శశికళ/అతిధి
< శశికళ
అతిధి
రూపు రేఖల రుచి తళర్ధళ
చూపు సొ బగుల సురభిళమ్ములు
జల జలా వచ్చావు బాలా
పల పలా తోచావు బాలా !
స్వచ్ఛ శోభాపూర్ణ మూర్తివి
విచ్చు పాటల పుష్ప వదనపు
అలలు లా వచ్చావు బాలా
కలలు లా వచ్చావు బాలా !
ఘల్లు ఘల్లన కాలి మువ్వలు
ఝల్లుమన నా జన్మ మంతా
వెల్లువై వచ్చావు ప్రేయసీ !
వెన్నలై వచ్చావు ప్రేయసీ !