శతావధానసారము/ఉపోద్ఘాతము
చదువరులారా!
ఈ పుస్తకమును బ్రక టించుటకు ముఖ్య కారణము, అవధాపమన నెట్టిదో ఆంద లికవిత్వ మెంతరసము తక్కువక లిగియుండునో, ఆందుగోరెడి కోర్కే లెంత విషయము లుగా నుండునో, యనువిషయ మెల్లరికీఁ దేట తెల్లంబగుట కే కాని దీనివలన మీమనస్సుల ను రంజింపఁ జేయుటకుఁ గాదు. ఇందులో" మాయొనర్చిన యవ ధానపద్యములన్నియును బ్రక టింపక గ్రంథవిస్తరభీతిచే దశాంశమునకన్న ను దక్కువగా మాత్ర మేముద్రిపించి తిమి. కొన్ని యవధానముల లోని పద్యములు రికార్డు దొరకనందున బొత్తిగా వదలివే యఁబడినవి. ఆయీయవధానములలో రచించిన పద్యములు కొన్ని యవసరమును బట్టి యిటీవల మేము ర చించిన యితర గ్రంథములందుఁ జేర్చియుంటిమి. ఆ వి పున రుక్తి గా భావిం చి యిందుఁ దిరిగియు సుదాహరింపఁ బడవయ్యె ... కొన్ని పద్యములు మాత్రమందును నిం దునుగూడఁ గన్పట్టును, ఏ మైనను నట్టిచోట్ల నవధాన పద్యములు గ్రంథమాలలోఁ గలి పి నట్టుగ నే కానీ గ్రంథపద్యము అవధానములలో గలిపినట్లు భ్రాంతి చెందకుండుటకై చదువరులకు నంజలి ఘటించు చున్నారము ఈ విషయమున మామాట ప్రమాణము గాజే సికొన లేని యాయవ ధాసరచనా కాలమునకును గ్రంథరచనా కాలమునకును గల పూ ర్వోత్త రసందర్భముందిలకింతురు గాక! ఈయవధానము లెట్లెట్లు జరిగినవో దేనియందలి కష్టమెంతయో తెలియఁ జేయుటయే కాక మాయెడల నాయాయీక వులకును రాజుల కును నితర పాపాండిత్యముగల యుద్యోగులకును బత్రి కాధిపతులకును గల యసు రాగమును పెల్లంపఁ దగుప్రశంసా పత్రము లేయవధానమునకు సంబంధించిన యా యవధానము క్రింద నే చిన్న యక్షరములతోఁ గొన్ని భాగములు గ్రథవిస్తర భీతిచేమా యవధాన పద్యముల వలెనే వదలినను గొంచెముగా నిందు ముద్రింపించిమి. అందు లో 28 పేజీ లోని కందపద్యములు గుండు అచ్చమాంబగారిచే రచింపబడినవి. ఆ ప్రస్తుత మేయైనను, ఈ మెకొక వ్రేలు విడిచిన 'మేనమామయగు బ్రంహ శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రుల వారిచే నొసఁగఁబడి యీ మెచేఁ బూర్తి చేయఁబడుటయేకాక పదంబడి ఈ విదుషిచే నొసఁగంబడి మాయిరు వురిచే గూడఁ బూర్తి చేయఁబడిన సమస్య నిందు దాహరించుచున్నారము .
(సమస్య) అచ్చాయమ్మకవిత్వధోరణి మహాహ్లా దంబు గల్పింప దే.
శా||సచ్చారి త్రులు పండితప్రవరులు సనోన్యులౌ వార లున్
మెచ్చంజాలనిదైనఁగాని మదిలోమే లెం'త్రు నైజమ్ముగా
నిచ్చోసందియమేల శాస్త్రికవికెంతెంతో వినోదమ్ముగా
నచ్చాయమ్మకవిత్వధోరణి మహాహ్లాదంబు గల్పింప దే1
శా|| అచ్చా? తిక్కన సోమయాజికృత డివ్య శ్రీకకా వ్యాళికిన్? మెచ్చం! తిమ్మ సముద్దుపల్కులకు సమ్మగా జెప్ప దృష్టాంతమా యుచ్చ స్రైణక విత్వసంతతికి నానొప్పారు చున్నట్టి యా యచ్చాయమ్మ కవిత్వధోరణి మహాహ్లాదంబు గల్పింప దే.2</poem>
శా! సచ్చారిత్ర పరాంబికాచరణ కంజాతార్చ నాసక్తి రా జచ్చేతోంబుజ విద్వడీడ్య కవితాంచద్వంశసంజాత వి ద్వచ్చంద్రాయిత వాసు దేవకవిరాజ్ఞాయాద యైనట్టి యీ యచ్చాయమ్మ కవిత్వధోరణి మహాహ్లాదంబు గల్పింప దే. 3</poem> </poem> కొందఱు కవులు మమ్ముఁగూర్చి తనుయ భి ప్రాయమును బద్యరూపము గావ్రా సి సభాముఖమ్మున వినిపించియు, దానిని మాకడకంపకుంటచే నయ్య విమాత్ర మిందులో బొత్తిగాఁ జేర లేదు. మఱియు నీగ్రంథాంతమునఁ బల్లెటూళ్లలోని కవులు గొందు మాపు స్తకముల నపేక్షించి వ్రాసిన పద్యములను వచనములనుగూడఁ బ్రసక్తి కలుగుక తన స్థాలీ పులాక న్యాయముగాఁ గొందఱు రచించిన వానీలో సయితము కొన్ని కొన్ని మాత్రము గై కొని ముద్రింపించితిమి, ఆయుత్తరములవలన మాపుస్తకములయందు లోకులకు గల యాదరము వెల్లడియగును గానఁ బ్రకృతము పుస్తక విక్రేతలమగు మేమవిగూడ గైకొ నవలసివచ్చినది. . ఆందు కొన్ని భాగములు మాకవితా శక్తిం గూర్చియే గాక యనవసర మగు మాయందచందములం గూర్చికూడ గొంతవఱకు నుతించియున్నవి. అయ్యవి యా చకుల స్వభావముం దెలిసికొనుటకుఁగాని లేక యే దేని యొక గుణమున్న చోట సర్వసు గుణములుగూడ నుండునని లోకులను కొందురనుటకుఁ గాని సూచకములై యంతింబోక చదువరులలో మాయంద సూయగలిగిన కొందఱు మమ్మి మూలమున నించుక యాక్షే పించి సంతసించుటకుఁగూడఁ బ్రేరక ములగుఁగాక! ఏమైనను మేమే కారణము చేతనో మాపుస్తకముల నీ కాలపుఁ గొందఱులు కవులవలె నాయాయి సుప్రసిద్ధులో యప్రసిద్దులో యగు కవులకడకంపి వారి సదభిప్రాయ మునో దురభిప్రాయమునో కైకొను తలంపు బొత్తిగా లేని వారమగుటచే నిర్వ్యాజ సిద్ధములగు వాని నేల యనాదరింపవలయు నని యిందుముద్రింపించితిమి. పుస్తకము సూరకే రాఁబట్టుటకై లేనిపోని నుతులు పచ రించి యుందురని యు పేక్షింతమనుకొన్న ను, నిందుఁగొందఱు మూల్యమున కే గోరినవా రునుంగలరు. ఈ ప్రశంసాపత్రములు సంపాదించు వారి గూర్చి మేము మాపాణీ గృహి తయను గ్రంథపుఁ బీఠిక లోఁ బూర్తీ గా వ్రాసియున్నారము. వలయువారలందరికిం పఁగలరని యిందంతగా విస్తరించ లేదు. ప్రశంసాపత్రములలో నేమి, యీయుత్తర ములలో నేమి, వ్యాకరణాది స్టాలిత్యములు మాయాశుక విత్వముతోపాటు క లిగి యేము న్నవి కాని చేతి పొరపాటులుతప్పఁ దదికరములు దిద్దుటకు మాకథి కారము లేనం దున దిద్దఁబడవయ్యె, ఏవో కొన్ని తప్ప దురుద్దరము లంత గా లేవనివిగ్ను లకుఁ దెలియును గానీ ప్రారంభదళ యందుండు వారికి మాత్రము న్నియును దురుద్ధరము లే యగు నను నూహ కలుగక మానదు. వారు పెద్దలగు వారినడిగి తెలిసికొందురు గాని వృథాగాఁ ద మకుఁ గల పొండితితోడ నే తృప్తి నంది యాయాయీకవుల నేమీ మమ్ము నేమి నిందింపు కుదురు గాక ! యని యంజలి ఘటించుచున్నారము . ఇఁకఁ బ్రకృత మనుసరింపుదము. మేమిందు ముద్రింపించిన యవధాన పద్యములు తఱచుగా భిన్న విషయములు గా నుం డునట్లు మాత్రమే విచారించి కొంటిమి గాని సరసములగు పద్యములను మాత్రము ? కొని నీరసములను వదిలిన వారము కాము, కావున నే నీరసపద్యములు గూడ నిందు విశ్లేషించి కన్పట్టును. మాయవధానములలోఁ గొన్నింటఁ జెరి సగముగను గొన్నిఁట నాలన వంతుగను వానమామ లావధానములో మాత్రము పాదన్యూనము -గను సం స్కృతిక విత్వము గూడఁ గల్గియున్న ను నయ్యది సర్వసులభము కాదనియును బకృత కాలముంబట్టి యీయాంధ్ర దేశమున దానియందంత గా నాదరము కనుపట్టదనియును యోజించి తెలుగు పద్యములనే విశ్లేషించి కొంటిమిగాని గీర్వాణమును బూర్తి గాఁ గాకపోయినను జాలభాగము పరిత్య జించి యెవరేని పండితులు మారకుధారసం స్కృతిమ్మున నెట్లుండునో యనుతలంపు కలవారుంకకపోదురా యనుతలంపుతో వాసమామల శతావధాన శ్లోకములు మాత్రము చాలభాగము నందుఁ జేర్చితిమి. ఇం దుఁ గొన్ని యష్టావధానములు సమస్యామయములుగా రచింపఁ బడినవియుఁగలవు. ఏమైనను నిందు మాబుద్ధి బలము నే చూతురు గాని కవితా రసముంజు డకుందురు గాక . ఇందు మాక విత్వమునఁగల కష్టసాధ్యప్రయోగము లాశుధారాక విత్వము నవలం బిం చువారి కక్కు రితిని వెల్లడించుఁగాత! “క్షుధాతు రాణాం నరుచిర్న పక్వ” మునునట్టు నాశుధారకవయితలకు సుప్రయోగ విచారణ మేకాక రసారస విచారణమును సంత ఏమన మాకు గానుండదని కవితామర్మఱులకు స్పష్టమే. కావున నేఁ తే | గీ| - ఆశుధారా" కవిత్వ మ్ములందు శయ్య , లు సములు త్రేక్షలును లేక యుండుఁ గాన | నెంత చర్చిం చినను బద్యమంతసార వంతమగుఁ గాన నిలుకడవలయం గృతి?"
“అనియప్పకవి చెప్పియున్నాడు. మేము గూడ నా నా రాజు సందర్శనములో గద్వాల
సంస్థానములో ఆశుధారాకవిత్వమ్మునందుకొంటిమేని యభిసారిక యుదండ మిచ్చితీ
ఱు" అని వ్రాసియున్నారము. మేము మహాసభలలో రచించిన పద్యములను యథాస్థిత
ముగ నేయుంచుట మాయాచారముగ నేయున్నను, నిందచ్చటచ్చటఁ గొన్ని పద్యములు
స్వల్పపాఠ భేదములు గలిగియుండు నే మోయని సంశయము గా నున్నది .
మొదల నుండియు నిన్ని యవధానములు చేయుదుమనియుఁ బిదప నిట్లన్నియుఁ గొంచే
ముగొప్ప సంగ్రహించి పెద్ద పొత్త ముగఁగూర్చి యచ్చొత్తింతు మనియు సభిప్రాయము
లేకుంటచేనంత శ్రద్ధ చేసి యాయాయవధాన పద్యము లన్నియు సంగ్రహించి భద్రపు
ఱచుట తటస్థింపదయ్యె, ఈయూహ యిటీవల నాలుగు వత్సరముల క్రిందటఁ గల్గి
అప్పటి నుండి చాలభాగము భద్రముగాఁ గా పొడుచు వచ్చితిమి. అంతకు
మున్ను జరిగకవి యుఁ జూలభాగము మాయొద్ద నున్నను లేని వానిం గూర్చి మాకు సహజ
మైన థారణము యోగించి మేనమామపోలిక గా సమకూర్చితి నునుటకు సందియము లే
దు గాని యేమయినను వ్యక్తి యొక నించుక భేదమున్నను నుండవచ్చును . . . " కేవల ధారణ
చేఁ జిరకాలము క్రిందట వచ్చిన పద్యములు -తూ చా. తప్పక సంగ్రసంగ్రహించుట
యసంభవమగుటచే నించుకమార్పుగలిగి యుండవచ్చును, ఇదిగాక యప్పటికప్పుడు
మాబుద్ధికి “ప్రాయుపుల 'బ్రౌద్దంతకొంత పడమటఁదిరిగెన్ " అనునవస్థ గూడ తటస్థించి
నది. అయినను - బెల్లమువండిన పొయి” గనుక విశేషభేదమెందును గనుపట్టకుండుట
ధ్రవము. ఈయవధానశక్తిం గుఱించి యనేకు లనేక విదములుగా భావించుచున్నారు,
అందులో గొందఱి యభి ప్రాయములను 'దెలు పుటకే యిందు గట్టకడపటి యుత్తర
ములు పనికివచ్చును. ఆయ్యవి యతి ప్రాసాదులలో గూడఁ దఱచుగా కొన్ని చెడి
యున్నను నీవిషయమునకు పకరించుననియే కై కొనవలసి వచ్చినది. ఇదియిట్లుండే మేము
తఱచుదేశాటన మొనర్చు కాలమున నొకప్పుడు మండ పేట వెళ్లినప్పుడక్కడ.. నున్నట్టియు
మహాపండితు లగుట యేకాక యాపాదు కాంతదీక్షాపరులగు మహామంత్ర వేత్త లొక
రు మాయొద్ద దాము స్వయము గా నుప దేశము నొందగోరుటయే కాక తమ శిష్యులు లో
నొక బుద్ధిశాలీనిగూడఁ బ్రేరిపిరి. వారిరువురితో మాకీశక్తి లేశమువ్వ లేదని యెంతచె
ప్పినను నవగోప్యాని కారయేత్" గనుకఁ తామిట్టు చెప్పుచుచున్నారనియే నొదువమెం
దలిడిరి గాని సుం తేని విశ్వసింపరైరి, పిదప నెట్టకేలకు వారిని వదలించుకొనుట దుర్ఘ
టమైనది. ఇంత విచిత్రముగాఁ గాకున్నను ననేక స్థలముల నిట్టిరీతియే జరగుచువచ్చి
నది. మేముసు గొంతమందితో నుపాసనా ఖలమని యే యొప్పుకొని వారిని సంతోష పె
ట్టుచుండుటయుఁ గలఁదు, ఏమన యధార్థము చెప్పిన , బొత్తగా విశ్వసింపరు గదా!
మండ పేట లోని సంగతిని 72 వ పేజీలో సీసపద్యము నొడువును గాన వలసిన వారది
చూడఁగలరు. మున్నెవరినేని యియ్యదియేయు పాసనము వలన నైన లభించయుండు
నేమో మాకుఁ దెలియదు గాని మాకు మాత్రమట్లు రాలేదని యధార్థము గా వక్కాణించు
చున్నారము, ఇందులకు బుద్ధి బలమను సహజమైన యాశుధారయును దానితో పాటు
థైర్య ఫైర్యములు ను పైనిశాస్త్రజన్య జ్ఞానాదికము ను ముఖ్య కారణములు, అన్నింటికన్న
"నాశు ధారయు దైర్య ఫైర్యములును బుద్దిబలమును మఱియును బ్రథానములు, ఇది
మాయనుభవము. దైవకృపయనునది అన్నింటికిని గావలయును. అన్నీఁటితోపాటు దీని
కిని నుండనిండు, కేవల దైవకృప మాత్రము పనిచేయదు, ఇఁక ధారణాశక్తింగూర్చి య
భ్యాసము కారణమనియ నేకుల భిప్రాయపడుచున్నారు. వారం గూర్చి కొంత వ్రాయ
దలఁచియు వారును మంత్రశాస్త్ర వేత్త ల వలెనే విశ్వసింపరని మిన్న కుందుము. దాక్షి
ణాత్యుల యవధానమునకును మన తెలుఁగు దేశ పువారి యవధానమునకును జాలవఱకు భే
దము గలదు. అదిగూడ నవసరమనీయెంచి యించుక వ్రాయు చున్నాము. మన యవ
ధానము నూఱుగురికిఁ గవిత్వము చెప్పుట, వారునూఱుపను లేవో చేయుట, అందు
లోఁ గవిత్వము కడు స్వల్ప మేయుండును. "బాగుగఁ బరిశీలించిన మనయష్టావధానము
వారి శతావధాన పదమున కర్హమైనదని మాయ భిప్రాయము. ఈసంగతి నానారాజు
సందర్శనములో గద్వాలలో తాతాచార్యులవారి యవ ధానమును గూర్చి మేము చెప్పిన
యుపన్యాసపద్యములు నెల్లడించును, ఇంతకును మనకు శతావధానమనఁగా శత లేఖ
న్యవధానమని తేలినది. ఈయవధానమే భట్టుమూర్తి ప్రభృతులొనర్చినది, కావున నే
ఆయాక వులకు “శతలేఖనీ పద్య సంభాన ధౌరేయుడనియు గత లేఖన్యవధాన పద్య
రచనా సంధాసురత్రాణుడ నియు బిరుదులు విద్వత్సమ్మతమ్ము లైయున్నవి. పైచొప్పు
ననే శ్రీమదభినవ పండిత రాయు విద్వన్మాడ భూషి వెంకటాచార్యులవారు రచించియు
న్నారు. ఏతదను సారమున నే మేము ప్రప్రధమమున శ్లో ॥ అత్త న్మానవమాస సాదృతిత
మంవృత్తం తదావస్తుచ | స్వీకృత్య ప్రథమంశ తో 'యసమయం తత్పాద మేకంవ దేత్ |
భూయః కెన్నచబోధితః క్రమనశాత్పాదత్రయం కీర్త యే! దేత న్నామ శతావధాన మధ
చేత్సబ్యాని సంకీర్త యేత్ || అని శత లేఖిన్యవ ధానమునకును, శ్లో! కాకావ్యోక్తిఃకవితో
క్తిరంచితకళావిధ్భ స్సహాభాషణం | పౌరాణోక్తి రమంద లౌకిక గిరోన్యస్తాక్షరోక్తి
స్సమం | ధీమద్భిశ్చతురంగ ఖేలన మధో సంఖ్యేయపుష్పాళయో | యస్మిత్స్యాద్యుగ
పత్త దేవకృతి నామష్టావధానాభిధం! ఆనియష్టావధానమునకును లక్షణము "లేర్పఱచుకొ
న్నారము, ఈశ్లోకార్థము బందరు పద్యములకుఁ గ్రింది భాగమున నుదాహరింపఁబడి
యున్న ఉపాధ్యాయోపయోగినియందుఁ బూర్తి గా వివరింపఁబడి యే యుస్నది గాన
నిటవ్రాయఁబడదయ్యే. అష్టావధానమునకు మాత్రము తెలుగులోఁగూడ లక్షణము
మాచేత నే రచింపఁబడియున్నది, అదియిందుదాహరించెదము. ||శా|| పౌరాణోక్తి కవిత్వ
పుష్పగణనావ్యస్తాక్షరుల్ లౌక్యగం|భీరోగ్యంచిత కావ్వపాతనక లా విద్భాషణంబుల్
ముదం! బారంగా జతురంగ ఖేలనము నీయష్టప్రచారంబులో |ప్పారున్ శంకర యేక కా
లమున నే యష్టావధానమ్మునన్ || మేమేర్పాటుచేసికొన్న దింత మాత్ర మేయైనను నిందు
లకు 'యోన్ని యో రెట్లు కష్టము నంగీక రించి చేసినయవధానములు మాత్రమ నేకములుగలవు.
ఈవిషయమున నెల్లూరు వెంకటగిరులు ముఖ్యముగా నచ్చటి వారివ్రాతల మూలమున
మీకుసాక్ష్యమునీఁగలవు. శతావధాన విషయిక వైలక్షణ్య ముసకు విజయనగరము పూ
ర్వరీతిగ నే సాక్షి కాగలదు. ప్రకృత సపుస్తకములో మాకు 30 వత్సరములు వచ్చు
టకుఁ బూర్వము రచించిన యవధాన పద్యము లున్న భాగమును బూర్వార్థ మునియం
బదపడి రచించిన యవధాన పద్యముల భాగమును నుత్త రార్థ మనియు వాడితిమి. ఉత్త
రార్థపూర్తి భగవదేక వేద్యము గాన సశేషము" అని వాయవలసి వచ్చినది, రెండవ
కూర్పు నందుఁ దిరిగియు నెచ్చట సేని యవధానములు రచించుటదట స్థించినచో నాప
ద్యము లేకాక చిత్తు కాగితములుండియును బకృతము సమయమునకుఁ దటస్థింపని న
ర్సారావు పేట మొదలగు నవధానముల యందలి పద్యములు గూడఁ జేర్పఁగలము. ఇప్ప
టికి మావయన్సు రమారమి 37 సంవత్సరములు ఇందు తిరుపతికన్న వేంక వేశ్వరుఁడు
నాల్గుమాసములు పెద్ద. మేమిరువురమును శ్రీచర్ల బ్రహ్మయ్యశాస్త్రులవారీ ప్రియశిష్యుల
ము. ఆయాయీ సంగతులు ప్రకృత గ్రంథమున నచ్చటచ్చట వెల్లడియగును. అందులో
బందరు పద్యములలోఁ జిన్నయక్షరములలో ముద్రించిన యుపాధ్యాయోప యోగిని
విస్పష్టముగా నొడువుచున్న యది గాన వలసిన వారది చూచుకొందురు గాక! ఇందలియ
వధానము లేవో పదిపదకొండు దప్పం దక్కినవన్నియు సుభయకృతములే, నానా రాజు
సందర్శనమున "ఒక చరణంబతండు మఱియొక్కటి నేను" అను పద్యముం జూడుఁడు ఆ
మాత్ర మేని యేకై క కృతములుండుటకు నిటీవల మేము వేఱు వేఱుచోటుల నివసించు
చుండుటయు సమయమున కిరువురమును జేరకుండుటయఁ గారణములు, ఒక్కరు
రచియించి రేనియును గాదగుఁ దిర్పతి వేంక టీయ మై" అనీ "మాజాతక చర్య" యను
గ్రంథమున వ్రాసికొనియున్నారము గాన నెవ రేది వ్రాసినను చత్కర్తృత్వ ముభయు
లకును నుండియే తీఱును. భేదము కూడ నంతగా నుండదనియే లోకుల యభిప్రాయము ,
నిజముగా నట్లయైయుండునని మేమును ననుకొందుము. రాజులపై మేమురచించిన పద్య
ముల నన్నింటిని వేఱుఁ జేసి నా నా రాజ సందర్శనమ ను వేర నింకొక గ్రంథమును
గూర్చితిమి. ఈ యుభయ గ్రంథములందును సాధ్యమైనంతవఱకు నాశుదారా కవిత్వమే
యుండును. రాజ సందర్శనము లో మాత్రము చెఱి సగమువరకు నాశుధారా కవిత్వ
మేయైనను తక్కిన సగమును నట్టిది కాకపోవచ్చును, అనఁగాఁ గాకితము పుచ్చుకొని
వ్రాసినది యని మీరూహించుకొందురు గాక ! ఆశుకవు లేగ్రంథము రచించినను నెట్టి
కల్పన ఘటించినను జిరకాల మాలోచింరిపరని మాయనుభవము , కల్పనతోఁచుటయే
తడవు గాని పద్యరచనకు నేవిధ మైన యాలస్యమును నాశుకవుల కవసరముండదని దృఢ
ముగా మేము చెప్పఁగలము. ఇది కొందఱి కతిశయోక్తి గాఁ దోచినను వారి యా
క్షేపణకు మేము పాత్రులమగు చున్నారమని విన్నవించికొనుచు, నిప్పటికే విస్త రించి
వ్రాసితిమను విసువుతో నింతట విరమించెదము.
ఇట్లు తిరుపతి వేంక టేశ్వరులు