శశికళ/అనర్ఘము
< శశికళ
అనర్ఘము
నిన్ను దరిసినకాంతి
నిన్ను పొందిన కాంతి
వెన్నెలలు వెలిగెనే
విరిసె మల్లెలు కోటి
నీవు వెలిగే కాంతి
నిన్ను వీడే కాంతి
మిన్ను టేరే బాల
స్విన్నామృతమె లీల
నిన్ను చుట్టి ఒకకాంతి
నీలోన ఒకకాంతి
ఉజ్వలమ్మై స్తిత
ప్రజ్వలమ్మై తప్త
కాంచనమ్మై వెలిగె
నీవు నెలరేకవట్ట
నీవు వెన్నెల వటే
పరమ శోభవు నీవు
నిరతిశయ ప్రణయవే !