విభూతి పాదము
←సాధన పాదము | పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (విభూతి పాదము) | కైవల్య పాదము→ |
జ్ఞానము. : |
1. దేశబంధశ్చిత్తస్య ధారణా
మార్చు(దేశ బంధః చిత్తస్య ధారణా) - చిత్తమును ఒకే ఒక్క స్థానములో నిశ్చలంగా ఉంచడం ధారణ.
2. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్
మార్చు(తత్ర ప్రత్యయ ఏకతానతా ధ్యానమ్) - ధ్యానానికి కేంద్రమైన వస్తువుమీద అచంచలంగా ఏకాగ్రతతో దృష్టి నిలపడం ధ్యానము.
3. తదేవార్థమాత్రానిర్భాసమ్ స్వరూపశూన్యమివ సమాధిః
మార్చు(తత్ ఏవ అర్థ మాత్రా నిర్భాసమ్ స్వరూప శూన్యమ్ ఇవ సమాధిః) - ధ్యానం సాఫల్యమైతే సాధకునికి స్థూలశరీరానికీ సమస్త ప్రపంచానికీ అతీతమైనదీ, తనలో అంతర్లీనంగా ఉన్నదీ అయిన అంతర్జ్యోతి కనిపిస్తుంది. అదే సమాధి.
4. త్రయమేకత్ర సంయమః
మార్చు(త్రయమ్ ఏకత్ర సంయమః) - ఈ మూడింటినీ కలిసికట్టుగా (ధారణ, ధ్యానము, సమాధి) సంయమము అంటారు.
5. తజ్జయాత్ ప్రజ్ఞాఽఽలోకః
మార్చు(తత్ జయాత్ ప్రజ్ఞా ఆలోకః) - సంయమము చేస్తే ప్రజ్ఞ కలుగుతుంది.
6. తస్య భూమిషు వినియోగః
మార్చు- ఆ ప్రజ్ఞను క్రమపద్ధతిలో వినియోగించుకోవాలి.
7. త్రయమంతరంగమ్ పూర్వేభ్యః
మార్చు(త్రయమ్ అంతరంగమ్ పూర్వేభ్యః) - సాధన పాదం 29వ సూత్రంలో ప్రస్తావించిన ఐదు విధాలకి (యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారము) భిన్నంగా ఈ మూడూ (ధ్యానం, ధారణ, సమాధి) అంతరంగానికి సంబంధించినవి.
8. తదపి బహిరంగమ్ నిర్బీజస్య
మార్చు(తత్ అపి బహిరంగమ్ నిర్బీజస్య) - అష్టాంగాలలో యమ, నియమ మొదలైన ఐదు స్థితులకంటె సంయమం ఉత్తమమే అయినా అది ప్రాథమిక దశలో బహిరంగ సాధనగా ఉంటుంది.
9. వ్యుత్థాననిరోధసంస్కారయోరభిభవప్రాదుర్భావౌ నిరోధక్షణచిత్తాన్వయో నిరోధపరిణామః
మార్చు(వ్యుత్థాన నిరోధ సంస్కారయోః అభిభవ ప్రాదుర్భావౌ నిరోధ క్షమ చిత్త అన్వయః నిరోధ పరిణామః) - ప్రారంభదశలో కింది స్థాయిలో చిత్తవృత్తులను అదుపులో ఉంచడానికి నిరోధక చిత్తవృత్తులు పుడతాయి. సాధకుడు వాటిని కూడా తొలగించుకోవాలి. ఈ చిత్తవృత్తులు పుట్టడం, వాటిని నిరోధించడం – ఈ నిరోధకపరిణామాన్ని సాధకుడు గుర్తించడం సాధనలో ఒక పరిణామదశ.
10. తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్
మార్చు(తస్య ప్రశాంత వాహితా సంస్కారాత్) - ఆ సాధనతో ధ్యానం ఏకోన్ముఖంగా సాగి ఆధ్యాత్మికమైన ప్రశాంతత లభిస్తుంది సాధకునికి.
11. సర్వార్థతైకాగ్రతయోః క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః
మార్చు(సర్వార్థతః ఏకాగ్రతయోః క్షయ ఉదయౌ చిత్తస్య సమాధి పరిణామః) - చిత్తవృత్తులు కలగడం, వాటిని నిరోధించడం, నిరోధిస్తున్నానన్న స్పృహ సాధకునికి కలగడంచేత ఇతర ఆలోచనలన్నీ తొలగి ఏకాగ్రత సాధిస్తాడు. చిత్తము సమాధిస్థితి చేరువ అవుతుంది.
12. తతః పునః శాంతోదితౌ తుల్యప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతాపరిణామః
మార్చు(తతః పునః శాంత ఉదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రతా పరిణామః) - ఆవిధంగా చిత్తవృత్తులు పుట్టడం గిట్టడం సమాన స్థాయిలో (హెచ్చుతగ్గులు లేకుండా) జరిగినప్పుడు ఆ స్థితికి ఏకాగ్రతా పరిణామం అని పేరు.
13. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థాపరిణామా వ్యాఖ్యాతాః
మార్చు(ఏతేన భూత ఇంద్రియేషు ధర్మ లక్షణ అవస్థా పరిణామాః వ్యాఖ్యాతాః) - చిత్తము యొక్క పరిణామము వివరించినతరవాత, ఆ పరిమాణానికి ఇంద్రియముల ధర్మము (తత్వము), లక్షణములు, అవస్థలతో (పరిస్థితి) గల సంబంధాన్ని వివరిస్తున్నారు.
14. శాంతోదితావ్యపదేశ్యధర్మానుపాతీ ధర్మీ
మార్చు(శాంత ఉదిత అవ్యపదేశ్య ధర్మ అనుపాతీ ధర్మీ) - ధర్మము అంతర్లీనంగానో అవ్యక్తంగానో వ్యక్తంగానో ప్రతి జీవిలోనూ ఉండడం సర్వసాధారణం.
15. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః
మార్చు(క్రమ అన్యత్వం పరిణామ అన్యత్వే హేతుః) - పరిణామంలో తేడాలకి కారణం పరిణామ క్రమం (చిత్తము ఒక దశనుండి మరొక దశకి పరిణమించే క్రమం)
16. పరిణామత్రయసంయమాదతీతానాగతజ్ఞానమ్
మార్చు(పరిణామ త్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానమ్) - ఈ ధర్మ, లక్షణ, అవస్థలను (పరిణామత్రయం) స్వాధీనం చేసుకున్న సాధకునికి గత, భావి జన్మలగురించిన జ్ఞానం కలుగుతుంది.
17. శబ్దార్థప్రత్యాయానామితరేతరాధ్యాసాత్సంకరః
మార్చుతత్ప్రవిభాగ సంయమాత్సర్వభూత రుతజ్ఞానమ్
మార్చు(శబ్ద అర్థ ప్రత్యాయానామ్ ఇతర ఇతర అధ్యాసాత్ సంకరః తత్ ప్రవిభాగ సంయమాత్ సర్వ భూత రుత జ్ఞానమ్) - శబ్దం (పదము), అర్థం, వాటికి మూలమైన వస్తువు – సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసిపోయి అయోమయం కలిగిస్తాయి. సంయమంతో వీటిని విడదీసి స్వాధీనం చేసుకుంటే సమస్త జీవుల భాషను అర్థం చేసుకోడం సాధ్యం.
18. సంస్కారసాక్షాత్కరణాత్పూర్వజాతిజ్ఞానమ్
మార్చు(సంస్కార సాక్షాత్ కరణాత్ పూర్వ జాతి జ్ఞానమ్) - సంస్కారంమూలంగా (పైన వివరించిన మూడు స్థాయీభావాలను అర్థం చేసుకోడంవలన) పూర్వజన్మగురించిన జ్ఞానము కలుగుతుంది.
19. ప్రత్యయస్య పరచిత్తజ్ఞానమ్
మార్చు(ప్రత్యయస్య పర చిత్త జ్ఞానమ్) - ఇతరచిత్తములతో సంయమంద్వారా వారి చిత్తముయొక్క స్వభావం గ్రహించగలరు.
20. న చ తత్సాలంబనమ్ తస్యావిషయీభూతత్వాత్వ్
మార్చు(న చ తత్ సాలంబనమ్ తస్య అవిషయీ భూతత్వాత్) - అయితే ఆ జ్ఞానము కేవలము చిత్తస్వభావానికి సంబంధించినదే కానీ ఆ స్వభావానికి మూలమయిన చిత్తవృత్తులను, తెలుసుకోవడం సాధ్యం కాదు. వేరు వేరు జీవులలో చిత్తవృత్తులు వేరు వేరుగా ఉంటాయి కనక. పైగా సంయమంయొక్క ధ్యేయం అది కాదు. (గమనిక: సూత్రాల వరస 22-24 కొన్ని పుస్తకాలలో భిన్నంగా ఉంది. 22వ సూత్రం నేను అనుసరిస్తున్న పుస్తకంలో లేదుకానీ మిగతా పుస్తకాలలో ఉండడంచేత చేర్చేను). అందుచేత ఇక్కడినుండి సూత్రములసంఖ్య మారవచ్చు.)
21. కాయరూపసంయమాత్ తద్గ్రాహ్యశక్తి స్తంభే చక్షుష్ప్రకాశాసంప్రయోగేఽన్తర్ధానమ్
మార్చు(కాయ రూప సంయమాత్ తత్ గ్రాహ్య శక్తి స్తంభే చక్షుః ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానమ్) - శరీరాన్ని కేంద్రము చేసుకుని సంయమం ఆచరించడంద్వారా ఆ దేహానికీ, దానిని చూచే కళ్ళకీ మధ్య గల సంబంధం తెగిపోతుంది. తద్వారా ఆ దేహం ఇతరులకి అగోచరము అవుతుంది.
22. ఏతేన శబ్దాద్యంతర్ధానముక్తమ్.
మార్చు(ఏతేన శబ్ద ఆది అంతర్ధానమ్ ఉక్తమ్) - అదేవిధంగా శబ్దము మొదలైనవి కూడా ఎదుటివారికి అనుభవము కావు.
23. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్
మార్చుఅపరాంత జ్ఞానమరిష్టేభ్యః వా
మార్చు(సః ఉపక్రమమ్ నిరుపక్రమమ్ చ కర్మ తత్ సంయమాత్ అపరాంత జ్ఞానమ్ అరిష్టేభ్యః వా) - కర్మ ఫలితాలు రెండు విధాలు. వెంటనే కనిపించేవీ, కొంతం సమయం గడిచేక కనిపించేవి. ఈ రెండు రకాల కర్మలను సంయమంద్వారా స్వాధీనం చేసుకుంటే శకునములద్వారా మృత్యువు గురించి తెలుసుకోగలడు.
24. మైత్ర్యాదిషు బలాని.
మార్చు(మైత్రీ ఆదిషు బలాని) - అలాగే మైత్రివంటి గుణములు (మొదటి పాదం సూ. 33లో చెప్పిన కరుణ, ఆనందము, ఉపేక్ష) సంయమనంద్వారా వృద్ధి పొందుతాయి.
25. బలేషు హస్తిబలాదీని.
మార్చు(బలేషు హస్తి బల ఆదీని) - ఏనుగుగురించి సంయమం చేస్తే ఏనుగుబలం పొందుతాడు.
26. ప్రవృత్త్యాలోకన్యాసాత్సూక్ష్మవ్యవహితవిప్రకృష్టజ్ఞానమ్
మార్చు(ప్రవృత్తి ఆలోక న్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానమ్) - హృదయకమలంలో ప్రతిష్ఠమైన అంతర్జ్యోతిని సంయమం చేస్తే సూక్ష్మ విషయాలూ, కంటికి కనిపించనవీ, బహుదూరంలో ఉన్నవీఅన్నిటి గూర్చిన జ్ఞానము కలుగుతుంది.
27. భువనజ్ఞానమ్ సూర్యే సంయమాత్.
మార్చు- సూర్యునిగూర్చి సంయమువలన సూర్యమండలం గురించిన జ్ఞానము కలుగుతుంది.
28. చంద్రే తారావ్యూహజ్ఞానమ్.
మార్చు(చంద్రే తారా వ్యూహ జ్ఞానమ్) - చంద్రుని గూర్చి సంయము చేస్తే చంద్ర, నక్షత్రమండలానికి సంబంధించిన జ్ఞానము కలుగుతుంది.
29. ధృవే తద్గతజ్ఞానమ్.
మార్చు(ధృవే తత్ గత జ్ఞానమ్) - ధృవునిగూర్చి చేసిన సంయమువలన ధృవమండలంలోని గ్రహములు, తారలగురించిన జ్ఞానం కలుగుతుంది.
30. నాభిచక్రే కాయవ్యూహజ్ఞానమ్.
మార్చు(నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానమ్) - నాభితో సంయమము చేస్తే నాడీజ్ఞానము గురించిన జ్ఞానము కలుగుతుంది.
31. కంఠకూపే క్షుత్పిపాసానివృత్తిః.
మార్చు(కంఠ కూపే క్షుత్ పిపాసా నివృత్తిః) - కంఠంతో సంయమము చేస్తే ఆకలి దప్పులను అరికట్టగలడు.
32. కూర్మనాడ్యాం స్థైర్యమ్.
మార్చు(కూర్మ నాడ్యాం స్థైర్యమ్) - గొంతులో నాలుకకింద ఉండే కూర్మనాడితో సంయమము చేస్తే శరీర స్థైర్యం కలుగుతుంది.
33. మూర్ధజ్యోతిషి సిద్ధదర్శనమ్.
మార్చు(మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనమ్) - తలతో సంయమము చేస్తే సిద్ధులదర్శనము లభిస్తుంది.
34. ప్రతిభాద్వా సర్వమ్.
మార్చు(ప్రతిభాత్ వా సర్వమ్) - అసాధారణమైన మేధవలన సర్వ విషయాలనూ తెలుసుకోగలుగుతాడు.
35. హృదయే చిత్తసంవిత్.
మార్చు(హృదయే చిత్త సంవిత్) - హృదయంతో సంయమము చేస్తే మనోభావనలకి సంబంధించిన జ్ఞానము కలుగుతుంది.
36. సత్త్వపురుషయోరత్యంతాసంకీర్ణయోః ప్రత్యయ అవిశేషాత్ భోగః
మార్చుపరార్థత్వాత్ స్వార్థసంయమాత్పురుషజ్ఞానమ్
మార్చు(సత్త్వ పురుషయోః అత్యంత అసంకీర్ణయోః ప్రత్యయ అవిశేషాత్ భోగః పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానమ్) - సత్త్వం (చిత్తం), పరమపురుషుడు – ఈరెంటిమధ్య గల విశేషమైన వ్యత్యాసాన్ని గుర్తించలేడు. తద్వారా ప్రాపంచికమైన సౌఖ్యం కలుగుతుంది. ఆ వ్యత్యాసం ఉందని గ్రహించి పరమపురుషునితో సంయమం చేస్తే పరమపురుషని గురించిన జ్ఞానము కలుగుతుంది.
37. తతః ప్రాతిభశ్రావణ వేదనాఽఽదర్శాఽఽస్వాదవార్తా జాయంతే
మార్చు(తతః ప్రాతిభ శ్రావణ వేదనా ఆదర్శా ఆస్వాద వార్తా జాయంతే) - ఆ సంయమంవలన పరమ పురుషునికి సంబంధించిన శ్రవణం, దృష్టి, అవగాహన, రుచి, వాసన సాధకునికి అనుభవం అవుతాయి.
38. తే సమాధావుపసర్గా వ్యుత్థానే సిద్ధయః
మార్చు(తే సమాధౌ ఉపసర్గా వ్యుత్థానే సిద్దయః) - ఆ అనుభవ ప్రభావాలు బాహ్యప్రపంచంలో అలౌకిక శక్తులుగా సాధకుడు పొందుతాడు. అవి సమాధికి ప్రతిబంధకాలు.
39. బంధకారణశైథిల్యాత్ ప్రచారసంవేదనాచ్ఛ చిత్తస్య పరశరీరావేశః
మార్చు(బంధ కారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాత్ చ చిత్తస్య పర శరీర ఆవేశః) - బంధనాలకి కారణమైన చిత్తవృత్తులను తెంచుకుని, సమాధివైపు సాధన కొనసాగిస్తే, మరొక దేహం ప్రవేశించగల శక్తి లభిస్తుంది.
40. ఉదానజయాజ్జల పంకకంటకాదిష్వసంగ ఉత్క్క్రాంతిశ్చ
మార్చు(ఉదాన జయాత్ జల పంక కంటక ఆదిషు అసంగః ఉత్ క్రాంతిః చ) - ఉదానవాయువును స్వాధీనం చేసుకుంటే నీరు, బురద, ముండ్లపైన నడవగల సామర్థ్యము కలుగుతుంది.
41. సమానజయాజ్జ్వలనమ్.
మార్చు(సమాన జయాత్ జ్వలనమ్) - సమానవాయువును జయించినవాని శరీరం ఉజ్జ్వలంగా ప్రకాశిస్తుంది.
42. శ్రోత్రాఽకాశయోః సంబంధసంయమాద్దివ్యం శ్రోత్రమ్
మార్చు(శ్రోత్రా ఆకాశయోః సంబంధ సంయమాత్ దివ్యం శ్రోత్రమ్) - ఆకాశంతో చెవులను సంయమం చేయడంవల్ల దివ్యశ్రవణ శక్తి కలుగుతుంది.
43. కాయాఽకాశయోస్సంబంధసంయమాతే లఘుతూలసమాపత్తేశ్చ ఆకాశగమనం
మార్చు(కాయ ఆకాశయోః సంబంధ సంయమాత్ లఘు తూల సమాపత్తేః చ ఆకాశ గమనమ్) - శరీరమును ఆకాశముతో సంయమం చేయడంవల్ల శరీరము దూదివలె తేలిక అయి ఆకాశ సంచారము చేయగల శక్తి కలుగుతుంది.
44. బహిరకల్పితా వృత్తిర్మహావిదేహా తతః ప్రకాశావరణక్షయః
మార్చు(బహిః అకల్పితా వృత్తిః మహా విదేహా తతః ప్రకాశ ఆవరణ క్షయః) - ఆత్మని పరమాత్మతో సంయమం చేస్తే కలిగే స్థితికి మహావిదేహము (దేహం లేని స్థితి) అని పేరు. ఆ స్థితిలో పరమాత్మని కప్పిన చీకటి తెర తొలగిపోతుంది.
45. స్థూలస్వరూపసూక్ష్మాన్వయార్తవత్ త్వసంయమాద్భూతజయః
మార్చు(స్థూల స్వరూప సూక్ష్మాత్ అన్వయ ఆర్తవత్ త్వ సంయమాత్ భూత జయః) - స్థూలశరీరము, సూక్ష్మ శరీరము, వాటి మూలతత్వాలు, గుణాలతో సంయమం చేస్తే పంచభూతములపై విజయము సాధించగలడు.
46. తతోఽణిమాదిప్రాదుర్భావ కాయసంపత్తద్ధర్మానభిఘాతశ్చ
మార్చు(తతః అణిమ ఆది ప్రాదుర్భావ కాయ సంపత్ తత్ ధర్మ అనభిఘాతః చ) - తద్వారా అణిమాది సిద్ధులు, శరీరసంపద (రూపం, సౌష్ఠవం) పొందగలడు. శరీరానికి సంబంధించిన అవధులను అధిగమించగలడు.
47. రూపలావణ్యబలవజ్రసంహననత్వాని కాసంపత్
మార్చు(రూప లావణ్య బల వజ్ర సంహననత్వాని కాయసంపత్) - దేహానికి రూప, లావణ్యాలు, వజ్రఘాతాన్ని తట్టుకోగల బలము కలుగుతాయి.
48. గ్రహణస్వరూపాస్మితాన్వయార్థవత్త్వసంయమాదింద్రియజయః
మార్చు(గ్రహణ స్వరూప అస్మిత అన్వయ అర్థవత్వ సంయమాత్ ఇంద్రియ జయః) - గ్రహణేంద్రియాలను, గ్రహించగలశక్తినీ, వాటి మూలస్థానాలతోనూ, అస్మితతోనూ సంయమం చేస్తే ఇంద్రియాలను జయించగలడు.
49. తతో మనోజవిత్వం వికరణభావః ప్రధానజయశ్చ
మార్చు(తతః మనః జవిత్వమ్ వికరణాభావః ప్రధాన జయః చ) - అప్పుడు స్థూలశరీరంనుండి విడివడగలడు. సాధకుడికి మనోదారుఢ్యం కలుగుతుంది.
50. సత్త్వపురుషాన్యతాఖ్యాతిమాత్రస్య సర్వభావాధిష్ఠాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ
మార్చు(సత్త్వ పురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య సర్వ భావ అధిష్ఠాతృత్వం సర్వ జ్ఞాతృత్వం చ) - సత్త్వము (చిత్తము) పరమపురుషుడు – ఈ రెంటిమధ్య గల విబేధంతో సంయమము చేసి పొందిన జ్ఞానమువలన అన్నివిధాల శక్తిమంతుడు, సర్వమూ తెలిసినవాడూ కాగలడు.
51. తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యమ్
మార్చు(తత్ వైరాగ్యాత్ అపి దోష బీజ క్షయే కైవల్యమ్) - ఆ వైరాగ్యమువలన చివరలో మిగిలిన బీజము (తాను జ్ఞానిని అన్న భావం) కూడా నశించి కైవల్యం సిద్ధిస్తుంది.
52. స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్టప్రసంగాత్
మార్చు(స్థాని ఉపనిమంత్రణే సంగ స్మయ అకరణమ్ పునః అనిష్ట ప్రసంగాత్) - ఆవిధంగా భగవంతుని సమాదరణ సాధించినప్పుడు మమకార, అహంకారాలకు లోను కారాదు. అలా చేసినట్లయితే, మళ్లీ అవాంఛనీయ విషయాలు తలెత్తుతాయి.
53. క్షణతత్క్రమయోః సంయమాద్వివేకజం జ్ఞానమ్
మార్చు(క్షణ తత్ క్రమయోః సంయమాత్ వివేకజం జ్ఞానమ్) - ఆ జ్ఞానము (అంటే భగవంతుని సమాదరణ లభించిందన్న జ్ఞానము) అది పొందడానికి కారణమైన వరుస క్రమం - వీటితో సంయమం చేయడంతో ఆ బీజము కూడా నశించి సంపూర్ణ సమాధి లభిస్తుంది.
54. జాతిలక్షణదేశైరన్యతానవచ్ఛేదాత్తుల్యయోస్తతః ప్రతిపత్తిః
మార్చు(జాతి లక్షణ దేశైః అన్యత అనవచ్ఛేదాత్ తుల్యయోః తతః ప్రతిపత్తిః) - సాధారణదృష్టికి సమంగా కనిపించే వస్తువులలో వస్తువుయొక్క జాతి, లక్షణాలు, అవి ఉన్న స్థానాలనుబట్టి తేడా ఉంటుంది. సాధకుడికి ఈ సంయమంవలన ఆ తేడా గుర్తించగల వివేకం కలుగుతుంది.
55. తారకమ్ సర్వవిషయం సర్వథా విషయమక్రమమ్ చేతి వివేకజం జ్ఞానమ్.
మార్చు(తారకమ్ సర్వ విషయం సర్వథా విషయమ్ అక్రమమ్ చ ఇతి వివేకజం జ్ఞానమ్) - సర్వ విషయాలనూ – స్థల, కాల, సమయాలతో సంబంధం లేకుండా – అవగాహన చేసుకోగల వివేకంతో పొందిన జ్ఞానమే పరమోత్కృష్టమైన జ్ఞానము.
56.సత్వపురుషయోశ్శుధ్ధి సామ్యే కైవల్యం.
మార్చుచిత్తము యొక్క బుద్దికి, ఆత్మకు రెండిటికి నిర్మలత్వము ఒకే కాలములో ప్రాప్తిన్చడమే కైవల్యము
←సాధన పాదము | పతంజలి యోగ సూత్రములు (విభూతి పాదము) | కైవల్య పాదము→ |
జ్ఞానము. : |
{{header2
| title = పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము | author = | section = | translation = [[కైవల్య పాదము ]