ఆంధ్రవిశ్వకళాపరిషద్గ్రంధమాల

(౨౧వ ప్రచురణము)

వ్యాసమంజరి

కర్త

కట్టమంచి రామలింగారెడ్డి

వాల్తేరు

1939

PRINTED BY

MR. A. LAKSHMANASWAMY NAIDU

AT THE SARASWATHI POWER PRESS, RAJAHMUNDRY

ORDER NO. 1268 – 1989

సర్వస్వామ్య సంకలితము ]

[వెల రు 1-7-0.

విషయసూచిక

పుటలు

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

3

51

ఉపోద్ఘాతము

ఆంధ్రసారస్వతము, భారతరూపమున ను ప్రతిష్ఠితమైనది మొదలు ఆ జేడుశ తాబ్దులు, బహుళముగా చంపూకావ్యములును, సకృత్తుగా నిర్వచన ప్ర బంధములును వెలసిన వేకాని, పేరుగల ఒక్క వచన గ్రంథ మైనను తలసూపలేదు. గద్యపద్యాత్మకములైన చంపువులు ఉభయ తారకములగును గదా యన్న నిబ్బరముచేతనో, గద్యము పద్యము వలె ధారణాయోగ్యము కాదన్న అనుమానము చేతనో, పద్యర చనవలె గద్యరచన యశోదాయకము కాదన్న నిరసన భావము చేతనో, మన పూర్వకవులు ప్రత్యేక వచనరచలను ఆదరింపరైరి. కానిచో, సంస్కృత మున ఉత్త మగద్య కావ్యములగు కాదంబరి దశకుమార చరిత్రలు సయి తము, తెనుగున చంపువులుగానే అవతరించుటకు హేతువుండదు.

ఇట్లుండగా, వచన గ్రంథములు అభావమువలని లోటును గ్రహించి, దక్షిణాంధ్రకవులు ఆ కొఱతను తీర్పసమకట్టిరి. మధుర, తంజావూరు, మైసూరు మొదలగు సంస్థానాధీశ్వరులు, 17, 18 శతాబ్దులలో పెక్కువచన గ్రంథములు వ్రాయించుటే కాక, వారిలో కొందఱు స్వయముగా కొన్ని రచించిరి. కాని, అవి ఆంధ్ర భారత భాగవతాది పురాణేతిహాసములకును, మణికొన్ని పూర్వ ప్రబంధములకును దండా స్వయప్రాయములగు వచనరూపములే కాని, స్వతంత్రరచనలు కావు. అందుచే, నానికి, చారిత్రక ప్రాధాన్యమున్నంత సాహిత్య ప్రతిష్ఠ లేదు.

అసలు స్వతంత్ర వాఙ్మయ శాఖగా పరిగణింపదగిన వచనావిర్భావము, మనభాషలో అధునాతనమే యని నిస్సంశయముగా చెప్పవచ్చును. ఆంగ్లేయులు మనకొసగిన విద్యాసంస్కారమువలన మనభాషకు కల్గిన మేలేమైన ఉన్న యెడల అది యిదొక్కటే. వారిభాషలో ఉన్నంత కావ్య పక్రియావైవిధ్యము మనభాషలో పూర్వములేదు. వారి వాఙ్మయము చదివి, ఆరుచి గ్రహించిన పిమ్మటనే మనవారు తద నుకరణముగా, నవలలు- కథానికలు వ్యాసములు మొదలగు నానా వచన గ్రంథములను రచింప మొదలిడిరి. ఈ నూతనగద్య గంగావతరణ మునకు చిన్నయసూరి భగీరథుని వంటివాడు. దాని నానా ముఖా ప్రతి హత ప్రవాహగతికి కారణభూతుడు వీ రేశలింగముపంతులుగారు, వచన ప్రపంచమున పంతులుగారు త్రొక్కని దారిలేదు. ధారాళమును, తేట తెల్ల మును అయిన శైలిలో వారు వ్రాసిన శతాధిక వచనములు వారి గద్య తిక్కన బిరుదమును సార్థకముచేసెను. సార్థకముచేసెను. ఆ రచనలన్నిటిలో కవుల చరిత్ర చిరస్థాయియై, వారికీ ర్తిని చిరస్థాయిగా గా కాపాడగలదు. పూర్వ కవుల జీవితాంశములను, చారి శ్రకపరిశో ధనపూర్వకముగా నిర్ణయించు తలంపుతో పంతులుగారు సల్పిన కృషి అనన్యసామాన్యము. కాని వారాసించిన ముఖ్య ప్రయోజనము ఆయాకవుల ఆయాశవులు కాలనిర్ణ కాలనిర్ణయము మాత్రమే. ఆశవుల గ్రంథ విమర్శనము నెడ వారికంత దీక్ష లేదు. ప్రసంగ వశమున గ్రంథ గుణమునుగూర్చియు ఏ కొలదిపాటి ప్రశంసయేని ఉన్నను, అది విమర్శనమనిపించుకొన దగినట్లుండదు. యథార్థమైన ఆంధ్ర కావ్యవిమర్శ ప్రారంభము కవుల చరిత్ర పుట్టుకకు తరువాత జరిగి నది. ఆ మహారంభమునకు ప్రథమాచార్యులుగా పేర్కొనదగినవారు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారు.

శబ్దసాధుత్వాసాధుత్వనిర్ణయమే గ్రంథవిమర్శనమనెడిభ్రమతో పండితు లొకరితో నొకరు వాగ్యుద్ధములు చేయుదినములలో, భావుకులదృష్టిని శాబ్దిక చర్చనుండి తాత్వికమీమాంసకు మరల్చిన రసికులు రెడ్డిగారు. కావ్యమునకు శబ్దము ఆధిభౌతికాంశము మాత్రము. అది బాహిరము. దాని ఆధ్యాత్మికాంశము తద్గతకళాసౌందర్యము. అది ఆంతరము. విమర్శమార్గమును బాహిరజగత్తునుండి అంతర జగత్తునకు కొనిపోయిన ప్రథమాంధ్రవిమర్శగ్రంథము రెడ్డిగారి కవిత్వతత్వవిచా రము. మనభాషలో ఈ గ్రంథరాజమునకు ప్రతిబింబములుగా ఇటీవల అనేకతత్వవిచారములు పుట్టినవి. అవన్నియు ఇంచుమించు ఈ మాతృస్తన్యమును గ్రోలిన శిశువులే. కళాపూర్ణోదయపరామర్శమును నిమిత్తముగా గైకొని, వీరా గ్రంథమున మన కపూర్వములైన అనేక శళాధర్మములను ప్రతిపాదించి, వ్యాఖ్యాన మొనర్చిరి. అట్లే ఆధునిక కవుల నాదరించి ప్రోత్సహించుతలంపున వారిఖండ కావ్యములకు పెక్కిం టికి తొలిపలుకులు వ్రాయుచు, విమర్శసారస్వతమును మఱికొంత వృద్ధికి తెచ్చిరి. ఒక వంక భారతకళాపూర్ణోదయాది ప్రాచీన కావ్యముల నారా ధించుట, ఇంకొకవంక బాలకవుల భావగీతములను ఆదరించుట ! ఈ. ప్రాచీన నవీన తాసమరస భావము నిజముగా ప్రశంసార్హము. దేశకాల నిరపేక్ష మైన గుణగ్రహణ పారీణత అచ్చపు సహృదయతగల వారికిగాని ఉండదు. అది లేకయే ప్రాచీన తాభిమానులు నవ్యకవిత్వమును, నవీన తాభిమానులు ప్రాచీన కవిత్వమును నిరంతరము శపించుచున్నారు.

ఆధునిక కవిత్వములో నైనను, సరసతతోపాటు నియమబద్ధత కలదాని నే వీరు కొనియాడుదురుగాని, విశృంఖల విహార మొనర్చు దానిని మెచ్చరు. సముచితనియమపరిపాలనము, నిరర్థక బంధవిచ్ఛేదము, అస్వతంత్ర తాతిరస్కారము—ఇవియే వీరు పదింపదిగా సాంఘికాచార విషయమునను, కావ్యమర్యాదావిషయమునను బోధించుధర్మములు, వీరి ఉపన్యాసములలో, వ్యానములలో, ఈ ధర్మత్రయమే ఆత్తగా భాసించుచుండును.

విమర్శకులలో వీరికెంత ప్రాధాన్యమున్నదో, వ్యాసరచయితల లోను అంత ప్రాధాన్యమున్నది. సాహిత్యాంగముగా పరిగణింపదగిన వ్యాసరచన ఆంగ్ల భాషలోవలె మన భాషలో ఇంకను పరిణ తావస్థకు రాకున్నను, జరిగినంతవరకు దాని పెంపునకు కారణభూతులైన విద్వాంసులలో వీరొకరు. గ్రంథములకు పీఠికలు వ్రాసినను, పత్రికలకు వ్యాస ములు వ్రాసినను, తాత్వికముగా విషయచాలన మొనర్చి, పటుత్వము గల భాషలో సోపపత్తికమైన సిద్ధాంతముచేయు నేర్పు వీరివాక్కునకు సహజగుణము. వీరివ్యాసములకు ఇదియే ప్రథమాలంకారము. రెండవది వానిశైలి. విషయాన్నత్యముతో పాటు అర్థగాంభీర్యమును, దాని కనుగుణమగు శైలియు ఉన్నప్పుడే, వ్యాసము సర్వాంగసుందర ముగా నుండును. అర్థ గాంభీర్యము లేనిచో పేలవతయు, శైలీసంపన్నత లేనిచో నీరసతయు తటస్థించి వ్యాసమునకు తీరనిలోటు కలుగును. వీరి వ్యాసములలో అర్థమెంత గంభీరముగా నుండునో, శైలియు అంత సురుచిరముగా నుండును. ఆశైలియు, విషయవిభేదమునుబట్టి ఒక్క యెడ ఆలంకారికముగా, ఒక్క యెడ ప్రాస్తావికముగా, ఒక్క యెడ తార్కికముగా మారుచుండును. ఏ రూపము తాల్చినను, దానిపటుత్వము, సొగసుదనము, పోవు. నన్నయసూరనలను ప్రశంసించుచో, శైలియెంత ఆలం కారికముగా నున్నదో తాతతండ్రులు ముచ్చటలు చెప్పుచో అంత ప్రాస్తావికముగా నున్నది. ఇన్ని అవాంతరరూప భేదములు పొందుచున్నను, దానికి ఆ త్మీయమైన మూలధర్మమును విడనాడదు. వీరిశైలికి ఆత్మీయాంశము బుద్ధి గమ్యత. నానాశాస్త్రనిష్ణాతమును, విజ్ఞానసాంద్రమును, సమ్యగ్యోజనాయుతమును ఐన మేదస్సున బుట్టిన భావములు గలర చన బుద్ధి గమ్యము గాక ఇంకొక విధముగా నుండదు, ఉండదగదు.

నూతనశాస్త్రపరిచయమువలననో, అన్యసంప్రదాయసంపర్కమువలననో, ఒక సంఘములో గాని, ఒక వ్యక్తిలోగాని అపూర్వభావములు పొడమునపుడు వానిని వ్యక్తీకరించుటకు పూర్వస్థితమైన సాధారణ భాష చాలదు. అట్టియెడ నూతన పదజాలము సృష్టించుటో అన్య దేశ్యములు ప్రయోగించుటో, పూర్వపదములనే, లక్షణార్థమున వాడుటో తప్పనిసరియగును, ఈ మూడుపద్ధతులలో అన్య దేశ్యపద ప్రయోగము భాషాస్వచ్ఛతకు ఉపహతికల్పించును. రెడ్డిగారు అట్టి స్వచ్ఛతాభ్రంశమును బొత్తిగా ఒల్లరు. మణి, పూర్వపదములనే అపూర్వార్థములకు తగినట్లు మలతురు. ఈ దుర్ఘటనియమమును అసిధారా వ్రతముగా పరిపాలించుట చేతనే వీరు తమ శైలిని స్వచ్ఛతామహిత ముగా నొనర్పగల్గిరి. అన్య భాషాపద కళంకితము కాని, అచ్చపు స్వభాషలో, శాస్త్రగ్రంథమైన అర్థ శాస్త్రమునే చిన్న నాడు వ్రాయగల్గిన వీరికి వ్యాసములు వ్రాయుట యేమి లెక్క.

ఈ విధముగా నానాగుణశోభితములైన వీరి వ్యాసములన్నియు -అప్పుడప్పుడు అవసరమును బట్టి అనేకకాలముల వ్రాసినవి ఒక్కచో చేర్చి, సమగ్ర సంపుటముగా ప్రకటించుట భాషకు మేలు నేతయని మిత్రులు హెచ్చరించగా, శ్రీ రెడ్డిగారు ఆమోదించుటయే కాక, ఈ వ్యాసమంజరిని విశ్వకళాపరిషత్తునకు సొత్తుగా దాన మొనర్చి, వారి కృతజ్ఞతకు పాత్రులైరి. మఱియు తమ తమ గ్రంథములకు పీఠికలుగా నున్న వ్యాసములను, ఈ సంపుటిలో చేర్చుకొనుటకు అనుమతించిన కవులకు విశ్వవిద్యాలయము పరమున కృతజ్ఞత తెలుపుచున్నాను.

ఈ వ్యాసములన్ని టిని సేకరించి, ప్రకటించు భారము నేను పూనితిని. వ్యాసములను విషయభేదమును బట్టి ఖండములుగా వర్గీక రించుటయు, వ్రాతతప్పులు దిద్దుటయు తప్ప నేను పడిన పాటేమియు లేదు. నాకు అచ్చుపూఫులు దిద్దు నేర్పులేదు; అలవాటు అంతకు మున్నె లేదు. అయినను, శక్తివంచనలేక చేతనైనంతవఱకు, సవరిం చితిని. ఇంకేవేని పొరపాట్లున్న వేమో, పాఠకులు మన్నింతురు గాక.

వాల్తేరు 22-9-1939 } పింగళి లక్ష్మీకాంతం

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.