వృక్షశాస్త్రము/మల్లి కుటుంబము
286
గదులుండును. కొన్నిటిలో మాత్రము ఒక గదియే కలదు. అండములు ఒకటియో రెండో వ్రేలాడు చుండును. ఫలములో పెంకు కాయ.
లోధ్ర చెట్టు హిందూస్తానములో ఉన్నతప్రదేశముల మీదను హిమాలయా పర్వతేముల మీదను పెరుగు చున్నది. పువ్వులలో కింజల్కములు చాల గలవు. దీనిబెరడును, ఆకులును ఎర్రని రంగు చేయుటలో ఉపయోగించెదరు. చినాలి రంగువంటి రంగు వచ్చును. కాని తరుచుగ రంగు వచ్చెడు తొగరు చెట్టు వంటి ఇతర పదార్థములతో గలిపి వాడుదురు. దీని బెరడును ఔషధములలో గూడ వాడుదురు.
మల్లి కుటుంబము.
మల్లితీగె పందిళ్ళ మీదను చెట్ల మీదను ప్రాకును గాని దానికి నులి తీగెలుండవు. కొమ్మలను చిక్కుడు తీగ వలె చుట్టుకొనును.
- ఆకులు
- - అభిముఖచేరిక. లఘు పత్రములు. కురుచ తొడిమ. అండాకారము. సమాంచలము. విషమరేఖపత్రము. కొనగుండ్రము. రెండు వైపుల నున్నగా నుండును.
- పుష్పమంజరి.
- - కొమ్మల చివరల నుండి గుత్తులు పువ్వులు తెలుపు.అంతరాళము. మంచివాసనవేయును. 287
- పుష్ప కోశము
- - సంయుక్తము. గిన్నెవలెనుండు అంచున చాల సన్నము తమ్మెలు అయిదు మొదలు తొమ్మిది వరకు వుండును. ఆకు పచ్చని రంగు నీచము.
- దళ వలయము
- - సంయుక్తము. చత్రాకారము, అడుగున గొట్టము వలె నుండి చివర పెద్ద తమ్మెలుండును. తెలుపు.
- కింజల్కములు
- - రెండు. కాడలులేవు. పుప్పొడి తిత్తులు మాత్రము దళవలయము నంటి కొని రెండు గలవు. అవి దళ వలయపు తమ్మెలును గొట్టమును గలియుచోటనున్నవి. రెండేసి గదులు.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము రెండు గదులు కీలము లావుగ నుండును.
- ఫలము
- - రెండు కండకాయలు కాయును.
సాధారణముగ మన దొడ్లలో పెరుగు వానిని కొమ్మలు నాటి పెంచుచు వచ్చుట వలన వానికి కాయలు గాయు శక్తి తగ్గి పోయినది.
చిన్న చెట్లును చిగురుమొక్కలు నీకుటుబమున గలవు. కొన్ని తీగెల వలె నెగ బ్రాకును. కాని వానికి నులి తీగెలు గాని, ముళ్ళు గాని యుండవు. ఆకులు లఘు పత్రములు గను మిశ్రమ పత్రములు గను కూడ వున్నవి. వీనికి గణుపు పుచ్చములుండవు. పుష్ప మంజరులు సాధార్ణముగ త్రివృంత మధ్యారంభ మంజరులు మిధున పుష్పములు ఏక లింగ పుష్పములును గలవు. పోతు మొక్కలు ఆడు మొక్కలు కొన్నిటిలో వున్నవి. పుష్ప కోశము దళవలయము సంయుక్తము. 288
నాలుగుమొదస్లు తొమ్మిది వరకు తమ్మెలుండును. అవి మొగ్గలో అల్లుకొని యుండును. కింజల్కములు రెం?డు కాడలు పొట్టి. అండాశయము ఉచ్చము. రెండు గదులు.
మల్లిపువ్వు చిరకాలమునుండి సువాసనకు ప్రసిద్ది చెంది యున్నది. ఇది వేసవి కాలమందు పుష్పించును. ఈ పువ్వుల నుండి అత్తరు చేయుదురు.
కుందము పెద్ద గుబురు మొక్క. దీనికిని పైకి పెరుగుట కాదారము కావలయును. పువ్వులు తెల్లగాను పెద్దవి గాను నున్నవి. మంచి వాసన గలదు.
అడవి మల్లి ఎక్కువగా కొండల మీద బెరుగును. దీని పువ్వుల రేకులు ఎనిమిది మొదలు పండ్రెండు వరకు వుండును. ఇదియు మంచి వాసన వేయును.
విరిజాజి తీగె పైదానివలెనే యుండునుగాని ఇది ఎగబ్రాకదు. చిన్నచెట్టువలె నుండును. ఆకులకు వాలముగలదు.
అడవిమొల్ల తీగె చుట్టుకొనిప్రాకును. ఆకులో మూడేసి చిట్టిఆకులు గలవు.
హేమవుష్పిక చిన్న చెట్టువలెనుండుదు. అన్నిఆకులు నొకతీరునలేవు. చివర నున్నవి పక్ష వైఖరిగ నుండును. 289
కొన్నిటిలో మూడేసి మాత్రమే గలవు. కొన్నిలఘు పత్రములే.
మాలతీ తీగెయు ఎగ ప్రాకును. ఆకులు పక్ష వైఖరి. చిట్టి ఆకులు మూడు జతలైనను, అయిదు జతలైనను వుండును.
పారుజాతము చిన్న చెట్టు. సదాపుష్పించు చుండును. పువ్వులు తెల్లగాను సువాసనగను నుండును. దళ వలయము యొక్క గొట్టము తిరుచూర్ణము రంగుగా నుండును.
సన్నజాజి తీగెకు నులి తీగె లుండవు. దీని పువ్వులు తెల్లగను సువాసనగను నుండును.
గన్నేరు కుటుంబము.
గన్నేరు తోటలందు గుబురుగా పెరుగు మొక్క.
- ఆకులు
- - కిరణప్రసారము. కణుపువద్ద మూడేసి కలవు. సన్నము గాను, బల్లెపాకారముగను దట్టముగను వున్నవి. రెండు వైపుల నున్నగా నుండును. కొనసన్నము. సమాంచలము. విషమరేఖ పత్రము. మధ్య ఈనె పెద్దదిగా నున్నది.
- పుష్ప మంజరి
- - కొమ్మల చివర నుండి మధ్యారంభ మంజరులగు రెమ్మ గెలలు. చేటికలు గలవు. పువ్వులు సరాళము గులాబిరంగు.,