వృక్షశాస్త్రము/పల్లేరు కుటుంబము

లెనె కాయలుగాయగానె ఎండిపోవును. దాని గింజలను, గింలనుండి తీసిన చమురును ఔషధములలో వాడుదురు. ఇవి రెండును, అన్నిరకముల మూత్ర వ్వాధులకును బని చేయును. మరియు పుండ్లకు గాని నొప్పులకు గాని పట్టు వేసిన దగ్గును.

అడవిగోరింట: ఒక్కయు చిన్నదియె. ఇది పడమటి కనుమల ప్రాంతముల ఎక్కువగా బెరుగు చున్నది. దీని కొమ్మలను నీళ్ళలోనుడక బెట్టి ఆ కషాయములో గొన్ని మందులు కలిపి జిగట విరేచనములు, అజీర్ణము, ఉబ్బు జబ్బులకు నిత్తురు.

ఆసుపత్రులందు శస్త్రములు చేయు నప్పుడు నొప్పి పెట్టకుండ రాచెడు కొకేను ఈ కుటుంబములోని యొక మొక్క ఆకుల నుండి చేయుచున్నారు. ఆ మొక్కలు మన దేశములో నొకటి రెండు చోట్లనే పెంచు చున్నారు కాని ద్రవము తీయుట కు బై దేశములకే పంపు చున్నారు.


పల్లేరు కుటుంబము.


ఈ కుటుంబపు మొక్కలు మన దేశములో నంతగా లేవు. దీనిలో గుల్మములు, గుబురు మొక్కలేగాని పెద్ద చెట్లు లేవు. ఆకులు అభిముఖము చేరిక, ఒంటరి చేరిక, కూడ గలదు. వీనికి కణుపు పుచ్చములున్నవి. కొన్నిటిలో నివి ముం డ్లుగా మారి యున్నవి. మిశ్రమ పత్రములు. రెండు మూడు చిట్టియాకులు గలిగి యుండును, కొన్నిపక్షవైఖరి నున్నవి. ఒక్కొక్క కణుపునుండి ఒకటో రెండో పువ్వులు వచ్చు చున్నవి. సరాళముగా, అసరాళముగాను గూడనుండును. ఈ పువ్వులలో తెలుపు, ఎరుపు, పశుపు తప్ప వేరు రంగు లేదు. రక్షక పత్రములు 5, కొంచెము కలిసి యుండిన నుండును. ఆకర్షణ పత్రములైదు. ఇవి కొన్నిటిలో మాత్రములేవు. పువ్వులో పళ్ళెరము గలుగు చున్నది. కింజల్కములు, ఆకర్షణ పత్రములన్నిగాని, వానికి రెండు మూడు రెట్లుగాని యున్నవి. ఇవి ఆకర్షణ పత్రముల నంటి యున్నవి. కింజల్కముల కాడల మీద బొలుసు కూడ కలదు. అండాశయము ఉచ్చము. నాలుగైదు గదులుండును.

పల్లేరుమొక్క:- గడ్డి పెరుగు ప్రతిచోటను బెరుగ గలదు. అది నేల మీదనే బడి యుండి గడ్డిలో గలసి మనకు గోచరము కాదుగాని, ముళ్ళు గ్రుచ్చు కొనుట వలన నది యున్నట్లప్పుడు గ్రహింతుము. ఆముళ్ళు కాయలకున్నవి. మన కట్లు గ్రుచ్చుకొనుట వలన దానికి లాభమే గలుగు చున్నది. కాయల మీద ముండ్లును అట్లు గ్రుచ్చు కొనుటకే ఏర్పడు చున్నవి. మన కాలిలో గ్రుచ్చుకొనిన యెడల దీసిదూరముగ వి సరివేతుము. ఇవియే దానికిగావలసినది. కాయ అచ్చటబడి మొలచును. ఈ రీతినే అవి వ్యాపించును. ఉత్తిరేణి కాయలు మన బట్టలకును, గొర్రెలు, మొదలగు వాని శరీరమునకు నంటు కొని వ్యాపించు నట్లు నివియు వ్యాపించుచున్నవి.

ఎండుకాయలకషాయమును, పచ్చియాకుల రసమను మూత్రవిసర్జనమప్పుడు కలుగు మంట శుక్ల నష్ణము మొదలగు బాధల నివారించుటకు వాడుదురు.


బిలిబిలికాయ కుటుంబము.


ఈ కుటుంబములో జాల భాగమన్నియు గుల్మములే. ఆకులకు కణువు వుచ్చములుండును. ఒంటరిచేరిక, లఘుపత్రములును, మిశ్రమపత్రములును గూడ గలవు. వాని పై రోమ ముండును. పుష్పములు సాధరణముగ సరాళముగానే యుండును. పుష్పమునందు బ్రతి వలయము నందును నైదేసి కలవు. అయిదు రక్షకపత్రములు అయిదు ఆకర్షణపత్రములు, వలయమున కైదు కింజల్కముల చొప్పున రెండు వరుసలూ అండాశయము నందు నైదు గదులు అయిదు కీలాములును గలవు. కాయ ఎండుటయు పెక్కువానియండ విచ్చెడుకాయ.