వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/18-ప్రకరణము

18-ప్రకరణము

శృంగారనైషధవ్యాఖ్య - శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డిగారు

శ్రీ శాస్త్రులవారు అచ్చాపీసు ప్రారంభించినప్పుడే ఆముక్తమాల్యదకు వ్యాఖ్య వ్రాయసంకల్పించి తమ ప్రచురణముల జాబితాలో నియ్యది సిద్ధమగుచున్నదని ప్రకటించిరి. కాని యందులకు విశేష గ్రంథావలోకనము వలసియుండినందున అదివచ్చులోపల నైషధమునకు వ్యాఖ్యవ్రాయుట సులువని దానిని ప్రారంభించి కృషి సలుపసాగిరి. శృంగారనైషధ ముద్రణోపోద్ఘాతమున శాస్త్రులవా రిట్లువ్రాసినారు. "ఈవ్యాఖ్యను రచించుటకై పూర్వముద్రణములో ఇంచుమించుగా 2000 తప్పులను దిద్దవలసివచ్చినది. అందు రమారమి 1100 అనుబంధమున సూచించి యున్నాడను. దిద్దుటకు ఊహయు సంస్కృతమూలంబును అలవడిన తాళపత్ర పుస్తకంబులును కావ్యాంతర సంవాదాదికంబులును సాధనములు. వ్యాఖ్యరచియించుటకన్న పాఠనిర్ణయము చేసికొనుట కడునెక్కుడుపనియైనది. పెద్దలకు పరితోషార్థమును పరీక్షార్థమును విద్యార్థులకు బోధనార్థమును సవరణలకెల్ల ఉపపత్తిని చూపితిని. అంతియగాక ఎల్లవారును తమతమ యిచ్చమెయి పాఠస్వీకరణము చేసికొందురుగాక యని పూర్వపాఠములను అచ్చుదప్పులని నాతలచినవానిని సయితము వ్యాఖ్యలోను అనుబంధములలోను చూసినాడను." అని*


  • వేంకటరాయశాస్త్రులవారు ప్రాచీనగ్రంథములను సవరించుటలో ననుసరించిన పద్ధతులంగూర్చి ప్రత్యేక మొకగ్రంథము వ్రాయుటకవకాశము గలదు. ఈ శృంగారనైషధ వ్యాఖ్యంగూర్చి మదరాసులోను నెల్లూరులోను శాస్త్రులవారు కొన్ని యుపన్యాసముల నొసంగిరి. ఆయుపన్యాసములలో నొకదానిని వినుటకు 'శ్రీ విక్రమసింహపురీ పౌరవతంసులు, శ్రీయుత రేబాల లక్ష్మీనరసారెడ్డిగారు విజయంచేసి విని తత్ప్రబంధప్రౌడికి కరమానందించిరి,' అనంతరము, "శ్రీ గునుపాటి యేనాదిరెడ్డి గారు మన్మిత్త్రులు నాకు ముప్పదియేండ్లుగా ప్రతివర్షకుటుంబపర్యాప్తథాన్యదాత - మదీయ శృంగారనైషధ వ్యాఖ్యాముద్రణార్థమై ధనముంగూర్చుటకు సమకట్టి, శ్రీయుత రేబాల లక్ష్మీనరసారెడ్డి గారితో 'అయ్యా, రెండుమాసములు నేను మీసన్నిధింబాసి యీజిల్లాలో సంచరింపవలసియున్నది.' అని నుడివిరి. అంతట శ్రీ రెడ్డిగారు 'ఏలసంచారమేగెదవు ? అని యడిగిరి. 'వేదము వేంకటరాయశాస్త్రిగారి శృంగారనైషధ వ్యాఖ్యాముద్రణార్థము ధనమార్జించుటకు' అని ఏనాదిరెడ్డి గారు బదులుపలికిరి. 'నీవు మత్సన్నిథానవర్తివైయుండి బిచ్చమునకుపోయెదవా!' అని రెడ్డి గారు నవ్వుమంబలికిరి. 'నాకై యాచించిన, నది బిచ్చమగునుగాని, నా గురువుగారిపుస్తకము ముద్రించుటకై యడుగుట బిచ్చమేలయగును?' అని యేనాదిరెడ్డిగారు వచించిరి. అంత ఆదొడ్డదొర సుగృహీతనాములు లక్ష్మీనరసారెడ్డి గారు 'సరిలేవోయి దానిని మేమును వినియున్నాము, దానినిముద్రించుటకు ఏపాటిపైకముపట్టును?' అని ప్రశ్నించిరి. 'సుమారు రెండువేలుపట్టును' అని వీరువక్కాణించిరి. 'మఱి, లే, శాస్త్రిగారి దర్శనమునకుంబోవుదము.' అని ఆయుదారులు బండి కాజ్ఞాపించిరి. ఏనాదిరెడ్డి గారు 'నేనుపోయి శాస్త్రిగారిని ముందు హెచ్చరించివచ్చెదను.' అనిరి. 'అట్లేచేయుము'అని వారు ఆనతీయగా ఆబండిలో ఏనాదిరెడ్డి గారు మాయింటికివచ్చి నన్నుంగని వృత్తాంతమువచించి, నేను ఇప్పుడేపోయి వారిని తెత్తునా, యనిరి. 'అయ్యా, నాబోంట్లు ఎందఱు వారిని నిత్యము దర్శింపరు? ఆక్షేపములేదేని నేనేవచ్చెదను. నాకుటీరమునకు వారేల రావలయును?' అంటిని. అంతట ఆబండిలోనే వారికడ కేగి సందర్శింపగా, వారు మదీయవ్యాఖ్యానముంగూర్చి నిజాభినందనముందెలిపి, ముద్రణార్థము ఏపాటియగునో అడిగిరి. "సుమారు రు. 2000 కావచ్చును' అని చెప్పితిని. అంతట రు. 1000 ల నో టొకటి ఫలసహితముగా నాకొసంగి 'మీరు మదరాసున కెప్పుడుపోయెదరు?' అని యడిగిరి. 'ఈమధ్యాహ్నపుబండిలోనే ఏగి సాయంకాలమున ఇల్లుచేరెదను' అని యుత్తరముచెప్పితిని. 'మీరు ఇల్లుసేరునప్పటికి మాకార్యస్థుడు వచ్చి మీకు రు. 1000 లు అందజేయును' అనిరి. అంతట నేను నాకృతజ్ఞతంబలికి నాడేతరలి సాయము మదరాసులో నిల్లుచేరునప్పటికి రెడ్డిగారికార్యస్థుడు పైకముతెచ్చి నాకై యెదురు సూచుచుండెను. దానింగైకొని ఆగ్రంథముద్రణమును నెఱవేర్చుకొంటిని. ఔదార్యమన నిట్లుగదాయుండవలయును."*


  • ఆముక్త - ఉపోద్ఘాతమునుండి. శాస్త్రులవారి శృంగారనైషధవ్యాఖ్యను పలువురు విద్యావంతులును పండితులును కొనియాడిరి. శ్రీకట్టమంచి రామలింగారెడ్డిగారు ఇట్లువ్రాసిరి.

'I suppose it is beyond question that yours forms the greatest commentary that has so far appeared in Telugu and that it will be probably a unique one of its kind for all time to come ............ to - day the Tulugu world could boast that a modern scholar has beaten the ancients at their own game in a most decisve fashion.'

గురుజాడఅప్పారావు పంతులవారు - I congratulate you on the completion of the work. It is invaluable to the student of the Telugu literature. Naishadham cannot be understood by average scholars without such a gloss as you have given. You have done What nobody else could have done so well. I am sorry that the gentlemen with whom you have chosen to throw in your lot (though you have more in common with us than with them) decided not to print my minute of dissent. There in I gave a critical estimate of the prose writers of the day and distinguished your work from that of the illiterate rabble. Your friends are never tired of singing the praises of two inferior artists like Veeresalingam Pantulu and Chilakamarti - and it is only recently there is a halting acknowledgement of your claims For the first time I boldly showed up the utter worthlessness of the prose which uncritical and unscholarly persons were blindly holding up as a model. Your friends never did you ordinary Justice. An old friend, from the opposite camp, that is, your humble servant, has given you your due as a scholarly writer.

If you glance through my minute of dissent you will find what I said of you Mr. Lakshmana Rao once said that I flattered you. It is he who flatters for his own purposes. I priclaim my views from house tops and they are always my honest convictions.

Why dont you do one service to Telugu? May I request you to write the story of the Mahabharata in a blend of old and new forms such as is used in commentaries, tales etc. You may say in your preface that the book is not meant for school boys, that it as meant for the illiterate or whatever you please. I shall print it.

yours very sincerely
G. V. Appa Rao.

శృంగారనైషధమును గుఱించి ఇంక నెందఱోవ్రాసిన జాబులుగలవు. వానిని శాస్త్రులవారి జీవితచరిత్రసర్వస్వమున ప్రకటింపదలంచితిని. ఈగ్రంథముద్రణము పూర్తియైనవెంటనే శాస్త్రులవారు మరల ఆముక్తమాల్యదపై కృషిసలుపనారంభించిరి. నైషధమున ముఖపత్రమువెనుక నీపద్యమును ముద్రించిరి.

ఉ. వ్రాసితిమున్'బ్రతాపుగృతి'బండితమానులగుండె నీఱుగా,
   వ్రాసితివెన్కన'య్యుషవివాహము'సిద్ధసుథాప్రవాహమున్,
   వేసరకాంధ్ర 'నైషధము' విప్పినిధుల్ నెఱచూఱలిచ్చితిన్,
   జేసెదనింక దత్పరతసేవలు చూడికుడుత్తదేవికిన్.

__________