వాసిష్ఠరామాయణము (ద్విపద)/ద్వితీయప్రకరణము

ద్వితీయ ప్రకరణము

శ్రీతారకోల్లాస! - శేషాద్రివాస!
శ్రీతరిగొండ నృసింహ! ధూతాంహ!

విన్నవించెద నది - వినుము వాల్మీకి
పన్నుగా దెల్నె ను - త్పత్తి క్రమంబు,

తప్పక విని భర - ద్వాజుండు మరల
నప్పు డిట్లనియె 'మ - హాగురు దేవ!

శ్రీరాఘవునకు వ - సిష్ఠుండు మరల
నే రహస్యముఁ జెప్పె - నెఱింగింపుఁ'డనిన

నలర వాల్మీకి యి - ట్లనె 'భరద్వాజ!
తెలియఁ జెప్పెద నది - తేటగా వినుము! 10

శ్రీరాఘవుండు - వాసిష్ఠు నీక్షించి
యారూఢభక్తి ని - ట్లనె 'నో మునీంద్ర!

చిత్తమందే సర్వ - సృష్టి పుట్టుటయుఁ,
జిత్తవృత్తులు విస - ర్జించుట ముక్తి

యగుటయుఁ జెప్పితి - రానంద మొదవె
నగణిత చరిత! కృం - తార్థుండ నైతి'.

ననిన వసిష్ఠుఁడి - ట్లనియె వెండియును
'జననాథ! యీ ప్రపం - చము మానసమున

జనియించి, యందుండు, - సంసార మాత్మ
నెనసి యున్నటువలె - నిలఁ జిత్తమునకుఁ 20

94

వాసిష్టరామాయణము

గనిపింపుచుండుఁ; ద - త్కథ వినిపింతు
విను చిత్రవర్ణముల్‌ - వెదకిన లేక,

కొమరొప్పఁగాఁ జిత్ర - కుఁడు లేక మింట
నమరి చిత్తరు వుండి - నటువలె, నిదుర

లేకయే కలవచ్చు - లీల, నద్దమునఁ
బ్రాకటంబుగఁ గన - బడు నీడవలెను,

సతతప్రకాశమౌ - స్వచ్ఛాత్మయందుఁ
బ్రతిబింబ మగుచుఁ బ్ర - పంచంబు దోఁచు

గనుకఁ బ్రపంచంబు - కల్లగా నెఱుఁగు,
మనుపమాత్మనుజూడు - మంతరంగమునఁ,

జపలాత్ములై ప్రపం - చముఁ జూచు మనుజు
లపరిమితాఘ దే - హములఁ బొందుదురు;

జననాథ! దీనికి - సాదృశ్య మొకటి
వినిపింతు, నెట్లన్న - విప్రపుంగవుఁడు

*శుక్రోపాఖ్యానము*



విమలుండు భృగుఁడు - వివేకభావమున
నమితసుందర పర్వ - తారణ్యు మందుఁ

దప మయుతాబ్దముల్‌ - తగఁ జేయ, శుక్రుఁ
డపుడు తండ్రికి సేవ ల - మరఁ దాఁ జేయ

వలసి, యందుండి వి - శ్వాచి యనంగఁ
జెలువొప్పు నప్పర - స్త్రీని వీక్షించి,

మోహించి మదనాస్త్ర - ముల కోరి, నైజ
దేహ మయ్యడవిలోఁ - దెప్పున విడిచి,

95

ద్వితీయప్రకరణము

యఱిముఱి సూక్ష్మదే - హంబుతో నెగసి,
మరులొంది దాని వి - మానంబుఁ జేరి,

తెఱఁగొప్పఁగా దివ్య - దేహంబుఁ దాల్చి,
నెఱవాది యగుచు దా - నినిఁ గూడి, యవల

సొలసి జన్మాంతర - సుఖ దుఃఖ సరణి
నలజడిఁ బడుచుండె - నందందు, నిచట

నలర నాభృగుని మ - హాతపోబలము
వలన శుక్రాంగంబు - వనములో వ్రాలి 50

యున్నఁ దద్దేహంబు - నుగ్ర జంతువులు
పన్నుగాఁ గని, - పట్టి భక్షింపకుండె

వలనొప్ప నట దివ్య - వర్షసహస్ర
ములకు సమాధి ని - మ్ముగ వీవిడి, భృగుఁడు

శుక్రాంగమును జూచి - శోకించి, మించి
యాక్రోశచిత్తుఁడై - యంతకుమీఁదఁ

గోపంబు రెట్టింపు - ఘోరమై నట్టి
శాప మియ్యఁదలంచు - సమయంబునందు

సదరుచు మహిష వా - హన మెక్కి వచ్చి,
పదరెడి భృగుమౌని - పజ్జను నిలిచి, 60

పలికి ని ట్లని దండ - పాణి 'మునీంద్ర!
లలిమీఱఁ బెద్ద కా - లముఁ జేసినట్టి

తపమెల్లఁ జెడుటకై - తామసబుద్ధి
నిపుడు శాపంబు నా - కియ్యఁ బూనుచును

ఈ కరణినిఁ గన్ను - లెఱఁ జేసితివి,
నీ కపకారంబు - నేఁ జేయలేదు

96

వాసిష్ఠరామాయణము

పదరి నా కిపుడు శా - పం బిత్తు ననిన
నెదిరించి ప్రతిశాప - మిచ్చెద నీకు,

విను నేను మును పది - వేవురు రుద్రు
లను, లక్షవిష్ణువు - లను, బద్మజాండ 70

కోటులఁ బట్టి మ్రిం - గుదుఁగాన, మిమ్ముఁ
బోఁటి విప్రులు నాకు - భోజ్యముల్‌ గారె!

ఇంత తపముఁ జేస్‌ - యీనాఁటికైనఁ
శాంతిఁ బొందవు ము - నీశ్వర! మదిలోనఁ,

గుదురు చున్నటువంటి - క్రోదంబు నణఁపు,
మది యెట్టు లనిన నె - య్యంబుతో వినుము!

సారిది చిత్తము పూరు - సుండు, తత్కృతము
పొరిబుద్ధి యనఁబడు, - బుద్ధికృతంబు

నల యహంకారమై - యభిమతకృత్య
ముల నొనరించు ని - మ్ముగ నటు గనుక, 80

సంతతంబును జిత్త - శాంతే సమస్త
శాంతి యటంచు నా - శమనుండు పలుక,

విని భృగుముని చాల - విన్ననై, యమునిఁ
గని యిట్టు లనియె ' ని - క్కడ శుక్రుఁ డుండి

తను విందుఁ బడవైచి - తర్లినచంద
మును నాకుఁ దెల్పు' మి - మ్ముగ నన్న యముఁడు

తా నిట్టు లనియె 'నో - తాపసప్రవర!
నీవందమం డిందు - నిలిచి శుశ్రూష

సేయు చుండఁగ, మీరు - చిరకాల మీదేట
మాయను గెలిచి వ - మాధి యందున్న 90

97

ద్వితీయప్రకరణము

నమయంబునందు వి - శ్వాచి యనంగ
నమరు దేవాంగన - యాకాశమందుఁ

జనుచుండఁగాఁ జూచి - చాల మోహించి,
తనతను విందుంచి, - తరలి యందొక్క

దివ్యదేహము దాల్చి, - ధీరుఁడై మించి,
నవ్యభోగముల వా - నళినాక్షి వెనసి,

పెద్దకాలం బుండి - పిమ్మట నతఁడు
నద్దయితను బాసి - యువనిపై వ్రాలి,

యురుశోణపురము నం - దొక్క భూసురుని
వరసుతుఁడై పుట్టి, - వనుధ నత్తనువు 100

విడిచి, కోసలదేశ - విభుఁడై జనించి,
పుడమిఁ బాలించి, య - ప్పుడు శరీరంబుఁ

దటుకున విడనాడి, - దండకాటవినిఁ
బటిమ మీఱఁ గిరాత - పతియై జనించి

అప్పు డాదేహంబు - నవనిపై వైచి
తెప్పున జాహ్నవీ - తీరంబునందు

నావల నొక రాజ - హంసయె పుట్టి,
యా వీటఁ జరియించి - యా దేహ మచటఁ

బడవైచి, పమ్మటఁ - బౌండ్రదేశమునఁ
బుడమిపై నినవంశ - మునఁ బుట్టి,మరల 120

జనులను బాలించి, - చని సాళ్వదేశ
మునబుట్టి యచ్చోట - ముఖ్యుఁడై నిలిచి,

యొనరంగ సౌర మం - త్రోప దేశముల
జినులకుఁ జేయుచుఁ - జలియింపుచుండి

98

వాసిష్థరామాయణము


యవనినిఁ దద్దేహ - మట విసర్జించి,
యవల విద్యాధరుఁ - డై జనియించి,

రహి నొప్పు నలకాపు - రంబందు నుండి,
విహరించి యా బొంది - విడిచి, పిమ్మటను,

మఖియొక్క మౌని కు - మారుఁడై పుట్టి,
యఱిముఱి సర్వేంద్రి - యముల నడంచి,130

తివిరి సరస్వతీ - తీరంబునందుఁ
బ్రవిమలుం డగుచుఁ ద - పముఁ జేసి, తనువు

జగతిపైఁ బడవైచి, - సౌరదేశమున
మగుడఁ దానొక్క సా - మంతుఁడై పుట్టి,

కొంతభూ మేలుచుఁ - గొన్నియేం డ్లుండి,
యంతటఁ దద్దేహ - మచ్చట విడిచి,

క్రమ్మఱఁ బోయి త్రి - గర్త దేశమున
సమ్మతంబుగ మహా - శైవుఁడై పుట్టి,

లలితుఁడై బహు శిష్యు - లకు నుపదేశ
ములు చేసి, తద్దేహ - మును విసర్జించి,140

చనియా కిరాతదే - శమున వొక్కెడను
గొనకొని యొక వేణు - గుల్మమై పుట్టి,

చని యొక భూమిలో - శ్వానమై తాను
జనియించి, యందుండి - చని, యొక్క చోట

హరిణమై యుదయించి - యా శరీరమును
ధరణిపైఁ బడవైచి, - తాళవృక్షమునఁ

బసచెడ నొక పెనుఁ - బామై జనించి,
వసుధఁ దత్తన్నువును - వాల్చి, యామీఁదఁ

99

ద్వితీయప్రకరణము

జని తమాలమహీ జ - జాల మధ్యమున
వనకుక్కుటంబయ్యె - వాఁ డివ్విధమున 150

సారె కీగతి బహు - జన్మంబు లెత్తి,
ధారుణి మీఁదఁ ద - త్తనువుల విడిచి,

యతిదుఖభాజియై - యాత్మ వివేక
గతి మది న్మఱచి, గం - గాతీరమందు

భూసురోత్తమునకుఁ - బుత్రుఁడై పుట్టి,
వాసుదేవాఖ్య న - వ్వలఁ దపొవేష

కలితుఁడై నిలిచి,'య - క్కడ తపంబునను
వెలుఁగుచు నెను మిది - వేలేండ్ల నుండి

అచట నున్నాఁడు మ - హాయోగివలెను
సుచరిత్ర! యిఁక వానిఁ - జూచెద ననినఁ 160

జూపెద, నీ విప్దు - సుజ్ఞాన దృష్టి
దీపింపఁ జేయుచు - దివ్యదేహమును

ధరియించి రమ్మన్నఁ - దపసి యా రీతి
నరుదైన దివ్య దే-హంబునుఁ దాల్చి,

తెప్పున భాగీర - థీతీరమునకు
నప్పు డయ్యమునితో - నరిగి, వా రచటి

కతికృశీభూతాంగు - లై శుక్రుకడకు
హిత మొప్పఁ జనఁగ వాఁ - డెదురుగా వచ్చి

మొక్కఁగా, నతనికి - మోక్షమార్గంబుఁ
జక్కఁగా దెలుప, సు - జ్ఞానియై యతఁడు 170

1. మర్కట తపంబునను- వేం. 100

వాసిష్ఠరామాయణం

తనజన్మదుఖముల్ - దలఁచుచు వగచి,
యెనసిన భక్తి న - య్యిరువురఁ జూచి,

పలికె ని ట్లని 'నేను - బహుజన్మదుఃఖ
ములఁ బొంది యలసితి - మోహంబుచేత,

మున్ను మీ సాన్నిధ్య - మున నుండ కరిగి,
యన్ని దుఃఖసుఖంబు - లనుభవించితిని,

ఎఱృక చిన్మాత్రమై - యెల్ల దిక్కులను
మెఱయుచు నున్న దే - మి కొఱంత లేదు

కనుఁగొంటి ముక్తి మా - ర్గంబు, మత్పూర్వ
తనువులోఁ జేరి మీ - తనయుండ నగుచుఁ 180

జెదరక మీ సేవఁ - జేసేద ననిన
వదలని కృప మీఱ - వా రిద్ద ఱతని

వెంటఁ దోడ్కొనిపోయి, - వింతగా నేల
నంటి కృశీ భూత - మైన దేహమును

జూపఁగాఁ జూచి, యా - శుక్రుఁ డీతనువు
నాపట్లఁ బడ వైచి, - యంతకు వరము

చేఁ బూర్వతనువులోఁ - జేరి యచ్చోట
దీపింపఁగాను ద - ద్దేహింబు లేచి

తన తండ్రి చెంత య - థా ప్రకారముగ
వానర సుఖస్థితి - నుండఁగాఁ జూచి, 190

శమనుండు నిజనివా - సంబున కరిగె
నమితసంతోషాత్ముఁ - డయ్యె భృగుండు.

అని శుక్రు వృత్తాంత - మా వపిష్ఠుండు
మనుజేంద్రునకుఁ జెప్పి మరల ని ట్లవియె:

101

ద్వితీయప్రకరణము

విను రామ! సంసార - విభ్రమ వ్యథలు
మనమునందే పుట్టు - మాయ నీ కిపుడు

తెలియుట కిది చెప్పి - తిని, మానసమును
నిలిపి శాంతిని బొంది, - నెమ్మది నుండు!

చెలఁగి వివేకంబు - చేఁ జిత్తశాంతి
గలుగ, సంసార దుః - ఖ మణంగిపోవు; 200

నిలను వివేక వి - హీన చిత్తునకుఁ
గలుష సంసార దుః - ఖము వృద్ధిఁబొందు;

సతతంబు నాత్మ వి - చారంబు సేయు
నతని చేతోవృత్తు - లణఁగి నశించు;

వడిగొన్న సంసార - వాసన మరలఁ
బొడమినయపుడు తె - ప్పునఁ దా విరాగ

మతినొంది, సంసార - మనిన వర్జించి,
హిత మొప్పఁ దన్నుఁ దా - నెఱుంగు చుండఁగను

సరవి సంసార వా - సన మూషకములు
కొఱికిన వలరీతిఁ - గ్రుస్సి నశించు; 210

తెరలి మనోగ్రంథి - తెగు, నటు మీఁదఁ
బరమ విజ్ఞాన స్వ - భావంము మించి

నిత్య ప్రనన్నమై - నిండుచునుండుఁ;
బ్రత్యక్ష మీ యను - భవము భావించు

నట్టి యోగాభ్యాసి - యైన పూరుషువి
పట్టైన కరుణకు - బ్రహ్మాదిసురలు

తగుపాత్ర లగుదు రం - తటి యోగివర్యుఁ
డగణిత చరితుఁడై - యన్ని దిక్కులను

102

వాసిష్ఠరామాయణము

కనులు స్వభావంబు - గాఁ జూచుపగిది
ఘనతరంబగు చిత్త - గతిలేక తాను 220

చేయఁగాఁ దగుపనుల్‌ - సేయుచునుండు;
నా యోగి యెఱుకతో - నఖిలభోగములంఁ

దెలిసి భోగించి తృ - ప్తిని బొందు, దురిత
ములు వాని నంటక - మురిగి నశించు

వారీతి యె ట్లన్న - నఖిలేంద్రియములు
చోరకులై తన్నుఁ - జొక్కింపవచ్చు

సమయమం దతఁ డతి - జాగరూకతను
భ్రమయ కాచోర న్వ - భావంబు లెఱిఁగి,

తొలఁగ కాచోరుల - తో మైత్రిఁ జేసి,
కలసిన ట్లుండి భో - గములను జెంది, 230

గెంటక తన్ను బొం - కించు కామాది
కంటకులను దాను - గాంచి వంచించి,

వాని నెల్లను దన - వశముఁ జేసికొని,
వాని కెందును దాను - వశుఁడు గాకుండు.

అది యెట్ల నన్న మ - హాబధిరుండు
పాదువుగా దారులఁ - బురముల, నదుల

నూరకే గనుచుఁ బో - వుచునుండుఁగాని,
వా రందుఁ బలికెడి - వార్తలు వినని

గతిఁదనప్రారబ్ధ - కర్మశేషముల
నతినిస్పృహుండునై - యనుభవింపుచును 240

నరయ జీవన్ముక్తు - డగుతుండి, తుదను
మురువు మీఱ విదేహ - ముక్తుఁడై, నభము

103

ద్వితీయప్రకరణము

నభమందుఁ గలిసియు - న్న విధంబుగాను
శుభకర పరమ వ - న్తువునందుఁ గలియుఁ;

గావున నిప్పు డే - క్రమముననైన
నీ వింద్రియములను - నిగ్రహంపుచును

ధీర సంసార వా - ర్థిని దాఁటవలయు;
నారీతి చేయ క - హంకారభావ

కలితుఁడవైన దుః - ఖములు ప్రాప్తించు.
ఇల నిందు నితిహాస - మెఱిఁగింతు వినుము! 250

*శంబరోపాఖ్యానము*



జననాథ! పూర్వంబు - శంబరాసురుఁడు
పనిం బూని చతురంగ - బలములం గూడి,

'శక్రాది దివిజుల - సమయింతు' ననుచు
విక్రమాటోపంబు - విపులంబు గాఁగ,

ననిమిషావళితోడ - ననిఁ జేయు వేళ
మొనకు నిల్వక వాని - ముఖ్యబలంబు

విఱిగి డాఁగినఁ జాచి, - విపులదుఃఖమున
మఱియును వాఁడు దా - మ, వ్యాళ, కటులఁ

బుట్టింపఁగా, వారు - భూరిశౌర్యమున
నట్టహాసంబుతో - ననిఁ జేసి, సురలఁ 260

దజుమ, దేవతలా వి - ధాతను జేరి,
శరణుని శంబరు - సామర్థ్య మెల్ల

వినిపింప, విని ధాత - విబుధులఁ జూచి,
పనిఁబూని యొక్క యు - పాయ మూహించి,

104

వాసిష్ఠరామాయణము

పలికె ని ట్లనుచు 'శం - బరుని మీ రిపుడు
గెలుచుట కొకయుక్తి - గెంటక వినుఁడి!

వాఁడు కయ్యము సేయ - వచ్చిన వేళ
నాడాడ డౌఁగుచు - నళికిన రీతిఁ

బోరాడుచుండుఁ డ - ప్పుడు విజయాశ
నా రాక్షసునియం ద - హంకార గుణము 270

పొడము, నందున వారు - పొలిసి పోవుదురు;
జడియక చనుఁడన్న - శక్రాదు లరిగి,

పొరిఁ బొరి దానవుల్‌ - పోరాడు తఱిని
వెఱచిన రీతిగా - విబుధు లందందు.

డాఁగుచుఁ బోరుచుం - డఁగ దానవులకు
వేగ నహంకార - వికృతి జనించె;

నాయహంకృతిచేత - నఖిలరాక్షసులు
నాయమరుల కోడి - యరిగి ' రటంచు

ముని దెల్పఁగాను రా - ముఁడు వెఱుఁగంది,
మనమున నూహించి - మరల ని ట్లనియె: 280

'కలుష దామ, వ్యాళ, కట - వామ భటులు,
నిలను బరాత్మ యం - దెటు గల్గి?' రనిన

మౌని యి ట్లనియె 'దా - మ' వ్యాళ, కటులు
పూని యద్భుతముగాఁ - బుట్టు టె ట్లనిన

నెరవొప్పఁ జెప్పెద - విను సూక్ష్మమతినిఁ
బరమాత్మ విప్రతి - భాతి మాత్రంబె

గావి సత్యంబులు - గా విది చెప్పఁ
గా నేల? రామ! త - క్కక నీవు, నేను

105

ద్వితీయవ్రకరణము

నుమట లపద్భావ - మగు నాత్మ రూప
మునఁ గల్గునాభాస - ముగఁ జూడు, మదియె 290

జీవశక్తి యనంగఁ - జెలరేఁగి, త్రివిధ
భావవిస్ఫూర్తిచే - బ్రభవించి మించి,

తనువు లనేకముల్‌ - ధరియించు, విడుచుఁ
గనుక, నాభాసాత్మ - కం బింత యనుచుఁ

దెలిసి, జీవత్వాంబు - ధిని వీడి, జ్ఞాన
బలముచేఁ జిత్సర - బ్రహ్మమై యుండు;

వెణుఁగని యహమర్థ - మిల వెద్దియైనఁ
బరువడి మలిన రూ - పముతోఁ జిదాత్మ

యందుఁ బొం దెఱిఁగిన - యహమర్ధ మొనరఁ
బొందుగా బ్రహ్మమై - పూర్ణమై వెలుంగు; 300

మొనసి తదహ మెన్న - మూఁడులోకములఁ
గనఁబడుఁ ద్రివిధ ప్ర - కారముల్గాను

అందు బ్రహ్మంబు తా - నని యహంభాన
మొందిన యహమర్ధ - మున్నతోన్నతము,

పరఁగ నీశ్వరుఁడు ప్ర - పంచంబువందుఁ
బరమాణు పూర్ణుడై - భాసిల్లుచుండు,

నతనికి దాసుండ - నను నహమర్థ
మతులితోత్తమ మగు, - నా రెండు విడిచి,

తనువు, నింద్రియములు - తా నను నహము
జనియింప నది కని - ష్టం బగుచుండు 310

గడపటి కీ యహం - కారత్రయంబు
విడిచిన ధన్యుండు - విమలనిర్వాణ

106

వాసిష్ఠరామాయణము

పదమందుఁ జెందుఁ, ద - ప్పదు నిశ్చయంబు.
కదిసియుండెడి యహం - కారంబు నణఁచి

ముందు భీమాదులు - ముక్తులైనట్టి
చందంబుఁ జెప్పెదఁ - జక్కఁగా వినుము!
   

*భీమాద్యుపాఖ్యానము*



మనుజేంద్ర! నాడు దా - మ,వ్యాళ,కటులు
మొనయు నహంకార - మున బలాయువులఁ

దాము గోల్పడి దేవ - తల కోడోరనుచు.
సామంబుతో మళ్ళీ - శంబరాసురుఁడు 320

అమలాత్ములను, నిర - హంకారమతుల
నమితసుశాంతుల - నధ్యాత్మ విదులఁ

బుట్టింస, జలధి బు - ద్బుదముల మాడ్కిఁ
బుట్టి యద్భుతముగాఁ - బురుహూతముఖులఁ

దఱమి జయించి సం - తసము దీపింపఁ
బరమపదంబునఁ - బ్రాపించి రపుడె.

పరఁగ దుర్వాసనా - బద్ధ మానవము
సరస సుజ్ఞాన వా - సనచేతఁ గ్రాఁగి,

సతతంబు విమలమై - శాంతినిఁ బొందు,
నతిశయంబగు సమ్య - గోలోకనంబు 330

చే చిత్త మణఁగు నా - ర్చిన దీపమట్ల,
నీ చంద మిపుడు నీ - కేను చెప్పినది

యేలన్న నీ విశ్వ - మెల్ల మాయికము
గా లక్ష్యమునఁ జూతుగా - కంచుఁ దాఘ,

107

ద్వితీయప్రకరణము

భీముల కథలఁ జె - ప్పితి' నన్న రాముఁ
డా మునిఁ గాంచి 'వి - శ్వాతీతమైన

పరమాత్మయందీ ప్ర - పంచ మేరీతి
నిర వొందు?' ననఁగ ము - నీంద్రుఁ డి ట్లనియె:

'నమలాత్మ! రామ! చి - దాకాశమందు.
భ్రమకాకరంబై ప్ర - పంచ మంతయును 340

ఊరకే యెండమా - వులయందు నీళ్ళు
పాఱిన గతిఁ గనం - బడు మృగంబులకు,

సటువలెఁ, దనయాత్మ - నంటిన మదము
పటిమ నన్యుఁడ నని - భ్రమ నొంది దేహి

మఱపను నజ్ఞాన మహి - మంబు చేత
నరయనేరక యీతఁ - డతఁడు గాకుండు,

వెలయు దీపము నందు - వెలుఁగున్న కరణిఁ,
దెలియ భానునియందు - దివమున్న రీతి,

పొసఁగ జిత్తున జగం - బులు దోఁచుచుండు;
అసమాన చరిత! నీ - వంతరంగమున 350

భావింపుచుండు మీ - పరమ రహస్య
మే వేళ' ననిన ము - నీంద్రు నీక్షించి

పలికె శ్రీరాముఁడో - పరమ మునీంద్ర!
నెలవుగా క్షీరాంబు - నిధి తరంగముల

నలె నుండు మీ సార - వాక్యముల్‌ వినఁగ
నలఘు సుజ్ఞానోద - యం బయ్యె మదిని,

నడర జ్ఞానోదయం - బైయున్నఁ గాని
గడియగడియకుఁ జీఁ - కటియును వెలుగు,

108

వాసిష్ఠరామాయణము

వలనుగాఁ జలి, యెండ - వర్ష మేఘంబు,
గలిగించు చందంబు - గా నా మనంబు 360

గలిబిలి చేసి సం - కల్ప వికల్ప
ములను బుట్టించు, ని - ర్మూలంబుగాదు;

అరయ ననంతంబు - నప్రమేయ౦బు,
పరము, నేకమును, స - ర్వము నైన బ్రహ్మ

యందు సృష్టి లయంబు - లగు వికారంబు,
లెందుకు జనియించె? - నీ హేతు వేమి?

యనిన వసిష్టుఁ డి - ట్లనె రాముఁ జూచి
'యనఘ! యథార్థ వా - క్యార్థంబు లగుచుఁ

దసరు పూర్వాపరా - ర్థ నిరూపణలకు,
మొనసి చూడ విరోధ - ములు గల్ల వెందు,370

సుజ్ఞానదృష్టిచే - సూటిగాఁ జూడ
నజ్ఞానభావంబు - నంట్టి మనంబు

రూపింప విద్యా స్వ - రూపమై వెలుఁగు:
నాపట్ల నస్త్ర మ - య్యస్త్రంబు చేతఁ,

గ్రమముగా గరళ మా - గరళంబు చేత
భ్రమ చెడ ఖండింప - బడినచందమున

ననుమాన విరహిత - మై యున్న సూక్ష్మ
మనముచేత మనంబు - మడియుచునుండు,

వెలయు ననాది య - విద్య యేరీతిఁ
గలుగునో యనుచింత - కడముట్ట విడిచి,380

విరతంబు సరతత్వ - నియతి సవిద్య
పఱిముఱిఁ జెఱచు టె - ట్లను విచారంబు

109

ద్వితీయ ప్రకరణము

నీ యాత్మ యంధుంచు - నెలవెందు లేక
నా యవిద్య నశించు - నపుడు తజ్జనన

కారణ మాత్మకుఁ - గనిపించు' ననిన
శ్రీరాముఁ డనియె 'నా-జీవుండు మించి

తా మనోరూపంబుఁ - దాల్చి విరించి
ధామంబు నొందు వి - ధం బెట్టు? లనిన

మౌని యి ట్లనియె 'బ్ర - హ్మ శరీర మొందు
మానిత చరితంబు - మది నిల్పి వినుము! 390

అరయఁగా దేశ కా - లాదులు లేక
వరునగాఁ జూచిన - వస్తు భేదంబు

లేక యంతట నొక్క - లీలగా నుండి
యాకాశనిభమగు - నాత్మతత్త్వంబు,

అదియే బ్రహ్మ శరీర - మనఁయిడుచుండు;
వదలక యుండెడి - వాసనావశము.

చేత జీవుం డగు, - జీవునివలన
నాతతంబుగ సంశ - యాత్మకంబైన

మదిగల్గి, దాని ని - ర్మలశక్తియందుఁ
గదిసి శబ్దోన్ముఖా - కాశాదిభూత 400

సముదయం బుదయింప, - సకల ప్రపంచ
మమితమై గనుపట్టె - నాకాశమందు,

ననలకణమురీతి - నాద్యహంకార
ఘనబుద్ధి బీజ సం - కలిత దేహంబ

కమపట్టి పుర్యష్ట - కంబను పేర
మొన మాపుచును భూత - ముల హృదబ్జముల

110

వాసిష్ఠరామాయణము

మెలఁగుచు నుండు తు - మ్మెదరీతి నందు,
బలసి పిమ్మట మనో - భావ వేగమున

లలిమీఱ బిల్వ ఫ - లంబు చందమున
సొబయక బళువుగా - స్థూలమై యదియె 410

చెలువొప్పఁ గరఁగి పో - సిన పైఁడి బొమ్మ
వలెఁ బ్రకాశించి, య - వ్వల నాకనమున

మొనసి తత్తద్రూప - ముల వెల్గుచుండుఁ;
దనరఁగా వాని కూ - ర్థ్వంబు శిరంబు,

నుదరంబు మధ్యంబు, - నొగి హస్తములును,
ముదమొప్పఁదగు పార్శ్వ - ములు, పాదములును

చాల నధంప్రదే-శముగాం నిట్లు
కాలవశంబునఁ - గాయమై నిలిచి

గణుతి కెక్కుచు బుద్ధి - ఘనసత్త్య ముఖ్య
గుణములు తనయందు - గుమికూడి మెఱయఁ 420

దరమిడి లోక పి - తామహుండైన
వరమేష్ఠి యుదయించుఁ - బరమార్థమైన

యతనికి జన్మల - యంబులు గల్ల
వతిశయ మిథ్య లై - నట్టి భావనల

చేతనే గల వంచుఁ - చెప్పఁగాఁబడును.
ఖ్యాతిగా నటుగానఁ - గర్మ సంసార

కలిత తృష్ణా భుజం - గంబును ద్రుంచి
యలఘు సౌఖ్యము నొందు - మాదిత్యకులజ!

111

ద్వితీయప్రకరణము


మొనయు నజ్ఞానాంశ - ములు సతీసుతులు,
ధనధాన్య ముఖ్య సంప - దలుగాఁ దలఁచి,430

మొనసి తత్సుఖ దుఃఖ - ముల మది రోసి
నను సదా నిశ్చలా - నందంబు కుదురు;

అరయఁగా మూర్ఖాత్ము - లగువారితలఁపు
లఱి ముఱి మోహ శో - కాబ్ధుల మునుఁగు;

నటువంటి తలఁపులే - యతివివేకులకు
ఘటిత వైరాగ్యసౌ - ఖ్యంబు పుట్టించి

జననాథ! చేఁ దప్పి - చనినట్టి కార్య
మునకుఁ జింతింప, కి - మ్ముగ దాని విడుపు

మల కాలవశమున - నబ్బిన సౌఖ్య
ముల నీ వనుభవించు - మోహివిగాక,440

కలిగెడు సుఖము దుః - ఖము మిథ్య లనుచుఁ
దెలియ నేర్చిన మహా - ధీర చిత్తుండు

ఆ సుఖదుఃఖంబు - లందంటి యంట
కీసూర్యుఁ డున్నట్ల - యింపొందు చుండు.

నొకవేళ శివునిచే - నుదయించు సృష్టి,
యొకవేళ నజునిచే - నుద్భవం బగును.

నొక వేళ విష్ణు దే - వునిచేతఁ గల్గు,
నొక యెడ మునులచే - నుత్పన్న మగును,

నొక తఱి గమల మం - దుదయించు బ్రహ్మ,
యొక వేళ జనియించు - నుదకంబునందు, 450

112

వాసిష్ఠరామాయణము


నొక కాలమునఁ బుట్టు - నురుతరాండమున,
నొక వేళఁ బొడమునీ - వ్యోమంబునందు,

నొక వేళఁ దరులతా - యుత యగు భూమి,
యొక వేళ నరులతో - నొప్పు నిద్దాత్రి,

యొక వేళ గిరులచే - నోగిఁ బ్రకాశించు,
నొక వేళ భూమి తా - నొక్కటే యుండు,

నొక వేళ మొఱప రా - ళ్లుండు నెల్లెడల,
నొకవేళఁ గనకమై - యొప్పు నిద్ధాత్రి,

యొక వేళ నాకాశ - ముదయించు మొదట,
నొక వేళయీ భూమి - యుదయించుఁ దొలుత, 460

నొక వేళ నాది యం - దుదకంబు పుట్టు,
నొక వేళ పాపకుఁ - డుదయించు మొదట,

నొక వేళఁ దొలి వాయు - వుద్భవం బందు,
నిఁక నెన్ని చెప్పు ద - నేక చిత్రములఁ

బ్రకటమై తోఁచుఁ బ్ర - పంచ మీరీతి
నొక బ్రహ్మపుట్టు వే - నొనరఁ జెప్పితిని

అమితంబులైన బ్ర - హ్మల పుట్టువులను
గ్రమముగా నెపరును - గణుతింపలేరు.

నిక్కంబుగా విధి - నిర్ణయం బనుచుఁ
జక్కఁగా సృష్టి ము - చ్చట చెప్పఁదరమె? 470

మానవేశ్వర! జగ - న్మాయా స్వరూప
మేను జెప్పెద నది - యె ట్లన్న వినుము!

113

ద్వితీయప్రకరణము

*దాశూరోపాఖ్యానము*


అనఘాత్మ! దాశూరుఁ డను - ముని తండ్రి
చనిపోవఁగాఁ జూచి - జనకునికొఱకు

నెలుఁగెత్తి దాశూరుఁ - డేడ్వ నవ్విధము
తెలిసి తెప్పున వన - దేవత యటకుఁ

జని 'జనించిన వారు - చచ్చుట నిజము
గనుక, నీవింక దుః - ఖంబును విడువు'

మని యూఱడింపఁగా, - 'వౌఁ గాక! యనుచుఁ
దనతండ్రి కట సేయఁ - దగిన కర్మములు 480

సుస్థిరమని దా - శూరుండు చేసి,
యస్థిరంబు శరీర - మని తాఁ దపంబు

సేయ సంకల్పించి - క్షితి నుండ రోసి,
యాయెడ నొక్క వృ - క్షాగ్రంబుఁ జేరి,

యతిశయంబగు తప - మం దాచరింప,
నతనికిఁ బ్రత్యక్ష - మై హుతాశనుఁడు

పఠముల నియ్యఁగా, - వాఁడటు మీఁద
మురిపెంబుతో జన్న - ములు చేయంఁదలఁచి,

పరమభక్తిని వన - స్పతిని గుఱి౦చి
పరఁగఁ బదేండ్లు త - పం బాచరించి, 490

మదిలోన యజ్ఞ సా - మగ్రినిఁ గూర్చి,
సదమల మతిని ని - ర్బరుల కర్పించి.

కొమరొప్ప నర, హయ - గో మేధయాగ
సముదయంబులు నిజ - స్వాంతంబునందె

114

వాసిష్ఠరామాయణము


తా వాచరింపఁ, ద - త్త్య జ్ఞాన మాత్మ
లోనె ప్రకాశింప, - లోక జాలముల

నిరసించి, యట మీఁద - నిస్పృాహుం డగుచుఁ
బరమైన నిర్విక - ల్పసమాధి నుండె.

అలరుచు నంతట - నతనిధన్యతను
దెలియుటకై వన-దేవత యతనిఁ 500

జేరి తా వందనాల్‌ - చేసి నుతించి,
“ధీర! దాశూర! నా - దెనఁ గృపనుంచి

“యిపుడు నా కొక పుత్రు - ని మ్మీయకున్న
నపరిమితాగ్నిలో - నైనను జొచ్చి

తనువు నీ కర్చింతుఁ - దక్కక యిచట"
నన విని నవ్వుచు - నమ్మహామహుఁడు

తనచేతికమల మా - తరళాక్షి కిచ్చి,
'వనిత! మాసమునకు - వరపుత్రకుండు

గలుగు, న న్నిట బలా - త్కారంబు చేసి,
యలరుచు సుతుని నీ - వడిగితి గాన, 510

జనియించు సుతుఁడు వి - జ్ఞాని యౌ'ననిన
విని యది పలికె 'నో - విమలాత్మ! నాకు

సుజ్ఞాని యైనట్టి - సుతుఁడు గల్గినను
ప్రజ్ఞానమేత! నీ - పద సేవ చేయ

వాని నీ చెంత - నిలిపెద' ననుచు
నా వనదేవత - యట మ్రొక్కి పోయి,

మానంబునకు సత్కు - మారునిఁ గాంచి,
యా సుతుఁ గొని చని - యచలాత్మయగుచు

115

ద్వితీయప్రకరణము


మ్రొక్కి, యా దాశూరు - మున్నిడి పలికె;
'నిక్కంబుగా వీని - నీ సేవ కొఱకుఁ 520

గని మీ కొనంగి, తి - క్కఢ వీనిఁ బోవు'
మని పుత్రు నందుంచి - యరిగె నద్దేవి.

ఆవల దాశూరుఁ - డాపుత్రకునకు
వేవేగ వేదాది - విద్య లన్నియును

నఱలేక చెప్పి, వే - దాంత రహస్య
మెఱిఁగిoప నొక్క నాఁ - డి ట్లని పలికె:

“ఓవరపుత్ర! నీ - కొకకథ నేను
భావించి చెప్పెదఁ - బట్టుగా వినుము!

అది యెట్టు లనిన స్వో - త్థాభిధానుండు
సదమలచరితుండు - సమ్యగాకార 530

కలితుఁ డాతఁడు - చేయు కార్యముల్‌ దుఃఖ
ములు నగుచు ననేక - ములు సముద్రమునఁ

బుట్టు తరగలట్ల - పొడముచు నుండు,
నట్టి రీతుల శక్య - మగుచుండ నతఁడు

సరవిని విహరణ - క్షమకై త్రితనువు
లఱిముఱి ధరియించి - యలరుచు నుండుఁ;

దలకొని యమ్మూఁడు - తనువులు లోక
ములయందు నిండి యి - మ్ముగ నుత్తమంబు

ననఁగను, మధ్యమం బ - నఁగఁ, గనిష్ట
మనఁగఁ గలుగుచుండు; - నా స్వోత్థనామ 540

ధేయుండు నెపుడు త - ద్దేహత్రయమును
బాయక యిందందుఁ - బక్షిచందమునఁ

116

వాసిష్ఠరామాయణము


నురవడిఁ జరియింపు - చుండె'నటంచు.
సురుచిరమతినిఁ దా - శూరుండు దెలుప,

విని యాకుమూరుండు - వెఱఁగొంది, యతని
కనియె నిట్లనుచు స్వో - త్ధాభిధానుండు

'ఎవ్వఁడు దేహంబు - లెన్ని ధరించె?
వెవ్విధంబునఁ జరి - యింపుచు నుండె?

దేటగా వివరించి - తెలుపుఁ ' డటన్నఁ
బాటించి యమ్ముని - ప్రవరుఁ డి ట్లనియె: 560

'విను పుత్ర! సంసార - విభ్రమ చక్ర
మనఁబడునది దీని - యం దనేకములు

గావస్తువితతులు - గలుగుచు నుండుఁ,
గావున సచ్చిదా - కాళంబునందుఁ

బూనిన సంకల్ప - పూరుషుం డనంగఁ
దాన జనింపుచుఁ - దా లీన మగుచు

వేడుకల్‌ చూపుచు - వెలుఁగుచునుండు,
వాఁడగు సర్వ వి - శ్వమటంచు నెఱుఁగు!

హరిహర విధి సురేం - ద్రాదు లందఱును
బొరి వాని యవయవం - బులుగా నెఱుంగు,570

మతిశయ సత్యలో - కాది లోకంబు
అతని నివాసంబు - లగుచుండు, మఱియు,

వాని తలంపున - వనజసంభవుఁడు
పూని జనించె న - ద్భుతవిశేషముల,

నిట్టి సంకల్ప మ - హీపాలకుండు
మట్టు మీఱుచు నధ - మంబు, నుత్తమము

117

ద్వితీయప్రకరణము


ననఁగాను, మధ్యమం - బనఁగ నొప్పుచును
దనరుచున్నటువంటి - తామన, సత్త్వ,

రాజసగుణ శరీ - రంబులు మూఁడు
మోజుగాఁదాల్చు ని - మ్ముగ న దెట్లనిన 580

సరవినిఁ దామస - సంకల్ప మహిమ
నఱిముఱి గ్రిమికీట - కాదులైనట్టి

జననంబు లొందును, - సత్త్వ సంకల్ప
మున వివేకశరీర - ములను ధరించు;

సారెకు రాజస - సంకల్ప మహిమ
నారయ మూఢ దే - హముల ధరించు;

మొనసి యీ సంకల్ప - ములు మూఁడు విడిచి,
తనలోని పరమాత్మ - తత్వంబుఁ దెలియఁ

గోరు, సంకల్పంబు - కొనసాఁగి పొడమ
నారూఢిగాఁ బొందు - నయ్యాత్మయందు, 590

సరసాత్మ! సర్వ వి - షయ జాలములను
నిరసించి విడిచిన - నిర్మల మనము

చేతనే మనమును - జెదరిపోనియక
యేతీరుగానైన - నెఱిఁగి బంధించి,

పట్టుచు మఱి మఱి - బాహ్యాంతరములఁ
బుట్టెడి సంకల్ప - ముల వీడు' మనిన

విని యక్కుమారుండు - వేగ ని ట్లనియె:
'జనక! యీ సంకల్స - జాల మెచ్చోటఁ

గలుగుచునుండు? నే - గతి వృద్ధిఁ బొందు?
విలయ మెట్లగు? నది - వివరింపు' మనినఁ 600

118

వాసిష్ఠరామాయణము


దనయుని మన్నించి - దాశూరుఁ డనియె:
'విను మా యనంతంబు - విమల, మద్వయము

ననఁదగు పరమాత్మ - కాదికాలమున
జననమైనట్టి సం - సారోన్ముఖతయె

అవిరళసంకల్ప - మగు, నదెట్లనిన
లవమాత్ర మగు చిదు - ల్లాసపరాత్మ

రూపింవ నజడస్వ - రూపమై మింటఁ
జూపట్టు జలదంబు - చొప్పున మించి

దట్టమై తానె చి - త్తం బగుచుండుఁ;
బట్టుగా మాయా ప్ర - పంచ భావనకుఁ 610

గన వ్యతిరిక్తంబు - గాం దోఁచుచుండు,
ననువొందఁగా బీజ - మంకురంబైన

గతిఁ బ్రపంచంబు సం - కల్పమే యగును.
ప్రతిభ నీ సంకల్ప - భావన తనకుఁ

దానె గల్గుచుఁ దనం - తనె వృద్ధి యగుచుఁ
దానె యణఁగు నీటి - తరఁగలరీతిఁ,

గాన డీన సుఖంబు - గలుగ దెన్నటికిఁ,
బూని మహాదుఃఖ - ములను బుట్టించుఁ

గావున నీవు సం - కల్ప భావనలఁ
బోవీడి నుఖమొందు - పుత్ర! యెట్లనిన 620

మొనసిన సంకల్ప - ములు నశించినను
మునుపు పుట్టు ప్రయత్న - ములు గల్గవవల,


2. లవమాత్రమగుచు నుల్లాసంబు నాత్మ 119

ద్వితీయప్రకరణము

 
వరుస భావన నభా - వంబు చేసినను:
గరఁగి సంకల్పముల్‌ - గళితంబు లగును;

కడను సంకల్పముల్‌ - గళితంబులైన
నెడలేని సంతోష - మిరవొందు మదిని,

జనన మొందెడి యస - త్సంకల్పములను
మొనసి నత్సంకల్ప - మున నిగ్రహించు!

మనముచే మనమును - మడియించు మవలఁ,
గనినను నీకు దు - ష్కరముగా దెద్ది' 630

యనుచు దాశూరుఁడి - ట్లని కుమారునకు
వినిపెంచెఁ బరమైన - వేదాంత' మనుచు

మునిదయ మీఱ రా - మున కెఱింగించి,
మనము రంజిల్లఁగా - మరల ని ట్లనియె:

'ఇలను మనోజాల - మిట్టిది యనుచుఁ
దెలిసి ధీరతను వ - ర్తింపుచునుండు!

లీలగాఁ దుద మొదల్‌ - లేదు కాలమున,
కేలాగుఁ జూచిన - నిదమిత్థ మనుచు

నెఱుఁగ శక్యంబుగా, - దెన్న నూఱేండ్లు
నరుఁడు జీవించు ని - ర్ణయముగా ననుచుఁ 640

బట్టుగా వేదంబు - పలుకుచునుండు;
నట్టినియతి దప్పు, నర్ధకాలంబు

బ్రదికి యుండుట దుర్ల - భంబుగా నుండు:
ఇది నాది, నే నని - యెల్ల మానవులు

వదలక సంసార - వనధిలో మునిఁగి
సదమల జ్ఞాన వి - చారంబు లేక

120

వాసిష్ఠరామాయణము


కాలమృత్యువు నోటి - కబళంబు లగుచు
భూలోకమున గిట్టి - పుట్టుట సుఖము

కా దని, వైరాగ్య - కలితాత్ములైన
వేదాంత వేత్త లే - విధమున ధరను 650

మెలఁగుచుండుదు రట్ల - మెలఁగుచునుండు!
కలుగ వావల జన్మ - కర్మ దుఖములు;

అంతరాస్థ నణంచి, - యట సేయుపనుల
నెంతని విడువక, - యెఱుక దప్పకను

సేయఁగాఁ దగుపనుల్‌ - చేయుచుండినను
మాయలే కణఁగు, చి - న్మయ మగునంత;

నిచ్ఛలేకయె రత్న - మెపుడు తనంత
స్యచ్చమై వెలిఁగెడి - చందంబుగాను

నణురూపమై పర - మాత్మునియందు
గణుతి కెక్కుచును లో - కములు తమంత 660

నే తాము లీలగా - వెరసి వెలుంగు,
నాతతంబుగ నాత్మ - యందుఁ గర్తృత్వ

మును, నకర్తృత్వ మి - మ్ముగఁ దోయచుండుఁ;
గనుంగొను నాసలే - కనె చేయుచుండుఁ,

గనుకను దాఁ - గర్త గా, దొక కర్త
యొనరంగఁ దనచెంత - నుండుటఁజేసి

పూని కార్యముల నె - ప్పుడు చేయు నెడలఁ
దాను గర్త నటంచుఁ - దలఁపక సేయఁ,

దగు కార్యములు చేసి - తాఁ గర్త ననక
జగతి నిర్లేప సం - జ్ఞను బొందవలయు; 670

121

ద్వితీయప్రకరణము


నటు గాకయుండిన - నంతటి కేను
ఘటకుండ నని నీవె - కర్తృత్వ మొంది,

సకలకార్యములను - సమబుద్ధిచేత
వికలత లేక వి - వేకివై నడుపు!

మొలచు రాగద్వేష - ముల మోదఖేద
ముల యందుఁ బొంద, కి - మ్ముగ నెప్పుడైన

లలిని సంకల్ప జా - లంబు నణంపఁ,
జెలువొప్ప సమతచేఁ - జిత్తు దీపించు

గాన, నకర్తృత్వ - కర్తృత్వములను
మాని, మనోలయ - మార్గంబు నొంది, 680

నీవు సుఖింపుచు - నెమ్మది నాత్మ
భావించినంతటఁ - బరిపూర్ణమగును.

తనువు తా నను నహం - తను విచారింప
సునిశితంబుగఁ గాల - సూత్రనారకము

గాన వీడందగు - ఘటము నే ననుట,
మానవేశ్వర! యొక - మర్మంబు వినుము!

అంతకు నేఁ గర్త - ననియైనఁ దలఁపు,
మంతకుఁ గర్త కా - నని యైనఁ దలఁపు,

మింతటికినిఁ గర్త - యెవఁడు? నే నెవఁడ?
నింతింత యనఁగూడ - దీ వింత యనుచు 690

నైనఁ దలఁపుచుండు, - మస్థిరంబైన
మేను నే ననకు సు - మీ! రామ! దేహ

122

వాసిష్ఠరామాయణము


వాసన బంధమౌ, - వరునగా సర్వ
వాసనా క్షయము జీ - వన్ముక్తి యనుచుఁ

దెలిసి, యావలన ము - క్తినిఁ గోరవలదు,
వలనొప్పఁగా మనో - వాసనావళినిఁ

బరిహరింపుచు మహా - పావనసత్త్య
పరగుణస్నేహాది - వాసనలందుఁ

దగులుచు వర్తించి, - తద్వర్తనముల
దిగనాడి యట మీఁద - ధీరత మీఱఁ 700

బొసఁగ నంతట శాంతిఁ - బొంది, యామీఁద
నసదృశ చిన్మాత్ర - మందు సుఖించి,

మఱి మనోబుద్ధి స - మన్వితం బగుచు
మెఱయు వాసన నటు - మీఁద వర్షించి,

తఱచైన చిర సమా - ధానంబుచేత
నెఱుకకు నెఱుకగా - నేకాగ్రమతినిఁ

దెలిసితి వెద్ది య - దిన వీడు మవల,
విలసితంబగు మనో - వృత్తినిఁ జేసి

మొలచు నఖిల దృశ్య - ముల వీడినపుడు
చెలువొప్ప నేది విశే - షించునో చూడ 710

నది మోక్ష మనఁబడు; - నాగుఱి యందుఁ
గుదిరిన ధన్యుండు - గురుఁ డనందగును;

ఆ గురుతర పుణ్యుఁ - డటు జ్ఞాన, కర్మ
యోగముల్‌ మరలఁ జే - యుచునున్న మేలె,

123

ద్వితీయప్రకరణము


చేయకుండిన మేలె - సిద్ధించు నతని,
కే యెడఁ గొదువలే - దినకులోత్తంస!

నిలుకడ యైనట్టి - నిర్లేపయుక్తి
గలవాని సంసార - కాంక్ష గోష్పదము

వలె నుండి యణఁగు; న - వ్వల లేపయుక్తి
గలవాని సంసార - కాంక్ష మహాబ్ధి 720

వలెఁ బొంగి కడపట - వాని ముంచు' నని
పలికి క్రమ్మఱ ముని - ప్రవరుఁ డిట్లనియె:

*ఉపదేశోఫాఖ్యానము*



'జననాథ! యిఁక నొక - సరణిఁ జెప్పెదను
విను మది యెట్లన్న - విబుధ దేశికుని

తనయుండు కచుఁడాత్మ - తత్త్వసమాధి
నొనరంగఁ గూర్చుండి - యుండి, యానిష్ఠఁ

జాలించి లేచి, వి - శ్వంబు నీక్షించి,
యాలోచనంబుగా - నంతరంగమునఁ

దలఁచె నిట్లనుచు 'భూ - త ప్రపంచమున
వెలుఁగుచుఁ బరమాత్మ - వేఱుగా కెల్ల 730

దిక్కులఁ బూర్ణమై - దీపెంచె, నేన
నిక్కమై యంతట - నిండి యున్నాఁడ

నెక్కడఁ బోవుదు? - నిఁక నేమి సేతు?
నొక్క పరబ్రహ్మ - మున్న దే నగుచుఁ

గనుకఁ దదన్య మె - క్కడ లే'దటంచుఁ
దన యనుభవముచేఁ - ధాఁ బూర్ణుఁ డయ్యె;

నని కచువృత్తాంత - మమర వసిష్ఠ
ముని తెల్పి, మరల రా - మున కిట్టు లనియె:

'ఎవ్వండు సత్త్వంబు - నెనయుచునుండు
నవ్విమలుఁడు వాఁడ - యనిశంబు కనక 740

కమలంబు రీతిఁ బ్ర - కాశింపుచుండు'
నమరఁ గోరఁడు కోర్కె, - లాత్మయం దెపుడు

మొనసి రమించు, ని - మ్ముగఁ జంద్రబింబ
మున శైత్యగుణము గ్ర - మ్ముచునుండు కరణి

నా యోగి హృదయమం - దమల శాంతంబు
పాయక యుండు; న - ప్పగిదినిఁ జిత్త

శాంతిఁ బొందుము రామ - చంద్ర! యీ బాహ్య
చింతల నొందక, - చెలఁగి నుఖించు!

ఓరామ! యిది రహ - స్యోపదేశంబు,
సారంబుగా నెంచు - స్వాంతమం' దనుచుఁ 750

దెఱ గొప్ప నీద్విస్థి - తి ప్రకరణము
కరుణను విజయ - రాఘవునకుఁ దెలియ

నా వసిష్ఠుఁడు చెప్పె - ననుచు వాల్మీకి
ప్రావీణ్యశాలి భర - ద్వాజ మునికి

మనము రంజిలఁ జాల - మన్నించి పొసఁగ
వినిపించె నత్యంత - విశదంబుగాను.

125

ద్వితీయప్రకరణము

*ప్రకరణాంతర్విపద*


ఇది సోమనాథ వి - శ్వేశ్వర దివ్య
పదపద్మభక్త సు - బ్రహ్మణ్యయోగి

చరణాంబుజాత ష - ట్ఛరణాయమాన
పరిపూర్ణ నిత్య స - ద్భావ నిమగ్న 760

మానసాంబుజ వెంగ - మాంబికా రచిత
మై, నిత్యమై, స - త్యమై, ధన్యమైన

సామార్థ సార సు - జ్ఞాన వాసిష్ఠ
రామాయణం బను - రమ్యనద్ద్విపద

యం దెన్నగా ద్వితీ - యప్రకరణము
అందమై విమలమో - క్షాకరం బగుచు

శ్రీతరిగొండ నృ - సింహుం డనంగ
ఖ్యాతిగా వెలయు వేం - కటరాయ! నీదు

పదయుగళికి సమ - ర్పణ మయ్యె దీని
సదమలులై వ్రాసి - చదివిన, వినిన 770

నరులు తాపత్రయా - ర్ణవము తరించి,
పరమైన నిర్వాణ - పదము నొందుదురు.

భూచక్రమున నిది - వురుషార్థ మగుచు
నాచంద్ర తారార్క - మై యుండుఁగాత!

-:ద్వితీయప్రకరణము సమాప్తము :-

This work was published before January 1, 1930, and is in the public domain worldwide because the author died at least 100 years ago.