వికీసోర్స్ చర్చ:వికీప్రాజెక్టు/వీవీఐటీ వికీకనెక్ట్

తాజా వ్యాఖ్య: సమీక్ష చేయటం టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

ప్రాజెక్టు పేజీ సంస్కరణ

మార్చు

User:Mekala Harika, User:Pavan santhosh.s గార్లకి, ప్రాజెక్టు పేజీని మరింత సమర్ధవంతంగా చేయటానికి సంస్కరించాను. పరిశీలించి ఇంకా అవసరమైన చోట్ల మెరుగుపరచండి. --అర్జున (చర్చ) 03:17, 23 ఆగస్టు 2019 (UTC)Reply

ఏకబిగిన OCR చేయటం వికీసోర్స్ నాణ్యత పరిరక్షణకు మంచిది కాదు

మార్చు

ప్రాజెక్టు సభ్యులందరికీ, వికీసోర్స్ లో మీరు కృషి చేయటం ఆహ్వానిస్తున్నాము. మీలో కొంతమంది ఇప్పటికే ఏకబిగిన OCR తో పేజీలు సృష్టిస్తున్నారు. వాటిని అచ్చుదిద్దకపోతే వికీసోర్స్ నాణ్యత పరిరక్షించబడదు. కావున ఒక అధ్యాయం వరకైనా అచ్చుదిద్దిన తరువాతనే తరువాత అధ్యాయానికి OCR చేయడం మంచిది. గమనించండి. మీకేదైనా సందేహాలుంటే అడగండి. ఈ సలహా పాటించకపోతే మీ కృషి తొలగించబడే అవకాశముందని గమనించండి. --అర్జున (చర్చ) 11:37, 23 ఆగస్టు 2019 (UTC)Reply

కామన్స్ లో ఎక్కించునపుడు పుస్తకాల పేర్లు తెలుగులో

మార్చు

కామన్స్ లో ఎక్కించునపుడు, పుస్తకం ప్రధాన పేరు తెలుగులో వుండేటట్లు చూడండి. పేరులో రచయిత పేరు చేర్చనవసరంలేదు. అలాగే ఆ పిడిఎఫ్ వికీమీడియా పిడిఎఫ్ రీడర్ మునుజూపు చూపించగలిగేటట్లుగా వుండాలి. --అర్జున (చర్చ) 11:45, 23 ఆగస్టు 2019 (UTC)Reply

తొలి దశలో నేర్చుకొనటం, అనుభవజ్ఞులనుండి సూచనలు పొందడం

మార్చు

తొలి దశలో కొత్త పుస్తకంపై ఒకరే పనిచేసే బదులు,(ఇద్దరు, ముగ్గురు) సముాహం గా ఏర్పడి ఒకపుస్తకంపై పనిచేస్తే, బాగా నేర్చుకొనగలుగుతారు. ఇప్పటికే పనిజరుగుతున్న పుస్తకాలలో కూడా పనిచేయవచ్చు. అప్పుడు అనుభవజ్ఞులైన వికీసోర్స్ ఎడిటర్లు మీ సవరణలు చూసి తగిన సలహాలు ఇవ్వగలుగుతారు. ఆ తరువాతైన కనీసం ఇద్దరు ఒక పుస్తకంపై పనిచేయనిదే పుస్తకం నాణ్యమైన స్థితికి రాదని గమనించండి. --అర్జున (చర్చ) 11:50, 23 ఆగస్టు 2019 (UTC)Reply

రూపాన్ని సరిగా చేయటం

మార్చు

చాలా మంది పుటలు దిద్దడం కూడా మొదలు పెట్టారు. మీ ఉత్సాహం మెచ్చుకోదగినది. నేను ఇచ్చిన కొన్ని సూచనలుకూడా కొంతమంది పాటిస్తున్నారు. ధన్యవాదాలు. పుటని సరిదిద్దడం, ఆ తరువాత అధ్యాయంలో ఆ పుట సరిగా కనబడుతుందా అని చూసి సవరణలు చేస్తేనే ఆ పుట పని పూర్తయినట్లు. ఒక్కో పుస్తకానికి అవసరాన్ని బట్టి కొన్ని శైలి సూచనలు ఆ పుస్తక సూచిక చర్చలో చేర్చివుంటే చూడాలి. సందేహాలుంటే ఆ చర్చాపేజీలో అడగవచ్చు. అవి పాటించకపోతే మరింత ఎక్కువ సమయం సరిదిద్దడానికి పట్టి, అందరి విలువైన సమయం వృధా అయ్యే అవకాశం వుందని గ్రహించండి. ఉదాహరణకి, ఇటీవల మార్పుల సూచిక చర్చలు (సూచిక చర్చ:Amsumathi by Adavi Bapuraju.pdf) లో శైలి,ఉదాహరణ పుటలు చూడండి. పుట చూపు మక్కీకి మక్కీ వచ్చేటట్లు చేయకుండా వికీసోర్స్ సౌలభ్యం కొరకు కొన్ని సవరణలు చేస్తామని గ్రహించండి. --అర్జున (చర్చ) 11:11, 25 ఆగస్టు 2019 (UTC)Reply

పుస్తకాల పాఠ్యీకరణకు సహసభ్యులు

మార్చు

ప్రాజెక్టు పేజీలో పుస్తకాల పేరు ముందలి గడిలో సహసభ్యత్వ గడి చేర్చాను. మీరు ఆయా గడులలో మీ పేర్లు చేర్చుకోండి. అలాగే ఇప్పటికే కొంత అనుభవం గడించినవారు, వికీసోర్స లో పని మెళవకులను సహసభ్యులకు తెలపండి. వికీసోర్స్ సముదాయం చాలా చిన్నది. మీ జట్టు అందరి మార్పులు గమనించి సలహాలివ్వడం చాలా కష్టం. అన్నట్లు సందేహాలుంటే చర్చాపేజీలు సమర్ధవంతంగా వాడండి. బిడియపడవద్దు. మీ భావప్రసరణ నైపుణ్యాలను, జట్టు పని నైపుణ్యాలను పెంపొందించుకొనడానికి చర్చలు చాలా ఉపయోగంగా వుంటాయి. --అర్జున (చర్చ) 11:24, 25 ఆగస్టు 2019 (UTC)Reply

పైలట్ ప్రాజెక్టు

మార్చు

మీరు పనిచేస్తున్న పైలట్ ప్రాజెక్టు సూచిక పేజీని ప్రాజెక్టు పేజీలో చేర్చండి. --అర్జున (చర్చ) 11:33, 25 ఆగస్టు 2019 (UTC)Reply

పైలట్ ప్రాజెక్టులో అంచెలంచెలగా మీ నైపుణ్యాలు మెరుగుచేసుకొంటూ పట్టికలో స్వంత మదింపు చేయండి. --అర్జున (చర్చ) 01:42, 31 ఆగస్టు 2019 (UTC)Reply

పుస్తకాల ఎంపిక

మార్చు

ప్రాజెక్టు కు పుస్తకాల ఎంపిక ఎలా చేశారో తెలుసుకోవాలనుంది. --అర్జున (చర్చ) 11:41, 27 ఆగస్టు 2019 (UTC)Reply

స్కాన్ నాణ్యత సరిగాలేని పుస్తకాలు

మార్చు

మీరు అచ్చుదిద్దేటప్పుడు పుస్తకంలో స్కాన్ నాణ్యతగా లేదనిపిస్తే ఆ పుటని వంగపండు (violet) రంగుకి మార్చండి. ఇలాంటి దోషాలు ఎక్కువ పేజీలలో వుంటే మూల భౌతికప్రతి వుంటేనే దానిని సరిగా చేయకలుగుతాం కాబట్టి, సూచిక చర్చలో స్కాను నాణ్యత సరిగాలేదనే వ్యాఖ్య వ్రాసి వేరొక పుస్తకంపై పనిచేయండి.--అర్జున (చర్చ) 11:02, 1 సెప్టెంబరు 2019 (UTC)Reply

సమీక్ష చేయటం

మార్చు

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

సంవత్సరానికి పైగా కాలం గడిచింది కావున ప్రాజెక్టులో కృషి చేసిన సభ్యులు సమీక్ష చేస్తే బాగుంటుంది. user:Hariwiki23, ఇతర ప్రాజెక్టు సభ్యులు స్పందించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 13:15, 22 నవంబరు 2020 (UTC)Reply

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 05:58, 1 డిసెంబరు 2020 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/వీవీఐటీ వికీకనెక్ట్".