వేదములే నీ నివాసమట (రాగం:మద్యమావతి ) (తాళం : ఆది )

ప|| వేదములే నీ నివాసమట విమలనారసింహా | నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహా ||

చ|| ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన | నారాయణ రమాధినాయక నగధర నరసింహా |
నీరూపంబు ఇంతఅంతయని నిజము తెలియరాదు | ఈరీతి త్రివిక్రమాకృతి యేచితి నరసింహా ||

చ|| గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ |
శ్రీవల్లభ పురాణపురుష శిఖనఖ నరసింహా |
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు | భావింపగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహా ||

చ|| దాసపరికర సులభ తపన చంద్రనేత్ర |
వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహా |భాసురముగ శ్రీవేంకటగిరిని పాయని దైవమవటుగాన | ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహా ||


vEdamulE nI (Raagam: ) (Taalam: )

pa|| vEdamulE nI nivAsamaTa vimalanArasiMha | nAdapriya sakalalOkapati namOnamO narasiMha ||

ca|| GOrapAtaka niruharaNa kuTiladaityadamana | nArAyaNa ramAthinAyaka nagadhara narasiMha |
nIrUpaMbu iMta aMtayani nijamu teliyarAdu | IrIti trivikramAkRuti nEciti narasiMha ||

ca|| gOviMda guNagaNarahita kOTisUryatEja | SrIvallaBa purANapuruSha SiKasaKa narasiMha |
dEvA mimu brahmAdulakunu teliya nalavikAdu | BAviMcaga prahlAdu neduTa paragiti narasiMha ||

ca|| dAsaparikara sulaBa tapana caMdranEtra | vAsava suramuKa munisEvita vaMdita narasiMha |
BAsuramuga SrIvEMkaTagirini pAyanidaivama vaTugAna | OsarakipuDu EgitiviTla ahObala narasiMha ||

బయటి లింకులు

మార్చు

vEdamulE-nI-nivAsamaTa






అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |