490

వచ్చుచున్నవి. ఇట్టిమరికొన్నిచెట్ల నుండి కూడ, కర్పూర తైలము వచ్చు చున్నది. చెట్టు నుండి తీసిన దానిని నీళ్ళలో గలపి బట్టి పెట్టుదురు. ఆవిరి రూపమున వచ్చు తైలమును చల్లార్చి ఒక దానిలో పోగు చేయుదురు. ఈ కర్పూర తైలమునకును, హారతి కర్పూరము, రస కర్పూరములకును సంబంధము లేదు. ఈ తైలము కొన్ని వ్యాధుల కుపయోగింతురు.

(వరగుణ) మదనముస్తు చెట్టును మన దేశములో విరివిగా పెరుగుట లేదు. వీని కంకుల నుండియే మదన మస్తును చేయుదురు.

వర్గము
పుష్ప రహితము. వంశము (దారు వంతము) పర్ణములు.
వర్గము
- పుష్పవంచము:


పువ్వుల తోటలలో కుండ్లయందు మొలచుచు ఎన్నడును పుష్పింపని చిన్నమొక్కలను మనము చూచు చున్నాము. అవియే పర్ణములు. కుండ్ల యందు మొక్కల వలె నున్నవి ఆకులే. వాని ప్రకాండము మట్టిలో గప్పబడి యున్నది. ఆకులు బహు భిన్న మిశ్రమ పత్రములై యుండుట చేత అవి కొమ్మల వలె నగపడు చున్నవి. ఇవి సాధరణముగ నన్నియు చిన్నమొక్కలే గాని కొన్ని చెట్ల వంటివి కూడ కలవు. 491

కొన్నినీళ్ళలోనే యుండును. చెట్లకువేరులున్నట్లు వీనికిని వేరులు వంటివి గలవు. ఇవియు ఆకులును, అన్ని వేరులు ఆకులు చేయునట్లే, ఆ యా పనులు చేయు చున్నవి. వేరు ప్రకాండముల అంతర్భాగముల నిర్మాణ్ము వేరు వేరు పర్ర్ణములందు వేరు వేరు విధములు గ నున్నది. పర్ణముల వంటివి యితర మొక్కలు కొన్ని గలవు. వీనిలోను మరి యొక విధమున నున్నది. ఎందులోను పువ్వులు పూసెడు చెట్లలోనున్నట్లులేదు.

చెట్లలో సంతానవృద్ధికి కారణమగు సంగములు పుష్పములని దెలిసి కొంటిమి. కాని వీనిలో పుష్పములు లేవు. కాన సిద్ధి బీజములు గలుగు చున్నవి. పర్ణములలో సిద్ద భీజాశయములు ఆకులు కడుగు వైపున అంచు వద్ద పొక్కులు పొక్కులుగ్తా నున్నవి. అవి పెరుగు చోట, కొంచెము గోదుమ వర్ణముగా చేతి కంటుకొను పొడియే సిద్ధ బీజములు. పర్ణముల వంటి మరియొక మొక్కలోనివి ఆకుల మీద బుట్టుట లేదు. చిన్న చిన్నకొమ్మలు కొంచెమెత్తుగా బెరిగి గద వలె నగు చున్నవి. వీని మీదస్నున్న ఆకుల కణుపు సందులలో అవి పెరుగు చున్నవి.

ఆడు, మగ, సిద్ధబీజములలో పరిమాణము తప్ప పైకగుపించు భేదమేమియు లేదు. ఆడుసిద్ధ బీజములు పెద్దవి. ఈ 492

సిద్ధబీజము లెట్లు పెరుగుచున్నవీ, సిద్ధ బీజాశయము లెట్లు పగులు చున్నవి వానిని సూక్ష్మ దర్శని క్రింద పెట్టి చూచిన గాని సుభోదకము గాదు.

సిద్ధిబీజములు గాలి కెగిరి దూర దూరముగ బడును. పడి తేమగా నున్న యెడల పెరుగుట కారంభించును. ఇవి యొక చోట బడిన చాల కాలమున వరకు అచ్చట మన కేమియు గాన రాదు. ఎదియు మొలచుచున్నట్లు గాన రాదు. కాని అవి యెదుగుచునే యున్నవి. ఒక సిద్ధ బీజమునుండి, తోడిమే ఒక పహము వచ్చుట లేదు. అచ్చటి స్థితిగతులు బాగుగ నున్న యెడల దాని నుండి, అరంగుళము కంటె చిన్నది హృదయాకారముగ నున్న యొకటి పుట్టు చున్నది. ఇది కొంచెమాకు పచ్చగ నున్నది. గాని, దీనికిని నీటి పాచి వలెనే అవయవము లేమియు లేవు; ఆకులు కొమ్మలని ఏమియు లేవు. దాని అడుగున మాత్రము సన్నని వేరుల వంటి కాడలు గలవు. దీనికి పుష్వంకురచ్చదమని పేరు. దీని అడుగున నుండి కొన్ని కణములు పెరిగి, కొన్ని మార్పుల నొందుటచే స్థూల బీజములును, సూక్ష్మ బీజములును గలుగు చున్నవి. సూక్ష్మ బీజములకు మృదు రోమములు గలవు. వీని సాయమున అవి ఈదు లాడుచు స్థూల బీజములవద్దకుపోవును. ఈ సూక్ష్మ బీజము 493

ల నాకర్షించుటకు స్థూల బీజములపై నున్న కొన్ని కణముల వద్ద నుండి ఒక రసము స్రవించు చున్నది. పిదప నొక స్థూల బీజకణమును ఒక సూక్ష్మ బీజకణమును సంయోగమును బొందును. మగ, ఆడు, భేదమిచ్చటనే గలుగు చున్నది. మగ కణము ఆడు కణములో గలసి పోవు చున్నది. తరువాత అది పెరిగి, పెద్దదై వర్ణగము చున్నది. పై చెప్పిన పర్ణము వంటి మరియొక మొక్క యందు పూర్వాంకురచ్చదనము మిక్కిలి చిన్నదిగానే యున్నది. అది సిద్ధ బీజముల నుండి పైకి వచ్చుట లేదు. స్త్రీ సిద్ధ బీజము నుండి పుట్టిన పూర్వాంకురచ్చ దనము నుండి ఆడు కణములు మగ దానిని నుండి పుట్టిన మగ కణములే బుట్టుచున్నవి.

ఈ రీతిని పర్ణము నుండి పర్ణము పుట్టుటకు మధ్య నొక తర మున్నది. పూర్వాంకు రచ్చదనము నుండి పర్ణముల నుండి సిద్ద బీజములు పుట్టు నపుడు ఆడు పర్ణము, మగ పర్ణము అని భేదమేమియు లేదు. సంయోగమును లేదు. ఈ భేదమును సంయేగమును రెండవ తరము నందె కలుగు చున్నది. ఇట్లు వీనిలో నొక మొక్క జీవితమునందే రెండు తరములు గలుగు చున్నవి. 494

వర్గము
- పుష్పరహితము, వంశము: అవయవ అరహితము ఉప వంశము (శేవతము)

నీటిపాచి

నీటి పాచి మంచి నీళ్ళలోనే గాక ఉప్పు నీళ్ళలోను సముద్రముల లోను కూడ నుండును. ఈ పాచిలో కంటికి కాన రాని యొక్కొక కణముగానె యున్న మొక్కలును వందల కొలది అడుగుల పొడుగున్నవియు గలవు. ఎంత పొడుగు ఎంత వెడల్పున్నను నవి కణముల సముదాయమె గాని వానిలో ఆరు కొమ్మవేరు అనుభేదము లేమియు లేవు. ఈ లక్షణములో బూజును పోలి యున్నవి. విడివిడిగా నుండు కొన్ని కణములకు నత్తల మీద గుల్లయున్నట్లు గుల్ల కలదు. ఆగుల్లలోనే మూల పదార్థముండును. అది పూర్తిగ నెదిగిన పిదప మూల పదారథము పైకి వచ్చు గుల్ల నుండి విడిపోయి రెండు తునకలుగా నగును. ఒక్కొక తునకకు తిరిగి గుల్ల ఏర్పడును. అవియు మొదటి దాని వలెనే పెరుగును. లేదా, గుల్లలో నుండగనే రెండు గా విడును. ఆగుల్ల రెండు ఆలు చిప్పలు గలిసి యున్నట్లు ఉన్నది. కావున ఒక్కొక్క భాగము నంటి ఒక్కొక చిప్ప బోవును, తరువాత వానికి రెండవ చిప్ప వచ్చును. ఈవచ్చెడు రెండవ చిప్ప మొదటి దాని కంటె చిన్నదిగా నుండును. ఈ రీతి