శశాంకవిజయము/పంచమాశ్వాసము
శ్రీరస్తు
శశాంకవిజయము
పంచమాశ్వాసము
| శ్రీమన్నరురంగాధిప | 1 |
వ. | అవధరింపుము సూతుండు శౌనకాదిమునీంద్రుల కిట్లనియె. | 2 |
క. | అంత శచీకాంతుఁడు మది | 3 |
సీ. | ధళధళద్యుతి | |
గీ. | కల్పసుమధామభూషణోత్కరము మెఱయ | 4 |
శా. | ఆరీతి న్జనుదెంచి యాఘనుఁడు ప్రోద్యద్దానధారాఝరీ | 5 |
చ. | అఱిముఱి వహ్ని మేషము కృతాంతుఁడు దున్న నరాశి మానవున్ | 6 |
ఉ. | మోమున లేఁతన వ్వెసఁగ ముత్యపుటొం ట్లసియాడ మల్కుతో | 7 |
ఉ. | స్వర్ణచిరత్నరత్నమయచక్రరవంబుల నబ్జజాండముల్ | 8 |
మ. | బహువర్ణాఢ్యకుధవ్రజంబు మణిచాపప్రక్రియక్ మీఱఁగా | 9 |
మ. | హరి గన్పట్టెను విశ్వరుద్రవసుమాహారాజికాదిత్యభా | 10 |
మత్తకోకిల. | ఇత్తెఱంగున మోహరించి మహేంద్రుఁ డాహవకౌతుకా | 11 |
క. | చారులచే నాచందం | 12 |
చ. | చెదరె గిరు ల్దివం బడరె శ్రీపతి దిగ్గున నిద్ర మేల్కొనన్ | 13 |
సీ. | బిబ్బోకవతి గబ్బిగుబ్బ గుప్పినసొంపు | |
గీ. | మోముఁదామర చిఱునవ్వు మురువు మీఱ | 14 |
మ. | బలువజ్రంబులబండ్లు కెంపుటిరుసు ల్ప్రాఁబచ్చఱాకూబరం | 15 |
సీ. | అతిలోకభుజగర్వుఁ డగువృషపర్వుండు | |
| ఘనవిభాజితవిరోచనుఁడు విరోచనుఁ | |
గీ. | యనెడుదైత్యేంద్రు లెనమండ్రు నాజి తామె | 16 |
చ. | వెడలఁ దదీయసైన్యములు వెల్వడె నుగ్రతఁ గాలమేఘము | 17 |
సీ. | మదచండవేదండమండలు ల్గొండలు | |
గీ. | లగుచుఁ గనుపట్టు దైత్యసేనార్ణవంబు | 18 |
ఉ. | ఆపగిదిన్ ఘటించి యమరాసురసైన్యము లంత నెంతయున్ | 19 |
క. | సుభటుఁడు సుభటుఁడు హరి హరి | 20 |
వ. | ఇవ్విధంబునం గ్రమ్మి యమ్మోహరంబులు రెండును ముమ్మరంబుగాఁ బోరునవసరంబున యుగనిగమనారంభసంరంభవిజృంభమాణమహాంభోధరగరాగంభీరంబు లయినభేరీభాంకారంబులును ప్రళయకాలభైరవహుంకారశంకారచనాచరణంబు లయినభీమడమాడమికాఢమఢమత్కారంబులు నకుంఠితపురుషకంఠీరవకంఠనాళక్ష్వేళాకరాళంబు లైనవీరకాహళీకోలాహలంబులును విగ్రహవేళాగ్రహోదగ్రహయగ్రీవగ్రీవామహోగ్రహేషాభీషణతాక్రూరంబు లయినబూరగలరవంబులును మంథాచలమంథానమధ్యమానమహార్ణవోదీర్ణనినాదానువాదంబు లయినయసంఖ్యశంఖఘుమఘుమప్రణాదంబులును సంవర్తనర్తనప్రవృత్తమృత్యుంజయచరణసంఘటనస్వనపోషణంబు లయినవీరభుజాస్ఫాలననిర్ఘోషణంబులును మహావరాహఘోణారవజయప్రవీణంబు లయినపటహడిండిమడమరుఢక్కాఝల్లరీతమ్మటప్రముఖనిఖిలవాద్యరావంబులు గొల్లన నుల్లసిల్లిన ఝల్లన మదంబు లుప్పతిల్ల నిప్పు లురులుచూడ్కులఁ బ్రతిసేనాగజంబులఁ గనుంగొని ఘళంఘళధ్వానంబులు మీఱ బారిగొలుసులు పరబలంబులఁ బాయం గొట్టి యుద్యదాధోరణంబు లయినరిపువారణంబులం దాఁకి ఘణిల్లు ఘణిల్లునం గొమ్ముక ట్లొరయ నగ్నికణంబులు నభోంగణంబున కెగయఁ గఠిల్లుపెఠిల్లునన్ గఠోరదంతంబులు చిటులఁ దుండంబులు పెనుచుకొన నొండొంటిం దాఁకి ఘణంఘణితకాంచనఘంటికాసంఘంబులతోడంగూడ ఱెక్కలతోడికొండలుంబలె నొకటొకటిం బట్టికొని యిమ్ముగా దంభోళిశకలాకారంబు లయినకొమ్ముకత్తులు గట్టినకొమ్ము లెంతయుం జూడఁ గ్రుమ్ములాడుచుం బోరునేనుంగులును తరటు గావించి ఘోటకంబుల మీటి ప్రతిబలంబులు బడలువడంజొచ్చి పగతురు నిగిడించు కుంతతోమరప్రాసశక్తిశూలాద్యాయుధంబులు చిదురుపలై గగనంబున కెగయం దొడుపుకత్తులు బిసబిస విసరుచు వేడంబులఁ దిరుగుచు కేడెంబు లొడ్డుకొని చకచకాయమానంబు లయినచికిలిబాకుతారులు గొని నఱుకులాడురవుతులును రథచక్రఘోషంబులును గేతనపటపటాత్కారంబులు నింగిముట్ట నరదంబులు నిబ్బరంబుగాఁ బఱపుచుం బ్రతిశతాంగంబుల నబ్బాటుగా మెట్టింపుచు లాఘవలక్ష్యశుద్ధిదృఢత్వచిత్రత్వంబులు మెఱయ సర | |
| యంబుగాఁ గోదండపాండిత్యంబు నెఱపుచు నంపపరంపరలం బెంపరలాడురథికులును గుదికాండ్రచేసన్న నుబ్బి గబ్బి మిగులం బొబ్బ లిడుచు నొక్కనితోఁ బెక్కండ్రును బెక్కండ్రతో నొక్కండును తారసంబై యీరసంబున నుక్కునారాసంబులు నిగిడించియుఁ జేరినచోట నీటెలం బోటులాడియు డాసినయెడఁ గరాసిగొని మిగులహత్తినయెడ సూరికత్తులం గొని యుద్దులుద్దులుగా గుద్దులాడు కాలుబంట్లును గలిగి దారుణం బయినయారణంబునఁ దదీయక్రోధాగ్నిధూమస్తోమంబులచొప్పున నప్పగంబునన్ గప్పలు విరాటుకుం గప్పుకప్పుదుప్పటియొప్పున గుప్పునం దుప్పఁ గట్టుటయును తమవారనియును బెరవారనిఁయునుం దెలియక చేసన్నలం దడవి పట్టుకొని యుబ్బినకైదువులచే నేటులాడి రయ్యవసరంబున నయ్యమరాసురసేవాసందోహంబులు నెత్తురువానల నమ్మహీపరాగం బణంగుటయు ఖండంబు లయినతుండంబులును దుమ్ము రయినఱొమ్ములును భేదంబు లయినపాదంబులును దీర్ఘంబు లయినకర్ణంబులును చీలిక లయినచూళికలును విద్ధంబు లయిన వాహిత్థంబులును గాయంబు లయినకాయంబులునుం గలిగి మావంతులతోడం గూడఁ బీనుంగు లయినయేనుంగులును పగిలిననోళ్లును బరియ లయినజోళ్లును దునిసినశిరంబులును తుమురు లయినఖురంబులును జీలినగల్లంబులును జిద్రువలైనపల్లంబులును వీడినభూషణబృందంబులును నలిసినఱొమ్ములును నజ్జు లైనయెమ్ములును బ్రద్ద లైనవెన్ను లును బగిలినకన్నులును దెగినవాలంబులును దీనదశం బొందిన రాహుత్తజాలంబులును గలిగి యపరిమితరక్తధారాతరంగంబులును జక్రంబులు వ్రీలి సారథుల్ గూలి కేతనంబులు వ్రాలి కింకిణులు రాలి రథికులు సోలి రథ్యంబులు వ్రేలి రయంబులు మాలి రణాంగణంబునం దూలి హతాంగంబు లైనశతాంగంబులును బదంబులు రదంబులును పాణులు కృపాణులును నురంబులు శిరంబులును వర్మంబులు చర్మంబులును వెన్నులు చన్నులును పక్కలు డొక్కలును వీనులు జానులును నేత్రంబులు గాత్రంబులును పాలంబులు కపోలంబులును తొడలు మెడలును వేళ్ళు నోళ్ళును గడికండలు పడకండలు నెత్తురులు గ్రక్కుచుఁ బొడిచినపోటుగంటివెంబడి వేదు రెక్కి నఱికి యరివీరుల | |
| శిరంబులు ద్రొక్కి క్రిక్కిరిసినవైరిభటశరీరంబులు తలగడలుగానౌడుగఱిచి మీసంబులమీఁద చే వైచికొని గతప్రాణులై పడినవీరభటులు గలిగి సంగరాంగణంబు ఘోరం బయ్యె నప్పుడు కేశంబులు శైవాలంబులును మొగంబులు పద్మంబులును భుజంబులు మీనంబులును శిరఃకపాలంబులు గవ్వలును ద్విపంబులు ద్వీపంబులును చూర్ణితాభరణరత్నరాసు లిసుకలును కంఠంబులు శంఖంబులును మేదోమాంసమస్తిష్కంబులు పంకంబులునుం గలిగి సురాసురశరీరపట్టంబులు పెట్టలం ద్రోయుచు వేలకొలందు లగునెత్తురుటేరులు ప్రవహింప నందు భూత భేతాళ డాకినీ శాకినీ యాకినీ లాకినీ పిశాచ కూశ్మాండ రాక్షసాదిగణంబు లుద్దులుద్దులుగా నోలలాడుచుం బ్రమోదంబునం దేలుచు నరంబులం బెనచి కరంబులం గట్టినశిరంబు లనునందెలును గజతుండఖండంబు లనుచిమ్మనగ్రోవులం బట్టి నెత్తురునీరు చిమ్ములాడుచు మునింగి యొండొరులం బట్టుచు నిట్టలంబుగా జల క్రీడలాడి క్రొవ్వుపొద లనుతెలిచల్వలు గట్టి నల్ల లనుతిలకంబులు దీర్చి సన్నపురంబు లనుసరంబులు వైచి నేత్రకమలమాలికాజాలంబులు ధరియించి మెదడుగంధంబు లలంది గుండెతండంబులు మ్రెక్కి క్రొత్తరక్తంబులు గ్రోలి చొక్కి సోలుచుఁ గర తాళగతుల నాడఁదొడంగి రప్పు డయ్యిరువాగునం గడిందివీరు లనుబేహారు రథంబులు ననునోడల నెక్కి సంగరం బనుసముద్రంబుఁ జొచ్చి తమతమప్రాణంబు లనుధనంబు లిచ్చి నిచ్చలం బయినకీర్తు లనుముత్యంబులు గొని రాసులు పోసి రయ్యవసరంబున దుర్వారగర్వంబులు పర్వ గీర్వాణులు ద్రోసి నడిచినం బూర్వగీర్వాణులు నెగ్గబారిన వృషపర్వుం డదల్చి తెరలినబలంబుల మరలం బురిగొల్పి తక్కినదండనాథులం దానును రథనేమీక్రేంకార భేరీభాంకార శింజినీటంకార వీరభటహుంకారంబులన్ వియత్తలంబు నొంది యెదిర్చుటయు నిలింపులు గుంపులుగూడి తెంపునం దారసిల్లిన నింద్రుండును వృషపర్వుండును నగ్నియు విప్రజిత్తియు దండధరుండును దామరకుండును మయుండును నైరృతియు వరుణుండును శంబరుండును వాయువు శతమాయుండును కుబేరుండును విరోచనుండును దుర్మదుండును నీళానుండును హయగ్రీవ | |
| శుంభనిశుంభులు నాదిత్యవసురుద్రులును ద్వంద్వయుద్ధంబునకు దొరకొనఁ దొణఁగి రప్పుడు. | 21 |
ఉ. | సింగముమీఁద నెక్కి, పటుశింజిని మ్రోయఁగడంగి, విక్రమా | 23 |
వ. | తదనంతరంబ యాలోన. | |
క. | సౌరగజేంద్రము దానిం | 24 |
క. | నేజము గొని, యి ప్పోటున | 25 |
క. | దానికిఁ గలఁగక శతమఖు | 26 |
క. | అందుకు వెఱవక తురగము | 27 |
క. | సుడి వడకయె వేడంబుల | 28 |
క. | అమ్మదనాగేంద్రంబును | |
| మమ్మాఱె యనుచుఁ జూపఱు | 29 |
క. | వాలమున నింద్రుడు కర | 30 |
ఉ. | అందుక యుగ్రతుండమున నందుక నబ్ధిఁ బరిభ్రమించు న | 31 |
ఆ. | హయము విడచి యసుర రయమున లంఘింప | 32 |
క. | కనుపట్టి శరపరంపర | 33 |
చ. | అనలుఁడు విప్రజిత్తియు రయంబున మార్కొని పోరువేళ న | 34 |
సీ. | తారకయములు విస్తారకనచ్చాప | |
గీ. | రలవిరోచనుఁ డర్ధేశు నలవి లేని | 35 |
క. | తక్కుఁ గలదనుజవీరులు | 36 |
క. | నక్రౌర్యత నావేళన్ | 37 |
క. | నేఁడే కడంగి శుక్రుఁడు | 38 |
లయగ్రాహి. | బంగరుబెడంగు బలుసింగిణి వడిం గరమునం గొని కడంగి ధర నింగియుఁ గలంగన్ | 39 |
ఉ. | తోడనె కూడి దిక్పతులు దుస్సహసూర్యకరంబులో యనన్ | 40 |
క. | మాయాదీవ్యంతులు శత | 41 |
సీ. | నగములై కూరపన్నగములై హలహల | |
గీ. | వెఱపుఁ బుట్టించి పోనీక వెంబడించి | 42 |
ఉ. | అత్తఱి ధారుణీతలవియత్తలము లన నొక్క టయ్యె ను | 43 |
ఉ. | అంత జయంతుఁ డెంతయు రయంబున దేవహయంబు నెక్కి రే | 44 |
గీ. | తనదుగాంధర్వమాయ నాదనుజవరుల | 45 |
చ. | దనుజులపాటుఁ జూచి మదిఁ దల్లడ మందుచు నుండు శుక్రునిం | |
| న్వినుతి యొనర్తు నే ననఁగ వేడుక మీఱఁ బురందరుండు నం | 46 |
వ. | ఇవ్విధంబునం బురందరుం డమందానందంబున నందను నభినందనం బొనర్చి బృందారకసేనాసందోహంబులుం దానును చందురునిపయిం దాఁకుటయు నితండునుం దనసహాయు లైనదైతేయులపాటును జయంతునిపోటునుం జూచి మనంబునఁ దాపంబునుం గోపంబునుం గదుర నెదుర సదరలజ్జావిషాదవేదనావిభావ్యుం డైనకావ్యునిం జూచి మీయీక్షణంబున కీక్షణంబున నారణంబుచే పారణం బొనర్చెద నిమిషంబున ననిమిషు లెట్లయ్యెదరో కనుంగొనుఁ డని ప్రార్థించి శుక్రుని రథం బెక్కించుకొని శంఖకర్ణనామకుం డైననిజసారథిం జూచి నీరధితెరల తెఱఁగంటిన తెరగంటిబలంబులం గనుంగొంటివే గాడ్పుకంటెను మనంబుకంటెను మనరథంబును రయంబుగాఁ బఱపింపుము. మాతలి సిగ్గుఁ బఱపింపుము. నీ సూతచాతుర్యంబు నెరపింపుము. చూత మని యగ్గించుటయు నతండును నిజమనోరథంబున కనుగుణంబుగా రథంబు నడిపించుటయు వజ్రమణిగణప్రభావిభాసితంబును వైడూర్యమయహరిణధ్వజాభిరామంబు నగునమ్మహాస్యందనంబు నంబరమణిబింబంబునకుఁ బ్రతిబింబంబై వెలుంగునప్పు డసురపట్టంబులపయిం గిట్టి మేరుశరాసనంబు మోపెట్టుగట్టురాయల్లునివిధంబున నయ్యామినీవల్లభుండు గాండీవంబు మోపెట్టి గుణస్వనంబు గావించుటయు నమ్మహాస్వనంబు బ్రహ్మాండంబు నిండి యాఖండలాదిదిక్పతులం బెండుపఱచె. నయ్యవసరంబున ననేకకోటిమార్తాండమండలప్రభాడంబరవిడంబనం బైనయారాజుదివ్యతేజంబు సురాసురులకు దుర్నిరీక్ష్యం బైయుండె. ననంతరంబ పద్మగర్భుండు పలుకుచిలుకలకొలికితోడంగూడ భండనంబు చూడ కోడెరాయంచ నెక్కి వేదంబులు నధ్యాత్మవాదంబులు యోగంబులు నఖలయాగంబులు కాలాదిపదార్థంబులును మూర్తీభవించి తన్ను గొల్వ నరుదెంచి కశ్యపాత్రివసిష్టవిశ్వామిత్రభరద్వాజప్రముఖు లైనమహామునులం గనుంగొని బహువిధయుద్ధంబులం బేరు వడసి సడిసన్న వార లింద్రాదిదిక్పాలకులు వీరలతోఁ జుక్క | |
| లరా జెక్కటి నెక్కరణిం బెనుగునో చూడవలయు నని పలుకుచు డేవతలకు నదృశ్యుండై యుండె నాసమయంబున. | 47 |
క. | శుక్రుని మృతసంజీవని | 48 |
ఉ. | ఒక్కట దిక్పతు ల్విబుధయోధులతో శశిఁ జుట్టిముట్టి వే | 49 |
ఉ. | అంత నితాంతకోపమున నత్రితనూభవుఁ డాత్మ భారతీ | 50 |
సీ. | వెండియుఁ గడఁగి చంద్రుండు గాండీవకో | |
గీ. | మెండుకొనఁ జేసి కండలకొండ లెసఁగఁ | 51 |
క. | ప్రదర మొకటి శశి యేసిన | 52 |
గీ. | ఘంట నాడించినవితాన గండుతేటి | 53 |
సీ. | అసువు లాసింపనివసువుల నెనమండ్ర | |
గీ. | మఱియు గంధర్వకిన్నరగరుడసిద్ధ | 54 |
ఉ. | ఏచి జయంతుఁ డయ్యెడ నహీనశరంబులఁ జంద్రు నొంచినన్ | 55 |
ఉ. | అంత జయంతుపాటు హృదయం బెరియింప నిలింపభర్త చౌ | 56 |
క. | అని పల్క ననిమిషేంద్రుని | 57 |
ఉ. | ఇద్దఱు నప్రమేయబలు లిద్దఱు నేర్పరు లస్త్రవిద్యచే | |
| ల్పద్దులు మీఱుఁ దారసిలి పద్మభవాండము శింజినీధ్వనిన్ | 58 |
ఉ. | అక్షులు వేయిటం గినుక నగ్నికణంబులు రాలఁగా సహ | 59 |
ఉ. | చందురుఁడు న్బురందరనిశాతశరాహతిఁ గంది నివ్వెఱం | 60 |
క. | కావరమునఁ గానవు నీ | 61 |
క. | ఆమాటల మన మెరియం | 62 |
సీ. | కోడివై మదనుని కోడి వైకృతి సహ | |
గీ. | మఱచితో పరుఁ దెగడెదు మదముకతన | 63 |
చ. | అని యనివార్యరోషమున నగ్నిశిఖాసఖమౌశిలీముఖం | 64 |
క. | ఆహరిహయుపాటునకున్ | 65 |
గీ. | వారి నందఱి మీఱి యవ్వారిజారి | 66 |
ఉ. | ఆయెడ మూర్ఛ దేరి విబుధాధిపుఁ డాగ్రహదుర్నిరీక్ష్యుఁడై | 67 |
గీ. | శుక్రశమనాదిదిక్పతు ల్శక్రుఁ గూడి | 68 |
మ. | ధరణీచక్రము దిర్దిరం దిరిగె దిగ్ధంతు ల్చలించెన్ దివా | 69 |
ఉ. | జంభవిరోధిముఖ్యు లతిసాహసవృత్తి నిజాయుధంబు లు | 70 |
ఉ. | ఎత్తినయాయుధంబు లవి యెత్తినకైవడి నుండ దేహముల్ | |
| జిత్తరుబొమ్మలో యన విచేష్టత నొందినయత్తఱిం జయో | 71 |
సీ. | అంకురత్పులకజాలాంకితగాత్రుఁడై | |
గీ. | కుంచ సారించుకొనుచు నికుంచనాది | 72 |
చ. | అనిమిషరాజి యీగతి మహాజిఁ బరాజితవృత్తి నొందుటన్ | 73 |
క. | వెఱ పేటికి నేఁ గలుగఁగ | 74 |
సీ. | అని పల్కి జోడులేనట్టిబండిని మీఱు | |
గీ. | నలుక హిమరశ్మి నిజకిరణాళి నించి | 75 |
క. | ఈగతి గవిసిన నాతని | 76 |
శా. | ఈలీలన్ హిమధాముఁ డర్కుఁడును దా రెంతే వడిం బోరఁగా | 77 |
క. | నా విని పవనుం డట్లన | 78 |
సీ. | గర్వధూర్వహపఙ్క్తికంధరబాహుకే | |
గీ. | రుద్రకన్యామణీగీతవిద్రుతాశ్మ | 79 |
మహాస్రగ్ధర. | కని యీశున్ వామవామాంగకరుచివిలసత్కంధరాకాంతిదూర్వా | |
| ఘనతరోత్కర్షరింఖత్కరసదనమృగగ్రాసవిత్రాసలోల | 80 |
గీ. | కాంచి భృంగి నివేదితాగమనుఁ డగుడు | 81 |
క. | అమరుల కతనికిఁ గలిగిన | 82 |
చ. | అన విని యింత దుర్జనుఁడె హా హరిణాంకుఁడు వీని దక్షునిం | 83 |
మ. | అని రోషాగ్నికణంబు లుప్పతిలఁగా నాదేవదేవుండు ది | 84 |
క. | ఆనిటలాక్షుఁడు శూలము | 85 |
ఉ. | అంబరవీథి భూతనివహంబులతోఁ జను దెంచి మించి యా | 86 |
మ. | ప్రమథుల్ ఘోరతరాట్టహాసములచే బ్రహ్మాండ మూటాడ శూ | |
| స్త్రమయాసారము నింపఁ జంద్రుడు వడి సర్వాస్త్రసంహారకా | 87 |
క. | వారలఁ దఱుమఁగ గజముఖ | 88 |
గీ. | నాతికై పోరునానలినారి నారి | 89 |
ఉ. | లావున నార్చుచున్ గలుఁగులాయపుతేజివజీరుఁ డంకుశం | 90 |
లయగ్రాహి. | దారుణజగత్ప్రళయవారిదచయస్తనతభైరవధమంధమఘనారవమహాఢ | 91 |
ఉ. | ఆసమయంబునం గుహుఁ డహంకృతితోఁ దనచేతికత్తిచే | 92 |
స్రగ్ధర. | రౌద్రావేశంబు మీఱం బ్రబలభుజబలప్రౌఢిమన్ వీరభద్రుం | |
| త్యుద్రేకస్ఫూర్తిచే నయ్యుడుపతిపయి బెట్టూన్చి వే వైచె వైవన్ | 93 |
క. | తనయులు ప్రమథులు నీగతి | 94 |
క. | వచ్చునిటలాక్షుఁ గనుఁగొని | 95 |
గీ. | అత్రినందన! నీదె గార్హస్థ్య మెన్న | 96 |
క. | నినుఁ జేపట్టి వరం బిటు | 97 |
క. | నీమేనల్లుఁడు గావున | 98 |
ఉ. | నా విని చంద్రుఁ డిట్లనియె నవ్వుచు మీ రిటు లాడ నుత్తరం | 99 |
గీ. | అవని మర్యాద దప్పనియతనిపత్ని | 100 |
క. | దారువనమౌనికాంతా | 101 |
క. | అని పలికి గాండివము చే | 102 |
సీ. | ఆగ్నేయశర మేయ నది యగ్నిలోచను | |
గీ. | విధుఁడు గ్రక్కున పైశాచవిశిఖ మేయ | 103 |
చ. | అజగవకార్ముకంబుఁ గొని యంతఁ బురాంతకుఁ డుగ్రమార్గణ | 104 |
ఉ. | కంజవిరోధి యంత నలుకం జలియింపక చాపశింజినీ | 105 |
క. | పశుపతి పాశుపతాస్త్రము | |
| హ్మశిరోనామక మగుది | 106 |
శా. | ఆదివ్యాస్త్రమహాగ్నికీలములచే నంభోనిధుల్ గ్రాగె బ | 107 |
క. | సప్తర్షిముఖ్యు లతిసం | 108 |
గీ. | ఎంత లే దని క్షణ ముపేక్షింతు వేని | 109 |
చ. | అన విని పల్కుకల్కిమగఁ డంత దయారసపూర మూరఁ బం | 110 |
గీ. | వచ్చి నిజవాహనము డిగ్గి వనజభవుఁడు | 111 |
సీ. | జయజయ శతకోటిశతకోటిసమశూల! | |
గీ. | జయ మహాదేవ! దేవతాజయదభావ ! | 112 |
క. | ఉపనిషదుక్తిశతంబులు | 113 |
చ. | అని చతురాసనుండు చతురాస్యముల న్నుతియించి యిట్లనున్ | 114 |
గీ. | అనువిరించిమృదూక్తుల నాదరించి | 115 |
క. | అజునకు నటుమును జితకా | 116 |
గీ. | శంకరుండును పంకజాసనుఁడు కరుణ | 117 |
మ. | అరవిందాసనుఁ డప్పు డి ట్లనియె చంద్రా! యీచలం బేటికిన్ | 118 |
గీ. | రాజ! నీచేతఁ జేయింతు రాజసూయ | |
| నిప్పు డిత్తన్వి గురునకు నొప్పగింపు | 119 |
చ. | అని పరమేష్ఠి పల్కుటయు నట్లన కా కని చంద్రుఁ డయ్యెడన్ | 120 |
సీ. | ఉడుపతిసంగతి నెడపి తాఁ జనలేని | |
గీ. | మనసు చంద్రునికడ నుంచి మ్రానుపడిన | 121 |
చ. | అమరులతోడ నప్పు డని రబ్జభవుండు భవుండు నగ్గురుం | 122 |
ఆ. | రాజరాజసఖుఁడు రాజీవభవుఁడును | 123 |
క. | మృతసంజీవని సంజీ | 124 |
గీ. | నవమమాసంబునం దొక్కనాఁడు శుభము | 125 |
ఉ. | తత్సమయంబునన్ శశి ముదంబున నచ్చటి కేఁగుదెంచి పు | 126 |
క. | అజుఁ డరుగుదెంచి గురునిన్ | 127 |
క. | గురునకొ గర్భంబు నిశా | 128 |
గీ. | స్రష్ట వగునీ వెఱుంగవె సకలభూత | 129 |
క. | నా విని యజుఁ డోహూహూ | 130 |
చ. | అని గురుచేత నబ్బుధుని నత్రితనూజుని కియ్యఁ జేసి నీ | 131 |
ఉ. | ఆనలినారియున్ సుతసమన్వితుఁడై గజవాజిముఖ్యసే | |
| ష్ఠానపురంబుఁ జేరి యచటన్ బలభిన్నిభవైభవంబుతో | 132 |
ఉ. | దక్షుఁడు చంద్రురూపబలదక్షత లారసి సంతసంబునన్ | 133 |
గీ. | తారకాధ్యక్షుఁ డప్పు డాదక్షు భక్తి | 134 |
క. | అశ్విని మొదలగుకన్యలు | 135 |
చ. | అని శుభలగ్నమందుఁ గమలాసనుఁ డత్రియు సమ్మతింపఁగాఁ | 136 |
గీ. | ఎలమి సుముహూర్తమునఁ దెర యెత్తునంత | 137 |
క. | కళలఁ దగునిర్వదేడ్వుర | 138 |
గీ. | చెలఁగి యిక రాజసూయంబు సేయువేళ | 139 |
క. | సత్పద్మానన లపుడు ల | 140 |
క. | పొలయల్కవేళ నే నిటు | 141 |
గీ. | సూక్ష్మముగ నభమున నున్నఁ జూడవలయు | 142 |
క. | పేరులు చెప్పు మటన్నం | 143 |
ఆ. | నాగవల్లిదాఁక నాలుగుదినము లీ | 144 |
సీ. | అరదముల్ ద్విరదముల్ హరులు గ్రామంబులు | |
గీ. | దాసదాసీజనంబులు తక్కు గల్గు | |
| నరణముగ నిచ్చి సుఖ ముండుఁ డనుచు దక్షుఁ | 145 |
గీ. | అసమవైఖరి నిట్లు పెండ్లాడి చంద్రు | 146 |
మ. | ఒకనాఁ డాయుడువల్లభుండు మదిలో నుత్సాహ మిం పొందఁగా | 147 |
చ. | అతిరయ మొప్ప నబ్జుఁడు శతాంగము నెక్కి సమస్తసైన్యసం | 148 |
క. | జంబూప్లక్షకుశక్రౌం | 149 |
చ. | పదపడి చంద్రుఁ డయ్యమరపాలుపురంబున కేఁగ నింద్రుఁ డిం | 150 |
మ. | రజనీవల్లభుఁ డిట్లనర్గళమహారంహశ్చమూధాటి ది | 151 |
ఉ. | వేలుపుఁబెద్దయానతిని విష్ణునదీతటమందుఁ జాల సు | 152 |
క. | కువలయమిత్రుం డంతట | 153 |
సీ. | జనమోదనంబులు శాల్యోదనంబులు | |
గీ. | చవులు పొగడుచు పఙ్క్తులు సాగి వేడ్క | 154 |
ఉ. | అత్రివసిష్ఠదక్షపులహాంగిరులాదిమహామునీంద్రు లౌ | 155 |
చ. | అనలుఁడు నమ్మహాధ్వరమునందుఁ జెలంగి ప్రదక్షిణార్చి యై | 156 |
క. | స్తుత్యాహంబున మునిసం | 157 |
ఉ. | ఘోటకము ల్రథంబులును గుంజరము ల్శిబికాసమూహము | |
| సాటి యొకింత లేకయె ప్రసర్పకదక్షిణ నిచ్చె దేవతా | 158 |
ఆ. | సుప్రయోగమునను విప్రగణంబుతో | 159 |
క. | ఆరాజు రాజసూయం | 160 |
క. | ఆతపమునకుఁ జలింపక | 161 |
ఉ. | రాజమనోజ్ఞ తేజ ద్విజరాజవు గమ్మని బ్రహ్మఁ బూన్చె స | 162 |
క. | హరిణాంకుం డీకరణి | 163 |
సీ. | సమయంబు దప్పక జలదము ల్వర్షించె | |
గీ. | సోముఁ డసమానసద్గుణస్తోముఁ డమృత | 164 |
క. | ఆచందంబున నెల్లపు | 165 |
గీ. | ఆయురారోగ్యకరము జయాస్పదంబు | 166 |
వ. | అనుటయు. | 167 |
ఆశ్వాసాంతము
ఉ. | మంత్రియుగంధరాకృతివిమానితమంధర! దానకంధరా! | 168 |
క. | శూరవరవారసన్నుత | 169 |
తోటకము. | రాజమానమానరాజరాజరాజసన్ముఖాం | 170 |
గద్య. | ఇది శ్రీజానకీరామచంద్రచరణారవిందవందనకందళితానంద కందాళరామానుజగురుచరణసేవాసమాసాదితసాహితీవైభవ శేషము కృష్ణయార్యతనూభవ సుకవిజనవిధేయ వేంకటపతినామధేయప్రణీతంబైన శశాంకవిజయం బనుమహాప్రబంధమునందు సర్వంబును బంచమాశ్వాసము. | |
శశాంకవిజయము సంపూర్ణము.