వెఱవకు మనసా
ప|| వెఱవకు మనసా విష్ణుని యభయము | నెఱవుగ నెదుటనే నిలచినది ||
చ|| శ్రీపతి కరుణ జీవ రాసులకు | దాపును దండై దగిలినది |
పై పై దేవుని బలు సంకల్పమె | చెపట్టి రక్షింప చెలగేది ||
చ|| నలినోదరు నిజ నామాంకితమే | యిలపై దాసుల నేలేది |
కలి భంజను శంఖ చక్ర లాంఛన- | మలవడి శుభముల నందించేది ||
చ|| శ్రీవేంకటపతి చేసిన చేతలె | వేవేల విధుల వెలసేది |
భూవిభుడితడు పూచిన మహిమలె | కైవసమై మము గాచేది ||
pa|| verxavaku manasA viShNuni yaBayamu | nerxavuga neduTanE nilacinadi ||
ca|| SrIpati karuNa jIva rAsulaku | dApunu daMDai dagilinadi |
pai pai dEvuni balu saMkalpame | cepaTTi rakShiMpa celagEdi ||
ca|| nalinOdaru nija nAmAMkitamE | yilapai dAsula nElEdi |
kali BaMjanu SaMKa cakra lAMCana- | malavaDi SuBamula naMdiMcEdi ||
ca|| SrIvEMkaTapati cEsina cEtale | vEvEla vidhula velasEdi |
BUviBuDitaDu pUcina mahimale | kaivasamai mamu gAcEdi ||
బయటి లింకులు
మార్చు
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|