వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/శ్రీ వేదవ్యాస

శ్రీ వేదవ్యాస “నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే! ఫుల్లారవిందాయతపత్రనేత్ర! | యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ||"

వ్యాస భగవానుడు భారతీయ జ్ఞానజ్యోతి. అతడు సమస్త విద్యాసాగరాలను ఆపోశన పట్టిన అగస్త్యుడు. విశాల భారతాన్ని ప్రప్రథమంలో వీక్షించిన దార్శనికుడు. జాతి కంతటికీ ఏకైక సాంస్కృతిక శక్తిని ప్రసాదించిన గురుదేవుడు. వేదవిభాగం చేసి, అష్టాదశ పురాణములను నిర్మించి 'పంచమ వేదమై పరగిన భారత సంహితను సృజించిన మహిమోపేతుడు వ్యాసుడు.

వ్యాసుడు : బిరుదము

"విద్యాస వేదాన్ యస్మాత్, వివ్యాస ఏకం వేదం చతుర్థా" అనే వ్యుత్పత్తులలో దేన్ని గ్రహించినా 'వ్యా' శబ్దం ఈ మహానుభావుడికి వేదవిభాగం (విస్తరణం) వల్ల కలిగిందని తెలుస్తుంది. వేదంలో యజ్ఞ యాగాది క్రతువులకు సంబంధించిన విధ్యర్థవాదక మంత్రాలను విస్తరించటం వల్ల ఆయనకు వ్యాసబిరుదం వచ్చిందని భారతీయ చారిత్రకు లందరూ అంగీకరిస్తున్నారు. యజ్ఞాన్ని నడిపించేవారు హోత, అధ్వర్యువు, ఉద్గాత, బ్రహ్మలు. వీరు యజ్ఞం చేయవలసిన సందర్భాలలోనూ, చేయించవలసిన సమయాలలోనూ చెప్ప వలసిన మంత్రాదులను ప్రత్యేకంగా అనేకమంది మహర్షులు 'వ్యాసునికి' పూర్వమే చేసినట్లు అర్థమౌతున్నది. అందువల్ల ప్రధాన వ్యాసుడైన కృష్ణద్వైపాయన వ్యాసుడికి పూర్వం ఇరువది ఆరుగురు వ్యాసులున్నట్లు వాయు పురాణంలోని 23వ అధ్యాయంం వల్ల తెలుస్తున్నది. బ్రహ్మాండ పురాణంలో నూ, మరి యితర పురాణాలలోనూ శక్తి పరాశరాదులు వ్యాసులని ఉంది. వాయుపురాణంలో ఒక వ్యాసుడు భరద్వాజుడు. ఇదేవిధంగా సామవేదాచార్యు డనిపించుకున్న ద్వైపాయనుడికి కొంతగా పూర్వులూ, పూర్వ వ్యాసులూ అయిన కుధుమి, హిరణ్యనాభ, కౌసల్య, లౌగాక్షులు పురాణాదులవల్ల వ్యక్తులౌతున్నారు. వ్యాసుడు : పాశ్చాత్య విమర్శ

పురాణాలలో కనిపించే ఇరువది ఆర్గురి లెక్కను జూచి, వ్యాసనామం మీద చెల్లుబడి ఔతున్న బహుళ గ్రంథజాలాన్ని జూచి ఇతమిత్థమని నిర్ణయించలేక, సంస్కృత వాఙ్మయ పరిశోధన చేసిన పాశ్చాత్య రచయితలు కొందరు వ్యాసుణ్ణి చరిత్రాత్మక వ్యక్తిగా పరిగణించలేదు. హాప్కిన్సు "ది గ్రేట్ ఎపిక్ ఆఫ్ ఇండియా" అనే గ్రంథంలో "In other words there was no one author of the Great Epic, though with not an uncommon confusion of the editor with the author, an author was recognised, called Vyasa. Modern authorship calls him the unknown, Vyasa for convenience, but this Vyasa is a very shadowy person. In fact his name probably covers a guild of revisers and retellers of the tale" అని వ్యాస భగవానుణ్ణి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినాడు. కీత్, మేగ్డానెల్ వంటి పాశ్చాత్య పండితులు స్వల్ప భేదాలతో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.

ప్రాచ్యుల అభిప్రాయాలు

కాని చారిత్రక రంగంలో భారతీయులు ప్రవేశించిన తరువాత ఆ అభిప్రాయాలు పరాస్తాలైపోయినవి. భారతజాత్యుద్ధరణ కోసం, ధర్మసమైక్యత కోసం వ్యాస భగవానుడు భారత భూమిలో అవతరించి, శిష్యుల మూలంగా ధర్మస్థాపన చేసిన చారిత్రక వ్యక్తి అని వీరు నిరూపించారు.

మహాభారతములోని శకుంతలోపాఖ్యానంలో దుష్యంతుని కాలంలో కృష్ణద్వైపాయన వ్యాసుడు పదసంహితాసహితంగా అథర్వ వేదాన్ని అధ్యయనం చేసినట్లున్నది. ఆచార్య శంకరులు సూత్ర భాష్యంలో (3.3.32) "తథాహి అపాంతరతమా నామ వేదాచార్యః పురాణర్షిః విష్ణు నియోగాత్ కలిద్వాపరయోః సంధా కృష్ణ ద్వైపాయనః సంబభూవ - ఇతిస్మరంతి” ఇతిస్మరంతి" - అని ప్రవచించారు. అందువల్ల అపాంతరతముడనే వేదాచార్యుడూ, ప్రాచీన మహర్షీ కలిద్వాపర సంధి సమయంలో కృష్ణద్వైపాయనుడుగా అవతరించాడని ఆచార్య శంకరుల అభిప్రాయము. ఈ అభిప్రాయాన్ని తరువాత కాలంలో పుట్టి అహిర్బుధ్న్య సంహిత (11) అంగీకరించి వాక్పుత్రుడైన వాక్పుత్రుడూ, వాచ్యాయనాపరనాముడూ అయిన అపాంతర తమ మహర్షి ఒకమారు వేదవిభాగం చేసి, విష్ణునియోగం వల్ల తిరిగి వేదవ్యాసుడుగా జన్మించి పునర్విభాగం చేసినాడని పలుకుతున్నది. 356 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 కృష్ణద్వైపాయనుడు - వేదవ్యాసుడు

వైదిక సాహిత్యంలో ఎక్కడా వ్యాసశబ్దం కనిపించదు. తరువాతి కాలములోని తైత్తిరీయారణ్యకంలోనూ, సామవిధాన బ్రాహ్మణంలోని వంగవంశ క్రమంవల్లనూ (Vedic Index II P. 339) కేవల వ్యాసశబ్దమే కాని కృష్ణద్వైపాయన, పారాశర్య శబ్దాలు కనుపించవు. కృష్ణ ద్వైపాయనులు ప్రత్యేక వ్యక్తులని కూడా ఒక అభిప్రాయం చారిత్రకులలో ఉంది. కాని “ఆంధ్ర మహాభారత భగీరథుడు నన్నయ్య భట్టారకుడు కృష్ణ ద్వైపాయన మునివృషభాభిహిత మహాభారత బద్ధనిరూపితార్థ మేర్పడ" రాజరాజు తన్ను భారతాంధ్రీకరణము చేయమని కోరినట్లు వ్రాయటం వల్ల, కృష్ణద్వైపాయనుల నిద్దరినీ ఒక వ్యక్తిగానే స్వీకరించినట్లు కనిపిస్తున్నది. సాత్యవతేయుడే భారత రచయిత అయిన వ్యాసుణ్ణిగా తిక్కయజ్వ భావించి, "సాత్యవతేయ సంస్కృతి శ్రీవిభవాస్పదం బయిన చిత్తముతో” అన్న భారతావతారికతో పలికినాడు. కానీ సాత్యవతేయుడు కౌరవవంశకర్తగాని పంచమ వేదకర్తకాడు. పంచమ వేదకర్త పారాశర్యుడని పార్జిటరు మహాశయుడు అభిప్రాయమిచ్చినాడు. (A.I.H.T.-70) దేశీయ చరిత్రకారుడు భగదత్త వైదిక వాఙ్మయ చరిత్రలో వ్యాసవంశాన్ని సమన్వయం చేయటానికి యత్నించాడు. ఆయన అభిప్రాయాన్ని అనుసరించి "అనాది కాలంలో బ్రహ్మ అనే మహర్షి ఒకడుండేవాడు. ఆయన కుమారుడు వశిష్ఠుడు. వశిష్ఠుని పుత్రుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. అతడు మత్స్యగంధి వల్ల ఒక కానీనుణ్ణి పొందినాడు. అతడే ద్వైపాయనుడు. తల్లి 'కృష్ణ' కాబట్టి అతడు కృష్ణద్వైపాయనుడైనాడు" (పే. 61) కానీ అంత స్వల్పంగా కృష్ణ ద్వైపాయన సాత్యవతేయులను సమన్వయం చేసి ఒకే వ్యక్తి అనటానికి అవకాశం లేదు. పారాశర్యులు నలుగురైదుగురు కనిపించటం వల్ల, వేదవిభాగం చేసిన పారాశర్యుడెవరో ఇంతవరకూ నిశ్చితం కాలేదు. ఇది భావి పరిశోధనలవల్ల నిరూపితమౌతోంది.

వ్యాసుడు - మహాభారతము

కృష్ణ ద్వైపాయనుడు వేదవిభాగం చేసినట్లు సమస్త పురాణాలూ సాక్ష్యమిస్తున్నవి. ఆయన నాలుగు వేదాలనూ నలుగురు శిష్యులకు - సుమంతుడు, పైలుడు, వైశంపాయనుడు, జైమినులకు - ఒప్ప చెప్పినట్లు మహాభారతం వల్ల వ్యక్తమౌతున్నది. (1.6324; XII 342-13025) అతి ప్రాచీనకాలంనుంచీ భారతదేశంలో జనశ్రుతిలో (Tradition) ఉన్న ఉపాఖ్యానాలనూ, ఇతిహాసాలనూ, కథాగాథలను గ్రహించి అష్టాదశ సంస్కృతి 357 పురాణాలను వ్యాసభగవానుడు ప్రవచించాడు. అయినా సమస్త భారత విజ్ఞానాన్నీ ఒకచోట క్రోడీకరించవలసిన అగత్యం కనిపించినది. అప్పుడు 'ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విదులు వేదాంత మనియు, కవివృషభులు మహాకావ్యమని...” ఈ రీతిగా భావనకు యోగ్యమైన భారతాన్ని పలికాడు. భారత రచన పురాణ రచనాంతర మైనట్లు 'అష్టాదశ పురాణాన్ని కృత్వా సత్యవతీ సుతః భారతాఖ్యాన మఖిలం చక్రే తదుపబృంహితమ్' అన్న మహాభారతంలోని (53-70) శ్లోకం వల్ల వ్యక్తమౌతున్నది. ఈ వ్యాసుడు సత్యవతీసుతుడని అంగీకరిస్తే, వ్యాసునకు 1000 సంవత్సరాల వయస్సు ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని ప్రక్షిప్తం క్రింద కొందరు వ్యాసకృతంగా అంగీకరించలేదు.

వ్యాసుడు - గురువు ద్వైపాయనుడు బాల్యంనుంచీ మహావిద్వాంసుడు. అనూచానంగా వస్తూ వున్న ఆచారం ప్రకారం వేదశాస్త్రాలను అధ్యయనం చేశాడు. వైదిక సాహిత్యంలో వ్యాసుడు విష్వక్సేనుని శిష్యుడని కనిపిస్తున్నది. పౌరాణిక వాఙ్మయంలో ఆయన జాతుకర్ణి శిష్యుడు. వాయుపురాణం ప్రథమాధ్యాయంలో
బ్రహ్మ వాయు మహేంద్రోభ్యో నమస్కృత్య సమాహితః | ఋషీణాం చ వరిష్ఠాయ వశిష్ఠాయ మహాత్మనే || వ్యాస శిష్యులు
వ్యాసాశ్రమంలో ఆయన శిష్యులు నలుగురు - సుమంతుడు, వైశంపాయనుడు, పైలుడు, జైమిని, వ్యాసుని పుత్రుడు శుకుడూ ఉండేవాళ్ళు. తండ్రి ఆజ్ఞానుసారంగా శుకుడు సాంఖ్యశాస్త్రం తెలుసుకోటానికి వెళ్ళిపోయినాడు. నలువురు శిష్యుల వేదాధ్యయనమూ పూర్తి అయిన తరువాత వ్యాసభగవానుడు అన్నాడు :
"భవంతో బహుళా సంతు వేదో విస్తార్యతామ్”
- ('మా శిష్యప్రశిష్యుల మూలంగా లోకంలో వేదం బహుముఖాల వ్యాప్తి పొందుగాక!' శిష్యులు శైలకానన ద్వీపాలను లెక్కచేయకుండా వేదవ్యాప్తికి వెళ్ళిపోయినారు. నారదుడు వచ్చి "మీ ఆశ్రమంలో వేదాధ్యయనం వినిపించటం లేదు. మీరు ఏదో ఏకాంతంగా చింతాక్రాంతులైనట్లున్నా” రన్నాడు. ఆయన శిష్యవాత్సల్యం అపారం కావటం వల్ల అలా ఉన్నప్పుడు, మహర్షి నారదుడు శుకునితో కలిసి వేదాధ్యయనం చెయ్యమని చెప్పి వెళ్ళిపోయినాడట! ఆయన ఒక్కొక్క విద్య ఒక శిష్యుని మూలంగా లోకంలో వ్యాప్తి పొందించిన గురుదేవుడు, పరమయోగి, త్రికాలవేదీ. ఈ సమస్తశక్తినీ తపస్సంపన్నతవల్లనే ఆ మహానుభావుడు పొందగలిగాడు. ముందెందరు వ్యాసులో జన్మించినా, వారందరూ చేయలేని పనిని కృష్ణద్వైపాయనుడు ఆ శక్తివల్ల చేయగలిగాడు. అందుకనే అశ్వఘోషుడు బుద్ధచరిత్రలో "వశిష్ఠుడూ, శక్తి ఏ పనైతే చేయలేదో ఆ వంశంలో జన్మించిన వ్యాసుడు దానిని చేశాడు; అతడు సారస్వత వ్యాసుడు" అన్నాడు (బుద్ధ చరిత్ర -48).
వైదిక సాహిత్యంలోనూ, పురాణాలలోనూ కనిపించే ఋషి వంశాల్లో వ్యాస వంశము దొడ్డది. వ్యాసుడు వశిష్ఠునంతటివాడు. ఆయన బ్రహ్మ సూత్ర రచన చేసిన బ్రహ్మజ్ఞాని. భారతీయ విజ్ఞాన గ్రంథకర్త కావటం వల్ల గ్రంథ పీఠం వ్యాస పీఠమైంది. వ్యాసమహర్షి భారత జాతిద్రష్ట, సారస్వతస్రష్ట, దేశంలో ధర్మం లుప్తమైనప్పుడల్లా 'జాగృతి' పొందటానికి దివ్య తేజస్సుతో జయగ్రంథసాగరంలో భాసించే మహోజ్వల మణిదీపం. అది గురుదేవుడు.
ఆయన పూజ గురుపూజ
తన్నప్తే చాతియశసే జాతూ కర్ణ్యాయ చర్షయే వశిష్ఠా యైన శుచయే కృష్ణద్వైపాయ నాయ చః
అని ఒకచోటా, మరొకచోట
"తస్మై భగవతే కృత్వా నమో వ్యాసాయ వేధసే! | పురుషాయ పురాణాయ భృగువాక్య ప్రవర్తినే ॥ మానుషశ్చ... విష్ణవే ప్రభవిష్ణవే జాత మాత్రం చయం వేద ఉపతస్థా ససంగ్రహః ॥ ధర్మమేవ పురస్కృత్య జాతూకర్యాదవాప తమ్ | మతి మంధాన మావిధ్య యేనాసౌ శ్రుతి సాగరాత్ ॥ ప్రకాశో జనితో లోకే మహాభారత చంద్రమాః | నేదద్రుమశ్చయం ప్రాప్య సశాఖః సమపద్యత ॥" అని కనిపిస్తున్నది.
వ్యాసాశ్రమము
మహాభారతం శాంతిపర్వంలో 'గురో ర్మే జ్ఞాననిష్ఠస్య హిమవత్పాద ఆస్థితః' అన్న వాక్యం వల్ల, ఆయన ఆశ్రమం హిమవత్పాద ప్రదేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి “బదరిక” అనే నామం కూడా వ్యవహారంలో ఉంది. అది బాదరాయణుని వల్ల కలిగింది. కావచ్చును. వ్యాసుడు కొంతకాలం శిష్యవర్గంతో వారణాసిలో ఉండటం వల్ల దానికి అంతటి ప్రశస్తి కలిగిందని కూర్మ పురాణం పలికింది.

వ్యాసుడు : వాల్మీకి
వాల్మీకి సామవేద ప్రోక్త. ఆయన “నిషాద క్రౌంచపక్షి వృత్తాంతాన్ని చూచి, ‘వైదిక అనుష్ఠుప్' ఛందాన్ని కొంత మార్చి, రామాయణ మహాకావ్య నిర్మాణం చేశాడు. కాని ఇతిహాసము గేయరూపకంగా ఉండకూడదు. వైదిక కర్మోపయుక్తంగా వ్యాస భగవానుడు ఆయా కర్మలననుసరించిన అర్ధవాదాలకు అనుగుణమైన ఇతిహాసాన్ని వ్రాసి అశ్వమేధ యాగానికి యుక్తంగా నడిపించినాడు. అందువల్ల మహాభారతము జయము. అందువల్ల ఆయన భారత ధర్మాచార్యుడైనాడు. వాల్మీకి రామాయణాన్ని కుశలవులచేత పాడించి యిహంలో వ్యాప్తి పొందించినట్లే, వ్యాస భగవానుడు వైశంపాయనాది శిష్యుల ముఖాన సమస్త రచనలనూ ప్రచారం చేయించారు.
భారతి - వ్యయ, ఫాల్గునము పే. 107-211