యోగిని

పదము సవ్వడి అయిన
చెదురు నీ యోగమని

                హృదయ దేవళ మూర్తి
                ఒదిగి వస్తిని నేను.

పూల పూజించితే
సోలి పోవుదు వనుచు

                ఆలయపు మోసాల
                పూలిడితి పూజిస్తి.

గొంతెత్తి పాడితే
శాంతి పొడి యగుననుచు

               లోలోన గుసగుసల
               ఆలపించితి పాట.

ఎంత కాలము తపసు
కాంత కోరిక ఏమి

               ఎదుట నిలచిన నేను
               ఏవరము లిచ్చేను.