వృక్షశాస్త్రము/కుంకుమపువ్వు కుటుంబము
414
చంద్ర మూలికను కూడ ఔషధములలో వాడు చున్నారు. దీని వేరునకు సువాసస్న గలదు. దీని కీలాగ్రము గరాటి వలె నున్నది.
కొండ పసుపు ఉల్లి గడ్డల వలె గడ్డలుగా నుండును.
కస్తూరి పసుపు పసుపు వలెనే యుండును గాని మంచి వాసన గలదు
అడవి యేలక కాయలు. ఏలక కాయలకు బదులుగా వీని నుపయోగించుట కలదు కాని ఇవి అంత రుచిగా నుండవు.
కుంకుమపువ్వు కుటుంబము.
ఈ కుటుంబము మొక్కలు శీతల దేసములో గాని పెరుగ లేవు. ఇవి మనదేశములో అంతగా లేవు. వీనిలోనన్నియు గుల్మములే గాని పెద్ద చెటేలు లేవు. పుష్ప నిచోళములో ఆరురేకులుండును. కింజల్కములు మూడును పుష్స్ప నిచోళ ములైనను అండాశయము నైనను అంటి యుండును. అండాశయము ఉచ్చము. మూడు గదులు గలవు. కీలము ఒకటి కీలాగ్రములు మూడు.
415
- కుంకుమ పువ్వు మొక్క. 416
మనదేశములో ఈ కుటుంబము లోని మిక్కలలో నుపయోగమైనది కుంకుమ పువ్వు మొక్కయె. ఇది చిరకలము నుండి మనదేశమున కలదు. దీనిని ఔషధములో వాడుచున్నారు గాని కొందరంతగా బనిచేయదందురు.
దీని దుంపలను ముక్కలు గోసి వానిని నాటి పైరు చేసెదరు. వీనిని మళ్లో నాటక పూర్వము చేలలో నీరు బోయక ఎండ గట్టుదురు. మొక్కలు పెరిగిన తరువాత అప్పుడప్పుడు నీరు పెట్టుట తప్ప వానికై అంతగా పాటు పడ నక్కరలేదు. ఇది పదునాలుగేండ్ల వరకు బ్రతుకును. వీని పుష్పములు మిక్కిలి అందముగాను పరిమెళముగాను నుండును. వీని నుండియే కుంకుమ పువ్వు చేసెదరు.
పువ్వులను గోసి ఎండ బెట్టి పువ్వులలో నుండు మధ్య కాడలను (కీలములను) త్రుంపి వేరు చేసెదరు. ఇదియే మేలైన కుంకుమ పువ్వు. దీని వెల తులము రూపాయిన్నర... రెండు రూపాయలవరకు వుండును. ఈ కాడలపై నున్న తలలు వీని కంటె కొంచెము తక్కువరకము తరువాత పువ్వులను చిన్న కర్రతో గొట్టి నీళ్ళలో వేసెదరు. రేకులు పైకి తేలును. అడుగునకు దిగు వానిని పోగు చేసి మరల బాది నీళ్ళలో వేయుదురు. ఈ ప్రకారము మూడు మాట్లు చేయుదురు గాని అంతకంతకు తక్కువ రకము వచ్చును. 417
దీని సువాసనకై తాంబూలమునందు పిండి వంటల యందు వాడు చున్నాము. దీనిని ఔషధములలో కూడ వాడుదురు. రాజులును మిక్కిలి ధనవంతులు దీనితో బొట్టు పెట్టు కొనుదురు. బహుశ దీని బట్టియే సాధరణముగా బొట్టు పెట్టుకొను దానికి కుంకుమ అని పేరు వచ్చి యుండును గాని కుంకుమ పువ్వు దీనియందణు మాత్రము లేదు.
ఒక్కొక్కప్పుడు కుంకుమ పువ్వులో కుసుంబ పువ్వును గలిపి దగాచేయుదురు. కాని కుసుంబపువ్వునకు కూడ మంచి వాసన గలదు.
కిత్తనార కుటుంబము.
- కేసరి మొక్క.
- ప్రకాండము. భూమిలోపల నుండును. లశునము.
- ఆకులు. భూమిలోనున్న లకునము నుండి వచ్చును. తొడిమ లేదు. పత్రములు సన్నముగాను బొడుగుగా నుండును. సమాంచలము. సమ రేఖ పాత్రము రెండు వైపుల నున్నగా నుండును.
- పుష్ప మంజరి
- ఆకుల మధ్య నుండి ఒకకాడ వచ్చును. ఈ కాడ చివర పుష్పముండును గాని వేరే ఆకులుండవు. పుష్పములు పెద్దవి.
418
పుష్పనిచోళము, సంయుక్తము. 6 దంతములు గలవు. 3 రక్షక పత్రములు, 3 ఆకర్షణ పత్రములు గలసి ఈ పుష్పనిచోళమైనదని యూహింప వచ్చును. తెలుపు. సువాసన గలదు.
కింజల్కములు 6 పొడుగుగా నున్నవి. పుప్పొడి తిత్తులు గాడలపై నూగులాడు చుండును., కింఅల్కములను గలుపుచు నొక పొర గలల్దు.
- కేసరి.