వికీసోర్స్:వికీప్రాజెక్ట్/DLI పాఠ్యీకరణ
DLI 22496 పైగా తెలుగు పుస్తకాలు స్కాను చేసింది. వాటిలో కొన్ని పాఠ్యీకరణకు వికీసోర్స్ సభ్యులు వాడారు. వాటిలో కొన్ని వర్గం:సార్వజనీయం-డిఎల్ఐ లో చూడవచ్చు. ఆ క్రమంలో ఎదురైన సమస్యలు, పరిష్కరించిన వివరాలు ఈ పేజీలో ముందు కృషికి ఉపయోగపడేలా పేర్కొనడం ఈ పేజీ వుద్దేశ్యం.
సమస్యలు
మార్చు- చాలా పుస్తకాలకు ముఖపత్ర పేజీ స్కానులో లేదు. అది స్కానుకి అందిన ప్రతిలో లేకపోవడమా లేక కావాలని స్కాన్ చేయలేదా?--అర్జున (చర్చ) 05:59, 10 సెప్టెంబరు 2018 (UTC)
కొన్ని పుస్తకాలకు ఒకటి కన్నా ఎక్కువసార్లు నిల్వలో కనబడినవి కాని అవి అన్నే ఒక మూల స్కానువి కావటంతో ఉపయోగం లేదు. ఆలా చేసినసంస్థ ఒకటే కావటం దారుణం. ఉదా:ఆంధ్రుల చరిత్రము మొదటి భాగము https://archive.org/stream/in.ernet.dli.2015.388407/2015.393995, https://archive.org/details/in.ernet.dli.2015.388407 అలాగే రెండవ భాగము, ఇంకా కాశీ యాత్రచరిత్ర --అర్జున (చర్చ) 05:59, 10 సెప్టెంబరు 2018 (UTC)- కొన్ని పుస్తకాలకు ఒకటి కన్నా ఎక్కువ కాపీలు బహుశా వేర్వేరు స్కాను సెంటర్లలో చేసినవి ఉన్నాయి. వాటిని ఉపయోగించి కొన్నిటికి దోషాలు లేని పాఠ్యీకరణ చేయటం వీలయింది. ఉదా: ఆంధ్రుల గుహాలయాలు, వేమన పద్యములు (సి.పి.బ్రౌన్) --అర్జున (చర్చ) 06:28, 10 సెప్టెంబరు 2018 (UTC)
- పుస్తకాల ఎంపిక పద్ధతి తెలియదు. అన్నిరకాల శతకాలు చేర్చారు.ఒక్కొక్క దానికి చాలా కాపీలు. --అర్జున (చర్చ) 06:06, 10 సెప్టెంబరు 2018 (UTC)
- RMSC IIITH స్కానింగ్ సెంటరు పుస్తకాల అధిదత్తాంశం లిప్యంతరీకరణ IT3 పద్ధతికి సరిపోయింది. కాని కొన్ని చోట్ల దోషాలు ఇంకా వున్నాయి. ఇతర సెంటర్ల వారు వారికినచ్చిన రోమన్ లిపిలో వ్రాశారు. దీనికి వాడిన పద్ధతే దోషపూరితం. --అర్జున (చర్చ) 06:06, 10 సెప్టెంబరు 2018 (UTC)
- స్కాన్ లు దోషాలు అనగా పేజీలు స్కాన్ లో లేకపోవటం, స్కాన్ నాణ్యత పాఠ్యీకరణ చేయడానికి వీలవకపోవడం వున్నాయి. --అర్జున (చర్చ) 06:25, 10 సెప్టెంబరు 2018 (UTC)
- నాణ్యతా నియంత్రణ పూర్తిగా విఫలమైంది. --అర్జున (చర్చ) 06:06, 10 సెప్టెంబరు 2018 (UTC)
- 100 శాతం నకలులు ఆర్కీవ్ లో తొలగించబడినందున పై వాక్యం కొట్టివేయబడినది.--అర్జున (చర్చ) 07:13, 30 నవంబరు 2018 (UTC)