శరణాగత వజ్ర
ప|| శరణాగత వజ్ర పంజరుడితడు | చక్రధరుడు అసుర సంహారుడు ||
అప|| వెరవుతోడ తను శరణనువారికి | వెనుబలమీతడే రక్షకుడు ||
చ|| అంతరాత్మ శ్రీ వేంకటేశ్వరుడు అన్యము భజించ చోటేది |
ఇంతట నమ్మక దేవతాంతరము లేటేటివొ మరి చెప్పుదురు |
ఎంతలేదు ప్రాకృత జనముల భ్రమ ఎవ్వరి కాదన నేమిటికి |
ఇంతకు శ్రీ వేంకటేశు దాసుల ఈతడే మాకిక రఖకుడు ||
చ|| శ్రీపతి దిక్కై కావగ జేరని సంపద లికనేవి |
దాపల బుద్ధుల నది నమ్మక విచ్చలవిడి నోములు చెప్పుదురు |
తీపులు పుట్టించి యెవ్వ రేమనిన తెలిపి వాదడువ నేమిటికి |
శ్రీపతి గొలిచితి చేరె సంపదలు జిగినితడే మా రక్షకుడు ||
pa|| SaraNAgata vajra paMjaruDitaDu | cakradharuDu asura saMhAruDu ||
apa|| veravutODa tanu SaraNanuvAriki | venubalamItaDE rakShakuDu ||
ca|| aMtarAtma SrI vEMkaTESvaruDu anyamu BajiMca cOTEdi |
iMtaTa nammaka dEvatAMtaramu lETETivo mari ceppuduru |
eMtalEdu prAkRuta janamula Brama evvari kAdana nEmiTiki |
iMtaku SrI vEMkaTESu dAsula ItaDE mAkika rakhakuDu ||
ca|| SrIpati dikkai kAvaga jErani saMpada likanEvi |
dApala buddhula nadi nammaka viccalaviDi nOmulu ceppuduru |
tIpulu puTTiMci yevva rEmanina telipi vAdaDuva nEmiTiki |
SrIpati goliciti cEre saMpadalu jiginitaDE mA rakShakuDu ||
బయటి లింకులు
మార్చు
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|