వృక్షశాస్త్రము/ముషిణి కుటుంబము
304
జటతీగె కూడ డొంకల మీద పెరుగును. ఆకులపై వత్తుగ రోమములు గలవు. దీని పువ్వులు మంచి వాసన వేయును.
ముషిణి కుటుంబము.
ఈ కుటుంబములో పెద్ద చెట్లు, గుబురు మొక్కలు, గుల్మములును కూడ కలవు. ఆకులు లఘు పత్రములు. ఒంటరి చేరిక. కొన్నింటికి సన్నని కణుపు పుచ్చములున్నవి. కణుపు సందులనుండి యైన కొమ్మల చివరల నుండి యైన మధ్యారంభ మంజరులు వచ్చును. పువ్వులు సరాళములు, పుష్ప కోశమునకు నాలుగైదు దంతము లుండును. నీచము దళ వలయము నకు నాలుగైదు దంతములుండును. నీచము. దళవలయమునకు నన్నియే తమ్మెలుండును. కింజల్కములు దళ వలయము నంటి యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు అండాశయము ఉచ్చము. రెండు గదులు, కీళము కొన్నిటిలో రెండు చీలి యున్నది.
ముషిణి చెట్టు చిన్న చెట్టు. ఆకులు అండాకారము పువ్వులు చిన్నవి. కొంచమాకు పచ్చగను తెల్లగను నుండును. దీని గింజల వ్యాపార మీమధ్యనే కొంచెము తగ్గెను. పండ్లను గోసి, గింజలను కడిగి ఎండ బెట్టుదురు. ఈ గింజ్లనుండి కొన్ని ద్రవములను తీయు చున్నారు. వీనితో బట్టలకు దోపు 305
రంగు వేయ వచ్చును. ఈ గింజలనుండి తీసినచమురును ఈ గింజల పొడుమును ఔషధములలో వాడుదురు. ముషిణి కలప గట్టిగానె వుండును.
ఇండుగ చెట్టు ముసిడి చెట్టుకంటె పెద్దది. ఈ చెట్లు కొండ్ల మీద మాత్రము పెరుగు చున్నవి. పండను తిందురు. గింజల నరగ దీసి మడ్డి నీళ్ళలో కలిపిన యెడల మడ్డి అడుగునకు పోవును.
- నాగ ముసిడి
- - కొండల మీద పెరుగును. ఆకులు సమ గోళాకారము, కణుపు పుచ్చములు లేవు. పువ్వులు కొంచమాకు పచ్చగను, పచ్చగను వుండును. దీని వేరు తాచుపాము కాటులకును విష జ్వరములకును మంచి పని చేయునందురు.
- ఎర్ర ముష్టి
- - టేకు చెట్ల మీద పెరుగును. పువ్వులు తెల్లగా నుండును.
నక్కెరి కుటుంబము.
ఇది కొంచెము పెద్దకుటుంబమే కాని ఉపయోగించు మొక్కలంతగాలేవు. ఈ కుటుంబములో గుల్మములు గుబురు మొక్కలు, పెద్ద చెట్లను గలవు. వాని కొమ్మల మీదను, ఆకుల మీదను రోమము లుండుట చే గరుకుగా నుండును. పు