెన్నునిభక్తికి వరంబు వెదచల్లు క్రియన్
గన్నులు దెఱవక ముందర
మిన్నక కూర్చున్న శివుఁడు మెచ్చునె వారిన్.
| 476
|
క. |
తన తండ్రిఁ దునిమి భక్తిం
దనరిన చండీశ్వరునకుఁ తనయెంగిలి యి
చ్చిక్రియ శివుఁ డిచ్చెనె పెఱ
జనులకుఁ గేవల వదాన్య జడులకు నెందున్.
| 477
|
క. |
మన్నించుఁ బ్రీతి మాదర
చెన్నయ భక్తియ మనమునఁ జేకొనఁ గాదే
మిన్నక యంటని ముట్టని
చెన్నఁటి వ్రతములకు నేల శివుఁ డెడఁ గూర్చున్.
| 478
|
క. |
ప్రీతి మెయి వీరచోడన
భాతిగఁ గడియెత్త నెఱచి పనుచుడును రజ
స్సూతకి యని తొలఁగె వృష
కేతనుఁ డాపులగ మారగించెడి చోటన్.
| 479
|
క. |
ఉన్నతభక్తి శిరంబులు
పన్నుగ శివుఁ బూన్చి కరుణ వడసిన భంగిన్
మున్నేవిధులం గొలిచియుఁ
జన్న దశాననుఁడు వడయఁజాలెనె చెపుమా?
| 480
|
క. |
తొల్లి శివుఁ గడవఁ బలికిన
కల్లరిఁ దన తండ్రి దునిమి కడుభక్తి మెయిన్
దెల్లమిగ ముక్తుఁ డయ్యెను
గొల్లఁడు గాఁడయ్య! కాట కోటఁడు రుద్రా?
| 481
|
క. |
మును సవి సూచిన కన్న
ప్పని యెంగిలి యారగించి భక్తి ప్రధానం
బని కరుణించెను శంకరుఁ
డని విందుము విధులలోన నది యేవిధియో?
| 482
|
క. |
మఱి శివుఁడు భక్తిఁ గొడుకుం
దఱిగిన చిఱుతొండనంబి దనవాఁడను గా
|
|
|
కెఱుఁగక యేఁటికిఁ గారులు
మొఱిఁగెడు నీ మంత్రతంత్రములు నేకొనునే!
| 483
|
క. |
కడుభక్తి నంబి పిలచిన
నొడఁబడి 'యో' యనినభంగి నొండొకవిధులన్
నొడువులు సెప్పిన వ్రేళులు
మిడిచిక శివుఁ డట్టివారి మెచ్చునె? చెపుడా!
| 484
|
క. |
ఆగమచర్యల కంత
ర్యాగ బహిర్భాగ విధుల కభ్యాస మహా
యోగమ్ములకుం బోయెనె!
భోగన్నకు శివుఁడు వలచి పోయిన భంగిన్.
| 485
|
క. |
అధ్యాత్మజులఁ బెఱమూ
ర్తిధ్యానంబులకు నితరదేవార్చనకున్
విధ్యుక్తక్రియలకు సా
న్నిధ్య మగునె శివుడు బాణునికిఁ గాక భువిన్.
| 486
|
క. |
విష్ణుభక్తి హలాయుధు
నిష్ఠకు వలచిన విధమున నీదగు కర్మా
నుష్ఠానములకు బిలబిల
నిష్ఠలకును శివుడు దలచునే తలపోయన్.
| 487
|
క. |
మరి విను మొరుల విధులకుం
గురియించెనె మెచ్చి లోకగురుఁ డీశుఁడు మా
కరికాల చోడ నరపతి
గురుభక్తికిఁ బసిండివాన గురియించు క్రియన్.
| 488
|
క. |
స్నానములకు దానములకు
మౌనములకు హోమములకు మదిఁ జే కొనఁ డీ
శానుఁడు నమ్మినభక్తికి
మానక.....................................................
| 489
|