వికీసోర్స్:శల్య పర్వ నిర్వహణ

9_1_61 చ. హరియును గా దనండు గరుణాన్వితులై తగ నమ్మహాత్ము లె ప్పరుసునఁ గార్యనిశ్చయము వల్కినఁ గీచకవైరియుం బురం దరతనయుండునుం గవలు దానికి మా ర్పలుకంగ నెమ్మెయిం జొర రగు సంధి యెట్లు ననసూయత నూల్కొని చేయు మి త్తఱిన్.

9_1_62 ఆ. ఇంత చెప్పు టనికి నే నోడి ప్రాణర,క్షణము సేసికొనుట గాదు నీకుఁ బథ్య మనియుఁ దఱిమి పల్కితి విను విన,వేని నొచ్చి తలఁచె దిట్టు లగుట.

9_1_63 వ. అని యగ్గౌతముండు శోకాయత్తచిత్తుం డగుచుం దనకు హితోపదేశంబు సేసిన విని దుర్యోధనుండు వేఁడినిట్టూర్పు నిగిడించి యొక్కింతసేపు చింతా క్రాంతుండై యూర కుండి వ్రాల్చినకనుదోయి విచ్చి యవ్విప్రవరుమొగంబు సూచి యి ట్లనియె.

9_1_64 చ. చెడుటకు నోర్వ కీ విటులు చెప్పితి నాకు హితంబు నెయ్య మె క్కుడు గలయట్టిచుట్టమునకున్ నయశిక్ష దగుం గదా భరం పడి బవరంబులం బెనఁగుభంగిని గార్యము దెల్పఁ జాలిన ప్పుడు నిను రక్షణార్థి వని భూసురసత్తమ యే నెఱుంగుదున్.

9_1_65 వ. నీకూర్మి పేర్శింజేసి కీడు దొలఁగింపం జూచి సంధి కర్తవ్యం జని పలికితివి గాని యప్పలుకులు నాకు రుచియింప వె ట్లంటేని.

9_1_66 సీ. కపటంపుజూదంబు ఘటియించి రాజ్యంబు గొని ధర్మజునిమది గుందఁ జేసి సభ కేకవస్త్ర రజస్వల నమ్మెయిఁ బాంచాలి ముందల వట్టి యీడ్చి సంధి సేయఁగఁ బూని శౌరి యేతెంచిన నవ్విధంబున కప్రియం బొనర్చి పలువురు గూడి సౌభద్రు నొక్కని బాలుఁ గిట్టియత్తెఱఁగునఁ గీ ట

తే. నేఁడు దుశ్శాసనునిఱొమ్మునెత్తురనిల,సుతుఁడుమదమునఁ ద్రావుటసూచి ప్రతినదీర్చునతండని భయముఁ బొంది,పొందుగోరిన నదియేల పొసఁగుఁ

9_1_67 ఉ. రాజులు భక్తిఁ గొల్వఁగ ధరావలయం బఖిలంబు దర్పవి భ్రాజితవృత్తి నేలి యనురక్తులఁ బ్రోచుచు శత్రుకోటికి న్దేజము దప్పఁ జేయుచు నతిప్రమదంబున నున్న నాకు నిం కాజియె కాక యొక్కనిదయం గనురాజ్యసుఖంబు లేటికిన్.

9_1_68 వ. నిశ్చయం బిట్టిద యగుటం జేసి

9_1_69 ఆ. పొడుతు నెట్లు పాండుపుత్రులతోఁ గయ్య,మేను నీవు దీని కియ్యకొ పలుకు వినమి గాఁగఁ దలఁపకు ముచితంబు, తెఱఁగు ధీరజనుల కెఱుఁ

9_1_70 చ. విభవమునుం బ్రతాపమును విశ్రుతకీర్తియు మాయ ధర్మపు త్రభటసమానవృత్తమున దైన్యము నొందుట కోర్వ రాదు వీ తభయతఁ బోరఁ బేర్కొని యుదాత్తపదంబున కేఁగి భీష్మకుం భభవజయద్రథాదు లగుబంధుల మిత్రులఁ గూడు టొ ప్పగున్.

9_1_71 వ. అంత వలవ దిమ్మాట మగపాడి కాడితిం గాని.

9_1_72 ఆ. ఏను దెంపు చేసి యీయున్నరథికజ,నంబుతోడఁ గడఁగి నడవ బెట్టు దఱిమి పాండురాజతనయుల మర్దింతు,ననఘ నీవు మెచ్చునట్లు గాఁగ.

9_1_73 చ. అన విని చుట్టు నున్ననృపు లందఱు సంతస మంది యన్న రేం ద్రుని వినుతించి యోటమికి రోయిట నొందినచింత వంతయె ల్లను దిగఁద్రోచి నెమ్మనములన్ రణకౌతుక మావహిల్లునా ననములు దోఁప దర్పవచనంబుల సేనకు ను బ్బొనర్చుచున్.

- దుర్యోధనుఁడు శిబిరంబు విడిచి సరస్వతీతీరంబు చేరుట -

9_1_74 వ. చెలంగి కృపకృతవర్మాశ్వత్థామశకునిశల్యులు గార్యంబు విచారించి శ్వరు నాలోకించి మన మీరాత్రి శిబిరంబున నిద్రించుట యొప్ప దె గర్ణుం దెగటార్చుటంజేసి పేర్చినయుబ్బునఁ బాండవులు పైకొని పర్యా నప్పళింపఁ గలుగఁ బో యని తలంచెదము వినుము వంచనఁ దొలంగి మనకుం గలచతురంగంబుల నాయితంబు సేసికొని పెనఁగువం బన్ని వా ఱఁ గగునట్టిబెట్టిదంపుటురవడిం గదసి రణంబు సేయుద మ ట్లైన జ గొన వచ్చు నని చెప్పిన నవ్వసుమతీపతి ప్రీతుం డై యది లెస్స చేయుద మని సముచితభంగిం దగువారల కెఱింగించి కదలి యచటికి మడ యగుసరస్వతిపొంతం బయలికి బలంబులం గొని చని సకలజన సహితంబుగా నమ్మహానదియం దిచ్ఛానురూపస్నానపానంబు లాచరించి వల యుతెఱంగున వెనుక నడతెంచిన వివిధాహారంబులం దుష్టిఁ బొంది యిష్టా లాపంబులు సెల్లుచుండ నున్నసమయంబు ము న్నాకర్జంబు నడపినదొరలు ను జిత్రసేనాదిభవత్కుమారులును గర్ణుకొడుకు సత్యసేనుండును లోనైనయా ప్తజనంబు లమ్మనుజనాథున కి ట్లనిరి.

9_1_75 వెరవును లావునుం గలిగి విక్రమసంపద సొంపు మీఱి భూ వర భవదీయ మైనబలవర్గము నొడ్డన మేర్ప వీఁకమైఁ బురికొలుపంగ నిర్భయతఁ బోలెడునట్లుగఁ దాను ముంద రై తిరముగఁ జేయఁ జూలు నొకధీరు నొనర్పుముసైన్యనాథుఁ గన్.

9_1_76 దివ్యాస్త్రవేదియు నవ్యాహతవిక్రమోద్దాముండును నగునశ్వత్థామ నాలో కించి యాదరభరితుం డగుచు నాధరణీవరుం డతని కి ట్లనియె.

9_1_77 అనఘ నీవు నాకు నాచార్యునట్టుల, నేడుగడయుఁ గాన హితము సెప్పఁ దగు బలాధినాథుఁడుగఁ జేయ నర్హుని,నెల్ల వినఁగ నిశ్చయింప వలయు.

9_1_78 అనుటయు నాతఁ డిట్టు లను నజ్జనపాలున కాజినైపుణం బును మహనీయశౌర్యమును భూరిబలంబును సర్వసత్త్వవే ధనముఁ బరాక్రమోద్ధతియు ధైర్యసమగ్రతయుం గలండు శ ల్యుని రథినీపతిత్వమహిమోజ్జ్వలుఁ జేయుము కౌరవేశ్వరా.

9_1_79 

నినుఁబట్టి పాండుపుత్రులఁ,దనమేనల్లురఁ దొరంగె ధరణీశ్వర యీ తనిఁ గడచినపరమహితులు,మనకుఁ గలరె యితఁడు లోకమాన్యుఁడు గాఁడే.

9_1_80 కార్తికేయుం డధీశుఁడుగా నమర్త్యు,లెలమిఁ బురికొనిదైత్యుల గెలుచుకరణి మద్రవిభుఁ డగ్రణిగ నేచి మనము నడచి,కడిఁదిపగఱ జయింతము కౌరవేంద్ర.

9_1_81 అనిన విని సమస్తజగతీశులును జయజయశబ్దంబులతో శల్యుం బరివేష్టించి సంగరోత్సాహంబునం బొంగిరి కురునాథుండు గద్దియ డిగి సవినయంబున నమ్మద్రవిభున కభిముఖుండై యి ట్లనియె.

9_1_82 పొచ్చెము లేనినెయ్యమునఁ బూని విపద్ధశ నొంద కుండఁగా నెచ్చెలిఁ గావఁ జూచుమహనీయున కిట్టిద కాల మిప్పు డీ వచ్చుపడంగ నీభుజబలాతిశయంబున నద్భుతంపుగె ల్పిచ్చి కృతార్థుఁ జేయు నను నే నినుఁ జెందియుఁ దూలఁ బోదునే.

9_1_83 పూనుము చమూపతిత్వము,నానమ్మినవారు నేను నరపతిబలసం తానంబుతోడఁ బరిజన,మై నడచెద మాక్రమింపు మరివర్గంబున్.

9_1_84 అన విని శల్యుఁ డి ట్లనియె నమ్మనుజేంద్రున కిప్పు డింతప్రా ర్థన మొనరింప నేల వసుథావరయే నినుఁ జేరినప్డ నా ధనమును బ్రాణమున్ బలవితానము నీకు సమర్పణంబు సే సినయవి గావె నీపనువు సేసెదఁ గౌరవసేనఁ గాచెదన్.

9_1_85 మ. భుజవీర్యంబున నచ్యుతార్జునులు నన్ బోలంగ లే రల్క వ చ్చి జయింపంగఁ గడంగినన్ సురలు నాచేనొత్తు రే నేచి య క్కజపుంజేవయు లావు జూవువడికిం గౌంతేయులే యోర్తు రా ప్రజయున్ నీప్రజయుం గలంగఁ జెలఁగం బాటింతు నాటోపమున్.

9_1_86 చ. అఱిముఱి బాణజాలముల నక్కడిసైనికులం దెరల్చెదన్ గుఱుకొని నాకు మాఱుకొనికోల్తలఁ జేసినవీరవర్గమున్ నఱికెదఁ జూచుఖేచరగణంబుల కచ్చెరుపాటొనర్చెదన్ బఱపెదఁ బాండునందనులఁ బాఱక నిల్చిన రూ పడంచెదన్.

9_1_87 శా. గంగానందనుపోటు మెచ్చక గురుం గా దంచు రాథాతనూ జుం గీ డాడుచు నీతఁ డెవ్వఁ డొకొ యంచున్ శల్యుఁడే యిట్టివా నిం గయ్యంబుల మున్ను గాన మనుచు న్వేభంగులం జూప ఱె ల్లం గీర్తింప ధనుఃకళానిపుణలీలాఖేలతన్ జూపెదన్.

- దుర్యోధనుఁడు శల్యుని సేనానాయకుంగాఁ జేయుట -

9_1_88 వ. అని పలికిన నీసుతుండు ప్రీతుండై కనకకలశంబుల సరస్వతీజలంబ ప్పించి శాస్త్రోక్తప్రకారంబునఁ దగురాజులుం దానును సేనామడి భద్రవిథానోపేతంబు గా నమ్మద్రవిభు నభిషేకించి బలాధిపత్యపట్ట నిర్వర్తించిన శంఖభేరీప్రముఖమంగళతూర్యరవంబులు సెలంగ సైని నాదంబు లుల్లసిల్ల నప్పు డాశల్యు నుద్దేశించి దీవనలం బొగడ్తల న బులును ముఖరు లయి రిట్లు సంతసిల్లి సపరివారంబుగాఁ గురుభూ రుండు విశ్రామంబు నొందె నట్టియెడ మున్ను సమరజయంబునం బ్రవె తుం డగుచు నిజశిబిరంబునకుం జనినపాండవాగ్రజుండు బంధుమిత్రపరి లఁ దమతమవిడిదలకుం బోవం బనుపక యుచితప్రదేశంబునఁ బేరోలగ మనవారివలనివిశేషంబు లరయఁ జారులం బనిచినవాఁడై వారలు వచ్చునంతకు నే మేని వినోదంబులం బ్రొద్దువుచ్చి యక్కడియుతా తెఱం గంతయు విని యచ్యుతునాననం బాలోకించి యి ట్లనియె.

9_1_89 చ. కురుపతి మద్రరాజుఁ దనకున్ బలముఖ్యునిఁగా నొనర్చి సం గరమున కుత్సహించె నధికప్రమదంబున వారిసేనయుం దిరు మయి పేర్చి యున్నయది దీనికి నెయ్యది సేయువార మీ వరయుము కార్యవృత్తి హృదయంబునఁ బాండవరక్షణోత్సుకా.

9_1_90 నీ వెట్లు నిశ్చయించి పలికె దట్ల చేయుదు ననిన నమ్మహీకాంతునకు మురాం తకుం డి ట్లనియె.

9_1_91 శల్యు నెఱుంగుదు శౌర్యధైర్యంబు లగ్గల మాతనికి బాహుబలఘనుండు గాంగేయకుంభజకర్ణుల మిగిలెడుఁ గాదేని సముఁ డగుఁ గాని యసదు గాఁ దలంపఁగరాదు కౌరవపతి మాన్యుఁ జేయుట నధికవిజృంభణంబుఁ జూపు భీమునకు నర్జునునకు నెనయంగ రాదు సాత్యకి కోర్వరాదు పార్ష తునకుఁ దత్సోదరులను మార్కొని పెనంగి,బ్రదుకరాదు నీవీట నాబల్లిదునకు నెదురురథికునిఁ గాన ననేకహేతి,నిపుణశార్ధులవిక్రమ నీవు దక్క.

9_1_92 ఒరు లయినఁ బెక్కు దినములఁ,బొరిగొను నీబలము నెల్లఁ బొరివోవ నతం డరిభంజన నీవైనం,బరమోత్సాహమున నెల్లి పడ వైతతనిన్.

9_1_93 అతఁడు మేనమామ యనుకృప దక్కుము,రాజధర్మమును బురస్కరించి యతులవిక్రమక్రియాపాటవంబున,నవ్విరోధినామ మడఁప వలయు.

9_1_94 గాంగేయుని గుంభజుఁ గ,ర్ణుం గడచితి మింక నుద్ధురుం డగుమద్రే శుం గూల్పు మంతతోడఁ దె,గుం గురుపతిపని జయంబు గొనుము కడంకన్.

9_1_95 అనిన విని యుధిష్ఠిరుం డతని కి ట్లనియె.

9_1_96 అనఘ నీవు చెప్పినట్టులు సేసెద,మున్ను పలికినాఁడ నన్న రేంద్రు కడిమి నాకుఁ బాలు గాఁ బూని యుద్యోగ,వేళయందు నెల్ల వినుచు నుండ.

9_1_97 సదనంబునకుం జని సుఖనిద్ర సేయు మని పలికి పద్మనాభునిఁ దనతమ్ము లను ధృష్టద్యుమ్నశిఖండిసాత్యకిప్రముఖులను దక్కటిపరిజనంబులను నిజమం దిరంబులకుం బోవం బనిచి వీతశల్యం బైనమాతంగంబుచందంబున శయ్యాత లంబు సేరె బలం బంతయు నత్యంతసంతుష్టం బై విశ్రాంతి నొందె నారాత్రి యే నిట వచ్చి నీకుఁ గర్ణువృత్తాంతంబు సెప్పి నీవు వనుప మగిడి చని తెల తెల వేగునప్పుడు కౌరవసేనాసన్నివేశంబు సేరితి నాసమయంబున.

9_1_98 కురుపతి పడవాళ్లం దగు,దొరలకడకు సత్వరముగ దురమునకు భటో త్కరము ననుపు సేయుటకై,బరవసము దలిర్పఁ బనిచెఁ బార్థివముఖ్యా.

9_1_99 పనిచిన నెల్లవారు నుల్లంబుల నుత్సాహంబు లుల్లసిల్లఁ దమతమచతురంగం బులకు సవరణలు సంఘటింపం దొడంగినఁ దూర్యంబులు సెలంగ నొండొ రులఁ బిలుచునెలుంగులు నింగి ముట్ట రథనేమిగజపదతురంగఖురపుటభటచరణ సంఘట్టితం బనుధరణీతలం బద్రువ బహుళం బగునులివు చంద్రోదయసమయ ఘూర్ణమానం బగుమహార్ణవంబునినదంబు ననుకరించె నట్లాయింతబైశల్య శకునికృపకృతవర్మాశ్వత్థామలును దక్కునుం గలయోధవరులును నొక్కెడ నను జసహితుండై యున్నమనుజపతిసన్నిధిఁ గూడి యతండు వినఁ దమలో నిట్లనిరి.

9_1_100 క. ఒకఁ డొకఁడ పాండవులఁ దాఁ,కక సైన్యోపేతగాఢగతి నందఱు నొ క్కొకతల గాఁ దలపడి వా,రికడంక యుడుపఁగవలయుఁ గ్రీడయ పోలెన్.

9_1_101 వ. మన మొకళ్లొకళ్లకుఁ బ్రాపగుచు నేపారి పోరినం జుల్కన గెల్పుగొన వచ నిత్తెఱంగు మనకు సమయంబు సుండీ యట్లు గాక యొంటి పెనంగె వాఁడును బెనఁగెడివానిఁ గని కూడుకొనినవాఁడును బంచవిధపాపంబు నొందఁ గలవాఁ డని యొండొరులకుం జెప్పికొని కదలి యుద్దామసామర్థ్య బున నమ్మద్రపతి ముంగిలియై నడవం జను నప్పుడు.

- కౌరవసైన్యంబు యుద్ధసన్నద్ధంబై వెడలుట -

9_1_102 సీ. చంచరీకావళిఝంకృతుల్ గల్పించు కర్ణ ఝళాకలనములును ధరణీపరాగసంతానంబు గబళించు కరశీకరచ్ఛటాస్ఫురణములును ఘంటికాటంకృతికాంతి సంభావించు నిర్భరబృంహీతనిస్వనములు నంబరభాగంబు నల్పంబు గావించు నున్నతగాత్రసముద్ధతులును

తే. జారుభీషణరేఖలు భూరిమదభ,రాభిరామయానంబులు నాహవోచి తోగ్రకల్పనాభంగులు నుల్లసిల్లఁ,గరులు ధాత్రితలంబు గ్రక్కదల నడచె.

9_1_103 చ. గతిబహుతాలసత్ఖురవిఘట్టితమేదిని జీవితేశక ల్పితనఖరేఖలం జెలువుపెంపు వహించుపురంధ్రిఁ బోల ను ద్ధతముఖబంధురాంగలలితంబులు నూర్జితకింకిణీఝణ త్కృతిపటుహేషలుం దగ నుదీర్ణము లై నడచెం దురంగముల్.

9_1_104 సీ. మీఱినయుబ్బున మీఁదికిఁ గాళులు సాఁచురథ్యంబుల చటులతయును లలి బెండ్లికినిఁ బోవుచెలువున విలసిల్లు సూతజనంబు విస్ఫుర్జితంబు జతనంబుమేలిమఁ జారుఘోరము లగు నవయవంబులవిభవాతిశయము బిరుదుల నుద్భటస్ఫురణంబులై క్రాలుకేతనంబులసముద్ద్యోతితంబు

తే. సొంపు మిగులంగ జోతుల యంపపొదుల,దీప్తులును లేఁతనవ్వులదీధితలున హారిరశ్ములుఁ గీడ్బెర నగుచు వెలుఁగఁ,దేరు లరిగె నుద్ధామతఁ గౌరవేంద్ర

9_1_105 చ. కడఁగయు లావునుం గరఁగి గట్టినఁ గూర్చి యొనర్చినట్టివే రొడళులఁ దాన్మియుం గడిమియుం గలయం బరికించి యందు నే ర్పిడుకొని గాఢభంగి రచియించినచందము నెమ్మనంబులం గడుఁ జెలు వొంద నుబ్బి వడిఁ గాల్బల మేఁగెఁ గరం బుదగ్రతన్.

9_1_106 వ. ఇట్లు కురుబలమబప సనతరతలంబు చేరం బోవునంతం బాండవబలంబును దెంచె ననిన విని యాంబికేయుండు సంజయున కిట్లనియె.

9_1_107 తే. సురనదీసుతుచావును గురునిచావుఁ,గర్ణుచావును వినిననాకర్ణములకు శల్యుచావు దుర్యోధనుచావుఁ జెప్పి,యధికతరముగ సంతోష మావహిం

9_1_108 అమ్మద్రవిభుని ధర్మజుఁ,డెమ్మెయిఁ బరిమార్చెఁ గౌరవేంద్రుని భీముం డెమ్మెయిఁ గీ టడఁచె రణం,బెమ్మెయిఁ బరిపాటిఁ జెల్లె నేర్పడఁ జెపుమా.

9_1_109 అనుటయు సంజయుం డమ్మనుజపతి కి ట్లను వగచుకొలంది కడచనియె ధీరుండ వై వార్త లవధరింపుము.

9_1_110 గంగాసుతగురుకర్ణుల, సంగరమునఁ బాండుసుతులు సంపుట గన్నా రం గనియు నీతనయు లా,సం గూరిరి వారిఁ జంపు శల్యుం డనుచున్.

9_1_111 దుర్యోధనుండు దిక్కు మాలి యుండియు నడియాసంజేసి తన్ను సంపన్నునిం గాఁ దలంచుచు.

9_1_112 అనుజులుఁ దాను శల్యునిఁ బ్రయాతిశయంబునఁ జేరఁ బోవ నా యన మును కర్ణుఁ డర్జునుశరాహతిఁ గూలిన నుబ్బి భీముఁ డా ర్చిన నడ లొంది తల్లడిలుచిత్తము లూఱట నొంద వారలం గనుఁగొని పల్కులన్ శ్రుతిసుఖం బొనరించె నుదగ్రమూర్తియై.

9_1_113 ఇట్లు సమరోత్సాహసమగ్రుం డయినమద్రపతి సర్వతోభద్రవ్యూహంబు వన్నించె నందు ముఖంబున మద్రపతి గర్ణపుత్రప్రముఖపరివృతుండై తాను నిలిచె వలపట శకయవనసమేతుండై కృపాచార్యుండును దాఁపటఁ ద్రిగర్తసహితుండై కృతవర్మయు వెనుకఁ గాంభోజసహాయుండై యశ్వ త్థామయు నడుమఁ గురువీరపరిరక్షితుం డయి కౌరవేశ్వరుండును నతనిముం దటఁ గరిఘటాగ్రభాగవర్తియై బహులచతురంగంబులతోడ శకునియు నిలుచు నట్లుగా నొనర్చి పేర్చి యురవణించె నంతకమున్ను పాండవులు మూఁడు మొగంబులుగా మోహరించిరి ధృష్టద్యుమ్నశిఖండిసాత్యకు లగ్రేసరులు గా భీమార్జును లగ్రజునగ్రభాగంబున శోభిల్లి సీతారూపవిద్యోతితం బైనశల్యు కేతనంబు సూచిత్రోచినడచి రనిన విని ధృతరాష్ట్రుం డప్పటికి మనకుఁ బాండవులకుం గలసేనాంగంబులకొలంది యెఱింగింపు మనవుడు సంజయుం డాజనపతి కిట్లను మనకుఁ బదునొకండువేలు రథంబులును బదివేలు నేడు నూఱు గజంబులును రెండులక్షలుహయంబులును మూఁడుకోట్లు పదాతు లును వారికి నాఱువేలు రథంబులును మూఁడువేలేనుంగులును లక్షగుఱ్ఱంబు లును గోటికాల్బలంబులును గలిగియుండె నయ్యెడ్డనంబు లొండొంటి గెలుచు నగ్గలిక డగ్గఱియె నట్టియెడ.

9_1_114 ఒండొరులన్ జయించుమతి నుద్భటలీలఁ జాల నొప్పి య ప్పాండవకౌరవుల్ పెనఁగుభంగిఁ గనుంగొనువేడ్క నొక్కొ యీ తండు మహాద్రి నెక్కె ననఁ దద్దయుఁ జెన్నగుబింబకాంతి న ర్కుం డభిరాముఁడై పొడుపుఁగొండపయిన్ వెలుఁ గొందెఁ జూడఁగన్.

9_1_115 అరసి యనాగతం బెఱుఁగునట్టిమనంబులు గల్గుపాండుభూ వరసుతబంధుమిత్రకురువర్గసుహృజ్జనకోటులత్తఱిం బొరసె నతిప్రమోదమును భీరివిషాదము నాఁగ నంబుజో త్కరము వికాసమయ్యెఁ గుముదంబులు మీలన మొందె నెంతయ

9_1_116 సీ. కుంజరనికురుంబకుంభస్థలీసంగసిందురరుచులతోఁ జెలిమి చేసి కేతనవ్రాతసంకీలితమాణిక్యరశ్శులగెడ విహారంబు సలిపి సైనికనికరవక్షస్థ్సలపరిలిప్తకాశ్శీరదీప్తులఁ గౌఁగిలించి దండనాథోత్కరచండభావోద్వృత్తచక్షుఃప్రభలుఁ దారు సరస మా

తే. యంశుజాలంబు లుభయసైన్యంబులందుఁ బరఁగి బహువిధశస్త్రాస్త్రకిరణతతుల బెరసి పరభాగలక్ష్మి దీపించి మెఱయ బాల్యరమణీయుఁ డగుచిత్రభానుఁ డొప్పె.

- కురుపాండవుల పదునెనిమిదవనాఁటియుద్ధప్రారంభము -

9_1_117 వ.

ఇట్లు పూర్వసంధ్యాసమయంబునఁ దార్కొని భేరీప్రముఖతూర్యనిన

నింగి వొంగం జెలంగ.

9_1_118 క. ఒండొంటిఁ దాఁకి హేతులు,మండఁగఁ దచ్చూర్ణతతులు మహి రాఁ దండతఁ గలయం బెరసెను, రెండు మొనలుఁ గ్రూరతరపరిస్ఫురణము

9_1_119 వ.

ఇత్తెఱంగునఁ దలపడి.

9_1_120 క. అరదంబులు నరదంబులఁ,గరులు గరుల హరులు హరులఁ గాల్వురు వ ల్వురఁ దాఁకి పెనఁగెఁ గడుభీ,కరభంగులు మెచ్చుదేర గగనచరులకున్.



9_1_151 చ. అడరి దనంజయాదులగు నక్కడివీరులు విక్రమింప ని క్కడ భవదీయనందనముఖప్రభవోద్భ్టయోధవర్గము ల్వడిఁ దఱుమంగ నప్పుడు బలద్వయమున్ విశిఖాగ్ని పేర్చి యె క్కుడయినభీతి నొందె రణఘోరత భూవర యేమిసెప్పుదున్. 9_1_152 వ. ఇట్ట్లు మధితం బయ్యును బౌరుషంబు పెంపున నిరువాఁగును వేగంబు గుందక ఎంతచందంబుగం జేర్చుక్రందు గగనచరులకుఁ గన్నులపండువుగా బృంహితద్వనులను ఘంటానినదంబులను నేమినిస్వనంబులను గేతుకింకిణీక్వణనంబులను రింకారవంబులను హేషాఘోషంబులను భుజాస్ఫాలనంబులను సింహనాదంబులను దిక్తటభేదనంబొనర్ప నద్భుతోత్సాహంబున నావహక్రీడ సలుపుచుండఁ బుండరీకాక్ష రక్షితులగు పాండు పుత్రుల బలశౌర్యసంపదల సొంపునం బెంపొందవు ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకి ప్రముఖులైన దండిమగలు గూడికొని తఱుమ దారుణనైపుణంబున బాహాటోపంబు సూపినఁ గార్చిచ్చు గవిసినం గలంగు మృగకలంబుకైవడీం గౌరవసైన్యంబు దైన్యంబు నొందిన.

9_1_153 క. పెనురొఁపి లోపలను బ్రుం గినధేనువు నెత్తుపోలికిని శల్యుం డ మ్మొనఁ దనభుజబలమునఁ గలఁ గనియట్టుగ నిలిపె శౌర్యగర్వము మెఱయన్.

9_1_154 వ. నిలిపి పేర్చినసమయంబున మనదిక్కున నుల్కాపాతప్రముఖంబులగు దుర్నిమిత్తంబులు వొదమిన నీకొడుకులు గూడుకొని చేయంగల సైని కులం గూర్చికౌని తీరంబయి పెనంగి రట్లు పెనంగునెడఁ గడంగి తల కడచి మిగిలి మద్రపతిమార్గాణాసారంబు వరఁగించుచుఁ బాండవాగ్రజు నగ్రభాగంబున నున్న భీమసేనసాత్యకిధృష్ట్యద్యుమ్నశిఖండిద్రౌపదేయ మాద్రేయులఁదాఁకి పరిపరి ప్రదరంబుల నొప్పించి కదిసి యన్నరపతికిని బదితూపుల వేఁడిమి సూపి మలసినఁ బాంచాలప్రభద్రకబలంబు లాజెట్టి బిరుదుచుట్టు ముట్టిన.

9_1_155 ఉ. వాలియతండు భాహువిభవం బలరించినఁ బేర్చి రౌద్రతం గూలుగజంబులుం గెడయుగుఱ్ఱపుతండముఁ ద్రెళ్ళుతేరులుం గీ లెడంచినట్ల పడుకేతువితానము మగ్గునూచ మై రాలుపదాతివర్గములు రక్తపుటేఱులుఁ బ్రేవుప్రోవులున్.

9_1_156 వ. మఱియును.

9_1_157 క. ఏరూపు లయినరూపణ ఘోరాశనులట్ల శల్యుక్రూరాస్త్రంబుల్ కౌరవులు వొంగఁ బాండుకు మారుల సేనపయిఁ దౌరిఁగె మనుజాధీశా.

9_1_158 వ. అట్లు దొరుఁగుదారుణమార్గణాసారంబున వెగడుపడి యాబలంబు పాండ వాగ్రజువెనుక కొదిఁగిన నమ్మహీపతి పురికొలిపికొని శల్యు మార్కొని నిశితవిశిఖవర్షంబునం బొదవిన నమ్మద్రవిభుండు గ్రూరానారాచం బతని మేనుచ్చివోనేయ నా ధర్మనందనునకుఁ దలకడచి యేడమ్ముల నవ్వడ ముడియు సహదేవుం డయిదురూపులను నకులుండు అమరంబుంమే బ్రతివింద్యాది ద్రౌపదేయులు బాహుబాణపరంపర నవ్విరు నేయ నప్పుడు కృపాచార్యుండును కృతవర్మయు శకునియు దత్సుతుండు మందహాసంబుతో నమందగతి వచ్చి వారిఁ గూడుకౌనియె నక్కడిసైనికులును రభసంబున నా రధికవరులఁ దాఁకి రట్టియెడ.

9_1_159 క. కృపుఁడును ధృష్టద్యుమ్యుఁడు నుపమాతీతాతి ఘోరయుద్ధంబున బా హుపట్వుతమ్ములు సూపి ర ధిప యొండొరులకు సమత్వదీప్తాకృతులై.

9_1_160 క. ఒకని నొకనిఁ బదిపదిసా యకముల నొప్పించె వీరు లగు పాండుకుమా రకు లేవుర నంతట ద్రో ణకుమారుఁడు మోము చిఱుతనగవున నొప్పన్.

9_1_161 ఆ. వాయుతనయు చిత్రవర్ణాశ్వముల మద్ర పతి ధరిత్రిఁ గూల్చె నతఁడు దేరు డిగ్గి నిజగ్దాపటిష్ఠతఁ జూపెఁ గౌ రవ్యసైన్యమునకు రాజముఖ్య.

9_1_162 క. అనిలజునియశ్వములఁ గూ ల్చియప్పుడు శల్యునిం గలితనము మెఱయం దనయంపవెల్లిచే ముం చె నకులుతమ్ముండు నీదుసేన దలంకన్.

9_1_163 తే. అతనిహయములు నమ్మద్రపతిశరములఁ బడిన నప్పాండవునిఁ దలకడచి బలము పొదివె నయ్యోధముఖ్యుఁ దత్పుత్రుఁ డపుడు గదిసె నాసహదేవుపైఁ గడిమి మెఱయ.

9_1_164 చ. కవిసిన దట్టకెం పడరుకన్నులతోడఁ గృపాణపాణియై యవనికి దాఁటి యాతనిశరావలి ద్రుంచుచుఁ గిట్టి తేరిపై కి వడిఁ జలంబుమై నరిగి కేళియపోలె శిరంబు ద్రుంచి పో యె వెసఁ బొగడ్త కెక్క ధరణీశ్వర యొండురధంబుమీదికిన్.

9_1_165 వ. ఇవ్విధంబున

9_1_166 క. సుతుఁ డీల్గిన మద్రమహీ పతి శోకా క్రోధవేగభరితాత్మకుఁ డై శితశరపరంపరల ను ద్ధతిఁ బాండవసైనికులమదం బడఁగించెన్.

- శల్యభీమసేనుల గదా యుద్ధము -

9_1_167 క. ఉరవడి రధికజనంబులఁ దెరలిచి యేపారుతనదుతేరు మెఱయ ను ద్ధురగతిఁ గౌతేయాగ్రజు నరదమునకుఁ గవిసి వాలురమ్ములు నిగుడన్.

9_1_168 సీ. కనుఆఒగొని భీముండు గన్నుల నిప్పులు రాలశుండాలకీలాలరంజి తంబును రిపుసైన్యదైన్య ప్రదంబును నాత్మీయవాహినీహర్షకరము నైశతధారామహాభుజగక్షమాధరశృంగసమత నుదగ్ర మగుచు నెనిమిదియంచుల నెసఁగుమెఱుంగుల దారుణం బగుగదాదండ ముగ్ర

తే. రేఖ సారించి రౌద్ర ముద్రేక మందఁ గదిసి మద్రాధిపునితురంగములఁ జదియు మోదెనాతండు దోమరమునఁ దదీయ విపులవక్షంబు భేదించె నృపవరేణ్య.

9_1_169 క. ఉరమున నాటినఘనతో మరమును డాచేతఁ బెఱికి మారుతి మద్రే శ్వరుసూతు వైచె దానన ధరణిని బోరగిలఁబడ నుదగ్రస్పురణన్.

9_1_170 మ. విరధుం డై పొలివోనిదర్పమున నవ్వీరుండు ఘోరంపుము ద్గరముం గేల నమర్చి తేరు డిగి దుర్దాంతాకృతిన్ వజ్రభా సురశుక్రుండును దండచండయముడున్ శూలోగ్రఫాలాక్షుఁడున్ సరి సేయం దగువారు గాఁగ బొలిచెన్ సంస్తుత్యసంరంభతన్.

9_1_171 వ. ఇ ట్లవష్టంభవిజృంబితుం డైనయాసేనాధిపతిం జూచి యేచి భీముఁ డుద్దామ రబసంబున నతనికి సమ్ముఖంబు గా నడరినఁ బణవాదిరాదిత్ర నిర్భరనినదంబులు సెలంగె నప్పు డయ్యిరువాఁగు నిరువుర నేనికపోరు చూచు విధంబునఁ గనుఁ గొనుచు గదారణంబునకు శల్యుండు దక్క మారుతి నూర్కొనఁ జాలుమేటి మగలు నివ్వదముడి వెలిగా నిమ్మద్ర పతిమీఁదఁ గవియునట్టిజెట్టిబిరుదులుం గలరే యనుచు వచ్చెరు వొందు చుండ.

9_1_172 ఆ. మండల ప్రచారమహితాకృతులు గర్జ నలుగఁ బొలిచి మాఱుమలసి ఱంకె లెసఁగఁ బోరి కమరి యే పారువృషభయు గంబునట్ట్లు వారు గవిసి రధిప.

9_1_173 చ. మదమున నిమ్మెయిం గదిసి మద్రవిభుండును భీమసేనుడున్ గదలమెఱంగు లాకసము గ్రమ్మఁగ నుద్భటభంగిఁ ద్రిప్పి బె ట్టిదముగ వ్రేయ నిప్పులుం వడిం దొరఁగించె సమగ్రవిస్మయ ప్రదరవభంగు లై యవి పరస్పరఘోరవిఘట్టనంబుసన్.

9_1_174 ఆ. ఇట్ట్లు దొడంగి


9_1_175 క. ధిక్కారంబులు చరణద భక్కారంబులును మెఱయ బలువు వెరవు పే రుక్కును నెక్కుడు వేగము నక్కజములు గా సుదీర్ణులై పోరునెడన్.

9_1_176 చ. వెరవున నంగఱుల్ నుసులవ్రేటులు వమ్ముగఁ దాఁకినప్డు ది క్కరిర్దనప్రహారములఁ గంపము నొందక యుండుమేదినీ ధరములఁ బోల్ప బట్టగునుదగ్రపుమూర్తుల కిద్ద ఱందు ని ష్టురరభసంబు శౌర్యము పటుత్వముఁ ద్రాసునఁ బెట్టిన ట్లగున్.

9_1_177 వ. ఒక్కొక్కమా ఱుబ్బన.

9_1_178 క. ఎనిమిదియడుగుల కొలఁదిని వెనువెనుకకుఁ బోయి నిగిడి వేగంబునఁ గి ట్టిన యెడఁదగరుల వడిఁ దాఁ కునగంబులభంగి దోఁచుఁ గురుకులముఖ్యా.


9_1_179 వ. ఇత్తెఱంగునఁ బెనంగి నెత్తుట జొత్తిల్లినయంగంబులు పుష్పితకింశుకంబులఁ బోలఁ బరిశ్రమంబు నొందియుఁ బొలివోవనిదర్పంబున.


- గదాయుద్ధమున మూర్చితుడైన శల్యునిఁ గృపుఁడు తొలంగం గొనిపోవుట -

9_1_180 క. ఇరువురును సందు సూడక వెర వెడలినయాగ్రహముల వ్రేసినగద లొం డొరులమెడలకెలకుల బ ల్నరములు దాఁకుటయు వారిలం బడి రధిపా.