వికీసోర్స్:శైలి

వికీసోర్స్ ప్రధానంగా స్వేచ్ఛా నకలు హక్కుల గల పుస్తకాలు కలది. అందుకని వికీపీడియా శైలికి కొన్ని విషయాలు అనగా ఉపపేజీలగురించి భిన్నంగా వుంటుంది. పుస్తకం శీర్షికతో ప్రధాన పేరుబరిలో వ్యాసం ప్రారంభించాలి. ఆ పేజీలో ఆ పుస్తకం ముఖపత్రం మరియు దాని మూలకృతులవనరులు, స్వేచ్ఛానకలుహక్కులు నిర్ణయించడానికి అవసరమైన సమాచారం వుంచండి. దాని పేజీలను శీర్షిక వ్యాసం ఉపపేజీలుగా అనగా ముందుకివాలే గీత తరువాత చేర్చండి. (అనగావ్యాసంశీర్షికపేజీ/వ్యాస విషయం విభాగం 1, అనగావ్యాసంశీర్షికపేజీ/వ్యాస విషయం విభాగం 2). ఒక్కో విభాగం ఒక అధ్యాయం లేదా సరిమానమైనది కావచ్చు. పుస్తకాన్ని సులభంగా చదవటానకి, ప్రతి పేజీలో విహరణ పెట్టె వుంచండి. దానిలో ముందలి భాగానికి లింకు తరవాత భాగానికి లింకు చేర్చండి.

ఆ తరువాత రచయిత పేజీలో రచయిత మూస చేర్చి రచయిత రచనలకు లింకులు, వికీపీడియాలో రచయిత వ్యాసానికి లింకులుమూస లో చేర్చండి.

(ప్రారంభంలో వ్యాసవిషయం విభాగాలు ప్రధానపేరు బరిలోనే సృష్టించారు. ఇలా చేస్తే మనకు ఎన్ని పుస్తకాలున్నాయో నేరుగా తెలియదు. అదే విషయం శీర్షికతో వేరువేరుపుస్తకాలలో వాడితే అయోమయ నివృత్తి పేజీలు ఏర్పరచాలి. అందువలన,కొత్తగా వికీసోర్స్ లో పనిచేసేవారు పై సూచనలను త్రప్పక పాటించండి. ఇప్పటికే వున్న పుస్తక వ్యాసాలను బాట్ ద్వారా చక్కదిద్దాలి.)