వికీసోర్స్:అభిప్రాయాలు
కొత్త గ్రంథాలు చేర్చడానికి సహాయం
మార్చుమేము తెవికీ లో గ్రంథాలు చేర్చడము మొదలు పెట్టిన దగ్గర నుంచి వారి సూచనలు, సలహాలు అందిస్తున్న Rajasekhar1961 గారికి మా ధన్యవాదాలు.
కాని తెవికీ లో మా లాంటి కొత్త వారికి గైడెన్స్ ఉదాహరణలతో వుండేలాగా ఒక పుట తయారు చేస్తే బాగుంటుంది. ఇపుడు వున్న గైడెన్స్ పుటలో clarity లేదు. బుక్ ను కామన్స్ లో ఆప్లోడ్ చేయడం దగ్గర నుంచి అది ఒక పుస్తకము లాగ తయారు అయ్యే వరకు వున్న procedure... step by step అందిస్తే బాగుంటుంది. ఈ క్రమములో జరిగే పొరపాట్లు వాటిని ఎలా సరి చేయ వచ్చు అన్న విషయము వివరిస్తే బాగుంటుంది. బుక్ మధ్యలో వున్న ఇమేజ్ లు పిడీఎఫ్ ఫైల్స్ నుండే ఎలా ఎక్కించవచ్చు, txt format ను యునీకోడ్ లోకి కన్వర్ట్ చేసే కన్వ్ర్టర్ ను కూడా వికీ లో వుంచితే అన్న టెక్నికల్ డీటెయిల్స్ కూడా వివరణ తో ఇస్తే ఎవరినీ బతిమాలకుండా కొత్తవారు కూడా పని ఎంతో ఇష్టంగా చేయగలుగుతారు. --ఇందూ జ్ఞాన వేదిక (చర్చ) 12:07, 11 జనవరి 2015 (UTC)
- @ఇందూ జ్ఞాన వేదిక గారికి, మీ సూచనకు ధన్యవాదాలు. గైడెన్స్ పుటని మెరుగు పరచడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. సభ్యుల సహకారం ఎప్పుడూ వుంటుంది. --అర్జున (చర్చ) 05:06, 7 ఆగస్టు 2019 (UTC)
భారతీయ ప్రతిభా విశేషాలు
మార్చుఈ భారతీయ ప్రతిభా విశేషాలు అనే శీర్షికన ఉన్న విషయం అంతా తొలగించబడింది.
ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలుసుకుని వారిని తొలగించాలి.
" భారతీయ ప్రతిభా విశేషాలు " అనే విషయం మొత్తం వికీ సోర్సు లో గానీ వికీపీడియా లో గానీ మళ్ళీ ఉంచాలి.
-- భవదీయుడు జాజిశర్మ 31వ మే 2020 రాత్రి 19.12
- జాజిశర్మ గారు, వికీపీడియాలో వికీసోర్స్ లో గాని మీరు పేర్కొన్న శీర్షిక గల వ్యాసం తొలగింపబడిన పేజీలలో కానరాలేదు. మీరు ఖాతా ఏర్పరచుకొని ఆ పేజీ సృష్టించవచ్చు. వాటిని తొలగించవలసివస్తే మీ ఖాతా ద్వారా సంప్రదిస్తారు. --అర్జున (చర్చ) 07:54, 9 డిసెంబరు 2020 (UTC)