వృక్షశాస్త్రము/చేమ కుటుంబము
451
ను గావున సగ్గుబియ్యము చేయుటకుచెట్లు పుష్పింపక పూర్వము వానిని నరికి, దవ్వను చిన్న చిన్న ముక్కలుగ కోసిన పొడుము చేసెదరు. ఈ పొడుము నీళ్ళతోగలపి రెండు చేతులతోడను రాయచు జంత్రికల చట్రము వంటి వాని మధ్య పెట్టుదురు. నారంతయు పైన మిగిలిన, అడుగునకు పిండి పోవును. దీనిని చిక్కగ నీళ్ళతో గలపి జల్లెడల మీద పెట్టి చేతితోడనే కారపుపూస /బూంది దూసినట్లు దూయుదురు. కనుక పిండిఅంతయు చిన్న చిన్న యుండలవలెపడును. ఇదియే సగ్గుబియ్యము. సగ్గుబియ్యముయెక్క పరిమాణము ఆజల్లెడ కంతలను బట్టి యుండును.
చేమ కుటుంబము.
- చేమమొక్క గుల్మమము. ప్రకాండము భూమిలోనున్నది.
- ఆకులు
- బాణాగ్రాకారము. తొడిమపొడుగు. పత్రముతో అంచును జేరక మధ్యగా గలయు చున్నది. సమాంచలము. సమరేఖపత్రము.
- పుష్ప మంజరి
- కంకి ఊరుచేటిక. దీనిని జుట్టుకొని యెదిగిన పిమ్మట విడిపోవును. తెలుపు రంగు.
- కంకి
- లావుగ మొక్కజొన్న పొత్తివలె నున్నది. దీనిమీద పెక్కుపుష్పములు గలవు. ఇవి చాలమారియున్నవి. ఉపవృంతములు లేవు. ర
452
క్షకపత్రములుగాని, ఆకర్షణపత్రములుగానిలేవు. ఏకలింగపుష్పములు. అడుగున స్త్రీ పుష్పములు. పైన పురుషపుష్పములు నపుంసక పుష్పములు కూడ కలవు.
- స్త్రీ పుష్పము.
- అండ కోశము
- అండాశయము. 3 గదులు. గింజలు స్థంభ సంయోగము. ఫలము కండ కాయ.
- పురుష పుష్పములు
- మూడో నాలుగో కింజల్కములున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు
నపుంసక పుష్పములలో నేయియు లేవు.
- గజపిప్పలి
గజపిప్పలి అడవులలో చెట్ల మీద వేళ్ళమూలమున ప్రాకు చున్నచి. దీనికి నులితీగలు లేవు.
- ఆకులు
- ఒంటరి చేరిక. తొడిమగలదు. అండాకారము. సమాంచలము. సమ రేఖ పత్రము. కొన సన్నము.
- ప్పుష్ప మంజారి
- కంకి. ఊరుచేటిక యొక వైపున వంగియున్నది. అడుగున కాయ పచ్చగాను, పైన పసుపుపచ్చగానుండును. కంకి కొంచముపసుపు వర్ణముగా నుండును. దాని మీద నల్లని మచ్చలు గలవు. మిధున పుష్పములు.
- పుష్ప కోశము
- పురుచేటికతీసిల్వేయబడినది.
- కింజల్కములు
- 4 కాండలు పొట్టివి. పుప్పొడి తిత్తులు 2 గదులు. 453
- అండకోశము
- అండాశయౌ 1 గది. 1 అండము. పీఠసంయోగము ఫలము లేదు. కీలాగ్రము నల్లగా నుండును. కొన్ని అండకోశములు గొడ్డులయి యున్నవి.
ఈ కుటుంబపు మొక్కలలో కొన్ని చిన్నవి. కొన్ని పెద్దవి. కొన్ని తీగలు కొన్ని బురుద నేలలో పెరుగును. ఆకులు ఒంటరి చేరిక. వీని పుష్పములను బట్టి ఈ కుటుంబపు మొక్కలను గుర్తింప వచ్చును. వాని కంకులు మొక్కజొన్న పొత్తుల వలె నుండును. సంపూర్ణ పుష్పములు లేవు. అండ కోశము ఉచ్చము.
చేమదుంపలు మన దేశములో ఎల్ల చోట్లను సేద్యము సేయు చున్నారు. ఒండ్రు మట్టితో కూడిన ఇసుక నేలలో బాగుగ పెరుగును. బాగుగ ఎదిగిన దుంపల తలలు కోసి పాతి పెట్టుదురు. ఆతలల నుండి 5, 6 మొక్కలు మొల్చును. వానికి దరుచుగా నీరును పెంటయు దగులు చుండ వలెను. ఆకులు కాక దుంపలకై వీనిని సేద్యము చేయు చుండిన అడుగు దూరములో పాతి మూడో నాలుగో ముదురాకులుంచి లేత వానిని త్రుంపి వేయ వలెను. పదినెలల నాటికి దుంప లెదుగును.
చేమదుంపలతో కూరను మాత్రము వండు కొను చున్నాము. వేసవి కాలమందు, వంగ, బీర, పొట్ల మొదలగు 454
కాయలు దొరకనప్పుడివి సమృద్ధిగను కుళ్ళి పోకుండనునుండుటచే మిక్కిలి యుపయోగ కరములగుచున్నవి . చేమదుంపలలో కొన్ని గుండ్రముగాను, కొన్ని కోలగాను నుండును. కోల దుంపలు బాగుగ ఉడుకునందురు. చేమ దుంపల యందును గంద వలె దురద పెట్టు పదార్థము గలదు. చేమ దుంపల నుడక పెట్టిన నది పోవును. మరియు నేదైన పుల్లని పదార్థము గీనితో గలసిన ఆ పదార్థము చెడు గుణము పోవును. కనుక దరుచుగా చింత పండు పులుసునో, నిమ్మకాయల రసమునో కలుపుచుందురు. వీని ఆకుల తోడసు కూర వండు కొందురు.
కంద మొక్కయని మనమనుకొనునది నిజముగా ఆకులే. మానుగాదు. మానుభూమిలో దాగి కంద వలె మారినది. కందసు కూడ చేమ వలెనే సేద్యముచేయుదురు. దీనికి నల్లనేల మంచిది. దీని యందు దురదపెట్టు పదార్థము చాలగలసు. క్షీరాభ్ధి ద్వాదశికి నుసిరి మొక్కను పూజ చేసినట్లు మహాళాయమావాశ్యకు కంద మొక్కను పూజింతురు.
వస మొక్క పువ్వులలో రేకులున్నవి. వీని ఆకుల నుండి తైలముతీయుదురు. దీనివేరును అజీర్ణము, దగ్గు మొదలగు రోగములకు దగుననుపానములతో నిత్తురు. 455
సూరికంద ఎక్కువ్గా మామిడి చెట్ల నీడలను బెరుగును. దీని దుంపలును కందవలె నుండును కాని అంత కంటె చిన్నవి. కొంచెము తెల్లగా నుండును. ఈ దుంపలనరుగ దీసి కంతులకును బాము కాటులకును వేయుదురు. దీనిని సరిగా ఉపయోగించిన ఎడల మంచి పని చేయును.
అడవి కంద కొండల మీద పెరుగును. దాని దుంపలు కోలగా నుండును. వీనికి నొక విధమగు వాసన గలదు. రెండు మూడు మారులు నీరుతో ఉడక బెట్టిన గాని వాసన పోదు. దీనిని కొండ మీద నుండు వారే తినుచున్నారు.
అడవిచామ మొక్కకు ఆకులు ఒకటో రెండో మత్రము పుట్టుచున్నవి. దీనిని కొండ జాతులు తిందురు.
గజపిప్పలి అడవులలో చెట్ల మీద ప్రాకును. దీని కాయల నెండపెట్టి ముక్కలుగా కోసి గజ పిప్పలియని అమ్ముచున్నారు. దీని ఔషధములలో వాడుదురు.
మూలసరి ఆకుల అడుగున ముండ్లుగలవు. పువ్వులలో కింజల్కములు చాల యున్నవి. కాయ నాలుగు పలకలుగా నుండును. 456
కుంభిక నీళ్ళలో మొలచును. వేసవి కాలమందు పుష్పించుట కారంబించును.
తుంగ కుటుంబము.
వూరిగడ్డి ఇసుక నేలలో పెరుగును. దీని అడుగున భూమిలో నున్న దుంపలు ఉల్లి గడ్డల నంటి లశునములు. కాని పైన చార చారలుగ బొరలు గలవు. ఇవి ఉల్లిపాయలో వలెనే ఆకులు మూలమున ఏర్పడినవి. వీనిలోపల తెల్లని పదార్థమున్నది. అది తినుటకు బాగుండును.
- ప్రకాండము
- - నిడువుగానె బెరుగును. దాని అడుగున మాత్రము ఆకులు గలవు. ఇది కొంచెము గుండ్రముగా నుండును.
- ఆకులు
- - విస్తారము లేవు. లఘు పత్రములు. పాద పీఠమునందు గొట్టము వలె నున్నది. సమ రేఖ పత్రము. సమాంచలము. కొన సన్నము.
- పుష్ప మంజరి.
- - గుత్తులు ఆరు ఒదలు పది వరకు కంకులు గలవు. ఈ కంకుల మీద చిన్న చిన్న పుష్పముల వలె నుండునవి పువ్వులు కావు. అవియు కంకులే. వానికి అల్పకణిశములనిపేరు.
పుష్పములలో పుష్పకోశముగాని, దళవలయముగాని లేదు. కింజల్కములు, అండ కోశము మాత్రము గలవు. వానిని గప్పుచు పెరుగు పత్రము చేటికలే. ఈ చేటికలకు తుషములని పేరు. అల్పకణకము మీద మొదట నున్న రెండు తుషములలోనే ఏమియులేదు. పైవానిలో కింజల్కములు అండకోశము గలదు.