శశికళ/తెర
< శశికళ
శ్రీరస్థు
శ్రీ పరదేవతాయై నమ:
తెర
ధవళమైనదీ తలపు దాటినది
దానికి మొదలూ చివరా లేనిది
నీకు ఇవతల
నాకు అవతల
తెర ఉన్నాది బాలా!
తెర ఉన్నదే!
తెర మీదానిన నీడను జూస్తిని
తెరచాటున నీ పాటలు వింటిని
తెరచొచ్చిన నీ కాంతిని జోగితి
తెరువేమన్నా
తెలియలేకనె
కలిగిపోతినీ
తెర ఉన్నాది బాలా!
తెర ఉన్నదే!
కన్నులు కానని రూపం పిలిచీ
కౌగిలికందని భావం తలచీ
తెరవైపున నా చేతులు మోడ్చీ
అరమూతలు నా తీరని కలవై
చీల్చిన చిరగని తెర ఇవతలనే
చేరగరానీ నీవవతలనే
తెర ఉన్నాది బాలా!
తెర ఉన్నదే!