వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)
వేమన పద్యములు (సి.పి.బ్రౌన్) (1911) - వేమన
"విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలదితో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, యోగి వేమన.
ఆత్మ - శుద్ధి లేని యాచారమ'ది యేల ?
భాండ - శుద్ధి లేని పాకమే'ల ?
చిత్త - శుద్ధి లేని శివ పూజలే' లరా ? వి. 3
3. Observances void of purity of heart ! to what end are they ? to what end is the preparation of food without cleansing the vessel ? void of purity of mind, to what end is the worship of God ?
నిక్కమై' న మంచి నీలమొ'క్కటి చాలు;
తళుకు బెళుకు రాళ్లు తట్టెడే'ల?
చదువఁ పద్యమ'రయఁ జాలదా' యొక్కటి ? వి. 4
4. One real and good sapphire is enough, why collect a basketful of glittering, sparkling stones ? consider then, is not one verse, if worth reading, sufficient ?