విశేష గ్రంథము/ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము -చిలుకూరి వీరభద్రరావు

ముఖపత్రము
ముఖపత్రము

చిలుకూరి వీరభద్రరావుఆంధ్రుల చరిత్రమునుఐదు భాగాలుగా ప్రచురించెను. మొదటి,రెండవ భాగాలను విజ్ఞానచంద్రికా మండలి 1910,1912 లో ప్రచురించగా మూడవభాగం1916 లో ఇతిహాస తరంగిణీ గ్రంధమాల ద్వారా ప్రచురించబడింది.


ఈ భాగము 1910 లో విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా ప్రచురించబడింది. ఈ భాగము రాయుటకు సంవత్సర కాలము పట్టెను. ఒక అజ్ఞాత దాత మరి ఇంకొంతమంది సహాయమువలన ఈ భాగము ముద్రితమయ్యెను. రచయిత చెప్పినట్లు ఈ భాగములో కల వివరములు. "ఆంధ్రులయొక్క రెండువేలయేనూరుసంవత్సరముల చరిత్రమును సవిస్తరముగా వ్రాయ నుద్యమించినవాడను గావున నంతయు నేక సంపుటమున నిమిడ్చిన నంతమనోహరముగా నుండదనియు, ప్రథమగ్రంథమగుటం జేసి యట్లుచేయుట సులభసాధ్యముగాదనియు భావించి చరిత్రకాలమునంతయు బూర్వయుగము, మధ్యయుగము, నవీనయుగము నని మూడుభాగములుగా విభాగించి యైతరేయ బ్రాహ్మణము మొదలుకొని క్రీస్తుశకము 1200 సంవత్సరమువరకును బూర్వయుగముగా గ్రహించి యాపూర్వయుగచారిత్రమునే ప్రథమభాగముగా నేర్పరచుకొంటిని. ఇందు ప్రాచీనాంధ్రదేశస్థితియు, ఆంధ్రవంశము, పల్లవవంశము, చాళుక్యవంశము,చాళుక్యచోడవంశము,కళింగగాంగవంశము,ఆంధ్రచోడవంశము,బాణవంశము,వైదుంబవంశము,హైహయవంశము, బేటవిజయాదిత్యవంశము,కళింగగాంగవంశము,విష్ణుకుండిన వంశము మొదలగునవి సంగ్రహముగా నిందుజేర్పబడినవి." చదవండి ..