విద్యుచ్ఛక్తి చట్టము, 2003

रजिस्ट्री सं.डी-२२१
Registered No. D-221
రిజిస్ట్రీ సంఖ్య. డి-221

मूल्य रू. २७.००
Price Rs. 27.00
మూల్యము:రూ 27.00

भारत का राजपत् The Gazette of India

భారత రాజపత్రము
असाधारण
EXTRAORDINARY
भाग XVI अनुभाग 1
Part XVI Section 1
భాగము XVI అనుభాగము 1
प्राधिकार से प्रकाशित
PUBLISHED BY AUTHORITY
ప్రాధికారము ద్వారా ప్రచురింపబడినది


सं १
No.1
సంఖ్య1
नई दिल्ली
New Delhi
న్యూ ఢిల్లీ
बुधवार

Wednesday
బుధవారము

१. फिब्रवरि, २०१७/१२
1 February, 2017/12

1 ఫిభ్రవరి, 2017/12

माघ

Magh
మాఘ

खंण्ड २४

Vol. 24
సంపుటము 24


MINISTRY OF LAW AND JUSTICE
(LEGISLATIVE DEPARTMENT)
New Delhi, 4th January, 2017/Paush, 1938 Magh.
The Translation in Telugu of the following Acts namely:-

(1) The Electricity.Act, 2003 [Act No.36 of 2003], (2) The Limited Liability Partnership Act, 2008 [Act No.6 of 2009] are hereby published under the authority of the President and shall be deemed to be the Authoritative Text thereof in Telugu under Clause (a).of Section 2 of the Authoritative Text (Central Laws) Act, 1973 (Act 50 of 1973).

శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వ శాఖ

(శాసన నిర్మాణ విభాగము)

ఈ క్రింది చట్టములు, అనగా,

(1) విద్యుచ్ఛక్తి చట్టము, 2003 (2003లోని 36వ చట్టము), (2) పరిమిత ధాయిత్వ భాగస్వామ్య చట్టము, 2008 (2009 లోని 6వ చట్టము) యొక్క తెలుగు అనువాదమును రాష్ట్రపతి ప్రాధికారము క్రింద ఇందుమూలముగా ప్రచురించడమైనది. ఆ చట్టములకు గల ఈ అనువాదమును ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 (1973లోని 50వ చట్టము) యొక్క 2వ పరిచ్ఛేదములోని ఖండము (ఎ) క్రింద, ప్రాధికృత తెలుగు పాఠములైనట్లు భావించవలెను.

విద్యుచ్ఛక్తి చట్టం - 2003

(2008లోని 36వ చట్టము )

[26 మే, 2003]

విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము, పంపిణీ, వ్యాపారం మరియు వినియోగము లకు సంబంధించిన శాసనములను ఏకీకరించుటకు మరియు సాధారణముగా విద్యుచ్ఛక్తి పరిశ్రమను అభివృద్ధిపరచుటకు దోహదపడు చర్యలు చేపట్టుట, దానికి పరిశ్రమలో పోటీని ప్రోత్సహించుటకు, వినియోగదారుల హితములను పరిరక్షించుటకు, విద్యుచ్ఛక్తిని అన్ని ప్రాంతములకు సరఫరా చేయుటకు, విద్యుచ్ఛక్తి టారిఫును హేతుబద్ధీకరించుటకు సబ్సిడీలకు సంబంధించి పారదర్శక విధానాలను నిశ్చయించుటకు, సమర్థవంతమైన మరియు పర్యావరణానుకూల విధానాలను అనుసరించుటకు, కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థను, క్రమబద్ధీకరణ కమీషన్లను ఏర్పాటు చేయుటకు, అపీలు ట్రిబ్యునలు స్థాపించుటకు మరియు వాటికి సంబంధించిన లేక ఆనుషంగికమైన విషయములను నిబంధించుట కొరకైన చట్టము.

భారత గణరాజ్యము యొక్క ఏబది నాలుగవ సంవత్సరములో పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయబడినది.

భాగము -1

ప్రారంభిక

సంగ్రహనామము, విస్తరణ మరియు ప్రారంభము. 

1 (1) ఈ చట్టమును విద్యుచ్ఛక్తి చట్టము, 2003 అని పేర్కొనవచ్చును.

(2) ఇది జమ్ము మరియు కాశ్మీరు రాజ్యము మినహా, భారత దేశమంతటికి విస్తరించును.

(3) ఇది, కేంద్రప్రభుత్వము అధినూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన 10.6.2003, 121వ పరిచ్చేదము మినహా ఎస్.ఓ.నెం.669(ఈ), తేదీ 10.6.2003 ద్వారా అమలులోనికి వచ్చును.

అయితే, ఈ చట్టపు వేర్వేరు నిబంధనల కొరకు వేర్వేరు తేదీలను నియతము చేయవచ్చును మరియు ఈ చట్టము ప్రారంభమును గూర్చి అట్టి ఏదేని నిబంధనలో చేసిన నిర్దేశమును, ఆ నిబంధన అమలులోనికి వచ్చుటకు చేసిన నిర్దేశముగా అన్వయించవలెను.

నిర్వచనములు. 

2. ఈ చట్టములో, సందర్భము వేరు విధముగా ఉన్ననే తప్పు.-

(1) "అపీలు ట్రిబ్యునలు " అనగా 110వ పరిచ్ఛేదము క్రింద స్థాపించబడిన విద్యుచ్ఛక్తి అపీలు ట్రిబ్యునలు అని అర్థము:

(2) "నియత తేదీ " అనగా కేంద్ర ప్రభుత్వము అధిసూచన ద్వారా నియతము చేసిన తేదీ అని అర్థము;

(3) "సరఫరా ప్రాంతము" అనగా ఏప్రాంతములో విద్యుత్ పంపిణీ లైసెన్సుదారు, తనకీయబడిన విద్యుచ్ఛక్తి సరఫరా లైసెన్సు ద్వారా పంపిణీకి ప్రాధికారము వుండునో ఆ ప్రాంతము అని అర్థము;

(4) “సముచిత కమీషను " అనగా 76వ పరిచ్చేదపు ఉప పరిచ్ఛేదము (1)లో పేర్కొనిన కేంద్ర క్రమబద్ధీకరణ కమీషను లేక 82వ పరిచ్ఛేదములో పేర్కొనిన రాజ్య క్రమబద్ధీకరణ కమీషను లేక సందర్భానుసారముగా 83వ పరిచ్ఛేదములో పేర్కొనిన సంయుక్త కమీషను అని అర్థము;

(5) "సముచిత ప్రభుత్వము " అనగా -

(ఎ)(i) పూర్ణతః లేక భాగతః స్వామిత్వము కలిగియున్న ఉత్పాదక కంపెనీ విషయంలో;

(ii) అంతర్ రాజ్య విద్యుత్ ఉత్పాదన, ప్రసారము. వ్యాపారం, లేక సరఫరా విషయములో మరియు ఎవేని గనులు, చమురు క్షేత్రాలు, రైల్వేలు, జాతీయ రహదారులు, విమానాశ్రయములు, తంతితపాలా. ప్రసారం కేంద్రాలు మరియు ఏనేని రక్షణ పనులు, నౌకా నిర్మాణ కేంద్రము, అణువిద్యుత్ ప్రతిష్టాపనల విషయంలో;

(iii) జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రం మరియు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము విషయంలో;

(iv) దానికి చెందిన లేక దాని నియంత్రణ క్రింద ఏవేని పనులు లేక విద్యుత్ ప్రతిష్టాపనల విషయంలో;

కేంద్ర ప్రభుత్వము అనియూ;


(బి) ఇతర సందర్భములో, ఈ చట్టము క్రింద అధికారిత కలిగిన రాజ్య ప్రభుత్వము, అనియూ అర్థము.

(6) "ప్రాధికార సంస్థ" అనగా 70వ పరిచ్చేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1)లో పేర్కొనిన కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ అని అర్థము;

1948 లో 54వది 

(7) “బోర్డు", అనగా ఈ చట్టము ప్రారంభమునకు ముందు విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948 యొక్క 5వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద ఏర్పాటు చేయబడిన రాజ్య విద్యుచ్ఛక్తి బోర్డు అని అర్థము;

(8). " క్యాప్టివ్ ఉత్పాదన ప్లాంటు అనగా , ప్రాథమికముగా తమ స్వంత వినియోగము కొరకు విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయుటకు ఎవ్వరేని వ్యక్తి నెలకొల్పిన విద్యుత్ ఉత్పాదన ప్లాంటు అని అర్థము మరియు ఈ పదబంధ పరిధిలో ఏదేని సహకార సంఘము

లేక వ్యక్తుల అసోసియేషను ద్వారా ప్రాధమికముగా అట్టి సహకార సంఘము లేక అసోసియేషను సభ్యుల వినియోగము కొరకు విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేయుట కొరకు నెలకొల్పిన విద్యుత్ ప్లాంటు కూడ చేరియుండును.

(9) "కేంద్ర కమీషను" అనగా 76వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (1)లో నిర్దేశించిన కేంద్ర విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను అని అర్థము;

(10) " కేంద్ర విద్యుత్ ప్రసార వినియోగము" అనగా 38వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదములు క్రింద కేంద్ర ప్రభుత్వముచే అధి సూచించబడినట్టి ఏదేని ప్రభుత్వ కంపెనీ అని అర్థము;

(11) "చైర్ పర్సన్" అనగా ప్రాధికార సంస్థ లేక సముచిత కమీషను లేక సందర్భానుసారముగ అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ అని అర్థము;

(12) “సహ - ఉత్పాదన" అనగా రెండు లేక అంత కెక్కువ రూపములలో (విద్యుచ్ఛక్తితో సహా) ఉపయోగకరమైన శక్తిని ఏకకాలంలో ఉత్పత్తి చేయు ప్రక్రియ అని అర్థము;

1956లోని 1వది  13) కంపెనీ” అనగా కంపెనీల చట్టము, 1956 క్రింద ఏర్పడి, రిజిస్టరు చేయబడిన కంపెనీ అని అర్థము మరియు ఈ పదపరిధిలో కేంద్ర, రాజ్య లేక ప్రాంతీయ చట్టము క్రింది, ఏదేని నిగమ నికాయము చేరి యుండును.

(14) "సంరక్షణ" అనగా విద్యుత్ సరఫరా మరియు వినియోగములలో సమర్థవంతమైన పనితీరు ద్వారా విద్యుత్ వినియోగములోని ఏదేని తగ్గింపు అని అర్థము;

(15) "వినియోగదారుడు" అనగా ఈ చట్టము లేక తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము క్రింద ప్రజలకు విద్యుచ్ఛక్తి సరఫరాచేయు వ్యాపారములో నిమగ్నమైన లైసెన్సుదారు లేక ప్రభుత్వము లేక ఎవరేని ఇతర వ్యక్తిచే తన వినియోగము కొరకై విద్యుచ్ఛక్తి ఎవరికి సరఫరా చేయబడినదో ఆ వ్యక్తి అని అర్ధము. మరియు ఈ పద పరిధిలో విద్యుచ్ఛక్తిని పొందు నిమిత్తము లైసెన్సుదారు. ప్రభుత్వము లేక సందర్భాను సారముగ అట్టి ఇతర వ్యక్తి చేపట్టిన పనుల వలన తత్సమయమున ఎవరి ప్రాంగణము లకు మన విద్యుత్ కనెక్షను ఈయబడిందో ఆ వ్యక్తి చేరియుండును. (16) “వినియోగించిన ప్రసారలైన్లు" అనగా 9వ పరిచ్చేదములో నిర్దేశించిన క్యాప్టివ్ విద్యుత్ ఉత్పాదన ప్లాంటు లేక 10వ పరిచ్చేదములో నిర్దేశించిన ఉత్పాదన స్టేషను యొక్క విద్యుత్ లైన్లు లేక విద్యుత్ ప్లాంట్లను ఏవేని ప్రసార లైన్లు లేక సబ్ స్టేషన్లు, లేక ఉత్పాదన స్టేషన్లు లేక సందర్భానుసారముగ లోడ్ సెంటర్ కు జోడించు నిమిత్తము ఒక పాయింటు నుండి మరియొక పాయింటుకు ప్రసారం చేయుటకు అవసరమైన ఏదేని విద్యుత్ సరఫరా లైను అని అర్థము;

(17) “పంపిణీ లైసెన్సుదారు" అనగా తన సరఫరా ప్రాంతములో వినియోగదారులకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయుటకు పంపిణీ వ్యవస్థను నడుపు మరియు నిర్వహించుట కొరకు ప్రాధికారమీయబడిన లైసెన్సుదారు అని అర్థము;

(18) "పంపిణీ మెయిన్" అనగా ఒక సర్వీసు లైనుతో వెంటనే జోడించుటకు లేక జోడించుటకు ఉద్దేశించిన ఏదేని మెయిన్ యొక్క భాగము అని అర్థము;

(19) "పంపిణీ వ్యవస్థ" అనగా ప్రసార లైన్లపై లేక ఉత్పాదన స్టేషను కనెక్షను మరియు వినియోగదారుల ప్రతిష్టాపనల కనెక్షను పాయింటుకు అందించు పాయింట్ల మధ్య తీగలు మరియు అనుబంధ సౌకర్యముల వ్యవస్థ అని అర్ధము;

(20) "విద్యుత్ లైను" అనగా ఏదేని ప్రయోజనము కొరకు విద్యుచ్ఛక్తి సరఫరాకు వినియోగించిన ఏదేని లైను అని అర్థము మరియు ఈ పదబంధ పరిధిలో,-

(ఎ) ఏదేని అట్టి లైనుకు ఇచ్చిన ఏదేని ఆధారము అనగా ఏదేని కట్టడము, టవరు, స్తంభము, లేక ఇతర వస్తువు లోపల, పైన, ద్వారా లేక నుండి అట్టి ఏదేని లైనుకు ఆధారమిచ్చిన, తీసుకొనిపోయిన లేక నిలిపివేయబడినది; మరియు

(బి) విద్యుత్ సరఫరా నిమిత్తము అట్టి ఏదేని లైనుకు జోడించిన ఏవేని ఉపకరణములు చేరియుండును;

(21) “విద్యుత్ ఇన్‌స్పెక్టర్" అనగా 162వ పరిచ్ఛేదపు, ఉప-పరిచ్చేదము (1) క్రింద సముచిత ప్రభుత్వముచే అట్లు నియమించబడిన వ్యక్తి అని అర్థము మరియు ఇందులో ముఖ్య విద్యుత్ ఇన్‌స్పెక్టరు కూడా చేరియుండును;

(22) "విద్యుత్ ప్లాంటు" అనగా విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారం, పంపిణీ లేక సరఫరా కొరకు వినియోగించిన లేక వాటితో జోడించిన ఏదేని ప్లాంటు, పరికరము, ఉపకరణము లేక పనిముట్టు లేక దాని ఏదేని భాగము అని అర్థము, అయితే ఇందులో________________

(ఎ) విద్యుత్ లైను: లేక

(బి) ఏదేని ఆవరణకు సరఫరా చేసిన విద్యుచ్ఛక్తి పరిమాణమును తెలుసుకొనుటకు వినియోగించిన .మీటరు; లేక

(సి) వినియోగదారుని నియంత్రణ క్రింద ఉన్నట్టి విద్యుత్ పరికరము, ఉపకరణము, లేక పనిముట్టు

చేరియుండును.

(23) "విద్యుచ్ఛక్తి అనగా

(ఎ) ఏదేని ప్రయోజనము కొరకు ఉత్పాదన చేయబడిన, ప్రసారం చేయబడిన, సరఫరా చేయబడిన లేక వర్తకం చేయబడిన; లేక

(బి) వార్తాప్రసారం చేయుటకు తప్ప ఏదేని ప్రయోజనము కొరకు వినియోగించిన విద్యుచ్ఛక్తి అని అర్థము;

(24) “విద్యుచ్ఛక్తి సరఫరా కోడ్" అనగా 50వ పరిచ్చేదము క్రింద నిర్దిష్ట పరచిన విద్యుచ్ఛక్తి సరఫరా కోడ్ అని అర్థము;

(25) విద్యుత్ వ్యవస్థ " అనగా ఒకటి లేక అంతకంటే ఎక్కువ.

(ఎ) విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు; లేక

(బి) ప్రసార లైన్లు; లేక

(సి) విద్యుత్ లైన్లు మరియు సబ్ స్టేషన్లు

కలిగియున్న విద్యుత్ ఉత్పాదక కంపెనీ లేక సందర్భానుసారము లైసెన్సుదారు నియంత్రణ క్రింద ఉన్న వ్యవస్థ అని అర్థము; మరియు రాజ్యము లేక, కేంద్రమునకు సంబంధించి వాడబడిన పుడు వాటి రాజ్య క్షేత్రముల లోపలి సమగ్ర విద్యుత్ వ్యవస్థ అని అర్ధము;

(26) "విద్యుచ్ఛక్తి వర్తకుడు " అనగా 12వ పరిచ్ఛేదము క్రింద విద్యుత్ వర్తకమును చేపట్టుటకు మంజూరు చేయబడిన లైసెన్సు గల వ్యక్తి అని అర్థము;

(27) “ఫ్రాంచైజీ" అనగా తమ సరఫరా ప్రాంతములోని ఒక ప్రత్యేక ప్రాంతములో పంపిణీ లైసెన్సుదారు తరఫున విద్యుచ్ఛక్తిని సరఫరా చేయుటకు పంపిణీ లైసెన్సుదారుచే ప్రాధికార మీయబడిన వ్యక్తి అని అర్థము:

(28) “ఉత్పాదన కంపెనీ” అనగా విద్యుత్ ఉత్పాదన కేంద్రమును స్వంతముగా కలిగిన లేక నడుపు లేక నిర్వహించు, నిగమితమొనర్చబడినదైనను లేదా కాకున్నను ఏదేని కం పెనీ లేక నిగమనికాయము లేక అసోసియేషను లేక వైయక్తిక నికాయము లేక కల్పిత న్యాయిక వ్యక్తి అని అర్థము; ________________ (29) “ఉత్పాదన" అనగా ఏదేని ఆవరణలకు సరఫరా చేయుట కొరకు లేక అట్లు సరఫరా చేయుటకు వీలుగా ఉన్న ఉత్పాదన స్టేషను నుండి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయుట అని అర్ధము;

(30) "ఉత్పాదన 'స్టేషను" లేక " స్టేషను" అనగా, ఏదేని భవనము మరియు " , స్టెప్-అప్ - ట్రాన్సఫార్మరు, స్విచ్ గేర్, స్విచ్ యార్డ్, కేబుళ్లు లేక అందునిమిత్తము వినియోగించిన ఇతర అనుబంధ సాధన సామాగ్రి, ఏదేని ఉన్నచో, వాటితో కూడిన మరియు అది ఉన్నట్టి స్థలముతో కూడిన ప్లాంటుతో సహా విద్యుత్ ఉత్పాదన కొరకైన ఏదేని స్టేషను అని అర్థము. ఉత్పాదన స్టేషనులో పనిచేయుచున్న సిబ్బంది నివాసము కొరకు వినియోగించిన ఏదేని భవనముతో సహా విద్యుచ్ఛక్తి ఉత్పాదన స్టేషను అని అర్థము మరియు జలశక్తి ద్వారా విద్యుచ్ఛక్తి ఉత్పాదన చేసిన యెడల, ఇందులో పెన్ స్టాక్స, హెడ్ అండ్ టేల్ పనులు, మెయిన్ మరియు రెగ్యులేటింగ్ జలాశయములు, ఆనకట్టలు మరియు ఇతర హైడ్రాలిక్, పనులు చేరిఉండును. అయితే ఇందులో ఎట్టి సందర్భములోను, విద్యుత్ సబ్ స్టేషను చేరి ఉండదు;

(31) "ప్రభుత్వ కంపెనీ” అను పదబంధము కంపెనీల చట్టము, 1956లోని 617వ పరిచ్ఛేదములో దానికి ఈయబడిన అర్థము నే కలిగి యుండును;

(32) "గ్రిడ్' అనగా అంతర్గతంగా జోడించిన ప్రసార లైన్లు, సబ్-స్టేషను మరియు ఉత్పాదన ప్లాంట్ల ప్రధాన హైవోల్టేజీ ఆధార వ్యవస్థ అని అర్థము;

(33) "గ్రిడ్ కోడ్" అనగా 79వ పరిచ్ఛేదములోని ఉప పరిచ్చేదము (1) యొక్క ఖండము (హెచ్ క్రింద కేంద్ర కమీషనుచే నిర్దిష్ట పరచబడిన గ్రిడ్ కోడ్ అని అర్థము;

(34) "గ్రిడ్ ప్రమాణములు" అనగా ప్రాధికార సంస్థ చే 73వ పరిచ్చేదము యొక్క ఈ ఖండము (డి) క్రింద నిర్దిష్టపరచబడిన గ్రిడ్ ప్రమాణములు అని అర్థము:

(35) "హైవోల్టేజి లైను" అనగా ప్రాధికార సంస్థ చే ఆయా సమయము లందు నిర్దిష్ట పరచబడునట్టి విద్యుత్ లైను లేక నామ మాత్రపు వోల్టేజి గల కేబులు అని అర్థము

(36) "అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థ " అను పదబంధ పరిధిలో,

(i) ఒక రాజ్య క్షేత్రము నుండి మరియొక రాజ్య క్షేత్రమునకు ప్రధాన ప్రసార లైను ద్వారా విద్యుచ్ఛక్తి సరఫరా కొరకైన ఏదేని వ్యవస్థ;

(ii) మధ్యలోనున్న రాజ్య క్షేత్రములో ఒకప్రక్క నుండి మరియొక ప్రక్కకు దానితో పాటు రాజ్యము లోపల విద్యుచ్ఛక్తి సరఫరా కోరకు అంతర్ రాజ్య విద్యుచ్ఛక్తి ప్రసారమునకు ఆనుషంగికమైన ఏడేని వ్యవస్థ; ________________

(iii). కేంద్ర ప్రసార వినియోగముచే నిర్మించబడి, స్వామిత్వము కలిగియుండి, నడుపబడు, నిర్వహించబడు. లేక నియంత్రించబడు వ్యవస్థ ద్వారా రాజ్య క్షేత్రములో చేయబడు విద్యుచ్ఛక్తి ప్రసారం

చేరియుండును.

(37) “రాజ్యాంతర్గత ప్రసార వ్యవస్థ” అనగా అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థ కానట్టి విద్యుచ్ఛక్తి ప్రసారము కొరకైన ఏదేని వ్యవస్థ అని అర్థము:

(38) “లైసెన్సు" అనగా 14వ పరిచ్చేదము క్రింద మంజూరు చేయబడిన లైసెన్సు అని అర్థము;

(39). "లైసెన్సుదారు" అనగా 14వ పరిచ్చేదము క్రింద లైసెన్సు మంజూరు చేయబడిన వ్యక్తి అని అర్థము;

(40) "లైను” అనగా విద్యుచ్ఛక్తి సరఫరాను వినియోగించుట కొరకు రూపొందించిన లేక వాడబడిన (కేసింగు లేక కోటింగుతో కూడిన) ఏదేని వైరు, కేబులు, ట్యూబ్, పైపు, ఇన్సులేటర్, కండక్టర్ లేక అదే విధముగానున్న ఇతర వస్తువు అని అర్థము మరియు ఈ పదపరిధిలో ఏదేని లైనుకు చుట్టుకొనినున్న లేక ఆధారమిచ్చు లేక చుట్టుకొని యుండి లేక ఆధారమీయబడినట్టి ఏదేని లైను లేక అట్టి ఏదేని లైనుతో కూడివుండి, ఆ లైనుకు అతి సమీపములో నెలకొల్పబడిన లేక ఆధారమీయబడిన లేక , తీసుకొనిపోయిన లేక ఈ నిలిపివేయబడిన ఏదేని లైను చేరి యుండును;

(41) "స్థానిక ప్రాధికార సంస్థ” అనగా ఏదేని నగర పంచాయితీ, పురపాలిక కౌన్సిలు, పురపాలక కార్పొరేషను, గ్రామస్థాయి, మధ్యస్థ స్థాయి మరియు జిల్లా స్థాయిలలో " ఏర్పాటు చేయబడిన పంచాయితీ, ఓడ రేవు కమీషనర్ల నికాయము లేక న్యాయికముగా హక్కు కలిగిన లేక కేంద్రము లేక ఏదేని రాజ్య ప్రభుత్వముచే ఏదేని ప్రాంతము లేక స్థానిక నిధి యొక్క నియంత్రణ లేక నిర్వహణ అప్పగించబడిన ఇతర ప్రాధికార సంస్థ అని అర్థము;

(42) “మెయిన్" అనగా విద్యుత్ సరఫరా చేయబడిన లేక విద్యుత్ సరఫరాకు ఉద్దేశించ బడిన ఏదేని విద్యుత్ సరఫరా లైను అని అర్థము: -

(43) “సభ్యుడు" అనగా సముచిత కమీషను లేక ప్రాధికార సంస్థ లేక సంయుక్త కమీషను, లేక సందర్భానుసారముగ అప్పిలేటు ట్రిబ్యునలు అని అర్థము మరియు ఈ పదపరిధిలో అట్టి కమీషను లేక ప్రాధికార సంస్థ లేక అప్పిలేటు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ చేరియుండును.

G8... (44) “జాతీయ విద్యుచ్ఛక్తి ప్రణాళిక" అనగా 3వ పరిచ్ఛేదపు ఉప- పరిచ్ఛేదము (4) క్రింద అధి సూచించబడిన జాతీయ విద్యుచ్చకి ప్రణాళిక అని అరము:

(45) "జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము" - అనగా 26వ పరిచ్చేడపు ఉప పరిచ్ఛేదము (1), క్రింద స్థాపించిన కేంద్రము అని అర్థము;

(46) "అదిసూచన". అనగా అధికారిక గెజెటులో ప్రచురించిన అధి సూచన అని అర్థము మరియు "అధి సూచించు" అను పదమును తదనుసారముగ అన్వయించు కొనవలెను;

(47) "ప్రవేశ సౌలభ్యము " అనగా సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచబడిన వినియమములననుసరించి ఉత్పాదనలో నిమగ్న మైన - ఎవరేని లైసెన్సుదారు లేక వినియోగదారుడు లేక వ్యక్తిచే అట్టి లైన్లు లేక వ్యవస్థతో కూడిన ప్రసార లైన్లు లేక పంపిణీ వ్యవస్థ లేక అనుబంధ సౌకర్యములను వినియోగించుట కొరకైన విచక్షణారహితమైన ఏర్పాటు అని అర్థము;

(48) “ఉపరితల మార్గము" అనగా భూమి పైన మరియు ఆరుబయలులో ఉంచబడిన విద్యుత్ లైను అని అర్థము: అయితే ఇందులో ట్రాక్షన్ వ్యవస్థ విద్యుత్ ప్రసారమవుతున్న కమ్మీలు చేరియుండవు.

(49) "వ్యక్తి" అను పదపరిధిలో నిగమిత మొనర్చబడినదైనను లేక కాకున్నను. ఏదేని కంపెనీ లేక నిగమనికాయము లేక అసోసియేషను లేక వైయక్తిక నికాయము లేక కల్పిత న్యాయిక వ్యక్తి అని అర్థము.

(50) "విద్యుత్ వ్యవస్థ " అనగా విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము, పంపిణీ మరియు సరఫరా యొక్క అన్ని అంశాలు అని అర్థము మరియు ఇందులో ఈ క్రిందివి అనగా

(ఎ) ఉత్పాదన స్టేషన్లు,
(బి) ప్రసార లేక ప్రధాన ప్రసార లైన్లు;
(సి) సబ్-స్టేషన్లు
(డి) , టై-లైన్లు;
(ఇ) లోడ్ డిస్ప్యా చ్ కార్యకలాపాలు;
(ఎఫ్) మెయిన్లు లేక పంపిణీ మేయిన్లు;
(జి) విద్యుత్ సరఫరా లైన్లు:
(హెచ్) ఉపరితల మార్గములు: ________________
(ఐ) సర్వీసు లైన్లు
(జె) పనులు

లలో ఒకటి లేక అంతకంటే ఎక్కువ అంశాలు చేరుతాయి.

(51) "ఆవరణలు” అను పదపరిధిలో ఏదేని భూమి, భవనము, లేక కట్టడము చేరియుండును;

(52) "విహితపరచిన" అనగా ఈ చట్టము క్రింద సముచిత ప్రభుత్వముచే చేయబడిన నియమముల ద్వారా విహితపరచిన అని అర్థము:

(53) "సార్వజనిక దీపం" అనగా ఏదేని వీధిలో వెలుతురు కొరకు వాడబడు విద్యుత్ దీపం అని అర్థము;

(54) “రియల్ టైమ్ ఆపరేషన్" అనగా " ఈయబడిన (నిర్దిష్ట) సమయానికి విద్యుచ్ఛక్తి వ్యవస్థ గురించిన సమాచారమును సంబంధిత లోడ్ డిస్పాచ్ కేంద్రమునకు లభ్యపరచుట కై తీసుకొనబడు చర్య అని అర్థము:

(55) “ప్రాంతీయ విద్యుత్ కమిటీ" అనగా కేంద్ర ప్రభుత్వ తీర్మానము ద్వారా ఒక నిర్దిష్ట ప్రాంతమునకు ఆ ప్రాంతములో విద్యుత్ వ్యవస్థల సమీకృత క్రియాకలాపాలకు వీలు కల్పించుట కొరకు స్థాపించబడిన కమిటీ అని అర్ధము:

(56) "ప్రాంతీయ లోడ్ డిస్ప్యా చ్ కేంద్రము" అనగా 27వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద స్థాపించబడిన కేంద్రము అని అర్థము:

(57) “వినియమములు " అనగా ఈ చట్టము క్రింద చేసిన వినియమములు అర్థము:

(58) “రద్దు చేసిన శాసనములు" అనగా 185వ పరిచ్చేదము ద్వారా రద్దు చేయబడిన భారత విద్యుచ్ఛక్తి చట్టము, 1910, విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948 మరియు విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 అని అర్థము;

(59) “నియమములు" అనగా ఈ చట్టము క్రింద చేసిన నియమములు అని అర్థము;

(60) "అనుసూచి" అనగా ఈ చట్టమునకు ఉన్న అనుసూచి అని అర్ధము; ________________

10/G10 (61). "సర్వీసు లైను" అనగా

(ఎ) పంపిణీ మెయిన్ నుండి గాని లేక వెంటనే పంపిణీ లైసెన్సుదారుని ఆవరణల నుండిగాని, ఒకే వినియోగదారునికి; లేక

(బి) అవే ఆవరణలకు పంపిణీ మేయిన్ నుండి వినియోగదారుల సముదాయమునకు లేక పంపిణీ మేయిన్ యొక్క అదే పాయింటు నుండి సరఫరా చేసిన ఆనుకొని ఉన్న ఆవరణములకు,

ఏ విద్యుత్ సరఫరా లైను ద్వారా విద్యుచ్చక్తి సరఫరా చేయబడినదో లేక చేయుటకు ఉద్దేశించబడినదో ఆ విద్యుత్ సరఫరా లైను అని అర్ధము;

(62) "నిర్దిష్ట పరచిన" అనగా ఈ చట్టము క్రింద సముచిత కమీషను లేక సందర్భానుసారముగ ప్రాధికార సంస్థచే చేయబడిన వినియమముల ద్వారా నిర్దిష్ట పరచిన అని అర్థము.

(63) " స్టాండ్ ఎలోన్ వ్యవస్థ" అనగా నిర్దిష్ట పరచబడిన ప్రాంతములో గ్రిడ్ ను జోడించకుండ విద్యుచ్ఛక్తి ఉత్పాదన మరియు పంపిణీ చేయుటకు నెలకొల్పబడిన విద్యుచ్ఛక్తి వ్యవస్థ అని అర్థము;

(64) “రాజ్యకమీషను" అనగా 82వ పరిచ్చేదము యొక్క ఉప పరిచ్చేదము (1) క్రింద ఏర్పాటు చేయబడిన రాజ్య విద్యుచ్ఛక్తి క్రమబద్దీకరణ కమీషను మరియు ఈ పదబంధ పరిధిలో 83వ పరిచ్చేదము యొక్క ఉప-పరిచ్చేదము(1) క్రింద ఏర్పాటు చేయబడిన సంయుక్త కమీషను చేరియుండును;

(65) “రాజ్య గ్రిడ్ కోడ్" అనగా 86వ పరిచ్చేదములోని ఉప-పరిచ్చేదము (1) యొక్క ఖండము (హెచ్) క్రింద నిర్దిష్ట పరచిన రాజ్య గ్రిడ్ కోడ్ అని అర్ధము;

(66) “రాజ్య లోడ్ డిప్ప్యా చ్ కేంద్రము" అనగా 31వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (1) క్రింద స్థాపించిన కేంద్రము అని అర్ధము;

(67) “రాజ్య ప్రసార సంస్థ " అనగా 39వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య ప్రభుత్వముచే అట్లు నిర్దిష్ట పరచబడిన బోర్డు లేక ప్రభుత్వ కంపెనీ అని అర్థము:

(68) "వీధి " అను పదములో సర్వసామాన్య మార్గమైనను లేక కాకున్నను, ప్రజలు దారికి హక్కు కలిగియున్నట్టి ఏదేని దారి, రోడ్డు, సందు, కూడలి, ఆవరణము, ఇరుకు సందు, మార్గము. లేక ఖాళీ స్థలము మరియు ఏదేని పబ్లిక్ వంతెన లేక కట్టపై రోడ్డు మార్గము లేక - కాలిబాట కూడ చేరియుండును; ________________

- 11/GTI (69) “సబ్ స్టేషను” అనగా ప్రసారము. లేక పంపిణీ కొరకు విద్యుచ్ఛక్తిని రూపాంతరము' లేక పరివర్తనము చేయుట కొరకైన స్టేషను అని అర్థము మరియు ఈ పదబంధ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్లు, కన్వర్టర్లు, స్విచ్ గేర్లు, కెపాసిటర్లు, సింక్రోనస్ కండెన్సర్లు, కట్టడములు, కేబులు మరియు ఇతర అనుబంధ సాధన సామగ్రి మరియు ఆ ప్రయోజనము : నిమిత్తము వినియోగించిన ఏదేని భవనము మరియు అది ఉన్న స్థలము చేరియుండును;

(70) విద్యుచ్ఛక్తికి సంబంధించి “సరఫరా” అనగా లైసెన్సుదారుకు లేక వినియోగదారునికి విద్యుచ్ఛక్తి అమ్మకము అని అర్థము:

(71) “వర్తకము " అనగా తిరిగి అమ్ముట కొరకు విద్యుచ్ఛక్తి కొనుగోలు అని అర్థము మరియు "వర్తకము " అను పదమును తదనుసారముగ అన్వయించవలెను;

(72) "ప్రసార లైన్లు" అనగా అట్టి కేబుళ్లు లేక ఉపరితల మార్గములకు అవసరమైన మరియు నియంత్రించుటకు వినియోగించిన ఏవేని స్టెప్-అప్ మరియు స్టెప్-డౌన్ ట్రాన్స్ ఫార్మర్లు, స్విచ్ గేర్లు మరియు ఇతర పనులు మరియు అట్టి ట్రాన్స్ ఫార్మర్లు, స్విచ్ గేర్లు మరియు ఇతర పనులను సమకూర్చుటకు అవసరమైనట్టి భవనములు లేక వాటి భాగములతోపాటు ఒక ఉత్పాదన స్టేషను నుండి మరియొక ఉత్పాదన స్టేషను లేక సబ్ స్టేషనుకు విద్యుచ్ఛక్తిని ప్రసారము చేయుచున్న (లైసెన్సుదారుని పంపిణీ వ్యవస్థలోని ఆవశ్యక భాగము కానట్టి) అన్ని అధిక వత్తిడిగల కేబుళ్లు మరియు ఉపరితల మార్గములు అని అర్థము:

(73) "ప్రసార లైసెన్సుదారు" అనగా ప్రసార లైన్లు వేయుటకు లేక నిర్వహించుటకు ప్రాధికార మీయబడిన లైసెన్సుదారు అని అర్థము:

(74) “ప్రసరించు" అనగా ప్రసార లైన్ల ద్వారా విద్యుచ్ఛక్తి సరఫరా చేయుట అని అర్ధము మరియు " ప్రసారము" అనుపదమును తదనుసారముగా అన్వయించవలెను;

(75) “వినియోగము" అనగా విద్యుత్ లైన్లు లేక విద్యుత్ ప్లాంటు అని అర్థము మరియు ఈ పదపరిధిలో, ఈ చట్టము యొక్క నిబంధనల క్రింద ఉత్పాదన కంపెనీ లేక లైసెన్సు దారుగా పనిచేయుచున్న ఎవరేని వ్యక్తికి చెందిన అన్ని భూములు, భవనములు, పనులు మరియు వాటికి జతచేసిన సామగ్రి చేరి యుండును;

(76) “వీలింగు" అనగా 62వ పరిచ్ఛేదము క్రింద నిర్ధారించబడునట్టి ఛార్జీల చెల్లింపుపై "విద్యుచ్ఛక్తిని సరఫరా చేయుటకు ఇతర వ్యక్తిచే ప్రసార లైసెన్సుదారు. లేక సందర్భానుసారముగ పంపిణీ లైసెన్సుదారు యొక్క పంపిణీ వ్యవస్థ మరియు అనుబంధిత సౌకర్యములను వినియోగించుట ద్వారా చేయబడిన పని అని అర్థము. ________________

12/G12 (77) “పనులు" అను పదపరిధిలో విద్యుత్ లైను, మరియు ఏదేని భవనము. ప్లాంటు, యంత్రము, ఉపకరణములు మరియు ప్రజలకు విద్యుచ్ఛక్తిని ప్రసారము, పంపిణీ లేక సరఫరా చేయుటకు మరియు ఈ చట్టము లేక తత్సమయమున అమలు నందున్న ఏదేని ఇతర శాసనము క్రింద లైసెన్సుదారు యొక్క లేక మంజూరీ ఈయబడిన ఉద్దేశములను అమలు చేయుటకు అవసరమై నట్టి ఏ పేరుతో పిలుపబడున దైనను ఏదేని ఇతర వస్తువు చేరియుండును;

భాగము - 2

జాతీయ విద్యుచ్ఛక్తి విధానము మరియు ప్రణాళిక.

3. (1) కేంద్ర ప్రభుత్వము, బొగ్గు, సహజ వాయువు, అణుపదార్ధము లేక సామగ్రి, జల మరియు పునర్ వినియోగ ఇంధన వనరులు వంటి వనరులను గరిష్ఠ స్థాయిలో వినియోగించు విద్యుత్ విధానమును అభివృద్ధిపరచుటకు రాజ్య ప్రభుత్వములు మరియు ప్రాధికార సంస్థను సంప్రదించి జాతీయ విద్యుచ్ఛక్తి విధానము మరియు టారిఫ్ విధానమును ఆయా సమయములందు తయారు చేయవలెను.

(2) కేంద్ర ప్రభుత్వము, ఆయాసమయములందు జాతీయ, విద్యుచ్ఛక్తి విధానము మరియు టారిఫ్ విధానమును ప్రచురించవలెను.

(3) కేంద్ర ప్రభుత్వము ఆయాసమయములందు రాజ్య ప్రభుత్వములతోను మరియు ప్రాధికార సంస్థతోను సంప్రదింపులు జరిపి ఉప-పరిచ్చేదము (1)లో నిర్దేశించిన జాతీయ విద్యుచ్ఛక్తి విధానము మరియు టారిఫ్ విధానమును పునర్విలోకనము లేదా పునరీక్షణ చేయవలెను.

(4) ప్రాధికారసంస్థ, జాతీయ విద్యుచ్ఛక్తి విధానముననుసరించి జాతీయ విద్యుచ్చక్తి ప్రణాళికను . తయారు చేసి ఐదు సంవత్సరములకు ఒకసారి దానిని అధి సూచించవలెను:

అయితే, ఆ ప్రాధికార సంస్థ జాతీయ విద్యుచ్ఛక్తి ప్రణాళికను తయారు చేయునపుడు జాతీయ విద్యుచ్ఛక్తి విధానము ముసాయిదాను ప్రచురించి, దానిపై విహితపరచబడునట్టి గడువు లోపల లైసెన్సుదారులు, ఉత్పాదక కం పెనీలు మరియు ప్రజల నుండి సూచనలు మరియు ఆక్షేపణలను కోరవలెను.

అంతేకాక, ప్రాధికార సంస్థ.

(ఎ) కేంద్ర ప్రభుత్వము యొక్క ఆమోదము పొందిన తరువాత ఆ ప్రణాళికను అధిసూచించవలెను; ________________

13/613 . (బి) ఖండము (ఎ) క్రింద కేంద్ర ప్రభుత్వము ఆమోదమును మంజూరు చేయునపుడు ఇచ్చిన ఏవేని ఆదేశములను ప్రణాళికలో చేర్చి పునరీక్షణ చేయవలెను.

(5) ప్రాధికార సంస్థ, జాతీయ విద్యుచ్ఛక్తి "విధానముననుసరించి జాతీయ విద్యుచ్ఛక్తి ప్రణాళికను పునర్విలోకనము లేదా పునరీక్షణ చేయవచ్చును.

4. కేంద్ర ప్రభుత్వము, రాజ్య ప్రభుత్వములతో సంప్రదించిన తరువాత గ్రామీణ ప్రాంతములకు (పునర్ వినియోగ ఇంధన వనరులు మరియు సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాతిపదికగా ఏర్పడిన వ్యవస్థలతోసహా) స్టాండ్ ఎలోన్ వ్యవస్థలను అనుమతించుచూ జాతీయ విధానమును తయారు చేసి మరియు అధిసూచించవలెను.

5. కేంద్ర ప్రభుత్వము, రాజ్య ప్రభుత్వములతో, మరియు రాజ్య కమీషన్లతో సంప్రదించి, గ్రామీణ విద్యుదీకరణ కొరకు భారీ ప్రమాణంలో విద్యుత్ కొనుగోలు కొరకు పంచాయితీ సంస్థలు, వినియోగదారుల అసోసియేషనులు, సహకార సంఘాలు, ప్రభుత్వేతర వ్యవస్థలు లేదా ఫ్రాంచైజీల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో విద్యుచ్ఛక్తి స్థానిక పంపిణీ నిర్వహణ కొరకు జాతీయ విధానమునొకదానిని కూడ రూపొందించ వలెను.

6. గ్రామీణ విద్యుచ్ఛక్తి మౌళిక సదుపాయాల్ మరియు గృహావసరాల యొక్క విద్యుదీకరణ ద్వారా గ్రామాలు మరియు పల్లెలతోసహా అన్ని ప్రాంతాలకు విద్యుచ్ఛక్తిని కల్పించుట కొరకు సంబంధిత రాజ్య ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము సమిష్టిగా ఆ ఏర్పాటు చేయుటకు పాటుపడవలెను.

భాగము - 3

విద్యుచ్ఛక్తి ఉత్పాదన

7. ఏదేని ఉత్పాదక కంపెనీ, 73వ పరిచ్ఛేదము యొక్క ఖండము (బి)లో నిర్దేశించిన గ్రిడ్ తో జోడింపుకు సంబంధించిన సాంకేతిక ప్రమాణములను పాటించినచో, ఈ చట్టము క్రింద లైసెన్సు తీసుకోకుండ ఉత్పాదక స్టేషనును స్థాపించి, నడుప వచ్చును మరియు నిర్వహించవచ్చును.

8. (1) 7వ పరిచ్చేదములో ఏమి ఉన్నప్పటికిని, జలవిద్యుత్ ఉత్పాదక స్టేషను నెలకొల్పదలచిన ఏదేని ఉత్పాదక కంపెనీ, కేంద్ర ప్రభుత్వము. ఆయా సమయములందు అధి సూచన ద్వారా నిర్ణయించునట్టి మొత్తమునకు మించిన మూలధన వ్యయముతో కూడిన అంచనా వ్యవయముతో పథకమును రూపొందించి ప్రాధికార సంస్థకు దాని సమ్మతి కొరకు సమర్పించవలేను. ________________

- 141 G1 (2) ప్రాధికార సంస్థ, ఉప పరిచ్ఛేదము (1)క్రింద తనకు సమర్పించబడిన ఏదేని పథకమునకు సమ్మతి తెలియజేయుటకు ముందు దాని అభిప్రాయములో

(ఎ) ప్రతిపాదిత నదీ పనులు, విద్యుత్ ఉత్పాదన కొరకు. నది లేక దాని యొక్క ఉపనదులను అంతిమముగా బాగా అభివృద్ధి చేయుటకు లభించు అవకాశములకు భంగము కలిగిస్తాయా లేదా, తాగునీరు, సేద్యము, నౌకాయానము, వరదల నియంత్రణ లేక ఇతర ప్రజా ప్రయోజనములకు సంగతముగా ఉండుట ఆవశ్యకమైనదా లేదా;

మరియు ఈ ప్రయోజనముల నిమిత్తము సదరు ప్రాధికార సంస్థ రాజ్య ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము లేదా తాము సముచిత నుని భావించునట్టి ఇతర ఏజెన్సీలను ఆనకట్టల మరియు ఇతర నదీ పనులకు అభిలషణీయ స్థానమును గూర్చి తగినంతగా అధ్యయనము చేయుట కొరకు సంప్రదించి స్వయంగా సంత్రుప్తి చెందడం జరిగిందా, లేదా

(బి) ప్రతిపాదిత పథకము, ఆనకట్ట డిజైను మరియు భద్రతా ప్రమాణము లకు అనుగుణముగా ఉన్నదా,

లేదా అను విషయములను ప్రత్యేక ముగా పరిగణనలోనికి తీసుకొనవలెను.

3) ఏదైనా ప్రాంతములోని నది. యొక్క అభివృద్ధి కొరకైన బహుళార్ధ పథకము అమలులో ఉన్న యెడల, రాజ్య ప్రభుత్వము మరియు ఉత్పాదక కంపెనీ తమ కార్యకలాపములను అవి పరస్పర సంబంధము ఉన్నంత మేరకు అట్టి పథకము కొరకు బాధ్యులైన వ్యక్తుల కార్యకలాపములతో సమున్వయపరచవలెను.

9 (1) ఈ చట్టములో ఏమి ఉన్నప్పటికినీ, ఒకవ్యక్తి, క్యాప్టివ్ ఉత్పాదక ప్లాంటును దానికి చెందిన ప్రసార లైన్లను నిర్మించి, నిర్వహించి లేక నడుపవచ్చును.

అయితే, గ్రిడ్ ద్వారా చేయబడు - క్యాప్టిన్ ఉత్పాదక ప్లాంటు నుండి విద్యుచ్ఛక్తి సరఫరాను ఉత్పాదక కంపెనీ యొక్క ఉత్పాదక స్టేషను మాదిరిగానే క్రమబద్ధీకరించవలేను.

అంతేకాక, ఈ చట్టపు నిబంధనలు మరియు దాని క్రింద చేయబడిన నియమములు మరియు వినియమములననుసరించి ఎవరేని లైసెన్సుదారు. మరియు 42వ సరిచ్ఛేదపు ఉప-పరిచ్చేదము (2) క్రింద చేసిన వినియమములకు లోబడి ఎవరేని వినియోగదారునికి క్యాప్టివ్ ఉత్పాదన ప్లాంటు నుండి విద్యుచ్ఛక్తి ఉత్పాదన సరఫరా కొరకు ఈ చట్టము క్రింద లైసెన్సు అవసరము లేదు.

(2) క్యాప్టివ్ ఉత్పాదక ప్లాంటును నిర్మించి మరియు నిర్వహించుచు నడుపుచున్న, ప్రతి వ్యక్తి, కేవలను తాను నాడుకొను నిమిత్తము అతడి క్యాప్టివ్ ఉత్పాదక ప్లాంటు నుండి విద్యుచ్ఛక్తిని గమ్యస్థానమునకు తీసికొనిపోవుటకు ప్రవేశసౌలభ్య హక్కు కలిగి ఉండవలెను.

అయితే, అట్టి ప్రవేశ సౌలభ్యము. (ఓపెన్ యాక్సెస్) తగినంత ప్రసార సౌకర్యం లభ్యతకు లోబడి ఉంటుంది మరియు అట్టి ప్రసార సౌకర్య లభ్యత కేంద్ర ప్రసార వినియోగము లేక సందర్భానుసారముగ రాజ్య ప్రసార వినియోగముచే నిర్ధారించబడవలెను.

అంతేకాక, ప్రసార సౌకర్యం లభ్యతను గూర్చిన ఏదేని వివాదము సముచిత కమీషనుచే అధి నిర్ణయించబడవలెను.

ఉత్పాదన
కంపెని
విధులు

10:(1) ఈ చట్టపు నిబంధనలకు లోబడి. ఈ చట్టము లేక దాని క్రింద చేయబడిన నియమములు లేక వినియమములననుసరించి ఉత్పాదక స్టేషన్లను, టై లైన్లను, సబ్ స్టేషన్లను మరియు వాటికి జోడించబడిన ప్రసార లైన్లను నెలకొల్పుట, నడుపుట మరియు నిర్వహించుట ఉత్పాదక కంపెనీ యొక్క విధులై ఉండును.

(2) ఉత్పాదక కంపెనీ, ఈ చట్టము మరియు దాని క్రింద చేయబడిన నియమములు లేక వినియమములననుసరించి ఎవరేని లైసెన్సుదారుకు విద్యుచ్చక్తి సరఫరా చేయవచ్చును. మరియు 42వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (2) క్రింద చేసిన వినియమములకు లోబడి ఎవరేని వినియోగదారునికి విద్యుచ్ఛక్తి సరఫరా చేయవచ్చును.

(3) ప్రతి ఉత్పాదక కంపెనీ,

(ఎ) తమ ఉత్పాదక స్టేషన్లకు సంబంధించిన సాంకేతిక వివరములను సముచిత కమీషను మరియు ప్రాధికార సంస్థకు సమర్పించవలెను;

(బి) ఆది. ఉత్పాదన చేసిన విద్యుచ్ఛక్తి ప్రసారము కొరకు కేంద్ర ప్రసార వినియోగము లేక సందర్భానుసారముగ రాజ్య ప్రసార వినియోగముతో సమన్వయము చేయవలెను.

ఉత్పాదక
కంపెనీలకు
ఆదేశములు

11 (1) సముచిత ప్రభుత్వము, ఉత్పాదక కం పెనీ, అసాధారణ పరిస్థితులలో ఆ ప్రభుత్వ ఆదేశములననుసరించి ఏదేని ఉత్పాదన స్టేషనును నడుపమనియు మరియు నిర్వహించుమనియు నిర్దిష్ట పరచవచ్చును.

విశదీకరణ: - ఈ పరిచ్చేదము నిమిత్తము "అసాధారణ పరిస్థితులు " అనగా రాజ్య భద్రత, ప్రజాశాంతికి ఏర్పడిన ప్రమాదము నుండి ఉత్పన్నమైన పరిస్థితులు లేక ప్రకృతి వైపరీత్యము - లేక ప్రజాహితము నుండి ఉత్పన్నమైన ఇతర పరిస్థితులు అని అర్థము.

(2) సముచిత కమీషను, ఉప-పరిచ్చేదము (1)లో నిర్దేశించిన ఆదేశముల వలన ఏదేని ఉత్పాదక కంపెనీకి వాటిల్లిన ప్రతికూల విత్తీయ ప్రభావమును తాము సముచితమని భావించునట్టి రీతిలో సమతుల్యము చేయవచ్చును.

* విద్యుచ్ఛక్తి సవరణ చట్టము, 2007లోని 3వ పరిచ్చేదము ద్వారా 15-6-2007 నుండి చొప్పించబడినది. ________________

14/ G16

భాగము -4

లైసెన్సు లిచ్చుట

12. ఏ వ్యక్తిగాని, 14వ పరిచ్చేదము క్రింద లైసెన్సు ద్వారా అట్లు చేయుటకు ఆతడికి ప్రాధికార మీయబడిననే లేక 13వ పరిచ్ఛేదము క్రింద అతడు మినహాయింపబడిననే తప్ప.-

(ఎ) విద్యుచ్ఛక్తి ప్రసారమును చేపట్టరాదు; లేదా
(బి) విద్యుచ్ఛక్తి పంపిణీని చేపట్టరాదు; లేదా

{(సి) విద్యుచ్ఛక్తి వర్తకమును చేపట్టరాదు

13. సముచిత కమీషను, సముచిత ప్రభుత్వము. చేసిన సిఫారసు పై, 5వ పరిచ్చేదము క్రింద రూపొందించిన జాతీయ విధానముననుసరించి మరియు ప్రజాహితమును దృష్టిలో పెట్టుకొని, ఏవేని షరతులు మరియు నిర్బంధనలు ఏవేనియున్నచో వాటికి లోబడి అధి సూచన ద్వారా, అందులో నిర్దిష్ట పరచబడునట్టి కాలావధి లేక కాలావధులకు 12వ పరిచ్ఛేదము యొక్క నిబంధనలు, ఏదేని స్థానిక ప్రాధికార సంస్థ, పంచాయితీ సంస్థ, వినియోగదార్ల అసోసియేషను, సహకార సంఘములు, ప్రభుత్వేతర వ్యవస్థలు లేక ఫ్రాంచైజీలకు వర్తించవని ఆదేశించవచ్చును.

14. సముచిత కమీషను, 15వ పరిచ్ఛేదము క్రింద తనకు చేయబడిన దరఖాస్తు పై,

(ఎ) ప్రసార లైసెన్సుదారుగా విద్యుచ్ఛక్తి ప్రసారము చేయుటకు; లేక
(బి) పంపిణీ లైసెన్సుదారుగా విద్యుచ్ఛక్తి పంపిణీ చేయుటకు, లేక
(సి) విద్యుచ్ఛక్తి వర్తకుడిగా విద్యుచ్ఛక్తి వర్తకమును చేపట్టుటకు

లైసెన్సులో నిర్దిష్ట పరచబడునట్టి ఏదేని ప్రాంతములో ఎవరేని వ్యక్తికి లైసెన్సును ఆ మంజూరు చేయవచ్చును.

అయితే, నియత తేదీన లేక దానికి ముందు రద్దు చేయబడిన శాసనము లేక అనుసూచిలో నిర్దిష్ట పరచిన ఏడేని, చట్టము యొక్క నిబంధనల క్రింద విద్యుత్ ప్రసార లేక సరఫరాల వ్యాపారం చేయుచున్న ఎవరేని వ్యక్తి, రద్దు చేసిన శాసనములు లేక అనుసూచిలో నిర్దిష్ట పరచినట్టి చట్టము క్రింద అతనికి మంజూరు చేయబడిన లైసెన్సు, క్లియరెన్సు లేక ఆమోదములో నిర్ణయించబడునట్టి కాలావధికి ఈ చట్టము క్రింద లైసెన్సుదారుగా భావించబడవలెను, మరియు అట్టి లైసెన్సుకు సంబంధించి రద్దు చేసిన శాసనములు లేక అనుసూచిలో నిర్దిష్టపరచినట్టి చట్టము యొక్క నిబంధనలు ఈ చట్టము ప్రారంభమైన తేదీ నుండి ఒక సంవత్సరవు కాలావధి వరకు లేక లైసెన్సుదారు అభ్యర్ధన పై సముచిత కమీషనుచే అంతకు ముందే నిర్దిష్టపరచబడునట్టి కాలావధికి వర్తించవలెను. మరియు ఆ తరువాత సదరు. వ్యాపారానికి ఈ చట్టపు నిబంధనలు వర్తింపజేయవలేను. ________________

171 G17. అంతేకాక, కేంద్ర ప్రసార వినియోగము లేక రాజ్య ప్రసార వినియోగమును ఈ చట్టము క్రింద ప్రసార లైసెన్సుదారుగా భావించవలెను.

అంతేకాక, ఈ చట్టము ప్రారంభమునకు ముందు లేక తరువాత సముచిత ప్రభుత్వము, విద్యుచ్ఛక్తి ప్రసారము లేక విద్యుచ్ఛక్తి పంపిణీ లేక విద్యుచ్ఛక్తి వర్తకం చేపట్టిన సందర్భములో అట్టి ప్రభుత్వమును కూడా ఈ చట్టము క్రింద లైసెన్సుదారుగా భావించవలెను, అయితే, ఈ చట్టము క్రింద దానికి లైసెన్సు తీసుకొనవలసిన అవసరం ఉండదు:

అంతేకాక, దామోదర్ వ్యాలీ కార్పొరేషను చట్టము, 1948లోని 3వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్చేదము (1) క్రింద స్థాపించిన దామోదర్ వ్యాలీ కార్పొరేషనును కూడా ఈ చట్టము క్రింద లైసెన్సుదారుగా భావించవలెను. అయితే ఈ చట్టము క్రింద దానికి కూడా లైసెన్సు తీసుకొనవలసిన అవసరం ఉండదు. మరియు దామోదర్ వ్యాలీ కార్పొరేషను చట్టము, 1948 యొక్క నిబంధనలు ఈ చట్టము యొక్క నిబంధనలకు అసంగతముగా లేనంత మేరకు సదరు కార్పొరేషనుకు వర్తించుట కొనసాగవలెను.

అంతేకాక, ఈ చట్టములోని 131వ పరిచ్చేదము యొక్క ఉప-పరిచ్చేదము (2)లో పేర్కొనిన ప్రభుత్వ కంపెనీ లేక కంపెనీ మరియు అనుసూచిలో నిర్దిష్ట పరచిన చట్టములను - పురస్కరించుకొని ఏర్పాటు చేయబడిన కంపెనీ లేక కంపెనీలను కూడా ఈ చట్టము క్రింద లైసెన్సుదారులుగా భావించవలెను.

అంతేకాక, సముచిత కమీషను, ఈ చట్టము క్రింది. ఇతర షరతులు లేక ఆపేక్షితము లకు భంగము కలుగకుండ, ఒకే ప్రాంతములో లైసెన్సు మంజూరు కొరకు దరఖాస్తుదారుడు కేంద్ర ప్రభుత్వముచే విహితపరచబడునట్టి (తగినంత మూలధనము. పరపతి యోగ్యత లేక ప్రవర్తనా నియమావళికి సంబంధించిన). అదనపు అపేక్షితములను పాటించవలెనను షరతులకు లోబడి ఒక ప్రాంతములో తమ స్వంత పంపిణీ వ్యవస్థ ద్వారా విద్యుచ్ఛక్తి పంపిణీ కొరకు ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ వ్యక్తులకు కూడా లైసెన్సును మంజూరు చేయ వచ్చును, మరియు లైసెన్సు మంజూరు కొరకైన ఆ పేక్షితములన్నియు పాటించిన ఏ దరఖాస్తుదారుడికి, అదే ప్రాంతములో అటువంటి ప్రయోజనము నిమిత్తము ఇదివరకే లైసెన్సుదారుకి లైసెన్సు ఇవ్వడం జరిగిందను కారణము పై లైసెన్సుమంజూరీని తిరస్కరించరాదు.

అంతేకాక, "పంపిణీ లైసెన్సుదారుడు తన సరఫరా ప్రాంతములోని ఒక నిర్దిష్టప్రాంతమునకు ఇతర వ్యక్తి ద్వారా విద్యుచ్ఛక్తి పంపిణీని చేపట్టుటకు ప్రతిపాదించిన యెడల ఆ వ్యక్తి, సంబంధిత రాజ్య కమీషను నుండి ఏదేని ప్రత్యేక లైసెన్సును తీసుకొన వలసిన అవసరం కూడా ఉండదు. మరియు అట్టి పంపిణీ లైసెన్సుదారు, తన సరఫరా ప్రాంతములో ఈ విద్యుచ్ఛక్తి సరఫరా కొరకు బాధ్యత వహించవలేను. ________________

18/G18 అంతేకాక, ఒక వ్యక్తి, రాజ్య ప్రభుత్వముచే అధి సూచించబడునట్టి గ్రామీణప్రాంతములో విద్యుచ్ఛక్తి ఉత్పాదనను మరియు పంపిణీకి ఉద్దేశించిన యెడల, అట్టివ్యక్తి, అట్టి విద్యుచ్ఛక్తి ఉత్పాదన మరియు పంపిణీ కొరకు ఏదేని లైసెన్సును తీసుకొనవలసిన 'అవసరం కూడా ఉండదు. అయితే, అతడు .. 53వ పరిచ్చేదము. క్రింద ప్రాధికార సంస్థచే నిర్దిష్ట పరచబడునట్టి చర్యలను తీసుకొనవలెను.

అంతేకాక, పంపిణీ లైసెన్సుదారు. విద్యుచ్ఛక్తి వర్తకమును చేపట్టుటకు కూడా లైసెన్సు - తీసుకొనవలసిన అవసరం ఉండదు.

15.(1) 14వ పరిచ్చేదము క్రింద ప్రతియొక దరఖాస్తు, సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి ప్రరూపము మరియు రీతిలో చేసుకొనవలెను. మరియు విహిత పరచబడునట్టి ఫీజుతో జత చేయబడవలెను.

(2) లైసెన్సు మంజూరు కొరకు దరఖాస్తు చేసిన ఎవరేని వ్యక్తి, అట్టి దరఖాస్తును చేసిన తరువాత ఏడుదినముల లోపల నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో అట్టి వివరములతో తన దరఖాస్తు నోటీసును ప్రచురించవలెను. మరియు

(i) ప్రచురించిన దరఖాస్తుకు సమాధానముగా సముచిత కమీషనుచే స్వీకరించబడిన ఆక్షేపణలు ఏవేని యున్నచో అవి దానిచే పర్యాలోచించబడినవే తప్ప,

అయితే, పైన చెప్పిన విధముగా నోటీసు ప్రచురించిన తేదీ నుండి ముప్పది దినములు ముగియుటకు ముందు స్వీకరించబడిన ఆక్షేపణ ఆయననే తప్ప ఆక్షేపణ ఏదియు పర్యాలోచించరాదు:

(ii) ఏదేని కంటోన్మెంట్, విమానాశ్రయము, కోట, ఆయుధశాల, నౌకా నిర్మాణకేంద్రము లేక శిబిరము లేక రక్షణ ప్రయోజనముల కొరకు ప్రభుత్వ స్వాధీనములో ఉన్నట్లే ఏదేని భవనము లేక స్థలము యొక్క పూర్తి భాగము గాని లేక ఏదేని భాగముతో సహా ఒక ప్రాంతమునకు లైసెన్సు కొరకైన దరఖాస్తు విషయములో లైసెన్సు మంజూరు చేయుటకు, కేంద్ర ప్రభుత్వమునకు అభ్యంతరము లేదని సముచిత కమీషను ధ్రువపరచుకోనునంత వరకు

లైసెన్సు మంజూరు చేయరాదు.

(3) ప్రసార లైసెన్సుదారుగా పనిచేయుటకు ఉద్దేశించుచున్న వ్యక్తి, దరఖాస్తు చేసిన వెంటనే కేంద్ర ప్రసార వినియోగము లేక సందర్భానుసారముగ రాజ్యప్రసార వినియోగమునకు అట్టి దరఖాస్తు ప్రతినొకదానిని పంపవలెను. ________________

- 1916 19 (4) కేంద్ర ప్రసార వినియోగము లేక సందర్భానుసారముగ రాజ్య ప్రసార వినియోగము, ఉప-పరిచ్చేదము (3)లో నిర్దేశించిన దరఖాస్తు ప్రతిని అందుకున్న తరువాత ముప్పది దినముల లోపల తమ సిఫార్సులు ఏవేని యున్నచో సముచిత కమీషనుకు పంపవలెను:

అయితే, కమీషను అట్టి సిఫార్సులకు బద్ధమై ఉండవలసిన అవసరం లేదు.

(5) 14వ పరిచ్ఛేదము క్రింద లైసెన్సు మంజూరు చేయుటకు ముందు సముచిత కమీషను,-

(ఎ) ఏ వ్యక్తికి లైసెన్సు జారీచేయుటకు ప్రతిపాదించబడినదో ఆ వ్యక్తి పేరు మరియు చిరునామాను తెలియజేయుచూ కమీషను అవసరమని భావించునట్టి రెండు దిన, వార్తాపత్రికలలో నోటీసు ప్రచురించవలెను.

(బి) కేంద్ర ప్రసార వినియోగము లేక సందర్భానుసారముగ రాజ్య ప్రసార వినియోగము యొక్క సూచనలు లేక ఆక్షేపణలన్నియు మరియు సిఫార్సులు ఏవేనియున్నచో పర్యాలోచించవలెను.

6. ఒక వ్యక్తి, 14వ పరిచ్చేదము యొక్క ఉప-పరిచ్చేదము (1) క్రింద లైసెన్సుదారుగా పనిచేయుటకు దరఖాస్తు చేసినయెడల, ఆచరణీయమైనంత మేరకు అట్టి దరఖాస్తును స్వీకరించిన తరువాత తొంబది దినముల లోపల,

(ఎ) ఈ చట్టము యొక్క నిబంధనలు మరియు దానిక్రింద చేసిన నియమములు మరియు వినియమములకు లోబడి లైసెన్సును జారీచేయ వలెను; లేక

(బి) అట్టి దరఖాస్తు ఈ చట్టము యొక్క నిబంధనలు లేక దాని క్రింద చేసిన నియమములు మరియు వినియమములు లేక తత్సమయమున అమలు నందున్న ఏదేని ఇతర శాసనము యొక్క నిబంధనలకు అనుగుణముగా లేనిచో, లిఖితపూర్వకముగా వ్రాసి యుంచదగు కారణముల పై దరఖాస్తును తిరస్కరించవలెను.

అయితే, దరఖాస్తుదారుడికి ఆకర్షింపబడుటకు అవకాశము ఇచ్చిననే తప్ప దరఖాస్తు ఏదియు తిరస్కరించబడరాదు.

(7) సముచిత కమీషను, లైసెన్సు జారీ చేసిన వెంటనే, లైసెన్సు ప్రతిని సముచిత ప్రభుత్వము, ప్రాధికార సంస్థ, స్థానిక ప్రాధికార సంస్థకు మరియు సముచిత కమీషను అవసరమని భావించునట్టి ఇతర వ్యక్తికి పంపవలెను.

(8) అట్టి లైసెన్సు ప్రతిసంహరణ చేయబడిననే తప్ప లైసెన్సు ఇరువది ఐదు సంవత్సరముల కాలావధి వరకు అమలు కొనసాగవలెను. ________________

20/-G20 . 16. " సముచిత కమీషను, లైసెన్సుదారునికి గాని లేక లైసెన్సుదారుల తరగతికి గాని వర్తించు. ఏవేని సాధారణ లేక నిర్దిష్ట షరతులను నిర్దిష్ట పరచవచ్చును. మరియు అట్టి షరతులను సదరు లైసెన్సు షరతులుగా భావించవలెను.

అయితే, సముచిత కమీషను, నియతము చేయబడిన తేదీ నుండి ఒక సంవత్సరము లోపల, ఈ చట్టము ప్రారంభమైనప్పటి నుండి ఒక సంవత్సరము ముగిసిన తరువాత 14వ పరిచ్చేదమునకుగల. మొదటి, రెండవ, మూడవ, నాలుగవ మరియు ఐదవ వినాయింపు లలో నిర్దేశించిన లైసెన్సుదారులకు వర్తించు. లైసెన్సు యొక్క ఏవేని సాధారణ లేక నిర్దిష్ట షరతులను నిర్దిష్ట పరచవలెను.

17 (1) ఏ లైసెన్సుదారు, సముచిత కమీషను పూర్వానుమోదము లేకుండ,-

(ఎ) ఎవరేని ఇతర లైసెన్సుదారు యొక్క వినియోగము కొనుగోలు లేక స్వాధీనము చేసుకొనుట ద్వారా లేక ఇతర విధముగా ఆర్జించుటకు ఏదేని లావాదేవిని జరుపరాదు; లేక

(బి) తన వినియోగమును ఎవరేని ఇతర లైసెన్సుదారుని వినియోగముతో సంవిలీనం చేయరాదు;

అయితే, ఈ ఉప పరిచ్చేదములోనున్నదేదియు, లైసెన్సుదారు యొక్క వినియోగము, ఖండము (ఎ) లేక ఖండము (బి)లో నిర్దేశించిన వినియోగము ఉన్నటువంటి రాజ్యము కానట్టి రాజ్యములో ఉన్నచో వర్తించదు.

(2) ప్రతియొక లైసెన్సుదారు, ఉప పరిచ్ఛేదము (1) క్రింద ఆమోదము పొందుటకు ముందు, సదరు ఆమోదము కొరకు దరఖాస్తు చేసుకొనినట్టి లైసెన్సుదారు యొక్క ప్రాంతములో విద్యుచ్ఛక్తి ప్రసారము లేక పంపిణీచేయు. ప్రతియొక ఇతర లైసెన్సుదారుకు ఒక మాసముకంటే తక్కువ కానట్టి నోటీసును ఈయవలెను.

(3) ఏ లైసెన్సుదారు, సముచిత కమీషను పూర్వాను మోదము లేకుండ అమ్మకము, లీజు, మార్పిడి ద్వారా లేక ఇతర విధముగా ఏ సమయములో నైనను తన లైసెన్సును అప్పగించరాదు. లేక తన వినియోగమును లేక దానిలోని ఏదేని " భాగమును అంతరణ చేయరాదు.

(4) ఉప-పరిచ్ఛేదము (1) లేక ఉప పరిచ్ఛేదము (3)లో నిర్దిష్టపరచిన ఏదేని ఈ వ్యవహారమునకు సంబంధించిన ఏదేని కరారు, సముచిత కమీషను పూర్వాను మోదముతో చేసినదైననే తప్ప చెల్లనిదగను. ________________

... 21 G21. 18.(1) సముచిత కమీషను, లైసెన్సుదారు. దరఖాస్తు పై , లేక ఇతరవిధముగా ప్రజాహితము దృష్ట్యా అట్లు చేయవచ్చని అభిప్రాయపడిన యెడల అతడి లైసెన్సు యొక్క నిబంధనలు మరియు షరతులకు తాము సబబని భావించునట్టి మార్పులు మరియు సవరణలు. చేయవలెను;

అయితే, అట్టి మార్పులు లేక సవరణలు ఏవియు అట్టి సమ్మతి అయుక్తముగా ఆపి ఉంచబడినదని సముచిత కమీషను అభిప్రాయపడినచో, లైసెన్సుదారు సమ్మతితో తప్ప, చేయరాదు.

(2) ఈ పరిచ్చేదము క్రింద లైసెన్సులో ఏవేని నూర్పులు లేక సవరణలు చేయుటకు ముందు, ఈ క్రింది నిబంధనలను అమలు చేయవలెను, అవేవనగా,

(ఎ) లైసెన్సుదారు. తన లైసెన్సులో ఏవేని మార్పులు లేక సవరణలు ప్రతిపాదించుచూ ఉప-పరిచ్ఛేదము (1) క్రింద దరఖాస్తు చేసిన యెడల,లైసెన్సుదారు, నిర్దిష్ట పరచబడునట్టి వివరములతో మరియు అట్టి రీతిలో సదరు దరఖాస్తు నోటీసును ప్రచురించవలెను;

(బి) ఏదేని కంటోన్మెంటు, విమానాశ్రయము, కోట, ఆయుధశాల, నౌకానిర్మాణ కేంద్రము లేక శిబిరము లేక రక్షణ ప్రయోజనముల కొరకు ప్రభుత్వ స్వాధీనములో ఉన్నట్టి ఏదేని భవనము లేక స్థలము యొక్క పూర్తి - భాగముగాని లేక ఏదేని భాగముతో కూడియున్నట్టి సరఫరా ప్రాంతములో మార్పులు లేక చేర్పులు ప్రతిపాదించుచూ చేసిన దరఖాస్తు విషయములో, సుముచిత కమీషను, కేంద్ర ప్రభుత్వము యొక్క సమ్మతితో తప్ప ఏవేని ఆ మార్పులు లేక చేర్పులు చేయరాదు.

(సి) లైసెన్సుదారు. దరఖాస్తు పై కాకుండ ఇతర విధముగా లైసెన్సులో ఏవేని మార్పులు లేక చేర్పులు చేయుటకు ప్రతిపాదించబడిన యెడల, సముచిత కమీషను, నిర్దిష్ట పరచబడునట్టి వివరములతో మరియు అట్టి రీతిలో ప్రతిపాదిత మార్పులు లేక చేర్పులను ప్రచురించవలెను;

(డి) సముచిత కమీషను, నోటీసు యొక్క మొదటి ప్రచురణ తేదీ నుండి ముప్పది దినముల లోపల స్వీకరించిన సూచనలు లేక ఆక్షేపణలన్నియు పర్యాలోచించిననే తప్ప ఏవేని మార్పులు లేక చేర్పులను చేయరాదు.

19.(1) సముచిత కమీషను, విచారణ జరిపిన తరువాత ప్రజాహితము దృష్ట్యా అవసరమని భావించినచో, ఈ క్రింది సందర్భములలో, అవేవనగా, ________________

- 221 G2 : (ఎ) ఈ చట్టము ద్వారా లేక ఈ చట్టము లేక దాని క్రింద చేసిన నియమములు లేక వినియమముల క్రింద లైసెన్సుదారు. తాను చేయవలసిన ఏపనినైనను చేయుటలో ఉద్దేశపూర్వక మరియు దీర్ఘకాలిక వ్యతిక్రమణ చేసినాడని సముచిత కమీషను అభిప్రాయపడిన యెడల,

(బి) , లైసెన్సుదారు. తన లైసెన్సు యొక్క ఏ నిబంధనలు లేక షరతులను: అతిక్రమించిన చో లైసెన్సు ప్రతిసంహరించబడునని లైసెన్సులో అభివ్యక్తముగా ప్రఖ్యానించబడినదో అట్టి తన లైసెన్సు యొక్క నిబంధనలు లేక షరతులను భంగపరచిన యెడల

(సి) లైసెన్సుదారు, ఈ విషయములో అతడి లైసెన్సు ద్వారా నిర్ణయించిన ఆ కాలావధి లోపల లేక సముచిత కమీషను అందుకు మంజూరు చేసిన ఏదేని ఆ దీర్ఘకాలిక కాలావధి లోపల,

(i) ఆతడి లైసెన్సు ద్వారా అతనిపై విధించబడిన విధులు మరియు బాధ్యతలను పూర్తిగాను మరియు సమర్థవంతముగాను నిర్వర్తించు స్థితిలో అతడు ఉన్నాడను విషయమును సముచిత కమీషను సంతృప్తి మేరకు తెలియజేయుటలో వైఫల్యము చెందిన యెడల, లేక ,

(ii) అతడి లైసెన్సు ద్వారా కోరబడినట్లుగా డిపాజిటు చేయుటలో లేక సెక్యూరిటీని సమకూర్చుటలో లేక ఫీజు లేక ఇతర ఛార్జీల చెల్లించుటలో వైఫల్యము చెందిన యెడల,

(డి) లైసెన్సు ద్వారా అతడిపై విధించబడిన విధులు మరియు బాధ్యతలను పూర్తిగాను మరియు సమర్ధవంతముగాను నిర్వర్తించగలగినట్టి విత్తేయస్థితిలో లైసెన్సుదారు లేడని సముచిత కమీషను అభిప్రాయపడిన యెడల

లైసెన్సును ప్రతి సంహరించవచ్చును

(2) సముచిత కమీషను ప్రజాహితము దృష్ట్యా అట్లుచేయుట అవసరమని అభిప్రాయపడిన యెడల, దరఖాస్తు పై లేక లైసెన్సుదారుని సమ్మతితో తాము సబబని భావించునట్టి నిబంధలు మరియు షరతులపై అతడి పంపిణీ లేక ప్రసారము లేక వర్తకప్రాంతము అంతయు లేక దానిలోని ఏదేని - భాగమునకు అతడి లైసెన్సును ప్రతిసంహరించవచ్చును. ________________ 231 623 --- (3) సముచిత కమీషను, ఏ కారణముల పై లైసెన్సు ప్రతిసంహరణ ప్రతిపాదించబడినదో. ఆ కారణములను తెలియజేయుచూ లిఖిత పూర్వకమైన మూడు మాసముల కంటే తక్కున కాని నోటీసును లైసెన్సుదారుకు ఇచ్చిననే తప్ప, మరియు ప్రతిపాదిత ప్రతిసంహరణకు వ్యతిరేకముగా నోటీసు కాలావధిలోపల లైసెన్సుదారుచే చూపబడిన ఏదేని కారణమును పర్యాలోచించిననే తప్ప ఉప-పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సు ఏదియు ప్రతిసంహరిచబడరాదు.

(4) సముచిత కమీషను, ఉప-పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సు ప్రతిసంహరించుటకు బదులు, అది సబబని భావించి విధించునట్టి అదనపు నిబంధనలు మరియు షరతులకు లోబడి, లైసెన్సు అమలు నందు ఉండునట్లు అనుమతించవచ్చును. మరియు అట్లు విధించిన ఏవేని అదనపు నిబంధనలు మరియు షరతులకు లైసెన్సుదారు బద్ధుడై ఉండి వాటిని పాటించవలెను, మరియు అవి లైసెన్సులో ఉండియుండినట్లుగా అమలు కావలెను మరియు ప్రభావము కలిగి ఉండవలెను.

(5) కమీషను, ఈ పరిచ్చేదము క్రింద లైసెన్సును ప్రతిసంహరించు నేడల, అది లైసెన్సుదారు పై ప్రతిసంహరణ నోటీసును తామీలు చేయవలెను మరియు ఏ తేదీన ప్రతిసంహరణ అమలులోనికి వచ్చునో ఆ తేదీని నిర్ణయించవలెను.

(6) సముచిత కమీషను, ఉప-పరిచ్చేదము (5) క్రింద లైసెన్సు ప్రతిసంహరణ కొరకు నోటీసు నిచ్చిన యెడల, ఈ చట్టము. క్రింద విధించబడునట్టి ఏదేని శాస్త్రికి లేక ప్రారంభించబడునట్టి అభియోగ ప్రొసీడింగుకు భంగము కలుగకుండ, లైసెన్సుదారు, కమీషను యొక్క పూర్వాను మోదము తరువాత కమీషనుచే లైసెన్సు మంజూరు చేయబడుటకు యోగ్యుడని కనుగొనబడిన ఎవరేని వ్యక్తికి అతడి వినియోగమును అమ్మివేయవచ్చును.

20.(1) సముచిత కమీషను, 19వ పరిచ్చేదము క్రింద ఎవరేని లైసెన్సుదారుని లైసెన్సును ప్రతిసంహరించుకొనిన యెడల, ఈ క్రింది. నిబంధనలు వర్తించవలెను. అవేవనగా

(ఎ) సముచిత కమీషను, ఏ లైసెన్సుదారు లైసెన్సు ప్రతిసంహరించబడినదో ఆ లైసెన్సుదారుని వినియోగమును ఆర్జించుట కొరకు దరఖాస్తులను ఆహ్వానించవలెను మరియు ప్రాథమికంగా వినియోగము కొరకు ఇవ్వజూపబడిన అత్యధిక మరియు మంచి ధర ప్రాతిపదికపై అట్టి దరఖాస్తులలో ఏ దరఖాస్తును స్వీకరించవలెనో నిర్దారించవలెను. ________________

- 244G24

(బి) సముచిత కమీషను, లిఖిత పూర్వక నోటీసు ద్వారా తమ వినియోగమును అమ్మవలసినదిగా లైసెన్సుదారును కోరవచ్చును. మరియు ఇకమీదట లైసెన్సుదారు (ఇటు పిమ్మట ఈ పరిచ్చేదములో "కొనుగోలుదారుడిఘగా " నిర్దేశించబడు) ఎవరి దరఖాస్తు కమీషనుచే స్వీకరించబడినదో ఆ వ్యక్తికి అతడి వినియోగమును అమ్మవలెను;

(సి) లైసెన్సు ప్రతిసంహరణ తేదీన మరియు అప్పటి నుండి లేక లైసెన్సుదారు వినియోగము కొనుగోలుదారుడికి అమ్మిన తేదీ ముందు అయినచో ఆ తేదీన మరియు అప్పటి నుండి. ఆ తేదీకి ముందు ప్రాప్తించిన ఏదేని దాయిత్వ ములు తప్ప లైసెన్సుదారుని హక్కులు, కర్తవ్యములు, బాధ్యతలు - మరియు దాయిత్వములన్నియు పూర్తిగా అంతము కావలెను.

(డి) సముచిత కమీషను, పరిపాలకుల నియామకముతో సహా, వినియోగము నిర్వహణకు సంబంధించి సముచితమని భావించునట్టి మధ్యకాలీన ఏర్పాట్లను చేయవచ్చును;

(ఇ) ఖండము (డి) క్రింద నియమించబడిన పరిపాలకుడు, సముచిత కమీషను ఆదేశించునట్లుగా అట్టి అధికారములను వినియోగించవలెను. మరియు అట్టికృత్యములను నిర్వర్తించవలెను.

(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద వినియోగమును అమ్మదలచిన యెడల, కొనుగోలుదారుడు, వినియోగము యొక్క కొనుగోలు ధరను అంగీకారము కుదుర్చుకున్నట్టి రీతిలో లైసెన్సుదారుకు చెల్లించవలెను.

(3) సముచిత కమీషను, లైసెన్సుదారుకు వినియోగమును అమ్మవలసినదిగా కోరుచూ ఉప పరిచ్చేదము (1) క్రింద ఏదేని నోటీసును జారీ చేసిన యెడల, అది అట్టి నోటీసు ద్వారా వినియోగమును ఇచ్చివేయమని లైసెన్సుదారును కోరవచ్చును. మరియు ఇకమీదట లైసెన్సుదారు, నోటీసులో నిర్దిష్ట పరచిన తేదీన దాని కొనుగోలు ధర చెల్లింపుపై పేర్కొన బడిన కొనుగోలుదారుడికి వినియోగమును ఇచ్చినేయవలెను.

(4) ఉష పరిచ్ఛేదము (3)లో నిర్దేశించు వినియోగమును లైసెన్సుదారు కొనుగోలుదారుడికి ఇచ్చివేసిన యెడల, కాని ఆ ఉప-పరిచ్చేదము క్రింద జారీ చేసిన నోటీసులో నిర్ణయించిన తేదీనాటికి దాని అమ్మకము పూర్తికాని యెడల, సముచిత కమీషను, అమ్మకము పూర్తికాకుండ అది పెండింగులో ఉండగానే, ఆది సబబవి. భావించినచో వినియోగమును నడుపమనియు మరియు నిర్వహించమనియు ఉద్దేశించుచున్న కొనుగోలుదారుడికి అనుమతించ వచ్చును. ________________

G25..

21. 20వ పరిచ్ఛేదము లేక 24వ పరిచ్ఛేదము క్రింద వినియోగము అమ్మివేయబడిన యెడల, అమ్మకము పూర్తి అయిన మీదట లేక సందర్భానుసారముగ ఉద్దేశించుచూ కొనుగోలుదారుడికి వినియోగమును ఇచ్చివేసిన తేదీన, ఇందులో ఏది ముందుజరుగునో అప్పుడు,-

(ఎ) వినియోగము, కొనుగోలుదారుడిలో లేక సందర్భానుసారముగ ఉద్దేశించుచున్న కొనుగోలుదారుడిలో ఏదేని అప్పు, తనఖా లేక లైసెన్సుదారుకు లేక వినియోగమునకు జతపరచిన అటువంటి బాధ్యత లేకుండ నిహితము కావలెను

అయితే, అట్టి ఏదేని అప్పు, తనఖా లేక అటువంటి బాధ్యత వినియోగమునకు బదులుగా క్రయధనమునకు జతపరచవలెను; మరియు

(బి) లైసెన్సుదారు యొక్క లైసెన్సు క్రింద హక్కులు, అధికారములు, ప్రాధికారములు, కర్తవ్యములు మరియు బాధ్యతలు కొనుగోలుదారుడికి అంతరణ కావలెను మరియు అట్టి కొనుగోలుదారుడు లైసెన్సుదారుడిగా భావించబడవలెను.

22.(1) 20వ పరిచ్ఛేదము లేక 24వ పరిచ్చేదము క్రింద నిబంధించబడిన రీతిలో వినియోగము అమ్మివేయబడనిచో, సముచిత కమీషను. వినియోగదారుల హితమును పరిరక్షించుటకు లేక ప్రజాహితము దృష్ట్యా వినియోగమును నిర్వహించుట కొరకు అది అవసరమని భావించునట్టి ఆదేశములను జారీ చేయవచ్చును లేక పథకమును రూపొందించవచ్చును.

(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద సముచిత కమీషను ఆదేశములను జారీచేయని యెడల లేక పథకమును రూపొందించని యెడల, 20వ పరిచ్చేదము లేక 24వ పరిచ్ఛేదములో నిర్దేశించిన లైసెన్సుదారు. తాను సబబని భావించునట్టి రీతిలో వినియోగమును విక్రయించ వచ్చును.

అయితే, ప్రతిసంహరణ తేదీనుండి ఆరుమాసముల కాలావధి లోపల లైసెన్సుదారు వినియోగమును విక్రయించనిచో, 20వ పరిచ్చేదము లేక 24వ పరిచ్చేదము క్రింద సముచిత కమీషను, ఏదేని వీధి లేక ప్రభుత్వ భూమిలో క్రింద, పైన, ప్రక్కన లేక అడ్డముగాయున్న లైసెన్సుదారు పనులు తొలగింపబడునట్లు చేయవచ్చును. మరియు పునఃస్థాపన చేయబడునట్టి ప్రతియొక వీధి లేక ప్రభుత్వ భూమి మరియు అట్టి తొలగింపు మరియు పునస్థాపన ఖర్చులను లైసెన్సుదారు నుండి రాబట్టుకొనవచ్చును. ________________

23. సరఫరాను సమర్ధవంతముగా నిర్వహించుట కొరకు న్యాయోచిత విద్యుచ్ఛక్తి పంపిణీని సురక్షితము చేయుట మరియు పోటీని పెంపొందించుటకు వెంటనే అట్లు చేయుట అవసరమని. లేక యుక్తమని సముచిత కమీషను అభిప్రాయబడినచో, ఆది, ఉత్తరువు ద్వారా సరఫరా, పంపిణీ, వినియోగము లేక దాని వాడకమును క్రమబద్దీకరించుట కొరకు నిబంధించ వచ్చును.

24(1) పంపిణీ లైసెన్సుదారు.-

(ఎ) నాణ్యమైన విద్యుచ్చ క్తిని గూర్చిన ప్రమాణాల కనుగుణముగా వినియోగదారులకు అంతరాయము కలగకుండ విద్యుచ్ఛక్తి సరఫరా చేయుటలో నిరంతరముగా వైఫల్యము చెందినాడని; లేక

(బి) ఈ చట్టము ద్వారా లేక ఈ చట్టము యొక్క నిబంధనల క్రింద అతనిపై విధించబడిన క్రుత్యములను లేక కర్తవ్యములను నిర్వర్తించలేడని; లేక

(సి) ఈ చట్టము క్రింద సముచిత, కమీషనుచే ఈయబడిన ఏవేని ఆదేశములను పాటించుటలో నిరంతరము వ్యతిక్రమణ చేసినాడని; లేక

(డి) లైసెన్సు నిబంధనలు మరియు షరతులను అతిక్రమించినాడని,

సముచిత కమీషను ఎప్పుడైనను అభిప్రాయపడినచో మరియు ప్రజాహితము దృష్ట్యా అట్లు చేయుట కొరకు అవసరమైన పరిస్థితులు ఏర్పడినచో, సముచిత కమీషను, లిఖితపూర్వకముగా వ్రాసియుంచదగు కారణములపై ఒక సంవత్సరము కాలావధికి మించకుండ పంపిణీ లైసెన్సుదారు లైసెన్సును సస్పెండు చేయవచ్చును మరియు లైసెన్సు యొక్క నిబంధనలు ఆ మరియు షరతుల ననుసరించి పంపిణీ, లైసెన్సుదారు కృత్యములను నిర్వర్తించుటకు పరిపాలకుడిని నియమించవచ్చును.

అయితే, ఈ పరిచ్ఛేదము క్రింద లైసెన్సును సస్పెండు చేయుటకు ముందు, సముచిత కమీషను ప్రతిపాదిత లైసెన్సు సస్పెన్షనుకు వ్యతిరేకముగా విన్నపములు చేసికొనుటకు పంపిణీ లైసెన్సుదారుకు సబబైన అవకాశమును ఈయవలెను మరియు పంపిణీ లైసెన్సుదారుని విన్నపములు ఏవేని ఉన్నచో వాటిని పర్యాలోచించవలెను.

(2) ఉష పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సును సస్పెండు చేసిన మీదట, పంపిణీ లైసెన్సుదారుని యొక్క వినియోగములు, ఒక సంవత్సరము కాలావధికి మించకుండ లేక 20వ పరిచ్ఛేదములో యున్నట్లే నిబంధనలనమసరించి అట్టి వినియోగమును విక్రయించు తేదీ వరకు ఇందులో ఏది తరువాత జరుగునో ఆ తేదీ వరకు పరిపాలకుడిలో నిహితము కావలెను. ________________

... 277627. (3) సముచిత 'కమీషను, ఉప-పరిచ్ఛేదము (1) క్రింద పరిపాలకుడి నియామకము జరిగిన ఒక సంవత్సరము లోపల, 9వ పరిచ్చేదములో ఉన్నట్టి నిబంధనలననుసరించి లైసెన్సును ప్రతి సంహరించవలెను లేదా సందర్భానుసారముగ లైసెన్సు సస్పెన్షనును ప్రతిసంహరించవలెను మరియు ఏ పంపిణీ లైసెన్సుదారుని లైసెన్సు సస్పెండు చేయబడినదో ఆ పంపిణీ లైసెన్సుదారుకు వినియోగమును పునరుద్ధరించవలేను.

(4) సముచిత కమీషను, ఉప-పరిచ్ఛేదము (3) క్రింద లైసెన్సును ప్రతిసంహరించిన సందర్భములో, పంపిణీ లైసెన్సుదారుని వినియోగము, 20వ పరిచ్చేదము యొక్క నిబంధనలననుసరించి లైసెన్సు ప్రతి సంహరించబడిన తేదీ నుండి ఒక సంవత్సరము కాలావధి లోపల విక్రయించబడవలెను మరియు వినియోగముల విక్రయమునకైన పరిపాలన పరమైన మరియు ఇతర ఖర్చులను తగ్గించుకున్న తరువాత పంపిణీ లైసెన్సుదారుకు ఆ ధర యొక్క డబ్బును పంపివలెను.

భాగము - 5

విద్యుచ్ఛక్తి ప్రసారము

అంతర్ రాజ్య ప్రసారము

25. ఈ భాగము నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము, ప్రాంతాలవారీగా దేశ సరిహద్దులను నిర్ణయించవచ్చును. మరియు విద్యుచ్ఛక్తి యొక్క సమీకృత ప్రసారము మరియు సరఫరాను సమర్థవంతముగాను మితవ్యయముతో చేయుటకు మరియు ప్రత్యేకించి స్వచ్ఛంద అంతర్ కనెక్షన్లకు వీలు కల్పించుటకు మరియు అంతర్ రాజ్య, ప్రాంతీయ మరియు అంతర్ ప్రాంతీయ విద్యుచ్ఛక్తి ఉత్పాదన మరియు ప్రసారమునకు సౌకర్యముల సమన్వయము కొరకు ఎప్పటికప్పుడు వాటిలో అది అవసరమని భావించునట్టి మార్పులను చేయవచ్చును.

26.(1) కేంద్ర ప్రభుత్వము, అత్యంతానుకూల కాల నిర్ణయ పట్టికలు మరియు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రముల మధ్య విద్యుచ్ఛక్తి డిస్పాచ్ కొరకు జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రముగా పిలువబడు కేంద్రము నొకదానిని జాతీయ స్థాయిలో స్థాపించవలెను.

(2) జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క ఏర్పాటు మరియు కృత్యములు కేంద్ర ప్రభుత్వముచే విహితపరచబడునట్టి విధముగా ఉండవలెను.

అయితే, జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము. విద్యుచ్ఛక్తి వర్తక కార్యకలాపములలో నిమగ్నము కారాదు. ________________ (3) జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, ఏదేని కేంద్ర చట్టముచే లేక దాని క్రింద స్థాపించబడిన లేక ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ కంపెనీ లేక ఏదేని ప్రాధికార సంస్థ లేక కార్పొరేషనుచే కేంద్ర ప్రభుత్వము ద్వారా అధి సూచించబడినట్లుగా నిర్వహించవలెను.

27.(1) కేంద్ర ప్రభుత్వము, ఈ భాగము క్రింద అధికారములను వినియోగించుట కొరకు మరియు కృత్యములను నిర్వర్తించుట కొరకు 25వ పరిచ్ఛేదము ననుసరించి కేంద్ర ప్రభుత్వముచే నిర్థారించబడినట్లుగా ప్రాదేశిక అధికారితా పరిధి కలిగియుండి ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రముగా పిలువడు కేంద్రము నొకదానిని ప్రతియొక ప్రాంతమునకు స్థాపించవలెను.

2) ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, ఏదేని కేంద్ర చట్టము ద్వారా లేక దాని క్రింద స్థాపించబడిన లేక ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ కంపెనీ లేక ఏదేని ప్రాధికార సంస్థ లేక కార్పొరేషను చే కేంద్ర ప్రభుత్వము ద్వారా అధి సూచించబడినట్లుగా నిర్వహించవలెను.

అయితే, ఈ ఉప-పరిచ్ఛేదములో నిర్దేశించిన ప్రభుత్వ కంపెనీ లేక ప్రాధికార సంస్థ లేక కార్పొరేషను కేంద్ర ప్రభుత్వముచే అధిసూచించబడునంత వరకు, కేంద్ర ప్రసార వినియోగము, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రమును నిర్వహించవలెను.

అంతేకాక, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రమేదియు. విద్యుచ్ఛక్తి ఉత్పాదన లేక వర్తక కార్యకలాపములలో నిమగ్నము కారాదు.

28.(1) ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, సంబంధిత ప్రాంతములో విద్యుత్ వ్యవస్థ సమీకృత క్రియాకలాపమునకు అత్యున్నత నికాయముగా ఉండవలెను.

(2 ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, వీలింగ్ మరియు అత్యంతానుకూల కాల నిర్ణయ పట్టికలు మరియు గ్రిడ్ కోడ్ లో కేంద్ర కమీషను నిర్దిష్ట పరచినట్లుగా విద్యుచ్ఛక్తి డిస్పాచ్ కు సంబంధించినట్టి సూత్రములు, మార్గదర్శకాలు మరియు పద్ధతులను పాటించ వలెను.

3) ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము.-

(ఎ) ప్రాంతములో పనిచేయుచున్న లైసెన్సుదారులు లేక ఉత్పాదన కంపెనీలతో కుదుర్చుకున్న కాంట్రాక్టులననుసరించి ప్రాంతము లోపల అత్యంతానుకూల కాలనిర్ణయ పట్టికలు మరియు విద్యుచ్ఛక్తి డిస్పాచ్ కొరకై బాధ్యత వహించవలెను;

(బి) గ్రిడ్ నిర్వహణలను మానిటర్ చేయవలేను:

(సి) ప్రాంతీయ గ్రిడ్ ల ద్వారా ప్రసారం చేయబడిన విద్యుచ్ఛక్తి పరిమాణమును గూర్చిన లెక్కలను నిర్వహించవలెను; ________________ - 291 G29: (డి). అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థను పర్యవేక్షించవలెను. మురియు నియంత్రించ వలెను; మరియు

(ఇ) గ్రిడ్ నియంత్రణ కొరకు వాస్తవంగా ఉపయోగములో యుంచిన సమయమును అమలు చేయుటకు మరియు గ్రిడ్ ప్రమాణములు మరియు గ్రిడ్ కోడ్ ననుసరించి ప్రాంతీయ గ్రిడ్ ను సురక్షితముగాను మరియు పొదుపుగాను నిర్వహించుట ద్వారా ప్రాంతము లోపల విద్యుచ్ఛక్తి డిస్పాచ్ చేయుటకు బాధ్యత వహించవలెను.

(4) ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, అంతర్ రాజ్య విద్యుచ్ఛక్తి ప్రసారములో నిమగ్నమైన ఉత్పాదన కంపెనీలు లేక లైసెన్సుదారుల నుండి కేంద్ర కమీషనుచే నిర్దిష్టపరచబడునట్టి విధముగా ఫీజును మరియు ఛార్జీలను విధించవచ్చును మరియు వసూలు అం చేయవచ్చును.

29 (1) ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము, తన నియంత్రణ క్రింద ప్రాంతములో గ్రిడ్ క్రియాకలాపముల స్థిరీకరణ మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో గరిష్ఠ స్థాయిలో మితమును మరియు సమర్థతను సాధించుటకు అవసరమైనట్టి ఆదేశములను ఈయవచ్చును, పర్యవేక్షణ మరియు నియంత్రణ చేయవచ్చును.

(2) ప్రతియొక లైసెన్సుదారు, ఉత్పాదన కం పెనీ, ఉత్పాదన స్టేషను, సబ్ స్టేషను మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో సంబంధము యున్నట్టి ఎవరేని ఇతర వ్యక్తి. ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రముచే జారీ చేయబడినట్టి ఆదేశములను పాటించవలెను.

(3) రాజ్య ప్రసార లైన్ల ఎవరేని ప్రసార లైసెన్సుదారు. లేక ఎవరేని ఇతర రాజ్య లైసెన్సుదారు లేక ఉత్పాదన కంపెనీ (అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థకు సంబంధించినవి కానట్టి) లేక రాజ్యములోని సబ్ స్టేషనుకు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రములచే జారీ చేయబడిన ఆదేశములన్నియు రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము ద్వారా జారీ చేయబడ వలెను మరియు రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రములు అట్టి ఆదేశములు లైసెన్సుదారు లేక ఉత్పాదన కంపెనీ లేక సబ్ స్టేషన్ విధిగా పాటించునట్లు జాగ్రత్త వహించవలెను.

(4) ప్రాంతములోని ప్రాంతీయ, విద్యుత్ కమిటీ, ఆ ప్రాంతములో సమీకృత గ్రిడ్ స్థిరత మరియు పాఫీగా నిర్వహణ మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో పొదుపు మరియు సమర్థతకు సంబంధించిన విషయములపై ఎప్పటికప్పుడు ఒక అంగీకారానికి రావలెను. ________________

- 301 G30 - (5) విద్యుచ్ఛక్తి, నాణ్యత లేక ప్రాంతీయ గ్రిడ్ యొక్క సురక్షితమైన, భద్రతగల మరియు సమీకృత నిర్వహణ లేక ఉప పరిచ్ఛేదము (1) క్రింద ఈయబడిన ఏవేని ఆదేశమునకు సంబధించి ఏదేని వివాదము ఉత్పన్నమైనచో, దానిని నిర్ణయము కొరకు కేంద్ర కమీషనుకు నిర్దేశించవలెను.

అయితే, కేంద్ర కమీషను నిర్ణయము పెండింగులో ఉండగా, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క ఆదేశములు, రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము లేక లైసెన్సుదారుడు లేక సందర్భానుసారముగ ఉత్పాదన కంపెనీ ద్వారా పాటింబడవలేను.

(6) ఎవరేని లైసెన్సుదారు లేక ఉత్పాదన కంపెనీ లేక ఎవరేని ఇతర వ్యక్తి, ఉప పరిచ్చేదము (2) లేక ఉప పరిచ్చేదము (3) క్రింద జారీ చేసిన ఆదేశములను పాటించుటలో వైఫల్యము చెందినచో, అతడు, పదునైదు లక్షల రూపాయలకు మించని శాస్త్రికి పాత్రుడగును.

రాజ్యాంతర్గత ప్రసారము

30. రాజ్య కమీషను. తన రాజ్య క్షేత్ర అధికారితా పరిధిలోపల విద్యుచ్ఛక్తిని పొదుపుగాను మరియు సమర్థనంతముగా వినియోగించుట ద్వారా విద్యుచ్ఛక్తి ప్రసారము మరియు సరఫరా కొరకు సౌకర్యములను కల్పించవలెను మరియు ప్రసారము, సీలింగు మరియు అంతర్ కనెక్షన్ల ఏర్పాట్లను పెంపొందించవలెను.

31 (1) రాజ్య ప్రభుత్వము, ఈ భాగము క్రింద అధికారములను వినియోగించు మరియు కృత్యములను నిర్వర్తించు ప్రయోజనముల నిమిత్తము రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రముగా పిలువబడు కేంద్రము నొకదానిని స్థాపించవలెను.

(2) రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము, రాజ్య ప్రభుత్వముచే అధి సూచించబడిన విధముగా ఏదేని రాజ్య చట్టము ద్వారా లేక దాని క్రింద స్థాపించబడిన లేక ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ కంపెనీ లేక ఏదేని ప్రాధికార సంస్థ లేక కార్పొరేషను చే నిర్వహించబడవలెను.

అయితే, రాజ్య ప్రభుత్వముచే ప్రభుత్వ కంపెనీ లేక ఏదేని ప్రాధికార సంస్థ లేక కార్పొరేషను అధి సూచించబడునంత వరకు రాజ్య ప్రసార వినియోగము, రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రమును నిర్వహించవలెను.

అంతేకాక, రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము ఏదియు విద్యుచ్ఛక్తి వర్తక కార్యకలాపములలో నిమగ్నం కారాదు. ________________ - 311 G31 32.(1) రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము, రాజ్యములో విద్యుత్ వ్యవస్థ సమీకృత నిర్వహణకై జాగ్రత్త వహించుటకు అత్యున్నత నికాయముగా ఉండవలెను.

(2) రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము,-

(ఎ) రాజ్యములో పనిచేయుచున్న లైసెన్సుదారులు లేక ఉత్పాదన కంపెనీలతో కుదుర్చుకున్న కాంట్రాక్టులననుసరించి రాజ్యములోపల అంత్యంలానుకూల కాలనిర్ణయ పట్టికలు మరియు విద్యుచ్ఛక్తి డిస్పాచ్ కొరకై బాధ్యత వహించవలెను;

(బి). గ్రిడ్ నిర్వహణలను మానిటర్ చేయవలెను.

(సి) రాజ్య గ్రిడ్ ద్వారా ప్రసారం చేయబడిన విద్యుచ్ఛక్తి పరిమాణమును గూర్చిన లెక్కలను నిర్వహించవలెను;

(డి) రాజ్యాంతర్గత ప్రసార వ్యవస్థను పర్యవేక్షించవలెను. మరియు నియంత్రించవలెను, మరియు

(ఇ) గ్రిడ్ నియంత్రణ కొరకు వాస్తవంగా నెరవేర్చుటలో యుంచిన సమయమును. అమలు చేయుటకు మరియు గ్రిడ్ ప్రమాణములు మరియు రాజ్య గ్రిడ్ కోడ్ ననుసరించి రాజ్య గ్రిడ్ ను సురక్షితముగాను మరియు పొదుపుగాను నిర్వహించుట ద్వారా రాజ్యము లోపల విద్యుచ్ఛక్తి డిస్పాచ్ చేయుటకు బాధ్యత వహించవలెను.

(3) రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము. రాజ్యాంతర్గత విద్యుచ్ఛక్తి ప్రసారములో నిమగ్నమైన ఉత్పాదన కంపెనీలు మరియు లైసెన్సుదారుల నుండి రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడిన విధముగా ఫీజును మరియు ఛార్జీలను విధించవచ్చును మరియు వసూలు చేయవచ్చును.

33.(1) రాజ్యములో రాజ్యలోడ్ డిస్పాచ్ కేంద్రము, ఆ రాష్ట్రములో సమీకృత గ్రిడ్ నిర్వహణలకు సంబంధించి జాగ్రత్త వహించుటకు మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో గరిష్ట స్థాయిలో పొదువును మరియు సమర్థతను సాధించుటకు అవసరమైనట్టి ఆదేశములను ఈయవచ్చును. మరియు పర్యవేక్షణ మరియు నియంత్రణ చేయవచ్చును.

(2) ప్రతియొక లైసెన్సుదారుడు, ఉత్పాదన కంపెనీ, ఉత్పాదన స్టేషను, సబ్ స్టేషను, మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణతో సంబంధము యున్నట్టి ఎవరేని ఇతర వ్యక్తి, ఉప-పరిచ్ఛేదము - (1) క్రింద రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము చే జారీచేయబడినట్టి ఆదేశములను పాటించవలెను.

(3) రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క అ ఆదేశములను పాటించవలెను. ________________ (4) విద్యుచ్ఛక్తి నాణ్యత లేక రాజ్య గ్రిడ్ యొక్క సురక్షితమైన, భద్రతగల మరియు సమీకృత నిర్వహణ లేక ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ఈయబడిన ఏదేని ఆదేశము నకు సంబంధించి ఏదేని వివాధము ఉత్పన్న మైనచో, నిర్ణయము కోరకు దానిని రాజ్య కమీషనుకు నిర్దేశించవలెను.

అయితే, రాజ్య కమీషను నిర్ణయము పెండింగులో ఉండగా రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క ఆదేశములు లైసెన్సుదారు లేక ఉత్పాదన కం పెనీ ద్వారా పాటించబడవలెను.

(5) ఎవరేని లైసెన్సుదారు లేక ఉత్పాదన కంపెనీ లేక ఎనలేని ఇతర వ్యక్తి, ఉప-పరిచ్ఛేదము (1) క్రింద జారీ చేయబడిన ఆదేశములను పాటించుటలో వైఫల్యము చెందినచో, అతడు ఐదు లక్షల రూపాయలకు మించని శాస్త్రికి పాత్రుడగును.

ప్రసారమునకు సంబంధించి ఇతర నిబంధనలు

34. ప్రతియొక ప్రసార లైసెన్నుదారు, ప్రాధికార సంస్థచే నిర్ధిష్ట పరచబడినట్లుగా గ్రిడ్ ప్రమాణముల ననుసరించి ప్రసార లైన్ల కార్యవర్తన మరియు నిర్వహణలకు సంబంధించినట్టి సాంకేతిక ప్రమాణములను పాటించవలెను.

35. సముచిత కమీషను, ఎవరేని లై సెన్సుదారునిచే దరఖాస్తు పై మధ్యలోనున్న ప్రసార సౌకర్యముల స్వామిత్వమును కలిగియున్న లేక వాటిని నిర్వహించుచున్న ఎవలేని ఇతర లైసెన్సుదారుకు, సదరు లైసెన్సుదారు వద్ద లభ్యమగుచున్న మిగులు సామర్ధ్యము మేరకు అట్టి సౌకర్యములను వినియోగించుట కొరకు ఏర్పాట్లు చేయమని ఉత్తరువు ద్వారా కోరవచ్చును.

అయితే, లైసెన్సుదారు వద్ద లభ్యమగుచున్న మిగులు సామర్థ్యము ఎంతమేరకు ఉన్నదను. విషయమునకు సంబంధించిన ఏదేని వివాదము పై సముచిత కమీషనుచే అధి నిర్ణయించబడనలెను.

36.(1) ప్రతియొక లైసెన్సుదారు, 35వ పరిచ్ఛేదము క్రింద చేసిన ఉత్తరువుపై, పరస్పరం అంగీకారము కుదుర్చుకున్న రేట్లు, ఛార్జీలు మరియు నిబంధనలు మరియు షరతుల పై తన మధ్యలోనున్న ప్రసార సౌకర్యములను సమకూర్చవలెను.

అయితే, లైసెన్సుదారులలో వాటిపై పరస్పర అంగీకారము కుదరనిచో, సముచిత కమీషను, రేట్లు, ఛార్జీలు మరియు నిబంధనలు మరియు షరతులను నిర్దిష్ట పరచవచ్చును.

(2) ఉప-పరిచ్ఛేదము (1)లో నిర్దేశించిన రేట్లు, ఛార్జీలు మరియు నిబంధనలు మరియు షరతులు న్యాయముగాను, సముచితముగాను ఉండవలెను మరియు అట్టి సౌకర్యముల వినియోగమున కైన అనుపాతములో కేటాయించవచ్చును. ________________

విశదీకరణ:- పరిచ్ఛేదములు 35 మరియు 36 యొక్క ప్రయోజనముల నిమిత్తము "మధ్యలో నున్న ప్రసార సౌకర్యములు " అనగా ఇతర లైసెన్సువారు కొరకు మరియు అతడి తరఫున "అతడి అభ్యర్ధన పై మరియు టారిఫు లేక ఛార్జీ చెల్లింపుపై విద్యుచ్ఛక్తి ప్రసారము కొరకు వినియోగించదగినట్టి విద్యుత్ లైన్లు లైసెన్సుదారు. స్వామిత్వము కలిగియున్న లేక , నిర్వహించబడుచున్న విద్యుత్ లైన్లు అని అర్ధము.

37. సముచిత ప్రభుత్వము, సాఫీగాను మరియు స్థిరమైన ప్రసారము నిర్వహించుట కొరకు మరియు ఏదేని ప్రాంతము లేక రాజ్యమునకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయుటకు అవసరమైనట్టి చర్యలను తీసుకొనుటకు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రములకు లేక సందర్భానుసారముగా రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రములకు ఆదేశములను జారీచేయ వచ్చును.

38.(1) కేంద్ర ప్రభుత్వము, ఏదేని ప్రభుత్వ కంపెనీని కేంద్ర ప్రసార వినియోగముగా అధిసూచించవచ్చును.

అయితే, కేంద్ర ప్రసార వినియోగము, విద్యుచ్ఛక్తి ఉత్పాదన లేక విద్యుచ్ఛక్తి వర్తక కార్యకలాపములలో నిమగ్నం కారాదు.

అంతేకాక, సదరు కేంద్ర ప్రసార వినియోగమునకు సంబంధించిన ఏదేని ఆస్తి, ఆస్తిలో హితము, హక్కులు మరియు దాయిత్వములు మరియు విద్యుచ్ఛక్తి ప్రసారముతో ప్రమేయమున్న సిబ్బందిని, కంపెనీల చట్టము, 1956 క్రింద నిగమితమొనర్చబడునట్టి కంపెనీ లేక కం పెనీలకు భాగము 13 క్రింద నిర్దిష్ట పరచినట్టి రీతిలో అమలు చేయబడునట్టి బదిలీ పథకము ద్వారా ప్రసార లైసెన్సుదారుగా పనిచేయుటకు కేంద్ర ప్రభుత్వము బదిలీ చేయవచ్చును. మరియు వాటిలో నిహితము చేయవచ్చును. మరియు అట్టి కంపెనీ లేక కంపెనీలు ఈ చట్టము క్రింద ప్రసార లైసెన్సుదారులుగా భావించబడవలెను.

(2) (ఎ) అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థ ద్వారా విద్యుచ్ఛక్తి ప్రసారము చేపట్టుట;

(బి) (i) రాజ్య ప్రసార వినియోగములు:
(ii) కేంద్ర ప్రభుత్వము;
(iii) రాజ్య ప్రభుత్వములు; -
(iv) ఉత్పాదన కంపెనీలు,
(V) ప్రాంతీయ విద్యుత్ కమిటీలు
(vi) ప్రాధికార సంస్థ.
(vii) లైసెన్సుదారులు:
(viii) ఈ విషయమై కేంద్ర ప్రభుత్వముచే అధీసూచించబడునట్టి ఏవరేని ఇతర వ్యక్తితో ________________

అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థకు సంబంధించిన ప్రణాళిక మరియు సమన్వయము కొరకైన కృత్యములన్నియు నిర్వర్తించుట;

(సి) ఉత్పాదన స్టేషనుల నుండి లోడ్ కేంద్రములకు సాఫీగా విద్యుచ్ఛక్తి సరఫరా చేయుట కొరకు సమర్థవంతమైన సమస్వయముతో కూడిన మరియు మిత వ్యయమగు అంతర్ రాజ్య ప్రసార లైన్ల వ్యవస్థను అభివృద్ధి చేయుట;

(డి) (i) ప్రసార ఛార్జీల చెల్లింపు పై ఎవరేని లైసెన్సుదారు లేక ఉత్పాదన కంపెనీ; లేదా

(ii) కేంద్ర కమీషనుచే నిర్దిష్టపరచబడునట్టి విధముగా ప్రసార ఛార్జీలు మరియు వాటిపై సర్ ఛార్జీ చెల్లింపుపై 42వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్చేదము (2) క్రింద ఎవరేని వినియోగదారునికి రాజ్య కమీషనుచే అట్టి ప్రవేశసౌలభ్యము సమకూర్చబడినపుడు ఎపుడైనను,

తన ప్రసార వ్యవస్థను వినియోగించుట కొరకు విచక్షణా రహితమైన ప్రవేశ సౌలభ్యమును సమకూర్చుట ద్వారా,

కేంద్ర ప్రసార వినియోగము యొక్క కృత్యములై ఉండును.

అయితే, అట్టి సర్ ఛార్టీని ప్రస్తుత స్థాయి ఎదురు సబ్సిడీ అవసరములను భరించు నిమిత్తము వినియోగించవలెను.

అంతేకాక, అట్టి సర్ ఛార్జీ మరియు ఎదురు సబ్సిడీలను కేంద్ర కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో క్రమంగా తగ్గించవలెను.

అంతేకాక, సర్ ఛార్జి చెల్లింపు మరియు దానిని వినియోగించవలసిన రీతిని కూడా కేంద్ర కమీషను నిర్దిష్ట పరచవలెను.

అంతేకాక, తన స్వంత వినియోగ గమ్యస్థానమునకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేసికొనుటకు క్యాప్టివ్ ఉత్పాదన ప్లాంటును స్థాపించుకున్నట్టి వ్యక్తికి ప్రవేశసౌలభ్యము సమకూర్చబడిన సందర్భములో అట్టి సర్ ఛార్టీ విధించబడరాదు.

39.(1) రాజ్య ప్రభుత్వము. బోర్డును లేదా ప్రభుత్వ కం పెనీని రాజ్య ప్రసార వినియోగముగా అధిసూచించవచ్చును.

అయితే, రాజ్య ప్రసార వినియోగము విద్యుచ్ఛక్తి వర్తక కార్యకలాపములలో నిమగ్నం కారాదు. ________________

- 35 (35 అంతేకాక, సదరు రాజ్య ప్రసార వినియోగమునకు సంబంధించిన ఏదేని ఆస్తి, ఆస్తిలో హితము, హక్కులు మరియు దాయిత్వములు మరియు విద్యుచ్ఛక్తి ప్రసారముతో ప్రమేయమున్న సిబ్బందిని, కంపెనీల చట్టము, 1956 క్రింద నిగమితమొనర్చబడునట్టి కంపెనీ లేక కంపెనీ లకు భాగము 13 క్రింద నిర్దిష్టపరచబడినట్టి రీతిలో అమలు చేయబడునట్టి అంతరణ పథకము ద్వారా ప్రసార లైసెన్సుదారుగా పనిచేయుటకు రాజ్య ప్రభుత్వము అంతరణ చేయవచ్చును. మరియు వాటిలో నిహితము చేయవచ్చును. మరియు అట్టి కంపెనీ లేక కంపెనీలు ఈ చట్టము క్రింద ప్రసార లైసెన్సుదారులుగా భావించబడవలెను.

(2)(ఎ) రాజ్యాంతర్గత ప్రసార వ్యవస్థ ద్వారా విద్యుచ్ఛక్తి ప్రసారము చేపట్టుట;

(బి) (i) కేంద్ర ప్రసార వినియోగము:
(ii) రాజ్య ప్రభుత్వములు;
(iii) ఉత్పాదన కంపెనీలు;
(iv) ప్రాంతీయ విద్యుత్ కమిటీలు;
(V), ప్రాధికార సంస్థ,
(vi) లైసెన్సుదారులు;
(vii) ఈ విషయమై రాజ్య ప్రభుత్వముచే అధి సూచించబడునట్టి ఎవరేని ఇతర వ్యక్తితో

రాజ్యాంతర్గత ప్రసార వ్యవస్థకు సంబంధించిన ప్రణాళిక మరియు సమన్వయము కొరకైన కృత్యములన్నియు నిర్వర్తించుట.

(సి) ఉత్పాదన స్టేషనుల నుండి లోడ్ కేంద్రములకు సాఫీగా విద్యుచ్ఛక్తి సరఫరా చేయుట కొరకు సమర్థవంతమైన సమన్వయముతో కూడిన మరియు మిత వ్యయమగు రాజ్యాంతర్గత ప్రసార లైన్ల వ్యవస్థను అభివృద్ధిపరచుట:

డి. (i) - ప్రసార ఛార్జీల చెల్లింపుపై ఎవరేని లైసెన్సుదారు. లేక ఉత్పాదన కంపెనీ; లేదా

(ii) రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి విధముగా ప్రసార ఛార్జీలు మరియు వాటి పై సర్ ఛార్జీ చెల్లింపుపై 42వ పరిచ్ఛేదపు , ఉప పరిచ్చేదము (2) క్రింద ఎవరేని వినియోగదారునికి రాజ్య కమీషనుచే అట్టి ప్రవేశ సౌలభ్యము సమకూర్చబడినపుడు ఎపుడైనను,

తన ప్రసార వ్యవస్థను వినియోగించుట కొరకు విచక్షణారహితమైన ప్రవేశ సౌలభ్యమును సమకూర్చుట ద్వారా,

రాజ్య ప్రసార వినియోగము యొక్క కృత్యములై ఉండును. ________________ అయితే, అట్టి సర్ ఛార్జీని ప్రస్తుత స్థాయి ఎదురు. సబ్సిడీ అవసరములను భరించు నిమిత్తము వినియోగించవలెను:

అంతేకాక, అట్టి సర్ ఛార్జీ మరియు ఎదురు రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో సబ్సిడీలను క్రమంగా తగ్గించవలెను.

అంతేకాక, సర్ ఛార్జీ చెల్లింపు మరియు దానిని వినియోగించవలసిన రీతిని కూడా రాజ్య కమీషను నిర్దిష్ట పరచవలెను.

అంతేకాక, తన స్వంత , వినియోగ గమ్యస్థానమునకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేసికొనుటకు క్యాప్టివ్ ఉత్పాదన ప్లాంటును స్థాపించుకున్నట్టి వ్యక్తికి ప్రవేశ సౌలభ్యము సమకూర్చబడిన సందర్భములో అట్టి సర్ ఛార్జీ విధించబడరాదు.

40.(ఎ) సనుర్థవంతమైన, సమన్వయపరచిన మరియు మితవ్యయమగు అంతర్ రాజ్య ప్రసార వ్యవస్థ లేక సందర్భానుసారముగా రాజ్యములో ప్రసార వ్యవస్థను నిర్మించుట, నిర్వహించుట మరియు నడుపుట;

(బి) ప్రాంతీయ, లోడ్ డిస్పాచ్ కేంద్రము మరియు సందర్భానుసారముగా రాజ్య లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క ఆదేశములను పాటించుట;

(సి) తన ప్రసార వ్యవస్థను వినియోగించుట కొరకు విచక్షణారహితమైన ప్రవేశ సౌలభ్యమును సమకూర్చుట ద్వారా;

(i) ప్రసార ఛార్జీల చెల్లింపు పై ఎవరేని లైసెన్సుదారుడికి లేక ఉత్పాదన కం పెనీకి; లేక

(ii) రాజ్య కమీషనుచే నిర్ధిష్టపరచబడునట్టి విధముగా ప్రసార ఛార్జీలు మరియు వాటిపై సర్ ఛార్జీ చెల్లింపు పై 42వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (2) క్రింద ఎవరేని వినియోగదారునికి రాజ్య కమీషను చే అట్టి ప్రవేశ సౌలభ్యము సమకూర్చబడినపుడు ఎపుడైనను

ప్రసార లైసెన్సుదారు కర్తవ్యమై యుండును.

అయితే, అట్టి సర్ ఛార్జీని ప్రస్తుత స్థాయి ఎదురు సబ్సిడీ అవసరములను భరించు నిమిత్తము వినియోగించవలెను.

అంతేకాక, అట్టి సర్ ఛార్జీ మరియు ఎదురు సబ్సిడీలను సముచిత కమీషను చేత నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో క్రమంగా తగ్గించవలెను. ________________

374637 అంతేకాక, సర్ ఛార్టీ చెల్లింపు మరియు దానిని వినియోగించవలసిన రీతిని కూడా సముచిత కమీషను నిర్దిష్ట పరచవలెను.

అంతేకాక, తన స్వంత వినియోగ గమ్యస్థానమునకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేసికొనుటకు క్యాప్టివ్ ఉత్పాదన ప్లాంటును స్థాపించుకున్నట్టి వ్యక్తికి ప్రవేశ సౌలభ్యము సమకూర్చబడిన సందర్భములో అట్టి సర్-ఛార్జీ విధించబడరాదు.

41, ప్రసార లైసెన్సుదారు, సముచిత కమీషనుకు ముందు తెలియజేయుట ద్వారా తన ఆస్తుల అత్యంతానుకూలమైన వినియోగము కొరకు ఏదేని వ్యాపారములో నిమగ్నం కావచ్చును.

అయితే, అట్టి వ్యాపారము నుండి లభించిన రెవిన్యూ యొక్క అనుపాతం సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి విధముగా తమ ప్రసార మరియు వీలింగు ఛార్జీలను తగ్గించుటకు వినియోగించబడవలెను.

అంతేకాక, ప్రసార లైసెన్సుదారు, ప్రసార వ్యాపారము ఏదేని మార్గములో అట్టి వ్యాపారసంస్థకు ఆర్థిక సహాయము అందించుటగాని లేక ఏదేని మార్గములో అట్టి వ్యాపారమును పోషించుటకు తన ప్రసార ఆస్తుల పై భారము పడకుండ జాగ్రత్త వహించుటకు అట్టి ప్రతియొక వ్యాపారము కొరకై ప్రత్యేక లెక్కలు నిర్వహించవలెను.

అంతేకాక, ఏ ప్రసార లైసెన్సుదారుడు, ఏదేని కాంట్రాక్టును కుదుర్చుకొనరాదు లేక విద్యుచ్ఛక్తి వర్తక కార్యకలాపములలో ఇతర విధంగా నిమగ్నం కూడా కారాదు.

భాగము - 6

విద్యుచ్ఛక్తి పంపిణీ

పంపిణీ లైసెన్సుదారులకు సంబంధించిన నిబంధనలు

42. (1) తన సరఫరా ప్రాంతములో దానిని సమర్థవంతముగాను, సమన్వయముతోను మరియు మితవ్యయముతో పంపిణీ వ్యవస్థను అభివృద్ధి పరచుట మరియు నిర్వహించుట మరియు ఈ చట్టములో యున్నట్టి నిబంధనలననుసరించి విద్యుచ్ఛక్తి సరఫరా చేయుట పంపిణీ లైసెన్సుదారు కర్తవ్యమై ఉండును.

(2) రాజ్య కమీషను, దానిచే నియతము చేసిన తేదీకి ఒక సంవత్సరము లోపల నిర్దిష్టపరచబడునట్టి దశలలో మరియు (ఎదురు సబ్సిడీలు మరియు ఇతర నిర్వహణపరమైన నిరోధములతో సహా) అట్టి షరతులకు లోబడి ప్రవేశ సౌలభ్యమును ప్రవేశ పెట్టవలెను మరియు వరుసగావచ్చు దశలలో ప్రవేశ సౌలభ్యము యొక్క పరిధిని నిర్దిష్ట పరచుటలో ________________

38/G38 - మరియు వీలింగు ఛార్జీలను నిర్ధారించుటలో సదరు ఎదురు సబ్సిడీలు మరియు ఇతర నిర్వహణపరమైన నిరోధములతో సహా సంబంధిత అంశములన్నింటిని పరిగణనలోనికి తీసుకొనవలెను:

అయితే, అట్టి ప్రవేశ సౌలభ్యమును రాజ్య కమీషనుచే నిర్ధారించబడునట్టి వీలింగు ఛార్జీలకు అదనముగా సర్ ఛార్జీ చెల్లింపుపై అనుమతించ వలెను:

అంతేకాక, అట్టి సర్-ఛార్జిని, పంపిణీ లైసెన్సుదారు సరఫరా ప్రాంతము. లోపల ప్రస్తుత స్థాయి ఎదురు సబ్సిడీ అవసరములను భరించు నిమిత్తము వినియోగించవలెను.

అంతేకాక, అట్టి సర్-ఛార్జీ మరియు ఎదురు సబ్సిడీలను రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచ బడునట్టి రీతిలో కూడా క్రమముగా తగ్గించవలెను.

అంతేకాక, తన స్వంత వినియోగ గమ్యస్థానమునకు విద్యుచ్ఛక్తి సరఫరా చేసికొనుటకు క్యాప్టివ్ ఉత్పాదన ప్లాంటును స్థాపించుకున్నట్టి వ్యక్తికి ప్రవేశసౌలభ్యము సమకూర్చబడిన సందర్భములో అట్టి సర్ చార్టీ విధించబడరాదు.

అంతేకాక, విద్యుచ్ఛక్తి (సవరణ) చట్టము, 2003 ప్రారంభ తేదీ నుండి ఐదు సంవత్సరములకు తక్కువ కాకుండా వినియమముల ద్వారా ఏదేని సమయములో లభించిన గరిష్ట విద్యుచ్ఛక్తి ఒక మెగా వాట్ కు మించినపుడు, విద్యుచ్ఛక్తి అవసరమైనట్టి వినియోగదారులందరికి అట్టి ప్రవేశ సౌలభ్యమును రాజ్య కమీషను నిబంధించవలేను.

(3) ఏ వ్యక్తి యొక్క ఆవరణలు పంపిణీ లైసెన్సుదారు సరఫరా ప్రాంతములో ఉన్నాయో (నియత తేదీకి ముందు విద్యుచ్ఛక్తి పంపిణీ వ్యాపారములో నిమగ్నమైన స్థానిక ప్రాధికార సంస్థ కానట్టి) ఆ వ్యక్తికి ఉత్పాదన కంపెనీ లేక అట్టి పంపిణీ లైసెన్సుదారు కానట్టి ఎవరేని లైసెన్సుదారు నుండి విద్యుచ్ఛక్తి సరఫరా అవసరమైన యెడల, అట్టి వ్యక్తి, నోటీసు ద్వారా రాజ్య కమీషనుచే చేయబడిన వినియమముల ననుసరించి అట్టి విద్యుచ్ఛక్తి వీలింగు కొరకు పంపిణీ లైసెన్సుదారును కోరవచ్చును మరియు అట్టి సరఫరాకు సంబంధించి పంపిణీ లైసెన్సుదారుని కర్తవ్యములు, విచక్షణారహితమైన ప్రవేశ సౌలభ్యము సమకూర్చు సామన్య వాహక సంస్థ వలె ఉండవలెను.

(4) తమ సరఫరా ప్రాంతపు పంపిణీ లైసెన్సుదారు. కానట్టి, ఒకవ్యక్తి నుండి విద్యుచ్ఛక్తి సరఫరా పొందుటకు ఒక వినియోగదారుడికి లేదా వినియోగదారుల తరగతికి రాజ్య కమీషను అనుమతించునెడల, అట్టి వినియోగదారుడు, సరఫరా చేయుట కొరకైన అతడి బాధ్యత నుండి ఉత్పన్నమైనట్టి పంపిణీ లైసెన్సుదారుని నిర్ణీత ఖర్చును భరించుటకు రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి వీలింగు ఛార్జీల పై అదనపు సర్-ఛార్జిని చెల్లించుటకు ఆ పాత్రుడగును. ________________

391 G39... (5), ప్రతియొక పంపిణీ లైసెన్సుదారు, నియత తేదీ లేదా లైసెన్సు మంజూరైన తేదీ, ఇందులో ఏది ముందు జరుగునో అప్పటి నుండి ఆరుమాసముల లోపల రాజ్య కమీషను చే నిర్దిష్టపరచబడు నట్టి మార్గదర్శకములననుసరించి వినియోగదారుల వ్యధల నివారణ కొరకు వేదిక నొకదానిని స్థాపించవలెను.

(6) "ఉప-పరిచ్చేదము (5) క్రింద తన వ్యధల నివారణ లభించని కారణముగా వ్యధితుడైన ఎవరేని వినియోగదారుడు, రాజ్య కమీషనుచే నియమించబడి లేక హోదా కల్పించబడి అంబడ్స్ మన్ గా పిలువబడు ప్రాధికారికి తన వ్యధల నివారణ కొరకు విన్నపము చేసుకొనవచ్చును.

(7) అంబడ్స్ మన్, రాజ్య కమీషను చే నిర్దిష్ట పరచబడినట్టి సమయము లోపల మరియు అట్టి రీతిలో వినియోగదారుని వ్యధను పరిష్కరించవలెను.

(8) ఉష పరిచ్చేదము (5), (6) మరియు (7)లలో ఉన్న నిబంధనలు, ఆ ఉప పరిచ్ఛేదముల ద్వారా అతడికి ఒసగబడిన హక్కుతో పాటు విడిగా వినియోగదారుడు కలిగి ఉండునట్టి హక్కులకు భంగము కలుగకుండా ఉండవలెను.

43.(1) ఈ చట్టములో ఇతర విధంగా నిబంధిచిననే తప్ప, ప్రతియొక పంపిణీ లైసెన్సుదారు ఏవేని ఆవరణల స్వంతదారు లేదా ఆక్రమణదారుని దరఖాస్తు పై అట్టి, సరఫరాను కోరుతూ చేసిన దరఖాస్తును స్వీకరించిన తరువాత ఒక మాసము లోపల అట్టి ఆవరణములకు విద్యుచ్ఛక్తి సరఫరా చేయవలెను:

అయితే, అట్టి సరఫరాకు పంపిణీ, మేయిన్ల విస్తరణ లేక క్రొత్త సబ్ స్టేషన్ల ప్రారంభము చేయుట అవసరమైన యెడల, పంపిణీ లైసెన్సుదారు, అట్టి విస్తరణ లేదా ప్రారంభము చేసిన తరువాత లేక సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి కాలావధి లోపల అట్టి ఆవరణము లకు వెంటనే విద్యుచ్ఛక్తి సరఫరా చేయవలెను.

అంతేకాక, విద్యుచ్ఛక్తి సరఫరా కొరకు సదుపాయము ఏదియు లేని గ్రామము లేక పల్లె లేక ప్రాంతము విషయములో సముచిత కమీషను, అట్టి గ్రామము లేక పల్లె లేక ప్రాంతము విద్యుద్దీకరణ కొరకు అది అవసరమని భావించినచో సదరు. కాలావధిని పొడిగించ వచ్చును.

“విశదీకరణ: - ఈ ఉప-పరిచ్ఛేదము నిమిత్తము "దరఖాస్తు" అనగా అవసరమైన ఛార్జీల చెల్లింపును మరియు ఇతర అనువర్తనములను చూపు దస్తావేజులతో సహా పంపిణీ లైసెన్సుదారులకు అవసరమైనట్టి సముచిత ప్రరూపములో అన్ని విషయాలను తెలియజేస్తూ పూర్తి చేసిన దరఖాస్తు అని అర్ధము. " ________________

40/G4 (2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద నిర్దిష్ట పరచిన, ఆవరణములకు విద్యుత్ సరఫరా ఇచ్చుటకు అవసరమైనచో, విద్యుత్ ప్లాంటు లేక విద్యుత్ లైనును సమకూర్చుట ప్రతియొక పంపిణీ లైసెన్సుదారు కర్తవ్యమై ఉండును.

అయితే, ఏదేని ఆవరణమునకు ప్రత్యేక సరఫరాను కలిగియున్నట్టి ఏ వ్యక్తియు, సముచిత కమీషనుచే నిర్ధారించబడినట్టి ధరను లైసెన్సుదారుకు చెల్లించుటకు అంగీకరించిననే తప్ప, అతడు లైసెన్సుదారు నుండి విద్యుచ్ఛక్తి సరఫరాను డిమాండు చేయుటకు లేక విద్యుచ్ఛక్తి సరఫరాను పొందుటకు హక్కు కలిగి యుండడు.

(3) ఉప-పరిచ్చేదము (1)లో నిర్దిష్ట పరచిన కాలావధి లోపల పంపిణీ లైసెన్సుదారు విద్యుచ్ఛక్తి సరఫరా చేయుటలో వైఫల్యము చెందినచో, అతడు ప్రతియొక దినము యొక్క వ్యతిక్రమణ కొరకు ఒక వేయి రూపాయల దాకా ఉండగల శాస్త్రికి పాత్రుడగును.

44 43వ పరిచ్చేదములోనున్నదేదియు, తుఫాను, వరదలు, గాలివానలు లేక అతడి నియంత్రణలో లేని ఇతర సంఘటనల మూలముగా ఏవేని ఆవరణములకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయుటలో పంపిణీ లైసెన్సుదారుకు ఆటంకమేర్పడినచో, విద్యుచ్ఛక్తిని సరఫరా చేయని పంపిణీ లైసెన్సుదారును కోరునదిగా పరిగణించబడరాదు.

45.(1) ఈ పరిచ్చేదపు నిబంధలకు లోబడి, 43వ పరిచ్చేదమును పురస్కరించు కొని విద్యుచ్ఛక్తి సరఫరా కొరకు పంపిటీ లైసెన్నుదారుచే ప్రభారము చేయబడునట్టి ధరలు ఆయా సమయములందు నిర్ణయించినట్టి టారిఫులు మరియు అతడి లైసెన్సు షరతుల ననుసరించి ఉండవలెను.

(2) పంపిణీ లైసెన్సుదారుచే సరఫరా చేయబడిన విద్యుచ్ఛక్తి కొరకు ఛార్జీలు,

(ఎ) సంబంధిత రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి, పద్దతులు మరియు సూత్రములననుసరించి నిర్ణయించబడవలెను;

(బి) అట్టి ఛార్జీలు మరియు ధరలకు తగినంత ప్రచారము లభించునట్టి రీతిలో ప్రచురించవలెను.

(3) పంపిణీ లైసెన్సుదారుచే సరఫరా చేయబడిన విద్యుచ్ఛక్తి కొరకైన ఛార్జీలలో, -

(ఎ) వాస్తవముగా విద్యుచ్ఛక్తి సరఫరా చేయుటకైన ఛార్జీలకు అదనముగా నిర్ణీత ఛార్టీ

(బి) పంపిణీ లైసెన్సుదారుచే సమకూర్చబడిన ఏదేని విద్యుత్ మీటరు లేక విద్యుత్ ప్లాంటుకు సంబంధించిన అద్దె లేక ఇతర చార్జీలు. ________________

41641 (4) 62వ పరిచ్చేదపు నిబంధనలకు లోబడి, ఈ పరిచ్ఛేదము క్రింద ఛార్జీలను నిర్ణయించుటలో పంపిణీ లైసెన్సుదారు, ఎవరేని వ్యక్తి లేక ఏదేని తరగతికి చెందిన వ్యక్తులకు అనుచిత ప్రాధాన్యము లేక ఎవరేని వ్యక్తి లేక ఏదేని తరగతికి చెందిన వ్యక్తుల పట్ల విచక్షణ చూపరాదు.

(5) పంపిణీ లైసెన్సుదారుచే నిర్ణయించబడిన ఛార్జీలు. ఈ చట్టము యొక్క నిబంధనలు మరియు సంబంధిత రాజ్య కమీషనుచే ఈ విషయమై చేయబడిన వినియమములనను సరించి ఉండవలెను.

46. రాజ్య కమీషను, 43వ పరిచ్చేదమును పురస్కరించుకొని విద్యుచ్ఛక్తి సరఫరాను కోరుచున్నట్టి వ్యక్తి నుండి, పంపిణీ లైసెన్సుదారుడు వినియమముల ద్వారా అట్టి సరఫరా ఇచ్చుట కొరకు వినియోగించిన ఏదేని విద్యుత్ లైను లేక విద్యుత్ ప్లాంటును సమకూర్చుటకై భరించిన ఏవేని సముచితమైన ఖర్చులను రాబట్టుకోనుటకు ప్రాధికారమీయ వచ్చును.

47 (1) ఈ పరిచ్ఛేదపు నిబంధనలకు లోబడి, పంపిణీ లైసెన్సుదారు, 43వ పరిచ్ఛేదమును పురస్కరించుకొని విద్యుచ్ఛక్తి సరఫరాను కోరుచున్న ఎవరేని వ్యక్తిని

(ఎ) సదరు వ్యక్తికి సరఫరా చేసిన విద్యుచ్ఛక్తికి సంబంధించి; లేక

(బి) సదరు వ్యక్తికి విద్యుచ్ఛక్తి సరఫరా కొరకు ఏదేని విద్యుత్ లైను లేక విద్యుత్ ప్లాంటు లేక విద్యుత్ మీటరు సమకూర్చవలసి ఉన్న యెడల, అట్టి లైను లేక ప్లాంటు లేక మీటరు ఏర్పాటుకు సంబంధించి, పంపిణీ లైసెన్సుదారుకు బకాయి ఉన్న అన్ని పైకముల చెల్లింపు కొరకు వినియముల ద్వారా నిర్ధారించబడునట్టి విధముగా సముచిత సెక్యూరిటీని ఈయమని కోరవచ్చును.మరియు అట్టి సెక్యూరిటీని ఇచ్చుటలో సదరు వ్యక్తి వైఫల్యము చెందినచో, పంపిణీ లైసెన్సుదారు, సబబని భావించినచో, వైఫల్యము కొనసాగిన కాలవధిలో విద్యుచ్ఛక్తి సరఫరాను ఇచ్చుటకు లైను లేక ప్లాంటు లేక మీటరు సమకూర్చుటకు తిరస్కరించ వచ్చును.

(2) ఉప పరిచ్ఛేదము (1)లో పేర్కొనినట్లుగా ఎవరేని వ్యక్తి సెక్యూరిటీ ఈయని యెడల లేక ఎవరేని వ్యక్తిచే ఈయబడిన సెక్యూరిటీ చెల్లనిది. లేక సరిపోనిదైన యెడల, పంపిణీ లైసెన్సుదారు, నోటీసు ద్వారా ఆ వ్యక్తిని నోటీసును తామీలు చేసిన తరువాత ముప్పది దినముల లోపల, విద్యుచ్ఛక్తి సరఫరా లేక అట్టి లైను, లేక ప్లాంటు లేక మీటరు ఏర్పాటుకు సంబంధించి అతడికి బకాయి ఉన్న పైకములన్నియు చెల్లించుట కొరకు సముచితమైన సెక్యూరిటీని ఈయమని కోరవచ్చును. ________________

- 421:04. (3) ఉప-సరిచ్ఛేదము (2)లో నిర్దేశించిన వ్యక్తి అట్టి సెక్యూరిటీని ఇచ్చుటలో వైఫల్యము చెందినచో పంపిణీ లైసెన్సుదారు సబబని భావించినచో వైఫల్యము కొనసాగిన కాలావధిలో విద్యుచ్ఛక్తి సరఫరాను నిలిపివేయవచ్చును.

(4) పంపిణీ లైసెన్సుదారు. ఉప-పరిచ్ఛేదము (1)లో నిర్దేశించిన సెక్యూరిటీ పై బ్యాంకు రేటుకు సమానముగా లేక అంత కెక్కువ సంబంధిత రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడినట్లుగా వడ్డీని చెల్లించవలెను. మరియు అట్టి సెక్యూరిటీని ఇచ్చిన వ్యక్తి అభ్యర్ధనపై సదరు సెక్యూరిటీని వాపసు చేయవలెను.

(5) పంపిణీ లైసెన్సుదారు, సరఫరాను కోరుచున్న వ్యక్తి ముందు చెల్లింపు జరిగిన మీటరు ద్వారా సరఫరాను తీసుకొనుటకు సంసిద్ధుడైనచో, ఉప పరిచ్చేదము (1)లోని ఖండము (ఎ)ను పురస్కరించుకొని సెక్యూరిటీని కోరుటకు హక్కు కలిగి యుండడు.

48. పంపిణీ లైసెన్సుదారు, 43వ పరిచ్ఛేదమును పురస్కరించుకొని విద్యుచ్ఛక్తి సరఫరాను కోరుచున్న ఎవరేని వ్యక్తిని,-

(ఎ) 53న పరిచ్ఛేదము క్రింద చేసిన వినియమములను పంపిణీ లైసెన్సుధారు పాటించుటకు వీలు కల్పించు నిమిత్తము విధించిన ఏవేని నిర్బంధనలు;

(బి) విద్యుచ్ఛక్తి సరఫరా చేయబడిన వ్యక్తి యొక్క నిర్లక్ష్యం ఫలితంగా వాటిల్లిన విత్తీయ నష్టమునకు పంపిణీ లైసెన్సుదారు యొక్క ఏదేని దాయిత్వమును పరిమితము చేయుటకైన ఏవేని నిబంధనలు

అంగీకరించమని కోరవచ్చును.

49. 42వ పరిచ్చేదము క్రింద కొందరు వినియోగదారులకు సముచిత కమీషను ప్రవేశ సౌలభ్యము అనుమతించిన యెడల, సదరు వినియోగదారులు, 62వ పరిచ్చేదములోని ఉప పరిచ్చేదము (1) యొక్క ఖండము (డి)లో ఉన్న నిబంధనలలో ఏమి ఉన్నప్పటికిని,(టారిఫుతో సహా) వారు అంగీకారము కుదుర్చు కున్నట్టి నిబంధనలు మరియు షరతులపై విద్యుచ్ఛక్తి సరఫరా లేక కొనుగోలు కొరకు ఎవరేని వ్యక్తితో కరారును కుదుర్చుకొనవచ్చును.

50. రాజ్య కమీషను. విద్యుచ్ఛక్తి ఛార్జీల వసూలు, విద్యుచ్ఛక్తి ఛార్జీల బిల్లింగ్ కొరకు కాలావధులు, వాటిని చెల్లించని కారణంగా విద్యుచ్ఛక్తి సరఫరా నిలిపివేయుట, విద్యుచ్ఛక్తి సరఫరా పునరుద్ధరణ, విద్యుత్ ప్లాంటును లేక విద్యుత్ లైను లేక మీటరును అక్రమంగా మార్చుట, ఆపద లేక నష్టం కలిగించుట నుండి నివారించుటకు చర్యలు, పంపిణీ లైసెన్సుదారు లేక సరఫరాను నిలిపి వేయుట కొరకు మరియు మీటరును తొలగించుటకు ఈ విషయమై అతడి తరఫున పనిచేయుచున్న ఎవరేని వ్యక్తి నమోదు కొరకు, విద్యుత్ లైన్లు లేక విద్యుత్ ప్లాంట్లు లేక మీటరు మరియు అట్టి ఇతర విషయములకు సంబంధించి వేరొక ________________

దానిని తిరిగి ఉంచుట, మరమ్మతు చేయుట లేక నిర్వహించుటను నమోదు చేయుటకుగాను విద్యుచ్చక్తి సరఫరా కోడ్ నొకదానిని నిర్దిష్ట పరచవలెను.

51. పంపిణీ లైసెన్సుదారుడు, సముచిత కమీషనుకు ముందు తెలియజేయుట ద్వారా తన ఆస్తుల అత్యం తానుకూలమైన వినియోగము కొరకు ఏదేని ఇతర వ్యాపారములో వ్యాపారములు నిమగ్నం కావచ్చును.

అయితే, అట్టి వ్యాపారము నుండి లభించిన రెవిన్యూ యొక్క అనుపాతము సంబంధిత రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి విధముగా తమ వీలింగు ఛార్జీలను తగ్గించుటకు వినియోగించబడవ లేను.

అంతేకాక, పంపిణీ లైసెన్సుదారు పంపిణీ వ్యాపారము ఏదేని మార్గములో అట్టి వ్యాపార సంస్థకు విత్తీయ సహాయము అందించుటగాని లేక ఏదేని మార్గములో అట్టి వ్యాపారమును పోషించుటకు తన పంపిణీ ఆస్తులపై భారము పడకుండ జాగ్రత్త వహించుటకు అట్టి ప్రతియొక వ్యాపారము కొరకై ప్రత్యేక లెక్కలు నిర్వహించవలెను.

అంతేకాక, ఈ పరిచ్ఛేదములో నున్నదేదియు ఈ చట్టము యొక్క ప్రారంభమునకు పూర్వం విద్యుచ్ఛక్తి యొక్క పంపిణీ వ్యాపారములో నిమగ్నమైన స్థానిక ప్రాధికార సంస్థకు కూడా వర్తించరాదు.

విద్యుచ్ఛక్తి వర్తకులకు సంబంధించిన నిబంధనలు.


52(1) 12వ పరిచ్ఛేదము యొక్క ఖండము (సి)లో యున్నట్టి నిబంధనలకు ఈ భంగము కలుగకుండ, సముచిత కమీషను, విద్యుచ్ఛక్తి వర్తకుడిగా ఉండుటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానము, తగినంత మూలధన లభ్యత మరియు పరపతి యోగ్యతలను నిర్దిష్టపరచవలెను.

(2) ప్రతియొక విద్యుచ్ఛక్తి వర్తకుడు, సముచిత కమీషనుచే నిర్దిష్టపరచబడు నట్టి విధముగా విద్యుచ్ఛక్తి సరఫరా మరియు వర్తకమునకు సంబంధించినట్టి కర్తవ్యములను నిర్వర్తించవలెను.

సాధారణ సరఫరాకు సంబంధించిన నిబంధనలు

53. ప్రాధికార సంస్థ, రాజ్య ప్రభుత్వముతో సంప్రదించి,

(ఎ) (ఉత్పాదన, ప్రసారము లేక పంపిణీ లేక వర్తకములో నిమగ్నమైన వ్యక్తులతో సహా) విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము లేక పంపిణీ లేక వర్తకము నుండి ఉత్పన్న మైన అపాయములు లేక సరఫరా చేసిన విద్యుచ్ఛక్తి వినియోగము లేక ఏదేని విద్యుత్ లైను లేక ప్లాంటు ప్రతిష్టాపన నిర్వహణ లేక వినియోగము నుండి ప్రజలను సంరక్షించుటకు; ________________

(బి) ఎవరేని వ్యక్తికి వ్యక్తిగత హాని లేక ఎవరేని వ్యక్తి యొక్క ఆస్తికి నష్టము లేక అట్టి ఆస్తి వినియోగములో జోక్యమును తొలగించుట లేక నష్టపూచీలను తగ్గించుట;

(సి) నిర్దిష్ట పరచబడునట్టి ప్రమాణములకు అనుగుణమైన వ్యవస్థాపరమైన సాధనముల ద్వారా తప్ప విద్యుచ్ఛక్తి సరఫరా లేక ప్రసారమును నిషేధించుట;

(డి) విద్యుచ్ఛక్తి సరఫరా లేక ప్రసారములలోని ప్రమాదములు మరియు వైఫల్యములను నిర్దిష్ట పరచిన ప్రరూపములో సముచిత కమీషను మరియు విద్యుత్ ఇన్-స్పెక్టరుకు నోటీసు నిచ్చుట; -

(ఇ) విద్యుచ్ఛక్తి సరఫరా లేక ప్రసారమునకు సంబంధించిన పటములు, ప్రణాలికలు మరియు విభాగములను ఉత్పాదన కంపెనీ లేక లైసెన్సుదారు ఉంచుకొనుట;

(ఎఫ్) దానిచే ప్రాధికార మీయబడిన ఎవరేని వ్యక్తి లేక విద్యుత్ ఇన్-స్పెక్టరు లేక నిర్దిష్ట పరచిన ఫీజు చెల్లింపుపై ఎవరేని వ్యక్తిచే పటముల, ప్రణాళికలు మరియు విభాగముల తనిఖీ;

(జి) వ్యక్తిగత హాని లేక ఆస్తికి నష్టము లేక దాని వినియోగములో జోక్యమును తొలగించు లేక నష్ట పూచీలను తగ్గించు నిమిత్తము వినియోగదారుడి నియంత్రణ క్రింద ఏదేని విద్యుత్ లైను లేక విద్యుత్ ప్లాంటు లేక ఏదేని విద్యుత్ పరికరణమునకు సంబంధించి తీసుకొనవలసిన చర్యను నిర్దిష్ట పరచుట కొరకు

తగిన చర్యలను నిర్దిష్ట పరచవచ్చును.

54.(1) ఈ చట్టము క్రింద ఇతర విధముగా మినహాయించబడిననే తప్ప, కేంద్రప్రసార వినియోగము లేక రాజ్య ప్రసార వినియోగము లేక లైసెన్సుదారు కాని ఏ ఇతర వ్యక్తియు,

(ఎ) ఏదేని వీధిలో, లేక

(బి) ఏదేని స్థలములో,

(i) సాధారణముగా ఒక వంద లేక అంతకెక్కువ వ్యక్తులు సమావేశమగుటకు అవకాశము యున్నట్టి; లేక

(ii) ఫ్యాక్టరీల చట్టము, 1948 యొక్క అర్ధము లోపల ఫ్యాక్టరీ లేక గనుల చట్టము, 1952 యొక్క అర్థము లోపల గని యున్నట్టి; లేక

(iii) రాజ్య ప్రభుత్వము, సాధారణ లేక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఈ ఉప పరిచ్ఛేదపు నిబంధనలు వర్తించునని ప్రఖ్యానించునట్టి; ________________ 145/ 645. విద్యుచ్ఛక్తి ప్రసారము లేక వినియోగము ప్రారంభించుటకు పూర్వం, విద్యుచ్ఛక్తి, ప్రతిష్టాపన మరియు ప్లాంటు ఏవేని ఉన్నచో వాటి వివరములు, సరఫరా స్వభానము మరియు ప్రయోజనము మరియు ఈ చట్టములోని భాగము XVII యొక్క వర్తించదగునట్టి నిబంధనలు పొందుపరచుచూ లిఖిత పూర్వకముగా తమ ఉద్దేశమును తెలియజేయుచూ విద్యుత్ ఇన్-స్పెక్టరు మరియు జిల్లా మేజిస్ట్రేటు లేక సందర్భానుసారముగా పోలీసు కమీషనరుకు ఏడు దినముల కంటే తక్కువ కాని నోటీసును ఇవ్వకుండ,

రెండు వందల యాభై వాట్లు మరియు వంద వోల్టులకు మించని ప్రమాణములో విద్యుచ్ఛక్తి ప్రసారము లేక వినియోగము చేయరాదు: -

అయితే, ఈ పరిచ్ఛేదములో నున్నదేదియు, ప్రయాణీకులు, జంతువులు లేక సరుకుల సార్వజనిక వాహకము కోరకు లేదా రైల్వే చట్టము, 1989 యొక్క నిబంధనలకు లోబడి ఏదేని రైల్వే లేక ట్రామ్ వేల రోలింగ్ స్టాక్ యొక్క వెలుతురు లేక వాయు ప్రసరణము పై లేదా వాటి కొరకు ఉపయోగించెడి విద్యుచ్ఛక్తికి వర్తించదు.

(2) ఒక స్థలమునందు వంద లేక అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు సాధారణముగా సమావేశమగుటకు అవకాశమున్నను లేక లేకున్నను. ఆ విషయమునకు సంబంధించి ఏదేని వ్యత్యాసము లేక వివాదము ఏర్పడినచో, దానిని రాజ్య ప్రభుత్వమునకు నిర్దేశించవలెను. మరియు దానిపై రాజ్య ప్రభుత్వము చేయు నిర్ణయము అంతిమమై యుండును.

(3) ఈ పరిచ్చేదపు నిబంధనలకు ప్రభుత్వము కట్టుబడి యుండవలెను.

55.(1) ఏ లైసెన్సుదారు. ఈ విషయములలో ప్రాధికారిచే చేయబడు వినియమముల ననుసరించి సరియైన మీటరును అమర్చిననే తప్ప, నియతము చేసిన తేదీ నుండి రెండు ఈ సంవత్సరముల కాలావధి ముగిసిన పిమ్మట, విద్యుచ్ఛక్తిని సరఫరా చేయరాదు.

అయితే, వినియోగదారు మీటరు కొనుగోలు కై ఎంపిక చేసుకొన్ననే తప్పు, లైసెన్సుదారు మీటరు ధర కొరకు సెక్యూరిటీ ఇవ్వవలెనని వినియోగదారుని కోరవచ్చును మరియు దాని కిరాయి కొరకు కరారును చేసుకొనవచ్చును.

అంతేగాక, రాజ్య కమీషను, అధిసూచన ద్వారా ఆ అధి సూచనలో నిర్దిష్ట పరచబడు తరగతి లేక తరగతుల వ్యక్తుల కొరకు లేదా అట్టి ప్రాంతము కొరకు సదరు రెండు సంవత్సరముల కాలవాధిని విస్తరించవచ్చును.

(2) విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము మరియు పంపిణీ లేక వర్తకములో సరియైన లెక్కింపు మరియు ఆడిటింగు కొరకు, ప్రాధికార సంస్థ, విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము లేక పంపిణీ లేక వర్తకపు అట్టి దశలలో మరియు తాను సబబని భావించునట్టి ఉత్పాదన, ప్రసారము, లేక పంపిణీ లేక వర్తకపు స్థలములలో ఉత్పాదక కంపెనీ లేక లైసెన్సుదారు మీటర్లను అమర్చవలెనని ఆదేశించవచ్చును ________________

- 46/G46.. (3) ఈ పరిచ్చేదములోనున్న నిబంధనలు లేక ఉప పరిచ్చేదము (1) క్రింద చేసిన వినియమముల అమలులో ఏ వ్యక్తి అయినను, వైఫల్యము చెందినచో సముచిత కమీషను, వైఫల్యమునకు బాధ్యుడైన ఉత్పాదక కంపెనీ లేక లైసెన్సుదారు లేక కంపెనీ యొక్క ఎవరేని అధికారులు లేక ఇతర అసోసియేషను లేక ఎవరేని ఇతర వ్యక్తి తన వైఫల్యమును సరిదిద్దుకొనుటకు తాను సబబని భావించునట్టి ఉత్తర్వును చేయవచ్చును.

56.(1) ఎవరేని వ్యక్తి. అతనికి విద్యుచ్ఛక్తి సరఫరా, ప్రసారము లేక పంపిణీ లేక 'వీలింగ్ చేసిన దానికి సంబంధించి లైసెన్సుదారునికి లేక ఉత్పాదక కంపెనీకి అతడు బాకీపడిన ఏదేని విద్యుత్ ఛార్జీని లేక విద్యుత్ ఛార్జీ కానట్టి ఏదేని మొత్తమును చెల్లించుటకు ఉపేక్షించిన యెడల, లైసెన్సుదారు లేక ఉత్పాదక కంపెనీ అట్టి వ్యక్తికి పదునైదు దినములు తక్కువ కాకుండునట్టి వ్రాతపూర్వకమైన స్పష్టమైన నోటీసును ఇచ్చిన మీదట మరియు అట్టి ఛార్జీని లేక ఇతర మొత్తమును దావా ద్వారా తిరిగి రాబట్టుకొను అతని హక్కులకు భంగము పాటిల్లకుండా విద్యుచ్ఛక్తి సరఫరాను నిలిపి వేయ వచ్చును మరియు అట్టి లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ ద్వారా విద్యుచ్ఛక్తిని సరఫరా, ప్రసారము, పంపిణీ మరియు వీల్డ్ చేయు ఏదేని విద్యుచ్ఛక్తి సరఫరా లైను లేక ఇతర పనులు వాటి ఆస్తి అయినపుడు, ఈ ప్రయోజనము నిమిత్తము వాటిని తీసివేయ వచ్చును లేదా నిలిపివేయ వచ్చును. మరియు సరఫరాను తీసివేయుటకు మరియు తిరిగి ఇచ్చుటకు అట్టి ఛార్జీ లేక ఇతర మొత్తము అతని ద్వారా చేయబడిన ఏవేని ఖర్చులతో సహా చెల్లింపబడునంత వరకు సరఫరాను నిలిపివేయ వచ్చును. అంతేగాని, అటు పిమ్మట అయి ఉండరాదు.

అయితే, అతను మరియు లైసెన్సుదారు మధ్య ఏదేని వివాదము పరిష్కారమునకై పెండింగులో నున్నపుడు,

(ఎ) అతని నుండి క్లెయిము చేసిన మొత్తమునకు సమాన మొత్తమును; లేక

(బి) గడచిన ఆరు మాసముల సమయములో అతనిచే చెల్లింపబడిన విద్యుచ్ఛక్తి సగటు ఛార్జీ ఆధారముగా లెక్కించబడిన ప్రతి మాసమునకు అతని నుండి రావలసియుండు విద్యుచ్ఛక్తి ఛార్జీలు

వీటిలో ఏది తక్కువయినచో దానిని, అభ్యంతరము తెలియజేయుచూ అట్టి వ్యక్తి డిపాజిటు చేసినచో, విద్యుచ్ఛక్తి సరఫరాను నిలిపి వేయరాదు.

(2) తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో ఏమి ఉన్నప్పటికిని, ఈ పరిచ్ఛేదము క్రింద ఎవరేని వినియోగదారుని నుండి బాకీయున్న మొత్తమును, విద్యుచ్ఛక్తి సరఫరా ఛార్జీల బాకీగా వసూలు చేయదగునట్టి మొత్తము చూపబడుచున్ననే తప్పు, అట్టి మొత్తము మొదట అట్లు బాకీపడిన తేదీ నుండి రెండు సంవత్సరముల కాలావధి పిమ్మట వసూలు చేయరాదు మరియు లైసెన్సుదారు విద్యుచ్ఛక్తి సరఫరాను తీసివేయరాదు. ________________

47647

వినియోగదారు రక్షణ: నిర్వహణా ప్రమాణాలు.

57.(1) సముచిత కమీషను, లైసెన్సుదారులను మరియు ప్రభావితమునకు గురికాగల వ్యక్తులను సంప్రదించిన పిమ్మట, లైసెన్సుదారు. 'లేక లైసెన్సుదారుల తరగతి యొక్క నిర్వహణ ప్రమాణాలను నిర్దిష్ట పరచవచ్చును.

(2) ఉపపరిచ్చేదము (1)లో నిర్దిష్ట పరచిన ప్రమాణాలను సాధించుటలో లైసెన్సుదారు విఫలమైనచో, విధించబడు పెనాల్టీకి లేక ప్రారంభించబడు అభియోగము నకు భంగము వాటిల్లకుండా, అతడు సముచిత కమీషనుచే నిర్ధారించబడునట్లుగా ప్రభావితుడైన వ్యక్తికి నష్ట పరిహారమును చెల్లించుటకు పాత్రుడగును.

అయితే, నష్ట పరిహారమును నిర్ధారించుటకు పూర్వము, సంబంధిత లైసెన్సుదారు నకు ఆకర్ణింపబడుటకు తగిన అవకాశమును ఇవ్వవలెను.

(3) ఉప పరిచ్చేదము (2) క్రింద నిర్ధారించబడిన నష్ట పరిహారమును అట్టి నిర్ధారణకు తొంబది రోజుల లోపు సంబంధిత లైసెన్సుదారు చెల్లించవలెను.

58. సముచిత కమీషను, ఒక తరగతి లేక తరగతుల లైసెన్సుదారులకు 57వ పరిచ్చే దపు ఉప పరిచ్చేదము (1) క్రింద వివిధ ప్రమాణాలను నిర్దిష్ట పరచ వచ్చను.

59 (1) ప్రతి లైసెన్సుదారు, సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచిన కాలావధిలోపు, కమీషనుకు ఈ క్రింది సమాచారమును అందజేయవలెను; అదేదనగా:-

(ఎ) 57వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద సాధించిన నిర్వహణా స్థాయీలు;

(బి) 57వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద చేసిన నష్టపరిహారమునకు సంబంధించిన కేసుల సంఖ్య మరియు నష్ట పరిహారపు వెరసి మొత్తము.

(2) సముచిత కమీషను, ఉప-పరిచ్చేదము (1) క్రింద తనకు అందజేయబడినట్టి సమాచారపు ప్రచురణ కొరకు తాము సముచితమని భావించునట్టి ప్రరూపములోను, అట్టి రీతిలోను ప్రతి సంవత్సరము కనీసము ఒకసారి ఏర్పాటు చేయవలెను.

60. సముచిత కమీషను, ఒక లైసెన్సుదారునకు లేక ఉత్పాదక కంపెనీకి అట్టి లైసెన్సుదారు లేక ఉత్పాదక కంపెనీ ఏదేని కరారు చేసుకొన్నచో లేక తన ఆధిక్యత స్థానమును దురుపయోగము చేసినచో లేక విద్యుచ్ఛక్తి పరిశ్రమలో పోటీపై ప్రతికూల ప్రభావమునకు కారణము లేక కారణములు ఏర్పడగల సంయోగము ఉన్నచో, తాను సబబని భావించునట్టి ఆదేశములను జారీచేయవచ్చును. ________________

భాగము - 7

ధరల పట్టీ (టారిఫ్)

61. సముచిత కమీషను, ఈ చట్టపు నిబంధనలకు లోబడి, ధరల పట్టీ నిర్ధారణపై నిబంధనలను మరియు షరతులను నిర్దిష్ట పరచవలెను. మరియు అట్లు చేయుటలో ఈ క్రిందివి మార్గదర్శకములై ఉండవలెను, అవేవనగా:

(ఎ) ఉత్పాదక కంపెనీలకు మరియు ప్రసార లైసెన్సుదారులకు వర్తించు ధరల పట్టీ నిర్ధారణ కొరకు కేంద్ర కమీషను ద్వారా నిర్దిష్ట పరచబడిన సూత్రములను మరియు పద్ధతులను

(బి) విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము, పంపిణీ మరియు సరఫరాలను వాణిజ్య ప్రాతిపదికపై నిర్వహణ,

(సి) పోటీ సమర్ధత, వనరుల సద్వినియోగము, మంచి నిర్వహణ మరియు అభిలషణీయమైన పెట్టుబడులను ప్రోత్సహించు కారకములు:

(డి) వినియోగదారుల హితమును కాపాడుట మరియు అదే సమయములో తగురీతిలో విద్యుచ్ఛక్తి ధరను తిరిగి వసూలు చేయుట,

(ఇ) నిర్వహణలో సమర్ధతకు బహుమానమును అందించు సూత్రములు;

(ఎఫ్) బహుళార్ధ సంవత్సరముల టారిఫ్ సూత్రములు;

(జి) టారిఫ్ (ధరల పట్టీ) విద్యుచ్ఛక్తి సరఫరా ధరల క్రమాభివృద్ధిని సూచిస్తుంది మరియు సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచబడిన రీతిలో ఎదురు రాయితీలను కూడా తగ్గిస్తుంది.

(హెచ్) శక్తి నవీకరణ, వనరుల నుండి విద్యుచ్ఛక్తి సహా ఉత్పాదకత మరియు ఉత్పాదకతను పెంపొందించుటకు;

(2) జాతీయ విద్యుచ్ఛక్తి విధానము మరియు ధరల పట్టీ విధానము:

అయితే విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948, విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 మరియు నియమిత తేదీకి అవ్యవహిత పూర్వము గల అనుసూచిలో నిర్దిష్టపరచిన శాసనముల క్రింద టారిఫ్ సూచిని నిర్ధారించుట కొరకు గల నిబంధనలు మరియు షరతులు, ఒక సంవత్సర కాలావధి వరకు లేక ఈ పరిచ్ఛేదము క్రింద ధరల పట్టీ కొరకు నిబంధనలను మరియు షరతులు మరియు నిబంధనలను నిర్దిష్ట పరచునంత వరకు, వీటిలో ఏది ముందయినచో అంతవరకు వర్తించుట కొనసాగును. ________________

49/G49 62.(1) సముచిత కమీషను. ఈ చట్టము క్రింద, నిబంధనలననుసరించి ధరల పట్టీని నిర్ధారించవలెను,-

(ఎ) - పంపిణీ లైసెన్సుదారుకు . ఉత్పాదక కం పెనీ ద్వారా విద్యుచ్ఛక్తి: సరఫరా కొరకు:

అయితే, సముచిత కమీషను, విద్యుచ్ఛక్తి సరఫరాలో కొరత ఏర్పడినపుడు, విద్యుచ్ఛక్తి ధరలను హేతుబద్ధము చేయుటకు ఒక సంవత్సరమునకు మించని కాలావధి కొరకు ఉత్పాదక కంపెనీకి మరియు లైసెన్సుదారుకు మధ్య లేక లైసెన్సుదారుల మధ్య కరారును కుదుర్చు కొన్న కారణముగా విద్యుచ్ఛక్తి విక్రయము లేక కొనుగోలు కొరకు టారిఫ్ కి కనిష్ట లేక గరిష్ట పరిమితులను నిర్ధారించవచ్చును;

(బి) విద్యుచ్ఛక్తి ప్రసారము; (సి) విద్యుచ్ఛక్తి వినిమయము: (డి) విద్యుచ్ఛక్తి చిల్లర విక్రయము.

అయితే, ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ పంపిణీ లైసెన్సుదారులచే అదే ప్రాంతములో విద్యుచ్ఛక్తి పంపిణీ విషయములో, సముచిత కమీషను మనసులను పంపిణీ లైసెన్సుదారుల మధ్య పోటీని పెంపొందించుటకుగాను విద్యుచ్ఛక్తి చిల్లర విక్రయము కొరకు టారిఫ్ యొక్క గరిష్ట పరిమితిని మాత్రమే నిర్ణయించవచ్చును.

(2) సముచిత కమీషను, టారిఫ్ ని నిర్ధారించుట కొరకు ఉత్పాదక ప్రసారము మరియు పంపిణీ విషయములో నిర్దిష్ట పరచబడు వేర్వేరు వివరములను పంపవలసినదిగా ఒక లైసెన్సుదారుని లేక ఒక ఉత్పాదక కం పెనీని కోరవచ్చును.

(3) సముచిత కమీషను, ఈ చట్టము క్రింద టారిఫ్ నిర్ధారించునపుడు, విద్యుచ్ఛక్తి యొక్క వినియోగదారునకు అనుచిత ప్రాధాన్యతను చూపరాదు, కాని వినియోగాదారుని లోడు కారకముగా, విద్యుత్తు కారకముగా, వోల్టేజి, ఏదేని నిర్దిష్ట పరచిన కాలావధిలో విద్యుచ్ఛక్తి వినియోగపు మొత్తము లేక అవసరమైన సరఫరా సమయంలో లేక ఏదేని ప్రాంతపు భౌగోళిక స్థితిలో సరఫరా స్వభావము మరియు సరఫరా అవసరమగు కారణములను అనుసరించి వ్యత్యాసము చూపవచ్చను.

(4) టారిఫ్ లేక ఏదేని టారిఫ్ లోని భాగమును నిర్దిష్ట పరచబడు ఏదేని ఇంధన సర్ ఛార్జీ ఫార్ములా యొక్క షరతుల క్రింద అభివ్య క్తముగా అనుమతించబడిన ఏదేవి మార్పుల విషయములో మినహా ఏదేని విలీయ సంవత్సరములో ఒక్క సారికన్నా తరుచుగా ఎక్కువసార్లు సాధారణముగా సవరించరాదు. ________________ (5) కమీషను, అతను లేక దాని నుండి తిరిగి వసూలు చేయుటకు అనుమతించు టారిఫ్ మరియు ఛార్జీల నుండి ఆశించిన రాబడులను లెక్కించుట కొరకు నిర్దిష్ట పరచ బడునట్టి ప్రక్రియను పాటించవలెనని ఒక లైసెన్సుదారుని లేక ఒక ఉత్పాదక కంపెనీని కోరవచ్చును.

(6) ఈ పరిచ్ఛేదము క్రింద నిర్ధారించిన టారిఫ్ నకు మించిన ధరను లేక చార్జీని ఎవరేని ఒక లైసెన్సుదారు లేక ఒక ఉత్పాదక కంపెనీ వసూలు చేసినచో, ఆ అధిక మొత్తమును, లైసెన్సుదారు ద్వారా ఖర్చు చేయబడిన ఏదేని ఇతర దాయిత్వమును భంగము వాటిల్లకుండా బ్యాంకు రేటుకు సమానమైన వడ్డీతో సహా అట్టి ధర లేక ఛార్జీ చెల్లించిన వ్యక్తిచే వసూలు చేసుకోనబడదగియుండును.

63. 62వ పరిచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికిని సముచిత కమీషను, కేంద్ర ప్రభుత్వముచే జారీ చేయబడిన మార్గదర్శకములను అనుసరించి వేలంపాట యొక్క పారదర్శక ప్రక్రియ ద్వారా అట్టి టారిఫ్ నిర్ధారించబడినచో, ఆ టారిఫ్ ను అనుసరించవలెను.

64(1) 62వ పరిచ్చేదము క్రింద టారిఫ్ నిర్ధారణ కొరకైన దరఖాస్తును, ఒక ఉత్పాదిక కంపెనీ లేక లైసెన్సుదారు, వినియమములచే నిర్ధారించబడునట్టి రీతిలో మరియు అట్టి ఫీజు జతపరచుచు చేయవలెను.

(2) ప్రతి దరఖాస్తుదారు, సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి సంక్షిప్త ప్రరూపము మరియు రీతిలో దరఖాస్తును ప్రచురించవలెను.

(3) సముచిత కమీషను, ఉప పరిచ్చేదము (1) క్రింద దరఖాస్తు అందిన తేదీ నుండి నూట ఇరవై దినముల లోపు మరియు ప్రజల నుండి అందిన అన్ని సలహాలను మరియు ఆక్షేపణలను పర్యాలోచించిన పిమ్మట,

(ఎ) టారిఫ్ ఉత్తర్వులో నిర్దిష్టపరచబడు అట్టి మార్పులతో లేక అట్టి షరతులతో దరఖాస్తును స్వీకరిస్తూ టారిఫ్ ఉత్తర్వును జారీ చేయుట;

(బి) ఈ చట్టపు నిబంధనలు, దాని క్రింద చేసిన నియమములు మరియు వినియమములు లేక తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనపు నిబంధనలను అనుసరించకుండనట్టి దరఖాస్తును, వ్రాసియుంచి రికార్డు చేయబడు కారణములతొ దరఖాస్తును తిరస్కరించుట:

అయితే, దరఖాస్తుదారునకు, అతని దరఖాస్తును తిరస్కరించుటకు పూర్వము ఆకర్ణింపబడుటకు తగిన అవకాశమును ఇవ్వవలెను.

(4) సముచిత కమీషను, ఉత్తర్వును చేసిన ఏడు దినముల లోపు సముచిత ప్రభుత్వమునకు, ప్రాధికారికి మరియు సంబంధిత లైసెన్సుదారుకు మరియు సంబంధిత వ్యక్తికి ఉత్తర్వు ప్రతినొకదానిని పంపవలెను. ________________

- 51/G51 (5) 10వ భాగములో ఏమి ఉన్నప్పటికిని, అట్టి సరఫరా, ప్రసారము లేక వీలింగును చేపట్టుటకు ఉద్దేశించు పక్షకారులు, తనకు దరఖాస్తు చేసికొనిన మీదట రెండు రాజ్యములలోని రాజ్య క్షేత్రముల ప్రమేయముతో, సందర్భానుసారము ఏదేని అంతర్ రాజ్య విద్యుచ్ఛక్తి సరఫరా ప్రసారము లేక వీలింగు కొరకు టారిఫ్ ను, విద్యుచ్ఛక్తి పంపిణికై ఉద్దేశించు "లైసెన్సుదారుల " విషయములో అధికారితా పరిధి కలిగిన రాజ్య కమీషనుచే ఈ పరిచ్చేదము క్రింద నిర్ధారించబడవలెను. మరియు వాటి కొరకు చెల్లింపు చేయవలెను.

(6) టారిఫ్ ఉత్తర్వు సవరించిన లేక ప్రతిసంహరించిననే తప్ప, టారిఫ్ ఉత్తర్వులో నిర్దిష్ట పరచబడు అట్టి కాలావధి వరకు అమలులో నుండుట కొనసాగును.

65. 62వ పరిచ్చేదము క్రింద రాజ్య కమీషనుచే నిర్ధారించబడిన టారిఫ్ లో ఎవరేని వినియోగదారునికి లేక వినియోగదారుల తరగతికై ఏదేని రాయితీ అనుదానము రాజ్య ప్రభుత్వమునకు అవసరమైనచో, రాజ్య ప్రభుత్వము, 108వ పరిచ్ఛేదము క్రింద ఇవ్వబడు ఏదేని ఆదేశములు ఏమి ఉన్నప్పటికిని, రాజ్య ప్రభుత్వము ద్వారా రాయితీ అనుదానమును అమలుపరచుటకు, లైసెన్సు కొరకు షరతుగాను లేక ఎవరేని ఇతర సంబంధిత వ్యక్తిగా రాజ్య కమీషను ఆదేశించు రీతిలో రాయితీ అనుదానము ద్వారా చెల్లింపుకు గురియగు వ్యక్తికి నష్ట పరిహారపు మొత్తమును అడ్వాన్సుగా మరియు నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో చెల్లించవలెను.

అయితే, రాజ్య ప్రభుత్వపు అట్టి ఆదేశమేదియు ఈ పరిచ్ఛేదములో ఉన్న నిబంధనల ననుసరించకుండా చేసిన చెల్లింపు అయినచో అమలులోనికి రాదు. మరియు రాజ్య కమీషను నిర్ణయించిన టారీఫ్ ఈ విషయములో కమీషనుచే జారీ చేయబడిన ఉత్తర్వుల తేదీ నుండి వర్తించును.

66. సముచిత కమీషను, నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో (వర్తకముతో సహా) విద్యుత్ మార్కెటు యొక్క అభివృద్ధిని పెంపొందించుటకు కృషి చేయవలెను మరియు ఈ విషయములో 3వ పరిచ్ఛేదములో నిర్దేశించిన జాతీయ విద్యుచ్ఛక్తి విధానము మార్గదర్శకముగా నుండవలెను.

భాగము - 8

పనులు

లైసెన్సుదారుల పనులు

67 (1) ఒక లైసెన్సుదారు, ఆయాసమయములందు, అయితే అతని లైసెన్సు యొక్క నిబంధనలకు మరియు షరతులకు లోబడి, అతని యొక్క సరఫరా లేక ప్రసార ప్రాంతము లోపల లేక అతని లైసెన్సు నిబంధనల ద్వారా అమమతించబడినపుడు, సరఫరా ప్రాంతము వెలుపల విద్యుచ్చకి సరఫరా లైన్లను నిర్మించవచ్చును లేక ఉంచవచ్చును. మరియు అట్టి పనులను ప్రాంతము వెలుపల కొనసాగించవచ్చును. అవేవనగా, ________________ 22/- 652 . (ఎ) ఏదేని వీధి, రైల్వే లేక ట్రామ్ వే యొక్క భూభాగము మరియు కాలిబాటను త్రవ్వుట మరియు పగులగొట్టుట.

(బి) ఏదేని వీధి, రైల్వే లేక ట్రామ్ వేలలో లేక దాని క్రింద గల ఏదేని మురుగు నీటి కాలువ, డ్రెయిను లేక సొరంగములను త్రవ్వుట మరియు పగులగొట్టుట

(సి) ప్రధాన మురుగు నీటి పైపు కానట్టి ఏదేని లైను లేక పనులు లేక పైపుల స్థితిని మార్చుట

(డి) విద్యుత్ లైనులు, విద్యుత్ ప్లాంటు మరియు ఇతర పనులను చేయుట మరియు ఉంచుట: -

(ఇ) వాటిని మరమ్మత్తు చేయుట, మార్చుట లేక తొలగించుట;

(ఎఫ్) విద్యుచ్ఛక్తి ప్రసారము మరియు సరఫరా కొరకు అవసరమైన అన్ని ఇతర చర్యలను చేపట్టుట.

(2) సముచిత ప్రభుత్వము, ఈ విషయములో తనచే చేయబడిన నియమములను అనుసరించి, ఈ క్రింది వాటిని నిర్దిష్ట పరచవలెను.

(ఎ) పనులను కొనసాగించుటకుగాను అవసరమైన సముచిత ప్రభుత్వము, స్థానిక ప్రాధికారి, సందర్భానుసారము యజమాని లేక ఆక్రమణదారు యొక్క వ్రాతపూర్వక అంగీకారము కలిగిన సందర్భములను మరియు పరిస్థితులను;

(బి) పనులను కొనసాగించుటను యజమాని లేక ఆక్రమణదారు ఆక్షేపించు పరిస్థితులలో ఆనుమతిని మంజూరు చేయు ప్రాధికారి;

(సి) పనులను కొనసాగించుటకు పూర్వము లైసెన్సుదారుచే ఇవ్వబడు నోటీసు యొక్క స్వభావము మరియు కాలావధి:

(డి) ఖండము (సీ)లో నిర్దేశించబడిన నోటీసు ననుసరించి అందిన ఆక్షేపణలను మరియు సలహాలను పర్యాలోచించు ప్రక్రియ మరియు రీతి;

(ఇ) ఈ పరిచ్ఛేదము క్రింది పనుల వలన బాధితులైన వ్యక్తులకు నష్టపరిహారమును లేక అద్దెను నిర్ధారించుట మరియు చెల్లించుట;

(ఎఫ్) అత్యవసర పరిస్థితి ఉన్నపుడు కొనసాగించబడు మరమ్మత్తులు మరియు పనులు:

(జి) ఈ పరిచ్ఛేదము క్రింద కొన్ని పనులు కొనసాగించుటకు యజమాని, లేక ఆక్రమణదారు యొక్క హక్కు మరియు దాని కొరకు చేసిన ఖర్చుల చెల్లింపు:

(హెచ్) మురుగు నీటి కాలువలు, పైపులు లేక ఇతర విద్యుత్తు లైన్లు లేక పనుల దగ్గర ఇతర పసులను కొనసాగించుటకైన ప్రక్రియ

(ఐ) పైపులు, విద్యుత్తు లైన్లు, విద్యుత్తు ప్లాంటు, టెలిగ్రాఫు లైన్లు, మురుగునీటి లైన్లు, సొరంగాలు, డ్రైయిన్లు మొదలగువాటి స్థితిని మార్చుట కొరకైన ప్రక్రియ; ________________ (జె) వీధులు, రైల్వేలు, ట్రామ్ వేలు, మురుగు నీటి కాలువలు, డ్రైయిన్లు, సొరంగాల పనులకు సంబంధించి కంచెవేయుట, సంరక్షణకు, లైటింగు మరియు ఇతర సురక్షిత చర్యలకైన ప్రక్రియ మరియు వాటి తక్షణ పునరుద్దరణ;

(కె) పబ్లిక్ న్యూ సెన్స్, పరిసరాల చెరుపు మరియు అట్టి పనుల వలన పబ్లికు మరియు ప్రైవేటు ఆస్తులకు అనవసరమైన నష్టములను కలిగించుట మానుకొనవలెను.

(ఎల్) సముచిత ప్రభుత్వము, లైసెన్సుదారు లేక స్థానిక ప్రాధికార సంస్థ చే మరమ్మత్తు చేయలేని పనులను చేపట్టుట కైన ప్రక్రియ:

(ఎమ్) ఏవేని రైల్వే, ట్రామ్ వేలు, జలమార్గములు మొదలగువాటి పునరుద్ధరణ కొరకు అవసరమగు మొత్తములను డిపాజిటు చేయు రీతి;

(ఎన్) అట్టి పనుల ద్వారా ప్రభావితమైన ఆస్తిని పునరుద్ధరించు రీతి మరియు దాని నిర్వహణ,

(ఒ) లైసెన్సుదారుచే చెల్లించవలసియుండు నష్ట పరిహారమును డిపాజిటు చేయు ప్రక్రియ మరియు సెక్యూరిటీని ఇచ్చుట; మరియు

(పి) ఈ పరిచ్ఛేదము క్రింద పనుల యొక్క నిర్మాణమునకు మరియు నిర్వహణకు ఆనుషంగీకమైన లేక పారిణామికమైనట్టి ఇతర విషయములు.

(3) లైసెన్సుదారు, ఈ పరిచ్చేదము ద్వారా లేక దాని క్రింద మరియు వాటి క్రింద చేసిన నియమముల ద్వారా ఒసగబడిన ఏవేని అధికారములను వినియోగించుచు, వీలైనంత తక్కువ చెరుపును, నష్టమును మరియు అసౌకర్యమును కలిగించవలెను. మరియు అతని ద్వారా లేక అతనిచే నియమింపబడిన ఎవరేని ద్వారా జరిగిన ఏదేని చెరుపు, నష్టము, లేక అసౌకర్యమునకుగాని పూర్తి నష్టపరిహారమును చెల్లించవలెను.

(4) (ఉప-పరిచ్ఛేదము (3) క్రింది నష్టపరిహారపు మొత్తముతో సహా) ఏదేని వ్యత్యాసము లేక వివాదము ఈ క్రింది పరిచ్చేదము క్రింద ఏర్పడినచో, ఈ విషయమును సముచిత కమీషను ద్వారా నిర్ధారించబడవలెను.

(5), సముచిత కమీషను, ఉప-పరిచ్ఛేదము (3) క్రింద ఏదేని నష్టపరిహారము నకు అదనముగా ఈ పరిచ్ఛేదము క్రింద ఏర్పడిన ఏదేని వ్యత్యాసము లేదా వివాదమును నిర్ధారించునపుడు, ఆ ఉప-పరిచ్ఛేదము క్రింద చెల్లించవలసిన నష్టపరిహారపు మొత్తమునకు మించనట్టి పెనాల్టీని విధించవచ్చును. ________________

- 54 654.

ఉపరితల మార్గములకు సంబంధించి నిబంధనలు

68.(1) ఉపరితల మార్గము, సముచిత ప్రభుత్వ పూర్వానుమతితో, ఉpa-పరిచ్చేదము (2) నిబంధనల ప్రకారము భూమి పై ఎత్తులో ఉండునట్లు అమర్చునట్లు లేక అమర్చబడు నట్లు చూడవలెను.

2 (2) ఉప-పరిచ్చేదము (1)లో నిబంధనలేవియు,-

(ఎ) 11 కిలో వోల్టులకు మించనట్టి నామమాత్రపు వోల్టేజి గల విద్యుత్తు లైను మరియు ఒకే వినియోగదారుని సరఫరా కొరకు వినియోగించెడు. లేక వినియోగమునకు ఉద్దేశింపబడు విషయములో,

(బి) దానిని ప్రతిష్టాపించుట కొరకు బాధ్యుడగు వ్యక్తి యొక్క ఆక్రమణ లేక నియంత్రణలో నున్న స్థలము యందున్న లేక ఉండెడు ఒక విద్యుత్ లైను అంతటికి సంబంధించి; లేక

(సీ) విహితపరచబడునట్టి ఇతర సందర్భములకు

వర్తించదు.

(3) సముచిత ప్రభుత్వము, ఉప పరిచ్ఛేదము (1)క్రింద అనుమతిని మంజూరు చేయునపుడు, లైను యొక్క యాజమాన్యము మరియు నిర్వహణ షరతులతో సహా), తనకు అవసరమని తోచునట్టి షరతులను విధించవలెను.

(4) సముచిత ప్రభుత్వము, తనచే మంజూరు చేయబడిన అనుమతిలో నియతమైనట్టి కాలావధి ముగింపు పిమ్మట ఏదేని సమయములో అనుమతిని మార్చవచ్చును లేక ప్రతిసంహరించవచ్చును.

(5) సముచిత ప్రభుత్వము చే నిర్దిష్టపరచబడిన ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు లేక ప్రాధికారి "విద్యుచ్ఛక్తిని పంపు లేక ప్రసారము చేయు లేక ఏవేని పనులను చేయుటకు వీలుకలిగించుటలో జోక్యము చేసికొనినను లేక ఆటంకపరచినను లేక జోక్యము చేసికొనుటకు లేక ఆటంకపరచుటకు అవకాశమున్నచో లైనును వేసిన పిమ్మట ఉపరితల మార్గము దగ్గర వేసిన లేక పడి ఉన్న ఏదేని చెట్టు లేక వేయబడి ఉపరితలమార్గము దగ్గర నిలబడియున్న ఏదేని నిర్మాణము లేక ఇతర వస్తు విషయము ఉన్నచో, లైసెన్సుదారు దరఖాస్తు చేసికొనిన మీదట, అతను లేక తాను సబబని భావించినచో చెట్టును, నిర్మాణమును లేక వస్తువిషయ మును తొలగించవచ్చును లేక ఇతర విధముగా వ్యవహరించవచ్చను. ________________

551 G35 (6) ఉప పరిచ్ఛేదము (5), క్రింది దరఖాస్తును పరిష్కరించునపుడు, ఆ ఉప-పరిచ్చేదము క్రింద, నిర్దిష్ట పరచిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు లేక ప్రాధికారి, ఉపరితల మార్గమును వేయుటకు పూర్వము. ఉన్నటువంటి ఏదేని చెట్టు విషయములో, ఆ చెట్టుపై హితము కలిగిన వ్యక్తికి తాను సబబని భావించునట్టి నష్టపరిహారమును అధినిర్ణయించ వచ్చును మరియు అట్టి వ్యక్తి లైసెన్సుదారుని వద్ద నుండి దానిని రాబట్టుకొనవచ్చును.

విశదీకరణ: - ఈ పరిచ్ఛేదము నిమిత్తము, “చెట్టు" అను పదబంధములో ఏదేని. పోద, కంచె, అడవి పెరుగుదల లేక ఇతర మొక్కలు చేరియుండును.

69.(1) ఒక లైసెన్సుదారు, సర్వీసు లైన్లు లేక విద్యుచ్ఛక్తి లైన్లు లేక విద్యుచ్ఛక్తి ప్లాంటు కానట్టి ఏదేని టెలిగ్రాఫు లైను, విద్యుచ్ఛక్తి లైను, విద్యుచ్ఛక్తి ప్లాంటు లేక ఇతర పనులను పదిమీటర్ల లోపల నిర్మించుట లేక ఉంచుటకు పూర్వము, పనుల యొక్క స్వభావము లేక స్థితిని మార్చకుండ మరమ్మత్తు, నవీకరణ మరియు సవరణ కొరకు, -

(ఎ) కేంద్ర ప్రభుత్వముచే పదాభిదానము చేయబడు ఒక ప్రాధికారికి నూతన ప్రతిష్టాపన విషయములో ప్రతిపాదనను పంపవలెను. మరియు అట్టి ప్రాధికారి ముప్పది దినముల లోపు ఆ ప్రతిపాదన పై నిర్ణయమును తీసుకొనవలెను;

(బి) ఈ క్రింది వాటిని నిర్దిష్ట పరుస్తూ, ప్రస్తుతము ఉన్న పనుల మరమ్మత్తు, నవీకరణ లేక సవరణ విషయములో టెలిగ్రాఫు ప్రాధికారికి పది దినములకు తక్కువ కానట్టి వ్రాత పూర్వక నోటీసును ఇవ్వవలెను,-

(i) పనుల యొక్క తీరు లేక ప్రతిపాదిత మార్పులు,

(ii) పనులను వినియోగించుకొను రీతి;

(iii) మొత్తము మరియు విద్యుచ్ఛక్తి ప్రసారము చేయబడు స్వభావము;

(iv) భూమి పై రాబడి (ఏదేని ఉన్నచో) దానిని ఏ మేరకు వినియోగించవలెనో మరియు దాని రీతి;

మరియు లైసెన్సుదారు, అట్టి పనులు లేక మార్పుల ద్వారా ఏదేని టెలిగ్రాఫు లైను తీవ్రముగా హానికి గురియగుట నుండి కాపాడుట కొరకు ఆ కాలావధిలో టెలిగ్రాఫు ప్రాధికార సంస్థ ద్వారా సాధారణముగాగాని లేక ప్రత్యేకముగాగాని చేయబడు అట్టి యుక్తమైన అవసరాలకు అనుగుణముగా నుండవలెను.

అయితే, ఏదేని విద్యుచ్ఛక్తి లైన్లు లేక విద్యుచ్ఛక్తి ప్లాంటు లేక లైసెన్సుదారు యొక్క ఇతర పనులలో లోపాలకు సంబంధించి అత్యవసర పరిస్థితుల (టెలిగ్రాఫు ప్రాధికార సంస్థలకు వ్రాతపూర్వకముగా లైసెన్సుదారుచే పేర్కొనబడిన) విషయములలో, లైసెన్సు దారు. ప్రతిపాధిత కొత్త పనులు లేక మార్పుల కొరకు ఏర్పడిన అవసరముల పిమ్మట సాధ్యమైనంత మేరకు అట్టి నోటీసును మాత్రమే ఇవ్వవలసి యుండును. ________________ - 56/G56 (2) ఏదేని సర్వీసు లైను నిర్మించు లేక ఉంచు పనులను అమలు చేయునప్పుడు, లైసెన్సుదారు, పనుల ప్రారంభమునకు పూర్వము నలుబది ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా 'అట్టి పనుల నిర్వహణకు అతని ఉద్దేశమును వ్రాతపూర్వకముగా ఒక నోటీసును టెలిగ్రాఫు ప్రాధికార సంస్థకు పంపవలెను.

భాగము - 9

కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ.

ప్రాధికార సంస్థ యొక్క సంఘటన మరియు కృత్యములు.

70.(1) ఈ చట్టము క్రింద తనకు అప్పగించబడినట్టి కృత్యములను నిర్వర్తించుటకు మరియు అట్టి విధులను నిర్వహించుటకు, కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థగా పిలువబడు ఒక నికాయము నుండవలెను.

(2) విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948 యొక్క 3వ పరిచ్ఛేదము క్రింద స్థాపించబడి, నియతము చేసినట్టి తేదీకి అవ్యవహిత పూర్వము పనిచేయుచున్న కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ, ఈ చట్టపు ప్రయోజనాల నిమిత్తము కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ అయి ఉండవలేను మరియు చైర్ పర్సన్, సభ్యులు, కార్యదర్శి మరియు దాని యొక్క ఇతర అధికారులు మరియు ఉద్యోగులు, ఈ చట్టము క్రింద నియమించబడి నట్లుగా భావించబడవలెను మరియు విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948 క్రింద నియమించబడిన వారు అవే నిబంధనలు మరియు షరతుల పై పదవియందు కొనసాగ వలెను.

(3) ప్రాధికార సంస్థ చైర్ పర్సన్ తోసహా పదునాలుగు మంది సభ్యులకు మించ కుండా ఉండవలెను, వారిలో ఎనిమిది మందికి తక్కువ కాకుండా కేంద్ర ప్రభుత్వము ద్వారా నియమించబడు పూర్తికాలిక సభ్యులుగా ఉండవలెను.

(4) కేంద్ర ప్రభుత్వము, ప్రాధికార సంస్థ యొక్క సభ్యుడుగా నియమించబడు టకు అర్హతగల ఎవరేని వ్యక్తిని, ప్రాధికార సంస్థ చైర్ పర్సన్ గా నియమించవచ్చును. లేక పూర్తికాలిక సభ్యులలో ఒకరిని ప్రాధికార సంస్థ చైర్ పర్సన్ గా పదాభిదానము చేయవచ్చును.

(5) ప్రాధికార సంస్థ సభ్యులను, ఇంజనీరింగు, విత్తీయ, వాణిజ్య, విత్తీయ లేక పారిశ్రామిక విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ, పరిజ్ఞానమును కలిగియుండి, చాలినంత అనుభవము మరియు హోదా కలిగి, సామర్ధ్యము, సమగ్రత, స్థాయి కలిగిన వ్యక్తుల నుండి నియమించబడవలెను. మరియు కనీసము ఒక సభ్యుడిని ఈ క్రింది తరగతులలో నుండి ఒక్కొక్కరిని నియమించవలెను. ________________ 57/457 (ఎ) ఉత్పాదన స్టేషన్ల యొక్క డిజైను, నిర్మాణము, నడిపించుట మరియు నిర్వహించుటలో ప్రత్యేక నైపుణ్యత కలిగిన ఇంజనీరు:

(బి) విద్యుచ్ఛక్తి యొక్క ప్రసారము మరియు సరఫరాలో ప్రత్యేక నైపుణ్యతను కలిగిన ఇంజనీరింగు;

(సి) విద్యుచ్ఛక్తి రంగములో అనువర్తిత పరిశోధన:

(డి) అనువర్తిత అర్ధశాస్త్రము, అకౌంటింగు, వాణిజ్య శాస్త్రము మరియు విత్తీయ శాస్త్రము.

(6) ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సన్ మరియు ఇతర సభ్యులందరు. కేంద్ర ప్రభుత్వ అభీష్టము మేరకు పదవి యందు కొనసాగవలెను.

(7) చైర్ పర్సన్, ప్రాధికార సంస్థ యొక్క ప్రధాన కార్యనిర్వాహకుడై ఉండవలెను.

(8) ప్రాధికార సంస్థ యొక్క ప్రధాన కార్యాలయము ఢిల్లీలో ఉండవలెను.

(9) ప్రాధికార సంస్థ, చైర్ పర్సన్ ఆదేశించునట్టి సమయములో ప్రధాన కార్యాలయము లేక ఏదేని ఇతర స్థలములో సమావేశము కావలేను మరియు ఆ సంస్థ నిర్దిష్ట పరచు (తన సమావేశములందు ఉండవలసిన కోరంతోసహా) తన సమావేశములలో వ్యాపార కార్యకలాపములు విషయములో అట్టి ప్రక్రియా నియమావళిని పాటించవలెను.

(10) చైర్ పర్సన్ లేక అతను ప్రాధికార సంస్థ యొక్క సమావేశమునకు హాజరు కాలేనపుడు, ఈ విషయములో చైర్ పర్సన్ ద్వారా నామనిర్దేశము చేయబడు ఎవరేని ఇతర సభ్యుడు మరియు అట్టి నామనిర్దేశము చేయని యెడల లేక చైర్ పర్సన్ లేనిచో, హాజరయిన వారిలో నుండి సభ్యులచే ఎంపిక చేయబడిన ఎవరేని సభ్యుడు, సమావేశము నకు అధ్యక్షత వహించవలెను.

(11) ప్రాధికార సంస్థ యొక్క ఏదేని సమావేశము సమక్షమున ఉత్పన్నమగు అన్ని ప్రశ్నలు హాజరయి, ఓటింగు చేసిన సభ్యుల మెజారిటీ ఓటింగుపై నిర్ణయించబడ వలెను. మరియు సమానమైన ఓట్లు వచ్చిన సందర్భములో, చైర్ పర్సన్ లేక అధ్యక్షత వహించిన వ్యక్తికి రెండవ లేక నిర్ణాయక ఓటును వినియోగించుటకు హక్కు కలిగి ఉందురు.

(12) ప్రాధికార సంస్థ యొక్క అన్ని ఉత్తర్వులు మరియు నిర్ణయాలు, ఈ విషయములో చైర్ పర్సన్ ద్వారా ప్రాధికారమీయబడిన ప్రాధికార సంస్థ యొక్క కార్యదర్శి లేక ఎవరేనీ ఇతర అధికారిచే ఆధిప్రమాణీకృత మొనర్చబడవలెను. ________________ 58.658 (13) ప్రాధికార సంస్థ యొక్క ఏదేని చర్య లేక ప్రొసీడింగు ప్రశ్నింపబడరాదు. లేక ప్రాధికార సంస్థ యొక్క ఏర్పాటులో ఏదేని ఖాళీ ఏర్పడినదని లేక ఏదేని లోపమున్నదను కారణమున మాత్రమే శాసనమాస్యత కోల్పోరాదు.

(14) ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సన్ మరియు ఇతర పూర్తికాలిక సభ్యులు కేంద్ర ప్రభుత్వము ద్వారా నిర్ధారించబడునట్టి జీతము మరియు బత్తెములు పోందవలెను మరియు ఇతర సభ్యులు, ప్రాధికార సంస్థ సమావేశములకు హజరుకై కేంద్ర ప్రభుత్వము విహితపరచునట్టి భత్యములను మరియు ఫీజును పొందవలెను.

(15) ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సన్ మరియు సభ్యుల సేవ యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు ఉప-పరిచ్చేదము (6) యొక్క నిబంధనలకు లోబడి, వారి పదవీ కాలావధితో సహా, కేంద్ర ప్రభుత్వము విహితపరచునట్లు ఉండవలెను.

71. ప్రాధికార సంస్థ యొక్క ఏ సభ్యుడుగాని, ఏదేని కంపెనీ లేక ఇతర నిగమ నికాయము లేక వ్యక్తుల అసోసియేషను నిగమితమొనర్చినను లేక నిగమితమొనర్చకున్నను లేక విద్యుచ్ఛక్తి ఉత్పాదకత, ప్రసారము, పంపిణీ మరియు వర్తకము. లేదా దాని యొక్క ఉత్పాదన కొరకు ఇంధనము లేదా విద్యుచ్చక్తి సామగ్రి తయారీలో వ్యాపారము చేయు ఫర్ము, తన స్వనామములో గాని లేక వేరు విధముగాగాని ఏదేని వాటా లేక హితమును కలిగియుండరాదు.

72. ప్రాధికార సంస్థ. ఈ చట్టము క్రింద తన కృత్యములను నిర్వర్తించుట కొరకు ఒక కార్యదర్శిని మరియు తాను యుక్తమని భావించునట్టి ఇతర అధికారులు మరియు ఉద్యోగులను నియతము చేయవచ్చును. మరియు కేంద్ర ప్రభుత్వ సంప్రదింపుతో ప్రాధికార సంస్థ జీతము, పారితోషికము, ఫీజు, బత్తెము. పింఛను, సెలవు మరియు గ్రాట్యుయిటీ లను అట్టి షరతులపై నిర్ణయించవచ్చును.

అయితే, కార్యదర్శి యొక్క నియామకము కేంద్ర ప్రభుత్వ ఆమోదమునకు లోబడి ఈ ఉండును.

73. ప్రాధికార సంస్థ కేంద్ర ప్రభుత్వము విహితపరచు లేక ఆదేశించునట్టి కృత్యములు మరియు కర్తవ్యములను నిర్వహించవలెను మరియు ప్రత్యేకించి -

(ఎ) జాతీయ విద్యుచ్ఛక్తి విధానమునకు సంబంధించిన విషయముల పై కేంద్ర ప్రభుత్వమునకు సలహానిచ్చుట, విద్యుచ్ఛక్తి విధానపు అభివృద్ధి కొరకు స్వల్పకాలిక మరియు సమగ్ర ప్రణాళికను రూపొందించుట: జాతీయ మితవ్యయము యొక్క హితములను చేకూర్చుటకు వనరుల అభిలషణీయ వినియోగము కొరకు ప్రణాళికా ఏజెన్సీల కార్యకలాపాలను సమన్యయము చేయుటకు మరియు వినియోగదారులందరికి విద్యుచ్ఛక్తిని విశ్వసనీయము గాను మరియు అందుబాటులో నుండునట్లు ఏర్పాటు చేయుట; ________________ 19/059. (బి) విద్యుచ్ఛక్తి ప్లాంట్లు, విద్యుచ్ఛక్తి లైన్ల నిర్మాణము మరియు గ్రిడ్ కు కలుపుటకు సాంకేతిక ప్రమాణాలను నిర్దిష్ట పరచుట,

(సి) విద్యుచ్ఛక్తి. ప్లాంట్లు మరియు విద్యుచ్ఛక్తి లైన్ల నిర్మాణము, క్రియాకలాపం మరియు నిర్వహణ కొరకైన సంరక్షణ ఆవశ్యకతలను నిర్దిష్ట పరచుట;

(డి) ప్రసార లైన్ల క్రియాకలాపములు మరియు నిర్వహణ కొరకు గ్రిడ్ ప్రమాణాలను నిర్దిష్ట పరచుట,

(ఇ), విద్యుచ్ఛక్తి ప్రసారము మరియు సరఫరా కొరకు మీటర్లను ఏర్పాటు చేయుటకై షరతులను నిర్దిష్ట పరచుట;

(ఎఫ్) విద్యుచ్ఛక్తి వ్యవస్థను మెరుగుపరచు మరియు అభివృద్ధిపరచుట కొరకు పధకాలను మరియు ప్రాజెక్టులను సమయములోపు పూర్తి చేయటకు ప్రోత్సహించుట మరియు సహకరించుట;

(జి) విద్యుచ్ఛక్తి పరిశ్రమలో పనిచేయు వ్యక్తుల నైపుణ్యతను పెంచుట కొరకు ప్రోత్సాహక చర్యలు;

(హెచ్) కేంద్ర ప్రభుత్వమునకు, తాను సలహాను కోరిన ఏదేని విషయము పై సలహా నిచ్చుట లేక విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము, వర్తకము. పంపిణీ మరియు వినియోగమును మెరుగుపరచుటలో సిఫారసు సహాయపడగలదని ప్రాధికార సంస్థ అభిప్రాయ పడినచో ఏదేని విషయము పై ప్రభుత్వమునకు సిఫారసు చేయుటకు;

(ఐ) విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము, వర్తకము, పంపిణీ మరియు వినియోగమును సంబంధించిన భోగట్టాను సేకరించుట మరియు రికార్డు చేయట; మరియు ధర, సామర్ధ్యము, పోటీ మరియు అటువంటి విషయములకు సంబంధించి అధ్యయనము చేయుట:

(జె) ఈ చట్టము క్రింద సేకరించిన సమాచారమును ఆయా సమయములందు బహిరంగపరచుట మరియు నివేదికలను మరియు దర్యాప్తులను ప్రచురణ కొరకు ఏర్పాటు చేయుట:

(కె) విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము, పంపిణీ మరియు వర్తకము ప్రభావితమగు విషయములలో పరిశోధనను పెంపొందించుట;

(ఎల్) విద్యుచ్చక్తిని ఉత్పాదన చేయు లేక ప్రసారము చేయు లేక పంపిణీ చేయు ప్రయోజనముల నిమిత్తము ఏదేని దర్యాప్తు చేయుట లేక చేయుటకు కారణము చూపుట; . ________________

- 60/ 660 (ఎమ్) విద్యుచ్ఛక్తి వ్యవస్థను మెరుగుపరచు రీతిలో వారి యొక్క స్వామ్యము లేక నియంత్రణ క్రింద దానిని నడుపుట మరియు నిర్వహించుటకు వీలుగా అట్టి విషయముల పై ఏదేని రాజ్య ప్రభుత్వము, లైసెన్సుదారు లేక ఉత్పాదక కంపెనీలకు మరియు అవసరమైనపుడు ఇతర విద్యుచ్ఛక్తి వ్యవస్థ యొక్క స్వామ్యము లేక నియంత్రణలో నున్న ఏదేని ఇతర ప్రభుత్వము,, లైసెన్సుదారు లేక ఉత్పాదక కంపెనీ యొక్క సమన్వయముతో సలహానిచ్చుట;

(ఎన్) విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, ప్రసారము మరియు పంపిణీకి సంబంధించిన అన్ని సాంకేతిక విషయాలలో సముచిత ప్రభుత్వమునకు మరియు సముచిత కమీషనుకు సలహానిచ్చుట; మరియు

(ఓ) ఈ చట్టము క్రింద నిబంధించబడు అట్టి ఇతర కృత్యములను నిర్వర్తించుట.

కొన్ని అధికారములు మరియు ఆదేశములు.

74. ప్రాధికార సంస్థచే నిర్దిష్ట పరచబడునట్టి సమయములలో మరియు అట్టి ప్రరూపము మరియు రీతిలో, తాను కోరిన విధముగా విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము. పంపిణీ, వర్తకము మరియు ఉపయోగమునకు సంబంధించినట్టి గణాంకాలు, రిటర్నులు మరియు ఇతర సమాచారమును ప్రాధికార సంస్థకు సమకూర్చుట దాని లేక అతని స్వంత ఉపయోగము కొరకు ఉత్పాదన చేయు ప్రతి లైసెన్సుదారు, ఉత్పాదక కంపెనీ లేక వ్యక్తి యొక్క బాధ్యత అయి ఉండును.

75 (1) తన కృత్యములను నిర్వర్తించుటలో ప్రాధికార సంస్థ, కేంద్ర ప్రభుత్వముచే ప్రజాహితము కలిగియున్న విధాన విషయాలలో వ్రాతపూర్వకముగా తనకు ఇచ్చినట్టి ఆదేశములు మార్గదర్శకమగును.

(2) ప్రజాహితము కలిగియున్న విధాన విషయములకు సంబంధించి ఏదేని అట్టి ఆదేశములు పై ఏదేని ప్రశ్న ఉత్పన్నమైనచో, దానిపై కేంద్రప్రభుత్వ నిర్ణయము అంతిమమైనదగును.

భాగము - 10

క్రమబద్దీకరణ కమీషన్లు.

కేంద్ర కమీషను సంఘటన, అధికారములు మరియు కృత్యములు.

76.(1) ఈ చట్టము క్రింద తమకు ఒసగబడిన అధికారములను వినియోగించుటకు మరియు అప్పగించబడిన కృత్యములను నిర్వర్తించుటకు కేంద్ర విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషనుగా పిలువబడు కమీషను నొక దానిని ఏర్పాటు చేయవలెను. ________________

. .. 61/ G61 (2) విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 యొక్క 3వ పరిచ్చేదము క్రింద ఏర్పాటు చేయబడి, అట్టి నియమిత తేదీకి అవ్యవహిత పూర్వము పనిచేయుచున్న కేంద్ర విద్యుచ్ఛక్తి, క్రమబద్ధీకరణ కమీషను, ఈ చట్టపు ప్రయోజనాల నిమిత్తము కేంద్ర కమీషనుగా భావించబడవలెను మరియు 'ఛైర్-పర్సన్, సభ్యులు, కార్యదర్శి మరియు ఇతర అధికారులు మరియు దాని యొక్క ఉద్యోగులు, ఈ చట్టము క్రింద నియమించబడినట్లుగా భావించబడవలెను మరియు వారు విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 క్రింద ఏ నిబంధనలు, మరియు షరతులపై నియమించబడినారో అవే నిబంధనలు మరియు షరతులు పై పదవియందు కొనసాగవలెను.

అయితే, విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 క్రింద ఈ చట్టపు ప్రారంభమునకు పూర్వము, నియమించబడిన కేంద్ర కమీషను చైర్ పర్సన్ మరియు ఇతర సభ్యులు, 78వ పరిచ్చేదము (1) క్రింద ఏర్పాటు చేయబడిన ఎంపిక కమిటీ యొక్క " సిఫారసుల పై, కేంద్ర ప్రభుత్వము చే, ఈ చట్టము క్రింద నిబంధనలకు మరియు షరతులకు అభీష్టము తెలుపుటకు అనుమతించబడవచ్చును.

(3) కేంద్ర కమీషను, స్థిర మరియు చర ఆస్తులను ఆర్జించు, కలిగియుండు మరియు వ్యయనము చేయు అధికారముతో శాశ్వత ఉత్తరాధికారమును మరియు సామన్య మొహరును కలిగియుండి సదరు పేర్కొనబడిన నామముతో నిగమ నికాయముగా నుండును మరియు కాంట్రాక్టు చేసుకొనవచ్చును మరియు సదరు నామములో దావా వేయవచ్చును. లేదా దాని పై దావా వేయబడవచ్చును.

(4) కేంద్ర కమీషను యొక్క ప్రధాన కార్యాలయము, కేంద్ర ప్రభుత్వముచే అధినూచన ద్వారా నిర్దిష్ట పరచునట్టి స్థలములో నుండవలెను.

(5) కేంద్ర కమీషను ఈ క్రింద సభ్యులతో కూడి యుండవలెను, వారెవరనగా:-

(ఎ) చైర్ పర్సన్ మరియు ముగ్గురు ఇతర సభ్యులు

(బి) ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సన్. ఇతడు పదవిరీత్యా సభ్యుడుగా నుండవలెను.

(6) కేంద్ర కమీషను చైర్ పర్సన్ మరియు, సభ్యులను 78వ పరిచ్ఛేదములో నిర్దేశించబడిన ఎంపిక కమిటీ యొక్క సిఫారసుపై కేంద్ర ప్రభుత్వము నియమించును.

77 (1) కేంద్ర కమీషను యొక్క చైర్ పర్సన్ మరియు సభ్యులు, ఇంజనీరింగు, న్యాయశాస్త్రము, అర్ధికశాస్త్రము, వాణిజ్యశాస్త్రము, విత్తశాస్త్రము లేక మేనేజిమెంటు శాస్త్రములకు సంబంధించి సమస్యల పరిష్కారమునకు, తగిన పరిజ్ఞానము లేక అనుభవము; చూపగల సమర్ధత కలిగిన వ్యక్తియై ఉండవలెను మరియు ఈ క్రింద పేర్కొనబడిన రీతిలో నియమింపబడవలెను, అదేదనగా; ________________

62 662 (ఎ) విద్యుచ్ఛక్తి ఉత్పాదకత, ప్రసారము లేక పంపిణీయందు ప్రత్యేక నైపుణ్యతను పొంది ఇంజనీరింగు క్షేత్రములో అర్హతలు మరియు అనుభవము కలిగియున్న వ్యక్తి ఒకరు;

(బి) విత్త శాస్త్ర రంగములో అర్హతలు మరియు అనుభవము కలిగియున్న వ్యక్తి ఒకరు;

(సి) విత్తీయ శాస్త్రము, వాణిజ్య శాస్త్రము, న్యాయశాస్త్రము మరియు మేనేజిమెంటు శాస్త్ర రంగములలో అర్హతలు మరియు అనుభవము కలిగియున్న వ్యక్తులు ఇద్దరు:-

అయితే ఒక సభ్యుడు కన్నా ఎక్కువ మందిని ఖండము (సి) క్రింద అదే వర్గము నుండి నియమింపబడరాదు

(2) ఉప-పరిచ్ఛేదము (1)లో ఏమి ఉన్నప్పటికిని, కేంద్ర ప్రభుత్వము, సర్వోన్నత న్యాయస్థాన న్యాయాధీశుడు లేక ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న లేక ఉండిన వ్యక్తుల నుండి ఎవరేని వ్యక్తిని చైర్ పర్సన్ గా నియమించవచ్చును.

అయితే, ఈ ఉప-పరిచ్ఛేదము క్రింది నియామకము భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిననే తప్ప చేయరాదు.

(3) కేంద్ర కమీషను చైర్ పర్సన్ లేక దాని యొక్క ఎవరేని ఇతర సభ్యుడు. ఏదేని ఇతర పదవి యందుండరాదు.

(4) చైర్-పర్సన్, కేంద్ర కమీషను యొక్క ముఖ్య కార్య నిర్వాహకుడై యుండువలెను.

78.(1) కేంద్రప్రభుత్వము, ఆపిలేటు ట్రిబ్యునలు సభ్యులు మరియు కేంద్ర కమీషను యొక్క చైర్ పర్సన్ మరియు సభ్యుల ఎంపిక నిమిత్తము ఈ క్రింది వారితో కూడిన ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేయవలెను,-

(ఎ) ప్లానింగు కమీషను సభ్యుడు విద్యుత్తు ఈ సెక్టారు యొక్క ఇన్-ఛార్జి -- చైర్ పర్సన్

(బి) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ యొక్క న్యాయ వ్యవహారాల శాఖలో వ్యవహరించుచున్న ఇన్-ఛార్జి కార్యదర్శి-- సభ్యుడు;

(సి) పబ్లికు ఎంటర్ ప్రైజెస్ ఎంపిక బోర్డు చైర్ పర్సన్,-- సభ్యుడు;

(డి) ఉప-పరిచ్చేదము (2) ననుసరించి కేంద్ర అని ప్రభుత్వముచే నామనిర్దేశము చేయబడు ఒక వ్యక్తి --సభ్యుడు ________________

3/G63 (ఇ) ఉప-పరిచ్ఛేదము (3) ననుసరించి కేంద్ర ప్రభుత్వముచే నామనిర్దేశము చేయబడు ఒక వ్యక్తి -- సభ్యుడు;

(ఎఫ్) విద్యుత్తుతో వ్యవహరించుచున్న కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖ యొక్క ఇన్ ఛార్జి కార్యదర్శి -- సభ్యుడు.

(2) ఉస-పరిచ్చేదము (1) యొక్క ఖండము (డి) నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము, కంపెనీల చట్టము, 1956 యొక్క 4-ఏ పరిచ్ఛేదములో నిర్దిష్ట పరచిన ఏదేని పబ్లికు విత్తీయ సంస్థ యొక్క, ఏ పేరుతో పిలువబడినప్పటికీ చైర్ పర్సన్ లేదా మేనేజింగ్ డైరెక్టరు హోదాను కలిగియున్న వ్యక్తుల నుండి నామనిర్దేశము చేయవలెను.

(3) ఉప-పరిచ్చేదము (1) యొక్క ఖండము (ఇ) నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము, అధిసూచన ద్వారా ఈ ప్రయోజనము నిమిత్తము ఏదేని పరిశోధన, సాంకేతిక లేక మేనేజిమెంటు సంస్థ యొక్క, ఏ పేరుతో పిలువబడినప్పటికీ డైరెక్టరు లేదా సంస్థ యొక్క అధిపతి, హోదాను కలిగియున్న వ్యక్తుల నుండి నామనిర్దేశము చేయవలెను.

(4) విద్యుత్తులో వ్యవహించుచున్న కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖ యొక్క ఇన్ ఛార్జి కార్యదర్శి, ఎంపిక కమిటీ కన్వీనరుగా నుండవలెను.

(5) కేంద్ర ప్రభుత్వము, అపిలేటు ట్రిబ్యునలు సభ్యుడు లేక కేంద్ర కమీషను యొక్క చైర్ పర్సన్ లేక సభ్యుడి మరణము. రాజీనామా లేక తొలగింపు కారణము వలన ఏదేని ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఒక మాసము లోపల మరియు అపిలేటు ట్రిబ్యునలు సభ్యుడు లేక కేంద్ర కమీషను యొక్క చైర్-పర్సన్ లేదా సభ్యుడి పదవీ విరమణ లేక పదవీ కాలావధి ముగింపుకు ఆరు మాసముల పూర్వము, ఖాళీని భర్తీ చేయుటకు ఎంపిక కమిటీకి నిర్దేశమును పంపవలెను.

(6) ఎంపిక కమిటీ, తనకు చేయబడిన నిర్దేశము తేదీ నుండి మూడు మాసముల లోపు ఉప పరిచ్ఛేదము (5)లో పేర్కొనబడిన చైర్ పర్సన్ మరియు సభ్యుల యొక్క ఎంపికను పూర్తిచేయవలెను.

(7) ఎంపిక కమిటీ, తనకు నిర్దేశించిన ప్రతి ఖాళీ కొరకు రెండు పేర్లు కలిగిన ప్యానెలును సిఫారసు చేయవలెను. ________________ (8) అపిలేటు ట్రిబ్యునలు యొక్క సభ్యుని లేక కేంద్ర కమీషను యొక్క చైర్ పర్సన్ లేక ఇతర సభ్యుని నియామకము కొరకు ఎవరేని వ్యక్తిని సిఫారసు చేయుటకు పూర్వము, ఎంపిక కమిటీ, చైర్ పర్సన్ లేక సభ్యుడిగా అతని కృత్యములకు భంగము వాటిల్లదగు, ఏదేని విత్తీయ లేక ఇతర హితములేనట్టి వ్యక్తి యైయుండునట్లు. తాను సంతృప్తి పొందవలెను.

(9) ఎంపిక కమిటీలో ఏదేని ఖాళీ ఏర్పడిన కారణము మాత్రముననే ఛైర్-పర్సన్ లేక ఇతర సభ్యుని యొక్క నియామకమేదియు శాసనమాన్యత కోల్పోరాదు.

అయితే, ఈ పరిచ్ఛేదములో నున్నదేదియు సర్వోన్నత న్యాయస్థానము యొక్క న్యాయాధీశుడు లేక ఉన్నత న్యాయ స్థానము యొక్క ప్రధాన న్యాయమూర్తిగా వున్న లేక వుండినట్టి వ్యక్తి, కేంద్ర కమీషను యొక్క చైర్-పర్సన్ గా నియుక్తుడైన వ్యక్తికి వర్తించదు.

79.(1) కేంద్ర కమీషను. ఈ క్రింది కృత్యములను నిర్వర్తించవలెను, అవేవనగా

(ఎ) కేంద్ర ప్రభుత్వముచే స్వామ్యము కలిగియుండి లేక దాని నియంత్రణలోనున్న ఉత్పాదక కంపెనీల యొక్క టారిఫ్ ను క్రమబద్ధీకరించుట:

(బి) ఒక రాజ్యమునకు మించి విద్యుచ్ఛక్తి ఉత్పాదన చేయుట లేక విక్రయము చేయుట కొరకు సమ్మిళిత పథకముతో లేక ఇతర నిధముగా అట్టి ఉత్పాదక కంపెనీలు చేరినచో, ఖండము (ఎ)లో నిర్దిష్ట పరచిన కేంద్ర ప్రభుత్వము ద్వారా స్వామ్యము లేక నియంత్రణ కలిగినవి కానట్టి ఉత్పాదక కంపెనీల టారిఫ్ ను క్రమబద్ధీకరించుటకు:

(సి) అంతర్ రాజ్య ప్రసార విద్యుచ్చ క్తిని క్రమబద్ధీకరించుటకు:

(డి) అంతర్ రాజ్య ప్రసార విద్యుచ్ఛక్తి కొరకు టారిఫ్ ను నిర్ధారించుటకు:

(ఇ) వారి అంతర్ రాజ్య నిర్వహణలకు సంబంధించి ప్రసార లైసెన్సుదారు మరియు విద్యుచ్ఛక్తి వర్తకుడుగా కృత్యములను నిర్వహించు వ్యక్తులకు లైసెన్సులు జారీచేయుటకు;

(ఎఫ్) పైన పేర్కొనబడిన ఖండములు (ఏ) నుండి (డీ)లకు సంబంధించిన విషయములలో ఉత్పాదక కంపెనీలు లేక ప్రసార లైసెన్సుదారు చేరియున్న వివాదములపై అధినిర్ణయించుటకు మరియు మద్యవర్తిత్వము కొరకు ఏదేని వివాదమును నిర్దేశించుటకు;

(జి) ఈ చట్టపు ప్రయోజనాల కొరకు ఫీజును విధించుటకు;

(హెచ్) గ్రిడ్ ప్రమాణాలను కలిగియున్న గ్రిడ్ కోడ్ ను నిర్దిష్ట పరచుటకు;

(ఐ) నాణ్యతకు సంబంధించి ప్రమాణాలను, లైసెన్సుదారుల కొనసాగింపు మరియు విశ్వసనియ సర్వీసును నిర్దిష్ట పరచుటకు మరియు అమలుపరచుటకు; ________________

651665.. (జే) అవసరమని భావించినచో, అంతర్ రాజ్య విద్యుచ్ఛక్తి వర్తకములో, వర్తక మార్జినును నిర్ణయించుటకు;

(కె). ఈ చట్టము క్రింద ఒసగబడినట్టి ఇతర కృత్యములను నిర్వర్తించుటకు.

(2) కేంద్ర కమీషను, ఈ క్రింది అన్నీ లేక ఏవేని విషయములకు సంబంధించి కేంద్రప్రభుత్వమునకు సలహానీయవలెను, అవేననగా:

(i) జాతీయ విద్యుచ్ఛక్తి విధానమును మరియు టారిఫ్ విధానమును రూపొందించుట;

(ii) విద్యుచ్ఛక్తి పరిశ్రమ యొక్క కార్యకలాపాలలో పోటీని, సామర్ధ్యమును మరియు మితవ్యయమును పెంపొందించుట;

(iii) విద్యుచ్ఛక్తి పరిశ్రమలో పెట్టుబడిని పెంపొందించుట;

(iv) ఆ ప్రభుత్వముచే కేంద్ర కమీషనుకు నిర్దేశించబడిన ఏదేని ఇతర విషయము.

3) కేంద్ర కమీషను తన అధికారములను వినియోగించునపుడు మరియు కృత్యములను నిర్వర్తించునపుడు నిశ్చయపరచవలెను.

4) కేంద్ర కమీషను తన కృత్యములను నిర్వర్తించుటలో 3వ పరిచ్ఛేదము క్రింద ప్రచురించబడిన జాతీయ విద్యుచ్ఛక్తి విధానమును, జాతీయ విద్యుచ్ఛక్తి ప్రణాళికను మరియు టారిఫ్ విధానమను అనుసరించవలెను.

80(1) కేంద్ర కమీషను, అధి సూచన ద్వారా, కేంద్ర సలహా కమిటీగా పిలువబడు ఒక కమిటీని అట్టి అధి సూచనలో తాను నిర్దిష్టపరచునట్టి తేదీ నుండి స్థాపించవచ్చును.

(2) కేంద్ర సలహా కమిటీ, విద్యుచ్ఛక్తి సెక్టారులో వాణిజ్యము, పరిశ్రమ రవాణా, వ్యవసాయము, శ్రామిక, వినియోగదారులు, ప్రభుత్వేతర వ్యవస్థలు మరియు అకాడమిక్ మరియు పరిశోధనా నికాయముల హితమును ప్రాతినిధ్యము వహించుటకు ముప్పది ఒకటి సభ్యులకు తక్కువ కాకుండా నుండవలెను.

(3) కేంద్ర కమీషను యొక్క చైర్-పర్సన్ కేంద్ర సలహా కమిటీ యొక్క పదవి రీత్యా చైర్-పర్సన్ అయి ఉండవలెను. మరియు ఆ కమీషను సభ్యులు మరియు వినియోగదారుల కార్యకలాపములు మరియు ప్రజా పంపిణీ వ్యవస్థలో వ్యవహరిస్తు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేక దాని విభాగములో భారత ప్రభుత్వమునకు, కార్యదర్శి, ఆ కమిటీకి పదవిరీత్యా సభ్యులు అయి ఉండవలెను.

81. కేంద్ర సలహా కమిటీ యొక్క ఉద్దేశాలు, ఈ క్రింది వాటి పై కేంద్ర కమీషనుకు సలహాలిచ్చుట,________________ 66.666 (i) విధానము పై ప్రధాన ప్రశ్నలకు;

(ii) లైసెన్సుదారులచే అందించబడిన సర్వీసుల నాణ్యత, కొనసాగింపు మరియు విస్తరణకు సంబంధించిన విషయములకు;

(iii). లైసెన్సుదారు చే వారి లైసెన్సు యొక్క షరతులు మరియు ఆవశ్యకతల పాటింపుకు; -

(iv). వినియోగదారుని హితమును రక్షించుటకు;

(V) విద్యుచ్ఛక్తి సరఫరా మరియు వినియోగముల ద్వారా మొత్తము మీద ప్రమాణాల నిర్వహణ.

రాజ్య కమీషన్ల సంఘటన, అధికారములు మరియు కృత్యములు

82.(1) ప్రతి రాజ్య ప్రభుత్వము, నియమిత తేదీ నుండి ఆరు మాసముల లోపు, అధి సూచన ద్వారా ఈ చట్టపు, ప్రయోజనాల నిమిత్తము, (రాజ్యము యొక్క పేరు)విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషనుగా పేర్కొనబడు. ఒక రాజ్య కమీషనును ఏర్పాటు చేయవచ్చును.

అయితే, విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను చట్టము, 1998 యొక్క 17వ పరిచ్ఛేదము క్రింద రాజ్య విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను రాజ్య ప్రభుత్వముచే స్థాపించబడి, మరియు అనుసూచిలో నిర్దిష్ట పరచిన శాసనములు మరియు నియమిత తేదీకి అవ్యవహిత పూర్వము అట్లు పని చేయుచున్న రాజ్య విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను ఈ చట్టపు ప్రయోజనాల నిమిత్తము రాజ్య కమీషనుగా ఉండును మరియు చైర్ పర్సన్, సభ్యులు, కార్యదర్శి మరియు దాని యొక్క అధికారులు మరియు ఇతర ఉద్యోగులు ఆ చట్టముల క్రింద వారు నియమించబడిన అవే నిబంధనలు మరియు షరతులపై, పదవియందు - కొనసాగవలెను:

అయితే, ఇంకనూ, విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 క్రింద లేక అనుసూచిలో నిర్దిష్ట పరచిన, శాసనముల క్రింద, ఈ చట్టవు ప్రారంభమునకు పూర్వము నియమించబడిన రాజ్య కమీషను యొక్క చైర్ పర్సన్, మరియు ఇతర సభ్యులు, 85వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ఏర్పాటు చేయబడిన ఎంపిక కమిటీ యొక్క సిఫారసు మేరకు, సంబంధిత రాజ్య ప్రభుత్వము ద్వారా ఈ చట్టము క్రింద నిబంధనలు మరియు షరతుల పై ఎంపిక చేసుకొనుటకు అనుమతించవలెను.

(2) రాజ్య కమీషను, స్థిర మరియు చర ఆస్తులను ఆర్జించు, కలిగియుండు మరియు వ్యయనము చేయు అధికారముతో, శాశ్వత ఉత్తరాధి కారమును మరియు సామాన్య మొహరును కలిగియుండి సదరు పేర్కొనబడిన నామముతో నిగమనికాయముగా నుండును. మరియు కాంట్రాక్టు చేసుకొనవచ్చును. మరియు సదరు నామముతో దావా వేయవచ్చును. మరియు దానిపై దావా వేయబడవచ్చును. ________________

571 667. (3) రాజ్య కమీషను ప్రధాన కార్యాలయము, రాజ్య ప్రభుత్వముచే, అధి సూచన ద్వారా నిర్దిష్ట పరచబడునట్టి స్థలములో ఉండవలెను.

(4) రాజ్య కమీషను, ఛైర్-పర్సన్ 'తోసహా ముగ్గురు సభ్యులకు మించకుండా ఉండవలెను.

(5) రాజ్య కమీషను, చైర్ పర్సన్ మరియు సభ్యులను, 85వ పరిచ్ఛేదములో నిర్దేశించబడిన ఎంపిక కమిటీ సిఫారసు పై రాజ్య ప్రభుత్వముచే నియమించబడవలెను.

83.(1) 82వ పరిచ్ఛేదములోనున్న దానికి విరుద్ధముగా ఏమి ఉన్నప్పటికిని, ఒక సంయుక్త కమీషనును,

(ఎ) రెండు లేక అంతకు మించి రాజ్య ప్రభుత్వముల ద్వారా, లేక

(బి) ఒకటి లేక అంతకు మించి సంఘ రాజ్య క్షేత్రముల మరియు ఒకటి. లేక

అంతకుమించి రాజ్య ప్రభుత్వముల విషయములో కేంద్ర ప్రభుత్వము ద్వారా చేసుకొనబడు కరారును అనుసరించి, ఏర్పాటు చేయవచ్చును. మరియు - అట్టి కాలావధి వరకు మరియు కరారులో నిర్ణీతపరచిన ఏదేని ప్రతి అదనపు కాలావధి కొరకు నవీకరణ చేయుటకు లోబడి అమలు కలిగియుండును.

అయితే, విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 యొక్క 21 ఏ పరిచ్చేదము క్రింద ఏర్పాటు చేయబడి మరియు నియమిత తేదీకి అవ్యవహిత పూర్వము అట్లు పనిచేయుచున్న, సంయుక్త కమీషను, ఈ చట్టపు ప్రయోజనాల నిమిత్తము సంయుక్త కమీషనుగా నుండును మరియు దాని యొక్క చైర్ పర్సన్, సభ్యులు, కార్యదర్శి మరియు ఇతర అధికారులు మరియు ఉద్యోగులు ఈ చట్టము క్రింద అట్లు నియమింపబడినట్లుగా భావించబడును. మరియు వారు విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 క్రింద ఆ వారు నియమించబడిన ఆవే షరతులు మరియు నిబంధనల పై పదవియందు కొనసాగవలెను.

(2) సంయుక్త కమీషను, పాల్గొను ప్రతి యొక్క రాజ్యములు మరియు సంఘ రాజ్య క్షేత్రముల నుండి ఒక్కొక్క సభ్యుని కూడియుండవలెను. మరియు చైర్ పర్సన్ సర్వసమ్మతి ద్వారా గాని, అది విఫలమైనచో రొటేషను ద్వారా గాని సభ్యులలో నుండి నియమించబడవలెను.

(3) ఉప పరిచ్చేదము (1) క్రింది కరారులో సంయుక్త కమీషను యొక్క నామము నకు, సంయుక్త కమీషను యొక్క చైర్ పర్సన్ మరియు సభ్యుల ఎంపికతో సంబంధమున్న పాల్గొను రాజ్యముల రీతిని, సభ్యుల నియామకము మరియు రొటేషను లేదా సర్వసమ్మతి ద్వారా చైర్ పర్సన్ నియామకపు రీతిని, కమీషను కార్యకలాపము సాగించు స్థలమునకు, ________________ సంయుక్త కమీషనుకు సంబంధించిన వ్యయములో పాల్గొను రాజ్యముల మధ్య పంచుటకు, సంయుక్త కమీషను మరియు సంబంధిత రాజ్య ప్రభుత్వమునకు మధ్య ఏర్పడిన భిన్నాభి ప్రాయములను తీర్మానించుటకైన రీతికి సంబంధించిన నిబంధనలు కలిగియుండవలెను. మరియు కరారును అమలుపరచుట కొరకు అవసరమని లేక ఉపయుక్తమని భావించబడు ఈ చట్టమునకు అసంగతము కానట్టి ఇతర అనుపూరక, ఆనుషంగిక మరియు పారిణామిక నిబంధనలు కూడా ఉండవలెను.

4) సంయుక్త కమిషను, పాల్గొను రాజ్యములు లేక సంఘ రాజ్య క్షేత్రముల విషయములో విడి విడిగాను మరియు స్వతంత్రంగాను టారిఫ్ ను నిర్ధారించవలెను.

(5) ఈ సరిచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికిని, కేంద్ర ప్రభుత్వము, అన్ని పాల్గొను రాజ్యములు అట్లు ప్రాధికారమిచ్చినచో, ఒక సంయుక్త కమీషనును ఏర్పాటు చేయవచ్చును. మరియు ఉప పరిచ్ఛేదము (3) క్రింద నిర్దిష్టపరచిన అన్నీ లేక, ఏవేని విషయములకు సంబంధించి మరియు పాల్గొను రాజ్యముల ద్వారా అట్లు నిర్దిష్టముగా ప్రాధికారమీయ బడినపుడు, అధికారములను వినియోగించవచ్చును.

84.(1) రాజ్య కమీషను యొక్క చైర్ పర్సన్ మరియు సభ్యులు, ఇంజనీరింగు, విత్తీయ, వాణిజ్య, విత్తీయ, న్యాయ లేక మేనేజిమెంటు శాస్త్రములకు సంబంధించిన సమస్యలతో వ్యవహరించుచున్న, తగినంత పరిజ్ఞానము కలిగిన మరియు హోదాలో నుండి, సామర్థ్యము, సమగ్రత, స్థాయి కలిగిన వ్యక్తులై యుండవలెను.

(2) ఉప-పరిచ్చేదము (1)లో ఏమి ఉన్నప్పటికిని, రాజ్య ప్రభుత్వము, ఉన్నత న్యాయస్థానము యొక్క న్యాయధీశునిగా ఉన్న లేక ఉండియున్న వ్యక్తుల నుండి చైర్ పర్సన్ గా ఎవరేని వ్యక్తిని నియమించవచ్చును.

అయితే, ఈ ఉప పరిచ్చేదము క్రింది నియామకమేదియు ఆ ఉన్నత న్యాయస్థానము యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిననే తప్ప చేయరాదు.

(3) రాజ్య కమీషను యొక్క చైర్ పర్సన్ లేక ఎవరేని ఇతర సభ్యుడు ఏదేని ఇతర పదవీ యందుండరాదు.

(4) చైర్ పర్సన్, రాజ్య కమీషను యొక్క ప్రధాన కార్యనిర్వాహకుడై ఉండవలెను.

85.(1) రాజ్య ప్రభుత్వము, రాజ్య కమీషను యొక్క సభ్యులను ఎంపిక చేయు నిమిత్తము ఈ క్రింది వారితో కూడిన ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేయవలెను. ________________ ... 61 669 .

(ఎ) ఉన్నత న్యాయస్థానములో న్యాయాధీశునిగా
   :ఉండిన ఒక వ్యక్తిని                .... 'చైర్-పర్సన్;  
(బి) సంబంధిత రాజ్య ప్రధాన కార్యదర్శి ..... సభ్యుడు;
(సి) ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సన్ లేదా.
   :కేంద్ర కమీషను యొక్క ఛైర్-పర్సన్ . . ..   సభ్యుడు: 

అయితే, ఈ పరిచ్ఛేదములో నున్నదేదియు ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా, పనిచేయు లేక చేసి చైర్ పర్సన్ గా నున్న వ్యక్తి నియామకమునకు వర్తించదు.

(2) రాజ్య ప్రభుత్వము, చైర్ పర్సన్ లేక ఒక సభ్యుని మరణము, రాజీనామా లేక తొలగింపు కారణముగా ఏదేని ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఒక మాసము లోపు మరియు చైర్ పర్సన్ లేక సభ్యుడి పదవీ విరమణ లేక పదని కాలావధి ముగింపుకు పూర్వపు ఆరు మాసములలో, ఖాళీని భర్తీ చేయుటకు ఎంపిక కమిటీకి నిర్దేశించవలెను.

(3) ఎంపిక కమిటీ, తనకు నిర్దేశించబడిన తేదీ నుండి మూడు మాసముల లోపు ఛైర్ పర్సన్ మరియు సభ్యుల ఎంపికను పూర్తి చేయవలెను.

(4) ఎంపిక కమిటీ, తనకు నిర్దేశించిన ప్రతి ఖాళీ కొరకు ఇద్దరి పేర్లు గల ప్యానలును సిఫారసు చేయవలెను.

(5) రాజ్య కమీషను యొక్క చైర్ పర్సన్ లేక ఇతర సభ్యునిగా నియామకము కొరకు ఎవరేని వ్యక్తిని సిఫారసు చేయుటకు పూర్వము ఎంపిక కమిటీ, అట్టి ఛైర్ పర్సన్ లేక సందర్భానుసారము సభ్యుడు అతని కృత్యములకు భంగము వాటిల్లగల ఏదేని విత్తీయ లేక ఇతర హితము లేనట్టి వ్యక్తి యైనట్లు తాను సంతృప్తి పొందవలెను.

(6) చైర్ పర్సన్ లేక ఇతర సభ్యుల నియామకమేదియు ఎంపిక కమిటీలో ఏదేని ఖాళీ ఏర్పడిన కారణము మాత్రముననే శాసనమాన్యత కోల్పోరాదు.

86.(1) రాజ్య కమీషను, ఈ క్రింది కృత్యములను నిర్వర్తించవలెను, ఆవేవనగా

(ఎ) రాజ్యము లోపల టోకు లేదా సందర్భానుసారము పెద్ద లేక చిల్లరగా విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, సరఫరా, ప్రసారము మరియు వినియమము కొరకు టారిఫ్ ను నిర్ధారించుట:

అయితే, 42వ పరిచ్ఛేదము క్రింద వినియోగదారుల శ్రేణికి ప్రవేశ సౌలభ్యమును అనుమతించినపుడు, రాజ్య కమీషను, సదరు వినియోగ దారుల శ్రేణి కొరకు, వీలింగు ఛార్జీలు మరియు సర్ ఛార్జీలు ఏవేని ఉన్నచో, వాటిని మాత్రమే నిర్ధారించవలెను. ________________

(బి) విద్యుచ్చక్తి ధరతో సహా విద్యుచ్ఛక్తి కొనుగోలు మరియు పంపిణీ లై సెన్సుదారులు సేకరించు ప్రక్రియ క్రమబద్ధీకరణ రాజ్యములో పంపిణీ మరియు అతని సరఫరా కొరకు విద్యుత్ కొనుగోలు కరారు ద్వారా ఉత్పాదక కంపెవీలు లేక లైసెన్సుదారులు లేక, ఇతర వనరుల నుండి సేకరించు విధముగా నుండవలెను.

(సి) విద్యుచ్ఛక్తి యొక్క ప్రసారము మరియు వినియమమును రాజ్యాంతర్గత సౌకర్యమును కలుగజేయుట:

(డి) రాజ్యము లోపల వారి నిర్వహణలకు సంబంధించి ప్రసార లైసెన్సుదారులు, పంపిణీ లైసెన్సుదారులు మరియు విద్యుచ్ఛక్తిని వర్తకులుగా ఉండుటకు కోరిన వ్యక్తులకు లైసెన్సుల జారీ,

(ఇ) గ్రిడ్ తో కలుపుటకు మరియు ఎవరేని వ్యక్తికి విద్యుత్తు అమ్మకము కొరకు తగిన చర్యలు తీసుకొనుట ద్వారా విద్యుచ్ఛక్తి నవీకరించు వనరుల నుండి విద్యుచ్ఛక్తి సహ ఉత్పాదన మరియు ఉత్పాదన పెంపొందించుట మరియు అట్టి వనరుల నుండి విద్యుచ్ఛక్తి కొనుగోలు కొరకు పంపిణీ లైసెన్సుదారు యొక్క ప్రాంతములో విద్యుచ్ఛక్తి మొత్తము వినియోగము యొక్క శాతము కూడ నిర్దిష్ట పరచబడవలెను;

(ఎఫ్) లైసెన్సుదారులు మరియు ఉత్పాదక కంపెనీల మధ్య వివాదములను అధి నిర్ణయించుట మరియు మధ్యవర్తిత్వము కొరకు ఏదేని వివాదమును నిర్దేశించుట.

(జి) ఈ చట్టపు ప్రయోజనాల నిమిత్తము ఫీజును విధించుట;

(హెచ్) 79వ పరిచ్చేదపు ఉప సరిచ్చేదము (1) యొక్క ఖండము (హెచ్) క్రింద నిర్దిష్ట పరచబడిన గ్రిడ్ స్మృతితో సంగతముగా నుండు రాజ్య గ్రిడ్ స్మృతికి నిర్దిష్ట పరచుట;

(ఐ) లైసెన్సుదారుల ద్వారా సేవలకు సంబంధించి నాణ్యత, కొనసాగింపబడు మరియు విశ్వసనీయమైన ప్రమాణాలను నిర్దిష్ట పరచుట లేక అమలుపరచుట;

(జె) అవసరమని భావించినచో, విద్యుచ్ఛక్తి యొక్క రాజ్యాంతర్గత వర్తకములో వ్యాపార మార్జినును నిర్ణయించుట;

(కె) ఈ చట్టము క్రింద తనకు అప్పగించబడు అట్టి ఇతర కృత్యములను నిర్వర్తించుట. ________________

11/G71. (2) రాజ్య కమీషను, అన్నీ లేక ఏవేని క్రింది విషయాలలో రాజ్య ప్రభుత్వము నకు సలహానీయవలెను; అవేవనగా: -

(i) విద్యుచ్ఛక్తి పరిశ్రమ యొక్క కార్యకలాపములలో పోటీని, సామర్థ్యమును మరియు మితవ్యయమును పెంపొందించుట;

(ii) విద్యుచ్చక్తి పరిశ్రమలో పెట్టుబడిని పెంపొందించుట;

(iii) రాజ్యములోని విద్యుచ్ఛక్తి పరిశ్రమను పునర్ వ్యవస్థీకరించుట పునర్నిర్మించుట;

(iv) ఆ ప్రభుత్వముచే రాజ్య కమీషనుకు నిర్దేశించబడిన ఉత్పాదక, ప్రసారము, పంపిణీ మరియు వర్తకమునకు సంబంధించిన విషయములు మరియు ఏదేని ఇతర విషయము.

(3) రాజ్య కమీషను, తన అధికారములను వినియోగించుటలో మరియు కృత్యములను నిర్వర్తించుటలో నిశ్చయపరచవలెను.

(4) రాజ్య కమీషను, తన కృత్యములను నిర్వర్తించుటలో, 3వ పరిచ్చేదము క్రింద ప్రచురించబడిన జాతీయ విద్యుచ్ఛక్తి విధానమును, జాతీయ విద్యుచ్చక్తి ప్రణాళిక మరియు టారిఫ్ విధానమును అనుసరించవలెను.

87. (1) రాజ్య కమీషను, ఆధీసూచన ద్వారా, అట్టి అధి సూచనలో నిర్దిష్ట పరచబడునట్టి తేదీ నుండి అమలులోనికి వచ్చునట్లు రాజ్య సలహా కమిటీ అని పిలువబడు ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చును.

(2) రాజ్య సలహా కమిటీ, వాణిజ్యము, పరిశ్రము, రవాణా, వ్యవసాయ, శ్రామిక, వినియోగ దారుల, ప్రభుత్వేతర వ్యవస్థలలో మరియు విద్యుచ్ఛక్తి సెక్టారు యొక్క అకాడమిక్ మరియు పరిశోధనా నికాయముల హితములను ప్రాతినిధ్యము వహించుటకు ఇరవై ఒక్క మందికి తక్కువ కానట్టి సభ్యులతో కూడి యుండవలెను.

(3) రాజ్య కమీషను యొక్క చైర్ పర్సన్, రాజ్య సలహా కమిటీకి పదవిరీత్యా చైర్ పర్సన్ గా నుండవలెను. మరియు రాజ్య కమీషను యొక్క సభ్యులు మరియు వినియోగదారు కార్యకలాపములు మరియు ప్రజా పంపిణీ వ్యవస్థను వ్యవహరిస్తున్న రాజ్య ప్రభుత్వపు మంత్రిత్వ శాఖ లేక దాని విభాగము యొక్క ఇన్ ఛార్జి కార్యదర్శి కమిటీ యొక్క పదవీ రీత్యా సభ్యులుగా నుండవలెను.

88.(1) రాజ్య సలహా కమిటీ యొక్క ఉద్దేశములు, ఈ క్రింది వాటిపై కమీషను సలహానిచ్చుట,

(i) విధానము పై పెద్ద తరహా ప్రశ్నలు: ________________

721 G72 - (ii) లైసెన్సుదారుల ద్వారా అందించబడు సర్వీసులలో నాణ్యత, కొనసాగింపు మరియు విస్తరణకు సంబంధించిన విషయాలు

(iii) వారి లైసెన్సు షరతులు మరియు అవశ్యకతలను వాటిని లైసెన్సుదారులు పాటించుట;

(iv). వినియోగదారు హితమును రక్షించుట;

(v) వినియోగముల ద్వారా విద్యుచ్ఛక్తి, సరఫరా మరియు మొత్తము మీద ప్రమాణాలను నిర్వర్తించుట.

సముచిత కమీషను - ఇతర నిబంధనలు.

- 89. (1) చైర్ పర్సన్ లేక ఇతర సభ్యుడు, అతడు పదవిలో చేరిన తేదీ నుండి ఐదు సంవత్సరముల కాలావధి వరకు పదవియందుండవలెను:

అయితే, కేంద్ర కమీషను లేక రాజ్య కమీషను యొక్క చైర్ పర్సన్ లేక ఇతర సభ్యుడు, ఆ విధముగా అంతకుముందు పదవిలోనున్న ఆ కమీషను యొక్క చైర్ పర్సన్ లేక సభ్యుడిగా అదే హోదాలో తిరిగి నియామకమునకు అర్హుడు కాడు.

అంతేగాక, ఏ చైర్ పర్సన్ లేక సభ్యుడుగాని, అతను అరువది. అయిదు సంవత్సరముల వయస్సు నిండిన పిమ్మట, అట్లు పదవియందు కొనసాగరాదు.

(2) చైర్ పర్సన్ లేక సభ్యుల జీతము, బత్తెములు మరియు ఇతర సేవా షరతులు మరియు నిబంధనలు సముచిత ప్రభుత్వము ద్వారా విహితపరచబడినట్లుండ వలెను:

అయితే, సభ్యుల జీతము, బత్తెములు మరియు ఇతర సేవా షరతులు మరియు నిబంధనలు వారి నియామకము జరిగిన పిమ్మట వారికి అననుకూలముగా మార్చబడగాదు.

(3) ప్రతి సభ్యుడు, అతను పదవిలో చేరుటకు పూర్వము, విహితపరచబడునట్టి ప్రరూపములో, మరియు అట్టి రీతిలో మరియు అట్టి ప్రాధికారి సమక్షమున పదవీ ప్రమాణము మరియు రహస్య గోపనము చేయుట మరియు చేవ్రాలు చేయవలెను.

(4) ఉప-పరిచ్ఛేదము (3)లో ఏమి ఉన్నప్పటికిని, ఒక సభ్యుడు, -

(ఎ) మూడు మాసములకు తక్కువ కాకుండా, సముచిత ప్రభుత్వమునకు వ్రాత పూర్వకముగా నోటీసు ఇచ్చుట ద్వారా, అతను పదవి వదులు కొనవచ్చును; లేక

(బి) 90వ పరిచ్చేదవు నిబంధనలననుసరించి అతనిని పదవి నుండి తోలగించవచ్చును. ________________

73/ G73 (5) అట్లు పదవియందు కొనసాగుట నుండి విరమించు ఎవరేని సభ్యుడు,

(ఎ) అట్లు పదవియందు కొనసాగుట నుండి విరమించు తేదీ నుండి రెండు సంవత్సరముల కాలావధి వరకు ఏదేని వాణిజ్యపరమైన ఉపాధిని స్వీకరించరాదు; మరియు

(బి) ఏ రీతిలోను కేంద్ర కమీషను లేక ఏదేని రాజ్య కమీషను సమక్షమున ఎవరేని వ్యక్తికి ప్రాతినిధ్యము వహించగాదు.

విశదీకరణము: ఈ ఉప-పరిచ్ఛేదపు ప్రయోజనముల నిమిత్తము "వాణిజ్యపరమైన ఉపాధి" అనగా, సముచిత కమీషను సమక్షమున గల ప్రొసీడింగులకు పక్షకారులైన ఏదేని వ్యవస్థలో లేక ఏదేని హోదాలో ఉపాధి, లేక విద్యుచ్ఛక్తి పరిశ్రమలోని వర్తక, వాణిజ్య, పారిశ్రామిక లేక విత్తీయ కార్యకలాపములలో నిమగ్నమైన వ్యక్తి క్రింద లేక ఏజెన్సీలో ఏదేని హోదాలో ఉపాధి అని అర్ధము మరియు ఇందులో కంపెనీ డైరెక్టరు, ఫర్ము యొక్క భాగస్వామి లేక స్వయముగాగాని, లేక ఫర్ము యొక్క భాగస్వామిగా గాని లేక సలహాదారుగాగాని లేక ఒక సంప్రదింపుదారుగా గాని ప్రాక్టీసు చేయుట చేరియుండును.

90.(1) ఈ పరిచ్ఛేదపు నిబంధనలననుసరించిననే తప్ప ఏ సభ్యునిగాని, పదవి నుండి తొలగించరాదు.

(2) కేంద్ర కమీషను యొక్క సభ్యుని విషయములో కేంద్రప్రభుత్వము, రాజ్య కమీషను యొక్క సభ్యుని విషయములో రాజ్య ప్రభుత్వము, ఎవరేని సభ్యుని అతని పదవి నుండి ఉత్తర్వు ద్వారా తొలగించవచ్చును, అయితే అతను,

(ఎ) దీవాలాదారునిగా న్యాయ నిర్ణయము చేయబడినచో;

(బి) సముచిత ప్రభుత్వ అభిప్రాయములో నీతిబాహ్యతతో కూడియున్న కారణంగా ఏదేని అపరాధమునకు దోష స్టాషితుడైనచో;

(సి) శారీరకంగాగాని లేక, మానసికంగాగాని, సభ్యుడుగా కొనసాగుటకు అసమర్ధుడైనచో;

డి) అట్టి విత్తీయ లేక ఇతర హితమును ఆర్జించుట వలన సభ్యునిగా అతని కృత్యములకు భంగము వాటిల్లినచో;

(ఇ) అతను పదవిని అట్లు దుర్వినియొగపరచుట అతను పదవిలో కొనసాగింపునకు ప్రజాహితము దృష్ట్యా భంగకరమైనచో; లేక

(ఎఫ్) నిరూపించబడిన దుర్వర్తనాదోషి అయినచో; ________________

అయితే, ఏ సభ్యుడుగాని, అట్టి కారణము లేక కారణముల పై సభ్యుని తొలగించ బడుటను తెలియపరచిన మీదట, కేంద్ర ప్రభుత్వము ద్వారా విహితపరచబడునట్టి ప్రక్రియ ననుసరించి అపి లేటు ట్రిబ్యునలు చైర్-పర్సన్ చే చేయబడిన విచారణ, విషయములో కేంద్రప్రభుత్వము లేక సందర్భానుసారము రాజ్య ప్రభుత్వము నిర్దేశము చేసిననే తప్ప ఖండము (డి), (ఇ) మరియు (ఎఫ్)లలో నిర్దిష్టపరచిన ఏవేని కారణములపై, అతనిని పదవి నుండి తొలగించరాదు.

(3) కేంద్ర ప్రభుత్వము, లేదా సంధర్బాసుసారము రాజ్య ప్రభుత్వము, ఉప- పరిచ్చేదము (2) క్రింద అపిలేటు ట్రిబ్యునలు యొక్క ఛైర్ పర్సన్ కు చేసిన నిర్దేశము విషయములో, అట్టి నిర్దేశముపై అపిలేటు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ యొక్క నివేదిక అందిన పిమ్మట కేంద్ర ప్రభుత్వము లేక సందర్భానుసారము రాజ్య ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయునంత వరకు సముచిత కమీషను యొక్క ఎవరేని సభ్యుని అపిలేటు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ సంప్రదింపుతో సస్పెండు చేయవచ్చును.

అయితే, ఈ పరిచ్ఛేదములోనున్న దేదియు, అతనిని అట్లు నియామకము చేయు సమయములో సర్వోన్నత న్యాయస్థాన ఉపవేశన న్యాయాధీశుడు లేక ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి లేక ఉన్నత న్యాయస్థాన న్యాయధీశునిగా నున్న సముచిత కమీషను యొక్క చైర్ పర్సనుకు వర్తించదు.

సముచిత కమీషను యొక్క ప్రొసీడింగులు మరియు అధికారములు.

91 (1) సముచిత కమీషను నిర్దిష్ట పరచబడునట్టి అధికారములను వినియోగించుటకు మరియు అట్టి కర్తవ్యములను నిర్వహించుటకు ఒక కార్యదర్శిని నియమించవలెను.

(2) సముచిత కమీషను సముచిత ప్రభుత్వ అనుమతితో ఇతర అధికారులు మరియు ఉద్యోగుల సంఖ్యలు, స్వభావము మరియు వర్గములను నిర్దిష్ట పరచవచ్చును.

(3) కార్యదర్శి, అధికారులు మరియు ఇతర ఉద్యోగులకు చెల్లించు జీతములు మరియు బత్తెములు మరియు ఇతర సేవా షరతులు మరియు నిబంధనలు, సముచిత ప్రభుత్వము యొక్క అనుమతితో నిర్దిష్ట పరచబడునట్లు ఉండవలెను.

(4) సముచిత కమీషను, నిర్దిష్ట పరచబడు షరతులు మరియు నిబంధనలపై అట్టి కృత్యముల నిర్వహణలో ఆ కమీషనుకు సహాయపడుటకు సంప్రదింపుదారులను నియమించవలెను. ________________

... 75 G75.

92. సముచిత కమీషను, ప్రధాన కార్యస్థానము లేక ఛైర్-పర్సన్ ఆదేశించునట్టి ఏదేని ఇతర స్థలములో అట్టి సమయములో సమావేశము కావలెను, మరియు తాను నిర్దిష్ట పరచు (ఆ సమావేశములందు కోరముతో సహా) తన సమావేశములలో వ్యాపార కార్యకలాపముల విషయమునకు సంబంధించి అట్టి ప్రక్రియా నియమావళిని పాటించవలెను.

(2) ఛైర్-పర్సన్, సముచిత కమీషను యొక్క సమావేశమునకు అతను హాజరు కాలేనపుడు, ఈ విషయఘులో చైర్-పర్సన్ చే నామనిర్దేశము చేయబడు ఎవరేని ఇతర సభ్యుడు మరియు అట్టి నామనిర్దేశము చేయనిచో లేక చైర్ పర్సన్ లేనిచో, హాజరయిన సభ్యులలో నుండి ఎంపిక చేసిన ఎవరేని సభ్యుడు సమావేశమునకు అధ్యక్షత వహించవలెను.

(3) సముచిత కమీషను సమక్షమునందు ఉత్పన్నమగు అన్ని ప్రశ్నలకు, హాజరయి మరియు ఓటింగు చేయు సభ్యుల మెజారిటీ ఓట్ల ద్వారా నిర్ణయించబడును. మరియు సమానమైన ఓట్లు వచ్చినచో, చైర్ పర్సన్ లేక అతని గైరుహాజరులో, అధ్యక్షత వహించు వ్యక్తి రెండవ మరియు నిర్ణాయక ఓటును వేయవచ్చును.

(4) ఉప-పరిచ్ఛేదము (3)లో ఇతర విధముగా నిబంధించిననే తప్పు, ప్రతి సభ్యునికి ఒక ఓటు కలిగి ఉండును.

(5) సముచిత కమీషను యొక్క అన్ని ఉత్తర్వులు మరియు నిర్ణయములు, తన కార్యదర్శి లేక ఈ విషయములో చైర్ పర్సన్ చే ప్రాధికారమీయబడిన కమీషను యొక్క ఎవరేని ఇతర అధికారిచే అధి ప్రమాణీకరించబడవలెను.

93. సముచిత కమీషను యొక్క ఏ చర్యగాని లేక ప్రొసీడింగునుగాని ప్రశ్నింపబడరాదు లేక సముచిత కమీషను యొక్క సంఘటనలో ఏదేని ఖాళీ లేక లోపమున్నదను కారణమున మాత్రమే చెల్లనిది కారాదు.

94.(1) సముచిత కమీషను, ఈ చట్టము క్రింద ఏదేని విచారణ లేక ప్రొసీడింగుల ప్రయోజనము నిమిత్తము, ఈ క్రింది విషయములకు సంబంధించి సివిలు ప్రక్రియా స్మృతి, 1908 క్రింద సివిలు న్యాయస్థానములో నిహితమైన అవే అధికారములను కలిగి యుండును. అవేవనగా;-

(ఎ) ఎవరేని వ్యక్తిని సమను చేయుట మరియు తప్పనిసరిగా హాజరగునట్లు చేయుట మరియు ప్రమాణముపై అతనిని పరీక్షించుట;

(బి) సాక్ష్యముగా దాఖలు చేయదగిన ఏదేని దస్తావేజును లేక ఇతర వస్తు విషయమును వెల్లడించుట మరియు దాఖలుపరచుట,

(సి) అఫిడవిట్లపై సాక్ష్యమును పొందుట; ________________

761 G16 - - (డి) ఏదేని పబ్లికు రికార్డును అభ్యర్థించుట;

(ఇ) సాక్ష్యులను పరీక్షించుటకు కమీషను జారీ చేయుట:

(ఎఫ్) తన యొక్క నిర్ణయాలను, ఆదేశములను మరియు ఉత్తర్వులను పునర్విలోకనము చేయుట;

(జి). విహితపరచబడు ఏదేని ఇతర విషయము.

(2) సముచిత కమీషను, తన సమక్షమునందున్న ఏదేని ప్రొసీడింగు, ఆకర్ణన, లేక విషయములో, కమీషను సముచితమని భావించునట్టి మధ్యకాలీన ఉత్తర్వులను జారీ చేయుటకు అధికారములను కలిగియుండును.

(3) సముచిత కమీషను, తన సమక్షమునందున్న ప్రొసీడింగులలో వినియోగదారుల హితమునకై ప్రాతినిధ్యము వహించుటకు, తాను సబబని భావించు. ఎవరేని వ్యక్తికి ప్రాధికారమీయవచ్చును.

95. సముచిత కమీషను సమక్షమునందున్న అన్ని ప్రొసీడింగులు, భారత శిక్షాస్మృతి యొక్క 193 మరియు 228 పరిచ్చేదముల అర్ధపరిధిలో న్యాయిక ప్రొసీడింగుగా భావించబడవలెను. మరియు సముచిత కమీషను, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 345 మరియు 346 పరిచ్ఛేదముల నిమిత్తము సివిలు న్యాయ స్థానముగా భావించబడవలెను.

96. సముచిత కమీషను, లేక కమీషనుచే ఈ విషయములో ప్రత్యేకముగ ప్రాధికారమీయబడు ఒక గెజిటెడు అధికారి హోదాకు తక్కువకాని ఎవరేని అధికారి, విచారణ యొక్క వస్తు విషయమునకు సంబంధించి ఏదేని దస్తావేజు కనుగొనబడినట్లు నమ్ముటకు కారణమున్నదని కమీషను అభిప్రాయపడినచో ఏదేని భవనము లేక స్థలములో ప్రవేశించవచ్చును. మరియు తనకు వర్తించునంత మేరకు క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 100వ పరిచ్చేదపు నిబంధనలకు లోబడి అక్కడ నుండి ఏవేని అట్టి దస్తావేజును అభిగ్రహణ చేయవచ్చును లేక ఉదాహృతులను లేక ప్రతులను తీసుకొన వచ్చును.

97. సముచిత కమీషను, తాను అవసరమని భావించినచో (79వ పరిచ్ఛేదము మరియు 86వ పరిచ్చేదము క్రింది వివాదములను అధినిర్ణయించు అధికారములు మరియు 178వ పరిచ్ఛేదము లేక 181వ పరిచ్ఛేదము క్రింద వినియమములను చేయు అధికారములు మినహా) ఈ చట్టము క్రింద అట్టి తన అధికారములు మరియు కృత్యములు, ఉత్తర్వులో నిర్దిష్ట పరచబడు ఏవేని అట్టి షరతులకు లోబడి సముచిత కమీషను యొక్క ఎవలేని సభ్యుడికి, కార్యదర్శికి, అధికారికి లేక ఇతర వ్యక్తికి, వ్రాసియుంచిన సాధారణ లేక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ప్రత్యాయోజనము చేయవచ్చును. ________________

77677. -

అనుదానములు, నిధి, లెక్కలు, ఆడిటు మరియు రిపోర్టు

98. కేంద్ర ప్రభుత్వము, ఈ విషయమై పార్లమెంటు ద్వారా తగిన వినియోజనము చేసిన పిమ్మట, ఆ ప్రభుత్వము అవసరమని భావించునట్టి డబ్బు మొత్తమును కేంద్ర కమీషనుకు అనుదానములు మరియు అప్పులుగా ఈయవచ్చును.

99.(1) కేంద్ర విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను నిధి అని పిలువబడు. ఒక నిధిని ఏర్పాటు చేయవలెను. మరియు అందులో ఈ క్రింది వాటిని జమచేయవలెను.

(ఎ) 98వ పరిచ్చేదము క్రింద కేంద్ర ప్రభుత్వము ద్వారా కేంద్ర కమీషనుకు ఇచ్చిన ఏవేని అనుదానములు మరియు అప్పులు;

(బి) ఈ చట్టము క్రింద కేంద్ర కమీషనుచే పొందిన అన్ని ఫీజులు:

(సి) కేంద్ర ప్రభుత్వముచే నిర్ణయించబడు ఆట్టి ఇతర వనరుల నుండి కేంద్ర కమీషను పొందు అన్ని మొత్తములు.

(2) నిధిని,

(ఎ) కేంద్ర కమీషను యొక్క చైర్ పర్సన్, సభ్యులు, కార్యదర్శి, అధికారులు మరియు ఇతర ఉద్యోగుల జీతము బత్తెములు మరియు పారితోషికముకు:

(బి) 79వ పరిచ్ఛేదము క్రింద కేంద్ర కమీషను తన కృత్యములను నిర్వర్తించుటకైన ఖర్చులకు;

(సి) ఈ చట్టము ద్వారా ప్రాధికారమొసగబడిన ఉద్దేశాలు మరియు ప్రయోజనాల నిమిత్తము చేయు ఖర్చులకు

వర్తింపజేయవలెను.

(3) కేంద్ర ప్రభుత్వము, భారత కంట్రోలర్ మరియు ఆడిటరు జనరల్ సంప్రతింపుతో, ఉప పరిచ్చేదము (2) యొక్క ఖండము (బి) మరియు (సి)లో నిర్దిష్ట పరచిన ఖర్చుల కొరకైన నిధిని వర్తింపజేయు రీతిని విహితపరచ వలెను.

100.(1) కేంద్ర కమీషను, - భారత కంప్లోలరు మరియు ఆడిటరు జనరులు సంప్రదింపుతో కేంద్ర ప్రభుత్వము ద్వారా విహితపరచబడునట్టి ప్రరూపములో లెక్కలను మరియు ఇతర సంబంధిత రికార్డులను సక్రమముగా నిర్వహించవలెను మరియు వార్షిక లెక్కల వివరణను తయారుచేయవలెను.

(2) కేంద్ర కమీషను లెక్కలను భారత కంప్లోలరు మరియు ఆడిటరు జనరలుచే నిర్దిష్ట పరచబడునట్టి అంతరావధులలో అతనిచే ఆడిటు చేయించవలెను మరియు అట్టి ఆడిటు సందర్భముగా చేసిన ఏవేని ఖర్చులను భారత కంప్టోలరు మరియు ఆడిటరు జనరలునకు కేంద్ర కమీషను ద్వారా చెల్లించవలసి యుండును. ________________

78/ G78.. (3) భారత కంప్లోలరు మరియు ఆడిటరు జనరలు మరియు ఈ చట్టము క్రింద కేంద్ర కమీషను యొక్క లెక్కలను ఆడిటు చేయు విషయములో అతనిచే నియమింపబడిన ఎవరేని వ్యక్తి, ప్రభుత్వ లెక్కలను ఆడిటు చేయు విషయములో కంప్లోలరు మరియు ఆడిటరు జనరలు వలెనే అట్టి ఆడిటు చేయు విషయములో అవే హక్కులను మరియు విశేషాధికార ములను మరియు ప్రాధికారమును కలిగియుండును. మరియు ప్రత్యేకముగా, పుస్తకాలను, లెక్కలను, సంబంధిత వోచర్లకు మరియు ఇతర దస్తావేజులను మరియు కాగితములను దాఖలు చేయుటకు మరియు కేంద్ర కమీషను యొక్క ఏదేని కార్యాలయమును తనిఖీ చేయుటకు అధ్యర్ధన హక్కు కలిగియుండును.

(4) భారత కాంట్రోలరు మరియు ఆడిటరు జనరులు లేక ఈ విషయమై అతనిచే నియమించబడిన ఎవరేని ఇతర వ్యక్తిచే ధృవీకరించిన కేంద్ర కమీషను యొక్క లెక్కలను దాని పై ఆడిటు రిపోర్టుతోసహా కేంద్ర ప్రభుత్వమునకు వార్షికముగా పంపవలెను. మరియు ఆ ప్రభుత్వము, అది అందిన పిమ్మట వెంటనే పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షములో దానిని ఉంచునట్లు చూడవలెను.

101.(1) కేంద్ర కమీషను, ప్రతి సంవత్సరములో ఒకసారి, విహితపరచబడునట్టి ప్రరూపములోను మరియు అట్టి సమయములోను, గత సంవత్సరములో తన కార్యకలాపాల యొక్క సంక్షిప్త వార్షిక నివేదికను తయారు చేయవలెను. మరియు నివేదిక యొక్క ప్రతులను కేంద్ర ప్రభుత్వమునకు పంపవలెను.

(2) ఉప పరిచ్ఛేదము (1) క్రింద అందిన నివేదిక యొక్క ప్రతిని, అది అందిన పిమ్మట వెంటనే, పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షములో నుంచవలెను.

102. రాజ్య ప్రభుత్వము, ఈ విషయమై రాజ్య శాసనమండలిచే తగిన వినియోజనము చేసిన పిమ్మట, ఆ ప్రభుత్వము అవసరమని భావించు అట్టి డబ్బు మొత్తములను రాజ్య కమీషనుకు అనుదానములు మరియు అప్పులుగాను ఈయవచ్చును.

103 (1) రాజ్య విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను నిధి అని పిలువబడు ఒక నిధిని ఏర్పాటు చేయవలెను మరియు దానిలో

(ఎ) 102వ పరిచ్ఛేదము క్రింద రాజ్య ప్రభుత్వముచే రాజ్య కమీషనుకు ఇచ్చిన ఏవేని అనుదానములు మరియు అప్పులు;

(బి) ఈ చట్టము క్రింద రాజ్య కమీషను స్వీకరించిన అన్ని ఫీజులు;

(సి) రాజ్య ప్రభుత్వముచే నిర్ణయించబడు అట్టి ఇతర వనరుల నుండి రాజ్య కమీషను స్వీకరించిన అన్ని మొత్తములు

జమ చేయవలెను. ________________ (2) ఈ నిధిని;-

(ఎ రాజ్య కమీషను, యొక్క చైర్ పర్సన్, సభ్యులు, కార్యదర్శి, అధికారులు, మరియు ఇతర ఉద్యోగుల జీతము, బత్తెములు మరియు ఇతర పారితోషికములను;

(బి) 86వ పరిచ్ఛేదము క్రింద, తన కృత్యములను నిర్వర్తించుటకై రాజ్య కమీషను చేయు ఖర్చులను;

(సి) ఈ చట్టము ద్వారా ఉద్దేశాలకు మరియు ప్రయోజనాల కొరకు అధికార మీయబడిన ఖర్చులను,

చెల్లించుటకు వర్తింప జేయవలెను.

(3) రాజ్య ప్రభుత్వము, భారత కంప్టోలరు మరియు ఆడిటరు జనరలు సంప్రతింపుతో ఉప - పరిచ్చేదము (2) యొక్క ఖండము (బి) లేక ఖండము (సి) నిర్దిష్ట పరచిన ఖర్చుల చెల్లింపు కొరకు నిధిని వర్తింపజేయు రీతిని విహితపరచవలెను.

104 (1) రాజ్య కమీషను, భారత కంప్లోలరు మరియు ఆడిటరు జనరలు సంప్రదింపుతో రాజ్య ప్రభుత్వము ద్వారా విహితపరచబడునట్టి ప్రరూపములో లెక్కలను మరియు ఇతర సంబంధిత రికార్డులను సక్రమముగా నిర్వహించవలెను మరియు లెక్కల వార్షిక వివరణను తయారు చేయవలెను.

(2) రాజ్య కమీషను లెక్కలను, భారత కంట్రోలరు మరియు ఆడిటరు జనరలుచే నిర్దిష్ట పరచబడునట్టి అంతరావధులలో, అతనిచే ఆడిటు చేయబడవలెను మరియు అట్టి ఆడిటు సందర్భముగా చేసిన ఏవేని ఖర్చులను భారత కంప్లోలరు మరియు ఆడిటరు జనరలుకు రాజ్య కమీషను ద్వారా చెల్లించబడవలెను.

(3) భారత కంట్రోలరు. మరియు ఆడిటరు జనరలు మరియు ఈ చట్టము క్రింద రాజ్య కమీషను యొక్క లెక్కలను ఆడిటు చేయు విషయములో అతనిచే నియమింప బడిన ఎవరేని వ్యక్తి, ప్రభుత్వ లెక్కలను ఆడిటు చేయు విషయములో సాధారణముగా కంప్లోలరు మరియు ఆడిటరు జనరలు వలెనే అట్టి ఆడిటు చేయు విషయములో అవే హక్కులను మరియు విశేషాధికారములను మరియు ప్రాధికారమును కలిగియుండును. మరియు ప్రత్యేకముగా, పుస్తకాలను, లెక్కలను, సంబంధిత వోచర్లను మరియు ఇతర దస్తావేజులను మరియు కాగితములను సమర్పించ మని కోరుటకు మరియు రాజ్య కమీషను యొక్క ఏవేని కార్యాలయములను తనిఖీ చేయుటకు అధ్యర్ధన హక్కు కలిగియుండును. ________________

- 80/G8 (4) భారత కంప్టోలరు మరియు ఆడిటరు జనరలు లేక ఈ విషయమై అతనిచే నియమించబడిన ఎవరేని ఇతర వ్యక్తిచే ధృవీకరించిన రాజ్య కమీషను యొక్క లెక్కలను, దానిపై ఆడిటు రిపోర్టుతో సహా రాజ్య ప్రభుత్వమునకు వార్షికముగా పంపవలెను. మరియు ప్రభుత్వము అది అందిన పిమ్మట వెంటనే రాజ్య శాసనమండలి యొక్క సనుక్షములో దానిని ఉంచునట్లు చూడవలెను.

105.(1) రాజ్య కమీషను, ప్రతి సంవత్సరమునకు ఒకసారి గత సంవత్సరములో తన కార్యకలాపాల సంక్షిప్త వార్షిక నివేదికను, విహితపరచబడునట్టి ప్రరూపములో మరియు అట్టి సమయములో తయారు చేయవలెను. మరియు ఆ నివేదిక ప్రతులను రాజ్య ప్రభుత్వమునకు పంపవలెను.

(2) ఉప-పరిచ్చేదము (1) క్రింద అందిన నివేదిక యొక్క ప్రతిని, అది అందిన పిమ్మట, వెంటనే రాజ్య శాసనమండలి సమక్షమున ఉంచవలెను.

106. సముచిత కమీషను, ఆ కమీషను యొక్క అంచనా వసూళ్లూ మరియు వ్యయమును చూపుతూ, తదుపరి విత్తీయ సంవత్సరము కొరకు తన బడ్జెటును విహితపరచబడు ప్రతి విత్తీయ సంవత్సరములో అట్టి ప్రరూపములోను మరియు అట్టి సమయములోను తయారు చేయవలెను మరియు దానిని సముచిత ప్రభుత్వమునకు పంపవలెను.

107 (1) కేంద్ర కమీషను, తన కృత్యములను నిర్వర్తించుటలో, వ్రాతపూర్వకముగా తనకు కేంద్ర ప్రభుత్వము ఇచ్చునట్టి ప్రజాహితము కూడియుండు విధాన విషయములో అట్టి ఆదేశములను పాటించవలెను.

(2) ప్రజాహితము కూడియున్న విధాన విషయమునకు సంబంధించి ఏవేని అట్టి ఆదేశమునకు సంబంధించి ఏదేని ప్రశ్న ఉత్పన్నమైనచో, దానిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయము అంతిమమగును.

108 (1) రాజ్య కమీషను తన యొక్క కృత్యములను నిర్వర్తించుటలో, రాజ్య ప్రభుత్వముచే వ్రాతపూర్వకముగా వ్రాసి ఉంచబడినట్టి ప్రజాహితము కలిగియుండు విధాన విషయములలో, అట్టి ఆదేశములను పాటించవలెను.

(2) ప్రజాహితము కలిగియుండు విధాన విషయమునకు సంబంధించి అట్టి ఏదేని ఆదేశము విషయములో ఏదేని ప్రశ్న ఉత్పన్న మైనచో, దాని పై రాజ్య ప్రభుత్వ నిర్ణయము అంతిమమైనదగును. ________________ 811681 : 109. ఈ చట్టములో ఏమి ఉన్నప్పటికిని, 83వ పరిచ్ఛేదము క్రింద ఏదేని సంయుక్త కమీషను ఏర్పాటు చేసినచో,

(ఎ) రాజ్య ప్రభుత్వము కొరకు ఏర్పాటు చేసిన సంయుక్త కమీషను, రాజ్యము యొక్క అనన్య ప్రాదేశిక అధికారితా పరిధి. క్రిందకి వచ్చు. ఆదేశపు విషయమునకు 'సంబంధించినట్టి సందర్భములలో మాత్రమే ఈ చట్టము క్రింద ఏదేని ఆదేశము నిచ్చుటకు సవర్ధత కలిగియుండును;

(బి) కేంద్ర ప్రభుత్వము మాత్రమే, పాల్గొను ప్రభుత్వములు కరారును చేసుకొనుటలో విఫలమైనచో లేక పాల్గొను రాజ్యములు లేక వారిలో మెజారిటీ వారికి కేంద్ర ప్రభుత్వమును అట్టి ఆదేశములను జారీ చేయుమని కోరినచో, రెండు లేక అంతకన్నా ఎక్కువ రాజ్యముల ప్రాదేశిక అధికారితా పరిధిలోపు విషయములకు సంబంధించి లేక సంఘ రాజ్య క్షేత్రమునకు సంబంధించి ఏదేని ఆదేశము ఉన్నచో, ఈ చట్టము క్రింద ఏదేని ఆదేశమునిచ్చుటకు, సమర్థత కలిగియుండును.

భాగము-11

విద్యుచ్ఛక్తి కొరకు అపీలు ట్రిబ్యునలు.

110. కేంద్ర ప్రభుత్వము, అధి సూచన ద్వారా, ఈ చట్టము లేదా తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము క్రింద అధినిర్ణయ అధికారి లేక సముచిత కమీషను యొక్క ఉత్తర్వులపై అపీలును ఆకర్ణించుటకు విద్యుచ్ఛక్తి కొరకైన అపీలు ట్రిబ్యునలుగా పిలువబడు ఒక అపీలు ట్రిబ్యునలును స్థాపన చేయవచ్చును.

111.(1) ఈ చట్టము క్రింద అధినిర్ణయము చేయు అధికారి ద్వారా చేయబడిన (127వ పరిచ్ఛేదము మినహా) లేక ఈ చట్టము క్రింద సముచిత కమీషను ద్వారా చేయబడిన ఉత్తర్వు ద్వారా వ్యధితుడైన ఎవరేని వ్యక్తి విద్యుచ్ఛక్తి కొరకు అపీలు ట్రిబ్యునలుకు అపీలు చేసుకొనవచ్చును.

అయితే, ఏదేని పెనాల్టీ విధించు అధినిర్ణయ అధికారి యొక్క ఉత్తర్వు పై అపీలు చేయు ఎవరేని వ్యక్తి, అపీలు దాఖలు చేయునపుడు, అట్టి పెనాల్టీ మొత్తమును డిపాజిటు చేయవలెను.

అంతేకాక, ఏదేని ప్రత్యేక సందర్భములో, ఆపీలు ట్రిబ్యునలు, అట్టి పెనాల్టీని డిపాజిటు చేయుట ద్వారా అట్టి వ్యక్తికి అనుచితమైన కష్టము కలుగునని అభిప్రాయపడినచో, పెనాల్టీ రాబట్టుటకు సంరక్షణగా తాను అవసరమని భావించునట్టి షరతుల విధింపుకు లోబడి అట్టి డిపాజిటును, అపీలు ట్రిబ్యునలు, మినహాయించవచ్చును. ________________ (2) ఉప పరిచ్ఛేదము (1) క్రింద ప్రతీ అపీలు, వ్యధితుడైన వ్యక్తికి, ఆధినిర్ణయం అధికారి లేక సముచిత కమీషను ద్వారా ఇచ్చిన ఉత్తర్వు యొక్క ప్రతి అందిన తేదీ నుండి నలుబది అయిదు రోజుల కాలావధి లోపు, దాఖలు చేయవలెను మరియు అది, విహిత పరచబడునట్టి ప్రరూపములో నుండి, అట్టి రీతిలో సత్యాపనము చేయబడి మరియు 'అట్టి ఫీజుతో జతపరచబడి యుండవలెను.

అయితే, అపీలు ట్రిబ్యునలు, అట్టి, కాలావధి లోపు దానిని దాఖలు చేయకుండుటకు తగిన కారణమున్నదని తాను సంతృప్తి చెందినచో, సదరు నలుబది ఐదు రోజుల కాలావధి ముగిసిన పిమ్మట అపీలును స్వీకరించవచ్చును.

(3) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద అపీలు అందిన మీదట, అపీలు చేసుకొనుటకు అపీలు ట్రిబ్యునలు, ఆకర్ణింపబడుటకు, పక్షకారులకు అవకాశము నిచ్చిన మీదట, అపీలు చేసిన ఉత్తర్వులను దృఢపరచుచూ, మార్పు చేయుచూ లేక త్రోసిపుచ్చుచూ దానిపై తాను సబబని భావించునట్టి ఉత్తర్వులను జారీ చేయవచ్చును.

(4) అపీలు ట్రిబ్యునలు, తాను జారీచేసిన ప్రతి ఉత్తర్వు యొక్క ప్రతిని అపీలు పక్షకారులకు మరియు సందర్భానుసారము సంబంధిత అధినిర్ణయ అధికారికి లేక సముచిత కమీషనుకు పంపవలెను.

(5) ఉప పరిచ్ఛేదము (1) క్రింద అపీలు ట్రిబ్యునలు సమక్షమున దాఖలు చేసిన అపీలును సాధ్యమైనంత త్వరితగతిన విచారించవలెను మరియు అపీలు అందిన తేదీ నుండి నూట ఎనభై రోజుల లోపు. అంతిమముగా అపీలును పరిష్కరించుటకు తాను ఆ ప్రయత్నించవలెను.

అయితే, ఏదేని అపీలును, సదరు నూట ఎనభై రోజుల కాలావధి లోపు పరిష్కరించనియెడల, అపీలు ట్రిబ్యునలు, సదరు కాలావధిలోపు అపీలును పరిష్కరించకుండుటకు గల కారణములను వ్రాతపూర్వకముగా వ్రాసి యుంచవలెను.

(6) అపీలు ట్రిబ్యునలు, ఈ చట్టము క్రింద అధినిర్ణయ అధికారి లేక సందర్భాను సారము సముచిత కమీషను ద్వారా చేసిన ఏదేని ఉత్తర్వు యొక్క శాసన మాన్యతను, తన ఔచిత్యము లేక యదార్ధతను పరిశీలించు నిమిత్తము, ఏదేని ప్రొసీడింగుకు సంబంధించి, తనంతట తానుగా లేక ఇతర విధముగా తాను సబబని భావించినచో, అట్టి ప్రొసీడింగుల రికార్డును తెప్పించ వచ్చును మరియు ఆ కేసులో అట్టి ఉత్తర్వును చేయవచ్చును.

112.(1) అపీలు ట్రిబ్యునలు, చైర్-పర్సన్ మరియు ముగ్గురు ఇతర సభ్యులతో కూడి ఉండవలెను. ________________

83683 :

(2) ఈ చట్టపు నిబంధనలకు లోబడి, -

(న) అపీలు ట్రిబ్యునలు యొక్క అధికారితా పరిధిని వాటి యొక్క బెంచీలు (న్యాయ పీఠములు) వినియోగించవచ్చును;

(బి) అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్-పర్సన్ తాను సబబని భావించినచో, అపీలు ట్రిబ్యునలు యొక్క ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ సభ్యులతో అపీలు ట్రిబ్యునలు ఛైర్-పర్సన్ ద్వారా ఒక బెంచీని (న్యాయపీఠమును) ఏర్పాటు చేయవచ్చును.

అయితే ఈ ఖండము క్రింద ఏర్పాటైన ప్రతి బెంచీలో (న్యాయ పీఠములో) కనీసము ఒక న్యాయక సభ్యుడు మరియు ఒక సాంకేతిక సభ్యుడు, చేరి ఉండవలెను;

(సి) అపీలు ట్రిబ్యునలు బెంచీలు. (న్యాయపీఠములు), సాధారణముగా ఢిల్లీలో మరియు కేంద్ర ప్రభుత్వము, అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ ను సంప్రదింపుతో, అధి సూచించిన అట్టి ఇతర స్థలములలో ఉపవిష్టుడగును.

(డి) కేంద్ర ప్రభుత్వము, అపీలు ట్రిబ్యు లు యొక్క ప్రతి బెంచీ (న్యాయపీఠము)తమ అధికారితా పరిధిని వినియోగించుటకు సంబంధించిన ప్రాంతములను అధి సూచించవలెను.

(3) ఉప-పరిచ్ఛేదము (2)లో ఏమియున్నప్పటికిని, అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్, అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుడిని ఒక బెంచీ (న్యాయపీఠము) నుండి మరో బెంచీకి (న్యాయపీఠమునకు) బదిలీ చేయవచ్చును.

విశదీకరణము

:- ఈ అధ్యాయపు నిమిత్తము

(i) "న్యాయిక సభ్యుడు" అనగా 113వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (బి)లోని ఉప ఖండము. (i) క్రింద అట్లు నియమించబడిన అపీలు ట్రిబ్యునలు సభ్యుడు అని అర్ధము మరియు ఇందులో అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ చేరియుండును.

(ii) "సాంకేతిక సభ్యుడు " అనగా 113వ పరిచ్ఛేదపు ఉప పరిచ్చేదము (1) యొక్క ఖండము (బి)లోని ఉప ఖండము (ii) లేక ఉప ఖండము (ii) క్రింద అట్లు నియమించబడిన అపీలు ట్రిబ్యునలు సభ్యుడు అని అర్ధము.

113 (1) ఒక వ్యక్తి,-

(ఎ) సర్వోన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా లేదా ఉన్నత న్యాయస్థానపు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న లేక ఉండియున్న అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ విషయములో, మరియు ________________

84/G84 (బి) అపీలు ట్రిబ్యునలు సభ్యుని విషయములో,-

(i) ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా ఉన్న, లేక ఉండియున్న లేక ఉండుటకు అర్హత కలిగిన; లేక

(ii) ఆర్ధిక వ్యవహారములు లేక విషయములు లేక మౌళిక సదుపాయములను నిర్వహించు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేక విభాగములో కనీసము ఒక సంవత్సరము వరకు కార్యదర్శిగా ఉన్న లేక ఉండియున్న; లేక

(iii) విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము మరియు పంపిణీ మరియు క్రమబద్ధీకరణ లేక ఆర్థికశాస్త్రము, వాణిజ్యశాస్త్రము, న్యాయశాస్త్రము, లేక మేనేజిమెంటులకు, సంబంధించిన విషయాలను నిర్వహించుటలో సామర్థ్యము, మరియు స్థాయి ఉండి, తగిన పరిజ్ఞానము లేక అనుభవము కలిగియున్న లేక ఉండియున్న ఒక వ్యక్తి, -

అయిననే తప్ప, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ లేక అపీలు ట్రిబ్యునలు సభ్యుడుగా నియమింపబడుటకు అర్హుడు కాడు.

(2) అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ ను భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన పిమ్మట కేంద్ర ప్రభుత్వము నియమించవలెను.

(3) అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యులను 78వ పరిచ్ఛేదములో నిర్దేశించిన ఎంపిక కమిటీ యొక్క సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వము నియమించవలెను.

(4) అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్-పర్సన్ లేక ఇతర సభ్యుని నియామకము కొరకు ఎవరేని వ్యక్తిని నియమించుటకు పూర్వము, కేంద్ర ప్రభుత్వము, అట్టి ఛైర్ పర్సన్ లేక సభ్యుడి, తన కృత్యములకు భంగము వాటిల్లునట్లుగా ఏదేని ఆర్ధిక లేక ఇతర హితము లేనట్టి వ్యక్తిగా ఉండునట్లు, తనంతటతాను సంతృప్తి చెందవలెను.

114. అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ లేక అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుడు, అతను పదవిలోకి వచ్చిన తేదీ నుండి మూడు సంవత్సరముల కాలావధి వరకు అట్లు పదవి యందు కొనసాగవలెను:

అయితే, అట్టి ఛైర్ పర్సన్ లేక సభ్యుడు మూడు సంవత్సరముల కాలావధికి రెండవసారి తిరిగి నియామకమున కై అర్హుడగును.

అంతేగాక, అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ లేక సభ్యుడు,

(ఎ) అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ విషయములో, 70 సంవత్సరముల వయస్సు;

(బి) అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుని విషయములో 65 సంవత్సర ముల వయస్సు -

నిండిన తరువాత అట్లు పదవి యందు కొనసాగరాదు. ________________

- 851685

115. అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ మరియు అషీలు ట్రిబ్యునలు యొక్క సభ్యులకు చెల్లించవలసిన జీతము మరియు బత్తెములు మరియు ఇతర సేవాషరతులు మరియు నిబంధనలు కేంద్ర ప్రభుత్వము ద్వారా విహితపరచబడునట్లుండవలెను.

అయితే, అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్-పర్సన్ లేక అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుని జీతము నురియు బత్తెములుగాని, లేక ఇతర సేవా షరతులు లేక నిబంధనలు గాని, నియామకము జరిగిన పిమ్మట అతనికి అననుకూలముగా మార్చరాదు.

116. తాత్కాలిక గైరుహాజరు కానట్టి ఏదేని ఇతర కారణమున్నచో, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ లేక అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుని పదవిలో ఏదేని ఖాళీ ఏర్పడినపుడు, కేంద్ర ప్రభుత్వము, ఖాళీని భర్తీ చేయుటకు ఈ చట్టపు నిబంధనల ననుసరించి మరొక వ్యక్తిని నియమించవలెను మరియు ప్రొసీడింగులు, ఖాళీని భర్తీ చేసిన దశ నుండి అపీ లేటు ట్రిబ్యునలు సమక్షమున కొనసాగించవలెను.

117.(1) అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ లేక ఆపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుడు, కేంద్ర ప్రభుత్వమునకు తన దస్తూరీతో వ్రాసియుంచిన నోటీసు ద్వారా తన పదవికి రాజీనామా చేయవచ్చును.

అయితే, అపీలు, ట్రిబ్యునలు చైర్ పర్సన్ లేక అపీలు ట్రిబ్యునలు యొక్క సభ్యుడు, కేంద్ర ప్రభుత్వము ద్వారా అనుమతి పొందిననే తప్ప, అట్టి నోటీసు అందిన తేదీ నుండి మూడు మాసములు ముగియు వరకు లేదా అతని పదవిలో అతని ఉత్తరాధికారిగా తగురీతిగా నియమించిన వ్యక్తి వచ్చునంత వరకు లేదా పదవి కాలావధి ముగియునంత వరకు, వీటిలో ఏది ముందయినచో దానికి వెంటనే పదవియందు కొనసాగుట నుండి వదులుకొనవచ్చును.

(2) అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ ను లేక అపీలు ట్రిబ్యునలు సభ్యుడిని, అట్టి నేరారోపణల విషయములో అపీలు ట్రిబ్యునలు యొక్క సంబంధిత చైర్ పర్సన్ లేక సభ్యునికి, అతని పై మోపబడిన నేరారోపణలను తెలియపరుస్తూ మరియు ఆకర్షింపబడుటకు తగిన అవకాశము నిచ్చిన సందర్భములో ఈ ప్రయోజనము నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము నియామకము చేయు సర్వోన్నత న్యాయస్థానము యొక్క న్యాయాధీశునిచే పరిశీలన జరుపబడిన పిమ్మట నిరూపించబడిన దుర్వర్తన లేక అసమర్థత కారణముగా, కేంద్ర ప్రభుత్వము ద్వారా, ఉత్తర్వు ఇవ్వబడిననే తప్ప, అతనిని పదవి నుండి తొలగించరాదు.

118. (1) మరణము, రాజీనామా లేక ఇతర కారణముగా అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ పదవిలో ఏదేని ఖాళీ ఏర్పడిన సందర్భములో, అపీలు ట్రిబ్యునలు యొక్క అత్యంత సీనియరు సభ్యుడు, అట్టి ఖాళీని పూరించుటకు ఈ చట్టపు నిబంధనల ననుసరించి నియమితుడైన నూతన చైర్ పర్సన్, అతను పదనిలో చేరు. తేదీ వరకు, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ గా వ్యవహరించవలెను. ________________

- 86/G86.. (2) అపీలు ట్రిబ్యునలు యొక్క ఛైర్ పర్సన్ గైరుహాజరు, అనారోగ్యము లేక ఏదేని ఇతర కారణముగా అతని కృత్యములను నిర్వర్తించలేనపుడు, అపీలు ట్రిబ్యునలు యొక్క అత్యంత సీనియరు సభ్యుడు, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ తన విధులకు హాజరగు తేదీ వరకు, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ యొక్క కృత్యములను అతను నిర్వర్తించవలెను.

119.(1) కేంద్ర ప్రభుత్వము, తాను సబబని భావించునట్టి అధికారులను మరియు ఇతర ఉద్యోగులను అపీలు ట్రిబ్యునలుకు ఏర్పాటు చేయవలెను.

(2) అపీలు ట్రిబ్యునలు యొక్క అధికారులు మరియు ఇతర ఉద్యోగులు, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ యొక్క సాధారణ అధీక్షణత క్రింద వారి కృత్యములను నిర్వర్తించ వలెను.

(3) అపీలు ట్రిబ్యునలు యొక్క అధికారులు మరియు ఇతర ఉద్యోగుల జీతములు మరియు బత్తెములు మరియు ఇతర సేవాషరతులు మరియు నిబంధనలు, కేంద్ర ప్రభుత్వము విహితపరచబడు నట్లుండవలెను.

120.(1) ఆపీలు ట్రిబ్యునలు, సివిలు ప్రక్రియా స్మృతి, 1908 ద్వారా నిబంధించబడిన ప్రక్రియకు కట్టుబడియుండదు, అయితే సహజసిద్ధ న్యాయ సూత్రములు మరియు ఈ చట్టపు నిబంధనలకు లోబడి మార్గదర్శకముగా నుండును మరియు అపీలు ట్రిబ్యునలు తన స్వంత ప్రక్రియను క్రమబద్ధీకరించుటకు అధికారములు కలిగియుండును.

(2) అపీలు ట్రిబ్యునలు, ఈ చట్టము క్రింద తన కృత్యములను నిర్వర్తించు ప్రయోజనాల నిమిత్తము, ఈ క్రింది వాటికి సంబంధించిన విషయాలలో, ఒక దావాను విచారించుచున్నపుడు, సివిలు ప్రక్రియా స్మృతి, 1908 క్రింద సివిలు న్యాయస్థానములో నిహితమైన అవే అధికారములను కలిగియుండును, అవేవనగా -

(ఎ) ఎవరేని వ్యక్తిని సమను చేయుటకు మరియు అతనిని తప్పనిసరిగా హాజరగు నట్లు చూచుటకు మరియు అతనిని ప్రమాణము పై పరీక్షించుటకు;

(బి) దస్తావేజులను వెల్లడించుట మరియు దాఖలు చేయమని కోరుట;

(సి) అఫిడవిట్లపై సాక్ష్యమును పొందుట;

(డి) భారతసాక్ష్య చట్టము, 1872 యొక్క 123 మరియు 124 పరిచ్ఛేదపు నిబంధనలకు లోబడి, ఏదేని కార్యాలయము నుండి ఏదేని పబ్లికు రికార్డును లేక దస్తావేజును లేక అట్టి రికార్డు లేక దస్తావేజు ప్రతిని అభ్యర్ధించుట;

(ఇ) సాక్ష్యులను లేక దస్తావేజులను పరీక్షించుటకై కమీషన్లను జారీచేయుట;

(ఎఫ్) తన నిర్ణయాలను పునర్విలోకనము చేయుట: ________________

(జి) వ్యతిక్రమమైన వినతి పత్రమును త్రోసిపుచ్చుట లేక ఏకపక్షముగా నిర్ణయించుట;

(హెచ్) ఏదేని బర్తరఫు ఉత్తర్వును లేక ఏదేని వ్యతిక్రమమైన వినతి పత్రమును లేక ఏకపక్షముగా జారీచేసిన ఏదేని ఉత్తర్వును కొట్టివేయవచ్చును.

(ఐ) కేంద్రప్రభుత్వము ద్వారా విహితపరచబడు ఏదేని ఇతర విషయము.

(3) ఈ చట్టము క్రింద అపీలు ట్రిబ్యునలు ద్వారా చేసిన ఉత్తర్వు సివిలు న్యాయ స్థానపు డిక్రీగా అపీలు ట్రిబ్యునలుచే అమలుపరచదగి ఉండును. మరియు ఇందు నిమిత్తము అపీలేటు ట్రిబ్యునలు, సివిలు న్యాయస్థానము యొక్క అన్ని అధికారములను కలిగియుండును.

(4) ఉప-పరిచ్ఛేదము (3)లో ఏమి ఉన్నప్పటికినీ, అపీలు ట్రిబ్యునలు, స్థానిక అధికారితా పరిధి కలిగిన సివిలు న్యాయస్థానమునకు, తనచే చేయబడిన ఏదేని ఉత్తర్వును పంపవచ్చును. మరియు అట్టి సివిలు న్యాయస్థానము, ఆ న్యాయస్థానముచే చేయబడిన డిక్రీ వలె ఆ ఉత్తర్వును అమలు పరచవలెను.

(5) అపీలు ట్రిబ్యునలు సమక్షములోని ప్రొసీడింగులన్నియు భారత శిక్షా స్మృతి యొక్క 193 మరియు 228 పరిచ్ఛేదముల అర్థపరిధిలో న్యాయిక ప్రొసీడింగుగా భావించవలెను మరియు అపీలు ట్రిబ్యునలు, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 345 మరియు 346 పరిచ్ఛేదముల నిమిత్తము సివిలు న్యాయస్థానముగా భావించబడవలెను.

121. ఆపీలు ట్రిబ్యునలు, సముచిత కమీషను లేదా ఆయా సమయమునందు ఎవరేని హితము కలిగిన ఇతర పక్షకారు ఉన్నచో వారిని ఆకర్ణింపబడిన పిమ్మట ఈ చట్టము క్రింద దాని యొక్క శాసనపరమైన కృత్యములను నిర్వర్తించుట కొరకుగాను ఏదేని సముచిత కమీషనుకు అది సబబని భావించినట్టి ఉత్తర్వులను, అనుదేశములను లేదా ఆదేశములను జారీ చేయవచ్చును.

122.(1) బెంచీల (న్యాయపీఠములు) ఏర్పాటు జరిగినపుడు, అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్, ఆయాసమయములందు, అధి సూచన ద్వారా బెంచీల (న్యాయపీఠములు) మధ్య అపీలు ట్రిబ్యునలు యొక్క కార్యకలాపాలను పంపిణీ చేయుటకు నిబంధనలు చేయవచ్చును మరియు ప్రతి బెంచీ (న్యాయపీఠము) వ్యవహరించవలసిన విషయాల కొరకు కూడా నిబంధనలు చేయవచ్చును. ________________

....88/G88 (2) ఎవరేని పక్షకారులు దరఖాస్తు పై మరియు పక్షకారులకు నోటీసు ఇచ్చిన పిమ్మట మరియు అతను ఆకర్ణింపబడుటకు కోరినచో అటువంటి వారిని ఆకర్ణింపబడిన పిమ్మట లేక తనంతట తానుగా అట్టి నోటీసు లేకుండా, అపీలు ట్రిబ్యునలు చైర్ పర్సన్ ఒక బెంచీ సమక్షముననున్న ఏదేని కేసు పరిష్కరింపబడుటకు, ఏదేని. ఇతర బెంచీకి బదిలీ చేయవచ్చును.

123. ఇద్దరు సభ్యులు కూడిన బెంచీలోని (న్యాయ పీఠములలోని) అపీలు ట్రిబ్యునలు సభ్యులు ఏదేని అంశముపై ఏకీభవించని యెడల, వారు ఏకీభవించని అంశము లేక అంశములను తెలియజేయపలెను. మరియు దానిని అపీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ కు నిర్దేశించవలెను. మరియు అతను ఆ అంశము లేక అంశములను ఆకర్ణించుటగాని లేక ఆ విషయమును ఆకర్ణించుటకు అట్టి అంశము లేక అంశములను ఒకటి లేక అంతకంటే ఎక్కువ మంది అపీలు ట్రిబ్యునలు ఇతర సభ్యులకు నిర్దేశించవలెను మరియు అట్టి అంశము లేక అంశములను మొదటి ఆకర్షించిన వారితో సహా ఆ విషయమును ఆకర్షించిన అపీలు ట్రిబ్యునలు సభ్యుల యొక్క మెజారిటీ అభిప్రాయము ప్రకారము నిర్ణయించవలెను.

124(1) ఈ చట్టము క్రింద అపీలు ట్రిబ్యునలుకు అపీలు చేసుకొను ఒక వ్యక్తి, స్వయముగాగాని లేక సందర్భానుసారము అపీలు ట్రిబ్యునలు సమక్షమున అతని కేసును విన్నవించుకొనుటకు అతని కోరిక పై న్యాయవాది సహాయమును పొందవలేను.

(2) సముచిత కమీషను ప్రిసెంటింగ్ అధికారులుగా వ్యవహరించుటకు ఒకరు లేక అంతకన్నా ఎక్కువ న్యాయవాదులకు లేక దాని యొక్క ఎవరేని అధికారులకు ప్రాధికారమీయ వచ్చును. మరియు అట్లు ప్రాధికార మీయబడిన ప్రతి వ్యక్తి సందర్భానుసారము అపిలేటు ట్రిబ్యునలు సమక్షముననున్న ఏదేని అపీలు విషయములో కేసును విన్నవించుకొనుటకు ప్రాధికార మీయవచ్చును.

125. అపీలు ట్రిబ్యునలు యొక్క ఏదేని నిర్ణయము లేక ఉత్తర్వు ద్వారా వ్యధితుడైన ఎవరేని వ్యక్తి సివిలు ప్రక్రియా స్మృతి, 1908 యొక్క 100వ పరిచ్చేదములో నిర్దిష్ట పరచిన ఏదేని ఒక లేక అంతకన్నా ఎక్కువ కారణాల పై అతనికి అపీలు ట్రిబ్యునలు నిర్ణయము లేక ఉత్తర్వు తెలియపరిచిన తేదీ నుండి అరువది దినముల లోపు సర్వోన్నత న్యాయస్థానములో అపీలు చేయవచ్చును.

అయితే సర్వోన్నత న్యాయస్థానము, సదరు కాలావధి లోపు అపీలు దాఖలు చేయుట నుండి అపీలుదారును నివారించుటకు తగిన కారణములు ఉన్నవని సంతృప్తి చెందినచో,అరువది దినములు మించకుండా అదనపు కాలావధి లోపు దాఖలు చేయుటకు అనుమతించవలెను. ________________

... 89/689

భాగము - 12

దర్యాప్తు మరియు అమలు

126 (1) ఏదేని స్థలము లేక ప్రాంగణము తనిఖీ చేయునపుడు లేక తనిఖీ చేసిన పిన్ముట పరికరములు, గాడ్జెట్లు, యంత్రములు, డివైజులు (ఆకృతులు) కలిపినట్లు లేక తనిఖీ పిమ్మట ఎవ రేని వ్యక్తిచే రికార్డులు నిర్వహింపబడిన పిమ్మట వినియోగింపబడినట్లు కనుగొన బడినచో, నిర్ధారణ అధికారి, అట్టి వ్యక్తి విద్యుత్తు వినియోగమునకు అనధికారముగా పాల్పడినట్లు అభిప్రాయమునకు వచ్చినచో, అట్టి వ్యక్తి లేక అట్టి వినియోగము వలన లబ్ది పొందిన ఎవరేని ఇతర వ్యక్తి చెల్లించదగు విద్యుత్తు ఛార్జీలను, ఆతను తన యొక్క అభీష్టము మేరకు తాత్కాలికముగా నిర్ధారించవలెను.

2. తాత్కాలిక అంచనా ఉత్తర్వు విహితపరచబడునట్టి రీతిలో ఆ స్థలము లేక ప్రాంగణము యొక్క ఆక్రమణ లేక స్వాధీనము లేక ఇన్-ఛార్జీలోనున్న వ్యక్తిపై తామీలు చేయవలెను.

(3) ఉప-పరిచ్చేదము (2) క్రింద ఉత్తర్వు తామీలు చేయబడిన వ్యక్తి నిర్ధారణ అధికారి సమక్షమున తాత్కాలిక అంచనా పై ఏవేని అభ్యంతరములు ఉన్నచో, వాటిని దాఖలు చేయుటకు హక్కు కలిగియుండును అట్టి వ్యక్తికి ఆకర్ణింపబడుటకు తగిన అవకాశము నిచ్చిన మీదట చెల్లించదగు విద్యుచ్ఛక్తి ఛార్జీల యొక్క అట్టి తాత్కాలిక అంచనా ఉత్తర్వును లామీలు చేసిన తేదీ నుండి ముప్పది దినముల లోపల తుది అంచనా ఉత్తర్వును జారీ చేయవలెను.

(4) తాత్కాలిక అంచనా ఉత్తర్వును తామీలు చేయబడిన ఎవరేని వ్యక్తి అట్టి అంచనాను స్వీకరించవచ్చును మరియు అట్టి తాత్కాలిక అంచనా ఉత్తర్వును అతని పై తామీలు చేసిన ఏడు రోజుల లోపు లైసెన్సుదారుతో అంచనా మొత్తమును డిపాజిటు చేయవలెను.

(5) విద్యుచ్ఛక్తి అనధికారముగా ఉపయోగించబడుచున్నదని నిర్ధారణ అధికారి తుది నిర్ణయమునకు వచ్చినచో, ఆట్టి అనధికార విద్యుచ్ఛక్తి వినియోగము జరిగిన మొత్తము కాలావధికి నిర్ధారణ చేయవలెను, అయితే, అట్టి అనధికార విద్యుచ్ఛక్తి వినియోగము జరిగిన కాలావధిని పరిగణలోనికి తీసుకొనరాదు. అట్టి కాలావధిని తనిఖీ తేదీకి అవ్యవహిత పూర్వము పన్నెండు మాసముల కాలావధి వరకు పరిమితము చేయవలెను.

(6) ఈ పరిచ్ఛేదము క్రింద నిర్ధారణను ఉప-పరిచ్ఛేదము (5)లో నిర్దిష్టపరచిన సర్వీసుల యొక్క సంబంధిత వర్గములకు వర్తించు టారిఫ్ కు రెండు వంతులకు సమానమైన రేటులో ఉండవలెను. ________________

90f G90

విశధీకరణ

: - ఈ పరిచ్చేదము నిమిత్తము,-

(ఎ) "నిర్ధారణ అధికారి" అనగా రాజ్య ప్రభుత్వము ద్వారా అట్లు నామనిర్దేశము చేసిన రాజ్య ప్రభుత్వ లేక బోర్డు యొక్క అధికారి లేక సందర్భానుసారము లైసెన్సుదారు.

(బి) "అనధికార విద్యుచ్ఛక్తి వినియోగము” అనగా:

(i) ఏదేని కృత్రిమ సాధనముల ద్వారా:
(ii) సంబంధిత వ్యక్తి లేక ప్రాధికార సంస్థ లేక లైసెన్సుదారుచే ప్రాధికారమీయ బడని సాధనముల ద్వారా;
(iii) అక్రమముగా మార్చిన మీటరు ద్వారా;
(iv) విద్యుచ్ఛక్తి ఉపయోగము కొరకు కానట్టి ఇతర ప్రయోజనము కొరకు ప్రాధికార మిచ్చుట ద్వారా; లేక
(v) విద్యుచ్ఛక్తి సరఫరా కొరకైన ఆవరణలు లేదా ప్రాంతములు కానట్టి వాటికి ప్రాధికారమిచ్చుట ద్వారా;

విద్యుచ్ఛక్తి వినియోగించుట అని అర్ధము.

127.(1). 126వ పరిచ్చేదము క్రింద చేసిన అంతిమ ఉత్తర్వుకు వ్యధితుడైన ఎవరేని వ్యక్తి, సదరు ఉత్తర్వు తేదీ నుండి ముప్పది రోజుల లోపల అట్టి ప్రరూపములో మరియు అట్టి రీతిలో సత్యాపనము చేసి అపీలు చేసుకొనవచ్చును. మరియు విహితపరచబడు ఆపీలు ప్రాధికార సంస్థకు రాజ్య కమీషను ద్వారా నిర్దిష్ట పరచబడునట్టి ఫీజును జతపరచవలెను.

(2) ఉప-పరిచ్చేదము. (1) క్రింద నిర్ధారణ ఉత్తర్వు పై అపీలు ఏదియు, లైసెన్సుదారు వద్ద నగదులో లేక బ్యాంకు డ్రాప్టు ద్వారా డిపాజిటు చేసిన నిర్ధారిత మొత్తములో సగమునకు సమానమగు మొత్తమును మరియు అట్టి డిపాజిటుకు దస్తావేజు సాక్ష్యమును అపీలుతో సహా జతపరచిననే తప్ప, స్వీకరించరాదు.

(3) ఉప-పరిచ్ఛేదము (1)లో నిర్దేశించబడిన ఆపీలు ప్రాధికారి పక్షకారుల వాదనలు ఆకర్ణింపబడిన పిమ్మట అపీలును పరిష్కరించవలెను. మరియు సముచిత ఉత్తర్వును జారీ చేయవలెను. మరియు ఉత్తర్వు యొక్క ప్రతిని నిర్ధారణ అధికారికి మరియు ఆపీలుదారుకు పంపవలెను.

(4) ఉప-పరిచ్చేదము (1)లో నిర్దేశించిన అపీలు ప్రాధికారి యొక్క ఉత్తర్వు ఉపపరిచ్చేదము (3) క్రింద జారీ చేయబడినది అంతిమమైనదై ఉండును.

(5) ఉప పరిచ్చేదము (1) క్రింద నిర్దేశించబడిన అపీలు ప్రాధికారికి పక్షకారుల సమ్మతితో చేసిన తుది ఉత్తర్వుకు వ్యతిరేకముగా ఎటువంటి అపీలు చేయరాదు. ________________

......91/691 (6) నిర్ధారించబడిన మొత్తమును చెల్లించుటలో ఎవరేని వ్యక్తి విఫలుడైనపుడు, అతడు నిర్ధారణ ఉత్తర్వు తేదీనుండి ముప్పది దినములు ముగియు నాటికి, నిర్ధారించబడిన మొత్తముతో బాటు, సంవత్సరానికి 16 శాతము చొప్పున ప్రతి ఆరు మాసములకు చక్రవడ్డీని చెల్లించవలెను.

128.(1) సముచిత' కమీషను. ఏవేని లైసెన్సు షరతులను అమలు చేయుటలో వైఫల్యం చెందినాడని లేక ఈ చట్టము. లేదా దానిక్రింద చేయబడిన నియమములు లేదా వినియమముల యొక్క ఏవేని నిబంధనలను అమలు చేయటలో ఉత్పాదక కంపెనీ లేక లైసెన్సుదారు వైఫల్యం చెందినాడని సంతృప్తి చెందిన మీదట, ఏ సమయములో నైనను, వ్రాతపూర్వక ఉత్తర్వు ద్వారా, (ఈ పరిచ్ఛేదములో ఇటు తరువాత "దర్యాప్తు చేయు ప్రాధికారి" అని నిర్దేశించబడి) ఉత్తర్వులో నిర్దిష్ట పరచబడిన ఎవరేని వ్యక్తిని ఏదేని ఉత్పాదక కంపెనీ లేదా లైసెన్సుదారు యొక్క వ్యవహారములను దర్యాప్తు చేయుట మరియు అట్టి దర్యాప్తు చేయు ప్రాధికారి ద్వారా చేయబడిన ఏదేని దర్యాప్తు పై కమీషనుకు నివేదికను పంపమని ఆదేశించవచ్చును.

అయితే, దర్యాప్తు చేయు ప్రాధికారి, ఈ పరిచ్చేదము క్రింద ఏదేని దర్యాప్తులో అతనికి సహాయపడు నిమిత్తం అవసరమైన చోట ఎవరేని ఆడిటరును లేదా ఎవరేని ఇతర వ్యక్తిని నియమించవచ్చును.

(2) కం పెనీల చట్టము, 1956 యొక్క 235వ పరిచ్చేదములోని దానికి వ్యతిరేక ముగా ఏమున్నప్పటికినీ, దర్యాప్తు చేయు ప్రాధికారి, ఏ సమయములో నైనను మరియు సముచిత కమీషనుచే ఆవిధంగా చేయమని ఆదేశించిన మీదట దాని యొక్క ఒకరు లేదా అంత కెక్కువ మంది అధికారులచే ఎవరేని లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ మరియు అతడి యొక్క ఖాతా పుస్తకములను తనిఖీ చేయవచ్చును. మరియు అట్టి తనిఖీ మీదట దర్యాప్తు చేయు ప్రాధికారి, తన నివేదిక ప్రతిని లైసెన్సుదారుకు సందర్భానుసారంగా ఉత్పాదక కం పెనీకి అందజేయవలెను.

(3) లైసెన్సుదారు సందర్భానుసారముగా ఉత్పాదకకం పెనీ యొక్క ప్రతి మేనేజరు, మేనేజింగు డైరెక్టరు లేదా ఇతర అధికారి, తన అధీనములో లేదా అధికారము క్రింద ఉన్నట్టి అన్ని ఖాతా పుస్తకములు, రిజిస్టరులు మరియు ఇతర దస్తావేజులను ఉప-పరిచ్చేదము (1) క్రింద దర్యాప్తు లేదా ఉప-పరిచ్చేదము (2) క్రింద తనిఖీ చేయమని ఆదేశమివ్వబడిన దర్యాప్తు చేయు ప్రాధికారి సమక్షమున సమర్పించుటకు మరియు దర్యాప్తు చేయు ప్రాధికారి నిర్దిష్ట పరచబడినట్టి సమయము లోపల సదరు దర్యాప్తు చేయు ప్రాధికారి తాను కోరిన తనకు కు అవసరమైన లైసెన్సుదారు. లేదా సందర్భానుసారంగా ఉత్పాదక కంపెనీ యొక్క ఈ వ్యవహారములకు సంబంధించి ఏదేని వివరణ మరియు సమాచారమును ఇచ్చుటకు కర్తవ్యమై ఉండవలెను. ________________

- 927 192 (4) ఉప-పరిచ్చేదము (1) క్రింద దర్యాప్తు లేదా ఉప పరిచ్ఛేదము (2) క్రింద తనిఖీ చేయమని ఆదేశమివ్వబడిన ఎవరేని దర్యాప్తు చేయు ప్రాధికారి లైసెన్సుదారు లేదా సందర్భానుసారంగా ఉత్పాదక కం పెనీ యొక్క ఎవరేని మేనేజరు, మేనేజింగు డైరెక్టరు లేదా ఇతర అధికారిని అతని వ్యాపార విషయములకు సంబంధించి ప్రమాణం పై పరీక్షించ వచ్చును. మరియు తదనుసారంగా ప్రమాణాలు చేయించవలెను.

(5) దర్యాప్తు చేయు ప్రాధికారి, సముచిత కమీషనుచే దానిని తనిఖీ చేయమని ఆదేశమివ్వబడిన యెడల ఏదేని ఇతర సందర్భములు ఈ పరిచ్ఛేదము క్రింద చేసిన ఏదేని తనిఖీ పై సముచిత కమీషనుకు నివేదించవలెను మరియు

(6) ఉప-పరిచ్చేదము (1) లేదా ఉప సరిచ్చేదము (5) క్రింద ఏదేని నివేదిక అందిన మీదట, సముచిత కమీషను, నివేదికకు సంబంధించి విన్నపము చేయుటకుగాను లైసెన్సుదారుకు లేదా సందర్భానుసారంగా ఉత్పాదక కంపెనీకి సముచిత కమీషను ఉద్దేశములో సబబని భావించినట్టి అవకాశమిచ్చిన పిమ్మట, వ్రాతపూర్వక ఉత్తర్వు ద్వారా; -

(ఎ) నివేదిక నుండి ఉత్పన్నమైన ఏదేని విషయానికి సంబంధించి సముచిత కమీషను యుక్తమని తలచునట్టి చర్య తీసుకొనుటకు లైసెన్సుదారుని లేదా ఉత్పాదక కం పెనీని కోరవచ్చును; లేదా

(బి) లైసెన్సును రద్దు చేయవచ్చును; లేదా

(సి) విద్యుచ్ఛక్తి ఉత్పాదక వ్యాపార నిర్వహణను నిలిపివేయమని ఉత్పాదక కం పెనీని ఆదేశించవచ్చును.

(7) సముచిత క్రమీషను లైసెన్సుదారుకు లేదా సందర్భానుసారంగా ఉత్పాదక కంపెనీకి తగిన నోటీసు ఇచ్చిన తరువాత ఉప పరిచ్ఛేదము (5) క్రింద దర్యాప్తు చేయు ప్రాధికారి ద్వారా సమర్పించబడిన నివేదికను లేదా దానికి అవసరమని భావించునట్టి దాని యొక్క భాగమును ప్రచురించ వచ్చును.

(8) సముచిత కమీషను, లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ వారి పుస్తకము లలో నిర్వహించవలసిన కనీస సమాచారమును అట్టి సమాచారమును నిర్వహించవలసి యున్నట్టి రీతి, ఆ సందర్భంలో లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ అవలంభించవలసి యున్న తనిఖీలు మరియు ఇతర సత్యాపనలు మరియు తన అభిప్రాయములో ఈ పరిచ్ఛేదము క్రింద దర్యాప్తు చేయు ప్రాధికారి తన కృత్యములను సంతృప్తికరంగా నెరవేర్చు టకు, ఆవశ్యకతను కల్పించుటకు వాటికి అనుషంగికములైన అన్ని ఇతర విషయములను నిర్ధిష్టపరచవచ్చును. ________________

93. G93

విశదీకరణ

:- ఈ పరిచ్ఛేదము నిమిత్తం, "లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ" అను పదబంధములో భారత దేశంలో నిగమితమైయున్నలై సెన్సుదారు విషయంలో, -

(ఎ) కేవలం భారతదేశం వెలుపల విద్యుచ్ఛక్తి ఉత్పాదన లేదా ప్రసారము లేదా పంపిణీ లేదా వర్తక వ్యాపారము చేయు నిమిత్తం ఏర్పడినట్టి దాని యొక్క అన్ని అనుబంధ కంపెనీలు; మరియు

(బి) భారతదేశం లోపల లేదా భారతదేశం వెలుపల ఉన్న దాని యొక్క అన్ని బ్రాంచీలు

చేరియుండును.

(9) ఈ పరిచ్ఛేదము క్రింద చేసిన ఏదేని దర్యాప్తు కొరకైన మరియు దానికి ఆనుషంగికమైన ఖర్చులన్నియు లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా ఉత్పాదక కంపెనీచే భరింపబడవలెను. మరియు లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ నుండి రావలసిన అప్పులకు ప్రాధాన్యతనివ్వవలెను మరియు వాటిని భూమిశిస్తు బకాయిల వలె వసూలు చేయవలెను.

129 (1) సముచిత కమీషను, తన స్వాధీనములోనున్న విషయాల పై ఆధారపడి, లైసెన్సుదారు. తన లైసెన్సులో పేర్కొనిన ఏవేని షరతులు లేదా మినహాయింపు మంజూరు చేయుట కొరకైన షరతులను ఉల్లంఘించునని లేదా ఉల్లంఘించవచ్చునని లేదా లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ ఈ చట్టపు ఏవేని నిబంధనలను ఉల్లంఘించునని లేదా ఉల్లంఘించ వచ్చునని సంతృప్తి చెందిన యెడల, షరతులు లేదా నిబంధనలను కట్టుదిట్టముగా అమల చేయు నిమిత్తం అవసరమైనట్టి ఆదేశములను ఉత్తర్వు ద్వారా ఇవ్వవలెను.

(2) ఉప-పరిచ్చేదము (1) క్రింద ఆదేశములను ఇచ్చునపుడు, సముచిత కమీషను, అట్టి ఉల్లంఘన వలన ఎవరేని వ్యక్తికి ఏ మేరకు నష్టం లేదా చెరుపు జరుగనుందో ఆ మేరకు మన్నించవలెను.

130. సముచిత కమీషను 129వ పరిచ్ఛేదము క్రింద ఏదేని ఆదేశమును జారీచేయుటకు పూర్వము, -

(ఎ) సంబంధిత లైసెన్సుదారుకు లేదా ఉత్పాదక కం పెనీకి నిర్దిష్ట పరచబడిన రీతిలో నోటీసును తామీలు చేయవలెను; -

(బి) ప్రభావమునకు గురికాగల లేదా ప్రభావితమైన వ్యక్తుల దృష్టికి తెచ్చు నిమిత్తం నిర్దిష్ట పరచబడిన రీతిలో నోటీసును ప్రచురించవలెను


(సి) సంబంధిత లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ నుండి మరియు ప్రభావము నకు గురికాగల లేదా ప్రభావితమైన వ్యక్తుల సలహాలు మరియు అభ్యంతరములను, పర్యాలోచించవలెను;

భాగము - 13.

బొర్డు యొక్క పునర్వ్యవస్థీకరణ.

131.(1) ఈ చట్టపు ఉద్దేశాలు మరియు ప్రయోజనముల అమలుకొరకు రాజ్య ప్రభుత్వము చే తయారు చేయబడిన బదలాయింపు పథకము ప్రచురించిన తేదీ నుండి లేదా రాజ్య ప్రభుత్వముచే నియతమైనట్టి తదుపరి తేదీ నుండి (ఇందుమీదట ఈ భాగములో అమలు తేదీగా నిర్దేశించబడు) రాజ్య విద్యుచ్ఛక్తి బోర్డుకు (ఇందుమీదట బోర్డు నిర్దేశించబడు) చెందిన అమలులేదీకి అవ్యవహితపూర్వము ఏదేని ఆస్తి, ఆస్తిలో హితం, హక్కులు మరియు దాయిత్వములు రాజ్య ప్రభుత్వము మరియు బోర్డు మధ్య సమ్మతించబడునట్టి నిబంధనలపై రాజ్య ప్రభుత్వములో నిహితమైన ఉండవలెను.

(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య ప్రభుత్వములో నిహితమైయున్న ఏదేని ఆస్తి, ఆస్తిలో హితం, హక్కులు మరియు దాయిత్వములను ప్రచురించబడిన బదలాయింపు పధకము ప్రకారం అట్టి పథకములో నిర్ణయపరచబడునట్టి రాజ్యప్రభుత్వము యొక్క ఇతర ఆస్తి, ఆస్తిలో హితం, హక్కులు మరియు దాయిత్వములతో పాటుగా రాజ్య ప్రభుత్వము మరియు రాజ్య ప్రసార వినియోగము లేదా ఉత్పాదక కంపెనీ లేదా ప్రసార లైసెన్సుదారు లేదా సందర్భానుసారంగా పంపిణీ లైసెన్సుదారుగా ఉన్నట్టి కంపెనీ లేదా కం పెనీల మధ్య సమ్మతించబడినట్టి నిబంధనలు మరియు షరతుల పై రాజ్యప్రభుత్వముచే ప్రభుత్వ కంపెనీ లేదా కంపెనీ లేదా కం పెనీలలో తిరిగి నిహితము చేయవలెను.

అయితే, దీని క్రింద అంతరణ అయిన ఏవేనీ సంపత్తుల అంతరణ విలువను సాధ్యమైనంత వరకు రాజ్య ప్రభుత్వము మరియు రాజ్య ప్రసార వినియోగము లేదా ఉత్పాదక కంపెనీ లేదా ప్రసార లైసెన్సుదారు లేదా సందర్భానుసారంగా పంపిణీ లైసెన్సుదారుకు మధ్య సమ్మతించబడినట్టి నిబంధనలు మరియు షరతుల వద్ద అట్టి సంపత్తుల ఆదాయ సామర్థ్యం పై ఆధారపడి నిర్ధారింపబడవలెను.

(3) ఈ పరిచ్చేదములో ఏమి ఉన్నప్పటికిని,-

(ఎ) అంతరణ పథకములో ఎవరేని వ్యక్తికి లేదా రాజ్య ప్రభుత్వముచే పూర్తిగా అధీనము చేసుకొనని సంస్థకి ఏదేని ఆస్తి లేదా హక్కుల అంతరణ ప్రమేయము ఉన్న యెడల, రాజ్య ప్రభుత్వమునకు అంతరణ స్వీకర్త చెల్లించవలసియున్న న్యాయమైన సముచిత విలువ కొరకు మాత్రమైన అంతరణకి ప్రభావము కలిగియుండవలెను. (బి) అంతరణ పథకములో పురస్కరించుకొని ఏదేని వివరణ యొక్క వ్యవహారము ప్రభావమైన యెడల, మూడవ పక్షకారులతో కలుపుకొని అందరు వ్యక్తులు, అట్టి వ్యక్తులు లేదా మూడవ పక్షకారులు దానికి అనుమతి ఇవ్వకపోయిన ప్పటికిని, అది బద్ధమై ఉండవలెను.

(4) ఉప-పరిచ్ఛేదము (2)లో నిర్దేశించిన రాజ్య ప్రసార వినియోగము లేదా ఉత్పాదక కంపెనీ లేదా ప్రసార లైసెన్సుదారు లేదా పంపిణీ లైసెన్సుదారు (ఇందు ఇటు పిమ్మట అంతరణ కర్తగా నిర్దేశించబడు) అయినట్టి ప్రభుత్వ కంపెనీ లేదా కంపెనీ లేదా కంపెనీలను సంప్రదించిన పిమ్మట ఏదేని ఇతర ఉత్పాదక కంపెనీ లేదా ప్రసార లైసెన్సుదారు లేదా పంపిణీ లైసెన్సుదారు ఈ పరిచ్ఛేదము క్రింద అంతరణకర్తలో నిహితమైన ఆస్తి, ఆస్తిలో హితము, హక్కులు మరియు దాయిత్వములను అంతరణ స్వీకర్తలో నిహితము చేయుటకుగాను అంతరణ పథకమును రూపొందించమనియు, మరియు అట్టి అంతరణ పథకమును. ఈ చట్టము క్రింద శాసనాత్మక అంతరణ పథకముగా ప్రచురించమనియు రాజ్యప్రభుత్వము అట్టి అంతరణ కర్తను కోరవచ్చును.

(5) ఈ పరిచ్ఛేదము క్రింద అంతరణ పధకము,

(ఎ) పరిణాము ప్రతిపత్తి యొక్క లాభదాయకత మరియు స్వయం భరణ శక్తిని పెంపొందించు, వితీయ సామర్థ్యమును చేకూర్చు, పోటీని ప్రోత్సహించు మరియు వినియోగదారుల హితములకు రక్షణ కల్పించు అనుబంధముల ఉమ్మడి రంగ కంపెనీల లేదా ఇతర విభజన పథకముల, విలీనీకరణ, సంవిలీనం, పునర్నిర్మాణం లేదా ఏర్పాట్ల స్థాపన కొరకు నిబంధించవచ్చును.

(బి) (i) వివాదాస్పద ఆస్తి, హక్కులు మరియు దాయిత్వములను నిర్దిష్ట పరచుట లేదా వివరించుట ద్వారా; లేదా

(ii) అంతరణ కర్త అధీనము యొక్క వివరణాత్మక భాగములో ఇమిడియున్న మొత్తం ఆస్తి, ఆస్తిలో హితం, హక్కులు మరియు దాయిత్వములను నిర్దేశించుట ద్వారా; లేదా

(iii) ఒకవైపు కొంతభాగం మరియు మరియొక వైపు కొంతభాగమును కేటాయించవలసియున్న ఆస్తి, ఆస్తిలో హితం, హక్కులు మరియు దాయిత్వములను నిర్వచించవచ్చును. ________________

961 696 (సి) పథకములో నిర్ణీతపరచబడినట్టి లేదా వివరించబడినట్టి ఏవేని హక్కులు లేదా దాయిత్వములు అంతరణకర్త లేదా అంతరణ స్వీకర్తచే లేదా వారిపై అమలు పరచవలయునని విబంధించవచ్చును;

(డి) ఎవరేని ఇతర తదుపరి అంతరణ స్వీకర్తకు అనుగుణముగా పథకములో నిబంధించబడినట్టి లిఖితపూర్వక ఒప్పందములు చేసుకొనుట లేదా అట్టి ఇతర పత్రములను అమలు జరుపుటకు అంతరణకర్త పై బాధ్యతను ఉంచవలెను.

(ఇ) అంతరణ స్వీకర్త యొక్క కృత్యములు మరియు కర్తవ్యములను పేర్కొనవచ్చును.

(ఎఫ్) అమలులోనికి తీసుకొను ఉత్తర్వును నియతమైన నిబంధనతోసహా అంతరణకర్త సముచితమని భావించినట్టి అనుపూరక ఆనుషంగిక మరియు పారిణామిక నిబంధనలను చేయవచ్చును; మరియు

(జి) నియతమైన కాలావధికి ఆంతరణ తాత్కాలికమని నిబంధించవచ్చును.

(6) అంతరణ పథకము అమలునకు ముందు బోర్డుచే, బోర్డుతో లేదా బోర్డు కొరకు రాజ్య ప్రసార వినియోగము లేదా ఉత్పాదక కంపెనీ లేదా ప్రసార లైసెన్సుదారు లేదా పంపిణీ లైసెన్సుదారు భరించిన అన్ని అప్పులు మరియు బాధ్యతలు చేసుకొనిన అన్ని కాంట్రాక్టులు మరియు చేయుటకు నిమగ్న మైన అన్ని విషయములు. మరియు పనులు సంబంధిత అంతరణ పథకములో నిర్దిష్ట పరిచినంత మేరకు బోర్డు చే, బోర్డులో లేదా రాజ్య ప్రభుత్వము కొరకు లేదా లైసెన్సుదారు భరించినట్లుగా, చేసుకొన్నట్లుగా లేదా చేసినట్లుగా భావింపబడవలెను మరియు బోర్డు లేదా సందర్భానుసారంగా అంతరణకర్తచే లేదా వ్యతి రేకముగా దాఖలు చేయబడిన దావాలు మరియు ఇతర శాసనిక ప్రొసీడింగులన్నియు రాజ్య ప్రభుత్వము లేదా సందర్భానుసారంగా సంబంధిత అంతరణ స్వీకర్తచే లేదా వ్యతిరేకంగా కొనసాగించవచ్చును లేదా ప్రారంభించవచ్చును.

(7) బోర్డు, అమలు తేదీన మరియు తరువాత జరిగిన అంతరణలకు సంబంధించి ప్రభారమైన కృత్యములు మరియు విధులు కోల్పోవును మరియు నిర్వర్తించరాదు.

విశదీకరణ

:- ఈ భాగము నిమిత్తం,-

(ఎ) "ప్రభుత్వ కంపెనీ" అనగా కంపెనీల చట్టం, 1956 క్రింద స్థాపించబడి రిజిష్టరు అయిన ప్రభుత్వ కంపెనీ అని అర్ధము; ________________

971 697 (బి) "కంపెనీ" అనగా ఈ భాగము క్రింద పధకము ప్రకారం ఉత్పాదకత, లేదా ప్రసారము లేదా పంపిణీని చేపట్టుటకు కంపెనీల చట్టం, 1956 క్రింద స్థాపించబడి రిజిస్టరు అయిన కంపెనీ అని అర్ధము;

132. సముచిత ప్రభుత్వము యొక్క స్వంతమైన లేదా నియంత్రితమైన బోర్డు లేదా ఏదేని వినియోగము ఏదేని రీతిలో సముచిత ప్రభుత్వముచే స్వంతముకాని, లేదా నియంత్రణలో లేని వ్యక్తికి అమ్మిన లేక అంతరణ చేసిన సందర్భంలో అట్టి అమ్మకము లేదా అంతరణ నుండి వచ్చిన రాబడులను ప్రాధాన్యతా క్రమంలో అన్ని ఇతర బకాయిలకు ఈ క్రింది వరుసలో ఉపయోగించవలెను, అవేవనగా;-

(ఎ) పైన పేర్కొనిన అమ్మకము లేదా అంతరణచే ప్రభావితమైనట్టి బోర్డు లేదా వినియోగము యొక్క అధికారులు మరియు ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు (పదవీవిరమణ ప్రయోజనముల బకాయిలతో సహా);

(బి) ప్రస్తుతమున్న ఋణ ప్రసంవిధాల ద్వారా అంతరణ కర్త యొక్క అప్పు లేదా ఇతర దాయిత్వము అవసరమైనంత మేర చెల్లించుట.

133.(1) రాజ్యప్రభుత్వము, 131వ పరిచ్ఛేదము క్రింద నిబంధించబడినట్టి అంతరణ స్వీకర్త ఆస్తులు, హక్కులు మరియు దాయిత్వములను నిహితమొనర్చిన మీదట అంతరణ పథకము ద్వారా అధికారులు మరియు ఉద్యోగులను అంతరణ స్వీకర్తకు అంతరణ కొరకై నిబంధించవచ్చును.

(2) అంతరణ పథకము క్రింద అట్టి అంతరణ జరిగిన మీదట, అంతరణ పథకము ప్రకారము నిర్ధారించినట్టి నిబంధనలు మరియు షరతులపై ఆంతరణ స్వీకర్త అధీనంలో ఉన్న సిబ్బంది పదవిని లేదా సర్వీసును కలిగియుండవలెను.

అయితే, అంతరణ జరిగిన పిమ్మట అట్టి నిబంధనలు మరియు షరతులు, అంతరణ పనులు పథకము క్రింద అట్టి అంతరణ జరగని యెడల, వారికి వర్తింప జేయదగిన వాటి కంటే ఏవిధంగాను తక్కువ అనుకూలమైనవి కావు.

అంతేకాక, నిర్ణీతపరచబడిన కాలానికి అంతరణ తాత్కాలికమైనది.

విశదీకరణ

:- ఈ పరిచ్చేదము మరియు అంతరణ పథకము నిమిత్తము, "అధికారులు మరియు ఉద్యోగులు" అనుపద బంధమునకు పథకములో నిర్దిష్ట పరచబడిన తేదీన బోర్డు లేదా సందర్భానుసారంగా అంతరణకర్త యొక్క అధికారులు మరియు ఉద్యోగులైన అందరు అధికారులు మరియు ఉద్యోగులు అని అర్ధము. ________________

98/G98 134. పారిశ్రామిక వివాదముల చట్టము, 1947లో లేదా తత్సమయమున అమలు నందున్న ఏదేని శాసనములో ఏమి ఉన్నప్పటికిని మరియు ఈ చట్టములో చేసిన నిబంధనల కొరకు తప్ప, 133వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)లో నిర్దేశించబడిన అధికారుల మరియు ఉద్యోగుల యొక్క ఉద్యోగ బదిలీ, ఈ చట్టము క్రింద లేదా అంతరణ పథకములో నిబంధించబడినట్లు తప్ప ఏదేని ఇతర కేంద్ర లేదా రాజ్య శాసనము క్రింద ఏదేని నష్టపరిహారము లేదా చెరుపులకు అట్టి అధికారులు మరియు ఉద్యోగులు హక్కు కలిగియుండరు.

భాగము - 14

అపరాధములు మరియు శాస్త్రులు.

135 (1) విద్యుచ్ఛక్తి సంగ్రహించుటకు లేదా వినియోగించుటకు లేదా ఉసయోగించుటకు దురుద్దేశంతో, ఎవరైనా -

(ఎ) లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా సరఫరాదారుల యొక్క ఉపరితల, భూగర్భ లేదా అడుగున ఉన్న నీటి లైన్ల లేదా కేబుళ్ల లేదా సర్వీసు వైర్లు లేదా సర్వీసు సదుపాయములతో ఏదేని జోడింపును వినియోగించిన, చేసిన లేదా చేయుటకు కారణమగునో, లేదా

(బి) మీటరును అక్రమముగా మార్పుచేయుట, అక్రమముగా మార్పు చేసిన మీటరును అమర్చుట లేదా ఉపయోగించుట, కరెంటు మళ్లింపు ట్రాన్స్ ఫార్మరు, కచ్చితమైన లేదా సరియైన రిజిస్ట్రేషనులో జోక్యము చేసుకొను లూపు జోడింపు లేదా ఏదేని ఇతర డివైజు (ఆకృతి) లేదా పద్ధతి పరిమాణ మాపకం లేదా విద్యుచ్ఛక్తి మీటరును ఏర్పాటు చేయుట లేదా ఇతరవిధంగా చేయుట వలన, ఎక్కడైతే విద్యుచ్ఛక్తి చౌర్యము చేయబడుటకు లేదా వ్యర్ధమగుటకు కారణమగునో; లేదా

(సి) విద్యుచ్ఛక్తి మీటరు ఉపకారణాలు, సామగ్రీ లేదా వైరును చెరుపు లేదా ధ్వంసములు కలిగించునో లేదా సరియైన లేదా కచ్చితమైన విద్యుచ్ఛక్తి మీటగును ఏర్పాటు చేయుటలో జోక్యము విషయమై ఆవిధంగా చెరుపు లేదా ధ్వంసము చేయుటకు వారిలో ఎవరైతే కారణమగునో లేదా అనుమతించునో, లేదా

(డి) అక్రమముగా మార్పు చేసిన మీటరు ద్వారా విద్యుచ్ఛక్తి వినియోగించిన; లేదా

(ఇ) ప్రాధికరమివ్వబడిన విద్యుచ్ఛక్తి వినియోగము కొరకు కానట్టి, ఇతర ప్రయోజనము కొరకు విద్యుచ్చ క్తిని సంగ్రహించిన లేక వినియోగించిన లేక ఉపయోగించిన వారు మూడు సంవత్సరముల కాలావధి పాటు పొడిగింపగల కారాగార వాసముతోను లేదా జుర్మానా తోను లేదా రెంటితోను శిక్షింపబడుదురు: . ________________

1997 699 అయితే, సంగ్రహించబడిన లేదా వినియోగింపబడిన లేదా ఉపయోగింపబడిన లేదా సంగ్రహించడానికి ప్రయత్నించిన లేదా వినియోగించు కోవడానికి యత్నించిన లేదా ఉపయోగించుకోవటానికి ప్రయత్నించిన లోడు,

(i) 10 కిలోవాట్లకు మించని యెడల, మొదటి దోష స్థాపన పై విధించిన జుర్మానా అట్టి విద్యుచ్ఛక్తి చౌర్యము ద్వారా పొందు విత్తీయ లాభము నకు మూడు రెట్లకు తక్కువ కాకుండ ఉండవలెను మరియు రెండవ లేదా తదుపరి తరువాతి దోష స్థాపన విషయంలో విధించిన జుర్మానా అట్టి విద్యుచ్ఛక్తి చౌర్యము ద్వారా పొందు విత్తీయ లాభమునకు ఆరు రెట్లకు తక్కువ కాకుండా ఉండవలెను.

(ii) 10 కిలోవాట్లకు మించిన యెడల, మొదటి దోష స్థాపన పై విధించిన జుర్మానా, అట్టి విద్యుచ్ఛక్తి చౌర్యము ద్వారా పొందు విత్తీయ లాభమునకు మూడు రెట్లకు తక్కువ కాకుండ ఉండవలెను. మరియు రెండవ లేదా తదుపరి తరువాతి దోష స్థాపన విషయంలో ఆరు మాసములకు తక్కువ కాకుండా అయితే ఐదు సంవత్సరముల దాకా మన పొడిగింపగల కారావాసముతోను మరియు అట్టి విద్యుచ్ఛక్తి చౌర్యము ద్వారా పొందు విత్తీయ లాభమునకు ఆరు రెట్లకు తక్కువ కాని జుర్మానాతోను శిక్షింపబడవలెను.

అయితే ఇంకనూ, 10 కిలోవాట్లకు మించిన లోడును సంగ్రహించబడిన, వినియోగింప బడిన, లేదా ఉపయోగింపబడిన లేదా సంగ్రహించడానికి ప్రయత్నించిన లేదా వినియో గించుకోవడానికి ప్రయత్నించిన లేదా ఉపయోగించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి రెండవ మరియు తదుపరి నేరారోపణ గావించిన సందర్భములో అట్టి వ్యక్తి కూడ మూడు మాసములకు మించనట్టి అయితే రెండు సంవత్సరముల వరకు ఉండగల కాలావధి వరకు ఏదేని విద్యుచ్ఛక్తి సరఫరాను పొందు హక్కును కోల్పోవును మరియు ఏదేని ఇతర వనరు లేదా ఉత్పాదన స్టేషన్ల నుండి ఆ కాలావధి వరకు విద్యుచ్ఛక్తి సరఫరాను పొందుట నుండి కూడ హక్కును కోల్పోవును.

అంతేకాక, వినియోగదారు. విద్యుచ్ఛక్తిని సంగ్రహించడం, వినియోగించుకోవడం లేదా ఉపయోగించుకోవడం కొరకుగాను బోర్డు లేదా లైసెన్సుదారుచే లేదా సందర్భానుసారము. సరఫరాదారుచే ప్రాధికార మీయబడని ఏదేని కృత్రిమ సాధనాలు లేదా సాధనాలు ప్రస్తుతము ఉన్నాయని నిరూపితమైనచో, ఆ ఉల్లంఘన నిరూపించబడునంత వరకు విద్యుచ్ఛక్తి యొక్క ఏదేని సంగ్రహణ. వినియోగము లేదా ఉపయోగము అట్టి వినియోగదారు చే దురుద్దేశము వలన కలిగినదని పురోభావన చేయవచ్చును. ________________ 100/G100 (1ఏ) ఈ చట్టము యొక్క నిబంధనలకు భంగము వాటిల్లకుండా లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా సరఫరాదారు విద్యుచ్ఛక్తి యొక్క అట్టి చౌర్యమును కనిపెట్టిన మీదట, వెంటనే విద్యుచ్ఛక్తి సరఫరాను తొలగించవచ్చును.

అయితే, సముచిత కమీషనుచే ఇందునిమిత్తం ప్రాధికారమీయబడిన లైసెన్సుదారు లేదా సరఫరాదారు యొక్క అట్టి అధికారి మాత్రమే లేదా ఆవిధంగా ప్రాధికారమీయబడిన హోదాకన్న ఎక్కువ హోదాగల లైసెన్సుదారు లేదా సందర్భానుసారము సరఫరాదారు యొక్క లేదా ఎవరేని ఇతర అధికారి విద్యుచ్ఛక్తి యొక్క సరఫరా లైను తొలగించవలెను.

అంతేకాకుండా, లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా సరఫరాదారు యొక్క అట్టి అధికారి, అట్టి నేరము జరిగిన దానికి సంబంధించి వ్రాతమూలకముగా అట్టి తొలగింపు జరిగిన సమయము నుండి ఇరవై నాలుగు గంటల లోపల అధికారితా పరిధి కలిగి ఉన్న పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయవలెను.

అంతేకాక, లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా సరఫరాదారు ఈ చట్టము యొక్క నిబంధనలననుసరించి అంచనా వేసిన మొత్తము లేదా విద్యుచ్చక్తి ఛార్జీలను డిపాజిటు లేదా చెల్లించిన మీదట, ఈ ఖండము యొక్క రెండవ వినాయింపులో నిర్దేశించ బడిన విధంగా ఫిర్యాదు చేయాలనే బాధ్యతకు భంగము వాటిల్లకుండా అట్టి డిపాజిటు లేదా చెల్లింపు జరిగిన నలభై ఎనిమిది గంటల లోపల విద్యుచ్ఛక్తి యొక్క సరఫరాలైనును పునరుద్దరించవలెను.

(2) రాజ్య ప్రభుత్వముచే ఈ విషయమున ప్రాధికార మీయబడిన లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా సరఫరాదారు యొక్క ఎవరేని అధికారి-

(ఎ) విద్యుచ్ఛక్తి అప్రాధీకృత ఉపయోగం జరిగినదని లేదా జరుగుతున్నదని అతను నమ్ముటకు తగిన కారణమున్న ఏదేని స్థలము లేదా ఆవరణలో ప్రవేశింఛ వచ్చును, తనిఖీ చేయవచ్చును. మరియు " బద్దలుకొట్టి మరియు సోదా చేయవచ్చును.

(బి) విద్యుచ్ఛక్తి ఆప్రాధీకృత ఉపయోగమునకు వాడిన లేదా వాడుతున్న అన్ని అట్టి డివైజులు (ఆకృతులు) పరికరాలు, వైర్లు మరియు ఏదేని ఇతర సౌకర్య సాధనం లేదా వస్తువును సోదా చేయవచ్చును, అభిగ్రహించవచ్చును మరియు తొలగించ వచ్చును; ________________

- 101 G101 (సి) ఉప పరిచ్ఛేదము (1) క్రింద అపరాధము విషయంలో ఏవేని ప్రొసీడింగులకు అతని అభిప్రాయంలో ఉపయోగించబడ వలసిన లేదా సంబంధించిన ఏవేని ఖాతా పుస్తకములు లేదా దస్తావేజులను పరిశీలించవచ్చును లేదా అభిగ్రహించ వచ్చును. ఎవరి అభిరక్షలో, అట్టి ఖాతా పుస్తకములు లేదా దస్తావేజులు అభిగ్రహించబడినవో ఆ వ్యక్తిని వాటి యొక్క ప్రతులను తయారు చేయుటకు లేదా అతని సమక్షములో దాని నుండి ఉదాహృతులు తీసుకొనుటకు అనుమతించవచ్చును.

(3) సోదా చేసిన స్థలము యొక్క ఆక్రమణదారు లేదా అతని తరఫున ఎవరేని వ్యక్తి సోదా సమయమున హాజరై ఉండవలెను మరియు అట్టి సోదా క్రమంలో అభిగ్రహించబడిన అన్ని వస్తువుల పట్టిక నొకదానిని తయారుచేసి అట్టి ఆక్రమణదారుకు లేదా పట్టికలో సంతకము చేయవలసియున్న వ్యక్తికి పంపవలెను.

అయితే, అట్టి ఆవరణను ఆక్రమించుకొన్న వయోజన పురుష సభ్యుని సమక్షమున తప్ప ఏవేని గృహస్థలములలో గాని లేదా గృహ ఆవరణలలోగాని సూర్యాస్తమయము మరియు సూర్యోదయము మధ్య ఎటువంటి తనిఖీ, సోదా మరియు అభిగ్రహణ జరుపరాదు.

(4) సోదా మరియు అభిగ్రహణకు సంబంధించి క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క నిబంధనలు ఈ చట్టము క్రింద సోదాలుకు మరియు అభిగ్రహణకు సాధ్యమైనంత వరకు వర్తించును.

136.(1) దురుద్దేశంతో, ఎవరైనా-

(ఎ) న్యాయ సమ్మతంగా లేదా, శాసనబద్ధంగా నిలువ చేసిన, డిపాజిటు చేసిన, ఉంచిన, నిలువ ఉన్న లేదా ఉండిన టవరు, స్తంభం, ఏదేని ప్రతిష్టాపన లేదా ప్రతిష్టాపితము చేయు స్థలము లేదా స్థానము నుండి కత్తిరించిన, తొలగించిన లేదా తీసుకొని పోయిన లేదా ఏదేని విద్యుత్ లైను, సామాగ్రీ లేదా మీటరును అంతరణ చేసి లైసెన్సుదారు లేదా సందర్భాను సారము యజమాని సమ్మతి లేకుండా రవాణా సమయములో కుడ లాభము లేదా లబ్ధి కొరకుగాను ఆ చర్య చేసినను లేదా చేయకున్నను; లేదా

(బి) యజమాని సమ్మతి లేకుండా అతని ఆవరణలో, సంరక్షణలో, లేదా నియంత్రణలో నిలువ చేసిన, కలిగియున్న లేదా ఇతర విధంగా ఉంచుకొన్న ఏదేని విద్యుత్ లైను, సామాగ్రి లేదా మీటరును లాభము లేదా లబ్ధి కొరకుగాను ఆ చర్య చేయబడినను లేదా చేయబడకున్నను; లేదా ________________

- 1021 G102 (సి) యజమాని సమ్మతి లేకుండా, ఏదేని విద్యుత్ లైను, సామాగ్రి లేదా మీటరును ఒక స్థలము నుండి మరొక స్థలమునకు ఎక్కించిన, పంపిన లేదా కదిలించిన యెడల లాభము లేదా లబ్ది కొరకు చర్య చేసినను లేదా చేయకున్ననూ, వారు విద్యుత్ లైన్లు మరియు సామాగ్రీల చౌర్యము అను అపరాధమును చేసినారని చెప్పబడును. మరియు మూడు సంవత్సరముల దాకా పొడిగింపగల కారావాసములోను లేదా జుర్మానాలోను లేదా రెండింటితో శిక్షింపబడవలెను.

2) ఉప-పరిచ్చేదము (1) క్రింద శిక్షించదగు అపరాధమునకు దోష స్థాపితుడైన వ్యక్తి అదే ఉప-పరిచ్చేదము క్రింద శిక్షింపదగు అపరాదమునకు తిరిగి దోషియైనచో, అతడు రెండవ లేదా తదుపరి అపరాధమునకు ఆరు మాసములకు తక్కువ కాకుండా అయితే ఐదు సంవత్సరముల దాకా పొడిగింపగల కాలావధి పాటు, కారావాసముతో శిక్షింపబడ వలెను. మరియు పదివేల రూపాయలకు తక్కువకాని జుర్మానాకు బాధ్యుడై ఉండవలెను.

137. చౌర్యము చేయబడిన ఏదైనా విద్యుత్ లైను లేదా సామాగ్రిని అది చౌర్యము చేయబడిన ఆస్తి అని ఎరిగి ఉండి లేదా చౌర్యము చేయబడిన ఆస్తి అని విశ్వసించుటకు కారణముండి దురుద్దేశముతో స్వీకరించు వారెవరైననూ మూడు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి, రెంటిలో ఒక రకపు కారావాసముతోకాని జుర్మానాలోగాని లేదా ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

138(1) ఎవరైనా-

(ఎ) లైసెన్సుదారుచే విద్యుత్ సరఫరా అవుతున్న ఏదేని విద్యుత్ లైనుతో ఏదేని మీటరు, ఇండికేటరు లేదా ఉపకరణాన్ని అప్రాధికృతముగా కలిపినపుడు లేదా ఏదేని అట్టి విద్యుత్ లైను నుండి దానిని తీసివేసినపుడు; లేదా

(బి) సదరు విద్యుత్ లైను లేదా ఇతర పనులను కత్తిరించియున్న లేదా యుండిన లేదా తీసివేసియున్న లేదా ఉండినపుడు లైసెన్సుదారు యొక్క ఆస్తి అయిన ఏదేని విద్యుత్ లైను లేదా ఇతర పనులతో ఏదేని మీటరును, ఇండికేటరును లేదా ఉపకరణాన్ని అప్రాధీకృతముగా తిరిగి కలిపినపుడు; లేదా

(సి) సంసూచించు నిమిత్తం లైసెన్సుదారుకు చెందిన ఏవేని ఇతర పనులతో ఏనేని పనులను ఉంచిన లేదా ఉంచుటకు కారణమైన లేదా కలిపినపుడు; లేదా ________________

103/6103 (డి) లైసెన్సుదారుకు చెందిన ఏదేని మీటరు, ఇండికేటరు. లేదా ఉపకరణాన్ని విద్వేష పూర్వకముగా హానిచేసిన లేదా ఏదేని అట్టి మీటరు, ఇండికేటరు లేదా ఉపకరణం యొక్క సూచికను బుద్ధిపూర్వకంగా లేదా కపటముతో మార్పు చేసిన లేదా తగురీతిగా రిజిస్టరు చేయుట నుండి ఏదేని అట్టి మీటరు, ఇండికేటరు లేదా ఉపకరణాన్ని నివారించినపుడు

మూడు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి కారావాసముతోను లేదా పదివేల రూపాయల దాకా ఉండగల జుర్మానాతోను లేదా రెండింటితోను మరియు అపరాధము జరుగుతున్నపుడు ఐదు వందల రూపాయల దాకా ఉండగల రోజు వారి జుర్మానాతోను శిక్షింపబడవలెను. మరియు ఖండము (ఎ)లో నిర్దేశించబడి నట్టి కలుపుటకు లేదా ఖండము (బి)లో నిర్దేశించబడినట్టి తిరిగి కలుపుటకు లేదా ఖండము (సి)లో నిర్దేశించబడినట్టి సంసూచనను చేయుటకు, ఖండము (డి)లో నిర్దేశించబడినట్టి మార్పు లేదా నివారణను కలిగించుటకు ఏదేనీ సాధనము కలదని ఋజువు చేయబడిన యెడల, మరియు ఆ మీటరు, ఇండికేటరు లేదా ఉపకరణము అది అతని ఆస్తి అయినను లేదా కాకున్నను వినియోగదారుని సంరక్షణలో లేదా నియంత్రణలో ఉన్నపుడు, విరుద్ధముగా నిరూపించబడిననే తప్ప, అట్టి కలుపుట, తిరిగి కలుపుట, సంసూచన, మార్పు, నివారణ లేదా సందర్భానుసారంగా అనుచిత ఉపయోగము అట్టి వినియోగదారుని వలన కలిగినదని పురోభావన చేయపబడవలెను.

139. ఎవరైనా, విద్యుచ్ఛక్తి సరఫరాతో కలిపియున్న ఏదేని సామాగ్రిని నిర్లక్ష్యముతో విరుగగొట్టిన, హానిచేసిన, క్రిందికి విసిరివేసిన లేదా నష్టపరిచిన, పదివేల రూపాయలదాకా ఉండగల జుర్మానాతో శిక్షింపబడవలెను.

140. ఎవరైనా, విద్యుచ్ఛక్తి సరఫరాను నిలుపుటకు ఉద్దేశించిన, ఏదేని విద్యుచ్ఛక్తి సరఫరా లైను లేదా పనులను నిలిపివేసిన లేదా హానిచేసిన లేదా నిలిపి వేయుటకు లేదా హాని చేయుటకు ప్రయత్నించిన, పదివేల రూపాయల దాకా ఉండగల జుర్మానాతో శిక్షింపబడవలెను.

141. ఎవరైనా విద్వేషపూరకముతో ఏదేని సార్వజనిక దీపమును ఆర్పివేసినచో రెండు వేల రూపాయల దాకా ఉండగల జుర్మానాతో శిక్షింపబడవలెను.

142. సముచిత కమీషను సమక్షమున ఎవరేని వ్యక్తిచే ఏదేని ఫిర్యాదు దాఖలు చేసినపుడు లేదా ఈ చట్టము యొక్క ఏవేని నిబంధనలు లేదా దాని క్రింద చేసిన నియమములు లేదా వినియమములను లేదా కమీషనుచే జారీ చేయబడిన ఏదేని ఆదేశమును ఎవరేని వ్యక్తి ఉల్లంఘించినాడని ఆ కమీషను సంతృప్తి చెందిన యెడల, ఈ ఆ విషయములో ఆకర్ణింపబడుటకు. అట్టి వ్యక్తికి అవకాశమునొసగిన తరువాత, సముచిత ________________

కమీషను, వ్రాతములకమైన ఉత్తర్వు ద్వారా, ఈ చట్టము క్రింద అతడు బాధ్య డైనట్టి ఏదేని ఇతర శాస్తికి భంగము కలుగకుండా ప్రతియొక ఉల్లంఘనకు లక్ష రూపారులకు మించని మొత్తమును శాస్తి ద్వారా అట్టి వ్యక్తి చెల్లించవలెనని మరియు వైఫల్యం కొనసాగుతున్న సందర్భంలో అట్టి మొదటి ఉత్తర్వు ఉల్లంఘన తరువాత వైఫల్యం కొనసాగుతున్న సమయంలో, ప్రతియొక్క రోజుకు ఆరు వేల రూపాయల దాకా ఉండగల "అదనపు శాస్తి, చెల్లించవలెనని ఆదేశించవచ్చును.

143.(1) ఈ చట్టము క్రింద న్యాయ నిర్ణయము చేయు నిమిత్తం, సముచిత కమీషను, ఏదేని శాస్తిని విధించు నిమిత్తం ఎవరేని సంబంధిత వ్యక్తికి ఆకర్ణింపబడుటకు యుక్తమైన అవకాశము నిచ్చిన తరువాత సముచిత ప్రభుత్వముచే విహితపరచబడునట్టి ప్రరూపములో విచారణ జరుపుట కొరకు, తన సభ్యులలో ఎవరినైనను న్యాయ నిర్ణయాధికారిగా నియమించవలెను.

(2) విచారణ జరుగుతున్నపుడు, విషయనస్తువు యొక్క విచారణకు తత్సంబంధించిన లేదా ఉపయోగించిన న్యాయనిర్ణయాధికారి యొక్క అభిప్రాయములో సాక్ష్యమును ఇచ్చుటకుగాను లేదా ఏదేని దస్తావేజును దాఖలు పరచుటకుగాను కేసు యొక్క సంగతులు మరియు పరిస్థితులు తెలిసియున్న ఏ వ్యక్తినైననూ సమను చేసి మరియు తప్పనిసరిగా హాజరు అగునట్లు చేయుటకును న్యాయ నిర్ణయాధికారి అధికారము కలిగి యుండును, మరియు అట్టి విచారణ మీదట, 29వ పరిచ్చేదము, లేదా 33వ పరిచ్చేదము లేదా 43వ పరిచ్చేదము యొక్క నిబంధనలను అమలుపరచుటలో ఆ వ్యక్తి విఫలం చెందినాడని అతడు సంతృప్తి చెందిన యెడల, ఏవేని సదరు సరిచ్చేదముల నిబంధనల ప్రకారం అతడు సబబని భావించినట్టి శాస్త్రిని విధించవచ్చును.

144. పరిచ్ఛేదము 29 లేదా పరిచ్చేదము 33 లేదా పరిచ్చేదము 43 క్రింద శాస్త్రి మొత్తమును న్యాయ నిర్ణయము చేయనపుడు, న్యాయనిర్ణయాధికారి ఈ క్రింది కారకములకు తగిన ప్రాధాన్యతను ఇవ్వవలెను, అవేవనగా: -

(ఎ) లెక్కించుటకు వీలున్నచోట వ్యతిక్రమణ ఫలితంగా చేసిన అసమాంజస్య లాబ్ది లేదా అనుచితమైన అనుకూల్యపు మొత్తము;

(బి) వ్యతిక్రమణను పునరావృత్తము చేయు స్వభావము. ________________

105/G105. 145. నిర్ధారించుటకుగాను ఈ చట్టము ద్వారా లేదా దాని క్రింద 126న పరిచ్ఛేదములో నిర్దేశించిన నిర్ధారణ అధికారి లేదా 127వ పరిచ్ఛేదము క్రింద నిర్దేశించిన అప్పీలు ప్రాధికారి లేదా ఈ చట్టము క్రింద నియమించబడిన న్యాయ నిర్ణయాధికారికి అధికారమీయబడిన ఏదేని విషయమునకు సంబంధించి ఏ సివిలు న్యాయస్థానము ఏదేని దావా లేదా చర్యను స్వీకరించుటకు. అధికారితా పరిధిని కలిగియుండదు మరియు ఈ చట్టము ద్వారా లేదా దానిక్రింద ప్రదత్తము చేయబడిన ఏదేని అధికారమును అనుసరించి తీసుకొనిన లేదా తీసుకొనవలసిన ఏదేని చర్యకు సంబంధించి ఏదేని న్యాయస్థానము లేదా ఇతర ప్రాధికారిచే ఈ వ్యాదేశము మంజూరు చేయబడరాదు.

146. ఈ చట్టము క్రింది ఏదేని ఉత్తర్వు లేదా ఆదేశమును సదరు ఉత్తర్వు లేదా ఆదేశములో నిర్దిష్టపరచబడినట్టి కాలావధి లోపల పాటించుటలో వైఫల్యం చెందిన లేదా ఉల్లంఘించిన లేదా ఈ చట్టము యొక్క ఏవేని నిబంధనలు లేదా దానిక్రింద చేయబడిన ఏవేని నియమములు లేదా వినియమములను ఉల్లంఘించుటకు ప్రయత్నించిన లేదా దుష్ప్రరణ చేసిన వారేవరైనను మూడు నెలల వరకు పొడింగింపగల కాలావధితోను లేదా లక్ష రూపాయల దాకా ఉండగల జుర్మానాతోను లేదా ప్రతియొక అపరాధమునకు సంబంధించి రెండింటిలోను మరియు వైఫల్యం కొనసాగుతున్న విషయంలో అట్టి మొదటి అపరాధము నకై దోషస్థాపన జరిగిన తరువాత వైఫల్యం కొనసాగుతున్న సమయంలో ప్రతియొక రోజుకు ఐదువేల రూపాయలదాకా ఉండగల అదనపు జుర్మానాలో శిక్షింపబడ వలెను.

అయితే, ఈ పరిచ్చేదములో నున్నదేదియు 121వ పరిచ్ఛేదము క్రింద జారీచేయబడిన ఉత్తర్వులు, అను దేశములు లేదా ఆదేశములకు వర్తించదు.

147. ఈ చట్టము క్రింద విధించబడిన శిస్తులు, నష్టపరిహారము చెల్లింపుకు సంబంధించి ఏదేని దాయిత్వమునకు లేదా లైసెన్సుదారు విషయంలో నేరస్థుడు భరించవలసిన అతని లైసెన్సు ప్రతిసంహరణకు అదనముగాను మరియు న్యూనపరచకుండా ఉండవలెను.

148. ఈ చట్టము యొక్క నిబంధనలు, అని వర్తించునంత వరకు, సముచిత ప్రభుత్వము చే సరఫరా చేయబడిన విద్యుచ్ఛక్తి లేదా దానికి చెందిన పనుల విషయంలో ఆ చట్టము క్రింద శిక్షింపబడు కార్యములు చేసినపుడు కూడ వర్తించునట్లు భావింపబడవలెను.

149.(1) ఈ చట్టము క్రింద అపరాధమును ఏదేని ఒక కంపెనీ చేసిన యెడల ఆ అపరాధము జరిగినపుడు ఆ కంపెనీ యొక్క బాద్యత లేక ఆ కంపెనీ వ్యాపార నిర్వహణ భారమును వహించి యుండిన ప్రతి వ్యక్తియు మరియు ఆ కంపెనీయు ఆ అపరాధము చేసినట్లు భావించవలెను. మరియు తదనుసారముగా చర్యలు జరుపబడి మరియు శిక్షింపబడుటకు పాత్రుడగును. ________________

- 1061 G106 అయితే, అట్టి ఎవరేని వ్యక్తి తనకు తెలియకుండా అపరాధము జరిగినదని లేక అట్టి అపరాధము జరుగుటను నివారించుటకు తాను తగిన శ్రద్ధ అంతయు తీసికొనినట్లు అతను రుజువు చేసినచో, ఈ ఉప-పరిచ్ఛేదములో నున్నదేదియు అతనిని ఏ శిక్షకు గురిచేయదు.

(2). ఉప-పరిచ్ఛేదము (1)లో ఏమి ఉన్నప్పటికినీ, ఈ చట్టము క్రింద ఏదేని అపరాధమును ఒక కంపెనీ చేసియుండి, ఆ అపరాధము. ఆ కంపెనీ యొక్క ఎవరేని డైరెక్టరు, మేనేజరు, కార్యదర్శి, లేక ఇతర అధికారి సమ్మతితో లేక మౌనానుకూలతతో జరిగినదని లేక ఏదేని నిర్లక్ష్యము వలన జరిగినదని రుజువైన యెడల ఆ డైరెక్టరు, మేనేజరు, కార్యదర్శి లేక ఇతర అధికారి కూడ అట్టి ధోషాయుత అపరాధము చేసినట్లు భావించబడవలెను మరియు తదనుసారముగా చర్యలు జరుబడి శిక్షింపబడుటకు పాత్రుడగును.

విశదీకరణ: - ఈ పరిచ్ఛేదము నిమిత్తము,-

(ఎ) "కంపెనీ" అనగా నిగమ నికాయము అని అర్ధము మరియు ఈ పదపరిధియందు ఫర్ము లేదా ఇతర వైయుక్తిక వ్యక్తుల అసోసియేషను, మరియు

(బి) ఫర్ముకు సంబంధించి "డైరెక్టరు" అనగా ఆ ఫర్ములోని భాగస్వామి

అని అర్ధము.

150.(1) భారత శిక్షా స్మృతిలో ఏమున్నప్పటికినీ, ఈ చట్టము క్రింద శిక్షింపదగు అపరాధమునకు దుష్ప్రరణ కలిగించు వారెవరైననూ ఆ అపరాధమునకై నిబంధించబడిన శిక్షతో శిక్షింపబడవలెను.

(2) ఈ చట్టము క్రింద లేదా తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము క్రింద విధింపవలసిన ఏదేని శాస్త్రి లేదా జుర్మానాకు లేక ప్రారంభించవలసిన అభియోగపు ప్రొసీడింగులకు భంగము కలుగకుండా, ఎవరేని అధికారి లేదా బోర్డు యొక్క ఇతర ఉద్యోగి లేదా లైసెన్సుదారు. ఏదేని చర్య లేదా సనిని చేయుటకు, చేయకుండా ఉండుటకు, అనుమతి ఇచ్చుటకు, రహస్యంగా ఉంచుటకు లేదా మౌనానుకూలతతో ఏదేని కరారు చేసికొనుటతో ఏదేని విద్యుచ్ఛక్తి చౌర్యం జరిగినప్పుడు, మూడు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి కారావాసముతోను లేదా జుర్మానాతోను లేదా రెండింటితోను, శిక్షింపబడవలెను.

(3) 135వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)లో, 136వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)లో, 137వ పరిచ్ఛేదము మరియు 138వ పరిచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికిని, ఎవరేని వ్యక్తి విద్యుచ్ఛక్తి కాంట్రాక్టరు, పర్యవేక్షకుడి లేదా కార్మికుడి కార్యకారిగా ఉన్నప్పుడు 135వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (1), 136న పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (1), 137వ పరిచ్చేదము లేదా 138వ పరిచ్చేదము క్రింద శిక్షించబడు అపరాధము చేయుట దుష్ప్రరణ ________________

- 1171 G107 చేసినచో అట్టి దుష్ప్రరణ కొరకు అతనిపై ఉన్న నేరస్థాపన ఈ చట్టము క్రింద చేయబడిన లేదా చేసినట్లు భావించబడిన నియమముల క్రింద జారీ చేయబడిన లైసెన్సును లేదా సమర్ధ్యతా ధృవీకరణ పత్రము లేదా అనుమతి లేదా అట్టి ఇతర ప్రాధికృతమును లైసెన్సు ప్రాధికారి రద్దు చేయవచ్చును.

అయితే, విన్నవించుకొనడానికి అట్టి వ్యక్తికి సబబైన అవకాశమీయకుండా అట్టి రద్దు కొరకు ఉత్తర్వును చేయరాదు.

విశదీకరణ:- ఈ ఉప-పరిచ్ఛేదము నిమిత్తం, "లైసెన్సు ప్రాధికారి" అనగా తత్సమయమున అధికారములో ఉండి అట్టి లైసెన్సు లేదా సామర్ధ్యతా ధృవీకరణ పత్రము లేదా అనుమతి లేదా అట్టి ఇతర ప్రాధికృతమును జారీచేయు లేదా నవీకరించు అధికారి అని అర్ధము:

151. సముచిత ప్రభుత్వము లేదా సముచిత కమీషను లేదా వారిచే ప్రాధికార మీయబడిన ఎవరేని వారి అధికారి లేదా ముఖ్య విద్యుత్ ఇన్స్ పెక్టరు లేదా విద్యుత్ " ఇన్ స్పెక్టరు లేదా లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా ఉత్పాదక కంపెనీ యొక్క వ్రాతమూలకమైన ఫిర్యాదు పై తప్ప ఈ ప్రయోజనము నిమిత్తం ఈ చట్టము క్రింద శిక్షించదగు ఏదేని అపరాధమును ఏ న్యాయస్థానముగాని సంజ్ఞానము చేయరాదు.

అయితే, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లోని 173వ పరిచ్ఛేదము క్రింద దాఖలు చేసిన పోలీసు అధికారి యొక్క నివేదికపై ఈ చట్టము క్రింద శిక్షించదగు ఏదేని అపరాధ మును న్యాయస్థానము కూడ సంజ్ఞానములోనికి తీసుకొనవచ్చును.

అంతేకాకుండా, 153న పరిచ్ఛేదము క్రింద ఏర్పాటు చేయబడిన ప్రత్యేక న్యాయస్థానము విచారణ కొరకు అభియుక్తుడిని పంపించకున్నప్పటికిని అపరాధమును సంజ్ఞానములోనికి తీసుకొనుటకు సమర్థత కలిగియుండును.

151ఏ. ఈ చట్టము క్రింద శిక్షించదగు అపరాధము యొక్క దర్యాప్తు నిమిత్తము క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లోని XIIవ అధ్యాయములో నిబంధించబడినట్టి అన్ని అధికారములను పోలీసు అధికార కలిగియుండవలెను.

151బీ. క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లో ఏమున్నప్పటికివి, పరిచ్ఛేదములు 135 నుండి 140 వరకు లేదా 150వ పరిచ్ఛేదము క్రింద శిక్షించదగు అపరాధము సంజేయమైనది. మరియు జామీనుకు అయోగ్యమైనదైయుండును. ________________

108 6108

152.(1) క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లో ఏమి ఉన్నప్పటికినీ, సముచిత ప్రభుత్వము లేదా ఈ విషయములో ప్రాధికారమీయబడిన ఎవరేని అధికారి, ఈ చట్టము క్రింద శిక్షింపదగు విద్యుత్ చౌర్య, అపరాధమును చేసిన లేక చేసినట్లు సబబుగా అనుమానించుటకు వీలున్న ఎవరేని వినియోగదారుడు లేక వ్యక్తి నుండి ఈ క్రింది పట్టికలో నిర్దిష్టపరచబడిన పైకమును అపరాధముల రాజీ ద్వారా అంగీకరించవచ్చును.

పట్టిక
సర్వీసు స్వభావము ఒక కిలోవాట్ (కె.డబ్ల్యూ)/హార్స్ పవరు (హెచ్.పి)కు వసూలు చేయవలసిన రాజీ పైకము మొత్తము యొక్క రేటు లేదా లోటెన్షను (ఎల్.టి) సరఫరా కొరకు మరియు హైటెన్షను( హెచ్.టి) కొరకు కాంట్రాక్టు డిమాండు యొక్క ఒక కిలో వోల్ట్ యాంపియర్ (కె.వి.ఏ)కు అందులో భాగము.
(1) (2)
(1) పారిశ్రామిక సర్వీసు ఇరవై వేల రూపాయలు;
(2) వాణిజ్య సర్వీసు పది వేల రూపాయలు:
(3) వ్యవసాయ సర్వీసు రెండు వేల రూపాయలు:
(4) ఇతర సర్వీసులు నాలుగు వేల రూపాయలు.

అయితే, సముచిత ప్రభుత్వము అధికారిక రాజపత్రములో అధిసూచన ద్వారా పై పట్టికలో నిర్దిష్ట పరచబడిన రేట్లను సవరించవచ్చును.

(2) ఉప పరిచ్చేదము (1) ప్రకారం పైకము మొత్తం చెల్లించిన మీదట, సదరు అపరాధము నకు సంబంధించి అభిరక్షలోనున్న ఎవరేని వ్యక్తి విడుదల చేయబడవలెను మరియు అట్టి వినియోగదారుడు లేదా వ్యక్తికి వ్యతిరేకముగా ఏదేని క్రిమినలు న్యాయ స్థానములో ఎటువంటి ప్రొసీడింగులను ప్రారంభించరాదు. లేదా కొనసాగించరాదు.

(3) సముచిత ప్రభుత్వము లేదా ఈ విషయముమై అధికారమీయబడిన అధికారిచే ఉప-పరిచ్చేదము (1) ప్రకారం అపరాధములు రాజీ కొరకై అంగీకరింపబడిన పైకము మొత్తమును క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 300వ పరిచ్ఛేదపు అర్ధములోని దోష విముక్తి కైన మొత్తముగా భావింపబడవలెను.

(4) ఉప-పరిచ్చేదము (1) క్రింద అపరాధముల రాజీని ఎవరేని వ్యక్తి లేదా వినియోగదారుని కొరకు ఒకసారి మాత్రమే అనుమతింపబడవలెను. ________________

- 109/G109

భాగము -18

ప్రత్యేక న్యాయస్థానములు

153.(1) పరిచ్ఛేదములు 135 నుండి 140 మరియు 150వ పరిచ్ఛేదములో నిర్దేశించిన అపరాధములకు సత్వర విచారణను సమకూర్చు నిమిత్తము రాజ్య ప్రభుత్వము, అధికారిక రాజపత్రములో అధిసూచన ద్వారా అధి సూచనలో, నిర్దిష్ట పరచబడినట్టి ప్రాంతము లేదా ప్రాంతముల కొరకు అవసరమైనన్ని ప్రత్యేక న్యాయస్థానములను సంఘటితము చేయవచ్చును.

(2) ప్రత్యేక న్యాయస్థానములో ఉన్నత న్యాయస్థానము యొక్క సమ్మతితో రాజ్య ప్రభుత్వముచే నియమించబడవలసిన ఏకైక న్యాయాధీశుడు ఉండవలెను.

(3) ఒక వ్యక్తి ప్రత్యేక న్యాయస్థానమునకు న్యాయాధీశుడుగా నియమింపబడుటకు అతడు అట్టి నియామకమునకు అవ్యవహిత పూర్వము అదనపు జిల్లా మరియు సెషన్సు న్యాయాధీశుడైననే తప్ప అర్హుడు కాదు.

(4) ప్రత్యేక న్యాయస్థానపు న్యాయాధీశునుని పదవి ఖాళీ అయిన లేదా అట్టి ప్రత్యేక న్యాయస్థానపు సాధారణ ఉపవిష్ట ప్రదేశములో హాజరులో లేకున్న లేదా అతని విధులను నిర్వర్తించుటకు, అనారోగ్యముతోగాని లేదా ఇతరవిధంగాగాని అసమర్ధుడైన యెడల ప్రత్యేక న్యాయస్థానములోని ఏదేని అత్యవసర వ్యవహారమును,

(ఎ) ప్రత్యేక న్యాయస్థానములో అధికారిత పరిధిని వినియోగించు ఎవరేని న్యాయాధీశుని ద్వారా,

(బి) అట్టి ఇతర న్యాయాధీశుడు అందుబాటులో లేని యెడల, ఉప పరిచ్చేదము (1) క్రింద అధిసూచించబడి ప్రత్యేక న్యాయస్థానపు సాధారణ ఉపవిష్ట ప్రదేశము పై అధికారితా పరిధి కలిగియున్న జిల్లా మరియు సెషన్సు న్యాయాధీశుని ఆదేశముల ప్రకారం

పరిష్కరింపబడవలెను.

154(1) క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లో ఏమియున్నప్పటికిని, పరిచ్ఛేదములు 135 నుండి 140 మరియు 150వ పరిచ్చేదముల క్రింద శిక్షింపబడు ప్రతి అపరాధము, ఏ ప్రత్యేక న్యాయ స్థానము యొక్క అధికారితా పరిధిలో అట్టి అపరాధము జరిగినదో అట్టి ప్రత్యేక న్యాయస్థానము చే మాత్రమే విచారణ జరుపబడవలెను. ________________

1101 6110 (2) ఏదేని దర్యాప్తు లేదా విచారణ క్రమంలో ఏదేని అపరాధమునకు సంబంధించి 135 నుండి 140వ మరియు 150వ పరిచ్చేదముల క్రింద శిక్షింపదగు అపరాధము, ఒక కేసు ఉత్పన్నమైన ప్రాంతము కొరకు ఈ చట్టము క్రింద ఏర్పాటు చేయబడిన ప్రత్యేక న్యాయస్థానముచే విచారణ జరుపబడు కేసు, ఒకటిని భావించిన యెడల, అట్టి ప్రత్యేక న్యాయస్థానమునకు అట్టి కేసును అంతరణ చేసి ఆ తరువాత ఈ చట్టపు నిబంధనల ప్రకారం అట్టి ప్రత్యేక న్యాయస్థానముచే అట్టి కేసును విచారణ జరిపి మరియు పరిష్కరించవలెను.

అయితే, ఏదేని ప్రత్యేక న్యాయస్థానమునకు కేసు అంతరణకి ముందే అభియుక్తుడిని హాజరు విషయంలో ఏదేని న్యాయస్థానముచే నమోదు కాబడిన ఏదేని సాక్ష్యము పై వ్యవహరించడానికి అట్టి ప్రత్యేక న్యాయస్థానమునకు న్యాయసమ్మతమై ఉండవలెను.

అంతేగాక, అట్టి ప్రత్యేక న్యాయ స్థానము, సాక్ష్యము నమోదు కాబడిన సాక్షుల యొక్క తదువరి పరీక్ష, అడ్డు పరీక్ష మరియు పునః పరీక్ష న్యాయహితము దృష్ట్యా అవసరమని అభిప్రాయబడిన యెడల, ఎవరేని అట్టి సాక్షిని తిరిగి సమను చేయవచ్చును మరియు ఏదేని అట్టి తదుపరి పరీక్ష, అడ్డు పరీక్ష లేదా పునఃపరీక్ష తరువాత అది అనుమతించిన విధంగా సాక్షిని విడుదల చేయవలెను.

(3) ప్రత్యేక న్యాయస్థానము, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 260వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) లేదా 262వ పరిచ్ఛేదములో ఏమిఉన్నప్పటికిని, 135 నుండి 140వ మరియు 150వ పరిచ్ఛేదములలో నిర్దేశించిన అపరాధమును, సదరు స్మృతిలో విహితపరచబడిన ప్రక్రియ మరియు సదరు విచారణకు వర్తించునంత వరకు సదరు స్మృతి యొక్క 263 నుండి 265 వరకు గల పరిచ్చేదముల యొక్క నిబంధనల ప్రకారం సంక్షిప్త పద్దతిలో విచారణ జరుపవచ్చును.

అయితే, ఈ ఉప-పరిచ్ఛేదము క్రింద సంక్షిప్త పద్ధతిన విచారణ జరుగుతున్న క్రమంలో, సంక్షిప్త పద్ధతిలో అట్టి కేసును విచారణ చేయుటకు అది అవాంఛనీయమైన దైన కేసు స్వభావం కలదని ప్రత్యేక న్యాయస్థానం భావించిన యెడల, అట్టి అపరాధమును విచారించుటకుగాను పరీక్షించిన ఎవరేని సాక్షిని తిరిగి పిలువవలెను మరియు సదరు స్మృతి యొక్క నిబంధనలచే నిబంధింపబడిన రీతిలో తిరిగి ఆకర్ణింపబడుటకుగాను కేసును ఉపక్రమించవలెను.

అంతేకాక, ఈ పరిచ్ఛేదము క్రింద సంక్షిప్త విచారణలో ఏదేని దోష స్థాపన విషయంలో, ఐదు సంవత్సరములకు మించని కాలావధిపాటు కారాగారవాస శిక్షను జారీ చేయుట ప్రత్యేక న్యాయస్థానమునకు న్యాయసమ్మతమై ఉండవలెను. ________________

111/G111, (4) ప్రత్యేక న్యాయస్థానం, ఏదేని అపరాధమునకు ప్రత్యక్షంగాగాని లేక పరోక్షంగా గాని సంబంధం ఉన్న లేదా సంబంధం కలిగియుండి గోప్యంగా ఉంచిన ఎవరేని వ్యక్తి యొక్క సాక్ష్యమును పొందు ఉద్దేశంతో, అపరాధమునకు సంబంధించి అతనికి తెలిసియుండిన పరిస్థితులు పూర్తిగాను మరియు నిజంగాను వెల్లడి చేయాలనే షరతులపై అట్టి వ్యక్తికి మరియు దానిని చేయుటలో అసలు వ్యక్తిగాగాని లేదా దుషేరకుడుగా గాని సంబంధం ఉన్న ప్రతి ఇతర వ్యక్తికి క్షమాదానం చేయవచ్చును. మరియు క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 308వ పరిచ్ఛేదము నిమిత్తం అట్టి ఏదేని క్షమాదానం 307వ పరిచ్ఛేదము క్రింద సమర్పించినట్లుగా భావించబడవలెను.

(5) ప్రత్యేక న్యాయస్థానము, విద్యుచ్ఛక్తి చౌర్యమునకు గాను డబ్బు రూపేణా విద్యుత్ చౌర్యము కనుగొనబడిన తేదీకి ముందు పన్నెండు మాసముల కాలావధికి లేదా నిర్ధారించబడిన చౌర్యము యొక్క ఖచ్చితమైన కాలావధికి, ఏది తక్కువ అగునో అది, వర్తించు టారిఫ్ రేటుకు రెండు రెట్లకు సమానమైన మొత్తము కంటే తక్కువగాని సివిలు దాయిత్వమును వినియోగదారుడు లేదా వ్యక్తిపై నిర్ధారించవలెను మరియు అట్లు నిర్ధారించ బడిన సివిలు దాయిత్వ మొత్తమును సివిలు న్యాయస్థానపు డిక్రీవ లెనే వసూలు చేయవలెను.

(6) ప్రత్యేక న్యాయస్థానములచే చివరగా అట్లు నిర్ధారింపబడిన సివిలు బాధ్యత ఒక వేళ వినియోగదారుడు లేదా వ్యక్తిచే డిపాజిటు, చేయబడిన మొత్తము కంటే తక్కువ అయిన, వినియోగదారుడు లేదా వ్యక్తిచే బోర్డుకు లేదా లైసెన్సుదారుకు లేదా సందర్భానుసారంగా సంబంధిత వ్యక్తికి అట్లు డిపాజిటు చేయబడిన అధిక మొత్తమును, సదరు డిపాజిటు అయిన తేదీ నుండి చెల్లింపు జరిగిన తేదీ వరకు గల కాలావధికి భారతీయ రిజర్వు బ్యాంకు ప్రధాన ఋణాల పై ప్రస్తుతం ఇచ్చు రేటు చొప్పున వడ్డీతో కలుపుకొని ప్రత్యేక న్యాయస్థానము యొక్క ఉత్తర్వు అందిన తేదీ నుండి పదిహేను దినములలోపల బోర్డు లేదా లైసెన్సుదారుడు లేదా సందర్భానుసారంగా సంబంధిత వ్యక్తిచే వాపసు చేయబడవలెను.

విశదీకరణ: - ఈ పరిచ్చేదము నిమిత్తము “సివిలు దాయిత్వము" అనగా 135 నుండి 140వ మరియు 150వ పరిచ్ఛేదములలో నిర్దేశించబడిన అపరాధము చేయుట వలన బోర్డు లేదా లైసెన్సుదారు లేదా సందర్భానుసారంగా సంబంధిత వ్యక్తిచే కలిగిన నష్టము లేదా చెఱుపు అని అర్ధము.

155. ఈ చట్టములో వేరు విధంగా నిబంధించబడిననే తప్ప, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973ను ఈ చట్టపు నిబంధనలతో అసంగతముగా ఉన్నంత మేరకు ప్రత్యేక న్యాయ స్థానము సమక్షముననున్న ప్రొసీడింగులకు వర్తింపజేయవలెను. మరియు పైన పేర్కొనిన చట్టముల యొక్క నిబంధనల ప్రయోజనముల నిమిత్తం, ప్రత్యేక న్యాయ స్థానము ________________ - - 114/0112 సెషన్సు న్యాయస్థానముగా భావింపబడవలెను మరియు సెషన్సు న్యాయస్థానము యొక్క అన్ని అధికారములను కలిగియుండును. మరియు ప్రత్యేక న్యాయస్థానము సమక్షమున అభియోగమును నడుపు వ్యక్తి పబ్లికు ప్రాసిక్యూటరుగా భావింపబడవలెను.

156. క్రిమినలు ప్రక్రియాస్మృతి, 1973 యొక్క 29 మరియు 30వ అధ్యాయములచే ఒసగబడిన అధికారములన్నింటిని వాటిని వర్తింపజేయదగినంత మేరకు ఉన్నత న్యాయస్థానము అధికరితా పరిధి యొక్క స్థానిక హద్దులలో యున్న ప్రత్యేక న్యాయస్థానము ఉన్నత న్యాయ స్థానపు అధికారితా పరిధి యొక్క స్థానిక హద్దుల లోపల కేసుల విచారణ జరుపుతున్న జిల్లా న్యాయస్థానము లేదా సందర్భానుసారంగా సెషన్ను న్యాయస్థానమువలె వినియోగించ వచ్చును.

157. ప్రత్యేక న్యాయస్థానము, దరఖాస్తు పైగాని లేదా ఇతర విధంగాగాని మరియు న్యాయ విఘాతమును నివారించుటకుగాను 154వ పరిచ్ఛేదము క్రింద జారీ చేసిన తీర్పు లేదా ఉత్తర్వును పునర్విలోకనము చేయవచ్చును. అయితే, సంగతి విషయక సొరపాటు, ముఖ్య సంగతులు తెలియక పోవడం లేదా రికార్డును బట్టి తేటతెల్లమయ్యే తప్పు క్రింద అది జారీ చేయబడినట్టి ఉత్తర్వు అనే ఆధారముపై తప్ప, అట్టి పునర్విలోకన దరఖాస్తును స్వీకరించరాదు.

అయితే, ప్రత్యేక న్యాయస్థానము, ప్రభావితమైన పక్షకారుల వాదనలు ఆకర్షించకుండా ఏదేని పునర్విలోకన దరఖాస్తును అనుమతించరాదు మరియు తన యొక్క పూర్వపు ఉత్తర్వు లేదా తీర్పును రద్దు చేయరాదు.

విశదీకరణ:- ఈ భాగము నిమిత్తం “ప్రత్యేక న్యాయస్థానములు" అనగా 153వ పరిచ్చేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద సంఘటితము చేయబడిన ప్రత్యేక కోర్టులు అని అర్ధము;

భాగము - 16

వివాద తీర్మానం

మధ్యవర్తిత్వము

158. ఈ చట్టము క్రింద లేదా దానిచే ఏదేని విషయమును మధ్యవర్తిత్వం ద్వారా నిర్ధారించుటకు ఉత్తర్వు చేసిన యెడల, ఆ విషయమును, లైసెన్సుదారు యొక్క లైసెన్సులో ఇతరవిధంగా అభివ్య క్తముగా నిబంధించబడిననే తప్ప, ఇరు పక్షకారుల దరఖాస్తు పై ఆ విషయమై సముచిత కమీషనుచే నామనిర్దేశము చేయబడినట్టి వ్యక్తి లేదా వక్తులచే నిర్ధారించ వలెను; కాని అన్ని ఇతర విషయములలో మధ్యవర్తిత్వము మరియు సంధాన చట్టము, 1996 యొక్క నిబంధనలకు లోబడి మధ్యవర్తిత్వము ఉండవలెను. ________________

భాగము - 17

ఇతర నిబంధనలు

సంరక్షక ఖండములు.

159. ఏ వ్యక్తి, విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదకత, ప్రసారము, పంపిణీ, సరఫరా, లేదా ఉపయోగములో స్థానిక ప్రాధికార సంస్థలో నిహితమైయున్న లేదా దానిచే నియంత్రించ బడియున్న ఏదేని రైల్వే, రహదారి, విమానాశ్రయాలు, ట్రామ్ వే, కాలువ లేక జలమార్గం లేదా ఏదేని డాకు, రేవు లేదా ఓడ చేరు వంతెనలను ఏవిధంగానైనను హాని చేయరాదు లేదా ఏదేని రైల్వే, వాయు మార్గం. ట్రామ్ మార్గం, కాలువ లేదా జలమార్గం పై రాకపోకలకు అవరోధం కలిగించరాదు లేక జోక్యం చేసుకొనరాదు.

160.(1) విద్యుచ్ఛక్తిని ఉత్పాదకత, ప్రసారము, పంపిణీ, సరఫరా లేదా ఉపయోగించుచున్న (ఇందు ఇటు పిమ్మట ఈ పరిచ్ఛేదములో "ఆపరేటరు" అని పిలువబడు) ప్రతియొక వ్యక్తి తన విద్యుత్ లైన్లు, విద్యుచ్ఛక్తి ప్లాంటు మరియు ఇతర పనులను నిర్మించుటలో, చేయుటలో మరియు ఉంచుటలోను మరియు తన వ్యవస్థ పనితీరులో టెలిగ్రాఫిక్, టెలిఫోను లేదా విద్యుత్ సిగ్నలింగు సందేశం నిమిత్తం ఉపయోగించిన ఏదేని వైరు లేదా లైను యొక్క పని లేదా అట్టి వైరు లేదా లైనులోని విద్యుత్ ప్రవాహంనకు చేర్చడం ద్వారా లేదా ఇతర విధంగా ఆట్లు హానికరం ప్రభావితము కాకుండునట్లు సరియైన, ముందు జాగ్రత్తలు తీసుకొనవలెను.

(2) ఆపరేటరు ఉప పరిచ్చేదము (1) ఉల్లంఘన చేసినచో అతని విద్యుచ్ఛక్తి లైన్లు, విద్యుచ్ఛక్తి ప్లాంటు లేదా ఇతర పనులను నిర్మించిన, వేసిన లేదా ఉంచిన అతని యొక్క వ్యవస్థ పనితీరు విషయమై లేదా ఏదేని వైరు, లైను లేదా విద్యుచ్ఛక్తి ప్రవాహము వలన హానికరంగా లేదా హానికరంగా కాకుండా ప్రభావితమైన విషయమై ఆప రేటరు మరియు టెలిగ్రాఫు ప్రాధికార సంస్థ మధ్య ఏదేని భేదము లేదా వివాదము తలెత్తిన యెడల, ఆ విషయములను కేంద్ర ప్రభుత్వమునకు నిర్దేశించవలెను. మరియు కేంద్ర ప్రభుత్వము, అట్టి లైన్లు, ప్లాంటు లేదా పనుల నిర్మాణము తరువాత విద్యుత్ లైన్లు, విద్యుత్ ప్లాంటు లేదా ఆపరేటరు యొక్క పనులకు అనుచితమైనంత దగ్గరగా వైరు లేదా లైను ఉంచబడినాయని భావించిననే తప్ప, ఈ పరిచ్ఛేదము యొక్క నిబంధనలను అమలు చేయుటకుగాను అతని వ్యవస్థలో మార్పులు లేదా వ్యవస్థకు చేర్పులు చేయుటకు ఆప రేటరును ఆదేశించవచ్చును మరియు ఆప రేటరు తదనుసారంగా అట్టి మార్పులు లేదా చేర్పులు చేయవలెను. ________________

114 G114 అయితే, విద్యుచ్ఛక్తి లైను లేదా విద్యుచ్ఛక్తి ప్లాంటు సరళిలో, దాని మొత్తము మరియు దానిచే విద్యుచ్ఛక్తి ప్రసారం చేసిన స్వభావం మార్పు చెందసంత వరకు, ఏదేని విద్యుచ్ఛక్తి లైను లేదా విద్యుచ్ఛక్తి ప్లాంటు యొక్క మరమ్మతు, నవీకరణ లేదా సవరణకు ఈ పరిచ్ఛేదములోనున్నదేదియు వర్తించదు.

(3) ఈ పరిచ్ఛేదపు ఆవశ్యకతలను పాటించుటలో ఆప లేటరు వ్యతిక్రమణ చేసిన యెడల, దాని కారణముచే కలిగిన ఏదేని నష్టం లేదా చెరుపుకి అతను పూర్తి నష్ట పరిహారము ఇవ్వవలెను మరియు అట్టి నష్టపరిహారపు మొత్తమునుకు సంబంధించి ఏదేని బేధము లేదా వివాదము సంభవించిన యెడల, ఆ విషయమును మధ్యవర్తిత్వము ద్వారా నిర్ధారించవలెను.

విశదీకరణ:- ఈ పరిచ్చేదము నిమిత్తం, టెలిగ్రాఫిక్, టెలిఫోనిక్ లేదా విద్యుచ్ఛక్తి సిగ్నలింగు సందేశమైనట్టి లైను, విద్యుచ్ఛక్తి లైను, విద్యుచ్ఛక్తి ప్లాంటు లేదా ఇతర పని లేదా దానికై చేసిన ఏదేని ఉపయోగముతో చేర్చుట లేదా ఇతరవిధంగా భంగకరమైన జోక్యము కలిగినచో, టెలిగ్రాఫిక్ లైను హానికరముగా ప్రభావితమైనదని భావించబడవలెను.

161 (1) ఉత్పాదకత, ప్రసారము, పంపిణీ, సరఫరా లేదా విద్యుచ్చ క్తిని ఉపయోగించు సందర్భంలో లేదా విద్యుచ్ఛక్తి లైన్ల యొక్క ఏదేని భాగం లేదా విద్యుచ్ఛక్తి ప్లాంటుకు సంబంధించి ఎవరేని వ్యక్తికి ఏదేని ప్రమాదము సంభవించిన యెడల మరియు ఆ ప్రమాద ఫలితంగా మానవుని లేదా జంతవుల ప్రాణానికి నష్టం లేదా మానవునికి లేదా జంతువుకి హాని జరిగినపుడు లేదా బహుశా జరగబోవునపుడు, అట్టి వ్యక్తి, సంఘటన విషయమును మరియు ప్రమాదము ద్వారా నిజంగా జరిగినట్టి ఏదేని నష్టము లేదా హాని విషయమును విహితపరచబడునట్టి ప్రరూపములో మరియు అట్టి సమయములోపల విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరుకు లేదా పైన పేర్కొనినట్టి ఇతర వ్యక్తి లేదా సముచిత ప్రభుత్వము సాధారణ లేక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఆదేశించబడినట్టి ఇతర ప్రాధికారులకు తెలియజేయవలెను.

(2) సముచిత ప్రభుత్వము సముచితమని భావించిన యెడల ఎవరేని విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు లేదా ఈ విషయంలో తనచే నియమింపబడిన ఎవరేని ఇతర వ్యక్తిని,-

(ఎ), అప్పుడప్పుడు లేదా ఉత్పాదకత, ప్రసారము, పంపిణీ, సరఫరా లేదా విద్యుచ్ఛక్తిని ఉపయోగించు సందర్భంలో ప్రజల భద్రతపై ప్రభావం చూపు ఏదేని ప్రమాదానికి కారణమైన విషయమై; లేదా ________________ 115/6115 (బి) ఈ చట్టపు నిబంధనలు లేదా దాని క్రింది చేయబడిన నియమములు మరియు వినియమములు లేదా ఏదేని లైసెన్సు, ఆ నిబంధనలు ఎవరేని వ్యక్తి భద్రత పై ప్రభావము చూపునంత వరకు పాటించిన రీతి మరియు దాని విస్తరణ విషయమై

పరిశీలించి మరియు నివేదించమని కోరవచ్చును.

(3) ఉప-పరిచ్ఛేదము (2) క్రింద విచారణ జరుపు ప్రతి విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు లేదా ఇతర వ్యక్తి, సాక్షులను హాజరుపరచుటకు, దస్తావేజులను మరియు ప్రధాన విషయములను తప్పనిసరిగ దాఖలు చేయుట నిమిత్తమై క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1908 క్రింద సివిలు న్యాయ స్థానము యొక్క అధికారములను కలిగియుండును మరియు ఎవరేని భారత శిక్షా స్మృతి యొక్క 176వ పరిచ్ఛేదము క్రిందకు వచ్చు విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు ద్వారా శాసనరీత్యా బద్దుడై ఉండునట్లుగా కోరవచ్చును.

162.(1)సముచిత ప్రభుత్వము, అధి సూచన ద్వారా తగిన అర్హతలుగల వ్యక్తులను ప్రధాన విద్యుచ్ఛక్తి ఇన్-స్పెక్టరు లేదా విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టర్లుగా నియమించవచ్చును మరియు అట్లు నియమింపబడినట్టి ప్రతి ఇన్ స్పెక్టరు, ఈ చట్టము క్రింద ప్రధాన విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు లేదా విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు యొక్క అధికారములను వినియోగించవలెను. మరియు కృత్యములను నిర్వర్తించవలెను. మరియు అట్టి ప్రాంతములలో లేదా పనుల తరగతి మరియు విద్యుచ్ఛక్తి అమరింపులకు సంబంధించి మరియు సముచిత ప్రభుత్వము ఆదేశించునట్టి ఆంక్షలకు లోబడి విహితపరచబడినట్టి ఇతర అధికారములను వినియోగించవలెను. మరియు అట్టి ఇతర కృత్యములను నిర్వర్తించవలెను.

(2) ఈ చట్టములో లేదా దానిక్రింద చేసిన ఏదేని నియమములో విరుద్ధముగా అభివ్యక్తమైన నిబంధన లేనందున, ప్రధాన విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు లేదా విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరు నిర్ణయము పై సముచిత ప్రభుత్వమునకు గాని లేదా సముచిత ప్రభుత్వము సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఆదేశించిన సముచిత కమీషనుకుగాని అప్పీలు చేయవచ్చును.

163.(1) లైసెన్సుదారు లేదా లైసెన్సు ద్వారా ప్రాధికార మీయబడిన ఎవరేని వ్యక్తి, ఏ ఆక్రమణదారుడి ఏవేని ఆవరణలు లేక భూమి క్రిందగాని, పైనగాని, ప్రక్కనగాని, అడ్డముగా గాని, లోగాని, లేదా మీదగాని అతడిచే విద్యుత్ సరఫరా లైన్లు లేక ఇతర పనులు శాసనబద్ధంగా ఉంచబడినాయో ఆ ఆక్రమణదారుడికి తమ ఉద్దేశమును తెలియజేయుట ద్వారా అతడిచే విద్యుచ్ఛక్తి సరఫరా చేసిన లేక విద్యుచ్ఛక్తి సరఫరా చేయబడిన ఏవేని ఆవరణలలో,________________

1161 G116 (ఎ) లైసెన్సుదారుకు చెందిన విద్యుచ్ఛక్తి సరఫరా కొరకైన విద్యుచ్ఛక్తి సరఫరా లైన్ల, మీటర్ల, ఫిట్టింగుల, పనులు మరియు ఉపకరణాల తనిఖీ, పరీక్ష మరమ్మతు లేదా మార్పు చేయుటకు; లేదా

(బి) సరఫరా చేయబడిన విద్యుచ్ఛక్తి పరిమాణ మొత్తమును లేదా సరఫరాలోని విద్యుచ్ఛక్తి పరిమాణమును కనుగొనుటకు; లేదా

(సి) విద్యుచ్ఛక్తి సరఫరా అవసరం లేనియెడల లేదా అట్టి సరఫరాను తీసివేయుటకు మరియు తొలగించుటకు లైసెన్సుదారుకు ప్రాధికారమీయబడిన యెడల, లైసెన్సుదారుకు చెందిన ఏదేని విద్యుచ్ఛక్తి సరఫరా లైన్లు, మీటర్లు, ఫిట్టింగులు, పనులు లేదా ఉపకరణాలను తొలగించు నిమిత్తము ఏదేని యుక్తమైన సమయమున ప్రవేశించవచ్చును.

(2) లైసెన్సుదారు లేదా పైన పేర్కొనిన విధంగా ప్రాధికార మీయబడిన ఎవరేని వ్యక్తి కూడా, ఇందునిమిత్తం కార్యపాలక మేజిస్ట్రేటు ద్వారా చేయబడిన ప్రత్యేక ఉత్తర్వును ను పురస్కరించుకొని మరియు ఆక్రమణదారుకు వ్రాతమూలకంగా ఇరవైనాలుగు గంటలకు తక్కువ కాని నోటీసును ఇచ్చిన తరువాత,-

(ఎ) ఉప పరిచ్ఛేదము (1)లో నిర్దేశించిన ఏదేని ఆవరణ లేదా స్థలంలోనికి దానిలో పేర్కొనిన ఏదేని ప్రయోజనం నిమిత్తం ప్రవేశించవచ్చును.

(బి) అతనిచే విద్యుచ్ఛక్తి సరఫరా చేయు విద్యుచ్ఛక్తి వైర్ల ఫిట్టింగులను, వినియోగదారుకు చెందిన విద్యుచ్ఛక్తి ఉపయోగము కొరకైన పనులు మరియు ఉపకరణాలను పరీక్షించు మరియు పరిశీలించు నిమిత్తం ఏదేని ఆవరణలో ప్రవేశించవచ్చును.

(3) వినియోగదారుడు, ఉప-పరిచ్చేదము (1) లేదా ఉప పరిచ్ఛేదము (2) యొక్క నిబంధనలను పురస్కరించుకొని లైసెన్సుదారుని లేదా పైన పేర్కొనిన విధంగా ప్రాధికారమీయబడిన ఎవరేని వ్యక్తిని తన ఆవరణ లేదా స్థలములోనికి ప్రవేశించుట కొరకైన అనుమతిని నిరాకరించిన యెడల, సదరు లైసెన్సుదారు. లేదా వ్యక్తి అట్లు ప్రవేశించినపుడు, సదరు ఉప పరిచ్చేదముల ద్వారా నిర్వర్తించుటకుగాను అతనికి ప్రాధికారమీయబడిన ఏదేని చర్యను నిర్వర్తించుటకు అతనిని అనుమతించుటకు నిరాకరించిన లేదా అట్టి ప్రవేశము లేదా నిర్వర్తన కొరకుగాను సరియైన సదుపాయములు కలుగజేయుటలో వైఫల్యం చెందిన, లైసెన్సుదారు. వినియోగదారునిపై వ్రాతమూలకమైన నోటీసును తామీలు చేసిన ఇరవై నాలుగు గంటలు గడిచిన తరువాత, అట్టి నిరాకరణ లేదా వైఫల్యం కొనసాగునంత కాలం వినియోగదారునికి సరఫరాను నిలిపి వేయవచ్చును. అయితే అది ఎక్కువ కాలము అయి ఉండరాదు. ________________

1171 G117 164. సముచిత ప్రభుత్వము, వ్రాతమూలక ఉత్తర్వు ద్వారా, విద్యుచ్ఛక్తి ప్రసారము కొరకు విద్యుచ్ఛక్తి లైన్లు లేదా విద్యుచ్ఛక్తి ప్లాంటు ఏర్పాటు కొరకు, లేదా పనులను సముచిత రీతిలో సమన్వయపరచుట కొరకు అవసరమైన టెలిఫోనిక్ లేదా టెలిగ్రాఫిక్ సందేశముల కొరకు, ఎవరేని పబ్లికు అధికారి, లైసెన్సుదారు లేదా ఈ చట్టము క్రింద విద్యుచ్ఛక్తి సరఫరా వ్యవహారంలో నిమగ్నమైయున్న ఎవరేని ఇతర వ్యక్తికి, సముచిత ప్రభుత్వము విధించుట అవసరమని భావించబడినట్టి ఏవేని షరతులు మరియు నిర్బంధనలు మరియు భారత టెలిగ్రాఫ్ చట్టం, 1885 యొక్క నిబంధనలకు లోబడి, టెలిగ్రాఫ్ లైన్లను ఏర్పాటు చేయుటకు మరియు ప్రభుత్వము చే స్థాపించిన లేదా నిర్వహించిన లేదా స్థాపించబడు లేదా నిర్వహించబడు టెలిగ్రాఫ్ ప్రయోజనముల నిమిత్తం పదవులకు సంబంధించి ఆ చట్టము క్రింద టెలిగ్రాఫ్ ప్రాధికారి కలిగియున్న ఏవేని అధికారములను ప్రదత్తము చేయవచ్చును.

165.(1) భూసేకరణ చట్టం, 1894 యొక్క 40వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (బి) మరియు 41వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (5)లో, "పని" అను పదము నిర్మితమగు పని ద్వారా విద్యుచ్ఛక్తి సరఫరా లేదా సరఫరా చేయబడుటలో చేరియున్నదని భావింపబడవలెను;

(2) సముచిత ప్రభుత్వము, ఈ విషయమై సముచిత కమీషను సిఫారసు పై, ఈ ప్రయోజనముల కొరకు ఏదేని స్థలమును పొందు వాంఛగల కంపెనీ కానట్టి ఎవరేని వ్యక్తి ఆ ఆ దరఖాస్తుమీద, తాను సబబని భావించినచో, సదరు వ్యక్తి కం పెనీ వలె దానిని అదే రీతిలో మరియు ఆవేషరతులలో అతడు భూసేకరణ చట్టం 1894 నిబంధనల క్రింద ఆర్జించవచ్చునని ఆదేశించవచ్చును.

బాగము-18

వివిధములు

166.(1) కేంద్ర ప్రభుత్వము, దేశములోని విద్యుత్ విధానమును మృదువుగా, సమన్వయంతో అభివృద్ధి చేయుటకు గాను, కేంద్ర కమీషను చైర్ పర్సన్ మరియు దాని యొక్క సభ్యులు, ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సను, ఉత్పాదక కంపెనీల ప్రతినిధులు మరియు అంతర్ రాజ్య విద్యుత్ ప్రసారములో నిమగ్న మైయున్న ప్రసార లైసెన్సుదారు లతో కూడియున్న సమన్వయ వేదిక నొకదానిని సంఘటితము చేయవలెను.

(2) కేంద్ర ప్రభుత్వము, కేంద్ర కమీషను యొక్క చైర్ పర్సను మరియు రాజ్య కమీషనుల చైర్ పర్ససులతో కూడియున్న క్రమబద్ధీకరణదారుల వేదికనొక దానిని కూడా సంఘటితము చేయవలెను. ________________

- 118 G118 (3) కేంద్ర కమీష ము యొక్క చైర్ పర్సన్ ఉప పరిచ్చేదము (2)లో నిర్దేశించిన క్రమబద్ధీకరణదారుల వేదిక చైర్-పర్సను అయి ఉండవలెను.

(4) రాజ్య ప్రభుత్వము, రాజ్యములోని విద్యుత్ విధానమును మృదువుగా, సమన్వయంతో అభివృద్ధి చేయుటకు గాను, రాజ్య కమీషను చైర్-పర్సన్ మరియు దాని యొక్క సభ్యులు, ఉత్పాదకత, కంపెనీల ప్రతినిధులు, ఆ రాజ్యములో విద్యుచ్ఛక్తి ఉత్పాదన, ప్రసారము మరియు పంపిణీలో నిమగ్నమైయున్న ప్రసార లైసెన్సుదారులు మరియు పంపిణీ లైసెన్సుదారులతో కూడియున్న సమస్వయ వేదికనొకదానిని సంఘటితము చేయవలెను.

(5)(ఎ) ప్రతి జిల్లాలో విద్యుదీకరణ విస్తరింపును సమన్వయించుటకు మరియు పునర్విలోకనము చేయుటకు;

(బి) విద్యుత్ సరఫరా మరియు వినియోగదారుని సంతృప్తి యొక్క నాణ్యతను పునర్విలోకనము చేయుటకు;

(సి) ఇంధన సామర్ధ్యాన్ని మరియు దాని యొక్క సంరక్షణను పెంపొందించుటకు

ప్రతి జిల్లాలో సముచిత ప్రభుత్వముచే సంఘటితము చేయబడు ఒక కమిటీ ఉండవలెను.

167. లైసెన్సుదారుకు చెందిన ఏవేని విద్యుచ్ఛక్తి లైన్లు లేదా విద్యుచ్ఛక్తి ప్లాంట్లను లైసెన్సుదారు యొక్క స్వాధీనములో లేని ఏదేని ఆవరణ లేదా స్థలములో గాని లేదా దానిపై గాని ఉంచిన యెడల, అట్టి విద్యుచ్ఛక్తి లైన్లు లేదా విద్యుచ్ఛక్తి ప్లాంటు, ఏ వ్యక్తి స్వాధీనములో ఉన్నవో ఆ వ్యక్తి పై ఏదేని సివిలు న్యాయస్థానపు ఏదేని ప్రక్రియ క్రింద లేదా ఏవేని దివాలా ప్రొసీడింగులలో అమలు చేయుటకు బాధ్యుడిగా తీసికొనబడరాదు.

168. ఈ చట్టము లేదా దాని క్రింద చేసిన నియమములు లేదా వినియమములు క్రింద సద్భావముతో చేసిన లేదా చేయుటకు ఉద్దేశించిన దేనికైనను సముచిత ప్రభుత్వము లేదా అప్పీలు ట్రిబ్యునలు లేదా సముచిత కమీషను లేదా సముచిత ప్రభుత్వము యొక్క ఎవరేని అధికారి లేదా అపీలు ట్రిబ్యునలు యొక్క ఎవరేని సభ్యుడు అధికారి లేదా ఇతర ఉద్యోగి లేదా సముచిత కమీషను యొక్క ఎవరేని సభ్యులు, అధికారి లేదా ఇతర ఉద్యోగులు లేదా మదింపు అధికారి లేదా ఎవరేని పబ్లికు సేవకుడు పై ఎట్టిదావా, అభియోగము లేదా ఇతర 'ప్రొసీడింగు వేయరాదు. ________________

119 6119.

169. అపీ లేటు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్, సభ్యులు, అధికారులు మరియు ఇతర ఉద్యోగస్తులు మరియు సముచిత కమీషను యొక్క చైర్ పర్సను, సభ్యులు, కార్యదర్శి, అధికారులు మరియు ఇతర ఉద్యోగస్తులు, 126వ పరిచ్ఛేదములో నిర్దేశించబడిన మదింపు అధికారి, ఈ చట్టపు ఏవేని నిబంధనలను పురస్కరించుకొని చేయునపుడు లేదా చేయుటకు ఉద్దేశించునపుడు భారత శిక్షా స్మృతి యొక్క 21వ పరిచ్ఛేదపు అర్థములో ఉన్న పబ్లికు సేవకులుగా భావింపబడవలెను.


170. ఈ చట్టము క్రింద వ్యక్తి చెల్లించవలసిన ఏదేని పెనాల్టీ చెల్లించని యెడల, భూమిశిస్తు బకాయి వలె దానిని వసూలు చేయవచ్చును.

171 (1) ఈ చట్టము ద్వారా లేదా దానిక్రింద అవసరమయిన లేదా ఎవరేని వ్యక్తికి పంపుటకు ప్రాధికారమీయబడిన ప్రతి నోటీసు, ఉత్తర్వు లేదా దస్తావేజును, సంతకం చేయబడిన తిరుగు రశీదును పొందిన తరువాత గాని లేదా రిజిస్టర్డు పోస్టు లేదా విహితపరచబడునట్టి బట్వాడా సాధనాల ద్వారా,

(ఎ) చిరునామాదారు సముచిత ప్రభుత్వము అయిన యెడల, ఈ విషయమై సముచిత ప్రభుత్వము విహితపరచినట్టి అధికారి కార్యాలయమునందు;

(బి) చిరునామాదారు సముచిత కమీషను అయిన యెడల, సముచిత కమీషను కార్యాలయము నందు;

(సి) చిరునామాదారు ఒక కంపెనీ అయిన యెడల, కంపెనీ యొక్క రిజిస్టర్డు కార్యాలయము నందు లేదా కంపెనీ యొక్క రిజిస్టర్డు కార్యాలయము భారత దేశములో లేని సందర్భములో భారత దేశంలో ఉన్న కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయమునందు;

(డి) చిరునామాదారు ఎవరేని ఇతర వ్యక్తి అయిన యెడల, ఆ వ్యక్తి యొక్క సాధారణ లేదా గతంలోని నివాస లేదా వ్యాపార స్థలము నందు,

దానిని అతనికి బట్వాడా చేయుట ద్వారా తామీలు చేయవచ్చును.

(2) ఏదేని ప్రాంగణము స్వంతదారుకు లేదా ఆక్రమణదారుకు ఈ చట్టము ద్వారా లేదా దాని క్రింద ఈయబడిన లేదా పంపుటకు అధికారమీయబడిన ప్రతినోటీసు, ఉత్తర్వు లేదా దస్తావేజును, ఆవరణ స్వంతదారు లేదా ఆక్రమణదారు వివరణతో చిరునామా ఉన్నచో, సరిగా పంపబడినదని భావింపబడవలెను. మరియు దానిని లేదా దాని యొక్క సరియైన నకలును ప్రాంగణములోనున్న వ్యక్తికి బట్వాడా చేయుట ద్వారా లేదా ఆ ప్రాంగణంలో తగిన శ్రద్ధతో బట్వాడా ఎవరికి చేయవలెనో ఆ వ్యక్తి లేనిచో, ఆ ప్రాంగణంలో ముఖ్య ప్రదేశంలో దానిని అంటించుట ద్వారా తామీలు చేయవచ్చును.

172. ఈ చట్టములో తద్విరుద్ధముగా ఏమున్నప్పటికినీ, ________________ 120/G120 (ఎ) రద్దు అయిన చట్టముల క్రింద సంఘటితము చేయబడిన రాజ్య విద్యుచ్ఛక్తి బోర్డు, ఈ చట్టపు నిబంధనల క్రింద నియత తేదీ లేదా రాజ్య ప్రభుత్వముచే అధిసూచించ బడినట్టి పూర్వపు తేదీ నుండి ఒక సంవత్సర కాలావధి కొరకు రాజ్య ప్రసార వినియోగము మరియు లైసెన్సుదారుగా" భావింపబడవలెను మరియు ఈ చట్టపు నిబంధనలు మరియు దానిక్రింద చేయబడిన నియమములు మరియు వినియమముల ప్రకారం రాజ్య ప్రసార వినియోగము మరియు లైసెన్సుదారు యొక్క కర్తవ్యములను మరియు కృత్యములను నిర్వర్తించవలెను:

అయితే, రాజ్య ప్రభుత్వము, అధి సూచన ద్వారా, కేంద్ర ప్రభుత్వము మరియు రాజ్య ప్రభుత్వములచే పరస్పరం నిర్ణయించబడిన సదరు ఒక సంవత్సర కాలావధి దాటినట్టి తదుపరి కాలావధికి రాజ్య ప్రసార వినియోగము లేదా లైసెన్సుదారువలె వ్యవహరించు టకును కొనసాగించుటకు రాజ్య విద్యుచ్ఛక్తి బోర్డుకు ప్రాధికార మీయవచ్చును.

(బి) రద్దయిన చట్టముల క్రింద మంజూరు చేయబడిన లైసెన్సులు, ప్రాధీకృతులు, ఆమోదములు, క్లియరెన్సులు మరియు అనుమతులు అన్నియు, నియత తేదీ లేదా సముచిత ప్రభుత్వముచే అధి సూచింపబడినట్టి పూర్వపు తేదీ నుండి ఒక సంవత్సరమునకు మించనట్టి కాలావధి కొరకు, అట్టి లైసెన్సులు, ప్రాధీకృతులు, ఆమోదములు, క్లియరెన్సులు మరియు సందర్భానుసారముగా అనుమతులకు సంబంధించి రద్దు అయిన చట్టములు అమలునందున్న విధంగా అమలులో ఉండుట కొనసాగించవచ్చును మరియు అటు తరువాత అట్టి లైసెన్సులు, ప్రాథీకృతులు, ఆమోదములు, క్లియ రెన్సులు మరియు అనుమతులు, ఈ చట్టము క్రింది లైసెన్సులు, ప్రాధీకృతులు, ఆమోదములు క్లియరెన్సులు మరియు అనుమతులుగా భావించవలెను మరియు అట్టి లైసెన్సులకు, ప్రాధీకృతులు, ఆమోదములు, క్లియ రెన్సులు మరియు అనుమతులన్నింటికి తదనుసారంగా ఈ చట్టపు నిబంధలన్నియు వర్తించును.

(సి) విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టం, 1948 యొక్క 5వ పరిచ్చేదము క్రింద స్థాపించబడిన రాజ్య విద్యుచ్ఛక్తి బోర్డుల యొక్క అధీనస్థ సంస్థ ఖండము (ఎ)లో నిర్దిష్టపరిచిన కాలావధి ముగిసిన పిమ్మట ఈ చట్టపు భాగము 13 యొక్క నిబంధనలు ప్రకారం అంతరణ చేయవచ్చును

(డి) రాజ్య ప్రభుత్వము, అధిసూచన ద్వారా ఈ చట్టములో ఉన్న ఏవేని లేదా అన్ని నిబంధనలు, ఆధిసూచనలో పొందుపరచబడిన నియత తేదీ నుండి ఆరు నెలలు మించనట్టి కాలావధి పాటు ఆ రాజ్యములో వర్తించకుండా ప్రఖ్యానించవచ్చును. ________________ 1211 G121 173. ఈ చట్టము లేదా దానిక్రింద చేయబడిన ఏదేని నియమము లేదా వినియమములో సున్నదేదియు లేదా ఈ చట్టము, నియమము లేదా వినియమము మూలముగా ప్రభావము కలిగియున్న ఏదేని పత్రము, వినియోగదారుని సంరక్షణ చట్టం, 1986 లేదా ఇంధన శక్తి చట్టం, 1962 లేదా రైల్వేల చట్టం, 1989 యొక్క ఏవేని ఇతర నిబంధనలతో అసంగతము అయినంత మేరకు ప్రభావం కలిగియుండదు.

174. 173వ పరిచ్చేదములో ఇతర విధముగా నిబంధించబడిననే తప్ప, ఈ చట్టపు నిబంధనలు, తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము లేక ఈ చట్టము కాని ఇతర శాసనము మూలముగా ప్రభావము కలిగినట్టి ఏదేని పత్రములో ఇందుకు అసంగతముగా ఏ మున్నప్పటికిని అమలు కలిగియుండదు.

175. ఈ చట్టపు నిబంధనలు తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములకు అదనంగాను మరియు న్యూనత పరచనవిగాను ఉండును.

176.(1) కేంద్ర ప్రభుత్వము, అధిసూచన ద్వారా ఈ చట్టము యొక్క నిబంధనల అమలు కొరకై నియమములు చేయవచ్చును.

(2) ప్రత్యేకించి మరియు పైన పేర్కొనిన అధికారము యొక్క వ్యాపకతకు భంగము కలుగకుండా, అట్టి నియమములు అన్నీ లేక ఈ క్రింది ఏవేని విషయములకు నిబంధనలు చేయవచ్చును. అవేవనగా:-

(ఎ) 3వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (4) కు గల వినాయింపు క్రింద ప్రాధికార సంస్థ చే జాతీయ విద్యుచ్ఛక్తి విధాన ముసాయిదా పై ఆక్షేపణలు మరియు సలహాలను ఆహ్వానించవలసిన సమయము;

(బి) 14వ పరిచ్ఛేదమునకు గల ఆరవ వినాయింపు క్రింద అదనపు ఆవశ్యకతలు (తగినంత మూలధనము, పరపతి యోగ్యత లేక ప్రవర్తన నియమావళితోకూడిన);

(సి) 15వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సు మంజూరు కై దరఖాస్తు కొరకు చెల్లించు ఫీజు:

(డి) 26వ పరిచ్చేదవు. ఉప-పరిచ్చేదము (2) క్రింద జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రము యొక్క సంఘటన మరియు కృత్యములు;

(ఇ) 67వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద యజమాని లేదా ఆక్రమణదారు యొక్క అస్తి పై ప్రభావం చూపు లైసెన్సుదారుల చర్యలు: _______________ -122/61220 (ఎఫ్) 68వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (2) యొక్క ఖండము (సి) క్రింద విహితపరచబడినట్టి ఇతర విషయములు:

(జి) 70వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (14) క్రింద ప్రాధికార సంస్థ యొక్క సమావేశములు హాజరు కొరకుగాను ఇతర సభ్యులకు చెల్లించవలసిన భత్యములు మరియు ఫీజు:

(హెచ్) 70వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (15) క్రింద ప్రాధికార సంస్థ యొక్క ఛైర్-పర్సన్ మరియు సభ్యుల సర్వీసు, ఇతర సేవా నిబంధనలు మరియు షరతులు:

(ఐ) 73వ పరిచ్చేదము క్రింద కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ యొక్క కృత్యములు మరియు విధులు;

(జె) 89వ పరిచ్ఛేదవు. ఉప-పరిచ్ఛేదము (2) క్రింద చైర్ పర్సన్ మరియు కేంద్ర కమీషను సభ్యుని జీతభత్యములు మరియు ఇతర సేవా షరతులు;

(కె) 89వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (3) క్రింద ఏ ప్రాధికారి సమక్షమున పదవీ మరియు రహస్య గోపనీయ ప్రమాణములను చేవ్రాలు చేయబడవలెనో ఆ ప్రాధికారి మరియు దాని యొక్క ప్రరూపము మరియు రీతి;

(ఎల్) 90వ పరిచ్చేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (2)కు గల వినాయింపు క్రింద కేంద్ర ప్రభుత్వముచే విహితపరచబడునట్టి ప్రక్రియ:

(ఎమ్) 94వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (జి) క్రింద విహిత పరచబడుటకు అవసరమైనట్టి ఏదేని ఇతర విషయము:

(ఎన్) కేంద్ర కమీషను 100వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (1) క్రింద తయారు చేయవలసిన తన వార్షిక లేక్కల వివరణ ప్రరూపము;

(ఒ) కేంద్ర కమీషను, 101వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద తన వార్షిక నివేదికను తయారు చేయవలసిన ప్రరూపము మరియు సమయము;

(పి) కేంద్ర కమీషను, 106వ పరిచ్ఛేదము క్రింద తన బడ్జెటును తయారు చేయవలసిన ప్రరూపము మరియు సమయము;

(క్యూ) అట్టి ప్రరూపమును సత్యాపనచేయు ప్రరూపము మరియు రీతి మరియు 111వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద అపీలు దాఖలుచేయుట కొరకైన ఫీజు:

(ఆర్) 115వ పరిచ్ఛేదము క్రింద అప్పీలు ట్రిబ్యునలు యొక్క చైర్ పర్సన్ మరియు అప్పీలు ట్రిబ్యునలు యొక్క సభ్యులకు చెల్లించవలసిన జీత భత్యములు మరియు ఇతర సేవా నిబంధనలు మరియు షరతులు: ________________ ...1231 G123 (ఎస్) 119వ పరిచ్చేదపు ఉప సరిచ్ఛేదము (3) క్రింద అప్పీలు ట్రిబ్యునలు యొక్క అధికారుల మరియు ఉద్యోగుల జీతభత్యములు మరియు ఇతర సేవా షరతులు;

(టి) 120వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (2) యొక్క ఖండము. (ఐ), క్రింద అప్పిలేటు ట్రిబ్యునలు వినియోగించవలసియున్న 'సివిలు న్యాయస్థానపు అధికారములకు సంబంధించి అదనపు విషయములు:

(యు) 127వ పరిచ్చేదపు, ఉప-పరిచ్చేదము (1) క్రింద అప్పీలు దాఖలు చేయవలసిన ప్రాధికారి:

(వి) 143వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద న్యాయ నిర్ణయాధికారిచే విచారణ జరుగు రీతి:

(డబ్ల్యూ) 161వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) నిమిత్తము ఎవరేని వ్యక్తికి లేక కేంద్ర ప్రభుత్వమునకు నోటీసులు అందజేయ వలసిన ప్రరూపము మరియు సమయము;

(ఎక్స్) 162వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ఇన్ స్పెక్టర్లచే వినియోగించవలసిన అధికారములు మరియు నిర్వర్తించవలసిన కృత్యములు;

(వై) 171వ పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద అందజేయవలసిన ప్రతి యొక్క నోటీసు, ఉత్తర్వు లేదా దస్తావేజు యొక్క బట్వాడా రీతి;

(జెడ్) అవసరమైన లేదా విహితపరచబడునట్టి ఏదేని ఇతర విషయము.

177. (1) ప్రాధికార సంస్థ అధిసూచన ద్వారా ఈ చట్టము యొక్క నిబంధనలను సాధారణముగా అమలు చేయుటకై ఈ చట్టము మరియు నియమములకు సంగతమైన వినియమములను చేయవచ్చును.

(2) ప్రత్యేకముగను మరియు ఉప-పరిచ్చేదము (1)లో ప్రదత్తము చేయబడిన సాధారణత అధికార వ్యాపకతకు భంగం లేకుండను ఈ క్రింది విషయములన్నింటి కొరకైనను లేదా వాటిలో వేటి కొరకైనను అట్టి వినియమములు చేయవచ్చును. అవేవనగా:-

(ఎ) 34వ పరిచ్ఛేదము క్రింద గ్రిడ్ ప్రమాణాలు:

(బి) 53వ పరిచ్చేదము క్రింద భద్రత మరియు విద్యుత్ సరఫరాకు సంబంధించి ఉపయుక్తమైన పరిమాణములు:

(సి) 55వ పరిచ్ఛేదము క్రింద మీటర్ల ప్రతిష్ఠాపన మరియు నిర్వహణ:

(డి) 70వ పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (9) క్రింద వ్యవహార లావాదేవీల కొరకైన నియమముల ప్రక్రియ; ________________

- 1241 G124 : (ఇ) 73వ పరిచ్చేదపు ఖండము (బి) క్రింద విద్యుచ్ఛక్తి ప్లాంట్లు మరియు విద్యుచ్ఛక్తి లైన్ల నిర్మాణము మరియు గ్రిడ్ కు జోడించుట కొరకైవ సాంకేతిక ప్రమాణాలు:

(ఎఫ్) 74వ పరిచ్ఛేదము క్రింద రాజ్య ప్రభుత్వము మరియు లైసెన్సుదారులు గణాంకముల, రిటర్నుల లేదా ఇతర సమాచారమును సమకూర్చవలసిన ప్రరూపము మరియు రీతి మరియు సమయము:

(జి) నిర్దిష్టపరచు లేదా నిర్దిష్ట పరచవలసిన ఏదేని ఇతర విషయము;

(3) ఈ చట్టము క్రింద ప్రాధికార సంస్థచే చేయబడిన వినియమములన్నియు పూర్వ ప్రచురణ షరతులకు లోబడి ఉండవలెను.

178.(1) కేంద్రకమీషను, అధి సూచన ద్వారా ఈ చట్టము యొక్క నిబంధనలను సాధారణముగా అమలుకై ఈ చట్టము మరియు నియమములకు సంగతమైన వినియమము లను చేయవచ్చును.

(2) ప్రత్యేకముగను మరియు ఉప-పరిచ్ఛేదము (1)లో పేర్కొనిన సాధారణత: అధికార వ్యాపకతకు భంగం లేకుండగను ఈ క్రింది విషయాలన్నింటి కొరకైనను లేదా వాటిలో వేటి కొరకైనను అట్టి నినియమములు చేయవచ్చును. అవేవనగా:-

(ఎ) 14వ పరిచ్ఛేదమునకు గల మొదటి వినాయింపు క్రింద నిర్దిష్ట పరచబడు కాలావధి;

(బి) 15వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (1) క్రింద దరఖాస్తు ప్రరూపము మరియు రీతి;

(సి) 15వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (2) క్రింద నోటీసు రీతి మరియు వివరములు:

(డి) 16వ పరిచ్ఛేదము క్రింద లైసెన్సు షరతులు

(ఇ) 18వ పరిచ్చేదవు ఉప-పరిచ్చేదము (2) యొక్క ఖండము (ఎ) క్రింద నోటీసు రీతి మరియు వివరములు:

(ఎఫ్) 18వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్చేదము (2) యొక్క ఖండము. (సి) క్రింద లైసెన్సులో చేయవలసియున్న మార్పులు లేదా సవరణల ప్రచురణ:

(జి) 28వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద గ్రిడ్ కోడు:

(హెచ్) 28వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (4) క్రింద ఉత్పాదక కం పెనీలు లేదా ప్రసార వినియోగములు లేదా లైసెన్సుదారుల నుండి ఫీజు మరియు ఛార్జీల విధింపు మరియు వసూలు; ________________ ... 125 G 125 (ఐ) 36వ పరిచ్ఛేదమునకు గల వినాయింపు క్రింద అంతరాగతమై ఉన్న ప్రసార సౌకర్యములకు సంబంధించిన రేట్లు, ఛార్జీలు మరియు నిబంధనలు మరియు షరతులు;

(జె) 38వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) యొక్క ఖండము. (డి)లోని ఉప ఖండము (ii) క్రింద ప్రసార ఛార్జీలు మరియు సర్ ఛార్జీ చెల్లింపు:

(కె) 38వ పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (2)లోని ఖండము (డి) యొక్క ఉప ఖండము (ii)కు గల రెండవ వినాయింపు క్రింద సర్ ఛార్జీ మరియు ఎదురు సబ్సిడీల తగ్గింపు;

(ఎల్) 40వ పరిచ్ఛేదపు ఖండము (సి) యొక్క ఉప ఖండము (ii) క్రింద ప్రసార ఛార్జీలు మరియు సర్ ఛార్జీల మరియు ఎదురు సబ్సిడీల తగ్గింపు;

(ఎమ్) 40వ పరిచ్చేదపు ఖండము (సి) యొక్క ఉప ఖండము. (ii)కు గల రెండవ వినాయింపు క్రింద సర్-ఛార్జీల మరియు ఎదురు సబ్సిడీల తగ్గింపు;

(ఎన్) 41వ పరిచ్ఛేదమునకు గల వినాయింపు క్రింద ప్రసార మరియు వీలింగు ఛార్జీల తగ్గింపు కోరకుగాను ఉపయోగింపబడు ఇతర వ్యాపారము నుండి వచ్చిన రెవిన్యూ యొక్క అనుపాతము;

(ఓ) 52వ పరిచ్చేదము యొక్క ఉప పరిచ్ఛేదము (2) క్రింద విద్యుచ్ఛక్తి వర్తకుని కర్తవ్యములు;

(పి) 57వ - పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సుదారు లేదా లైసెన్సుదారుల వర్గము యొక్క నిర్వర్తనా ప్రమాణాలు:

(క్యు) 59వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సుదారుచే ఏ కాలావధి లోపుగా సమాచారమును సమకూర్చవలసియున్నదో ఆ కాలావధి:

(ఆర్) 61వ సరిచ్చేదములోని ఖండము (జి) క్రింద ఎదురు సబ్సిడీల తగ్గింపు కోరకైన రీతి:

(ఎస్) 61వ పరిచ్ఛేదము క్రింద టారిఫ్ నిర్ధారణ కొరకు నిబంధనలు మరియు షరతులు:

(టి) 62వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ చే సమకూర్చవలసియున్న వివరములు;

(యు) 62వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (5) క్రింద టారిఫ్ మరియు ఛార్జీల నుండి ఆశించిన రెవిన్యూ లెక్కింపు ప్రక్రియలు;

(వి) 64వ పరిచ్ఛేదపు ఉప పరిచ్చేదము (1) క్రింద కేంద్ర కమీషనుకు దరఖాస్తు చేసుకొను రీతి మరియు దాని కొరకు చెల్లించవలసిన ఫీజు:

(డబ్ల్యు) 64వ పరిచ్చేదము యొక్క ఉప పరిచ్ఛేదము (2) క్రింద దరఖాస్తు యొక్క ప్రచురణ రీతి: ________________ - 1261 G126 (ఎక్స్) 64వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (3) క్రింద మార్పులు లేదా షరతులతో టారిఫ్ ఉత్తర్వు జారీ:

(వై) 66వ పరిచ్ఛేదము క్రింద నిర్దిష్ట పరచబడిన వర్తకముతో కలుపుకొని విద్యుచ్ఛక్తిలో మార్కెటు అభివృద్ధి చేయు రీతి;

(జెడ్) 91వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్ఛేదము (1) క్రింద కేంద్ర కమీషను యొక్క కార్యదర్శి అధికారములు మరియు కర్తవ్యములు;

(జెడ్-ఎ) 91వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్చేదము (3) క్రింద కేంద్ర కమీషను యొక్క కార్యదర్శి, అధికారులు మరియు ఇతర ఉద్యోగుల సేవా నిబంధనలు ఆమె మరియు షరతులు:

(జెడ్-బి) 92వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (1) క్రింద వ్యాపార వ్యవహారము కొరకు ప్రక్రియా నియమావళి:

(జెడ్-సి) 128వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (8) క్రింద లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీచే నిర్వహించవలసియున్న కనీస సమాచారము మరియు అట్టి సమాచారమును నిర్వహించవలసియున్న రీతి:

(జెడ్-డి) 130వ పరిచ్చేదము క్రింద నోటీసు తామీలు మరియు ప్రచురణ చేయు రీతి:

(జెడ్-ఇ) వినియమములచే నిర్దిష్ట పరచబడు లేదా నిర్దిష్ట పరచవలసిన ఏదేని ఇతర విషయము.

(3) ఈ చట్టము క్రింద కేంద్ర కమీషను ద్వారా చేయబడిన వినియమములన్నియు పూర్వ ప్రచురణ షరతులకు లోబడి ఉండవలెను.

179. కేంద్రప్రభుత్వముచే చేయబడిన ప్రతినియమము, ప్రాధికార సంస్థ చే చేయబడిన ప్రతి వినియమము మరియు కేంద్ర కమీషనుచే చేయబడిన ప్రతి వినియమము, దానిని చేసిన పిమ్మట వీలైనంత త్వరగా పార్లమెంటు అధివేశములోనున్న సమయమున మొత్తం ముప్పది దినముల కాలావధి పాటు దాని ప్రతియొక సదనము సమక్షమునను ఉంచవలెను. అట్టి కాలావధి ఒకే అధివేశనంలో గాని వరుసగా వచ్చు రెండు లేక అంత కెక్కువ అధివేశనములలోగాని చేరి యుండవచ్చును. మరియు పైన చెప్పిన ఆధివేశనమునకు లేక వరుసగా వచ్చు అధివేశనములకు వెనువెంటనే వచ్చు అధివేశనం ముగియుటకు పూర్వమే ఆ నియమములో లేదా వినియమములో ఏదేని మార్పు చేయుటకు ఉభయ సదనములు అంగీకరించినచో లేక నియమమును లేక వినియమమును చేయరాదని ఉభయసదనములు అంగీకరించినచో, అటు పిమ్మట ఆ నియమము లేక వినియమము అట్లు మార్పు చేసిన రూపంలో మాత్రమే ప్రభావం కలిగియుండును. లేక సందర్భానుసారముగా ప్రభావరహితమై యుండును. అయినప్పటికినీ ఏదేని అట్టి మార్పుగాని, రద్దుగాని అంతకు పూర్వం ఆ నియమము లేక వినియమము క్రింద చేసిన దేని శాసన మాన్యతకైనను భంగం కలిగించదు. ________________

1271 G127 ...... 180 (1) రాజ్య ప్రభుత్వము, అధిసూచన ద్వారా, ఈ చట్టపు నిబంధనల అమలు కొరకై నియమములు చేయవచ్చును.

(2) ప్రత్యేకముగను మరియు పైన పేర్కొనిన సాధారణత అధికార వ్యాపకతకు భంగం లేకుండగను ఈ క్రింది విషయాలన్నింటి కొరకైనను లేదా వాటిలో వేటికొరకైనను అట్టి నియమములు చేయవచ్చును, అవేననగా: -

(ఎ) 15వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సు మంజూరు కొరకు దరఖాస్తు చేసుకొనుటకు చెల్లించవలసిన ఫీజు;

(బి) 67వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద ఇతర వ్యక్తుల ఆస్తి పై ప్రభావితమగు లైసెన్సుదారుల పనులు;

(సి) 68వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) యొక్క ఖండము. (సి) క్రింద విహితపరచబడినట్టి ఇతర విషయములు:

(డి) 89వ పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద చైర్ పర్సను మరియు రాజ్య కమీషను సభ్యుల జీతభత్యములు మరియు ఇతర సేవా నిబంధనలు మరియు షరతులు:

(ఇ) 89వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (3) క్రింద ఏ ప్రాధికారి సమక్షమున పదవీ మరియు రహస్య గోపనీయ ప్రమాణములను చేవ్రాలు చేయబడవలెనో ఆ ప్రాధికారి మరియు దాని యొక్క ప్రరూపము మరియు రీతి:

(ఎఫ్) 94వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (జి) క్రింద రాజ్య కమీషనుచే విహితపరచబడుటకు అవసరమైన ఏదేని ఇతర విషయము;

(జి) 103వ పరిచ్చేదపు ఉప పరిచ్ఛేదము (3) క్రింద నిధికి వర్తింపచేయు రీతి;

(హెచ్) 104వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య కమీషను తన వార్షిక లెక్కలను తయారు చేయవలసిన ప్రరూపము మరియు సమయము;

(ఐ) 105వ పరిచ్చేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య కమీషను తన వార్షిక ఆ నివేదికను తయారు చేయవలసిన ప్రరూపము మరియు సమయము:

(జె) 106వ పరిచ్ఛేదము క్రింద రాజ్య కమీషను తన బడ్జెటును తయారు చేయవలసిన ప్రరూపము మరియు సమయము;

(కె) 126వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము. (2) క్రింద తాత్కాలిక మదింపు ఉత్తర్వును తామీలు చేయు రీతి;

(ఎల్) 143వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద న్యాయ నిర్ణయాధికారిచే విచారణ జరుపు రీతి:

(ఎమ్) 161వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద విద్యుచ్ఛక్తి ఇన్ స్పెక్టరుకు అందజేయవలసిన నోటీసు ప్రరూపము మరియు సమయము: ________________ . 128/ G128 (ఎన్) 171వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము. (1) క్రింద ప్రతి నోటీసు, ఉత్తర్వు లేదా దస్తావేజును అంద చేయవలసిన రీతి;

(ఓ) విహితపరచుటకు అవసరమైన లేదా విహితపరచదగు ఏదేని ఇతర విషయం .

181.(1) రాజ్య కమీషనులు, అధిసూచన ద్వారా ఈ చట్టపు నిబంధనలు సాధారణ ముగా అమలు కొరకై, ఈ చట్టము మరియు నియమములకు సంగతమైన వినియమములను చేయవచ్చును.

(2) ప్రత్యేకముగను, మరియు ఉప-పరిచ్చేదము (1)లో పేర్కొనిన అధికార వ్యాపకతకు భంగం లేకుండగను ఈ క్రింది విషయాలన్నింటి కొరకైనను లేదా వాటిలో వేటి కొరకైనను అట్టి వినియమములు చేయవచ్చును, అవేవనగా:-

(ఎ) 14వ పరిచ్చేదమునకు గల మొదటి వినాయింపు క్రింద నిర్దిష్ట పరచబడు కాలావధి;

(బి) 15వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద దరఖాస్తు ప్రరూపము మరియు రీతి:

(సి) 15వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (2) క్రింద ప్రచురించబడు. లైసెన్సు కొరకైన దరఖాస్తు రీతి మరియు వివరములు:

(డి) 16న పరిచ్ఛేదము క్రింద లైసెన్సు షరతులు;

(ఇ) 18వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (2) యొక్క ఖండము (ఎ) క్రింద నోటీసు ప్రరూపము మరియు వివరములు;

(ఎఫ్) 18వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (2) యొక్క ఖండము (సి) క్రింద లైసెన్సు చేయవలసిన మార్పులు లేదా సవరణల ప్రచురణ;

(జి) 32వ పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (3) క్రింద ఉత్పాదక కం పెనీలు లేదా లైసెన్సుదారుల నుండి ఫీజు మరియు ఛార్జీల విధింపు మరియు వసూలు:

(హెచ్) 36వ పరిచ్ఛేదమునకు గల వినాయింపు క్రింద అంతరాగతమైయున్న ప్రసార సౌకర్యములకు సంబంధించిన రేట్లు, ఛార్జీలు మరియు నిబంధనలు మరియు షరతులు;

(ఐ) 39వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (2) యొక్క (డి) యొక్క ఉప ఖండము (ii) క్రింద ప్రసార ఛార్జీలు మరియు సర్-ఛార్జీ, చెల్లింపు;

(జె) 39వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (2) యొక్క ఖండము (డి)లోని ఉప ఖండము(ii)కు రెండవ వినాయింపు క్రింద సర్-ఛార్జీ మరియు ఎదురు సబ్సిడీల తగ్గింపు: ________________

129/G129. (కె) 39వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) యొక్క ఖండము (డి)లోని ఉప ఖండము (ii)కు గల నాల్గవ వినాయింపు క్రింద సర్-ఛార్జీ చెల్లింపు రీతి మరియు వినియోగము;

(ఎల్) 40వ పరిచ్చేదపు ఖండము (సి) యొక్క ఉప-ఖండము (ii) క్రింద, ప్రసార ఛార్టీల మరియు సర్-ఛార్జీల చెల్లింపు;

(ఎమ్) 40వ పరిచ్ఛేదపు ఖండము (సి) యొక్క ఉప ఖండము (ii)కు గల రెండవ వినాయింపు క్రింద సర్-ఛార్జీ మరియు ఎదురు సబ్సిడీల తగ్గింపు;

(ఎన్) 40వ పరిచ్ఛేదపు ఖండము (సి) యొక్క ఉప ఖండము (ii)కు గల నాల్గవ వినాయింపు క్రింద సర్-ఛార్జీ చెల్లింపు రీతి;

(ఓ) 41వ పరిచ్చేదమునకు గల వినాయింపు క్రింద ప్రసార మరియు వీలింగు ఛార్జీల తగ్గింపు కొరకు వినియోగించబడు ఇతర వ్యాపారము నుండి రెవిన్యూల యొక్క అనుపాతం;

(పి) 42వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2)కు గల మూడవ వినాయింపు క్రింద సర్-ఛార్జీల మరియు ఎదురు సబ్సిడీల తగ్గింపు:

(క్యూ) 42వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (4) యొక్క వీలింగు ఛార్జీల పై అదనపు ఛార్జీల చెల్లింపు;

(ఆర్) 42వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (5) క్రింద మార్గదర్శకములు:

(ఎస్) 42వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (7) క్రింద వ్యధల పరిష్కారమున కైన సమయము మరియు అట్టి రీతి:

(టి) 43వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింది నిర్దిష్ట పరచబడిన ప్రయోజనముల నిమిత్తం రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడు కాలావధి;

(యు) 45వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (2) క్రింద విద్యుచ్ఛక్తి ఛార్జీలను నిర్ణయించవలసిన పద్దతులు మరియు సూత్రములు;

(వి) 47వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద పంపిణీ లైసెన్సుదారుకు ఇవ్వవలసిన యుక్తమైన సెక్యూరిటీ;

(డబ్ల్యు) 47వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (4) క్రింద సెక్యూరిటీ పై చెల్లించు వడ్డీ;

(ఎక్స్) 50వ పరిచ్ఛేదము క్రింద విద్యుచ్ఛక్తి సరఫరా కోడ్:

(వై) 51వ పరిచ్ఛేదమునకు వినాయింపు క్రింద వీలింగు ఛార్జీల తగ్గింపు కొరకు వినియోగించబడు ఇతర వ్యాపారము నుండి రెవిన్యూల యొక్క అనుపాతం;

(జెడ్) 52వ పరిచ్చేదపు , ఉప పరిచ్చేదము (2) క్రింద విద్యుచ్ఛక్తి వర్తకుని మన కర్తవ్యములు:

(జెడ్-ఎ) 57వ పరిచ్ఛేదపు , ఉప పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సుదారు లేదా లైసెన్సుదారుల వర్గము యొక్క నిర్వర్తనా ప్రమాణాలు: ________________ (జెడ్-బి) 59వ పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సుదారుచే ఏ కాలావధి లోపల సమాచారము సమర్పించబడునో ఆ కాలావధి:

(జెడ్-సి) 61వ పరిచ్ఛేదములోని ఖండము (జి) క్రింద ఎదురు సబ్సిడీల తగ్గింపు కొరకైన రీతి;

(జెడ్-డి) 61వ పరిచ్ఛేదము క్రింద టారిఫ్ నిర్ధారణ కొరకు నిబంధనలు మరియు షరతులు;

(జెడ్-ఇ) 62వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీచే సమకూర్చబడు వివరములు;

(జెడ్-ఎఫ్) 62వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (5) క్రింద టారిఫ్ మరియు ఛార్జీల నుండి ఆశిస్తున్న రెవిన్యూ లెక్కింపునకుగాను విధానములు మరియు ప్రక్రియలు:

(జెడ్-జి) 64వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య కమీషను సమక్షమున దరఖాస్తు చేయు రీతి మరియు దానికై చెల్లించవలసిన ఫీజు:

(జెడ్-హెచ్) 64వ పరిచ్చేదపు, ఉప పరిచ్ఛేదము (3) క్రింద మార్పులు లేదా షరతులతో టారిఫ్ ఉత్తర్వు జారీ;

(జెడ్-ఐ) 66వ పరిచ్చేదము క్రింద నిర్దిష్ట పరచబడిన వర్తకమును కలుపుకొని విద్యుచ్ఛక్తిలో మార్కెటు అభివృద్ధి చేయు రీతి;

(జెడ్-జె) 91వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య కమీషను కార్యదర్శి యొక్క అధికారములు మరియు కర్తవ్యములు:

(జెడ్-కె) 91వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద రాజ్య కమీషను యొక్క కార్యదర్శి, అధికారులు మరియు ఇతర ఉద్యోగస్తుల సేవా నిబంధనలు మరియు షరతులు;

(జెడ్-ఎల్) 92వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (1) క్రింద వ్యాపార లావాదేవీల ప్రక్రియా నియమావళి,

(జెడ్-ఎమ్) 128వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (8) క్రింద లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ నిర్వహించబడు కనీస సమాచారము మరియు అట్టి సమాచారము నిర్వహించవలసిన రీతి;

(జెడ్-ఎన్} 130వ పరిచ్ఛేదము క్రింద నోటీసు తామీలు మరియు ప్రచురణ చేయు రీతి;

(జెడ్-ఒ) 127వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (1) క్రింద అపీలు దాఖలు చేయు ప్రరూపము, అట్టి ప్రరూపమును. సత్యాపన చేయవలసిన రీతి మరియు అప్పీలు దాఖలు కొరకైన ఫీజు,

(జెడ్-పి) నిర్దిష్ట పరచుటకు అవసరమైన లేదా నిర్దిష్ట పరదగు ఏదేని ఇతర విషయము ________________ - 131/ 6131 2 (3) ఈ చట్టము క్రింద రాజ్య కమీషనుచే చేయబడిన వినియమములన్నియు పూర్వ ప్రచురణ షరతులకు లోబడి ఉండవలెను.

182. రాజ్య ప్రభుత్వముచే చేయబడిన ప్రతి నియమము మరియు రాజ్య కమీషనుచే చేయబడిన ప్రతి వినియమము, దానిని చేసిన పిమ్మట, రాజ్య శాసన మండలి శాసనమండలి ఉభయ సదనములు కలిగియున్న యెడల దాని ప్రతి యొక సదనము సమక్షమున లేదా అట్టి శాసన మండలి ఒక సదనమును కలిగియున్నచో ఆ సదనము సమక్షమున ఉంచనలెను.

183.(1) ఈ చట్టపు నిబంధనలను అమలు జరుపుట యందు ఏదైన చిక్కు ఏర్పడినచో, కేంద్రప్రభుత్వము, ప్రచురించిన ఉత్తర్వు ద్వారా, ఈ చట్టపు నిబంధనలకు అసంగతము కాకుండ ఆ చిక్కును తొలగించుటకై ఆవశ్యకమని తమకు తోచునట్టి నిబంధనలను చేయవచ్చును:

అయితే, ఈ చట్టము ప్రారంభపు తేదీ నుండి రెండు సంవత్సరములు ముగిసిన పిమ్మట ఈ పరిచ్ఛేదము క్రింద ఏ ఉత్తర్వును చేయరాదు.

(2) ఈ పరిచ్చేదము క్రింద చేసిన ప్రతి ఉత్తర్వు దానిని చేసిన పిమ్మట వెంటనే పార్లమెంటు ప్రతి యొక్క సదనముల సమక్షమున ఉంచవలెను.

184. రక్షణ, అణు ఇంధనముతో వ్యవహరించు మంత్రిత్వ శాఖ లేదా కేంద్ర ప్రభుత్వ విభాగము లేదా అదేవిధమైన అట్టి ఇతర పోలిన మంత్రిత్వ శాఖలు, లేదా విభాగములు లేదా కేంద్ర ప్రభుత్వముచే అధి సూచించబడునట్టి మంత్రిత్వ శాఖలు లేదా విభాగముల నియంత్రణ క్రింద అధీనస్థలు, బోర్డులు లేదా సంస్థలకు ఈ చట్టపు నిబంధనలు వర్తించవు.

185.(1) ఈ చట్టములో ఇతర విధముగా నిబంధించబడిన నే తప్ప, భారత విద్యుచ్ఛక్తి చట్టము, 1910, విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టము, 1948 మరియు విద్యుచ్ఛక్తి రెగ్యులేటరీ కమీషనుల చట్టము, 1998 ఇందుమూలముగా రద్దు చేయడమైనది.

(2) అట్టి రద్దు ఉన్నప్పటికినీ,

(ఎ) ఈ చట్టపు నిబంధనలకు అసంగతముగాకుండునంత వరకు, రద్దు చేయబడిన శాసనముల క్రింద చేసిన లేదా జారీ చేయబడిన ఏదేని నియమము, అధి సూచన, తనిఖీ, ఉత్తర్వు లేదా నోటీసు లేదా చేసిన ఏదేని నియామకము, స్థిరీకరణ. లేదా ప్రఖ్యాపన లేదా మంజూరు చేసిన ఏదేని లైసెన్సు, అనుమతి, ప్రాధికృతము లేదా మినహాయింపు లేదా వ్రాసిన ఏదేని దస్తావేజు లేదా పత్రము లేదా ఇచ్చిన ఏదేని ఆదేశముతో సహా చేసిన ఏదేని పని లేదా తీసుకొన్న ఏదేని చర్య లేదా చేయుటకు లేదా తీసుకొనుటకు ఉద్దేశించిన ఏదేని ఈ చట్టమునకు తత్తుల్యమైన నిబంధనల క్రింద పనిని లేదా చర్యను చేసినట్లు లేక తీసుకొన్నట్లు భావించవలెను: ________________

. 132/6132. (బి) భారత విద్యుచ్ఛక్తి చట్టము, 1910 యొక్క 12 నుండి 18 వరకు గల పరిచ్చేదములలో యున్నట్టి నిబంధనలు మరియు దాని క్రింద చేసిన నియమములు ఈ చట్టము యొక్క 67 నుండి 69 వరకు గల పరిచ్చేదముల క్రింద నియమములు, చేయునంత వరకు అమలు కలిగి వుండవలెను;

(సి) భారత విద్యుచ్ఛక్తి చట్టం, 1910 యొక్క 37వ పరిచ్ఛేదము క్రింద చేయబడిన భారత విద్యుచ్ఛక్తి నియమములు, 1956, ఈ చట్టము యొక్క 53వ పరిచ్ఛేదము క్రింద వినియములు చేయునంత వరకు, అట్టి రద్దుకు ముందు ఉన్నట్లే అమలులో కొనసాగవలెను:

(డి) విద్యుచ్ఛక్తి (సరఫరా) చట్టం, 1948 యొక్క 69వ పరిచ్చేదపు ఉప పరిచ్చేదము (1) క్రింద చేసిన నియమములన్నియు, అట్టి నియమములు రద్దు చేయునంత వరకు లేదా సందర్భానుసారంగా మార్పు చేయునంత వరకు అమలులో కొనసాగవలెను.

(ఇ) ఈ చట్టము ప్రారంభమునకు ముందు, అనుసూచిలో నిర్దిష్ట పరచబడిన శాసనముల క్రింద రాజ్య ప్రభుత్వముచే జారీ చేయబడిన అన్ని ఆదేశములు రాజ్య ప్రభుత్వముచే అట్టి ఆదేశములు జారీ చేయబడునంత కాలావధితోపాటు వర్తించుట కొనసాగవలెను.

(3) ఈ చట్టపు నిబంధనలకు అసంగతము కాకుండ, అనుసూచిలో నిర్దిష్ట పరచ బడిన శాసనముల నిబంధనలు అట్టి శాసనములు వర్తించు రాజ్యములకు వర్తింప చేయవలెను.

(4) కేంద్ర ప్రభుత్వము, అవసమని భావించినపుడు, అధి సూచన ద్వారా అనుసూచిని సవరించవచ్చును.

(5) . ఉప-పరిచ్చేదము (2)లో, ఇతర విధముగా నిబంధించబడిననే తప్ప ఆ పరిచ్చేదములో రద్దుల ప్రభావానికి సంబంధించిన ప్రత్యేకమైన విషయముల ప్రస్తావన, సాధారణ ఖండముల చట్టం, 1897 యొక్క 6వ పరిచ్చేదపు సాధారణ వర్తింపునకు భంగము కలిగించదు లేదా ప్రభావము చూపదు. ________________

. 1336133

అనుసూచి

అధిశాసనములు

(185వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (3) చూడుడు)

1. ఒరిస్సా విద్యుచ్ఛక్తి సంస్కరణ చట్టం, 1995 (1996లోని 2వ ఒరిస్సా చట్టం)

2. హర్యానా విద్యుచ్ఛక్తి సంస్కరణ చట్టం, 1997 (1998లోని 10వ హర్యానా చట్టం)

3. ఆంధ్రప్రదేశ్ విద్యుచ్ఛక్తి సంస్కరణ చట్టం, 1998 (1998లోని 30వ ఆంధ్రప్రదేశ్ చట్టం)

4. ఉత్తరప్రదేశ్ విద్యుచ్ఛక్తి సంస్కరణ చట్టం, 1999 (1999లోని 24వ ఉత్తరప్రదేశ్ చట్టం)

5. కర్ణాటక విద్యుచ్ఛక్తి సంస్కరణ చట్టం, 1999 (1999లోని 25వ కర్ణాటక చట్టం)

6. రాజస్థాన్ విద్యుచ్ఛక్తి సంస్కరణ చట్టం, 1969 (1999లోని 23వ రాజస్థాన్ చట్టం)

7. ఢిల్లీ విద్యుచ్ఛక్తి సంస్కరణ చట్టం, 2000 (2001లోని 2వ ఢిల్లీ చట్టం)

8. మధ్యప్రదేశ్ విద్యుచ్ఛక్తి సధార్ ఆధినియమ్, 2000 (2001 లోని 4వ మధ్యప్రదేశ్ చట్టం)

9. గుజరాత్ విద్యుచ్ఛక్తి పరిశ్రమ (పునర్వ్యవ స్థీకరణ మరియు క్రమబద్దీకరణ) చట్టము, 2003

  (2003లోని 24వ గుజరాత్ చట్టం)