వృక్షశాస్త్రము/తిప్పతీగె కుటుంబము
తిప్పతీగె కుటుంబము
తిప్పతీగె పలు తావులందు బెరుగుచున్నది. వేరు పెద్దదిగాను మెత్తగాను వుండును.
ప్రకాండము:- తిరిగెడు తీగ (నులితీగలు లేవు) పెద్ద చెట్లమీదప్రాకును. దళసరి బెరుడుకలదు. కొమ్మలనుండి సన్నని వ్రేళ్ళు మర్రి యూడలవలె గ్రిందకు దిగును.
ఆకులు:- ఒంటరిచేరిక. హృదయాకారము లఘుపత్రములు, సమాంచలము, రెండు ప్రక్కలనున్నగానుండును. తొడిమ మొదట కొంచెము లావుగనున్నది.
పుష్పమంజరి:- కొమ్మలు చివర నుండిగాని, కణుపుసందులనుంఛి గాని, గెలలు, కొన్ని కణుపు సందులందు విడివిడిగా కూడ గలవు. ఏక లింగపుష్పములు.
పురుషపుష్పములు:--
పుష్పకోశము:- అసంయుక్తము, రక్షక పత్రములు 6. నీచము.
దళవలయము:- అసంయుక్తము. 6 రక్షక పత్రములలో సగము పొడుగుండును.
కింజల్కములు:- 6. గదవలేనుండును. ఆకర్షణపత్రములకంటె పొడుగు. పుప్పొడితిత్తులు రెండు. కాడల చివర నున్న కండలో దిగి యున్నవి.
స్త్రీపుష్పము:- పుష్పకోశమును దళవలయమును పురుషపుష్పము నందువలెనే యుండును.
కింజల్కములు:- కాడలు ఆరు. పుప్పోడితిత్తులులేవు.
అండకోశము:- అండాశయము ఉచ్చము. విభక్తాండాశయము. 3. కీలము ఒకటి. కీలాగ్రముచీలియున్నది. సాధారణముగ నీమూడు నెదుగవు. అండ మొక్కొక్క దానిలో నొక్కొక్కటి కండ కాయ., జీడిగింజ (ఫలము) ఆకారముగ నుండును.
ఈ కుటుంబములోనున్న మొక్కలు తిరుగుడి తీగెలే. ఆకులు ఒంటరిచేరిక, వానికి గణుపుపుచ్చములుండవు. పువ్వులు మెండుగానుండును. అవి యేకలింగపుష్పములు. అండాశయము క్రింద గొంచము కలిసియుండును గాని పైన విడిగానెయుండును.
తిప్పతీగె:- ఔషధములలో వాడుదురు. కొమ్మలు, వ్రేళ్ళనుంచి తీసిన కషాయము కొన్నిజ్వరములకు బని చేయును. పచ్చి కొమ్మలను వేళ్ళను నలుగగొట్టి రసముతీసి యారసము కాచిన అడుగున నొకపదార్థము మిగులును. దీనిని నిలువ చేసి ఔషధములో వాడుదురు. కొందరు మహమ్మదీయులకు వేప చెట్లల మీద ప్రాకిన తీగ మంచిదని నమ్మకముకలదు.
దూసరతీగె:- డొంకలమీద పెరుగును. ఇది తిప్పతీగకంటె సన్నముగా నుండును. ఆకులు, అండాకారము. మూడు పెద్ద ఈనెలు గలవు. దీని పండ్ల రసము సిరావలె ఉపయోగించును. వేళ్ళ కషాయము పిప్పళ్ళ రసముతోడను మేక పాల తోడను కలిపి సుఖ వ్వాధుల వలన గలిగిన కీళ్ల నొప్పులు మొదలగు రోగముల కిత్తురు. ఆకులను నీళ్ళలో వేసి రాసిన యెడల నీళ్ళు ఆకు పచ్చనగును. చిక్కగాను నగును. దానిలో పంచదార వేసి సంకటమువారల కిత్తురు. ఆకులతో గూర చేసి తిన్నచో వారికి మంచిదె.
మానుపసుపు:- పెద్ద తీగె. దీనియాకులు హృదయాకారము దానిమీద 5...7 ఈనెలుండును. కొమ్మలను చిన్న చిన్నముక్కలుగజేసి నీళ్ళలోవేసి నానవేసి నానినిదిని నీరు త్రాగుచో గడుపునొప్పియు కొన్నిజ్వరములును తగ్గును. ఈ గీతె గగెట్టిగా నుండుటచే నొక్కొక్కప్పుడు త్రాడుబదులు దీనినేఉపయోగించుచుందురు.
తీగముషిణి:- తీగెపెద్దది. పువ్వులుచిన్నవి. పచ్చాగానుండును. పక్షులు దీని పండ్లను తినును. దీని వేరు నుండి రసము తీసి పాముకాటునకిత్తురు గాని అంతగా పని చేయునట్లు తోచదు.
కాకిమఱ్ఱితీగె:- ఆకులుపెద్దవి. దీనికాయలను దినరాదు. అవి విషము గింజల నుండి చమురు తీసి కొబ్బరి నూనెలో గలిపి వ్రాసిన తామరమొదలగు చర్మ వ్వాధులు తగ్గును. దీని పండ్లను , గింజలను అన్నముతో కలిపి కాకులను జంపుటకు బెట్టుదురు.
కలువ కుటుంబము.
కలువమొక్కలు మన దేశమందంతటను బెరుగుచున్నవి. వేళ్ళు బురదలో నాటుకొనియుండును.
ప్రకాండము నీళ్ళలోనె పొట్టిగా నుండును.
ఆకులు:- పెద్దవి. గుండ్రము, తొడిమలు మిక్కిలిపొడుగుగాను గుండ్రముగాను నున్నగాను నుండును. ఇవి కడ్డివలెగట్టిగాలేవు. వీని పొడుగునను సొరంగములలో గాలియుండును. కావున ఆకులు నీటి మీద తేలును. కాడలు వంగగల్గుట చేతను సాగగల్గుటచేతను నీరు తగ్గినను హెచ్చిననను ఆకులు నీటి మీదనే తేలుచుండును. కాడ పత్రముతో గలియు చోట నెత్తుగాకణుపు వలెనున్నది. పత్రము రెండు వైపుల సన్నగా నుండును.