వృక్షశాస్త్రము/గుగ్గిలపు కుటుంబము
109
తేయాకు కషాయము త్రాగనేర్చితిమి. అది సువాసనగను పాలును పంచదారను గలుపుదుము గాన, రుచిగను నుండుట నిజమే. అది అప్పటికి చురుకును బుట్టించి నిద్దుర రాకుండ చేయును.
గుగ్గిలపు కుటుంబము:
గుగ్గిలపు చెట్లు మన దేశములో విరివిగానె పెరుగుచున్నవి.
- ఆకులు
- - లఘు పత్రములు. ఒంటరి చేరిక. అండాకారముగ నైన నిడివి చౌక పునాకారముగనైన యుండును. సమాంచలము. విషమరేఖ పత్రము. కొన, వాలము గలదు.
- పుష్పమంజరి
- ... కొమ్మలచివరలనుండి గాని, కణుపు సందుల నుండి గాని మధ్యారంభ మంజరులగు రెమ్మగెలలు, పుష్పములు ఉపవృంతములు మిక్కిలి పొట్టివి, పువ్వులు లేత పశుపు రంగు.
- పుష్పకోశము
- ... సంయుక్తము. గొట్టము పొట్టి. తమ్మెలు సన్నము. మొగ్గలో అల్లుకొనియుండును.
- దళవలయము
- ... అసంయుక్తము. 5. కొంచెము బల్లెపునాకారముగ నుండును. మంచి వాసనయే గలదు. వృంతాశ్రితము.
- కింజల్కములు
- ... ఏబది గలవు. పుప్పొడితిత్తులు రెండు గదులు. కింజల్కములు వృంతాశ్రితములు.
- అండకోశము
- ... అండాశయము ఉచ్చము 3 గదులు గలవు. ఒక్కొక్క దాని యందు రెండేసి యండము లున్నవి. కీలము పొట్టి. కీలాగ్రములు మూడు చీలికలు, కాయ ఎండి పగులును. 110
- బొమ్మ
- రెల్లడామర:
ఈకుటుంబములోని చెట్ట్లన్నియు పెద్దవృక్షములే. వీని నన్నిటినుండు గుగ్గిలము వంటి పదార్థము వచ్చును. ఆకులు ఒంటరి చేరిక లఘుపత్రములు. వీనికి చిన్నచిన్నకణుపు పుచ్చములున్నవి. పువ్వులకు మంచి వాసన గలదు. ఆకర్షణ పత్రములు సాధారణముగ మొక్కలో మెలిపెట్టినట్లుండును. కీలాగ్రములు మూడు.
- గుగ్గిలము
- -
చెట్లు హిమాలయ పర్వతముల ప్రాంతములను, రాజమహాలుకొండలవద్దను, ఒరిస్సా, మధ్యపరగణాలు, అంధ్రదేశములోను ఎక్కువగా బెరుగు చున్నవి. ముదురు చెట్లను మూడు నాలుగుగడుగులెత్తున చెట్టు పరిమాణమును బట్టి నాలుగైదు చోట్ల {బెరడు} గీసెదరు. ఆ చారలలోనికి అరపూస వంటి పదార్థము వచ్చి చేరును. అధి మొట్టమొదట తెల్లగానే యుండును గాని తరువాత కొంచెము గోధుమ వర్ణము వచ్చును. ఇదియే గుగ్గిలము. దీనిని తీసివేసినతరువాత కొన్ని నెలలకు ఆచారలోనే మరికొంత చేరును. ఇట్లు మూడుమాట్లు తీయవచ్చును గాని మాటి మాటికి తక్కువ రకము వచ్చుచుండును. గుగ్గిలము నౌషధములలో వాడుదురు. దీనిని లోపలి కివ్వరు గాని కొన్ని మందులతో గలిపి పైన రాయుచుందురు. దురువాసన బోగొట్టు 112
టకు దీనిని పొగవేయుదురు. పడవలు, ఓడలు కట్టుటలో దీనినుపయోగింతురు. దీని బెరడు తోలుబాగుచేయుటకుకూడ పనికివచ్చును.
గుగ్గిలపుగొమ్మ. తెల్లడామర:.... చెట్టుపెద్దదియె. దీనియాకులు నగోళాకారము. దీని నుండియు గుగ్గిలము వంటిది వచ్చును. దీనిని గూడ గుగ్గిలము వలె నౌషధములలో వాడుదురు. దీని కర్పూరతైలములో గలిపిన మంచి వార్నీషు అగును. దీనినే కొబ్బరి నూనెలో గలిపి క్రొవ్వువత్తులు కూడ చేయవచ్చును. తెల్లడామర గింజలనుండి వచ్చు చమురుకూడ క్రొవ్వు వత్తులు చేయుటకు బనికి వచ్చును. ఈ చమురు నొక కప్పుడు నేతిలో కలిపి దగా చేయుచుందురు. దీని బెరడు వగరుగా నుండును. కల్లు పులియకుండ కొన్ని చోట్ల దీనిని వేయు చుందురు. కలప గుగ్గిలపు చెట్టు కలపంత మంచిది కాదు.
నల్లడామర:.... ఆకులు కొంచెము హృదయాకారముగ నుండును. దీని నుండియు గుగ్గిలము వచ్చును. ఈ చెట్టు నుండి మంచి కలపయు వచ్చును.
బెండ కుటుంబము.
బెండ మొక్క మంచి నేలలం దారడుగులవరకు బెరుగును; లేత భాగములందు గ్రుచ్చుకొను నూగును గొంచము నీలముగా నున్న మచ్చలును గలవు.
ఆకులు:.... ఒంటరి చేరిక, లఘు పత్రములు, కొంచము పైగానున్న యాకులు చీలియున్నవి. చివర వానికి బెద్ద తమ్మెలు గలవు; తాళపత్ర వైఖరి. అంచున రంపపుపండ్లున్నవి. కరుకుగానున్న రోమములును గలవు. తొడిమ పొడుగు. కొమ్మ ఆకుకంటె నెర్రగానుండును. రెండుకణుపు పుచ్ఛములు గలవు.