వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/సంవత్సరము, ఆది-ఆచారములు
సంవత్సరము, ఆది ఆచారములు
"చతుర్వింశతి పర్వ త్వాం షణాభి ద్విదశీ ప్రథి |
తత్రిషష్టి శతారం వై చక్రం పాతు సదాగతి ॥ - మహాభారతమ్
చ.
"ఋతువున కొక్కరూపు సవరించి అహర్నిశలన్ తెరల్ యథో
చితముగ లేచి వ్రాలగ కుశీలవులై నటియింప ప్రాణి సం
హతి సుఖదుఃఖరంగముల నాదియు నంతములేక సాగు నీ
స్తుతిమదదృష్ట కాల నయచోదన కంజలినిత్తు నర్మిలిన్." - శ్రీ రాయప్రోలు
1
ఆంధ్రులకు చైత్రశుద్ధ పాడ్యమితో సంవత్సరాది. మన ప్రాచీనులైన ఆంధ్రులూ,
భారతీయులూ అనంతమైన కాలాన్ని ఏ నాడో భావించారు; అది పరబ్రహ్మ స్వరూపమని
సిద్ధాంతీకరించారు. సృష్టి స్థితిలయాలు కాలం వల్ల కలుగుతున్నవనీ బ్రహ్మ విష్ణు
మహేశ్వరులూ, తదితర దేవతలైన ఇంద్రాదులు కాలనియంత చేత వారి వారి
పదవులనుంచి చ్యుతులై పరమాత్మలో లీనమౌతున్నారని భారతీయుల భావన. కాలము,
దేశము, వస్తువు - ఈ మూటి చేతా పరిచ్ఛిన్నమైనది ప్రకృతి. పరమాత్మ ఈ మూటిచేతా
అపరిచ్ఛిన్నుడు. ఇది మన తత్త్వశాస్త్రజ్ఞుల నిర్ణయం.
జగత్కారణుడైన నారాయణమూర్తి హిరణ్మయ స్వరూపిగా సూర్యమండల
మధ్యవర్తియై కాలచక్రాన్ని భ్రమింప జేస్తున్నాడని మన జ్యోతిస్సిద్ధాంతుల సిద్ధాంతం.
మహత్తర మేధానిధులైన మహర్షులు బహుకాలం తపించి, చంద్ర సూర్య నక్షత్ర
గ్రహ గమనాలను పరిశీలించి, ఇతర జ్యోతిర్గణాలను దివ్యనేత్రాలతో దర్శించి,
అనంతమైన కాల స్వరూపాన్ని నిరూపించారు. కాలాన్ని పరిగణించటానికి మానాలను
ఏర్పరిచారు. ఈ భారతీయుల కాల విజ్ఞానము నేటి శాస్త్రజ్ఞులను కూడా ముగ్ధులను
జేసి జోహారులు అందుకుంటున్నది.
మన భారతీయ కాలమానానికి విస్పష్టమైన ఆద్యంతాలున్నవి. బ్రహ్మ సృష్టితో
ప్రారంభము, ప్రళయంతో అంతము. ఈ సృష్టి ప్రళయాలను కలిపి మనం కల్పమని వ్యవహరిస్తున్నాము. విష్ణు పురాణాదులు “రెండు పరార్థ కాల పరిమితి ఉన్న
బ్రహ్మపతనము శ్రీమహావిష్ణువుకు ఒక దిన" మని పలుకుతున్నవి.' సచ్చిదానంద
స్వరూపియైన పరమేశ్వరుని లీలావిలాసం చేత త్రిగుణాత్మకమైన సృష్టి కలుగుతున్నదనీ,
పరమేశ్వరుడు అపరిచ్ఛిన్నుడు కనుక బ్రహ్మతో సృష్టి కాలం ఆరంభమౌతున్నదనీ
గమనించిన మన ప్రాచీనులు కాలాన్ని కొలవటానికి నాలుగు మానాలు ఏర్పరిచారు.
1. మనుష్య మానము 2. పితృమానము 3. దేవమానము 4. బ్రహ్మమానము. మనం
మానవ లోకంలో నివసిస్తున్నాము. మనకు మానవమానం ప్రమాణం. మనకు మన
మానంలోనే చెపితే అర్థమౌతుంది. కనుక మనవారు మానవేతరమైన మానత్రయాన్ని
మానవమానంలోనే లెక్కించి చూశారు.
2
వాడియైన సూదిమొనతో తామరసదళాన్ని గుచ్చటానికి పట్టే కాలం ఒక త్రుటి.
నూరు త్రుటులు ఒక లవము. ముప్పది లవాలు ఒక నిమేషము. పదునెన్మిది నిమేషాలు
ఒక కాష్ఠ. ముప్పది కాష్ఠలు ఒక కల - దీనికి ప్రాణము నామాంతరము. ఇది ఒక
గుర్వక్షరోచ్చారణకు పట్టే కాలం. ముప్పది కలలు ఒక ఘటి. పది గుర్వక్షరోచ్చారణ
కాలం ఒక ప్రాణం. ఆరు ప్రాణాలు ఒక వినాడి లేక విఘటిక. అరవై విఘటికలు
ఒక అహోరాత్రము (దినము). పదిహేను దినాలొక పక్షం. రెండు పక్షాలు ఒక మాసం.
రెండు మాసాలు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక అయనము. రెండు అయనాలు
ఒక సంవత్సరము లేదా సౌరాబ్దము. ఇది మానవమానం!
మానవ మానంలో రెండు పక్షాలున్నవి. ఇందులో శుక్లపక్షం పితరులకు పగలు.
కృష్ణపక్షం రాత్రి. అంటే మన మాసం పితరులకు ఒక అహోరాత్ర మన్నమాట. ఇది
పితృమానం!!
మానవ మానాన్ని అనుసరించి ఆరుమాసాలు ఉత్తరాయణము. ఆరు మాసాలు
దక్షిణాయనము. ఇందులో మొదటిది దేవతలకు పగలు, రెండవది రాత్రి. అంటే
మానవుల ఒక సంవత్సరము దేవతలకు ఒక అహోరాత్రము. దీనిని బట్టి మూడు
వందల అరువది మానవ వత్సరాలు దేవతలకు ఒక సంవత్సరము. పన్నెండువేల
దేవ సంవత్సరాలు దేవతల కొక యుగం. ఇది మనుష్య మానంలో 4,32,000
సంవత్సరాలు. దీనికి మహాయుగమని నామం. ఈ దేవయుగంలో మన కలి
4,32,000, ద్వాపరం 8,64,000, త్రేత 12,96,000 కృతయుగం 17,28,000.
వెరసి 43,20,000 సంవత్సరాలు ఇమిడి ఉన్నా యన్నమాట. ఇది దేవమానం!! ఇటువంటి చతుర్యుగాలు లేక దేవయుగం బ్రహ్మకు ఒక దినం (పగలు)
రాత్రికూడా అంతే. ఈ కాలానికి 71 రెట్లు మన్వంతరము. అంటే మన డెబ్బది ఒక్క
చతుర్యుగ కాలాలు మనువుకు కాలనియతి అన్నమాట. మానవ కాలపు ప్రమాణంలో
ఇది 30,67,20,000 సంవత్సరాలు. పదునలుగురు మనువుల కాలం
4,29,40,80,000 మానవ సంవత్సరాలు. వీటన్నిటినీ బట్టి బ్రహ్మమానం క్రింది
రీతిగా ఉంటుంది.
14 మన్వంతరాలు లేక 1000
మహాయుగాల కాలము
మానవాబ్దాలలో
14 మన్వంతరాలు లేక 1000 మహాయుగాల కాలము
42,94,08,000
6 మహాయుగాల సంధికాలము
2,39,20,000
బ్రహ్మకు పగటికాలము సృష్టికల్పము
4,32,00,00,000
బ్రహ్మకు రాత్రి కాలము ప్రళయకల్పము
4,32,00,00,000
బ్రహ్మకు అహోరాత్రమైన దినము (బ్రహ్మకల్పము)
8,64,00,00,000
30 కల్పముల బ్రహ్మ మాసానికి
2,59,20,00,00,000
12 కల్పాల బ్రహ్మ సంవత్సరము
31,10,40,00,00,000
100 సంవత్సరాలు బ్రహ్మ కాయుః ప్రమాణము
31,10,40,00,00,00,000
ఇది బ్రహ్మ మానము. శత సంవత్సరాలున్న బ్రహ్మ పరమాయువుకు మన ప్రాచీనులు 'పర'మని సంజ్ఞ కల్పించారు. ఈ పరానికి రెండు అర్థాలున్నవి. అర్ధానికి బ్రహ్మవత్సరాలు ఏబది.
3
ఈ కాలమానంతో మన ప్రాచీన భారతీయులు బహుకాలం తమ నిత్య నైమిత్తిక
కామ్యకర్మలను జరుపుకున్నారు. ఈ నాడు కూడా శుభాశుభకర్మల్లో మనం ఈ మానాన్ని
అనుసరిస్తున్నాము. ఈ జయనామ సంవత్సరాదినాడు సదాచార సంపన్నులు ప్రాతః
స్నాన సంకల్పం చెప్పేటప్పుడు "శ్రీమహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః
ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే
జంబూద్వీపే భరత వర్షే భారతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ్...
అస్మిన్ వర్తమానేన జయనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతే చైత్రమాసే శుక్లపక్షే ప్రథమే భానువాసరే...' ఇత్యాదిగా చెప్పుకుంటారు. దీనినిబట్టి మనవారు మనకు
ఎటువంటి కాల స్వరూపాన్ని ఏర్పరచింది, దాన్ని మనం ఎలా నిత్యజీవితంలో
వినియోగించుకుంటున్నదీ వ్యక్తమవుతున్నది.
మనకు నేటి సంవత్సరాదితో ఆరంభమయ్యే జయనామ సంవత్సరం నాటికి
చతుర్విధమానాలు ఈ రీతిగా గడిచాయి. సృష్ట్యాదిగా గడిచిన సంవత్సరాలు
1655885054. జయతో 1655885055 ప్రారంభమైంది. ఇప్పటి బ్రహ్మకు ద్వితీయ
పరార్ధము. ఆయన 50 సంవత్సరాలు గడిచి ఏబది ఒకటో సంవత్సరం మొదటి
దినం జరుగుతున్నది. ఈ దినానికే కల్పమని పేరు. మొదటి దినం కనుక శ్వేత
వరాహకల్పము. మొదటి దినంలో పగటివేళ ఘ 13 వి. ఘడియలు గడిచినవి.
స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, చాక్షుస, రైవత, వైవస్వత, సూర్యసావర్ణి,
దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, దేవసావర్ణి, ఇంద్రసావర్ణి - ఈ
పదునాల్గురు మనువుల్లో ఆరుగురి మన్వంతరాలు గడిచిపోయినవి. ఏడవ దైన వైవస్వత
మన్వంతరంలోని డెబ్బది మహాయుగాలలో ఇరువది ఏడు గడిచిపోగా, ప్రస్తుతము
నడుస్తున్న 28వ మహాయుగంలోని చతుర్యుగాలలో కృత, త్రేత, ద్వాపరాలు
అయిపోయినవి. నాల్గవ దైన కలియుగంలో ప్రథమ పాదం నడుస్తున్నది. '
4
కలియుగానికి 4,32,000 మానవాబ్దాలు. అందులోని ప్రథమ పాదంలో
జయనామ సంవత్సరం నాటికి 5054 గడిచిపోయినవి. జయతో 5055 ప్రవేశించింది.
ఇక కలిలో శేషాబ్దాలు 426945.
ప్రతి అరవై సంవత్సరాలకూ ప్రభవాది నామాలు చెల్లుతూ ఉండటం
ఆంధ్రులందరికీ తెలిసిందే. ఈ అరవై సంవత్సరాల ప్రమాణం దేవతలకు ఒక ఋతువు.
ఈ అరవై సంవత్సరాలల్లో జయ, ఇది చాంద్రమానాన్ని బట్టి.
సంవత్సరాల సంఖ్యను చెప్పుకోటానికి అన్ని దేశాలలోను, ఏదో ఒక అబ్దం
ఆచారంలో ఉంది. మన దేశంలో ఇటువంటివి షటకాలున్నట్లు తెలుస్తున్నది. అవి
1. యుధిష్ఠిర శకము. 2. విక్రమార్క శకము 3. శాలివాహన శకము 4. విజయాభి
నందన శకము 5. నాగార్జున శకము 6. కల్కి శకము. యుధిష్ఠిర విక్రమార్కశకాల
మధ్యకాలంలో భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలోనైనా సప్తర్షియుగము,
మహేశ్వరాబ్దము వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రాచీన భారతదేశంలో
స్వర్ణయుగాన్ని కల్పించిన గుప్తుల పేర ఒక శకం కన్పిస్తున్నది. పూర్వపు ఒరిస్సా లోని కళింగ గంగరాజుల పేర ఒక శకం కొంతకాలముంది. ఈ శకాలలో నేడు ఉ
త్తర దేశంలో విక్రమార్క శకము, దక్షిణ దేశంలో శాలివాహన శకము వాడుకలో ఉ
ంది. మహమ్మదీయ క్రైస్తవ ప్రభుత్వాల కారణంగా ఫసలీ, క్రీస్తుశకాలు వచ్చినవి.
ఈ జయనామ సంవత్సరము యుధిష్ఠిర శతాబ్దము 3059, శాలివాహన శకము
1876, ఫసలీ 1363-1364. క్రీ.శ. 1954-55 (ఎ.డి)' ఆంధ్రదేశంలో వేదార్థ
నిర్ణయం చేసిన అద్వైత స్థాపనాచార్యులు శ్రీ శంకరభగవత్పాదులవారి జన్మ నుంచీ,
విద్యారణ్య స్వామివారి జన్మనుంచి సంవత్సరాన్ని లెక్క పెట్టడం అనూచానంగా
వస్తున్నది. జయ ఆచార్యుల జన్మ నుంచి 2457. విద్యారణ్యావతారాబ్దములో జయ
959.
4
ఆంధ్రదేశంలో సంవత్సరము లోక వ్యవహారానికి చాంద్ర సౌరమానాన్ని (Luni-
Solar measure) అనుసరిస్తున్నది. సూర్యుడు అశ్వినిలో ప్రవేశించటంతో సౌర
సంవత్సరము ప్రారంభిస్తుంది. నేటికి కూడా శేషాచల (తిరుపతి) దక్షిణ దేశంలో
సూర్యుడు మేషంలో ప్రవేశించిన నాటినుంచే సంవత్సరాది. వింధ్యకు ఉత్తరాన ఉన్న
దేశంలో బార్హస్పత్యమానం ఆచారంగా ఉంది. కార్తికమాసంలో ఈ అబ్దానికి ఆరంభం. 8
ఈ మాన ప్రకారము మన జయ వింధ్యోత్తరవాసులకు ప్లవంగ సంవత్సరము.
సంవత్సరాన్ని గురించి అరుణ కారకములలో (3-56) "పంచ పంచస్త త్రివర్త
సంవత్సరః" అని మంత్రం కనిపిస్తున్నది. దీని అర్థం 5+50+300 - 355. పంచ
పంచ పంచదశః : (50x50)+105 = 355. పంచ పంచస్త ఏక వింశః
5x(50+21) = 355 దీనిని బట్టి సంవత్సరానికి 355 దినాలున్నట్లు ఒక లెక్క
ఉన్నదన్నమాట. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టే కాలం ఒక నెల.
సూర్యుని చుట్టూ ఒకసారి భూమి తిరిగి రావటానికి పట్టే కాలము (Sidereal year)
సంవత్సరము.
పన్నెండు చాంద్రమాసాలు కలిపి 291/2×12-356. సౌరవత్సరానికి మూడు
వందల అరవై ఐదు దినాల ఆరుగంటల తొమ్మిది నిమిషాల 9 సెకండ్లు. చాంద్ర
సంవత్సరానికీ - అంటే 12 చాంద్రమాసాలు పట్టే కాలానికి - సౌర సంవత్సరానికీ
ఉన్న తేడాలను దూరంగా ఉంచితే సగటున సంవత్సరానికి 360 దినాలు. సంవత్సరానికి 360 దినాలైతే మాసానికి 30 దినాలు గల 12 చాంద్ర
మాసాలకూ కలిపి కొన్నాళ్ళు తగ్గింది. సౌర వత్సరంలో కొన్ని దినాలు పెరిగినవి.
రెంటికీ ఉన్న తేడాను మనవారు 10 ది. 21 గం. 20 ని. 30 సెకండ్లని నిర్ణయించారు.
మనవారు ఋతువులలో విస్పష్టంగా కనిపిస్తున్న సౌర సంవత్సరాన్ని
వదులుకోలేక పోయినారు. మరొక వంక శుక్ల కృష్ణ పక్షాలతో చాంద్రమాసము (Lunar
month) కనిపిస్తుంటే దాన్నీ వదులుకోలేక చాంద్ర - సౌరవత్సరాన్ని స్వీకరించారు.
5
యజ్ఞప్రియులైన ప్రాచీనార్యులకు తిథి, మాస, ఋతు, అయన పరిజ్ఞానము
అత్యవసరమైంది. అందువల్లనే ఒక జిజ్ఞాసువు 'జ్యోతిష్య శాస్త్ర దృష్టితో చూస్తే యజ్ఞము
కాలాన్ని కనుక్కోవటానికి ఏర్పడ్డ పరిశోధనాగారమని భావించారు. యజ్ఞం సంవత్సరం
పొడుగునా జరుగుతూ ఉండటం వల్ల యజ్ఞం, సంవత్సరము అనే రెండు పదాలు
ఏకార్థసూచకాలైనవి.' 'సవన'మనే శబ్దానికి సోమరస సంధానమని అర్థము. ఇది
యజ్ఞము. దీనిని బట్టి సావన దినము, మాసము, సంవత్సరము అను వ్యవహారం
కల్గింది. కాని 30 సావన దినాల మాసము చాంద్రమాసానికి ఎక్కువ. చాంద్ర మాసము
ది. 29 1/4 తో అయిపోతుంది. దీనిని బట్టి పన్నెండు నెలలకు 6 దినాల తేడా
వస్తుంది. చాంద్రమాసాలకు ఋతువులకు ఐక్యాన్ని సరిపెట్టటానికే మనవారు అధిక
మాసాన్ని కల్పించారు. ఋతుభేదాన్ని పాటించకుండా చంద్రునితో సరిపెట్టుకుంటూ
ముసల్మాన్ సోదరులలాగా పోతే, మన వ్యవసాయపు పనులలోనూ, దేవపూజ, నిత్య
పూజాల్లోను చీకాకు కలుగుతుంది. 360 తిథులను సిద్ధాంతులు 354 దినాలలోకే
సర్ది, అవసరాన్ని బట్టి అధిక మాసాలను చేరుస్తూ పంచాంగాలను సవరణ చేస్తూంటారు.
ఆంధ్రదేశంలో చాంద్ర సౌర భేదాల చేత సంవత్సరం రెండు విధాలుగా
ఉందని పైన గమనించాము. అమావాస్య నుంచి అమావాస్యకు ఉన్న కాలం
చాంద్రమాసం. పన్నెండు చాంద్రమాసాలు ఒక చాంద్రవత్సరం. సూర్యుడు మేషాది
రాశిచక్రాన్ని తిరిగి రావటానికే పట్టే కాలం సౌరసంవత్సరం. ఈ సౌరవత్సరం సాయన
నిరయన భేదాలతో ద్వివిధంగా ఉంది. మేషాయనం (మార్చి 20) నుంచి మేషాయనం
వరకు పట్టేకాలం సాయన సంవత్సరం. మేష సంక్రమణం (ఏప్రిల్ 13) నుంచి
మేష సంక్రమణం వరకు అయ్యేకాలం నిరయన సంవత్సరము. ఆంధ్రుల సంవత్సరం
చాంద్రమాసాలవల్ల కలగటం చేత ఆంధ్రుల సంవత్సరం నేడు నిరయన సంవత్సరము. పూర్వకాలములో ఆంధ్రదేశంలో సాయన నిర్ణయన వత్సరాలు రెండూ వ్యవహారంలో
ఉన్నట్లు తెలుస్తున్నది. కాని సాయన వ్యవహారం మధ్యలో లోపించింది. నేడు నిర్ణయనం
వాడుకలో ఉండడం వల్ల మేషారంభమైన అశ్వన్యాది మనకు సంవత్సరాదిగా ఉన్నది.
కాని యజ్ఞయాగాది క్రతువులకు సాయనవత్సరమే అవసరము. అందువల్లనే
బాలగంగాధర తిలక్ మహాశయుడు ఇలా అభిప్రాయమిచ్చినాడు.
"At the present day we on the southern side of Narmada begin the
year at the vernal equinox for all civil purposes, but still all the Religious
ceremonies prescribed to be performed in the Uttarayana, are performed in
Uttaray ana beginning with the winter solstice. 10 అయన చలనాలవల్ల ఇలా
రెండు సంవత్సరారంభాలు ఏర్పడి రెండూ రెండు విధాలైన ప్రయోజనాలకు
ఉపయోగపడుతున్నవన్న మాట!
6
“సంవత్సరోవత్సరో బ్లో హాయనో స్త్రీ శరత్సమాః” సంవత్సరాదిని సూచించే
శబ్దాలను అమరుడు ఈ విధంగా పేర్కొన్నాడు." "సమ్యక్ వసంతి ఋతవో
స్మిన్నితి సంవత్సరః 2 వత్సరశ్చ. ఋతువులు ఇందు బాగా నివసించటం చేత
సంవత్సరము వత్సరమనీ, ఆపః దదా తీతివా
అబ్దమనీ, లేదా అన్యతే అధిక మాసేన
-
జలము నిచ్చునది కనుక
అధిక మాసాల చేత విస్తరించేది
కనుక అబ్దమనీ, జహాతి ఋతూన్ క్రమేణ వరుసగా ఋతువులను విడిచేది గనుక
హాయనమనీ, శీర్యతే జగదనయేతి శరత్ - జగత్తు దీని చేత దుఃఖపెట్టబడుతుంది
కనుక శరత్తనీ, సహమాంతి వర్తంతే ఋతనో త్రసమాః, సమయంతి జనానితి
సమాః - ఋతువులు దీనియందు కూడి ఉంటవి కనుకనూ, జనులను విహ్వలత్వము
పొందిస్తుంది కనుకనూ సమ అనీ సంవత్సరానికి నామాలు కలిగినట్లు విజ్ఞులు
వ్యాఖ్యా నించారు. సంవత్సరానికి వర్షమని కూడా మరొక సంజ్ఞ ఉంది.
-
వీటిని గమనిస్తే, అందులో ముఖ్యంగా అబ్ద, వర్ష, శరత్ శబ్దాలను గమనిస్తే
ఒకానొక కాలంలో వర్షంతోనూ, మరొక కాలంలో శరత్తుతోనూ వర్షం ఆరంభించిందా
అనిపిస్తుంది.
భారతదేశంలోని ఆర్యుల సంవత్సరారంభ విషయంలో తిలక్ మహాశయుడు
సంగ్రహంగా ఇలా పలికాడు. "The ancient ary ans originally commenced their year, which was Luni
- Solar, and sidereal, with the Vernal Exquinox, and that when the beginning
was changed to the winter solstice both the reckonings were kept up, the
one for the sacrificial and the other for civil purposes.
12
తిలక్ మహాశయుడు భావించినరీతిగా ఆర్యులు చాంద్రసౌర సంవత్సరాన్ని
గ్రహించి వసంత చైత్రశుద్ధ ప్రథమతోనో కృష్ణ ప్రథమతోనో సంవత్సరాన్ని
ఆరంభించటానికే ముందు మరొక విషయాన్ని విద్వాంసు లూహించారు.13 వీరి
యభిప్రాయంలో కొన్ని వేలవేల యేండ్లకు పూర్వం నాక్షత్రమైన సౌరసంవత్సరం
ఒకటి ఉండి ఉండాలి. సూర్యుడు ఒక నక్షత్రంలో బయలుదేరి తిరిగి ఆ నక్షత్రానికి
రావటానికి పట్టేకాలము నాక్షత్ర సంవత్సరము. ఈ సౌరవత్సరానికి ఆరంభం ఎప్పుడో
చెప్పలేము.
తరువాతి కాలంలో మహా విషువంనాడు సంవత్సరం ఆరంభించి ఉంటుంది.
ఈ విషువము ఏటేటా 50 వికలలు వెనుకకు జరుగుతుంటుంది. 950 సంవత్సరాలకు
సుమారు ఒక వెనక ఔతుంది. విషువంతో సంవత్సరం ఆరంభించినప్పుడు ఆ నాడే
ఉత్తరాయణానికి, ఋతువుకు, మాసానికి, యజ్ఞానికి ఆరంభము.
14
భారతీయ సాహిత్యంలో కొంతకాలనుంచీ కలుగుతూ వస్తున్న మార్పులను
సూచించడానికి తగ్గ నిదర్శనాలు కనిపిస్తున్నవి. పునర్వసుకు నక్షత్ర దేవత అదితి.
ఆమెకు అన్ని యజ్ఞాలూ ఆమెతో ప్రారంభించి అంత మొందేటట్లు వరమున్నది.
సంవత్సరారంభంతో యజ్ఞాలు ఆరంభించటం ఆచారం కనుక ఇది ఒక
సంవత్సరారంభాన్ని సూచిస్తున్నదనీ, అదితి ఆదిత్యులకు తల్లి అనీ, ఆమె దేవయాన
పితృయానాలను ఏర్పరిచి ప్రథమ నక్షత్రంగా ఉన్నదనీ తెలియజేసే మంత్రాలు కనిపిస్తూ
ఉండటం ఈ అంశాన్ని బలపరుస్తున్నదని తిలక్ మహాశయుని అభిప్రాయం. ఈ
కాలానికి 'అదితి కాలము' (క్రీ.పూ. 6000 - 4000) అని నామకరణం చేసి,
అప్పుడు సంవత్సరము వాసంత విషువము దగ్గిర పునర్వసుతో గాని, దాని దగ్గర
గాని ఆరంభించి ఉంటుందని ఆయన నిర్ణయించాడు.
తరువాత కాలము మృగశిర కాలము (క్రీ.పూ. 4000 - 2500) ఈ కాలంలో
విషువము ఆర్ద్రలో ఉండేది. మృగశిరకు అగ్రహాయనమనే నామం ఉండటం వల్ల
సంవత్సరారంభం ఆ నక్షత్రంతో అయి ఉంటుందని తిలక్ మహాశయుని నిర్ణయము.
మూడవకాలము కృత్తికాకాలము (క్రీ.పూ. 2500-1400). ఇది తైత్తిరీయ సంహితా బ్రాహ్మణాల కాలము. ఋగ్వేదంలో ఎక్కడా కృత్తికలు నక్షత్రముఖంగా చెప్పలేదు.
సంహితాకాలంలో వాసంత విషువము సంవత్సరము కృత్తికతో ఆరంభించింది.
క్రీ.శ. 1377లో ప్రాంతంలో విషువము ధనిష్ఠలో ఉంది. ఇది వేదాంగ జ్యోతిష
కాలము. తరువాత ఐతిహాసిక కాలంలో విషువము శ్రవణంలో ఉండేది.
మహాభారతములోని విశ్వామిత్ర సృష్టి ఇందుకు నిదర్శనం.1 "అహః పూర్వం తతో
రాత్రి ర్మాసాః శుక్లాదయః స్మృతాః, శ్రవణాదీని నక్షత్రాణి, ఋతవః శిశిరాదయః”
దీనిని బట్టి మహాభారతము శ్రవణం నక్షత్ర ముఖంగా ఉన్న కాలంలో పుట్టి ఉంటుంది.
అంటే క్రీ.శ. 4వ శతాబ్ద ప్రాంతంలో శ్రావణ శుద్ధ ప్రథమ సంవత్సరాది అన్నమాట.
కానీ ఈ పరిగణనను అందరూ అంగీకరించి వ్యాప్తికి తెచ్చినట్లు తోచటం లేదు.
క్రీ.శ. 18 వ శతాబ్ది వరకూ ఇలాగే ఉంది. తరువాత అశ్విని నక్షత్రాది అయింది.
మేషంతో రాశి చక్ర మారంభించింది. చైత్ర శుద్ధ ప్రథమ సంవత్సరాది - అయినది.14
7
మన సంవత్సరానికి రెండు అయనాలు. ఉత్తరాయణము, దక్షిణాయనము
(Equinactical Points). వేదాంగ జ్యోతిష కాలంలో (క్రీ.శ. 1377 ప్రాంతము)
సూర్యుడు ధనిష్ఠ ప్రథమ పాదంలో ప్రవేశించగానే ఉత్తరాయణము. ఆశ్లేషార్ధగతుడు
కాగానే శ్రావణ మాసంలో దక్షిణాయమని తెలుస్తున్నది.17 " వరాహ మహిరాచార్యుడు
'సాంప్రత' మయనం సవితుః కర్కటకాద్యం మృగాడిత శ్చాన్యత్' అని చెప్పినాడు.
పునర్వసు చతుర్ధ పాదంలో దక్షిణాయనమని, ఉత్తరాషాఢ ద్వితీయ పాదంలో
ఉత్తరాయణమనీ దీని భావము. ఈ నాడు సూర్యుడు కర్కటకరాశి ప్రవేశించగానే
దక్షిణాయనము; మకరరాశిలో ప్రవేశింపగానే ఉత్తరాయణము.
8
మన సంవత్సరంలో షడృతువులన్నవి - అని వరుసగా వసంతము, గ్రీష్మము, వర్షము, శరత్తు, హేమంతము, శిశిరము. దీనిని బట్టి ఋత్వాది వసంతమని మనకు అర్థమౌతున్నది. 'నూరు సంవత్సరాలు నన్ను బ్రతకనీ' అనటానికి 'నూరు హేమంతాల ఆయువీయి' అన్న అర్థాన్నిచ్చే మంత్రాలు కనిపిస్తున్నవి. అంటే ఒకానొక కాలంలో హేమంతము మొదటి ఋతువన్న మాట! వైదిక వాఙ్మయంలో ఋతువులకు సూర్యుడు కారకుడనీ, అవి మూడు, అయిదు, ఆరు, ఏడు, అనీ నిదర్శనాలు కనిపిస్తున్నవి.18 శతపథ బ్రాహ్మణాన్ని బట్టి ఋతువు లారని తెలుస్తున్నది. వసంత ఋతువున మధుమాధవ మాసములు, గ్రీష్మంలో శుక్ర శుచి మాసాలు. వర్షర్తువులో నభోనభస్య మాసాలు, శరత్తులో ఇషోర్ణములు, హేమంతంలో సహస్సహస్య మాసాలు, శిశిరంలో తపస్తపస్య మాసాలు ఉన్నవి. ఈ ఋతుమాసాలు వ్యవహారంలోకి రాక పూర్వం ద్వాదశాదిత్యుల పేర్లు పుట్టి ఉంటవి. దీనికి కారణం ఆయన గతి తిన్నగా తెలియక పోవటమే. ద్వాదశాదిత్యులు వసంతంలో ధాత అర్యములు. గ్రీష్మంలో మిత్రావరుణులు, వర్ష ఋతువులో ఇంద్ర వివస్వతులు, వర్షర్తువున పర్జన్య - పూషులు.
హేమంతంలో అంశు భగులు, శిశిరంలో త్వష్టృ - విషులు19. వసంత గ్రీష్మ
వర్షాలు మూడు దేవ ఋతువులనీ, శరద్ధేమంత శిశిరాలు మూడు పితృఋతువులనీ
శతపథ బ్రాహ్మణము.
-
సంవత్సరము ఒక పిట్ట. వసంతం దాని తల. గ్రీష్మం కుడి రెక్క శరత్తు
ఎడమ రెక్క వర్షము తోక' అని ఒక బ్రాహ్మణంలో ఋతువు స్వరూపం నిరూపించి
ఉంది. దీన్నిబట్టి ఒకానొక కాలంలో వసంతం ఋత్వాదిగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది.
వాసంత విషువము (Vernal Equinox - షుమారు మార్చి 21) మొదలు ఆరు నెలలు
ఉత్తరాయణము. శారద విషువము షుమారు సెప్టెంబరు 21 మొదలు ఆరునెలలు
దక్షిణాయనము. తరువాత కాలక్రమాన ఇది మారి ఉత్తరాయణము దక్షణాయనాంత
దినము (Winter Solstice డిసెంబరు 21) నుండి ప్రారంభించింది. మరి కొంత
కాలానికి తిరిగి వాసంత విషువద్దినం నుంచి సంవత్సరము ఆరంభమైంది. మహాకవి
కాళిదాసునాడు చాంద్ర ఆషాఢ శుక్ల ప్రతిపత్తునాడు దక్షిణాయనారంభము. సౌర
మాఘంలో ఉత్తరాయణము. పురాణాలలో, సాహిత్య గ్రంథాలలో చైత్ర వైశాఖాలు
వసంత ఋతువని కనిపిస్తున్నది. తరువాత వచ్చిన జ్యోతిష సిద్ధాంతులు ఫాల్గున
చైత్రాలు వసంత ఋతువని నిర్ణయించారు. ఇప్పటికీ ఉత్తర దేశంలో 'ఫాల్గున చైత్రాలే
వసంతము. తైత్తిరీయ సంహితాకాలంలో వసంతము ఋతుముఖము. అప్పుడు
సంవత్సరాది ఫాల్గున పూర్ణిమ. శిశిరము ఋతుముఖంగా కొంతకాలం ఉంది. వరాహ
మిహిరుడు ఫాల్గునంలో సంవత్సరారంభం చేశాడు. భాస్కరుడు (క్రీ.శ. 1150) మరల
వసంతము ఋతుముఖంగా పేర్కొన్నాడు.
9
మన సంవత్సరానికి పన్నెండు మాసాలు. 'మస్యతే పరిమియతే నేతి మాసః
మసీ పరిమాణే' దీనిచేత కాల పరిమాణం చేయబడుతున్నది కనుక ఇది
మాసమైంది.20 పున్నమినాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో దాన్ని బట్టి చైత్రాదిమాస నామాలు కలిగినవి. చైత్రమాసంలో పూర్ణిమనాడు 'చిత్ర'లో ఉంటాడు.
ఇలాగే వైశాఖంలో విశాఖలో.
రాశిచక్రంలో చంద్రగమనాన్ని బట్టి చైత్రాది మాసాలు ఏర్పడుతున్నవి. చంద్రుని
గమనం వల్లనే భారతీయులకు నక్షత్రాలు తోచినవి. నక్షత్రాలను ఆధారం చేసుకొని
మొదట చంద్రగమనాన్ని, తరువాత సూర్యగ్రహ గమనాలనూ నిర్ణయించారు. నక్షత్రాలు
ఆకాశంలో ప్రయాణం చేసే దేవయాత్రికులకు మైలురాళ్ళ వంటివని భారతీయులే
నాడో గుర్తించారు. సూర్యుని గమనం గాని, ఇతర గ్రహాల గమనం గాని చంద్రుని
గమనానికి భిన్నం కాకపోవటం వల్ల 27 నక్షత్రాలను 12 రాసుల క్రింద
విభజంచారు.21 నక్షత్రం ఒకటి నాలుగు పాదాల చొప్పున 27 × 4 = 108 పాదాలను
పన్నెండు రాసులు క్రింద సర్ది, సూర్యుడు నెలకు 9 పాదాలు గమిస్తాడని మనవారు
నిర్ణయించారు. చైత్రాది మాస నామాలు పుట్టక పూర్వం, మధు మాధవాది మాస
నామాలు సూర్యునిబట్టే వ్యవహారంలో ఉండేవి. రాశిచక్రంలో సూర్యగమనాన్ని బట్టి
మేష, వృషభాది మాసాలు వచ్చినవి. ఇవి చైత్ర వైశాఖాది మాసాలకు తరువాత
పర్యాయపదాలైనవి. కవితా స్వభావం గల భారతీయ దైవజ్ఞులు వీటిని (సౌర
మాసాలను) చంద్రుని సంతానమని వ్యవహరించారు. 22
10
భారతీయుల రాశి చక్రంలో 27 నక్షత్రాలున్నవి. ప్రతి నక్షత్రంలో ఒకటి,
రెండు, మూడు లేక అంతకంటే మించి చుక్కల గుంపులు ఉంటవి. ప్రతి నక్షత్రంలోనూ
కాంతిమంతమైన చుక్క ఒక్కటి ఉంటుంది. దాన్ని మనవారు 'యోగతార' అని
వ్యవహరించారు. ఇవి క్రాంతి వృత్తానికి మధ్యమార్గంలో ఉండటం వల్ల చంద్రునితో
కూడడానికి, గ్రహాలతో యోగం పొందడానికి వీలవుతుంది.
వైదిక సాహిత్య కాలంనాడే ఆర్యులకు 27 నక్షత్రాలు తెలుసు. మొదట చంద్రుడు
దినానికి ఒక నక్షత్రంతో ఉన్నట్లు భావించి, చాంద్రమాసానికి 28 దినాలు మించి
ఉండడం వల్ల 28వ నక్షత్రం కూడా కల్పన చేశారు. దీని పేరు అభిజిత్తు (Vega
Alfra Lyra) దీనిని తైత్తిరీయ బ్రాహ్మణకాలంలోనే గుర్తించారు. మహాభారత
వనపర్వంలో (23) రోహిణిమీద అభిజిత్తుకు ఈర్ష్య కలిగి సహించలేక తపోవనాలకు
వెళ్లిపోయినట్లున్న కథ దీనికి సంబంధించిందే. ఈ అభిజిత్తు ఉత్తరాషాఢ శ్రవణాలకు
మధ్య ఉండేది. అభిజిత్తు తపోవనానికి వెళ్ళిన తరువాత ఇంద్రుడు కాలాన్ని
గుర్తించలేకపోతే, బ్రహ్మ స్కందుడు దాన్ని ధనిష్ఠ నుంచి గుర్తించారట. 23 తరువాత కృత్తిక నక్షత్రాదిగ ఉంది. యజుర్వేదంలో వేదాంగ జ్యోతిషంలో నక్షత్రపు పట్టిక
కృత్తికతో ఆరంభిస్తుంది. ఈ పట్టిక క్రీ.శ. 1వ శతాబ్ది వరకూ ఇలానే ఉంది. తరువాతి
నక్షత్రాలు అశ్వనితో ప్రారంభించినవి.
ఉత్తర దిక్కున ఉన్న ధ్రువుని క్రీ.పూ. 2780లోనే భారతీయులు ఎరుగుదురని
జాకోబీ. అటువంటి భారతీయులు రాశి చక్రాన్ని గ్రీకుల దగ్గరనుంచీ గ్రహించారనటం
అసమంజసము. సర్ విలియం జోన్సు వేదకాలంనాడే భారతీయులకు రాసులు
తెలుసునని చెబుతున్నాడు. ప్రాచీన పంచాంగాలనూ, రాసులను పరిశోధించిన ప్లంకెట్
ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాడు.
24
11
మన మాసానికి రెండు పక్షాలున్నవి. ఒకటి శుక్ల పక్షము; రెండు కృష్ణ పక్షము.
మాసానికి 15 దినాలు. కృష్ణ పక్షము అమావాస్యతో అంతం పొందుతుంది. 'అమా
సహతిష్ఠతః రవి చంద్రావస్యా మిత్యమావాస్య' అమా = కూడ, వాస్యా = వసించుట
సూర్యచంద్రులు కూడి ఉండేది కనుక, అమావాస్యనాడు సూర్యచంద్రుల మధ్య
అంతరం శూన్యం. ఆ నాటినుంచీ సూర్యచంద్రులిద్దరూ ఎవరి దారిన వారు
వెళ్ళుతుంటారు. వారికి పన్నెండు డిగ్రీల ఎడము ఉన్నపుడు పాడ్యమి పూర్తి ఔతుంది.
విదియకు 240 డిగ్రీల ఎడము. పున్నమినాటికి 1600 ఎడము. 3600 డిగ్రీల
ఎడముంటే అమావాస్య.
పూర్వ పక్షాలు కృష్ణపక్షంతో కొంతకాలం మొదలు పెట్టినట్లు నిదర్శనాలు
కనిపిస్తున్నవి. మహాభారతము వన పర్వంలో (161 అధ్యాయము) కుబేర యుధిష్ఠిర
సంవాదంలో "మొదటిదైన కృష్ణపక్షంలో నీవు భయదుఃఖరహితంగా ఉండు" అన్న
వాక్యం కనిపిస్తున్నది. 'పూర్ణమాసి' శబ్దం వల్ల ఒకానొక కాలంలో శుక్లపక్షం నుంచి
మాసారంభం కనిపిస్తున్నది. దీనినిబట్టి ఒక కాలంలో శుక్ల పక్షం నుంచి మాసారంభం
అయ్యేదనీ, ఋతువులలో ఆయన చలనాల వల్ల కలిగిన మార్పులు కారణంగా
అమావాస్య నుంచీ మాసం ఆరంభించిందనీ, తిరిగీ శుక్లపక్షమే పక్షద్వయారంభ
మైందనీ మనం నిర్ణయించవచ్చు. ఈ విషయాన్ని గురించి సి.వి. వైద్య ఇలా అన్నారు.
"The fact is clear that at the begining of the Epic Period the practice of
counting the month from the dark fortnight has prevailed as in other Ary an
countries. But towards the end of the Epic period the country practice was certainly in Vogue. The other practice again came into use after this, perhaps
being copied from the Greeks, to suit the shifting back in seasons as measured
by the old months which had happened by the time, a reform perhaps
introduced by King Vikramaditya like similar reforms in calenders introduced
by many Kings in the West."
(Ep. India P. 317)
సిద్ధాంత గ్రంథాలు శుక్లపక్షాన్నే ప్రథమ పక్షంగా చెబుతున్నప్పటికీ, ఉత్తర
భారతంలో ఈ నాడు కూడా మాసం కృష్ణ పక్షంతో ఆరంభిస్తున్నది.
12
సూర్య చంద్రుల మధ్య ఎడమున్న పన్నెండు అమావాస్యలు కల పన్నెండు చాంద్రమాసాలు ఒక చాంద్ర సంవత్సరము. దీనికి దినాలు 354 మాత్రము. తిథులు 360. రవిచంద్రుల గమనం వేసవిలో వడిగా ఉంటుంది. శీతకాలంలో మెల్లగా ఉంటుంది. దీర్ఘాహము ఘ 65-16; హ్రస్వాహము 53-56. ఇందువల్ల 360 తిథులను సరిపెట్టుకోవలసి వచ్చింది.25 " చాంద్రమాసాదులలో 7 వృద్ధితిథులు, 13 క్షీణ తిథులు వస్తున్నవి.
చాంద్ర సౌరమాసాలను సరిపెట్టటానికి అధికమాసాన్ని చేర్చటం ఋగ్వేద కాలంనుంచీ కనిపిస్తున్నది. అప్పుడు ఎలా సరిపెట్టేవారో చెప్పలేము. రెంటికీ మధ్య ఉన్న తేడా సవరించడానికి మనవారు మూడు సంవత్సరాల్లో ఒక అధికమాసం గాని, లేదా అయిదు సంవత్సరాల్లో ఒక అధికమాసం గాని చేరుస్తారు. పందొమ్మిది సంవత్సరాలలో ఏడు అధికమాసాలు వస్తవి. దిద్దుబాట్లు విశేషంగా వచ్చినప్పుడు ఒక మాసాన్ని తగ్గించవలసి వస్తుంది. క్రీ.శ. 1826లో ఇలా తగ్గించిన ఒక లుప్తమాసం వచ్చింది. క్రీ.శ. 1963, 1964 లోగా మరొక లుప్తమాసం వస్తుంది.
13
నేడు ఆంధ్రదేశంలో ఆదిత్య సోమాది వారాలు వ్యవహారంలో ఉన్నవి. ఇవి నేటి రూపంలో ఇతిహాసకాలంలో లేవని ఒక అభిప్రాయం ఉంది.26 ఇవి అవైజ్ఞానికాలనీ, వీనివల్ల జ్యోతిష్య శాస్త్రంలో తప్ప ప్రయోజనం లేదనీ, మరిచిపోతే వీటిని ఉద్ధరించటానికి మార్గం లేదనీ మరొక అభిప్రాయం.27 వారంలోని దినాలకు 'శక' మనీ, తత్సంబంధమైన జ్ఞానాన్ని మనవారు శకజ్ఞాన మన్నారనీ, ఋగ్వేదంలోని మం 1 అను 22 సూక్తం 80, మంత్రం 48 వారాన్ని గురించి చెబుతున్నదనీ, దీనిని భారతీయులు గ్రీకుల దగ్గరనుంచి గ్రహించలేదనీ మరొకమతం.29 " తైత్తిరీ యారణ్యకంలోని ప్రశ్న 1 అనువాకం 3. పంచతి 1 ఏడుదినాలు గల వారాన్ని సూచిస్తున్నదని రెండవ మతం. ఋగ్వేద సంహితలోనూ, తైత్తిరీయారణ్యకంలోనూ పేర్కొనబడ్డ వారాలనే తరువాతి కాలంలో సిద్ధాంతులు విపులీకరించి ఉంటారు. వారం ఇంచుమించు పక్షములో సగభాగము. సూర్యుడు ఉదయం ఏ గ్రహపరిధిలో ఉదయిస్తాడో ఆ దినానికి ఆ గ్రహనామాన్ని బట్టి పేరు వచ్చింది. సోమవారం నాడు సూర్యుడు చంద్రుని పరిధిలో ఉదయిస్తానడన్న మాట. ఇదే రీతిగా మంగళవారం నాడు కుజపరిధిలో. కౌటిల్యుని అర్థశాస్త్రంలో సప్తవార విభాగం లేదు, పంచవార విభాగం ఉంది. అమర సింహుడు వారనామాలను పేర్కొనలేదు. సప్త సంఖ్యతో మాసం గాని, సంవత్సరం గాని సమానంగా విభజితం కావడం లేదు. అయితే పంచాంగాలలో వారం ఒకటి నిత్యోపయోగంలో ఉంది.
14
నెలకు ముప్పది దినాలని మనం వ్యవహరిస్తున్నాము. అనేక విధాలైన దినాలు నేడు కనిపిస్తున్నవి. ఒక నక్షత్రం ధ్రువం చుట్టూ ఒకసారి తిరగటానికి పట్టే కాలము 23 గంటల 56 ని. 40.9 సెకండ్లు. దీనికి నక్షత్ర దినమని పేరు. ప్రాచీనులు నక్షత్ర దినానికి అరవై నాడులున్నవన్నారు. ప్రతి నాడికి అరవై వినాడులు. ప్రతి వినాడికీ ఆరు ప్రాణాలు. ప్రతి ప్రాణికీ పది గుర్వక్షరాలు. గుర్వక్షరం ప్రతిదానికీ నాలుగక్షరాలు. ఈ దిన విభాగం అతి ప్రాచీనమైంది. "గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేక పదీ ద్విపదీ సాచతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషి. సహస్రాక్షరా పరమేవ్యోమమ్." ఈ మంత్రంలో పైన పేర్కొన్న దిన ప్రయాణం నిబద్ధమై ఉందట. 1x2x4×8 × 9× 1000 = 864000 అక్షరాలు. మన పూర్వులు దిన ప్రమాణాన్ని కొలవటానికి అక్షరాన్ని (శబ్దాన్ని) ఆధారం చేసుకున్నారు. ఋగ్వేదంలో ఉన్న మొత్తం అక్షరాలు ఒక సౌర సంవత్సరానికి ఎన్ని అక్షరాలు ఉన్నవో అన్నేనట. అంటే 864000. ఈ విషయాన్ని గురించి ఒక అభిజ్ఞుడు 'ఆరు గడియారము' వలె మన పూర్వులు ఋగ్వేదాన్ని ఉపయోగించారు. పై గడియారము ఒక సెకండు కాలాన్ని, అంటే సౌరదినంలోని 864000 భాగాన్ని మాత్రం కొలవగలుగుతుంది. దీనిని బట్టి ప్రాచీనులకు నిష్కర్షగల ఒక కాలమాపక మున్నదని అర్థమౌతుంది' అని వ్రాసినాడు.
30 15
భాస్కరాచార్యులు (క్రీ.శ. 1150) దినాన్ని త్రుటుల లెక్కలో చెప్పి, దినానికి
2,91,60,00,000 త్రుటులున్నవన్నాడు. అంటే 27x25x43,20,000
చతుర్యుగాలను సంవత్సరాలుగా మారిస్తే ఎన్ని భాగాలు వస్తవో, దినాన్ని భాగాలుగా
మారిస్తే అన్ని త్రుటులు వస్తవన్నమాట.
ఒక మధ్యాహ్నం నుంచి మరొక మధ్యాహ్నానికి సూర్యుడు రావటానికి పట్టే
కాలాన్ని సౌరదినమని వ్యవహరిస్తున్నాము. ఈ సౌరదిన పరిమాణం ఋతువులతో
బాటు మారుతూ ఉంటుంది. దీర్ఘమైన ప్రొద్దున్న దినానికీ, పొట్టి ప్రొద్దు ఉన్న దినానికీ
మధ్య తేడా 51 సెకండ్లు. దినానికి ఆరంభం లంకిలో ఉయమని ఆర్యభటుడు,
వరాహ మిహిరుడు అర్ధరాత్రం నుంచి అర్ధరాత్రానికి దినమని చెప్పాడు. 'ఉదయా
దుదయం వారః' అన్న ప్రమాణాన్ని అనుసరించి మనం నిత్య వ్యవహారంలో
ఉదయంతోనే దినం ఆరంభించినట్లు లెక్కిస్తున్నాము.
దినంలో (పగటిలో) ప్రాహము, మధ్యాహ్నము, అపరాహము, సాయాహము'
అని నాలుగు రీతులు ఒకచోట, ఉష, మధ్యాహ్నము, అపరాహము, సాయాహము,
సంగవము (పాలు పితుకు కాలము) అని ఒకచోట అయిదు రీతుల కన్పిస్తున్నది.
బౌద్ధుల పద్ధతిని బట్టి రాత్రి త్రియామ, యామానికి నాలుగు గంటలు. బౌద్ధేతరులు
రాత్రిని, పగలును కూడా నాల్గు యామాల క్రింద విభజించి వ్యవహరించినట్లు యువాన్
చ్వాంగ్ చెప్పినాడు (యువాన్ చ్యాంగ్ పుట 143)
16
ప్రాచీన కాలంలో దినప్రమాణాన్ని, సహగమన విశేషాలనూ క్రమంగా
నిరూపించుకొని వ్యవహరించుకోటానికి కొన్ని యంత్రా లుపయోగించారు.
ఋగ్వేదంలో తురీయమనే యంత్రం కనిపిస్తున్నది.
దీనిని భాస్కరాచార్యులవారు 'దళీకృతం చక్రముశంత చాపం కోదండ ఖండం
ఖలు తుర్యగోళం' (సిద్ధాంత శిరోమణి -10-15) అని వర్ణించారు. ఒక గ్రహాన్ని
గాని, నక్షత్రాన్ని గాని, సూర్య చంద్ర బింబాన్ని గాని మనం చూస్తున్నప్పుడు అది
దిక్చక్రం మీద ఎన్నో భాగ (డిగ్రీ) ఎత్తున ఉన్నదీ దాని సహాయంతో మనవారు
చూచేవారు.31 వృత్తాంత పరిమాణాన్ని, కాల పరిమాణాన్నీ కనుక్కోవటానికి పూర్వులు
రెండు యంత్రాలను ఉపయోగించారు. శంకువు పగటివేళ పనిచేస్తుంది. రాత్రికి
కపాల యంత్రాన్ని కనిపెట్టారు. రాశిచక్రం వచ్చిన తరువాత సూర్య ఘటికాయంత్రం వచ్చింది. దీనికి 12 ముళ్ళు ఉంటవి. పగటిని తెలియజేస్తుంది. తరువాతి కాలంలో
జలఘటికాయంత్రాలు వచ్చినవి.
పూర్వం మఠాలలో, సంఘారామాలలో ఇవి ఉండేవి. మోఖరీ మైత్రికుల కాలంతో
క్రీ.శ. 5వ శతాబ్ది మొదలు ఏడవ శతాబ్దం వరకూ ఉత్తరదేశంలోనూ, తరువాత
బహుకాలం వరకూ దక్షిణాదేశంలోనూ ఇవి ఉన్నవి. 32 వీటిని సంఘారామాలలో
కుర్రవాళ్ళ చేత పట్టించి వాళ్ళు వచ్చి కాలాన్ని చెప్పుతుంటే ఘటికాస్థానంలో గంటలు
కొట్టేవారు. మన పిల్లలమర్రి పినవీరన పీఠికలలో "చిడిముడి జాహ్నవీతటిని
శీకరపోతముజూచి యెవ్వరీ కొడిమలుగట్టి పెండ్లికొడుకున్ గడియారము మోపజేసి
రంచడుగ”లో సూచించింది ఈ విషయమే. మధ్యాహ్నాన్ని, కుతపకాలాన్నీ
తెలుసుకోటానికి షష్ఠి యంత్రాన్ని ఉపయోగించేవారు. పెద్దన్నగారు ప్రవరాఖ్యుని
ఇంటికి యోగిని కుతప కాలంలో తీసుకొని వచ్చారు. బహుశః రాయల కాలంలో
(క్రీ.శ. 15 శతాబ్ది పూర్వభాగం) ఆంధ్రదేశంలో ఇవి ఉపయోగంలో ఉండి ఉండాలి.
గణిత శాస్త్రసహాయంతోనూ, యంత్రసహాయంతోనూ మన పూర్వులు పరిపూర్ణ
కాలవిజ్ఞానం కలిగి వ్యవహరించారనటం నిస్సంశయము. వారి అనంత కాలవిజ్ఞానం
వేదకాలం నుంచీ అవ్యవచ్ఛిన్నంగా వస్తున్నది. ఇటువంటి వారు ఇతరుల దగ్గర
నుంచి జ్యోతిష విజ్ఞానాన్ని గ్రహించారని పాశ్చాత్యులు కొందరు వ్రాస్తే వ్రాసి ఉండవచ్చు
గాని, దానిని మనవారు కూడా కొందఱు నమ్మటం శోచనీయం. పాశ్చాత్యులలో
బుద్ధిమంతులు కొందరు సత్యప్రియులై, 'ఈ నాడు నూతనంగా కనిపెట్టబడ్డవని'
చెప్పుకునే యురేనస్, నెప్టూన్ గ్రహాలు కూడా మన భారతీయులకు తెలుసునని
అంగీకరిస్తున్నారు.34
17
ప్రాచీన శాసనాలను చూస్తే క్రింది విశేషాంశాలు సంవత్సరానికి సంబంధించి కన్పిస్తున్నవి. ఒక కుషాణ రాజు తక్షశిల శాసనంలో (క్రీ.శ. 79) 'అషాఢస్య మాసస్య దివసే పంచదశే' అని మాస నామం కనిపిస్తున్నది. (Ep. hd. XIV. P125) 'మహారాజస్య కనిష్కస్య రాజ్యతృతీయే హేమంతమాసే తృతీయే పూర్ణిమాంతమాఘే' (37-39 Selective Inscriptions - D.C. Circar) శాతవాహన రాజుల కాలంలో గాని, ఇక్ష్వాకు రాజుల కాలంలో గాని శాసనాలలో మాసనామం కన్పించడం లేదు. కృష్ణ పక్షంతో నాలుగు మాసాలు గల మూడు ఋతువులు ఆరంభిస్తున్నట్లు నిదర్శనాలున్నవి. వాశిష్ఠీ పుత్ర పులోమావి కార్లే శాసనాలలో 'గ్రీష్మ పక్షే పంచమే దివసే ప్రథమే' : జ్యేష్ఠ కృష్ణ ప్రథమ (క్రీ.శ. 137) అనీ, 35 'హేమంత పక్షే తృతీయే దివసే ద్వితీయే : పుష్య
బహుళ ద్వితీయ (క్రీ.శ. 154) అనీ,36 " వీరపురుషదత్తుని (ఇక్ష్వాకువంశపు రాజు) నాగార్జునకొండ శాసనంలో 'హేమంతః పక్షః షష్టః దివసః త్రయోదశః : మాఘ శుద్ధ త్రయోదశి' అనీ " కనిపిస్తున్నది. పల్లవులలో తరువాతి రాజుల కాలంలో మాస నామాలు కన్పిస్తున్నవి.37 శకవర్ష ప్రశంస కన్పిస్తున్నది. కుమారవిష్ణు చందలూరు, ఉరవవల్లి శాసనాలు ఇందుకు నిదర్శనము.38,39 రాజరాజ నరేంద్రుని వంశస్థుల శాసనాలలో సింహమాసము, 40 తులామాసము "" అనే వ్యవహారం ఉంది. ఇలాగే ఉత్తర దక్షిణ భారతదేశంలోని శాసనాలను పరిశీలిస్తే సంవత్సరానికి సంబంధించి విశేషాలెన్నో బయల్పడతవి. 42
18
“అబ్దాదౌ బంధుసంయుక్తో మంగళ స్నాన మాచరేత్
వస్త్రైరాభరణై దేహ మలంకృత్య తత శుచిః ।
విఘ్నేశం భారతీం ఖేటాన్ దైవజ్ఞ మభిపూజ్యచ,
సంవత్సర ఫలం సమ్యక్రుత్వా విప్రాన్ సమర్చయేత్. ||"
అనాదినుంచి సంవత్సరాది ఒకే నియతమైన ఋతువులో గాని, మాసంలోగాని,
పక్షంలోగాని రావటం జరగలేదు. అనేకరీతుల మారుతూ వచ్చిందని మనం
గమనించాము. అందువల్ల పూర్వకాలంలో సంవత్సరాది ఆచారాలు విస్పష్టంగా ఇలా
ఉన్నవని చెప్పటం కష్టం. అయితే మొట్టమొదటి సంవత్సరాది నాడే యజ్ఞం
ప్రారంభమయ్యేది. సంవత్సర కాలం అది జరుగుతూ ఉండేది. నేడు మనం
ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలాలలోనూ, నక్షత్ర దర్శన సమయాలలోనూ చేసే
కార్యకలాపాలన్నీ ఆయా కాలాలతో సంవత్సరం ఆరంభించినప్పుడు సంవత్సరాది
కృత్యాలుగా ఉన్నవని ఊహించవచ్చు.
నేడు సంవత్సరాది చైత్రశుద్ధ ప్రథమ. ఇప్పుడు నింబకుసుమ భక్షణం, పంచాంగ
శ్రవణం తప్ప విశేషంగా పాటిస్తున్న ఆచారాలు ఆంధ్రదేశంలో ఏమీ లేవు. సంవత్సరాది
నాడు సదాచార సంపన్నుడు అంగుళీస్ఫోటంలో నిద్రలేచి శ్రీమచ్ఛంకర
భగవత్పాదులవారు చెప్పిన
"ప్రాతఃస్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయమ్ ।
యస్తు ప్రజాగరసుషుప్త మతి నిత్యం
తదృహ్మ నిష్కలమహం న చ భూత సంఘః ॥
ప్రాతర్భజామి మనసా వచసా మగమ్యమ్
వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ |
యన్నేతి నేతి వచనైర్నిగమా అవోచమ్
తం దేవ దేవ మజ మచ్యుత మాహురగ్ర్యమ్ ॥
ప్రాతర్న మామి తమసః పరమార్క వర్ణం
పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యమ్ |
యస్మిన్నిదం జగదశేష మశేషమూర్తి
రజ్వాం భుజంగ ఇవ ప్రతిభాసితం పై ॥
అన్న ప్రాతఃస్మరణ శ్లోకాలను పఠిస్తాడు. పైన చెప్పిన శ్లోకాలలోని అర్థాన్నీ
'కాలః కలయతే లోకం
కాలః కలయతే జగత్ |
కాలః కలయతే విశ్వం
తేవ కాలోభిషీయతే ॥
కాలస్య వశిగా స్సర్వే
దేవర్షి సిద్ధ కిన్నరాః |
కాలోహి భగవాన్ దేవ
స్స సాక్షాత్పరమేశ్వరః ॥'
అన్న కాలస్వరూపాన్ని నిరూపించి కాలం పరమాత్మ అనీ, సర్వం కాలాధీనమని
ఊహించి మననం చేసుకుంటాడు. కాల్యకృత్యాలను తీర్చుకొన్న తరువాత
మంగళస్నానం చేసినా, సంకల్పపూర్వకమైన కూపోదక స్నానాన్ని గానీ, నదీ జలోదక
స్నానం గానీ చేసి సంధ్యావందనం పితృతర్పణాదులు పూర్తి చేసి, దేవతలకు పులికాపు
చేసి అసాదించి శర్క రామ్ల ఘృతాదులతో కూడిన నింబ కుసుమ ప్రసాదాన్ని నివేదన
చేసి, సకుటుంబంగా తానూ స్వీకరిస్తాడు. మృష్టాన్న భోజనం చేస్తాడు. సాయంత్రం
పంచాంగ శ్రవణం చేస్తాడు.
ధనికులు కొందరు దైవజ్ఞులను, పండితులను, గురువులనూ ఆహ్వానించి వాళ్ళ
ఇళ్ళల్లోనే సాయంత్రం పంచాంగ శ్రవణం చేస్తారు. వీరికీ, గ్రామ వాసులకూ ఉదయమే
ఇంటి పురోహితులూ, గ్రామ పురోహితులూ వచ్చి నింబకుసుమ ప్రసాదాన్ని ఇచ్చి
వెళ్ళుతారు. ధనికులు నూతన వస్త్రాభరణాలంకరణం చేసుకొని పంచాగ శ్రవణ సమయంలో
రాబొయ్యేది వేసవి గనుక, పాత్రులకు ఛత్రము, తాళవృంతము, పాదుకలు,
వస్త్రాభరణాదులు దానం చేస్తారు. కొందరు సరస్వతీపూజాసమయంలోనూ,
మంటపారాధన సమయంలోనూ 'పంచాంగాలు' పంచి పెట్టుతారు; పేద విద్యార్థులకు
ఇతర పుస్తక దానం కూడా చేయటం కద్దు.
గ్రామాల్లో జనం ఉదయం మంగళస్నానాలు చేసి, ఆమ్రతోరణాలతో
గృహద్వారాలను అలంకరించి, నూతన వస్త్రాభరణాలతో అలంకరించుకుంటారు.
పురోహితుడు వచ్చి యింటింటికి తిరిగి ప్రసాదమిచ్చి వాయనాలు పుచ్చుకొని వెళు
తాడు. సామాన్య ప్రజలు 'సంకులమ్మ' మొదలైన గ్రామ దేవతల దగ్గరకు 'చిందు
నృత్యం' చేసుకుంటూ మంగళవాద్యాలతో వెళ్ళి వచ్చి, తృప్తిగా భోజనం చేసి
సాయంకాలం దేవాలయంలోని మండపం దగ్గరికి పంచాంగ శ్రవణం కోసం చేరుతారు.
మంటపం దగ్గిర సభ ఉత్తర ముఖంగా గాని, తూర్పు ముఖంగా గానీ ఏర్పాటై
ఉంటుంది. పంచాంగ శ్రవణం గణపతి పూజతో ఆరంభిస్తుంది. “గణానాం త్వాం
గణపతిగ్ం హవామ హే కవిం కవీనాముప మశ్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం
బ్రహ్మణ స్పత, అనఃశృణ్వ న్నూతిభిః సీదసాదనమ్” (ఋగ్వే 11.28) అన్న ఋగ్వేద
మంత్రంతో గణపతి పూజ ప్రారంభించినప్పుడు వేదార్థం తెలిసినవారు ఈ
మంత్రంలోని 'ఈ సమస్త దేవతాంగాలకూ, అధిపతివి నీవు, నాయకుడవు,
బుద్ధిమంతులలో బుద్ధిమంతుడవు, ప్రఖ్యాతులో అగ్రగణ్యుడవు, ప్రార్థనలు పూజలు
యజ్ఞాలు మొదలైన సమస్త కర్మలకు నీవే రాజువు ఓ బ్రాహ్మణస్పతీ! యజ్ఞస్థానాన్ని
అలంకరించు' అన్న అర్థాన్ని మననం చేసుకొని గణపతిని పరబ్రహ్మగా భావిస్తారు.
తరువాత సరస్వతీ పూజ. సరస్వతి వాగధిదేవత. సృష్టికి ఆదిశబ్దం. కాలానికి
సంబంధించిన సంవత్సరాదినాడు సరస్వతీపూజ ఎంతో సముచితమైంది. ఈ
సరస్వతీపూజకు ముందే మంటపారాధన జరుగుతుంది. 'మంటపము' కేవలం
ఖగోళము. వివిధ నక్షత్రాలనూ, గ్రహాలను, ఇంద్రాది లోకపాలకులనూ, తదితర
దేవతలనూ ఇందులో ఆహ్వానించి పూజించటం ఉంటుంది. ఈ పూజాసందర్భాలలో
కాలాన్ని కనుక్కోవటానికి మన పూర్వులు ఉపయోగించిన తురీయ, కపాల, షష్ఠి,
జలఘటికాది యంత్రాలను కూడా పూజించేవారు.
పైన చెప్పిన మంటపారాధాన, సరస్వతీ పూజలు అయిపోయిన తరువాత
పురోహితుడు తప్పుకుంటాడు. దైవజ్ఞుడు గ్రామ పెద్ద ఆహ్వానాన్ని అందుకొని వేదికను
అలంకరిస్తాడు. ఆయనకు చందన చర్చ, వస్త్రాలంకరణం ఇత్యాదులు జరుగుతవి. ఇతడు ద్వేషరహితుడు, నిత్యసంతోషి, గణిత శాస్త్రవేత్త, ముహూర్తగుణ దోషజ్ఞుడు,
వాగ్మి, సూక్ష్మబుద్ధి, నిత్యకర్మలలో ఆసక్తి కలవాడు, అయి ఉండాలెనని శాస్త్రం
చెప్పుతున్నది. దైవజ్ఞుడు పూజలు పొందిన తరువాత ఇష్టదేవతా గురు ప్రార్థనలతో
'పంచాంగ శ్రవణం' ప్రారంభిస్తాడు.
తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో కూడింది పంచాంగము. సంవత్సరాదిని
పంచాంగం విన్న వాళ్ళకు 'క్రతుఫలం' చెప్పి ఉంది. నిత్య నైమిత్తిక కామ్య కర్మల్లో
వేటికైనా భారతీయులకు కాలజ్ఞానం అవసరం. అంతేకాక వర్షాలు, కార్తెలు, ధనధాన్య
సమృద్ధి మొదలైన వాటిలో జ్యోతిష్కులు చెప్పినట్లే జరుగుతూ ఉండటంవల్ల ప్రజలు
అత్యాదరంతో ఈ పంచాంగ శ్రవణం చేస్తారు.
దైవజ్ఞుడు పంచాగ శ్రవణానికి (వినిపించటానికి) ముందు అనంతమైన కాల
స్వరూపాన్ని విశదం చేస్తాడు. ఇది పంచాంగాలకు పీఠికాభాగంలో ఉంటుంది.
సంవత్సరాధిపతులను గురించీ, వారిచ్చే ఫలితాలను గురించీ చెప్పి, తరువాత
ఆదాయకందాయాలనూ, రాజపూజావమానాదులను నిరూపిస్తాడు. పుష్కరాలు గాని,
అర్ధోదయ మహోదయాలు గాని ఉంటే వాటి విశేషాలను నిరూపిస్తాడు. గ్రహణ
విశేషాలను పేర్కొంటాడు. పండితులు వేసే ప్రశ్నలకు సమాధానాలిచ్చిన తర్వాత
దైవజ్ఞుడు తన ప్రసంగాన్ని క్రింది పంచాంగ శ్రవణఫలశ్రుతితో పూజ చేస్తాడు. ప్రజలు
వడపప్పు, పానకాలు పుచ్చుకొని సంవత్సరం విశేషాలను గురించి ముచ్చటించుకుంటూ
ఇళ్ళకు చేరుకుంటారు.
"శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషావహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యత వృణామ్ |
ఆయుర్వృద్ధి ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం
నానా కర్మసుసాధనం సముచితం పంచాంగ మాకర్ణితామ్ ||"
అథఃసూచీపట్టిక
1. "ద్విపరార్థాత్మకః కాలః కథితో యో మయా తవ
తదహస్తస్య మైత్రేయ విష్ణో రీశస్య కథ్యతే” విష్ణు పురాణము 6. అ.గ. 4 అధ్యా. శ్లో. 41
2. "శతం హితస్య వర్షాణాం పరమిత్యభిధీయతే
పంచాశద్భి స్తథా వరైః పరార్థమితి కీర్త్యతే" మార్కండేయ పురాణము 46 అధ్యాయ. శ్లో 42
సంవత్సర ఫలాన్ని వినేటప్పుడు బ్రహ్మజన్మతః వినమని శాస్త్రాలు చెబుతున్నవి.
దైవజ్ఞులు ఆ క్రమాన్నే అనుసరించి పంచాంగ శ్రవణము చేస్తున్నారు. ఈ
కల్పకల్పనము వేదాలలో లేదు గాని, దాన్ని ప్రపంచించటానికి అవసరమైన
బీజాలు కనిపిస్తున్నవి. 1. కల్పము : 14 మన్వంతరములు + 1 కృతయుగము
= 14 (71 మహాయుగములు 1 కృతయుగము) +1 కృతయుగము 1
మహాయుగము 10+ 4,32,000 ఏండ్లు; కృతము × 4 × 4,32,000
సంవత్సరాలు, ఒక మన్వంతరము 810 × 4,32,000 + 4 × 4,32,000
ఏండ్లు కాబట్టి ఒక కల్పము
(14 × 714 + 4) × 4,32,000
మార్చు4,32,00,00,000 ఏండ్లు. 'ఇందులో 714ను గుణకంగా గ్రహించటం వల్ల ఇది కేవల జల్పనం కాదనీ అయనాంశ పరిమాణాన్ని భావగర్భితంగా వ్యాఖ్యానించటమనీ, బ్రేసెండ్ మొదలైన పాశ్చాత్య విద్వాంసులు కూడా అంగీకరించారు'
(భారతి - సర్వధారి, కార్తికము పుట 476)
బ్రహ్మ మాసానికి 30 తిథులు (దినాలు) శ్వేతవరాహము, నీలలోహితము, వామదేవము, రథంతరము, గౌరవ, దేవ, బృహత్, కందర్ప, సత్య, ఈశాన, తమః, సారస్వత, ఉదాన, గారుడ, కౌర్మ, నారసింహ, సమాన, ఆగ్నేయ, సోమమానవ, తత్పురుష, వైకుంఠ, లక్ష్మీ, సావిత్రీ, ఘోర, వరాహ, వైరాజ, గౌరీ మహేశ్వర పితృకల్పములు.
కలియుగం క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 20 తేదీన గం.2 ని. 17 సెకండు 30న ఆరంభమైందని మనవారు సిద్ధాంతీకరించారు. వైవస్వత మన్వంతరానికి ఇంద్రుడు పురందరుడు, ఆదిత్యుడు, మరుత్తులు, అశ్విని, పసుపు, రుద్రుడు ఇత్యాదులు దేవతలు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్నులు సప్తర్షులు. సప్తర్షులు మన్వంతరాన్ని బట్టి మారుతుంటారు. సప్తర్షులను గురించి చూ. భారతి ఈశ్వర చైత్రము; భారతి ఈశ్వర మాఘము; వీరిలో కొందరు ప్రజాపతుల్లో ఉన్నారు. ప్రజాపతులు రవిసోమాది గ్రహాలనటానికి చూ. Planets, Prajapatis and plexuses - C. J. Ghatak Astro, Maga... No. 1 pp 70-73
ప్రాచీన ఖగోళము శ్రీ వేలూరి శివరామశాస్త్రి, భారతి - సర్వధారి. పు. 604
గుప్తశకం. క్రీ.శ. 320లో ప్రారంభమైనదని డాక్టరు ఫ్లీట్ (1. A.Val X VIII)
క్రీస్తుశకాన్ని క్రీ. శ. 533లో డయోనిసియస్ ఎక్సిగ్ నస్ అనేవాడు ఏసు కాల్పనిక జన్మతిథినుంచి ఒక అబ్దారంభం చేయాలని నిర్దేశించాడు. క్రీ.శ. 6వ శతాబ్దిలో ఐరోపాలో అన్ని దేశాలవారూ ఈ అబ్దాన్ని అవలంబించారు. 381 8. 9. కృత్తికలో విషువం ఉన్నప్పుడు ఆశ్లేషతో ఉత్తరగతి ధనిష్ఠతో దక్షిణగతి చెల్లేది. ఈ మానము వేదాంగ జ్యోతిష రచనాకాలము క్రీ.శ. 1337 ప్రాంతాన ఆరంభించి ఉంటుందని అభిజ్ఞులు నిర్ణయము. విషువమంటే రాత్రి, పగలు సమానంగా ఉండే కాలము. 'సంవత్సరః ప్రజాపతిః, ప్రజాపతిర్యజ్ఞః' ఐతరేయ బ్రాహ్మణము 11. 17. "The main idea of Yearly sacrifice appears to be a very old one. The Etymology of Ritvij, (Ritu+Yag) is season - Sacrificer. Note the correspondence between the sacrifice and seasons. In 'Samvatstara' 'Vas' is to dwell. It is a cycle of Lewis seasons. The priests were not only sacrificers but time keepers' Lewis. Historical Survey of the Astronamy of the Ancients - 9.19 10. B.GTilak - Orion - P. 31. 11. 'ఏడాది' దేశీపదం. ఏఱు + ఆది : ఏఱు + ఆది - ఆదిగా మారి ఉంటుంది. ఇది వర్షాలు కురిసి ఏఱులు బాగా వచ్చిననాటి వర్షారంభాన్ని సూచిస్తున్నట్లున్నది. ORION P. 32 ప్రాచీన ఖగోళము - కాలము భారతి, సర్వధారి కార్తికము పుట 469 ఐతిరేయ బ్రాహ్మణము 1.7 తైత్తిరీయ సంహిత 1.5.1 12. 13. 14. 15. ORION - P. 205 మహాభారతము ఆదిపర్వము 16. 17. 18. 19. 20. 21. - 61 C.V. Vidya - Epic India P. 311 'ద్వౌ క్వా మాఘాదిమాసౌ ఋతురత్యుతే' అని అమరుడన్నాడు. "ప్రపద్యేతే శ్రవిష్టాదౌ సూర్యా చంద్రమాసా వుదక్ | సార్పార్థ దక్షిణార్కస్తు మాఘ శ్రావణ యాస్సదా ॥” ప్రాచీన ఖగోళము - భారతి సర్వధారి కార్తికము పుట 471 'వసంతో గ్రీహ్మో వర్షాతే దేవా ఋతవః శరద్ధేమంత శిశిరస్తే పితరో' శత. బ్రాహ్మ 11.1.3,1-3 ఆంగ్లభాషలోని మాస్ మంత్ శబ్దాలు కూడా పరిమాణార్థంలోనే వచ్చాయి. Epic India - C.V. Vidya P. 317 'చంద్రమస్' శబ్దంలోంచి 'మాస' శబ్దం విడిపడ్డది. కొన్ని ఋగ్వేద మంత్రాలలో 'సూర్యమాసా' అన్నచోట 'మాస' శబ్దానికి చంద్రుడనే అర్థం. - రాశుల స్వరూప విశేషాలకు శ్రీ గొబ్బుటూరి వేంకటానంద రాఘవరావు 'రాసుల ప్రశంస' భారతి పార్థివ మాఘము, పుటలు 149-160 382 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/383