శతావధానసారము/మొగల్‌తుర్తికోట
<poem>ఉ॥ చేకుఱె జేకుఱు, గలదు చేకుఱి సట్టి ధనంబు పెంచినన్
జేకుఱు నింతకన్న ను విశేషముగా ధనమంచు లోభమున్
జేకొని యున్న నిన్ను నతిశీఘ్రముగా నొక పెట్ట మ్రింగఁగా
నాకొని యున్న దయ్య మని యాశ నెఱుంగ నదేమి మూర్ఖుఁడా,13
వెం॥ శా॥ చెప్పినది.
శ్రీ శ్రీ శ్రీ
దుర్ముఖి సం|| ఆషాఢమాసము లో మొగ ల్ తుర్తి కోటలో జరగిన శతావధానములో జెప్పిన పద్యములలోఁగొన్ని
ప్రకృత ప్రభువు.
క || శీలమున సంశమ్ముస, నాలాప ముసను 'మేల్ సయమ్మునను మఱే రీ?లోకమున నృపతులు, శ్రీలక్ష్మీ నారసింహ సృపవరుఁ బోలన్ ,1
(ఆంజనేయులు )
సీ|| దాఁటె నెవ్వాడు ప్రోద్దామ వేగాటో వమున గోష్పదమ్ముగా మున్ను వార్థి | మాట నిన్వాలను గంభీరరాశుసరాజకుల మెల్లఁ దసకొనగో టీచేత దాటెనె న్వాండు బంథురత రాగ్ని జ్వాల గలతో కతో లంకఁ గల గృహముల | నాటే నెవ్వాడు ఎన్నాణం పుజయపుఁగంబంబు లంకా పట్టణంబులోన, తే! గీ! నితఁచు గుణవంతుఁ డతి శాంతుఁ డరికృతాంతుఁ డమలసుస్వాంతుఁ డనుపమాసంతకాంతి మంతుఁ డతిమంతుభక్తదుర్మం హరణ నంతుఁ డలరారు శ్రీ హనుమంతుఁ డెలమి2
కోశద్వంద్వమి యుందధాతి" యను శ్లోకము నకు తెలుగు.
చ| నళిని ధరించే సంచముకు నాటిన మొగ్గలు రెండు, చూడు చూ తలత ధరిం చెఁ బుంస్పీక విదారిత మనవల్ల వంబు నెచ్చెలి? గను గొంటి వే!యని వచించు చెలిం గని దీర్ఘ కాతటిన్ గలికి కుచాధగోష్ఠములు గప్పిని బయట గరమ్మునన్3</poem> <poem>
వీరేశలింగముగారు చేయు విధ వివివాహము లను గుఱించి.
సీ|| "మా డబ్బు చెడదొబ్బె మాప్పబుద్దుఁ" డటంచు మంగలివాండ్లు తన్నుం గుణింప ! పెండ్ల ములకు వండి పెట్టఁగా సుఖ యించు వారలేల్లకు త న్ను దూరుచుండ ! విద్యార్థులును మెట్ట వేదాంతులును గూడి తన్ను నేవేళ నిందను నొనర్ప " | మును చచ్చినట్టిమగ నితద్దినం బెట్టు, లని బుధవరులు వా దొనరఁ జేయ, తేః.గీ|| నన్నిటికి 'మోర్చి విధవలౌ నంగనలకు “భ్రూణహత్యలు జరగక పోవుఁగాక,, యంచుఁ బెండిండ్లు సేయ యత్నించుచుండెఁ గందుకూరి వీరేశలింగ ప్రధాని4
ప్రకృతప్రభువు- మందాక్రాం తావృత్తమ్.
స్మేరం నక్త్రంహృదయ మమలం • శీతలా చ ప్రవృత్తి రూపం తాపాపహ మనృత వాగ్వారణీ ధోరణీచ తుష్టి స్తుష్టా బహు వితరణం పుష్టి, రత్యంతపుష్టా జాగర్తి శ్రీకలితనిల యే నారసింహక్ష్మితీంద్రే 5
రాజుతమ్ముడు.
శా||సారాసారవి వేక యుక్తుఁడు యశస్సంపాద నాత్యంతశో భారోచిష్ణుఁడు, రూపవంతుఁడు కళాభ్రాజిష్ణుఁ డశ్యున్న తా గారారామవి శేషభాసురుఁడు శృంగార ప్రధానుండు సు శ్రీరమ్యుండు కరముఁ జెన్న లరు లక్ష్మీ కాంత రా జెల్లెడన్ 6
మన్మ ధుఁడు.
II కలుకులకంగెనలనుస, మ్ములఁగొని విటరాజు హృదయముల్ పగులగ గా సిలఁజేయుచుమారుఁడు తొయ్య లులకు దాసానుదాసుఁడై చరియించున్"7
రామాయణము.
తే!! గీ|| శివునివిల్ ద్రుంచి జనకుని చెల్మి గాంచి సీతఁ బెండ్లాడి వనికి నేం చేసి పిదప రావణునిఁ దున్ని శ్రీరఘు రాముఁ డతివ
తోడఁ బట్టాభిషిక్తుఁడై నాఁడు నాఁడు.8 ,
నల చరిత్ర,
చ||నలుడలయంచకారణమునన్ దమయంతిని బెండ్లియాడి పె
ంగముల నంది జూదమునగాగల కార్యము లొంది మీద గా
నలఁ బలుకష్టముల్ వడి యనంతర మాఋతుపర్ణుజేరి వే
డ్కలు చెలువార నావయి సుఖము ననుం డెను దానుఁబత్నీ యున్”.9
సోమరితనము,
ఆ|| వె|| చదువు మట్టుపడును సంసృతి చెడిపోవు
సంపదలు తొలంగు సౌఖ్య ముడుగు
గౌరవంబు వోవుఁ గావున సోమరి
తనముకన్న హీదవశయుఁగలదె10
వైష్ణవులు స్మార్తులు
సీ|| శివుని యాఖ్యానమ్ము చెవి సోకినంతన నిప్పు తొక్కిన కోఁతినియతి
గాంత్రు | శివు నాలయంబు కంగనఁ దాకినంతన గాలిసోకినరీతి గాఁ జ
రింత్రు | శివ దేవుఁ డూ రేగుసవసరమ్మునఁ దల్పు మూసి పెట్టుక యొ
క్కమూల నుంద్రు | వెలిబూ దె మెసఁటను బెట్టు వారల జూచి ప
కసకసగుచుఁ జప్పట్లుచరతు,
తే| గీ|| రహహ యేమంచు! వైష్ణవులైనవారి
చర్యలను, శివ కేశవస్వాములందు
సార్డులగువారు సమభక్తి సలుపుచుందు
రదియ న్యాయ్యం బటంచు మాకభిమతంబు11
దుర్ముఖ సం|| ఆశ్వయుజ కార్తికములలో రెండవసారి కాకినాడ
లో జరగిన యనేకావధానము లలోఁ గొన్ని పద్యములు
(సమస్య) మాకుల దాస: యెంతయభిమానము లేదుర చంద్రశేఖరా
ఉ||నాకు విభూతిరాయఁ డోక నాయకుఁడా యని నీదు భార్య ర
త్నాకరు చెట్ట వట్టు టది యారసి యుండియు సిగ్గు లేక ర
త్నాకరుఁ జంకఁ బెట్టికొని యక్కులటన్ దలఁ దాల్చి తౌర? భా
మాకుల దాన యెంత యభిమానము లేదుర చంద్ర శేఖరా1