వృక్షశాస్త్రము/తగడ కుటుంబము

324

ఈమొక్క అపువ్వులు సరాళములు 5 రక్షక పత్రములు, 5 ఆకర్షణ పత్రములు, 5 కింజల్కములు, 5 కీలములును గలవు.

మరికొన్ని కీటక భుక్కులగు మొక్కలలో ఆకులు గిన్నె వలె మారి యున్నవి. ఆ గిన్నెకు ఒక మూత గలదు. ఈ మూతను త్రోసికొని లోపలకు బోవచ్చును గాని ఏపురుగును పైకి రాలేదు. మరియు పురుగొక్కటి లోపలకు ప్రవేశింపగానె ఒక ద్రవము స్రవించి ఆ కీటకమును చంపి వేయును.

ఈ కీటక భుక్కులగు మొక్కలు బురదనేలలోను, నీళ్ళలోను బెరుగు చున్నవి. అవి పెరుగు చోట ఉప్పువాయువు నత్రజని మిక్కిలి తక్కువగా దొరుకును. కాని ఆది జంతువులకు వలెనే మొక్కలకు కూడ ముఖ్యముగా కావలయును. కాన ఆ మొక్కలిట్లు పురుగులను జంపి వాని నుండి ఆ పదార్థము పొందు చున్నవి.


తగడ కుటుంబము.


తగడ చెట్టు కొండ ప్రదేశములలో ఎత్తుగా పెరుగును.

ప్రకాండము:- లావుగను పొడుగుగను వంకరలు లేక తిన్నగను, నుండుడును. బెరడు, దట్టము, దోదుమ వర్ణము 325

ఆకులు
- అభిముఖచేరిక, మిశ్రమ పత్రములు మిషమ పక్ష వైఖరి. చిట్టి ఆకులు 4 జగలు. వీని తొడిమ పొట్టిది. అండాకారము విషమ రేఖ పత్రములేతాకుల కడుగున మెత్తనిరోమములు గలవు. సమాంచలము, కొన్నిటి యందు కొంచెము గొగ్గి గొగ్గులుగ నుండును. కొన సన్నము.
పుష్ప మంజరి
- కొమ్మలచివరలనుండి రెమ్మగెలలు వృంతము మీదను ఉప వృంతము మీదను గోధుమ వర్ణము గల రోమములు గలవు. పుష్పములు పెద్దవి. అసరాళము చేటికలు చిన్నవి గలవు.
పుష్పకోశము
- సంయుక్తము 5 దంతములు. నీచము.
దళస్వలయము
.... సంయుక్తము 5 తమ్మెలు అసరాళము పశుపు రంగు మంచి వాసన వేయును.
కింజల్కములు
- 4 కాడలు పొడుగు మరియొక గొడ్డు కాడ గలదు. దీనికి పుప్పొడి తిత్తి లేదు పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండకోశము
- అండాశయము ఉచ్చము రెండు గదులు అండములు చాల గలవు. గింజలకు రెక్కలుండును. కీలమగుండ్రము కీలాగ్రము రెండు చీలికలు.

ముక్కడి చుట్టు కూడ కొండ ప్రదేశములే బాగుగ బెరుగును.

ఆకులు
- అభి ముఖ చేరిక, మిశ్రమ పత్రములు పక్ష వైఖరి. చిట్టిఆకులు హృదయాకారము అడుగున నున్న జాత పెద్దవి. విష మ రేఖ పత్రము సమాంచలము కొన సన్నము.
పుష్ప మంజరి
- కొమ్మలచివరల నుండి, త్రివృంత మధ్యారంభ మంజరులు, చేతికలు గలవు. పువ్వులు చిన్నవి. తెలుపు రంగు మంచి వాసన వేయును. 326
పుష్పకోశము
- సంయుక్తము గొట్టమువలె నుండును. కొంచెమోష్టాకారము ఒక్కొక్కప్పుడు 4 దంతములుండును. నీచము.
దళ వలయము
- సంయుక్తము బిళ్ళ గన్నేరు పువ్వుల వలె అడుగున పొడుగు గొట్టము వలెను, పైన 5 తమ్మెలు వ్యాపించి యు నుండును.
కింజల్కములు
- 2 పొట్టివి దళవలయము నంటి యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము
- అండాశయము ఉచ్చము రెండు గదులు. అండములు చాల యున్నవి. కీలముపొడుగు కీలాగ్రము రెండు చీలికలు.

ఈ కుటుంబములో ఎక్కువగ తీగెలును, చెట్లును గలవు. వీని ఆకులు అభిముఖ చేరిక, కొన్నిటివి మాత్రము లఘు పత్రములు. పుష్పములు అసరాళము. కింజల్కములు దళ వలయపు తమ్మెలుకకంటె తక్కువగానుండును. అండాశస్యము రెండు గదులు, చాల గింజలుండును. గింఅలకు సాధారణముగ రెక్కలు గలవు. కాయ యెండి పగులును. ఈ కుటుంబములో ఉపయోగించు మొక్కలంతగా వున్నట్లు గాన వచ్చుట లేదు.

ముక్కడిచెట్టు కలప బూడిఒదవర్ణముగను గట్టిగానునుండును. అదిత్వరగా వంగి పోదు. కావున సాలివాండ్రు మగ్గములకు దానినుపయోగింతురు. ఈ కలప ఇతర పనులకు కూడ పనికి వచ్చును. 327

తగడ చెట్టు కలప కూడ గట్టిగానే యుండి చిరకాలము మన్నును.

సంపెన

సంపెన చెట్టు చాలపొడుగుగ పెరుగును. పువ్వులు ఎర్రగా నుండును. దీని కలప గట్టిగా నుండదు.

కలిగొట్టు చెట్తు చిన్న చెట్టు. దీని పువ్వులు మంచివాసన వేయును. 328

చిట్టివడ్డిచెట్టు అడవులలో పెరుగును. పువ్వులు తెలుపు. కాయలు మెలివెట్టి కొని యుండును.


నూవు కుటుంబము.


ఈ కుటుంబములో గుల్మములు, చిన్న గుబురు మొక్కలే గాని పెద్ద చెట్లు లేవు. ఆకులు ఒంటరి చేరిక, కొన్ని సమాంచలము కొన్నిటి అంచున రంపపు పండ్లున్నవి. కొన్ని తమ్మెలుగా చీలి యున్నవి. పువ్వులొక్కక కణుపు సందు నొక్కక్కటి యున్నవి. అసరాళము. పుష్ప కోశము సంయుక్తము. నాలుగో అయిదో తమ్మెలు గలవు. దళ వలయము గొట్టము వలె నున్నది దీని తమ్మెలు మొగ్గలో అల్లుకొని యుండును. కింజల్కములు నాలుగు. రెండు పెద్దవి. రెండు చిన్నవి. అండాశయము లుచ్చము రెండు గదులు గలవు. కీలాగ్రమునకు రెండు తమ్మెలు గలవు.

నూవు మొక్క మీది యాకులన్నియు నొక రీతిని లేవు. పైభాగమందున్నవి నిడివి చౌకపాకారము. సమాచలము. అడుగున నున్నవి అండాకారము, వీని యంచున రంపపు పండ్లున్నవి. మన దేశములో నూవులను ఉష్ణ ప్రదేశములలో శీతాకాలమందును, శీతలప్రదేశములందు వేసవి కాలమందును సేద్యము చేయుదురు. వీనికి మిక్కిలి సారవంతమగు ఒం