వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/వాత్స్యాయనుడు-కామసూత్రములు

వాత్స్యాయనుడు - కామసూత్రములు

చతుర్విధ పురుషార్థములలో కామము తృతీయము. పరలోక సాధకమైనది ధర్మము. ఇహలోక సాధకమైనది కామము. మతిమంతులై మెలగినవారికి కామమును మోక్షసాధకమే అగునని 'ధర్మావిరుద్ధో లోకేస్మిన్ కామోస్మి భరతవర్షభ' అను గీతావచనమును బట్టి వ్యక్తమగుచున్నది. సర్వేంద్రియ తోషకమైన కామము సర్వార్థ సాధకమగుటచే దీనిని పరమ పురుషార్థముగ పరిగణించి, మహర్షి వాత్స్యాయనుడు 'ధర్మార్థ కామేభ్యో నమః' అని మంగళారంభమును పలికినాడు. త్రివర్గములందును ధర్మార్థములు పురుషార్థములని సూచించుటకే మున్ముందు అట్లు వచించినాడుగాని కేవలమగు పరమపురుషార్థము కామమే అని వాత్స్యాయనుని అభిప్రాయమై నట్లు నరసింహవృత్తి పలుకుచున్నది.


'పునీత భారతమున సమస్త తేజమును శ్వేతరక్తవర్ణ జలబిందు ద్వయమున నున్నది. ఈ రెంటిలో శ్వేతము పురుషకము, రక్తము స్త్రైణము, ఇవి భిన్నాభిన్నములు. కామదేవతా విధ్ధములు. అందువలన కామము సృష్టి సమస్తమును బంధించు అంతరికశక్తి. కాని అది శక్తిశేఖరము కాదు. ఈ బిందుద్వయ సంయోగ వియోగములకు కారణభూతమైన పరమశక్తి కామాధిదేవత కంటె గొప్పది. స్త్రీ పురుష లింగద్వయ సంయోగమువలన కామకళాదేవి రూపకల్పన మొందినది. సూర్యచంద్రములు ఆ దేవత పయోధరములు. ఆమె సృజనేంద్రియములు హార్ధకళాయుతములు. వారి కామకథనమును గురించియు, జగదుత్పత్తి, స్థితిలయములను, తార్తీయ పురుషార్థ స్థానమును గురించియు ఒక వృద్ధ భారతీయవేత్త నాతో పలికినాడు' అని 'గోల్డు బెర్గు’ పండితుడు అతని పవిత్రాగ్ని (Sacred Fire) అను గ్రంథమున వ్రాసి ఉన్నాడు. ' ఇట్టి మహోన్నత దృష్టితోను, పరిపూర్ణ జ్ఞానమును కామమును ఉపాసించిన జాతి మరెచ్చటను లేదని చెప్పజూచుట అతిశయోక్తి కాజాలదు.


ప్రాచీన భారతీయుల కామతంత్ర లోలతకు ప్రధాన కారణము ప్రజ. గృహమేధులగుట సంతానము కొరకే. ప్రజాతంతు విచ్ఛేదము జరుగకుండునట్లు జూచుటకే కామకళా విజ్ఞాన మత్యావశ్యకముగ వారు పరిగణించిరి. ఏతద్విజ్ఞాన

విరహితులను ప్రజాతంతు విచ్ఛేదకులుగ నెంచిరి. పాశ్చాత్య లోకములందు వైజ్ఞానిక భానూదయమున కెన్ని సహస్రవర్షములకు మున్నో భారతీయులు కామకళా విజ్ఞానమున పారము ముట్టిన ద్రష్టలని చెప్పవచ్చును. ఏతద్విజ్ఞానము సమస్త జాతిని ఉత్తేజితమొనర్చి కావ్యనాటకాది సమస్తసాహిత్య విభాగములకును అంతర్విలీన జ్యోతిగా నిలచి ఔన్నత్యము నాపాదించినది.


భారతదేశమున కామకళా విజ్ఞానము బహుళముగ సృజితమైనది. కాని మన దురదృష్టకారణముగ అతిప్రాచీన కాలముననే ఉత్సన్నమైపోయినది. ఇతరములగు కళా శాస్త్రాదికములవలె దానిని అభ్యసనీయవిద్యగా ప్రాచీనులు పరిగణించి రనుటలో విప్రతిపత్తి లేదు. దేవాలయాదులలోను, శతాంగములమీదను కామకళా ప్రతిమల శిల్పులు స్థపతించుట, కారువులు చిత్రించుట ఇందుకు ప్రత్యక్ష నిదర్శనములు. ఇట్టివానిలో ఒరిస్సా దేశమునందలి కోణార్క్ అనుచోట సూర్యదేవుని రాతిరథముపైనున్న శిల్పములు సుప్రసిద్ధములు. వైదిక, జైన, బౌద్ధాది, విభేదములు లేక ఇటువంటి ప్రతిమలను చిత్రించుట, చెక్కించుట ఈ కళావశ్యకతను ద్యోతకమొనర్చు చున్నది.


భారతీయుల కామతంత్ర రచనము అనాది సిద్ధము. తదుత్పత్తిని గూర్చి మహర్షి వాత్స్యాయనుడు కొన్ని సూత్రములను చెప్పి ఉన్నాడు. వాటి సారాంశము 'ప్రజాపతి ప్రజలను సృజించి త్రివర్గ సాధనార్థము శత సహస్రాధ్యాయి గ్రంథము నొకదానిని ప్రవచించినాడు. ఈ గ్రంథము కారణముగ ధర్మ, అర్థ, కామములను మూడు ఏకదేశములు ఏర్పడినవి. అందు స్వాయంభువమనువు ధర్మమును, బృహస్పతి అర్థమును, నందికేశ్వరుడు కామమును పృథక్కరించిరి.


నందికేశ్వరుని కామశాస్త్ర గ్రంథము సహస్రాధ్యాయి. దానిని ఔద్దాలకి శ్వేత కేతువు పంచశతాధ్యాయ గ్రంథముగ సంగ్రహించినాడు. బాభ్రవ్యుడను పాంచాల దేశస్థుడు ఈ గ్రంథమును నూటయేబది అధ్యాయములలోనికి సంక్షేపించి సాధారణము, సాంప్రయోగికము, కన్యాసంప్రయుక్తకము, భార్యా, పారదారిక, వైశిక, ఔపనిషదికములు అను సప్తాధికరణములు గల గ్రంథముగ నొనర్చినాడు. ఇందలి వైశికమును పాటలీపుత్ర నగరములో గణికల ఉపయోగార్థము వారి కోరికను అనుసరించి దత్తకుడు ప్రత్యేకించి ప్రవచించినాడు. తరువాత కొంతకాలమునకు చారాయణుడు సాధారణాధికరణమును, సువర్ణనాభుడు సాంప్రయోగికమును, ____________________________________________________________________________________________________

110

వావిలాల సోమయాజులు సాహిత్యం-4

ఘోటకుడు కన్యా సంప్రయుక్తకమును, గోనర్దియుడు భార్యాధికారమును, గోణికాపుత్రుడు పారదారికమును, కౌచుమారుడు ఔపనిషదికమును, పృథక్కరించినారు.


పై సూత్రములందు ఉటంకింపబడిన గ్రంథములు అతి విస్తృతములును అతిదీర్ఘములగుట వలననో, ప్రత్యేకాధికరణములగుటచే సంపూర్ణ జ్ఞానము నొసంగ ప్రత్యేకముగ శక్తిమంతములు కాకపోవుట వలననో, లేక ఉత్సన్నము లగుట వలననో వాత్స్యాయన మహర్షి ప్రత్యేకముగ తంత్రావాపముతో కూడిన కామకళను ఉపాసించి విజ్ఞుడై సంగ్రహ శాస్త్రగ్రంథ రచనమునకు పూనుకొన వలసి వచ్చినది. ప్రాచీన భారతమునందెన్ని అమూల్య కామకళా గ్రంథరచనములు జరిగినను వాత్స్యాయనునికి పూర్వరచనమని చెప్పదగిన దొక్కటియును నేడు మన కుపలభ్యమాన మగుట లేదు. నేడు లభించువానిలో వాత్స్యాయనుని 'కామసూత్రము'లే ప్రాచీనతమ గ్రంథము.


వాత్స్యాయనుని కాలమునాటికే బాభ్రవ్యుని గ్రంథమును సంపాదించుటకే అతికష్టసాధ్యమైన కార్యముగ నుండెడిదట. శ్వేత కేతు, నందికేశ్వరుల గ్రంథములు ప్రాచుర్యములో లేక రూపుమాసిపోయినవి. అందువలననే వాత్స్యాయనుడు సప్తాధికరణ సంక్షేపరూప కామశాస్త్ర గ్రంథ రచనమునకు కడంగ వలసిన వాడయ్యెనని కొందరి అభిప్రాయము.


నందికేశ్వరుడు ప్రమథగణాధిపతి యైన నంది అనియును, మహాదేవ శిష్యుడైన ఈతడు జగత్పితలు పార్వతీపరమేశ్వరులు సృష్టి కార్యమునకు పూనినపుడు కామకళా రహస్యములు వారివలన గ్రహించినాడనియును భారతీయుల విశ్వాసము. మధ్య వైదిక కాలమునుండి మాత్రమే కామశాస్త్ర విజ్ఞానము ప్రచలితముగ నున్నట్లు కన్పించుటచే నందికేశ్వరుడు కేవలము పౌరాణిక వ్యక్తి యని భావించుట కంటె మానవునివలె జన్మించి శాస్త్రగ్రంథ రచన మొనర్చిన వానివలె పరిగణించుట యుక్తమని ఒక విజ్ఞుని అభిప్రాయము


ఔద్దాలకి శ్వేతకేతువు చరిత్రాత్మక వ్యక్తి. ఇతడు అరుణుని మనుమడు. కేకయ మహారాజు అశ్వపతికిని ఇతనికి జరిగిన వాకో వాక్యములు ఛాందోగ్యమున కనుపించు చున్నవి. ‘ ఇతడు పాంచాలదేశమున కేగి పంచాగ్ని విద్యను గూర్చి ఒకానొక పరిషత్తులో ప్రసంగించినట్లు ఆ ఉపనిషత్తు వలన తెలియుచున్నది. బృహదారణ్యకోపనిషత్తున ఒక శ్వేత కేతువు కన్పించుచున్నాడు. మహాభారతమున ఉద్దాలక మహర్షి కుమారుడైన ఒక శ్వేత కేతువు ప్రశంస ఉన్నది. అందు ఇతనిని గూర్చిన ఒక కథనము కనిపించుచున్నది.

ఒకనాడు ఉద్దాలకి కుమారుడు శ్వేతకేతువు, తల్లిని ఒక బ్రాహ్మణుడు కామతృప్తి కొరకై ఎత్తుకొని పోవుచుండగా తండ్రి వలన 'ఆ రీతిగా సంఘములలో సమస్త పురుష సంయోగము వలన స్త్రీలు అపవిత్రలు కారను మాటలు విని కోపించి, అది పాపమని నిశ్చయించి, భర్త అనుమతి లేనిది నియోగము నైన పొందరాదని నిర్ణయమొనర్చినాడు" అని భారత కథనము. దీనిని పరికించినచో అతి ప్రాచీన కాలమున భారతదేశమున ఎట్టి వ్యవస్థయును లేక వివక్షారహిత కామోపభోగము (Sexual Promiscuity) లక్షణముగా నున్నప్పుడు, కొన్ని వైవాహిక నిబంధనలను (Marriage Laws) ఏర్పరచిన మహానుభావుడు శ్వేత కేతువని నిశ్చయింపవలసి ఉన్నది.


బాభ్రవ్యుని గ్రంథభాగములు వాత్స్యాయనుని నాటికి నిలచి ఉన్నట్లును, అతడు ఆ గ్రంథమునుండి కొన్ని సూత్రములను, విషయములను సేకరించినట్లు కామసూత్రముల వలన తెలియుచున్నది. కామసూత్రముల వలనను, తద్వ్యాఖ్యానమైన జయమంగళము వలనను దత్తకుడు మాతృమరణానంతరము దత్తుడైనాడని తెలియుచున్నది. ఇతడు మగధలో వీరసేనాది గణికలవలన అనేక విషయములను గ్రహించి శాస్త్ర కర్త ఐనాడు. 'వైశికము' ఇతని గ్రంథము. దత్తకాచార్యుని గ్రంథ మీ నాడుత్సన్నమైనది. కాని సంస్కృత భాణములందు ఇతని గ్రంథమునకు సంబంధించినవి కొన్ని సూక్తులు కానవచ్చుచున్నవి. నరేశ్వర దత్తుని ధూర్తవిట సంవాదము,' అతని కుమారుడగు శ్యామిలకుని పాద తాడితము లకు భాణముల దత్తక సూత్రప్రశంస ఉన్నది. వేదములు 'ఓం' కారముతో నారంభించి ప్రారంభమైనవని వ్యంగ్యగర్భితముగ పలికిన పాదతాడితక వాక్యము గమనింప దగినది. క్రీ.శ. 380 ప్రాంతమున కళింగదేశ పాలకుడైన గాంగవంశ రాజన్యుడు రెండవ మాధవ వర్మ దత్తక సూత్రములకు శ్లోకమయ వ్యాఖ్యానము వ్రాసినాడు. అందు రక్త, విరక్త, వేశ్యలను గురించియు, శయనోపచారాదికములను గూర్చియు వ్రాసిన రెండు పాదముల గ్రంథము మాత్రమే ఉపలభ్యమాన మగుచున్నది. కామ కళాభిజ్ఞులు మాధవవర్మ గ్రంథము దత్తక సూత్రములకు సంగ్రహ గ్రంథముగాని వ్యాఖ్యానము కాదని అభిప్రాయ పడుచున్నారు.


చారాయణ, సువర్ణనాభ, ఘోటక ముఖ, గోనర్గీయ, గోణికాపుత్రులను గురించి ఎట్టి విశేషములును తెలియుట లేదు. కోసల దేశాధిపతి అగు దీర్ఘచారాయణుడొకడు అర్థశాస్త్ర రచయిత ఐనట్లు బౌద్ధుల మధ్యమనికాయము వలన తెలియుచున్నది. ఫోటకముఖుడును అర్థ శాస్త్ర పండితుడైనట్లు కౌటిల్యుని గ్రంథము వలన


వ్యక్తమగుచున్నది. స్త్రీలను చతుర్విధములుగ విభజింప నారంభించిన వాడితడే. కొక్కోక పండితుడు ఇతని గ్రంథమును చూచినాడు. కూచిమారుడు ఈ శాస్త్ర గ్రంథకర్తలలో ఉచ్ఛశ్రేణికి చెందినవాడు. అతని గ్రంథము ఉపనిషన్నామములతో విఖ్యాతమైనది. అతని మహర్షిగా పూర్వులు పరిగణించినారు.


దత్తకాచార్యుని తరువాత పేర్కొనదగిన కామశాస్త్ర ప్రణీత వాత్స్యాయన మహర్షి వాత్స్యాయనుని కామసూత్రములు గురించి విపులముగ తదుపరి ప్రశంసించుటచే నిక అతని యనంతరము జన్మించిన కామశాస్త్రములను దిజ్మాత్రముగ పేర్కొనుట అత్యావశ్యకము. అందు దామోదర గుప్తుని కుట్టనీ మతము ప్రప్రథమమున చెప్పదగినది. దీనికి శంభళీమతము అను నామాంతర మున్నది. ఇతడు కాశ్మీర దేశమును పాలించిన కర్కోటక వంశజుడగు జయాపీడదేవుని (క్రీ.శ. 779-813) మంత్రిసత్తముడు. ఇందు 1060 శ్లోకములున్నవి. ఈ గ్రంథము ప్రధానముగ వాత్స్యాయన మహర్షి షష్ఠాధికరణమును (వైశికము) విపులీకరించుచున్నది.


నాగర సర్వస్వకర్త పద్మశ్రీ అతని డెబ్బది రెండవ అధ్యాయమున కుట్టనీమత ప్రశంస ఒనర్చుటచే నితడు దామోదరగుప్తుని తరువాత వాడని తెలియుచున్నది. ఇతడు బౌద్ధ సన్యాసి. ఇతని గ్రంథము క్రీ.శ. 1351 నాడు జన్మించిన శార్ఙ్గ ధరపద్ధతిని ఉటంకించుటచే, పద్మశ్రీ క్రీ.శ. 10 - 11 శతాబ్దముల నాటివాడని పండిత ప్రకాండుల అభిప్రాయము.


క్రీ.శ. 1029-1064 మధ్య కాలమున కాశ్మీర రాజ్యము నేలిన అనంత దేవుని సభాసదుడైన క్షేమేంద్ర మహాకవి వాత్స్యాయన సూత్రసారమును, సమయమాత్రకమును వ్రాసి యున్నాడు. సమయ మాత్రకము కుట్టనీమతము ననుసరించిన శ్లోకమయ గ్రంథము.


తరువాత చెప్పదగిన కామకళాగ్రంథకర్త కొక్కోకుడు. ఇతడు అద్వితీయ పండిత వంశమున జన్మించిన సింహళ దేశీయుడు. గద్య విద్యాధర, వైద్య విద్యాధర బిరుదాంచితుడగు తేజోకుని పుత్రుడు. పరాభద్రుని వంశస్థుడు. ఇతని రతిరహస్యము కామశాస్త్ర గ్రంథములలో విశేష ప్రాధాన్యము వహించినది. ఇది కల్యాణమల్లుని అనంగరంగమునకు మూలగ్రంథము. వాత్స్యాయన కామసూత్ర వ్యాఖ్య జయమంగళమున నీతని రతిరహస్య ప్రశంస కనుపించుచున్నది. అందువలన నతడు యశోధరునికంటె ప్రాచీనుడని నిశ్చయింపవచ్చును. క్రీ.శ. 1307 నాటి జనప్రభసూరి అతని కల్పసూత్రములలో జయమంగళ వ్యాఖ్యను పేర్కొనినాడు. అందువలన

కొక్కోకుడు క్రీ.శ. 12వ శతాబ్దికి పూర్వుడని నిశ్చయింపవలసి యున్నది. కాని పండిత లోకము ఇతడు పద్మశ్రీకి తరువాతి వాడని భ్రమ పడుచున్నారు.


కొక్కోకుడు రతిరహస్యమును జాత్యధికారాదులగు పదునేను ప్రకరణములుగ శ్లోక రూపమున వివరించి యున్నాడు. 'వాత్స్యాయనాది ప్రాచీన కామశాస్త్ర ప్రణేతలు 'ధర్మ మర్థం చ కామం చ ప్రత్యయం లోక మేవ చ' అని త్రివర్గములకును పరస్పరానుప ఘాతకముగ కామమును సేవింపవలసినదని చెప్పియుండగా, ఈయన 'అసాధ్యాయా స్సుఖంసిద్ధి సాధ్యాయా శ్చానురంజనం రక్తాయాశ్చ రతి సమ్యక్కామ శాస్త్ర ప్రయోజనం’ అని చెప్పినాడు. తన్మూలమున తర్వాతి కాల కామశాస్త్ర గ్రంథకర్తలందరును ఇతడు తీసిన మార్గమునే అనుసరించి కేవలము జాత్యధికారము, బంధాధికారము, వశ్యౌషధ విధానములతో అవిచారితమున నారంభించినారు. కొక్కోకుని గ్రంథమునకు (1) కంచీనాథుడు (2) ఆవంచ రామచంద్రుడు (3) కవి ప్రభువు (4) హరిహరుడు అను నలువురు పండితులు వ్యాఖ్యానములు వ్రాసినారు. గీత గోవింద కావ్యమునకు టీక వ్రాసిన కుంభనృపతి, నైషధీయ చరిత్రమునకు వ్యాఖ్యాన మొనర్చిన నారాయణభట్టును, పంచకావ్య వ్యాఖ్యాతలలో ప్రసిద్ధుడును, దార్శనికాగ్రేసరుడు నగు కోలాచల మల్లినాథసూరి రఘువంశ కిరాతార్జునీయాది కావ్యవ్యాఖ్యానములలో కొక్కోకుని గ్రంథమునుండి ఉదాహరణముల నిచ్చినారు.


క్రీ.శ. 1422-40 మధ్యకాలమున విజయనగర సామ్రాజ్యమును పాలించిన ఆంధ్ర చక్రవర్తి ఇమ్మడి ప్రౌఢదేవరాయలు రతిరత్న ప్రదీపిక అనునొక కామకళా గ్రంథమును వ్రాసి ఉన్నాడు. అందు సాంప్రయోగాధికారము మాత్రమే నిలచియున్నది. భార్యాధికారము, పారదారికము, వైశికాది అధికరణములున్న గ్రంథము లుప్తమై పోయినది. ఇతడు ప్రధానముగ రతిరహస్య మార్గమును అనుసరించినాడు. ఇది ఒకరీతిగ నా గ్రంథమునకు వ్యాఖ్యానమని చెప్పవచ్చును!


కల్యాణమల్లుని అనంగరంగము తదుపరి పేర్కొనదగిన ప్రధాన గ్రంథము. ఇతడు ఒరిస్సా రాజగు లడదేవుని (అనంగ భీముడు) ఆస్థానకవి అని కవిచరిత్రల వలన తెలియుచున్నది. కాని ఇతడు అహమ్మదుఖానుని కుమారుడగు లడఖానుని కోరిక ననుసరించి అనంగరంగ రచనమునకు పూనుకొనినాడని ఏతద్గ్రంథ, ద్వితీయ, తృతీయ శ్లోకముల వలన తెలియచున్నది. ఇతడు గుజరాతు దేశ నాయకుడు. ఇతని తండ్రి క్రీ.శ. 1488-1517 మధ్య రాజ్యమొనర్చిన సికందరు సుల్తాను కాలముననున్న ఒక ప్రభువని తెలియుచున్నది." అందువలన కల్యాణమల్లుడు క్రీ.శ. 15వ శతాబ్ది


114

వావిలాల సోమయాజులు సాహిత్యం-4

చివరభాగముననో లేక 16వ శతాబ్ది ప్రథమ భాగముననో జీవించియున్నాడని నిశ్చయింపవచ్చును. భారతీయ కామకళా గ్రంథములలో దీనికున్నంత విశేష ప్రచారము మరి యే యితర గ్రంథమునకు లేదు. పర్షియా, టర్కీ, అరబ్బు దేశములు దీనిని ఆయా భాషలలోనికి అనువదించుకొన్నవి. ఆ దేశములందు దీనికి 'లజ్జత్ - అల్ - నిస్సా' అని నామము. ఈ గ్రంథమునకు నేడు ఆంగ్లేయ, ఫ్రెంచి, జర్మన్, అనువాదములును లభించుచున్నవి.


తరువాత కాలమున జన్మించిన కవిశేఖర జ్యోతీశ్వరాచార్యుని 'పంచసాయక’ మే నాటిదో తెలియదు. ఇది శ్లోకరూప గ్రంథము. ఇతడు కొక్కోకుని మార్గమనుసరింపక వాత్స్యాయనుని మార్గము త్రొక్కినాడు. అతని చరిత్రాదికములను చెప్పు శ్లోకముల రెంటిని గ్రంథమున చెప్పి ఉన్నాడు. బికనీరు మహారాజు అనూపసింహుని (క్రీ.శ. 1674-1708) ఆస్థాన విద్వాంసుడు, వ్యాసజనార్దనుడు కామప్రబోధము అను గ్రంథమును వ్రాసినాడు. ఇది అనంగరంగమునకు తాత్పర్య గ్రంథము. క్రీ.శ. 1457 నాటి అనంతుని కామసమూహము, జయదేవుని రతిమంజరి, సర్వసామాన్య శాస్త్రగ్రంథములు. హరిభట్టార రహస్యము సంప్రదాయ శుద్ధముగను, కామ సూత్రోద్దేశ నిబద్ధముగను నున్నది. సౌమదత్తి విటవృత్తము వైశికాధికరణమునకు సంబంధించిన స్వతంత్రగ్రంథము, రామచంద్ర బుధేంద్రుని ప్రకాశిక రతిరహస్య వ్యాఖ్యానము. వీరణారాధ్యుని గ్రంథము స్వతంత్రము. ఈ పంచ రత్నమునకు రేవణారాధ్యుని స్మరతత్త్వ ప్రకాశిక వ్యాఖ్యాన గ్రంథము. ఇతడు వేద వేదాంగములనుండి ప్రమాణములనిచ్చి కామము తప్పక సేవింపవలసిన దనియును, ధర్మ్యమనియును నిరూపించిన వీరశైవుడు. సిద్ధ నాగార్జునుడు వశీకరణ తంత్రము నొకదానిని వ్రాసినట్లు తెలియుచున్నది.


ఇట ఆంధ్ర కామశాస్త్ర గ్రంథ ప్రశంస యొనర్చుట అసమ్మతము కాదు. కామశాస్త్రమున కంతటికిని నాయిక వేశ్యయను భ్రాంతిని కల్పించునట్లు, కొక్కోకాది గ్రంథకర్తలవంటి విశేష కామలౌల్యముతో 'కొక్కోక' మను పేర ఆంధ్ర కామశాస్త్ర గ్రంథమును వ్రాసినవాడు ఎఱ్ఱయకవి. ఇది రతిరహస్యాంధ్రీకరణము, నెల్లూరి శివరామకవి తంజాపుర మహారాష్ట్ర నాయకుడు ప్రతాపసింహుని కోరిక పై కామకళానిధి గ్రంథమును వ్రాసినాడు. ఇది స్వతంత్ర గ్రంథము. ముష్టిపల్లి సోమభూపాలుడు ఆంధ్ర రతిరహస్యమును రచించెను. ఇది గద్వాల ప్రభువు హరిభట్టు వ్రాసిన రతిరహస్యమునకు ఆంధ్రీకరణము. గోపీనాథ వెంకటకవి


సంస్కృతి

115

(శ్రీమద్రామాయణము నాంధ్రీకరించిన వాడు) శృంగార పరాకాష్ఠను పొందిన బ్రహ్మానంద శతకమును వ్రాసి యున్నాడు. ఇంకను ఆంధ్రమున ననేకములైన చిల్లర గ్రంథములున్నవి.


ఉపలబ్ధ మానములగు సమస్త భారతీయ కామకళాగ్రంథ పరంపరలోను, అతి ప్రాచీనమును, ప్రామాణికమును అయిన గ్రంథము వాత్స్యాయన మహర్షి కామసూత్రములు. ఈ గ్రంథమునకున్న సమగ్రస్ఫూర్తిగాని, ప్రాగల్భ్య ప్రాశస్త్యములుగాని అన్యగ్రంథములకు లేవు. సమస్త కామకళా గ్రంథములకును నిదియే ఆదిభిక్ష వెట్టినది; అన్నియును దీని ననుసరించినవి అని ఘంటాపథముగ చెప్పవచ్చును. వాత్స్యాయనుడు పూర్వాచార్యులను కొందరిని పేర్కొని వారి మతములను విమర్శించుట వలన నితడు శాస్త్ర సంధాతయే గాని స్వతంత్ర రచయిత కాడని ఒక అభిప్రాయమున్నది. ఇది ఎంతయు సత్యదూరము. మన పూర్వులు ఇతనిని మహర్షిగ భావించినారు. ఇతడు కామకళాద్రష్ట, స్రష్ట, ఇతని కామసూత్రములను అవలోడన మొనర్చి ప్రపంచములోని ఉత్తమజాతి శాస్త్రవేత్తలును, కామశాస్త్ర వేత్తలును (Sex and Erotic Scholars) ఇతని 'కామశాస్త్ర విజ్ఞానమునకు బుద్ధినైశిత్యముతో రాజ్యతంత్రమును నడపి శాస్త్రరచన మొనర్చిన విశిష్ట పాశ్చాత్య రాజకీయవేత్త - మేకవెల్లీ' అని ప్రశంసించినారు.


మన ప్రాచీన సాహితీపరులు కామసూత్రములకు విశేష గౌరవమిచ్చినట్టు సంస్కృత కావ్యపఠనము వలన వ్యక్తమగుచున్నది. మల్లినాథాది వ్యాఖ్యాతలమాట అటుంచినను, మహాకవులు కాళిదాసు, భవభూతి, ఆచార్య దండి, ప్రభృతులు వారి కావ్యములందు సందర్భానుసారముగ వాత్స్యాయన కామసూత్రములను అనువదించినారు. వరాహ మిహిరాచార్యులవారును కొన్ని సందర్భములందు ఈ గ్రంథమునుండి ఉదాహరణములను గ్రహించినారు.


వాత్స్యాయనుని 'కామసూత్రములు' నేటికి ప్రపంచములోని 160 భాషలలోనికి వ్యాఖ్యాన టిప్పణి సహితముగ అనువదితములైనవి. దీనికి 11 ఆంగ్లానువాదములు, 20 ఫ్రెంచి అనువాదములు, 40 జర్మను అనువాదములు నున్నవి. ఫ్రెంచి వానిలో నుత్తమమైనది లామైరీ అనువాదము, రిచ్చర్డు స్కిమిడ్జ్ హైమన్, స్టీఫెనుల అనువాదములు జర్మను పరివర్తనములోని కెల్ల ముఖ్యమైనవి. నేటి జాతి శాస్త్రజ్ఞులలో కామసూత్రములను మెచ్చుకొననివారు లేరు. అతి ప్రాచీన కాలముననే వాత్స్యాయనుని ప్రభావము అరబ్బు దేశములలో పుట్టిన కామశాస్త్ర గ్రంథములపై బడినది. పూర్వ రోమక చక్రవర్తులనాటి జాతిశాస్త్రవేత్తలును భారతీయ కామశాస్త్రపు చవిచూచినవారే


116

వావిలాల సోమయాజులు సాహిత్యం-4

ననుటలో అతిశయోక్తి లేదు. ఈ సందర్భమున వసు మహాశయుని వాత్స్యాయన ప్రశంసను పేర్కొనుట ఉచితము.

“The Kama-Sastra is written in brilliantly arranged and superbly pithy Sutra form in the style of many of the ancient and Mediaeval Hindu scriptural works. The foreign scholars, particularly authorities on sexual science in the nineteenth and twentieth centuries have justly appraised and recognised the value of such a supremely interesting and useful treatise on the art of love that had presumably attained wonderful perfection in India several centuries before CHRIST. It is acclaimed as the most precise but elucidating ancient work for all times and with a universal appeal by celebrities like Havelock Ellis, Kraft-Ebing, Kisch Forel, Mantegazza, Lombroso, Iwan Block and others ... It can be proved beyond doubt that almost all the Turkish, Arabic and Persian Books on Erotics have freely derived help from the precontemporaneous Hindu manuscripts - The KAMA SUTRA etc... It becomes very difficult to gain say if somebody presumes that Ovidus Nasso the Roman composer of A R S A Mooris who lived during the reign of first Imperial Caesar filled his cup at the fountain - head of Vatsyayana or his predecessors."


ఇందు వాత్స్యాయనుని కామసూత్రములు గూర్చి 'వసు' మహాశయుడు చెప్పిన వాక్యములలో సత్యేతర మిసుమంత యైనను లేదు; నేటి కామతంత్ర రచయితల గ్రంథములను గాని అరేబియా, పర్షియా దేశములందును, రోమునగరమునను జన్మించిన పురాతన కామకళా గ్రంథములనుగాని పరికించిన నీ విషయము తేటపడగలదు.


కామసూత్రములకు వ్యాఖ్య లొనర్చిన వారిలో ప్రముఖుడు యశోధరమహారాజు. ఇతని వ్యాఖ్యానమునకు 'జయమంగళ' మని నామము. ఇతడు క్రీ.శ. 10వ శతాబ్ది వాడని చరిత్రజ్ఞుల అభిప్రాయము. వ్యాఖ్యాప్రారంభమునందు యశోధరుడు చెప్పిన -

“వాత్స్యాయనీయం కిల కామసూత్రం వ్యాఖ్యాయి తత్కైశ్చిది హాదేన్యథైవ, తస్మాద్విధాస్యే జయమంగళాఖ్యాం, టీకామిమాం సర్వ మిదం ప్రణమ్య" అను శ్లోకము వలన ఇతని నాటికి వాత్స్యాయనమునకు సంప్రదాయ విరుద్ధములైన కొన్ని వ్యాఖ్యానములున్నట్లును, ఇతడు సంప్రదాయార్థములను కొనివచ్చుటకై వ్యాఖ్యచేయ


సంస్కృతి

117

పూనుకొనినట్లును అర్థమగుచున్నది. అందువలన నితని వ్యాఖ్యానము సమగ్రమును ప్రామాణికమునునని మన మంగీకరింపవచ్చును. సూత్ర హృదయము నెఱిగినట్లు వ్యాఖ్యానించు పట్ల నితని కామకళా విజ్ఞానము, తదితర శాస్త్ర విజ్ఞానము సర్వేసర్వత్ర గోచరించుచుండును. ఇతనికి కామకళ స్వానుభవ పూర్వకమైనట్లు గద్యలో చెప్పుకొనిన 'విదగ్ధాంగనా విరహకాతర' శబ్దము వలన మన కర్థమగుచున్నది. క్రీ.శ. 1577లో వీరభద్రుడు 'కందర్ప చూడామణి' అనుపేర ఆర్యావృత్తములలో కామసూత్రములకు వేరొక వ్యాఖ్యానము జెప్పినాడు. క్రీ.శ. 1789లో సర్వేశ్వరశాస్త్రి శిష్యుడును కాశీనివాసియు నైన ఆంధ్రుడు భాస్కర నృసింహుడు రాజా ప్రజలాల్ అనువాని ప్రోత్సాహమున వాత్స్యాయనీయమునకు ఒక వృత్తిని వ్రాసినాడు. అఖిల ప్రౌఢక్రియయైన వృత్తిని రచింపబూనినట్లు గ్రంథారంభమున చెప్పుకొనిన శ్లోకమునందున్నది. వాత్స్యాయన సూత్ర వ్యాఖ్యాతలలో మల్లదేవుడొకడు. ఇతనిని పంచసాయక కర్త జ్యోతీశ్వరాచార్యుడు మూలదేవుడని వ్యవహరించినాడు. క్షేమేంద్రమహాకవి ఔచిత్య విచారచర్చయను అతని గ్రంథమున నొక వాత్స్యాయన సూత్రసారమును పేర్కొనినాడు. కాని నేడది లభించుట లేదు.

భాస్కర నృసింహుడు కామసూత్ర వృత్తిని ఆరంభించుచు ‘వత్సోపరి వాత్సల్యా వాత్స్యాయనీయ కామసూత్రం యః' అనినాడు. దీని కుపోద్బలకముగ వత్సరాజు వాత్స్యాయనుల మైత్రి కనుగుణములైన జనశ్రుతులున్నవి. మల్లనాగు డను ఆచార్యుడు వత్సదేశ పరిపాలకుడైన వత్సరాజుకు మిత్రుడై, అతని కుమారుడు లోకతంత్ర మెరుగని వాడగుటచే ప్రభువు పరితపింప, నాతడు కనికరించి ఈ కామసూత్రములను చెప్పినాడట! దీనికి ప్రమాణముగ 'మల్లనాగ ప్రబోధితో వత్సేశ్వర ఇవ' అను వాక్యములు ఉదాహృతములైనవి. ఇందలి సత్యాసత్యము లెట్లున్నను 'వాత్స్యాయన' శబ్దము బిరుదనామము. అయిన కామసూత్ర కర్త పేరేమి?

యాదవ ప్రకాశ హేమచంద్రులు వాత్స్యాయన శబ్దమునకు క్రింది శ్లోకముల పర్యాయ పదముల నిచ్చి ఉన్నారు.

“వాత్స్యాయనస్తు కౌటిల్యో విష్ణుగుప్తో వరాణకః ద్రమిళః పక్షిల స్వామీ మల్ల నాగోంగులోపి చ;

వాత్స్యాయనో మల్లనాగః కౌటిల్యశ్చ కాత్మజః, ద్రామిళః పక్షిల స్వామీ విష్ణుగుప్తోంగుళశ్చ సః


118

వావిలాల సోమయాజులు సాహిత్యం-4

ఈ శ్లోకములు చరిత్రజ్ఞులు పరిగణింప తగినవిగా లేవు. లోకమున వాత్స్యాయన శబ్దవాచ్యులైన శాస్త్రకారులు మువ్వురు కనిపించుచున్నారు. (1) అర్థశాస్త్ర కర్త కౌటిల్యా పరనాముడు (2) న్యాయశాస్త్ర భాష్యకారుడు వాత్స్యాయనుడు (3) కామసూత్ర కారుడు వాత్స్యాయనుడు. అర్థశాస్త్ర వ్యాఖ్యాత లెవ్వరును కౌటిల్యుని వాత్స్యాయన శబ్దముతో వ్యవహరింపరు. అదే రీతి న్యాయశాస్త్ర వ్యాఖ్యాతలు కౌటిల్య శబ్దము న్యాయశాస్త్ర వ్యాఖ్యాతకు వాడుక చేయలేదు. లోకము నందున్న ఉపశ్రుతి ననుసరించి కొందరు విద్వాంసులు వాత్స్యాయన శబ్దము బిరుదనామ మనియు, అతడు మల్లనాగుడనియును అభిప్రాయపడుచున్నారు. మరికొందరు కామసూత్రకర్తను 'వాత్స్యాయన మల్లనాగు' డనుచున్నారు.


వాత్స్యాయనుని కాలనిర్ణయ మొనర్చుటకు ప్రబలములైన ఆధారము లెవ్వియును లేవు. పండితులు నానారీతుల అభిప్రాయములను వెల్లడించినారు. 1. కామ సూత్రములను ప్రప్రథమమున ప్రచురించిన కలకత్తా విద్వాంసుడు మహేశ చంద్రభట్టు “ద్వివేదాక్షి” అను ఒక శ్లోకభాగమున సూత్రకారుడు 1424 ను సూచించినాడనియును, అందువలన ఇతడు క్రీ.శ. 677 నాటివాడని నిశ్చయించినాడు 2. సంస్కృత వాఙ్మయ చరిత్రకారుడు కృష్ణమాచార్యులవారు 'కామ సూత్రము' లందు కుంతలస్వాతికర్ణి అను ఆంధ్ర శాతవాహనరాజు ప్రశంస ఉండుట వలన ఇతడు క్రీ.శ. 3, 4 శతాబ్దుల వాడని నిశ్చయించిరి. 3. ఇతడు మూడవ శతాబ్ది వాడని ఆచార్య చోరే అభిప్రాయము 4. ఆంధ్ర వాత్స్యాయన కామసూత్ర వ్యాఖ్యాతలు కావ్యస్మృతి తీర్ధశ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రులవారు, ప్రథమ ముద్రణమున ఇతడు పతంజలి మార్గముననుసరించి చర్చించుటచే, నించుమించు అతనికి సమకాలికుడై క్రీ.శ. 150 ప్రాంతమున జీవించి ఉండవచ్చునని అభిప్రాయపడినారు. " రెండవ ముద్రణమున ఆచార్య చక్కల్ ధర్ గారి వలె ఇతడు క్రీ.శ. 3వ శతాబ్ది మధ్య భాగమునకు చెందినవాడనినారు. 5. ఆచార్య చక్కల్ ధర్ మహాశయుడు " వాత్స్యాయనుడు క్రీ.శ. 3వ శతాబ్ది మధ్యభాగము వాడని కాళిదాస మహాకవి కాలనిర్ణయముననుసరించి, మరికొన్ని ఇతర ప్రమాణములను బట్టియు నిశ్చయించినారు. ఈ అభిప్రాయముతో డాక్టర్ బార్నెట్టు మహాశయుడు సంపూర్ణముగ నేకీభవించినాడు. అందువలన కామసూత్ర కర్త క్రీ.శ. 3వ శతాబ్ది మధ్యభాగము వాడని మనము నిర్బాధకముగ నిశ్చయింపవచ్చును.


సంస్కృతి

119

కామసూత్రములు

మహర్షి వాత్స్యాయనుడు కామసూత్రములను ఏడు అధికరణములుగ రచించినాడు. అందు మొదటిది సాధారణాధికరణము. తంత్రావాసాత్మికమైన కామమునకు సాధారణ నిర్వచనము, తదావశ్యకత మున్నగు సాధారణ విషయములందున్నవి. దశాంగములు గల కామమును ప్రయోగించు మార్గమును విశదీకరించుటచే రెండవదానికి సాంప్రయోగికాధికరణమని నామము. ఇది తంత్రభాగము. మిగిలిన గ్రంథము నాయికలను పొందు విధానమును నిరూపించును. అందువలన ఈ భాగమునకు శాస్త్రవేత్తలు ఆవాపమనినారు. ఈ ఆవాపభాగము నందు నాలుగధికరణములున్నవి. వాత్స్యాయనుని కాలము ననుసరించి నాయికలు చతుర్విధములుగనున్నారు. అందు ఏకచారిణీ వృత్తమును అవలంబించి కన్యకలుగా నుండి ప్రేరణ విధాన పూర్వకముగా నాయక పాణి గ్రహణము చేయునట్టివారు ఒక తెగవారు. వీరిని కన్యకలనుగా భావించి కన్యాసంప్రయుక్తాధికరణమున వీరికి సంబంధించిన సమస్త విషయమును మూడవ అధికరణమున మహర్షి నిబంధించినాడు. ఇది ఆ భాగమున తొలిపాదము. వరణ విధానము ననుసరించి నాయకుని పాణిగ్రహణము చేసుకొని భార్యాత్వమును అధిష్ఠించినది మొదలుకొని వారు నడువవలసిన రీతిని, జీవన విధానమును 'భార్యాధికరణ'మను పేర నాల్గవ యధికరణముగనున్నది. ఈ రెండవ పాదము తరువాత పారదారాధికరణము, కారణాంతరమున పరదారాభిగమనము నొనర్పవలసిన కారణములు ఆ నాటి సాంఘిక పరిస్థితుల ననుసరించి ఉండుట వలన, దానిని ప్రత్యేకాధికరణముగ ఆ మహర్షి పలికినాడు. ఇది అయిదవ అధికరణము. ఆరవ భాగమున మిగిలిన పాదము వైశికము. దీనిలో తంత్రావాపాత్మకమైన కామము పూర్ణమగును. ఈ అధికరణముతో అనగా నారు అధికరణములతోనే కామశాస్త్రము పూర్తికావలసి ఉన్నది. లోకమున కొందరకు తంత్రావాపముల మూలమున కామప్రాప్తి లేకుండుట సంభవించుటచే నట్టివారి నిమిత్తము, బలాత్కార వశమున నొందుటకు ఔపనిషదికాధికరణము చెప్పవలసి వచ్చినది. అందువలన నీ అధికరణమున - సుభగంకరణము, వాజీకరణము, మున్నగు విషయములున్నవి. ఈ రీతిగా కామశాస్త్రము ఏడధికరణముల, మహాశాస్త్ర గ్రంథమైనది. ఇందు అరువది నాలుగు అధ్యాయములు, దరిదాపుగ పదునేడు వందల సూత్రములు కనుపడుచున్నవి.


వాత్స్యాయనము కామశాస్త్ర గ్రంథము. కేవల రాగవశమూలకములైన బంధన చుంబనాదికములను నిరూపించినను యథాతథముగ ననుసరింపుమని అభిప్రాయము


120

వావిలాల సోమయాజులు సాహిత్యం-4

కాదు. అందుకనియే "విపాకాహి శ్వమాంస స్యాపి వైద్య కే కీర్తితా ఇతి తత్కింస్యా భక్షణీయం విచక్షణైః" అని చెప్పినాడు. వైద్య శాస్త్రములు రసవీర్య విపాకములుగ కుక్క మాంసమును చెప్పినను విచక్షణులు భక్షింపని రీతిననే, ఇందును అనుసరింప వలయునని ఆయన అభిప్రాయము. 'బ్రహ్మచర్యమునకు పరమమైన సమాధిచే లోకయాత్ర సుఖముగ సిద్ధించి జగత్కల్యాణము జరుగవలెనని ఈ శాస్త్రము మావలన విహితమైనది' అని -


“తదేత బ్రహ్మచర్యేణ పరేణ చ సమాధినా, విహితం లోకయాత్రాయై నరాగార్థీస్స సంవిధిః" అను శ్లోకమున విస్పష్టముగ పలుకుటచే మహర్షి ఆర్ష హృదయము అభివ్యక్తమగుచున్నది.


మహర్షి జ్ఞాన విజ్ఞానములపారములు. ఈ రెంటి సమ్మేళనమూలమున త్రివర్గ ప్రతిపత్త్వాధ్యాయమున ధర్మార్థకామ స్వరూప నిర్ణయ మొనర్చినాడు. ఇతనికి స్మృతి, పురాణేతిహాస పరిచయమున్నట్లు అనేక సూత్రములు ప్రమాణము నొసగుచున్నవి. చతుష్షష్టి, నామము - ఏ రీతిగ ఏ శాస్త్రమునకు ఒప్పునది నిర్ణయమొనర్చు సందర్భమున 'ఋచాం దశత్రయీనాం చ సంజ్ఞతత్వా ది హాపి తదర సంబంధాత్... (2-2-4) అని చెప్పుట వలన వైదిక విజ్ఞానము వెల్లడియగుచున్నది. పతంజలి మహాభాష్య పరిజ్ఞానమున్నట్లు ఆయన సూత్ర రచనావిధానము చెప్పక చెప్పుచున్నది. చార్వాకాది నాస్తిక తత్త్వములు ఆయన గ్రహించినట్లు త్రివర్గ ప్రతిపత్త్యధ్యాయము వలన తెలియగలదు. న్యాయ, తర్కాది శ్రుత్యంగ పరిజ్ఞానము సర్వేసర్వత్ర ప్రమాణస్వీకరణ సందర్భముల గోచరించుచున్నది. కన్యాసంప్రయుక్తమున వివాహ ప్రకరణమున చేసిన నిర్ణయములు స్మృతి పరిజ్ఞానమును, పారదారికము రాజకీయ పరిజ్ఞానమును వెల్లడి చేయుచున్నవి. విద్యాసముద్దేశాధ్యాయమున - ఆయన కళా పరిజ్ఞానము, నాగరక అనాగరక దేశాచార పరిజ్ఞానము పరిస్ఫుటముగ నిరూపితమైనది. దేశసాత్మ్యముల వెల్లడించు సందర్భమున భౌగోళిక విజ్ఞానమును, ఔపనిషదాధికరణమున వైద్యశాస్త్ర విజ్ఞానమును వ్యక్తమగుచున్నవి. ఇక కామశాస్త్ర పరిజ్ఞానమున నతడేకైక విజ్ఞాని. జగదేక శాస్త్రకారుడు.


సాధారణాధికరణమున శాస్త్ర సంగ్రహాధ్యాయము మొదటిది. అందు ప్రథమమున కామశాస్త్రావతరణ కథనమును విశదీకరించి, వాత్స్యాయనుడు ప్రకరణాధికరణ సముద్దేశ మొనర్చి, సంఖ్యానిర్దేశమును, సూత్రకర్తల సంప్రదాయ విశేషములను పేర్కొనినాడు. ద్వితీయాధ్యాయమైన త్రివర్గ ప్రతిపత్త్యధ్యాయమున ధర్మార్థ కామములు


సంస్కృతి

121

పరస్పరానుబద్ధములగు రీతులను వ్యక్తమొనర్చి, శాస్త్రరచనావశ్యకతను నిరూపణ చేసినాడు. ఈ సందర్భమున మహర్షి నాస్తిక లోకాయతాది మత విమర్శన మొనర్చి ధర్మా చరణీయ సిద్ధాంతమును ప్రతిపాదించినాడు. కామమును సేవింపరాదనువారి వాదములు ఖండించు సందర్భమున ప్రతిపక్షులు సూపు అనర్థ జనసంసర్గ అసద్వ్యవసాయ అశౌచ అనార్య అనాయత్యాదులైన దోషములను త్రోసిరాజని 'శరీరస్థితి హేతుత్వాదాహర సధర్మాణోహి కామః' (1.2.46) అని కామమును శరీరస్థితికి హేతుభూతమనియును, ఆహారముతో తుల్యమైనదనియును నిర్ణయించినాడు. అంతేకాదు. 'ఫలభూతాశ్చ ధర్మార్థ యోః' (1.2.47) అని సూత్రీకరించి దానిని ధర్మార్థ సాధకముగ చెప్పియున్నాడు. అజీర్ణము మొదలగు దోషములందు ఏ విధమగు ప్రతీకారము నవలంబింతువో అట్టి ప్రతివిధానమును అవలంబించి కామమును సేవింపవలెననియును, దోషములున్నవని పరిత్యజింపరాదు, అని వాత్స్యాయనుని సిద్ధాంతము.


తదుపరి వచ్చు విద్యాసముద్దేశాధ్యాయమున త్రివర్గమును పొందినవానికి కామసిద్ధి కలుగవలెనన్న ప్రథమోపాయము విద్యాగ్రహణము. అందు మూలమున విద్యాసముద్దేశము మహర్షి పలికినాడు. ధర్మ (శ్రుతి స్మృతులు) అర్థ (వార్తా) విద్యలకు అడ్డురానిరీతిగ కామసూత్రమును తదంగ విద్యయైన చతుష్షష్టితో అధ్యయనము చేయవలెనని ఆయన నియమము." 'ప్రాగ్యౌవనాత్త్స్రీ' (1.2.2) అను సూత్రమున పురుషులవలె స్త్రీలకును అంగసహిత కామవిద్య అధ్యయనమునకు కావలెనట! స్త్రీలకు శాస్త్రములు పఠించు అధికారము లేదనియును, ఒకవేళ పఠించినను గ్రహించు సామర్థ్యము లేదు కావున, శాసించుట నిరర్థకమను పూర్వాచార్యుల మతమును త్రోసిరాజని, వాత్స్యాయనుడు 'ప్రయోగ గ్రహిణం త్వాసామ్. ప్రయోగస్య చ శాస్త్ర పూర్వకత్వాత్' (1.3.5) అని స్త్రీలకు ఈ శాస్త్ర విషయమున ప్రవేశముండవలెనని శాసించుట నిరర్థకము, అనర్థకము కాజాలదని సిద్ధాంత మొనర్చెను. కొందరు స్త్రీలకు శాస్త్ర గ్రహణము కూడ కలదనియును, పురుషులవలె శాస్త్రములను జదివి, తత్పరిశ్రమ మూలమున బుద్ధి సంపాదించిన వేశ్యాజనము, రాజకుమార్తెలు, సామంతపుత్రికలు ఉన్నారనియును నిరూపణ మొనర్చినాడు (1.3.12)


స్త్రీలు కామసూత్రములను ఏకాంతముగ నభ్యసింపవలెనట. వారి కాచార్యత్వము వహింపదగిన వ్యక్తులను వారి గుణగణములను వ్యక్తమొనర్చిన తదుపరి చతుష్షష్టి సంప్రయోగాంత మగుటచే దానిని విపులముగ వివరించి, వేశ్య, రాకొమరిత,


122

వావిలాల సోమయాజులు సాహిత్యం-4

మహామాత్ర దుహితాదులు దానిని నేర్చుకొనుట వలన కలుగు ఫలములు, పురుషులు నేర్చుకొనుట వలన కలుగు ఫలములను విశదీకరించినాడు. ప్రయోగశాస్త్ర గ్రహణముల రెంటిని నేర్చుకొనలేని పక్షమున కేవలము నొకదానినిగాని అందుకును చాలనపుడు సంప్రయోగాంగము నందలి భాగముగాని నేర్చుకొనవలెనని శాసించినాడు. (1.2.13)


నాగరక వృత్తము తదుపరి అధ్యాయము, ఇందు నాగరకుని గృహనిర్మాణ విధానము ప్రథమమున వివరించినాడు. గృహమున అంతర్గృహ, బాహ్యగృహ, బహిర్గృహములు, నందుండవలసిన వేదిక, అనులేపన, తాంబూల పాత్రికలు, వీణాదిస్థానములు, పతద్గృహము, చిత్రఫలకము, పుస్తకము, వర్తికా సముద్గకము, గోరింటమాలికలు, వృత్తాస్తరణము, ఆకర్ష ఫలకము, ద్యూత ఫలము, క్రీడాపంజరములు, ప్రేంఖాడోలిక, స్థండిల పీఠిక మున్నగు భవన విన్యాసములు చెప్పిన వెనుక నాగరకుల ప్రాతఃకాల కృత్యాదికములు వివరించినాడు. అటు పిమ్మట అపరాహ్ణ కాలకృత్యమును నిర్వర్తించిన వెనుక నాగరకు డొనర్పవలసిన కర్మలను చెప్పినాడు. అపరసంధ్యవేళ అలంకరించుకొని సంగీత వ్యాపారములు నిర్వర్తించి శయనరచన మొనర్చుకొని అభిసారికకై వేచి యుండవలెనట! తరువాత పర్వదినము లందొనర్పవలసిన గోష్ఠీవిభేదములు వివరించినాడు" అందలి ఆపానకవిధులు, కావ్య సంగీత నాట్యాది ప్రసంగములు గమనింపదగినవి. గ్రీష్మకాలమున జలక్రీడాదికములు, ప్రియులతో కూడి ఒనర్పవలెనని చెప్పి ఉన్నాడు. యక్షరాత్రి కౌముదీజాగరాది క్రీడలను తరువాత సంగ్రహముగ నిర్దేశించిన వెనుక నుపనాగరకుని గోష్ఠీ విధానమును గ్రామీణుల గోష్ఠీ విధానమును వ్యక్తమొనర్చినాడు. ఇట -


'నాత్యంతం సంస్కృతే నైవ నా అత్యంతం దేశభాషయా, కథాం గోష్ఠీషు కథయన్ లోకే బహు మతో భవేత్.' (1.4.50) అని నిబద్ధము చేసి గోష్ఠి సర్వజన విజ్ఞాన ప్రదముగ నుండునట్లు శాసించినాడు


మహర్షి ‘యాగోష్ఠీ లోక విద్విష్టా యాచ స్వైర విసర్పణీ పరహింసాత్మికా యాచ వతా మవత రేద్భుధః' అనుట వలన నా కాలమున వెలసిన కౌముదీ జాగరాది గోష్ఠులు లోక చిత్తానువర్తులని గ్రహింపవలసి ఉన్నది.


ఇక సాధారణాధికరణమున మిగిలినది నాయిక సహాయదూతకర్మ విమర్శాధ్యాయము. ఇందలి ప్రథమ సూత్రమును 'కామశ్చతురు వర్ణేషు సవర్ణ తశ్చా నన్య పూర్వాయం ప్రయుజ్య మానః పుత్రియో యశస్యో లౌకి కశ్చ భవతి' అను సూత్రము ననుసరించి కామము చతుర్వర్ణముల వారి యందును, సవర్ణముననుసరించి


సంస్కృతి

123

శాస్త్రముననుసరించి అనన్యపూర్వమై కన్యాత్వమును కోల్పోవని నాయికయందు ప్రవర్తమైన నది పుత్రీయము, యశస్యము, లౌకికమయినది వశ్యమగుచున్నది. తద్విపరీత కామము ఆ నాడు ప్రతిషిద్ధము. అని వరసిద్ధులందును, వేశ్యాస్త్రీల యందును, పునర్భువులయందును ప్రయోగితమైన కామము సుఖార్థము కాన నిషిద్ధము కాదు, శాస్త్ర విహితము కాదు. అందువలన శిష్టము కాదు. దీనిని బట్టి ఆ నాడు అధమవర్ణ వివాహము లున్నను అవి కేవల సుఖార్ధములని వక్తమగుచున్నది. వేశ్యా, పునర్భువులందు పుత్రాశలేదు. పునర్భువ పుత్రుడు పౌనర్భువుడు, పునర్భువ 20 కంటే వేశ్య స్థితి తక్కువ.


దీనిని బట్టి కన్యల వలన పుత్రుడు, అని వరసిద్ధులందును, పునర్భువ, వేశ్యలందు, సుఖము కామమును ప్రయోగించుట వలన కలుగుచున్నది. అంతేకాక ఇతర కారణముల వలన పరపరిగృహీత యైన స్త్రీ పాక్షికయగు నాల్గవ నాయిక అగుచున్నదని గోణికాపుత్రుని అభిప్రాయమును వాత్స్యాయన మహర్షి వెల్లడించినాడు. " పరపరిగృహీత యెడ కామము ధర్మవిరుద్ధము కాదా అని శంకించినచో, దానికి సమాధానముగ నామె ఉత్తమ వర్ణయైనను శీలము విడుచుట వలన ధర్మహాని కలుగదని చెప్పినాడు. ఆమె శీలభ్రష్ట కావున వేశ్యవంటిదట. అందువలన దోషము లేదట. దీనికి జయమంగళ వ్యాఖ్యాత 'జీవకార్ముక వస్తా వీన్దధ్యాదాత్మ విశుద్ధయే చతుర్ణామమి వర్ణానాం నారీర్హత్వా వ్యవస్థితాః' అని ధర్మశాస్త్ర ప్రమాణము ఉటంకించినాడు.


విధవను పంచమ నాయికనుగా గ్రహింపమను చారాయణుని అభిప్రాయమును, ప్రవ్రజితను షష్టనాయికగా స్వీకరింపమను సువర్ణనాభుని మతమును, అనన్య పూర్వయైన వేశ్యాదుహితనుగాని, కన్యకయయ్యు పాణిగ్రహ ధర్మము లేనిదై నాయకునికి పరిచర్య చేయునట్టి పరిచారికను సప్తమనాయికగ పొందవలయునను ఘోటకముఖుని అభిప్రాయమును ఉత్క్రాంత బాలభావయైన కులయువతిని అష్టమ నాయికగ స్వీకరింపమను గోనర్డీయుని అభిప్రాయమును మహర్షి ఈ సందర్భమున పేర్కొనినాడు. (1. 5. 22, 23, 24, 24)

"కార్యాంతరాభావాదేతా సామసి పూర్వాస్వేవోపలక్షణం తస్మా దేతా ఏవ నాయికా ఇతి వాత్స్యాయనః” అని పై సమస్తమునకును తన అభిప్రాయమును స్పష్టీకరించినాడు. పై రీతిన నాయికలు అష్టవిధములు అని పూర్వాచార్యులు నిర్దేశించినను ఈ నాయికలును "కన్యకలు, పునర్భవలు, వేశ్యలు, పరదారలు" అను నల్వురు


124

వావిలాల సోమయాజులు సాహిత్యం-4

చేయు కృత్యములనే చేయుట వలనను. తదితరములగు కృత్యములు వీరికి లేకుండుట వలనను వీరును నందే చేరుచున్నారని ఆయన అభిప్రాయము. నిజమునకును నంతే. విధవ, ప్రవ్రజికలు, పరదారలు, గణికాదుహితగాని పరదారగాని సుఖార్థమగుట వలన వేశ్యయందంతర్భూత లగుచున్నారు. కులయువతియైన నాయిక పుత్రమిత్రాది ఫలము కలిగినది కనుక, కన్యక కనుక నాయికలు నల్వురే. అందువలననే వారిని గురించిన అధికరణములు మాత్రము వాత్స్యాయనమున ఒప్పుచున్నవి.


తదుపరి గమనింపవలసిన సూత్రము 'భిన్నత్వాత్తృతీయా ప్రకృతి పంచమీత్సేకే అనునది. స్త్రీ ప్రకృతి పురుష ప్రకృతులకు భిన్నుడై ఔపరిష్టకాదులకు మైథున కర్మలకును, రూప వ్యాపారలాభ ముండుట వలనను నపుంసకుని అయిదవ నాయికగ పరిగణింపదగునని కొంద రాచార్యులు పలికిరని ఊరకొనినాడేగాని తన అభిప్రాయ వ్యతిరేకతను వ్యక్తపరుపలేదు.


నాయకుల విషయము వచ్చినప్పుడు 'ఏక ఏవతు సార్వలౌకికో నాయకః” (1.5.28) అని ఒక అర్థవాదమును పలికినాడు. కాని ఏకపత్నీవ్రత, బహుపత్నీ వ్రతాదులను బట్టియును, ప్రచ్ఛన్న బహిరంగాదులను బట్టియును, నాయకోప నాయకాది భేదములను బట్టియు, గుణములను బట్టియు, నాయక విభేదములున్నట్లు తదుపరి చెప్పియున్నాడు.


అగమ్యలను (సంప్రయోగము నెరపదగని వారు) గూర్చి తదుపరి ప్రసంగించినాడు. ఇట పరిశిష్ట న్యాయమున గమ్యలెవరో వాత్స్యాయన మహర్షి భంగ్యంతరముగ నిరూపించినాడనుట స్పష్టము. ఇట్టి నిరూపణ మొనర్చుటలో మహర్షి ధర్మ, మానసిక, శారీరకారోగ్యాది లక్షణముల ననుసరించి నియమించి నాడు. కుష్ఠురోగ, అతిశ్వేత, అతి కృష్ణాదులు ఆరోగ్య శాస్త్రసంబంధమున అగమ్యలు. సంబంధిని, సఖిప్రవ్రజిత రాజదారాదులు ధర్మమూలమున అగమ్యలు. ఉన్మత్త, దుర్గంధ ఇత్యాదులు మానసిక వికాస రహితలుగాను అగమ్యలు - 28. అగమ్యల విషయమున హిందూ, మహమ్మదీయ కామశాస్త్ర గ్రంథకర్తలు ఏకాభిప్రాయులై యున్నారు. గత యౌవనప్రాయను మహర్షి అగమ్యనుగ పేర్కొనినాడు. 'బాలార్కో ప్రేత ధూమశ్చ వృద్ధస్త్రీ పల్వ లోదకమ్ రాత్రే దధ్యన్న భుక్తిశ్చ ఆయుః క్షీణం దినే దినే' అను ఆర్యవచనమును దీని కానుగుణ్యముగ నున్నది. నఫోజైషేకు చిన్నదానితో రతి శక్తి నిచ్చుననియును, సమాన వయస్కవలన లాభముగాని నష్టముగాని లేదనియును, వృద్ధ స్త్రీ సంగమము విషసర్పము కాటు వంటిదనియును పలికినాడు. వంధ్య, మృతశిశు ప్రసవ


సంస్కృతి

125

ఇరువురు స్త్రీలను ఆయుష్కాముడు చేరరాదని వాత్స్యాయన మహర్షి పలికినాడు. ఆధునిక వైద్యశాస్త్రజ్ఞు లెల్లరును నీ విషయములను అంగీకరింతురు. రాబిన్ సన్ అను ఒకానొక వైద్యమహాశయుడు తన "షండత్వము” (Sexual Impotence) అను గ్రంథమున


" శృంగార పురుషులు ఈ రెండుజాతుల వారిని వర్ణింపవలసి యున్నది. వీరిలో ముఖ్యముగ గనోరియల్ సాల్ పింగిటిస్ గాని, సిప్లిసు రక్తము గాని ప్రవహించుట వలన షండత్వము కలుగుననుట నిస్సంశయము.” అని వ్రాసి యున్నాడు. 3 దుర్గంధను అగమ్యగ మహర్షి చెప్పి యున్నాడు. ఇట్టివారిని పరిత్యజించుటకు అమెరికా దేశమున విడాకుల చట్టములో నొక సూత్రమున్నట్లు “విడాకులలో శరీరస్థితి” (Sexual factor in Divorce) అను గ్రంథము వలన తెలియుచున్నది. బాల లక్షణములు గల స్త్రీయును అగమ్య. అట్టి స్త్రీని మానసిక శాస్త్రవేత్తలు 'బాలనారి' (Child Woman) అనినారు. ‘ఆమెలో Electra Complex అను నొకానొక గుణమో లేక స్వజాతి ప్రణయ లక్షణమో (Homo-Sexual tendency) ఉండునని నిశ్చయించినారు' అని ఆ గ్రంథకర్త వ్రాసినాడు


అగమ్యా ప్రసంగానంతరము నాయకునికి మిత్రులుగా నుండదగిన వారి లక్షణములను విశదీకరించి, వారికి కావలసిన దూత లక్షణములను "పటుతా ధార్ష్ట్య మింగితాకారజ్ఞతా అనాకులత్వం పర మర్మజ్ఞతా ప్రతారణం దేశజ్ఞానం కాలజ్ఞతా విషహ్య బుద్ధిత్వం లఘ్వీప్రతిపత్తిః సోపాయా దూతగుణాః (1.5.40) అను సూత్రమున నిబద్ధించినాడు.


త్రివర్గ విద్యాసముద్దేశముల మూలమున గుణములనొంది ఆత్మవంతుడై స్వరూప జ్ఞానము కలిగి 'ఆత్మవాన్ మిత్రవాన యుక్తః భావజ్ఞో దేశకాలవిత్, అలభ్యా మ ప్రయత్నేన స్త్రీయం సంపాదయే న్నరః' అని ప్రథమాధికరణ ప్రయోజనమును సంక్షేపించినాడు.


సాంప్రయోగికము ద్వితీయాధికరణము వెనుకటి అధికరణమున "స్త్రీయం సంసాధనయే న్నరః” అని చెప్పి ఆ ఆవాపమును వివరించుటకు ముందు సాంప్రయోగిక తంత్రమును మహర్షి వివరించినాడు. ఇది ప్రమాణాదుల మూలమున జ్ఞాతరూపము. లింగసంయోగాదుల కంటే ముందు భావకాలము అనునది కామశాస్త్ర ప్రమాణము. దీనిని బట్టి చేయదగిన రతావస్థాపనమును మున్ముందు విశదము చేయుటకై, సాంప్రయోగమున రతావస్థాపనమును ప్రథమాధ్యాయ మొనర్చినాడు.


126

వావిలాల సోమయాజులు సాహిత్యం-4

ఈ అధ్యాయారంభమున మహర్షి వాత్స్యాయనుడు లింగప్రమాణముల ననుసరించి స్త్రీ పురుష విభేదముల నొనర్చి ఉన్నాడు. తరువాతి కాలమువారు ఇతని మార్గము ననుసరింపక నందికేశ్వర గోణికాపుత్రాదుల మతమున స్త్రీని పద్మిని, చిత్తిని, హస్తిని, శంఖిని- అని చతుర్విధ విభాగము లొనర్చిరి. ఈ విభాగమున కొంత శారీరక లక్షణము (Physical Nature), కొంత మానసిక స్థితి (Psychological Disposition), కొంత జాత్యము (Sexual Temperment) కననగును.


పాశ్చాత్య దేశములందును స్త్రీ జాతి విభాగము అనాదికాలముననే ప్రారంభమైనది. అది కేవలము వారి మానసిక స్థితిని, సౌందర్యాతిశయములను అనుసరించునది. ఒవిడ్ మహాశయుడు 'ఆర్స్ అమటోరియా' గ్రంథమున నిట్టి విభాగమునకు పూనుకొనినాడు. కాని అది విస్పష్టరూపమును పొందలేదు. " ప్లేటో, సోక్రటీస్ లకు సమకాలికుడును వైద్య శాస్త్రజ్ఞుడు నైన, హిప్పోక్రేటిస్ స్త్రీ పురుష జాతులను రెంటిని వారివారి స్థితిననుసరించి (1) కంపనశీల (Nervous) (లేక) (2) వ్యాకుల (Meloncholic) (3) పైత్య (Bilous or Choleric) రక్తవర్ణ, ఉల్లాస (Sanguines) (4) శోషవాహిక (Lymphatic or Philematic) అని చతుర్విధ విభాగ మొనర్చి ఉన్నాడు. 2 కెట్షిమర్ మానవుల నందరిని (1) ఉద్వేగులు (Cyclothyme) (2) అనుద్వేగులు (Schizothyme) అని ద్వివిధ స్థూల విభాగ మొనర్చి, అందు రెంటను అనేక అవాంతర విభేదము లున్నవని పలికినాడు. మీడియర్ అను ఒకానొక సాంఘిక శాస్త్రవేత్త (Sociologist) స్త్రీజాతిని వారి మానసికోద్దేశ లక్షణము (Emotional makeup) ననుసరించి (1) మేహన లక్షణ లేక మాతృలక్షణ (Uterine or Maternal Type) (2) కామచ్ఛత్ర లక్షణ లేక జాత్యలక్షణ (Clitoroid or Sexual Type) అను ద్వివిధస్థూల లక్షణము నొనర్చి రెంటిలోను అనేక అంతర్విభేదము లున్నవని యున్నాడు. ఈ విభాగము లన్నియు దాంపత్యానుకూలతను దృష్టియందుంచుకొని యొనర్చినవే. నేడు పాశ్చాత్య దేశమున విశేష పరిశోధన జరిగిన మాంసగ్రంథి శాస్త్రము (Endorinology) ననుసరించినవి. ఈ శాస్త్రానుసారముగ మానవజాతిలోని స్త్రీ పురుష విభేదములు, అందలి అంతర్విభేదములు - మానసిక జాత్యములు (Psycho Sexual) రెండును - కొన్ని నాళరహిత మాంసగ్రంథులు (Ductless - Glands) కారణముగ నేర్పడినట్లు తెలియుచున్నది. ఈ శాస్త్రజ్ఞుల పరిశోధనల ననుసరించి స్త్రీ పురుష జాతులు రెంటను ప్రధానముగ చతుర్విధములు ఏర్పడినవి - (1) Pituitary Group (2) Thyroid Group (3) Thymus Group (4) Adrenal Group. వీటినిబట్టి స్త్రీ పురుష జాతులు స్థూలముగ నాలుగు విధములని ఏర్పడుచున్నది. ఆధునిక జాతి


సంస్కృతి

127

శాస్త్రజ్ఞుడు ఔస్ పెస్కీ ఇట్టి విభాగమునకు పూనుకొనక పోయినను, స్త్రీ పురుషులలో

నాలుగు జాతులున్నవని అంగీకరించి విశ్వనవ్య రూపము (A new Model of the Universes) అను గ్రంథమున వ్యక్తమొనర్చిన అభిప్రాయములను 'ఆధునిక వివాహ’ గ్రంథకర్త గ్రిఫ్ఫెత్ మహాశయుడు ఇట్లు సంగ్రహించినాడు.


"He says that in Sex-life men and women are devided in to four main types. Union between two wrongly assorted types produces discord and disharmony. Women of the first type, of whom there are few for each man, attract him irresistably, and, if the love is mutual' arouse the maximum of sensation. Women of the second type, of whom there are more, attract him also, but his feelings are more under the control of reason. This is a calmer love, and fits very well into the convensional pattern, passing more easily into friendship and sympathy. Women of the third type leave him indifferent. The feelings are weak, and the first satisfaction usually exausts all interest, and may even change to hostility. Women of the fourth type interest him still less and physical relationship with them contains a tragic element... Nothing is mere painful or immoral than sex relationship without sensations. ”


మానవ వైవాహిక సంబంధము శారీరకము (Physical) ఉద్వేగయుతము (Emotional) విజ్ఞానయుతము (Intellectual) ఈ మాటయందును శారీరకము ప్రాథమిక ప్రాధాన్యమును వహించుచున్నది. మహర్షి వాత్స్యాయనుడు ఈ సత్యమును గమనించి స్త్రీలను మృగి (Doe) బడబ (Mare) కరిణి (She-Elephant) అని మూడు జాతులుగ విభజించినాడు. పురుషులును శశ, వృష, అశ్వజాతులు, స్త్రీ పురుష లింగ ప్రమాణ విభేదముల ననుసరించి నవవిధ రతిభేదములు ఏర్పడుచున్నట్లు 'అత్రాపి ప్రమాణ వదేవ నవరతాని' (2.1.16) అను సూత్రమున వెల్లడించినాడు. వాత్స్యాయన మహర్షి చేసిన విభాగము నందలి మృగి, వాడవ, కరిణులు, లక్షణమును తెలుపలేదు. కాని కొక్కోకుడు, పద్మశ్రీ, వ్యాసజనార్దనుడు దీనిని గమనించిరి. కాని వారు వేరుమార్గమును త్రొక్కిరి. వాత్స్యాయనుని మతము ననుసరించి చూచినచో తరువాత వారి పద్మిని, మృగి, వాడవ, కరిణులలో నేజాతికైన చెందవచ్చును. అదేరీతిగ హస్తిని, చిత్తిని, శంఖినులును. పురుషులను శశ, మృగ, వృష, హయ జాతులుగను, స్త్రీలను పద్మిని (Lotous Woman), చిత్రిణి (Art-Woman) శంఖిని (Counch-Woman) హస్తిని (She

Elephant Woman) అను విభాగము నందికేశ్వర మతము. ఈ మతము ననుసరించిన గ్రంథములలో స్మర దీపిక ప్రథమమున పేర్కొనదగినది. తరువాత కొంత కాలమునకు పుట్టిన శార్గ్ఙధర పద్ధతి, కందర్ప చూడామణులు ఈ మార్గము ననుసరింపక స్త్రీ పురుష జాతుల రెంటిని మేహన ప్రమాణముల ననుసరించి పంచవిభేదములతో పరిగణించిరి. స్త్రీలు : (1) హరిణ (She-Deer) (2) ఛాగి (She-Goat) (3) వాడవము (Mare) (4) కరిణి (She-Elephant) (5) కరభి (She-Camel). పురుషులు: (1) మృగ (Harst) (2) వర్కరము (He-Goat) (3) వృషము (Bull) (4) తురగము (Stallion) (5) రాసభము (Jack-Ass). వీరి మేహన ప్రమాణములు 6, 8, 10 12, 14 అంగుళములని వారి అభిప్రాయము. స్త్రీభగ పరిధి లింగము పొడవును, మేహనము లోతును అనుసరించి ఉండునట. కాని అట్లుండని అవకాశములును కొన్ని సందర్భములందున్నవని కామసూత్ర వ్యాఖ్యాత యశోధరుడు (వ్యాఖ్య సూ.2.1.2) అందు నిరూపించినాడు. దీర్ఘ లింగము పలుచగ నుండవచ్చును. కుబ్జలింగము మందముగ నుండవచ్చును. అట్టి సందర్భముల మొదటి దానికి వాంశిక మనియును (Bamboo Type), రెండవ దానికి ముసలకమనియును (Club-Type) రతిమంజరీ, స్మరదీపికలు నామకరణ మొనర్చినవి.


రతావస్థాపనాధ్యాయమున మహర్షి రతివిభేదములను కేవలము మేహనప్రమాణ వైవిధ్యము ననుసరించి మాత్రమే కాక విసృష్టి, వేగములను బట్టియును నవవిధములని నిర్ణయించుట వలన ఆయన మానసిక నైశిత్యము, శాస్త్ర వైశాల్యము వెల్లడి అగుచున్నవి. మానసికముగ గాని శారీరకముగ గాని మానవజాతి సమము కాదనియును అందు అనంత వైవిధ్యమున్నదనియును మహర్షి గ్రహించినాడనుటకు సందేహము లేదు. అందువలన మహర్షి మతము ననుసరించి 'ప్రమాణకాల భావజానం సంప్రయోగాణా మేరైవేస్య నవవిధత్వా తేషాం వ్యతికరే సురతసంఖ్యా యానశ్యంతే కర్తు మతి బహుత్వాత్' (2.1.35) అను సూత్రమును బట్టి (9 × 9 × 9 = 729) ఏకోనత్రిశతృప్త శతవిభేదములు ఏర్పడినవి. విసృష్టికి ఉపచారాది క్రియలొనర్ప వలసినదని చెప్పినాడే గాని వాత్స్యాయనుడు వాటి స్వరూపమును నిరూపించలేదు. కొక్కోకుడును వాని పొంత పోలేదు. అనంగరంగ కర్త కరికరక్రీడ (Tittilation) మొదలైనవానిని నిశ్చయించి తన్మూలమున నేర్పడిన నవభేదములను చేర్చినాడు. అందుమూలమున రతివిభేదములు 9 × 9 × 9 × 9 = 6561 విభేదములు ఏర్పడుచున్నవి. పాశ్చాత్యజాతి శాస్త్రవేత్త

243ను మాత్రమే పేర్కొనినాడు. ప్రమాణ (Size) విసృష్టి (Time of Orgasm) వేగము

(Impulse) క్రియ (Amount of Stimulus) వీటినిబట్టి ఏర్పడిన రతివిభేదములను ప్రక్క పుటలోని పట్టికయందు విశదముగ కనవచ్చును.


ఈ రతావస్థానాధ్యాయముననే మహర్షి స్త్రీ పురుష విసృష్టి సంబంధమైన రతి (Orgasm) ని గురించి కొంత చర్చించి ఉన్నాడు. "పురుషునివలె స్త్రీ రతివిషయక విసృష్టి పొందదను పూర్వచార్యుల మతమును ఖండించి, స్త్రీకిని విసృష్టి సుఖమున్నదని నిరూపించినాడు. 'పురుషుడు విసృష్టి సుఖమును అనుభవించి కృతకృత్యుడై స్త్రీయెంత ప్రేరేపించినను మైథున కార్యమునుండి విరమించుచున్నాడు. స్త్రీకి స్వేచ్ఛగ విరమించుట యనునది లేదు. అందుమూలమున వారికి విసృష్టి సుఖప్రాప్తి పురుషునివలె లేదు. చిరకాలము భోగించి విసృష్టి సుఖమును పొంది భోగవ్యాపారమును శీఘ్రవేగుడగు నాయకుడు విరమించిన స్త్రీలు ద్వేషించుచున్నారు. దీనివలన వారికి భావప్రాప్తి ఉన్నదని వ్యక్తమగుచున్నది. కాని అది విసృష్టి సుఖానుభవము వలన కలిగినదా? లేక స్త్రీలకు సహజమగు కండూతి ప్రతీకారము వలన కలిగినదా? అని ప్రశ్నించుకొని 'తస్మాత్ సందిగ్ధత్వా దల క్షణ మితి' (2.1.30) స్త్రీ పురుషునివలె రతిని పొందుట లేదనియును సంయోగే యోషితః పుంసాం కండూతి రపనుద్యతే తచ్చాభిమాన సంపృష్టం సుఖమిత్యభిధీయతే (2.1.31) అను సూత్రమున కండూత్యపనోదము వలన కలుగునట్టి అభిమానయుతమైన సుఖస్పర్శనే కారణమునందు కార్యమునుపచరించి అభిమానిక విధమగు సుఖమని స్త్రీ చెప్పుచున్నదని ఔద్దాలకి అభిప్రాయము. ఆరంభము నుండి భావమును పొందుననియును, పురుషుడు రతాంతమున శుక్రనిసర్గమున భావమును పొందుననియు బాభ్రవ్యుడు దానిని ఖండించినాడు. 'ఏత దుపపన్నతరం' అని దానిని సమర్థించి, వాత్స్యాయనుడు భావప్రాప్తి వలన స్త్రీ తృప్తి, విసృష్టి సుఖప్రాప్తి వలన గర్భధారణ పొందుననెను. దీనికి జయమంగళ వ్యాఖ్యాత సుశ్రుతాచార్యులవారి 'యథా నా రీ చ నా రీ చ మైథునాయోపపద్యతే, అన్యోన్యం ముంచతః శుక్ర మవస్థ స్తోత్రజాయతే' అను శ్లోకము నుదహరించి ఇరువురు స్త్రీలు మైథున మొనర్చుట కారంభించినపుడు పరస్పరము శుక్రము వదలుట వలన అవస్థి పుట్టునని అందువలన స్త్రీకి విసృష్టి సుఖమున్నదనియును వ్యాఖ్యానించినాడు. ఈ సందర్భమున 'సురతాంతే సుఖం పుంసాం స్త్రీ ణాంతు సతతం సుఖం ధాతుక్షయ నిమిత్తా చ విరామే చ్చోపజాయితే' (2,1.40) అను సూత్రమున స్త్రీకి సురతారంభము నుండి సుఖము కల్గును. ధాతుక్షయనిమిత్తముగా విరామేచ్ఛ కలుగును అని నిశ్చయించినాడు.

మహర్షి విసృష్టిని గురించి యొనర్చిన చర్చ యెంతయు సమంజసముగ నున్నది. ఆధునిక జాతిశాస్త్రజ్ఞుల అభిప్రాయములు కానుగుణ్యముగ నున్నది. ఆధునిక వివాహమను గ్రంథమున గ్రిఫ్ఫెత్ మహాశయుడు ఇట్లు వ్రాసి ఉన్నాడు. "స్త్రీ పురుషులకు విసృష్టి సుఖము పరస్పరమున్న కాని పరిపూర్ణ సంభోగ రసానుభవము కలుగదు. మూఢులైన నాయకానాయికలు వ్యక్తిగతముగ స్వేచ్ఛగ విసృష్టి సుఖమును పొందగలుగుదురు, పురుషుని శుక్ర వినిర్గమమునకు పూర్వమే స్త్రీ ఒకటి రెండు మారులు స్యందనము పొందవచ్చునని నేను అంగీకరింతును. కాని ఏక కాలమున నిరువురును పొందిన విసృష్టితో నిది సమము కాదు. శుక్రబహిర్గమను సంభోగము (Coitus Interruptus) నొనర్చువారికి అట్టి విసృష్టి సుఖము లభ్యము కాదు. ఈ అభిప్రాయమునే మహాశయుడు Havelock Ellis ఇట్లు చెప్పినాడు.


“The whole structure of the world is built upon the general fact that the intimate contact of the male and female who have chosen each other is mutually pleasurable. Below this general fact is the more specific fact that in the normal accomplishment of the act of sexual consummation the two partners experience the actual gratification of simultaneous orgasm. Herein it is said, lies the secret of love"


స్త్రీలు వదులు నీ శుక్ర మెచ్చటిదను ప్రశ్న ఉదయించగా మనవారు అది రసధాతుజనితమై అసృగ్ధాతునే (రక్తధాతువు) ఒక స్థితిలో ఆర్తవమనిపించుకొను ననియును, అది మజ్జాధాతువు నుండి పుట్టినదని అభిప్రాయములో పడినారు. పాశ్చాత్య శాస్త్రజ్ఞులలో వాన్ డివెల్డి ఈ విసృష్టి మూలకమైన స్త్రీ శుక్రము బర్తలోనియన్ గ్లాండులనుండి నరముల ఒత్తిడి మూలమున బయటకు స్రవించునని అభిప్రాయ మిచ్చినాడు. కాని అనేకులు సుప్రసిద్ధ వైద్య శిఖామణులు దీనినంగీకరింపక, ప్రాచీనులు చెప్పినట్లు అది మజ్జాధాతు సంబంధమైన దనినారు. స్త్రీ శుక్ర సంబంధమైన అనేక విశేషాంశములు వైద్యశాస్త్రజ్ఞులు వెల్లడించినారు.


'జాతే రభేదాద్దుపత్యోః సదృశం సుఖమిష్యతే, తస్మాత్తథోపచర్యా స్త్రీయథాగ్రే ప్రాప్నుయాద్రతిమ్' అను సూత్రము వలన వాత్స్యాయన మహర్షి జాతిభేద రహితమగు స్త్రీ పురుషులకు సదృశముగనే సుఖము కలుగునని చెప్పియున్నాడు. కండూతి నివారణమును బట్టియును, శుక్రక్షరణమును బట్టియును, స్త్రీలకు కలుగు సుఖము ద్వివిధము. అందును శుక్రక్షరణము స్యందనమని విసృష్టియని మరల ద్వివిధము. స్యందనము వలన క్లిన్నత, విసృష్టి, మథనముల వలన సుఖము కలుగును. ఇది రతి మధ్యస్థితి. చివర విసృష్టి సుఖము పురుషునివలె స్త్రీకిని పూర్ణముగ లభించును అని ప్రాచ్యుల నిశ్చితాభిప్రాయము. విసృష్టి సంబంధమైన స్థితిని ముత్తెరగులుగ విభజించి దాని స్వరూపమును “The libido may be devided into 3 phases. The anti orgastic, orgastic and post-orgastic phases. During the anti-orgastic stage, the lustful sensation grows by degrees in intensity upto the moment of commencing ejaculation. The libido then remains relatively constant for sometime, the larget last swells then suddenly to the maximum and reaches its acme, the orgasm at the instant of emission అని టాల్మీ మహాశయుడు 'ప్రణయము’ అను గ్రంథమున వ్రాసియున్నాడు. '


ఈ అధ్యాయమున మహర్షి చెప్పిన 'ప్రథమ రతే చండవేగతా శీఘ్రకాంతా చ పురుషస్య ముత్తరేషు యోషితః పునరేత వేవ విపరీత మాధాతుక్షమాత్' అను సూత్రములోని అర్థము వలననే బంధవిభేదముల ఆవశ్యకత ఏర్పడినది.


తదుపరి వాత్స్యాయనుడు ప్రీతిలక్షణములను వివరించినాడు. ఆ ప్రీతి విభేదములు నాలుగు (1) అభ్యాసిక (2) అభిమానిక (3) సంప్రత్యయిక (4) విషయకములు. ఇందు అభిమానిక ప్రీతి విషయమున 'ప్రకృతే ర్యాతృతీయస్యాః స్త్రియా శ్చైవోపరిష్టకే తేషు తేషు చ విజ్ఞేయా చుంబనాదిషు కర్మసు' (2.1.74) గమనింపదగినది. స్త్రీ పురుష ప్రకృతుల రెంటను చేరని తృతీయా ప్రకృతులకును (నపుంసకులు) ముఖచాపల్యముగల స్త్రీకిని ఔపరిష్టక రతియందును, అట్టివేయగు చుంబనాదికములందును రాగసంకల్పము వలన కలుగు ప్రీతి అభిమానికము.


సాంప్రయోగికమున ద్వితీయాధ్యాయమున ఆలింగన విచారాధ్యాయముల చుంబన వికల్పము, నఖరదన జాత్యాద్యధ్యాయములు, దశనచ్ఛేదాద్యధ్యాయములు తదితరములు.


రతావస్థాపనానంతరము వాత్స్యాయనుడు సంప్రయోగ స్వరూపమును నిరూపించినాడు. దీనికి చతుష్షష్టి యను నామాంతరమున్నట్లు చెప్పి అందుకు కారణముగ నొక సూత్రమును వ్రాసినాడు. సంప్రయోగము - (1) ఆలింగనము, (2) చుంబనము, (3) దంతక్షతము, (4) నఖక్షతము, (5) సీత్కృతము, (6) పాణిఘాతములు, (7) సంవేశనము, (8) ఉపసృప్తము, (9) ఔపరిష్టకము (10) పురుషాయితములు.

ఇందు ఆది అగు ఆలింగనము బాహ్యరతి సమయమున - స్పృష్టక, విద్ధక, ఉదష్టక, పీడితములని నాలుగు విధములును, రతి సమయమున వృక్షాధిరూఢ, తిలతండుల, క్షీరనీర, లతావేష్టితములని నాలుగు విధములును (2.2.7-16), ఇందు సంప్రయోగ కాలము లందు లతావేష్టితక, వృక్షా దిరూఢకము కలదు. నాయిక ప్రయోక్తిగ నుండవలెనని యశోధరుని వ్యాఖ్యానము. ఈ ఉభయమునకు వాత్స్యాయనుడు స్థితకర్మ లనినాడు. (22.18) తదుపరి ఏకాంగోపగూహనములుగ ఊరు, జఘన, స్తన, లలాటికాలింగనములను సువర్ణనాభుని మతమును పేర్కొనినాడు. వీనిలో రతి పూర్వరంగమునకు (బాహ్యరతి) సంబంధించిన నాల్గింటిలో స్పృష్టక, ఉద్ఘాట్టక, పీడితకములను వదలి తదుపరి వచ్చిన ఏకాంగోపగూహనములలోని ఊరు, జఘన, లలాటి కాలింగనములను గ్రహించి అనంగరంగాది కామశాస్త్రజ్ఞులు ఆలింగన షష్ఠమును మాత్రమే పేర్కొనినారు. కుట్టనీమత కర్త, దామోదరగుప్తుడు చక్రవాక, హంస, నకుల, పారావతాది ఆలింగన విధానములను పేర్కొనినాడు. కామసూత్రముల లోనే ఆమోద, ముదిత, ప్రేమ, ఆనంద, రుచి, మదన, వినోదాలింగనములను గూర్చి 'పృచ్ఛతాం, శృణుతాం వాపి తథా కథయతా మపి ఉపగూహనవిధిం కృత్నం రిరంసా జాయతేః శృణాం' (2.2.30) అను సూత్రమున ఉక్తి వైచిత్య్రముతో వెల్లడించి మనుజులకు రిరంస (కామేచ్ఛ) కలిగించుటయే వీని ప్రయోజనమని స్పష్టముగ పలికినాడు.


ప్రణయ చుంబనము మానవుని కొకనాడు లభ్యమైన గుణము కాదని ఎల్లిస్ అభిప్రాయము. చుంబనమును ప్రపంచములలోని వివిధ జాతులు వివిధ రూపముల అనేక భావములకు వెల్లడి యొనర్చుట కుపయోగించు చున్నారు. 'వివాహ గ్రంథకర్త వాన్ డి వెల్డి చుంబనమున రుచి, స్పర్శ, గంథములున్నవనినాడు. ' అభిప్రాయమున కనుగుణముగ కెన్నెత్ వాకర్ "Kisses provide a fitting prelude to love, and all the great Eastern works on the subject devote much attention to the art of kissing, the lover's kiss the tongue often plays the part so that other special senses contribute their quota to it; Taste and smell are added to tacitile sensation. In this connection it will be remembered that it was said of the kisses of POPPAEA that they had about them the favour of wild berries. It is, however among the Mongolian Races that the olifactory component of the kisses enters so iargely into courtship. In the kiss of Europeans touch predominates over smell" (Physiology of sex page 47) వాత్స్యాయన మహర్షి స్త్రీ పురుషాది విభేదముల ననుసరించి చుంబన వికల్ప ప్రకరణమున స్థానక్రియా రూపాదికములను చక్కగ నిరూపించినాడు. చుంబనాది పంచకములో ముందు వెనుకలు లేవనియును (2.3.4) “సర్వసర్వత్రరాద స్యాన పేక్షితత్వాదితి వాత్స్యాయనః' అనుచోట సమస్త శరీరమును ప్రయోగ యోగ్యస్థానమనియును పలికినాడు (23.3.)


మహర్షి వాత్స్యాయనుడు అతి నిశిత విచక్షణతో చుంబనమును ముగ్ధయగు కన్యక యొనర్చు నిమిత్తము మొదలు ప్రౌఢ యగు నాయిక యొనర్చు జిహ్వాయుద్ధము వరకును పరిశోధించి విభజించినాడు. చుంబన యోగ్య స్థానముల విషయమున కామసూత్రములకును, రతిమంజరికిని విశేష విభేదము కనుపించుచున్నది. రతిమంజరీకర్త యోనిని చుంబన యోగ్య స్థానముగ నిరూపింప మహర్షి దానిని ఊరుసంధిగనే పలికినాడు. 4 తొడలు, క్రీగడుపుపై నొనర్చు చుంబనమునకు నాగరసర్వస్వకర్త పద్మశ్రీ సంహతోష్టము అని నామకరణమొనర్చెను. పాశ్చాత్యుల ‘Brush and Bloom' అను చుంబనమును వాత్స్యాయనుడు నమితమని వ్యవహరించి నూతన వధూపరము గావించినాడు. కామసూత్రములలోని ఉద్ఘాంతమును రతి రహస్యకారుడు ఉద్ఘాంతక మనినాడు. దీనిని నాగరసర్వస్వము భ్రమిత మనియును, అనంగరంగము తిర్యక్కనియును వ్యవహరించినవి. కామ గ్రంథముల 'ప్రతిబోధ' మను పేరనున్న చుంబన విధానము చుంబన విధానము కాజాలదని నేటివేత్తల అభిప్రాయము. వాత్స్యాయనుని సూత్రములు కనిపించిన (1) సూచి, (2) ప్రతత (3) కరి అను చుంబన విభేదములను పద్మశ్రీ నిరూపించినాడు. కామసూత్రములందున్న చుంబన ప్రతిచుంబన విధానముల కాలస్థలజాతి విభేదములను పరిశీలించినచో ప్రాచీన భారతీయుల కామకళ ఎట్టి ఉచ్చస్థితి నొందినదో తేటపడగలదు. వాత్స్యాయన మతమున చుంబనములు 13. (1) నిమిత్తకము (Perfunctory kiss) (2) స్ఫురితము (Tremoulous) (3) ఘట్టితకము (Driving) (4) సమ (Straight) (5) వక్ర లేక తిర్యక్ (Oblique) (6) ఉాద్భ్రాంతము (Errastic) (7) అవపీడితము (Compressed) (8) శుద్ధావ పీడితము (Soft-Pressed) (9) చూషణము లేక అధరపాన (The sucking or lip drinking) (10) ఆకృష్ట (Drawn-up) (11) ఉత్తర చుంబిత (Concurrent kiss) (12) సంపుటక (Cupping) (13) జిహ్వాయుద్ధ (Tongue tilting). " ఇంతేకాక ప్రాతిబోధ (Awaking kiss) ఆది చుంబన విభేదములును కామసూత్రములందు కనుపించుచున్నవి. కార్డ్స్ ఎబ్బింగు, ఫ్రాయిడ్ మొదలగు ఆధునిక విజ్ఞానులకంటే నెంతో పూర్వము భారత, రోమకదేశ కామకళా శాస్త్రవేత్తలు కామతంత్రమున చుంబన స్థానమును గమనించి తదనుగుణముగ శాస్త్ర రచన చేసియున్నారు. ఇట్టి విభాగావశ్యతకు స్త్రీ జాతిలోని అహంభావ పూర్వకమైన అర్ధరహితత (Mosochistic tendencies of a sex-conscious women) ప్రాచీనులు గుర్తించుటయే కారణము. కామ ప్రేరణమున చుంబన శక్తిని గమనించుటయును మరియొక కారణము. ఆ శక్తిని గూర్చి ఆధునిక వివాహ కర్త గ్రిఫ్ఫెత్తు అన్న మాటలు సమంజసములు ఈ వాక్యములకు మహర్షి అంగీకారమును నున్నది. గ్రిఫ్ఫెత్తు మహాశయుడు "నేటి ఆధునిక స్త్రీ చుంబన క్రియ పురుషకర్మయని భావించుట కానవచ్చుచున్నది. అది పొరబాటు. అతడెట్లు చుంబించినచో ఆమెయునట్లు చుంబింపవలెనని” ఈ నాడు పాశ్చాత్య దేశములకు చెప్పవలసి వచ్చినది. " మహర్షి రెండువేల వత్సరములకు మున్నే "కృతే ప్రతికృతం కుర్యా త్తాడితే ప్రతితాడితం, కరణేనచ తేనైవ చుంబితే ప్రతిచుంబితమ్” అని స్త్రీ లోకమునకు శాసనమొనర్చినాడు. (2.3.34)


స్మరదీపిక నాగర సర్వస్వాది కామగ్రంథములందు చూషణము (Sucking) అను మరియొక సంప్రయోగాంగము (Form of Love Play) కనుపించు చున్నది. పద్మశ్రీ ఇందలి - ఓష్ఠ విమృష్టకము, చుంబితకము, అర్ధ చుంబితకము, సంపుటకము - అని నాలుగు విభేదములను చెప్పినాడు. ఇవి వాత్స్యాయనుని చూషణ చుంబన విభాగములేగాని అన్యములు కావు.


తదుపరి కామసూత్రకర్త నఖాదానమును గురించి ప్రసంగించినాడు. ఉపయోగింపవలసిన సమయములను "తస్య ప్రథమసమాగమే ప్రవాస ప్రత్యాగమనే క్రుద్ధ ప్రసన్నాయాం మత్తాయాం చ ప్రయోగో ననిత్య మచండ వేగయోః" (2.4.2) అను సూత్రమున విశదీకరించినాడు. రాగోద్దీపన యైన తదుపరి స్థాన మస్థానమనిగాని సమయములని గాని నిబంధనలు లేనట్లు సువర్ణనాభుడు (2.4.6) సూత్రములందు 'కక్షా స్తనౌగళః పృష్ఠం జఘనమూరూచ స్థానాని' (2.4.5) అని స్థాన నిర్దేశమున్నది. స్మరదీపిక కారుడు ఇంత కంటే భిన్న స్థానముల పేర్కొనినాడు. కొక్కోకుడు మాసిక రజోదర్శనానంతర కాలమున కొన్ని దినములు నఖాదాన యోగ్యములని చెప్పినాడు. చండ, మధ్య, వేగల నఖలక్షణము లెట్లుండవలెనో వాత్స్యాయన యశోధరులు వెల్లడి చేసినారు. ఈ సందర్భమున మహారాష్ట్ర దాక్షిణాత్యుల నఖలక్షణములు నిరూపితములైనవి. (2.4,10,11) నవవిధములైన నఖాదాన రీతులు కామసూత్ర కర్త మతమున నేర్పడినవి. (1) ఛురితకము (Clasping of the Nails) (2) అర్ధచంద్రకము (Half Moon) (3) మండలకము (Circle) (4) రేఖా (Vertical Lines) (5) మయూరపాద (Peacock Foot Print) (6) వ్యాఘ్రపాద (Tigers claws) (7) శశప్లుతకము (Poping of the Hare) (8) ఉత్పలపత్రకము (Lotus Petal) ఇందు రేఖ నెటనైన ప్రయోగింపవచ్చునని వాత్స్యాయనుని మతము. కేవలము చేతులు, తొడలు, స్తనములు, గుహ్యాంగము (Mons Veneris) నందును మాత్రమేనని అనంగరంగకర్త. వాత్స్యాయనుని వ్యాఘ్ర నఖస్థాన ములకు భిన్నముగ నాగరసర్వస్వకర్త తొడలు పిరుదులపై ప్రయోగింప వచ్చుననినాడు. ఉత్పలపత్రము విషయమునను కామసూత్రకర్తకును, అనంగరంగకర్తకును అభిప్రాయభేదమున్నది. అంతమున 'ఆకృతి వికార యుక్తాని చాన్యావ్యపి కుర్వత' (2.4.23) అని అనురాగము నేర్పు ననుసరించి నఖాదానమొనర్పవలెననియును, ఇందు చెప్పిన వికల్పములు మాత్రమే కాక అనంతభేదమున్నదని యను పూర్వాచార్యుల మతమైనట్లు పలికినాడు. (2.4.24) రాగ సంజననము కొరకు వైచిత్య్రమును అపేక్షించుట లోకసహజ మగుటవలన నఖాదానములొనర్చినను పరదారల విషయమున రహస్య ప్రదేశములందు మాత్రమే ప్రయోగింప వలెనని చెప్పినాడు. (2.4.26) నఖక్షత దేహములు స్త్రీ పురుషుల కిరువురకును రాగవర్ధకములని ఆయన నిశ్చయము - అందువలననే ప్రాచీనులు 'సహసా నఖంపచ స్తన దత్త పరిరంభ' సంభోగులైనారు. వేశ్యలు 'గరజలేఖాలంకృత కుచయుగళ' లైనారు.


దశనచ్ఛేద్యమును (Morsification) అతి గాఢమైన చుంబన విధానముగ పాశ్చాత్యులు పరిగణించినారు. 'రదనములు పెదవులను ఒకచోట చేర్చుటకే కాక అవి ప్రీతి నచుంబన సమయముల రాగవృద్ధికరములుగ నుపకరించు చున్నవి. సంప్రయోగమున ప్రధాన అప్రధాన పాత్రలు (Active and Passive Partners) ఇరువురును నిశితములు, మధురములు అయిన రదనచ్ఛేద్యముల మూలమున శృంగారకానందము (Erotic Pleasure) ను పొందుదురు. కాని అట్టివారిని ఒకదాని వెనక ఒకదాని పరస్పరము ఏకస్థానీయము అగునట్లు ప్రయోగింపవలయును. నాయికా నాయకులు భావప్రాప్తి అత్యున్నత స్థాయిని పొందినప్పుడు వారు దంతముల నుపయోగించుదురు. అట్టి సమయముల వారికి ఎట్టి క్రియలును వైపరీత్యము (Abnormal గ తోచవు' అని ఒక ఆధునిక శాస్త్రజ్ఞుడు దంతక్షత ఆవశ్యకతను గూర్చి పలికినాడు. మరికొందరు శాస్త్రజ్ఞులు దీనిని వైపరీత్యముగ నెంచుటమాని, ఒక మతము దంతక్షతాదాన సహన గుణములు వివాహితులకు కొంతవరక వసరమనియు చెప్పుచున్నారు. అన్య శాస్త్రకారాదృష్ట అధ్వగుడైన వాత్స్యాయనుడు రదనచ్చేదావశ్యకతను, కామతంత్రమున తత్థానమును గమనించి నిరూపించినాడు. జయమంగళకర్త 'ఆలింగనాదయో దేశ ప్రవృత్తి, మనిరూప్య ప్రయుజ్యమానా నరాగ హేతవ' అని హెచ్చరించి ఉన్నాడు. 'గూఢక (Hidden) ముచ్ఛూనక (Swollen) బిందు (Spot) బిందుమాలా (Chain of spots) ప్రవాళమణి (Coral) ప్రవాళ మణిమాలా (Coral chain) ఖండాభ్రకం (Broken cloud) వరాహచర్వితక (Boars) మితి దశనచ్ఛేదన వికల్పాః (2.5.4) అనుసూత్రమున వీటి భేదములను నిరూపించినాడు. ఉచ్ఛూనకమును వాత్స్యాయనుడు లోపలి పెదవిపై ప్రయోగింపనగు నని చెప్పగా అనంగరంగకర్త ఎడమ బుగ్గను దానిస్థానముగ చెప్పినాడు. ప్రవాళమణి రదనక్షతమును కామసూత్రములు అనేక మారులుగ ప్రయోగించి చూపమును పొందవలెనని చెప్పగా అనంగరంగ కర్త కల్యాణమల్లుడు పొరపాటు పడి కఠినముగ కొఱికి ఒక మారే యొనర్పవలెననినాడు. కల్యాణమల్లుడనినట్లు ప్రవాళమణి స్థానము పై పెదవి కాదు. దక్షిణ చుబుకము నందును ప్రయోగింపవచ్చును. మహర్షి అట్టొనర్చిన దానిని మండల రదనచ్ఛదముగ పరిగణించినాడు. “తదుభ మపిచ చండ వేగయోః" (2.5.18) అను సూత్రము ననుసరించి స్త్రీ పురుషులిరువురును వీనిని ప్రయోగింపవలయునని శాస్త్రకారుల మతమైనను విశేషముగ నివి పురుష ప్రవర్తకములుగ ప్రాచ్య దేశములందు కనిపించుచున్నవని పాశ్చాత్య జాతిశాస్త్ర వేత్తల అభిప్రాయము.

రాగోద్దీపక క్రియలలో కచాకర్ష మొకటి. (Hair-Caressing) ఈ కేశగ్రహణము నేటి వరకును పాశ్చాత్యలోకము లెరుగవట! కామసూత్ర రతిరహస్యములందు కచాకర్షణ విధానములు కనిపింపవు. పంచసాయకములోని ఒకానొక ప్రతిలో ఒక విధానమున్నది. మరియొక విధానము నాగరసర్వస్వము నందున్నది.' అనంగరంగమునకు ప్రతిరూపమైన కామప్రబోధమున వీని స్వరూప స్వభావాదులు విశదముగ కనుపించు చున్నవి. ఇట్టి ఉద్దీపన క్రియలలో చేర్చదగిన మరికొన్ని మర్దనములు (Squeezes), గ్రహణములు (Grasps) కనుపించుచున్నవి. ఇవియును పూర్వ గ్రంథములందు లేవు. ఇవి బాహ్యరతులు. కరతాడన విధానముల పురుషులొనర్పదగిన వానిని నాల్గింటిని, స్త్రీ లొనర్పదగిన వానిని నాల్గింటిని అనంగరంగ కర్త పేర్కొనినాడు. పద్మశ్రీ కొన్ని మర్దనములను, గ్రహణములను చెప్పినాడు. ఆది పితకము (Enkindling) స్పృష్టకము (Touching) కంపితకము (Throbbing) సమిక్రమము (Attacking all about) ఇవి మర్దనరీతులు - బద్ధముఖి (Close Grasp) - వేష్టితకము (Twinning) కృతగ్రంథికము (Knotted tightly) సమకృష్టి (Pinching) గ్రహణములు ఔపరిష్టక సీత్కృతములును బాహ్యరతిలోనివే. వీనిని మహర్షి వేరు అధ్యాయముల విశదీకరించెను.

సంవేశన చిత్రరతాధ్యాయము (Modus sexualis) నకు ముందు మహర్షి దేశసాత్మ్యము ననుసరించిన ఆయా దేశీయములగు ప్రవర్తనములను విశదపరచినాడు.‘ప్రకృత్యా మృద్యో రతిప్రియా అశుచి రుచయో నిరాచారాశ్చాంద్య్రః' (2.5.28) అని ఆంధ్ర స్త్రీ లక్షణమును చెప్పినాడు. దేశ సాత్మ్యముల వివరించు సందర్భముల కొక్కోకుడు వాత్స్యాయను ననుసరించినాడు. పద్మశ్రీ నూతన మార్గమును త్రొక్కినాడు. మాళ్వ దేశ సాత్మ్యమును గూర్చి వాత్స్యాయనుడు 'పరిష్వంగ చుంబన నఖదంత చూషణ ప్రధానాః క్షత వర్ణితాః ప్రహనం సాధ్యాః అభీర్యశ్చ' (2.5.24) అని వాత్స్యాయనుడు, కొక్కోకుడు, చూషణమును వదలినారు. అనంగరంగకర్త వారికి కరతాడనాదికములన్న ఇష్టమనినాడు. ఆంధ్ర స్త్రీలను వాడవకము (The art of holding the Linga by SPINCTER CUNNI Muscles) అని అందరు నంగీకరించినారు. (రతిరహస్యము - V-14) కర్ణాటక స్త్రీల సాత్మ్యమును గూర్చి నాగరసర్వస్వమును పూర్వగ్రంథములు ప్రసంగింపలేదు. కోసల స్త్రీలకు యోనికండూతి విశేషమనియును, కామతంత్రము నెరిగినవారని అనంగ రంగము, వీరు చండవేగలని అపద్రవ్య ప్రధానలు (Artificial Phallus) అని వాత్స్యాయనుడు (2.5.27). పాటలీపుత్ర స్త్రీలను గురించి కామసూత్రములందు ఎట్టి ప్రసంగమును లేదు. అనంగరంగకర్త నాగరీలక్షణములనే పాటలీపుత్ర స్త్రీల సాత్మ్యముగ చెప్పి ఉన్నాడు. వంగదేశమునకు పశ్చిమమున నున్నది స్త్రీ రాజ్యమని వ్యాఖ్యాత అభిప్రాయము. వారు ఖరవేగలు అపద్రవ్య ప్రియలు అని వాత్స్యాయనుని అభిప్రాయము. 'సకల చతుష్షష్టి ప్రయోగ రాగిణ్యో అశ్లీల పరుష వాక్యప్రియాః శయనే చ సరభసోషక్రమా మహారాష్ట్రన్' (2.5.28) అని మహారాష్ట్ర స్త్రీ లక్షణమును వాత్స్యాయనుడు వచించినాడు. దానినే కొక్కోకుడు గ్రహించినాడు. వీరికి గాఢరమేచ్ఛ కలదనియును, ఆలింగన చుంబనాదికము లందు ఆసక్తికలవారనియును, సంభోగమునకు ముందు కరికరక్రీడ (Titilation) ను వాంఛింతురనియును పలికినాడు. వంగగౌడ లౌహిత్య కామరూప స్త్రీలకు నాగరసర్వస్వ కర్త అధరామృతపానశక్తి విశేషమని వాత్స్యాయనుని కంటె నధికముగ చెప్పి ఉన్నాడు. ఉత్కళులను గూర్చి వాత్స్యాయనుడు గాని, పద్మశ్రీ గాని పలుకలేదు. ఉత్కళదేశ స్త్రీలకు ఔపరిష్టక రతి (Fellatio and cunninglingus) యందాసక్తి విస్తారమని రతిరహస్యకర్త అభిప్రాయము. కామరూప స్త్రీలను గూర్చి విశేషాంశములను వాత్స్యాయనుడు పలుకలేదు. కొక్కోకుడు వారికిని, నేపాళ చీనాదేశము వారికిని, శృంగారి దృష్టి వైశిత్యము విశేషమని పలికినాడు. వనవాసస్త్రీలు మృదుల హృదయలనియును, అసభ్య వైవాహిక ధర్మమును పరిత్యజింతురని పలికినాడు.

లాటదేశ స్త్రీల పోలినవారే అపరాంతవాసులని వాత్స్యాయనుని అభిప్రాయము. వారికి బాహ్యరతి, సంప్రయోగముల వెంటను ప్రీతి కలదని కొక్కోకుడనినాడు. సింధు స్త్రీలు ఔపరిష్టక ప్రియలనినాడు. వారికి ఔపరిష్ట కాద్యము కాని రతమున తృప్తి లేదనినాడు. జలంధర దేశ స్త్రీలకు ప్రయోగవిధాన వైచిత్య్రములన్న (Sexual Movements) (కామసూత్రములు, ద్వితీయాధికరణము, అష్టమాధ్యాయమున వర్ణితములు) ఆసక్తి అధికమని పద్మశ్రీ అభిప్రాయము. ద్రావిడ స్త్రీలకు శుక్రక్షరణము రతారంభమునుండి కలుగుననియును అందువలన ప్రథమ రతముననే తృప్తలగుదురని వాత్స్యాయన కొక్కోకుల మతము. పద్మశ్రీ వీరికి కరతాడన, మర్దన, ఔపరిష్టకాది ప్రీతి కలదని చెప్పుచున్నాడు. కాశ్మీరస్త్రీ గంధప్రియ అని పద్మశ్రీ. ఇతర గ్రంథములు కానరాని అనేక దేశస్త్రీల సాత్మ్యములను నాగరసర్వస్వకర్త నిరూపించినాడు. ఈ అధ్యాయాంతరమున సూత్రకర్త దేశ సాత్మ్య ప్రకృతి సాత్యముల ప్రయోగ విధానమును గుర్తించి 'దేశసాత్మ్యాతృకృతి సాత్మ్యం బలీయ ఇతి సువర్ణ నాభో నతత్ర దేశ్యా ఉపచారాః' (2.5.34) అని నిశ్చయించినాడు. తుది సూత్రముగ చెప్పిన 'పరస్పరాను కూల్యేన తదేవం లజ్జమానయోః సంవత్సర శతేనాపి ప్రీతిర్నపరిహీయతే' అను వాక్యమెంతయో సమంజసమైనది. వీనిని గుర్తింపక పోవుట వలననే భారతదేశమున ప్రీతిరహిత వివాహ ధర్మములును, పాశ్చాత్య లోకములందు వివాహ విచ్ఛేదనములును జరుగుటయును, కలుగుటయును.


సంవేశన చిత్రరతములు (MODUS SEXUALIS) : దేశప్రకృతి సాత్మ్యా పేక్షయా ఆలింగనా ద్యుపచారముల మూలమున పరస్పరము అనురాగము కల్గిన నాయికానాయకులు సంవేశమునకు అర్హులయ్యెదరని పూర్వాధ్యాయమున స్థాపించిన తదనంతరము మహర్షి వాత్స్యాయనుడు సంవేశన ప్రకారమును, తదంతర్గతములైన చిత్రరతములను నిరూపించినాడు.


ప్రాచీన అర్వాచీన ప్రపంచములో రతిబంధ విభేదములు విశేషముగ కనుపించుచున్నవి. ఇవి కొన్ని స్వతః సిద్ధములు. కొన్ని నూతనత్వాపేక్షకులైన దంపతులు కనుగొనినవి. అనేక కారణముల మూలమున సమస్త కాలములలోను సమస్త దేశ ప్రజలును వీనిని ఆదరించినారు. క్రీస్తునకు నెంతో పూర్వముననే ఔద్దాలక, శ్వేత కాదులు, భారతావనిలో రతిబంధ విభేదములను గుర్తించి శాస్త్రనిబద్ధములుగ నొనర్చిరి. వాత్స్యాయనుని నాటికి అవి క్రమక్రమముగ నలువది ఎనిమిదిగ సంగ్రహితములైనవి. ప్రాచీన భారతము నాటికి సంబంధించిన విజ్ఞానము విశేషముగ నుండుట వలన నివి సాహిత్యశాస్త్ర గ్రంథముల కెక్కినవి. '

రతిబంధ విభేద నిరూపణమున ప్రాచీనా చార్యులను మించినవారు నేటికిని జన్మింపలేదు. అరబ్బుదేశ కామశాస్త్రవేత్త నఫజోయిషేకు వాత్స్యాయనాది గ్రంథములనుండి అనేక విభేదములను స్వీకరించినాడు. రిచ్చర్డు బర్టన్ మహాశయుడు తన అనంగరంగ అనువాద పీఠికలో పాశ్చాత్యుల కూహింపనైన నలవిగాని రతిబంధ విభేదములను భారతీయులు స్వీకరించుటకు వారి అవయవ వల్గన స్వభావము ముఖ్యకారణము కావచ్చు ననినాడు. వైవాహిక సౌఖ్యము (Happy Marriage) అను గ్రంథమున డాక్టరు హైమ్సు అను వైద్య శాస్త్రజ్ఞుడు భారతీయ రతిబంధ విశేషములను గమనించి విస్తుపోయి, "If some of these ideas are some what shocking because they have not been encountered before, it would be well for the married couples to try them gradually before condemning them" అని అభిప్రాయమిచ్చి ఉన్నాడు.


ఇట భారతేతర దేశములందరి రతిబంధ వైవిధ్యమును కొంతగ గమనింపవలసి ఉన్నది. క్రీ.పూ. 1300 సంవత్సరముల నాటి ఈజిప్టు పాపిరసు చిత్రలిపిలో పదునాలుగు రతిబంధ విభేదములున్నవి. ఎలిఫాంటిస్ అను గ్రీసుదేశ కవయిత్రి ఒక గ్రంథమున నవవిధ రతిభేదములను (SUNT ILLIS VENERIS NOVEM) మాత్రమే పేర్కొనినది. క్రీ.శ. 14, 15 శతాబ్దములలో రోము, ఫ్రాంసు మొదలగు దేశములందు భోగతత్పరత విశేషముగ పొడకట్టినది. అనేక కామకళా గ్రంథములు బయల్వెడలినవి. వానిలో సుప్రసిద్ధ ఇటలీ రచయిత ఆర్టినో (క్రీ.శ. 1497-1557) గ్రంథము ప్రధానమైనది. రోమక చక్రవర్తి నీరో భోగమందిరమున కొన్ని రతిబంధ చిత్రములను గీయించినాడు. రాఫెల్ శిష్యుడు రొమానో వాటినుండి పండ్రెంటిని మాత్రము గ్రహంచి, నూతనముగ నాల్గింటిని చేర్చి చిత్రణ మొనర్చినాడు. తదుపరి మర్కొంటో నియో మాండి అను చిత్రకారుడు ఈ పదునారు భేదములను మొదట చిత్రించి పండిత ప్రతిగా ముద్రించినాడు. ఈ ప్రతికి ఆల్టెనో వ్రాసిన అసభ్య శృంగారములైన సానెట్లను పదునారింటిని కూర్చి De Omnibus Veneris Schemafitus అను నామముతో మరియొక పండితప్రతి వచ్చినది. చక్రవర్తి అతనిని మరణదండనకు పాత్రుని చేయ ప్రయత్నించినాడు. కాని ప్రభువర్గమున నతనికి విశేషమైన పలుకుబడి ఉండుటవలన, ఆగ్రహము నుండి బయట పడిన తరువాత మరికొన్ని సానెట్లను పెంచి ముప్పది ఆరు చిత్రములతో ప్రచురించినాడు. నేడు దీనికి "ఆర్టినో చిత్రము”లని ప్రసిద్ధ నామము. రోమక సామ్రాజ్యము అత్యుత్తమ స్థితిలో నున్న కాలమున పుట్టిన 'ఆర్స్ ఆమొరిస్' గ్రంథకర్తయే ద్వాదశ రతి బంధములమించి గ్రహింపకపోవుట వలన,

నివి ఆ జాతి కనుభవైక వేద్యములైనవి కావని పండితుల అభిప్రాయము. రోమక సామ్రాజ్య వైభవమునాడు పశ్చిమ భారతమునుండి కొందరు సామాన్య వేశ్యలు వెళ్ళినారుగాని వారి వెంట నీ భారత రతిబంధ భేదములు అచటికి వెళ్ళినట్లు కనుపింపవు. అరబ్బు దేశ కామశాస్త్ర వేత్తలు ముప్పది రెంటిని మించి సంవేశన విధానము లెరిగినట్లు లేదు. ఫోర్బెర్గు అను ఒకానొక ఆధునిక సాంఘిక శాస్త్రవేత్త (Sociologist) ప్రపంచములోని అనేక కామకళా గ్రంథము లను అవలోకన మొనర్చి తొంబది రతిబంధ భేదములను గుర్తించినట్లు తెలియుచున్నది. పారిస్ నగరమున ముద్రితములైన కొన్ని అశాస్త్రీయ గ్రంథములలో 101 రతివిభేదములున్నవట! శారీరకముగ సమమైనవియును, దంపతులు అన్యోన్యానురాగమును చూరగొన నవకాశము కల్పించునవియును అయిన సంవేశన విధానములు 12కు మించిలేవని పాశ్చాత్య శాస్త్రజ్ఞుల అభిప్రాయము. 'మేహన ధర్మములు' (Genital Laws) గ్రంథకర్త 10 మాత్రమంగీకరించినాడు. ఆదర్శ వివాహ గ్రంథకర్తయును బంధదశకమును స్వీకరించినాడు. దంపతులు వైవిధ్యానుభూతికి, వ్యక్తిగతలోపపూరణములకును నివిచాలునని ఆయన అభిప్రాయము. మిగిలిన వానిని కామకళలోని మల్లబంధ విశేషములని త్రోసిపారవేసినాడు. సుప్రసిద్ధ స్త్రీ పురుష మానసిక శాస్త్రవేత్త (Sex - Psychologist) ఎల్లిస్ 48 బంధవిభేదముల నంగీకరించినాడు.


వాత్స్యాయనుడు నిరూపించిన నలుబది ఆరు రతిబంధ భేదములలో తరువాతి శాస్త్రజ్ఞులు కొన్నిటిని మాత్రమే స్వీకరించిరి. అనంగరంగకర్త 35 గ్రహించెను. కొన్ని సందర్భములందు నామ వ్యత్యయములు, లక్షణ వ్యత్యయములు కనుపించుచున్నవి. భారతదేశ మున జన్మించిన కామశాస్త్ర వేత్తలలో మహర్షిని అనుసరించినవారు కొందరు; పూర్వాచార్యుడైన గోణికాపుత్రుననుసరించినవారు కొందరు. మొత్తము మీద సంవేశనములు 48గ పరిగణితములగుచున్నవి. అందువలన వీనికి 'చౌశీతి' అను నామము రూఢమైనది.


బంధభేద స్వరూపములను నెల్లూరు శివ రామకవి కామకళానిధిలో నిట్లు ఎరిగించినాడు. "ఆ బంధములకు ఉత్తాన కరణములు (SUPINEATTITUDES), తిర్యక్కరణంబులు (Lateral), స్థితీకరణంబులు, నుతిత కరణంబులు, వ్యాపకరణంబులు నన నైదు విధంబులు. నారీరత్నంబు పల్యంకి కాంకతలమున పన్నుండినపుడు తత్పాదంబులు, కరంబులు పట్టి పట్టెడి బంధంబు లుత్తాన కరణంబులు, పువుబోడి ప్రక్కవాటుగ నైన ప్రక్కగ నైన కుడిప్రక్కగనైన పవ్వళించియుండ

పురుషుం డభిముఖంబుగ పవ్వళించి పట్టునవి తిర్యక్కరణంబులు. అంగనామణి కూర్చున్నప్పుడు పురుషుండు పైకొనిపట్టు కరణంబులు స్థితకరణంబులు. మగువ నిలుచున్నప్పుడు, స్తంభకుడ్యాదులానిగా నుంచి పురుషుడు పట్టుబంధంబు లుబ్ధిత కరణంబులు. కోమలాంగి కరంబులు పాదంబులు పాన్పుననాని తిర్యగ్జంతువుల రీతి వ్రాలిన పురుషుండు వెనుకగ నిలచి పట్టు బంధంబులు వ్యాపకరణంబులు. ఇవి ఐదును పురుష కృత్యములు. ఇక పురుషుడు రతిశ్రాంతుడై పవళింప తనివినొందక పురుషుని పైకొని లతాంగి పట్టునవి విపరీత కరణంబులు నన జను" అని.


కల్యాణమల్లుడు కూర్మ, పరివర్తిత, ఉపపాద, పద్మాసన, కర్కాటక, ఫణిపాశ, సంయమన బంధములను స్థితకరణములలోను (Sedentary attitudes), వీణక బంధకమును తిర్యక్కరణములోను (Lateral Group) చెప్పి ఉన్నాడు. ఇది వాత్స్యాయనాది ప్రాచీనాచార్యుల మార్గమునకు భిన్నమైనది.


'ఉత్ఫులకం విజృంభితకం ఇంద్రాణికం చేతి త్రితయం మృగ్యాః ప్రాయేణ’ (2.6.7) ‘ఏకోన నీచతర రతేః సంపుటకం పీడితకం వేష్టితకం బాడబక మితి హస్తిన్యాః (2.6.14) అని మృగీ, హస్తినుల బంధవిభేదములను మహర్షి నిరూపించినాడు. ఉత్తాన కరణములలోని సమపాదము స్మరదీపిక, రతిమంజరీ, ప్రభృతి గ్రంథములలో కాకపాద, కామప్రద, నాగపాద, కామమర్దన ఇత్యాది నామవిభేదములతో పొడకట్టుచున్నది. వాత్స్యాయనుని జృంభితకమును రతిరహస్య కర్త స్వీకరించినాడు. పంచసాయకాదులు కల్యాణమల్లుని సమపాదమును గ్రహించినవి. స్మరదీపికలోని సమపాదమునకును, అనంగరంగములోని సమపాదమునకును కొంత విభేదము కనిపించుచున్నది. 'తరుణి తన పాదయుగళము, హరియూరువు లందు నిల్పియట బవళింపన్, యురమురము జేర్చి పైకొన, పరువడి సమపాద నామబంధం బయ్యెన్' అని నందికేశ్వర మతానుసారముగ శివరామకవి సమపాదమును చెప్పినాడు. నాయిక పాదము నొకదానిని పాన్పుపై జాపిన ఈ బంధమే సరితమగునని కొక్కోకుని మతము. గ్రామ్యబంధమే సౌమ్య బంధము. శివరామకవి దీనిని గుర్తించినట్లు లేదు. కామసూత్ర కారుని శూలచితమునే నాగర సర్వస్వము ఆయత మనినది. 'ఏకశ్శిరసి ఉపరిగచ్ఛే ద్వితీయః ప్రసారిత ఇతి శూలచిత' అని మహర్షి శూలచితమును చెప్పినాడు (2.6.26). రతిరత్న ప్రదీపిక కర్త వ్యాఖ్యాత ననుసరించి దీనిని శూలాంకమని నాడు. రతిరహస్య వ్యాఖ్యాత మల్లినాథుడును, కొక్కోకుడును దీనిని త్రివిక్రమమనినారు. వాత్స్యాయన,

కొక్కోకు లిరువురును వ్యోమపాదమును పేర్కొనలేదు. ఇది పంచసాయక కామ

ప్రబోధము లందున్నది. రతిమంజరిలోని రతిసుందర బంధమునకును దీనికిని సన్నిహిత సంబంధమున్నది. అందు నాయకుడు నాయిక పాదములను పట్టుట ఒక్కటియే విభేదము. స్మరచక్ర బంధమును పేర్కొనిన గ్రంథములు అనంగరంగ కామప్రబోధములు మాత్రమే. స్మరదీపికలో నొక స్మరచిత్రబంధము కనిపించుచున్నది. కాని దానికిని కామప్రబోధాది గ్రంథములలోని స్మరచక్రమునకును విభేదమెయున్నది. ఆ స్మరచక్రము వాత్స్యాయనుడు పేర్కొనిన శూలచితమునకు సన్నిహితముగ నున్నది. 'ఏ చాన చుంబన మాచరింపుచును చక్రాకృతి భ్రమియించు నదియ చక్ర బంధమని’ ఎర్రన కొక్కోకుని చక్రబంధమును చెప్పినాడు గాని ఇది విపరీత కరణము. ఉపరతికి సంబంధించినది. అవిదారిత బంధము అనంగరంగ, కామప్రబోధ, పంచసాయకము లందు మాత్రమే కనుపించుచున్నది. ఇది నాగర సర్వస్వ, రతిరహస్యములలోని ప్రేంఖణము వంటిది. వేణువిదారితము పంచసాయకమునందు తప్ప తక్కిన శాస్త్ర గ్రంథములన్నిటను కానవచ్చును. వాత్స్యాయనాదులు దీనికి రెండు రూపములు చెప్పిరి. ఒక పరి కుడికాలు భుజముపై నుంచుట ఎడమకాలు చాచుట, రెండవమారు ఎడమకాలు భుజముపై నుంచి కుడికాలు చాచుట దీని విభేదములు. అనంగరంగమున నిట్టి విభేదము కానరాదు. అందువలన కల్యాణమల్లుడు చెప్పిన వేణువిదారితము రతిరహస్య సరితము. వాత్స్యాయనుని జృంభకమునే నాగర సర్వస్వకర్త భుగ్నకమనినాడు. దానిని అనంగరంగ కర్త ఉద్భుగ్నక మనినాడు. ఇది నీచరతము. యోనికంటె లింగము సూక్ష్మమైన దైనప్పుడు ఇది యోగ్యమైన బంధము. ఇది హరిణీ శశజాతులకైనది. (2.6.14) కామసూత్రములలోని ఉత్పీడితకము, రతిరహస్యములోని ఉరఃస్ఫుటనము, నాగరసర్వస్వములోని పిండితకమును ఒకే బంధ విశేషమును తెలియజేయుచున్నవి. దీనికిని అవిదారితమునకును విశేష భేదము లేదు. ఇందు అవిదారితము నందువలెగాక మోకాళ్ళను కలిపి పట్టవలయును. ఒక పాదమును పాన్పుపై చాచినచో నది అర్ధపీడితకము అని వ్యవహరించినారు. మహర్షి నిరూపించిన ఉత్తాన కరణములలో ఉత్ఫుల్లక, ఇంద్రాణికములను ప్రధానబంధ ద్వితీయమును అనంగరంగ కర్త త్యజించినాడు. సువర్ణనాభుని పీడితకమును గూడ త్యజించినాడు. ఉత్ఫుల్లకమునకు పంచసాయకకర్త చాటుక ప్లేలుకమను నామమును వాడినాడు. ఇది బాహ్య యోని (Mons Veneris) వికసించినట్లు చేయుటవలన నుత్ఫుల్లకము (Blooming posture) అయినది. దీనిని ఎర్రన ఆంధ్ర కొక్కోకమున "కామిని కించి దున్నతముగా జఘనం బెగనెత్తి తత్కటీ సీమల క్రింద పాదములు సేరిచి కృష్ణు కటిద్వయంబులన్ ప్రేమను చేతులందు నిడ ప్రీతి విభుండు కుచంబులాని

యుద్దామగతిన్ రమింప నది ధాత్రిని ఫుల్లక నామబంధమౌ” అని నిరూపించినాడు. కౌర్మక బంధమును అనంగరంగకర్త అనాలోచితముగ స్థితకరణముల (Sedentary Postures) నుంచినాడు. అతడు దీనిలో పిరుదులు ఉన్నతములుగ నొనర్చిన కలుగు పరివర్తిత బంధమును ఉత్తాన కరణమేయనెను. రతిరహస్యము దీనిని వేరుగ చెప్పుచున్నది. నాయిక పాన్పుపై వెలికిల పరుండి చేతులను కాళ్ళను వివరమొనర్చినపుడు నాయకుడు ముఖమున ముఖమును, చేతుల చేతులును చేర్చగా నాయిక తొడల నెత్తిన నది పరివర్తితమట. అయిన నిది ఒక నూతన బంధవిభేదముగ కనుపించుటలేదు. దీనాలాపనిక శుకసప్తతిలో ఘనకూర్మమను మరియొక ఉత్తాన కరణము కనిపించుచున్నది. నాయిక వెనుకగ పరుండినపుడు నాయకుడు ఆమె పాదములను మోచేతులలోనికి తీసుకొని తన పాదములను ఆమె వక్షఃస్థలమున నుంచి రెండు చేతులతో నామె చేతులను పట్టుకొని రమించిన నది ఘనకూర్మమట. నెల్లూరు శివరామకవి ముప్పదిఆరు ఉత్తానకరణ విభేదములను పలికినాడు.

ఇందు యుగ్మపాదము నాగరసర్వస్వమతమున తిర్యక్కరణము, రతిరహస్య, అనంగ కర్తల మతమున నది స్థితకరణము. అర్ధపీడిత కార్కటక, పరావృత్తకములు కామసూత్ర రతిరహస్యాది గ్రంథముల ననుసరించి స్థితకరణములు.

కామసూత్రములలోని పార్శ్వ సంపుటకమునే అనంగరంగకర్త సంపుటక మనినాడు. 'ఋజు ప్రసారితా వప్పుభయో శ్చరణావితి సంపుటః స ద్వివిధః పార్శ్వ

ఉత్తాన సంపుటశ్చ తథా కర్మయోగాత్' (2.6.15.16) సూత్రములలో వాత్స్యాయనుడు సంపుటక భేదద్వయమును చెప్పినాడు. కొక్కోకుడు దీనిని ప్రత్యేకము ప్రస్తావింపక ఉత్తాన సంపుటమును చెప్పునపుడు ప్రస్తావించినాడు. దీనిని నేటి పాశ్చాత్యులు Anterior Lateral Extended Attitude గ పరిగణించిరి. వీటిలో నాయిక పిండిత, వేష్టిత, బాడబకముల మూలమున రతితృప్తి నొందును. 'సంపుటక ప్రయుక్త యంత్రైవ దృఢమూరు పీడయే దితి పీడితకమ్; ఊరూ వ్యత్యస్యేదితి వేష్టితకమ్; బడబేవ నిష్ఠుర మవ గృష్ణాయా దితి బాడబక వరాబ్యాసికమ్' అనునవి వాత్స్యాయనుని వాక్కులు (2,6.17-19). కార్కటకమును కామసూత్ర, రతిరహస్య, నాగరసర్వస్వాది గ్రంథములు ఉత్తానకరణములుగ భావించినవి. పంచసాయకమున నీ బంధవిభేదము కనుపింపదు. కామప్రబోధము దీనిని కుక్కుట బంధమనినది. నాయిక నాభీస్థానమున నిజపాదముల నుంచి నాయకుని డోలిక వలె నూపిన నది ప్రేంఖణమని కల్యాణమల్లు డనినాడు. దీనిని తిర్యక్కరణముగ భావించుటలో పొరబడినాడు. నాయకానాయికలు శయన తలమున పార్శ్వవర్తనము కలిగి పరుండినపుడు ఇట్టి బంధవిభేదమున

కవకాశము లేదు. సముద్గక ముద్గ కాది తిర్యక్కరణము లందు నాయకుని ఒక తొడ నాయిక ఊరువుల మధ్యనుండును. పరివర్తనక బంధమున నాయకుడు నాయికను వెనుక నుంచి పట్టుకొని రమించును. రతిరహస్య పరివర్తనకమునకును దీనికిని భేదమున్నది. అందు నాయికానాయకులిరువురుమ మేహన సంయోగమైన వెనుక సముద్గక విధానము నొంది విడివడక రమించిననది పరివర్తకము.


కొక్కోకుడు మర్కటకమును స్థితకరణముగ చెప్పినాడు. లలితము పంచసాయక రతిమంజరులందు పద్మాసనముగ నున్నది. యుగ్మపాదము అనంగరంగ రతిరహస్యములలో స్థితకరణముగాని నాగరసర్వస్వము నది తిర్యక్కరణము. రతిరహస్య కామసూత్రములను అనువదించి జూచినచో అర్ధపీడితకము, కార్కటకములు రెండును ఉత్తానకరణములు. 'చరణా వూర్ధ్వం నాయకో స్యాధారయే దితి జృంభితకమ్; తత్కుంచితా ఉత్పీడితకమ్; తదేక స్మిన్ ప్రసారితేర్ధ పీడితకమ్ (2.6.23-25) సంకుచితే స్వబస్తిదేశే విదధ్యాదితి కార్కటకమ్; (2.6.28) ఇవి ఈ బంధ ద్వితీయమునకును వాత్స్యాయన లక్షణములు - అనంగరంగ కర్తకు పూర్వముందున్న రచయిత లందరును పద్మాసనమును, ఉపపాదమును ఉత్తానకరణములుగ నిరూపింప నతడు వీనిని స్థితకరణములుగా పరిగణించినాడు. స్థిత కరణముగ పద్మాసన బంధ మొనర్చుట యతి కష్టసాధ్యము. కామప్రబోధములోని పద్మాసమును నాగరసర్వస్వములోని లలితమును నొకటియని కామశాస్త్ర గ్రంథ పఠనము మూలమున తెలియుచున్నది. అర్ధపాదమును అర్ధోపపాద మనుట యసమంజసము. ఇది పొరబాటు. " బంధురితము అనంగరంగమునను కామప్రబోధమునందును తప్ప తదితర గ్రంథములందు కనిపించుట లేదు. రతిరహస్యమున ఫణిపాశబంధమును వర్ణించు సందర్భమున ఉన్న శ్లోకములోని 'గట్టిగ బిగించు' అను నర్థముగల బంధురిత శబ్ద ప్రయోగమును చూచి కల్యాణమల్లుడు ఈ బంధవిభేదమును సృజించినట్లున్నాడని ఒకానొక నేటి కామకళావేత్త అభిప్రాయము. బంధురితము కామప్రబోధము, అనంగరంగములందు తప్ప ఇతర గ్రంథములందు కనుపించుట లేదు. ఫణిపాశము కామప్రబోధమున కనుపింపదు. దీనికి శక్తిమంతము, దీర్ఘమునైన సాధకము (లింగము) కావలయును. నాగరసర్వస్వ రతిరహస్యములు దీనిని ఉత్తానకరణము క్రింద లెక్కకట్టినవి. ఇందు నాయిక మోకాలి సందులనుండి చేతులపోనిచ్చి నాయకుని కంఠాలింగన మొనర్చిన నది నాగరపాశమగునని నిర్ణయించినవి. స్మరదీపికలో దీని నిరూపణము మరియొక రీతిగ నున్నది. భర్త హస్తములను మోకాలిసందుల యందుంచి రమించు విధానమే ఫణిపాశమని అందున్నది. కామప్రబోధకర్త సంయమన బంధమును కౌర్మమని పేర్కొని అనంగరంగ కర్తవలె స్థితకరణముగ పరిగణించినాడు. నాగరసర్వస్వకర్త ఉత్తానకరణ విభాగమగు నొకదానిని కార్ముకాకృతిని పోలిన దానిని 'హనుపాద' మని నామకరణ మొనర్చినాడు. అనంగరంగపు పరివర్తితమును పూర్వశాస్త్రజ్ఞులు ఉత్తానకరణముగ పరిగణించినారు. ఇది ప్రత్యేక బంధము కాదని విజ్ఞుల అభిప్రాయము. యుగ్మ పాదబంధమును అనేకులు అనేక రీతులుగ నిరూపించిరి. పద్మశ్రీ దీనిని తిర్యక్కరణ మనినాడు. అట్టయినచో 'ప్రక్కకు తిరిగి పరుండిన నాయిక పాదములు ఎదురుగ కూర్చుండిన నాయకుని క్రోడము వద్ద నుంచును'. రతిరహస్యమును బట్టి దీని స్వరూపమును గ్రహించుట కష్టము. కొక్కోక గ్రంథానువాదకు డొకడు యుగ్మపాదమున నాయికానాయకులిరువురును ఒకరి కొక రెదురుగ ఒక మోకాలిని ముడిచి రెండవ పాదమును ముడిచినవారి పాదమున కెదురుగ నిల్చి రమించుట అని పలికినాడు. రతిరత్న ప్రదీపికలో నాయిక కాళ్ళను ప్రక్కలకు ముడిచి రెండు పాదముల నొక చోటికి చేర్చును. నాయకుడు నట్లే ఆమెకు క్రిందుగ నొనర్చును. కామప్రబోధమున నాయకుడు కూర్చొని కాళ్ళు ముడుచుననియును, నాయికయు నట్లే యొనర్చుననియును నున్నది. విమర్దిత మర్కటక బంధములకు గలభేద మత్యల్పము. ఇందు మొదటి దానియందు భర్త పిరుదులనే వర్తులముగ నాడించును. రెండవ దానియందు పైకి క్రిందికి నాడించును. కొక్కోకకారుడు విమర్దితమున నాయిక నాయకుని కెదురుగ కూర్చుండు ననియును, మర్కటమున తొడపై కూర్చుండి అటే చూచుననియును చెప్పినాడు. ఇది వెనుక మళ్ళ అయిన స్థితకరణము. నాగర సర్వస్వమున ఒక మర్కటబంధమున్నది. కాని దానికిని అనంగరంగములోని మర్కటబంధమునకు పోలిక లేదు. నాగరసర్వస్వమున స్థితకరణములుగ నున్న అశిన, లలితములు - రెండును విపరీత బంధముగ పొడకట్టుచున్నవి.


ఉత్థిత కరణములు (Standing Attitudes): మహర్షి వాత్స్యాయనుడు ఉతిత వ్యాన కరణముల రెంటిని చిత్రరతములనినాడు. సువర్ణనాభుడు స్థితకరణములను గురించి చెప్పలేదు. కాని నీటియందు పరుండి కూర్చొని, నిలచి భూమియందు కంటే సుగమముగ సంభోగించవచ్చునని అతని అభిప్రాయమైనట్లు మహర్షి వాత్స్యాయనుడు “జలే చ సంవిష్ణోప విష్టస్థితాత్మకాం శ్చిత్రా న్యోగా నుపలక్షయేత్తథా సుకరత్వా దితి సువర్ణ నాభః” (2.6.32) అని చెప్పి తదుపరి వానిని శిష్టులంగీకరింపనట్లు వార్తంతు తచ్ఛిష్టే రపస్మృతత్వాదితి వాత్స్యాయనః' (2.6.33) అని తన మతమును నిరూపించినాడు.

ఉత్థిత కరణములలో నొకటైన జానుకర్పరము (Knee Elbow Pose) నందు నాయిక ఒక ఉన్నతమైన వేదికమీద కూర్చొని ఉండగా నాయకుడు ఆమె పాదములను మోచేతులమీద నిల్పిన తరువాత ఆమె మెడను గాని, దేహమునుగాని ఆలింగన మొనర్చుకొని నిలచి రమించును. భర్త చేతులతో నాయికను కౌగిలింపవచ్చునని నాగరసర్వస్వము. ఉత్థితలింగము పైకినిలిచి రమించుట. జానుకర్పరమని కొక్కోకుడు. అట్టి సందర్భమున నాయిక భర్త శరీరమును మోకాళ్ళతో బంధింపవచ్చునని రతిరత్న ప్రదీపిక చెప్పుచున్నది. హరివిక్రమబంధము (Rampant Lion Pose) కేవలము యౌవనవంతులకు మంచిదని అనంగరంగకర్త చెప్పుచున్నాడు. ఈ బంధమున నాయకుడు పైకెత్తి నాయిక పాదమును చేతులలో పట్టుకొనగా నామె కొంచెము వెనుకకు వ్రాలినట్లుండు ననినాడు. ఈ బంధమునే పంచసాయకము త్రిపాద మనినది. "భార్య మోకాలును భర్త హస్తమున నిల్పి రెండవ పాదము భూమిపైనుండి అతనిని బంధింపగా నతడు ఆమె నాలింగన మొనర్చి రమించుటయే త్రిపాదమట. కామసూత్ర వ్యాఖ్యాత దీనికే వ్యాయితమను నామాంతరమున్నట్లు ఒక శ్లోకమును ఉటంకించినాడు. పద్మశ్రీ వ్యాపారమను నీ బంధ విభేదము నొకదానిని పేర్కొనినాడు. అందు నాయిక ఎత్తిన పాదమును భర్త భుజము మీద ఉంచవలెనట. 'కీర్తి' (Favouring Pose) అని లోకమున ప్రఖ్యాతి పొందిన బంధమునే కామసూత్రకర్త రతిరహస్యకర్తలు అవలంబిత మనినారు. నాగరసర్వస్వము విలంబిత మనినది. పంచసాయకము వ్యతికరమనినది. ఇందు భర్త ఒక కుడ్యమును ఆధారముగా గొని నిలచును. రెండు ముంజేతులను చేర్చి భార్య కూర్చొండుటకు అనువుగా నొక ఆసనమును నిర్మింప దానిపై నామె కూర్చుండి భర్తను పెనవేసుకొని కాళ్ళతో కుడ్యమును ఆధారము చేసుకొని పిరుదుల యలవలె నూపును. ఇట్టి సందర్భముల భార్య విశేషముగా నలసిపోయి సీత్కారమొనర్చుననియు, అధికముగా ఊపిరి విడచుననియును, ఇందుకు పురుషుడు అతిబలశాలి, యువకుడుగా నుండవలయుననియు కొక్కోకుని అభిప్రాయము. దీనినే అరబ్బులు డోక్ - ఎల్ - ఊటేడ్ (Driving the Nail Home) అందురు. మరికొన్ని కామకళా గ్రంథములందు ప్రముఖ గ్రంథములలో కనుపింపని ఉత్థిత కరణములు కొన్ని కానవచ్చు చున్నవి. అవి (1) ద్వితాళము. భర్త నిలచి భార్యను హస్తముతో నామె పాదముల క్రింద నిలిపి పట్టును. ఆమె భర్తను కంఠాలింగన మొనర్చుకొనును. దీనికి భర్త అతిశక్తిమంతుడు కావలసి ఉన్నది. దీనినే నాగరసర్వస్వము అర్పిత మనినది. 2. డోలాబంధము: నాయిక ఎత్తయిన వేదిక మీద కూర్చొని పాదములను ఎదురుగా నిలచిన భర్త రొమ్ములపై నుంచును. కంఠాలింగన మొనర్చును. కాని దీనికిని స్మరదీపికయందు కనుపించు డోలా (డోలాయిత) బంధమునకును భేదమున్నది. ఇందు నాయకుడు ఉన్నతమైన వేదికమీద కూర్చొని భార్య మోకాళ్ళ వద్ద చేతులుంపగా నామె అతనిని కంఠాలింగన మొనర్చుకొని పిఱుదుల పైకి క్రిందికి డోలవలె నాడించును. ఇది విపరీత బంధములలో (Reverse Attitudes) చేర్చదగినదని విజ్ఞుల అభిప్రాయము. 3. వేష్టితకము : భార్య వేదిక మీద కూర్చొని ఒక పాదమును నిలచిన భర్త రొమ్ముపై నుంచి రెండవ పాదముతో నతని చుట్టి కంఠాలింగన మొనర్చుకొనుటయే ఈ బంధ లక్షణము.


వ్యానకరణములు (Prone Attitudes): వ్యానకరణములలోని ధేనుకాబంధము (Bovin Posture) ను నాగరసర్వస్వము, స్మరదీపికలు, పశుబంధ మనిన నేటి పాశ్చాత్య విద్వాంసులు దీనినే Standing Arched Position అనినారు. అరబ్బులు దీనికి 'ఏల్ హౌరీ' అని నామకరణ మొనర్చిరి. వ్యానకరణములలో ఐభ (Elephant mode) ఒకటి. ఐన (Deer) సూకర (Boar) గార్దభ (Ass) బంధములు వ్యాసకరణములై యున్నవి. కాని ఇవి లోకమున కష్టకారణముగనో, లేక సౌఖ్యవ్యతిక్రమములగుట వలననో ఉ పయోగమున లేవు. వాఘ్రావస్కంధమను (Attack of the Tiger) మరియొక వ్యాకరణమున్నది. దీనిని నేటి పాశ్చాత్య విద్వాంసులు 'Wheel Barrow' అనినారు. నియతమనునది ఇదియు నొకటేయనియును నాగరసర్వస్వ వ్యాఖ్యాత త్రిపాఠీ మహాశయుడు వ్రాసియున్నాడు. కానీ అనంగరంగ సంపాదకుడు త్రిదివనాథరే ఈ అభిప్రాయముతో నేకీభవించుటలేదు. (అనంగరంగము పేజి 224). ఈ విధానమున నాయిక పర్యంకమున బోరగిల పరుండి పాదముల పైకెత్తగా ఆమె నడుమ బాణమువలె వంగి కామావయవసీమ కొంత ముందునకు తీసుకొని వచ్చిన భర్త ఆమె తొడలను మరింత పైకెత్తి వాటి కాధారముగా నతని మోకాళ్ళు నిలపి రమించుట ఈ బంధ లక్షణము. అందువలన త్రిదివనాథరే అభిప్రాయపడినట్లు ఇది భారతీయుల వ్యాసకరణమును వాఘ్రావస్కంధమును (Attack of the tiger) పోలుటకు అవకాశము లేదు. ఇది Posterior extended attitudes కు ఉదాహరణము. అనగా ఇది ఉత్ఫుల్లక బంధమునకు Posterior Form అని చెప్పవచ్చును.


ఏతేనైవ యోగేన శాన మైనేయం ఛాగలం గార్దభాక్రాంతం మార్జాల లలితకం వ్యాఘ్రావస్కంధనం గజోపమర్దితం వరాహ దృష్టకం తురగారూఢాదిక మితి యత్ర యత్ర విశేష యోగో అపూర్వస్తత్త దుపలక్షయేత్ (2.6.39) అను సూత్రమును బట్టి వ్యాకరణముల నెన్నిటినైన నూహించి పొందవచ్చునని వాత్స్యాయనుని అభిమతమైనట్లు తెలియుచున్నది. ఇట మహర్షి చిత్రరతములలో కొన్ని బృందసంప్రయోగ విధానములను (Group Congress) చెప్పినాడు. పురుషుడు అనేక నాయికలతో కలసి రమించుట వారి క్రీడితకము, ఐణేయము, ఛాగలము, మొదలగు భేదములతో నొప్పుననియును 'గ్రామనారీవిషయే స్త్రీ రాజ్యే చ బాహ్లికే బహవో యువానో అంతఃపురస ధర్మాణః ఏకైకస్యాః పూరిగ్రహభూతాః తేషా మేకైకో, యుగపచ్చ యథాసాత్మ్యం యథా ప్రయోగం చ రంజయే యః' (2.3.43) అను సూత్రమున అనేక యువకులు యుగపదముగ ఒక్కొక్కరు గాని, ఒక్కొక్క మాటుగాని, ఒకేమాటుగ వేర్వేరు ప్రదేశములని గాని సంప్రయోగము నెరపుటకు చెప్పినాడు. ఇట్లు చెప్పుట వలన నిది గోష్ఠీ పరిగ్రహయగు వేశ్యకు రాజపరిగ్రహకు సంబంధించినది. చిత్ర రతాంతమున మహర్షి తత్సా త్మ్యాద్దేశ సాత్మ్యాచ్చ తై సైఔర్భాతైః ప్రయోజితైః స్త్రీణాం రాగశ్చ స్నేహశ్చ బహుమానశ్చ జాయతే' (2.6.49) అని స్త్రీ స్నేహరాగ గౌరవములను పొందుటకు చిత్రరతముల చెప్పినట్లు సూచించినాడు.” అటుపిమ్మటవచ్చు సీత్కృతాద్యధ్యాయమున మహర్షి పలికిన 'కలహరూపం సురత మాచక్షతే వివాదాత్మకత్వా ద్వామ శీలత్వాశ్చ కామస్య' వివాదాత్మకము వామశీలము కలది అగుట వలన కామము కలహము వంటిదని ఆయన అభిప్రాయము. పాశ్చాత్యులును దీనిని కలహరీతిగనె (Love duel) పరిగణించినారు. కలహమగుట వలననే గ్రహణము కలిగినది. దానివలన సీత్కృతము పుట్టినది. ఇట్టి ప్రహరణములందు క్రౌర్యము లేదా అను ప్రశ్నకు మానవ జాత్యస్వభావము నెరిగిన పాశ్చాత్య విజ్ఞాని ఎల్లిస్ మహాశయుడు ఇట్లు పలికినాడు.

“When the normal man inflicts or feels to inflict, some degree of physical pain on the woman he loves, he can scarcely be said to be moved by cruelty. He feels, more or less obscurely, that the pain he inflicts, or desire to inflict, is really a part of his love, and that, more over, is not really resented by the women on whom it is exercised,

'తస్మాత్ప్రహరణ స్థాన మంగం స్కంధౌ శిరస్తనాంతరం పృష్ఠం జఘనం పార్శ్వ ఇతిస్థానాని తచ్చతుర్విధం అపహస్తకం, ప్రసృతిక ముష్టిః సమతలకమితి' (2.7.2) అను సూత్రమున ప్రహరణ స్థానములను, తద్విభేదములను నిరూపించినాడు. సీత్కృతమున ధ్వని రూపమున నున్నవి హింకారము, స్తనితము, కూజితము, రుదితము, సూత్కృతము, సీత్కృతము, ధూత్కృతము, ఫూత్కృతము అని ఎనిమిది విధములు. సంబాధక మోక్షణార్థ అలమర్థక పీడా బోధకములును అర్థసంబంధము వలన సీత్కృతము లేనట. ఇందు విరుతములు (Inarticulte Erotic Movement) విననగు చుంబనములని పద్మశ్రీ అభిప్రాయపడి చుంబనములుగ పరిగణించినాడు. ప్రధానపాత్ర మొనర్చు చుంబన నఖక్షత దంతక్షతా తాడనాదికముల వలన కలుగుటచే నీ ధ్వనులను చుంబనముల క్రింద పరిగణించుట పొసగదు. ప్రహరణములలోని కర్తరీకీలములు గమనింపదగినవి. ప్రహరణవిధులలో లెక్కగాని శాస్త్రముగాని లేదని వాత్స్యాయనుడు పలికినాడు.


తదుపరి అధ్యాయము పురుషోప సృప్తాద్యధ్యాయము. ఇందు పురుషోప సృప్తకములు దశవిధములని చెప్పి మహర్షి "ఉపసృప్తకం మంథనం హులోవ మర్దనం పీడితకం నిర్ఘాతో వృషాఘాత శ్చటకవిలసితం సంపుట ఇతి పురుషోపనృప్తాని” (2.5.33) ఇట్లు సూత్రనిబద్ధమొనర్చినాడు. ఈ యంత్రయోజన విధానమును (Penile Intromissions and Movements) కల్యాణమల్ల కొక్కోకులు వారి గ్రంథములందు పేర్కొనలేదు. ఇవి నిరుపయోగములని కొక్కోకుడు చెప్పలేదు. ఒకానొక తమిళ కొక్కోక గ్రంథ వ్యాఖ్యాత వీనిని కూడ చేర్చినాడు. ఇవి అధికమైన ఉపయోగమును గూర్పగలవనుట నిస్సందేహము. చటక విలసితమునకు కొన్ని గ్రంథముల ‘చాతకవిలసితము' (The Sport of the Sparrow) అను నామమున్నది. ఈ యంత్ర యోజనములన్నియును ఉత్తానకరణముల పురుషకృత్యములు, విపరీత బంధముల (పురుషాయితమున) స్త్రీవిగ పైన చెప్పిన వాని కంటే నధికముగ సందంశ (Pincers), భ్రమరక, ప్రేంఖోలితములు మూడున్నవని చెప్పినారు. (2, 8, 23) ఇందలి సందంశమును వాత్స్యాయనుడు 'బాడబేన లింగ మవగృహ్య నిష్కర్షం త్యాం పీడయంత్యాం వాచిరాన స్థానం సందంశః' అని నిరూపించినాడు" రతిలయమును (Speed of the Sex Union) గురించి వాత్స్యాయనుడు ప్రసంగింపలేదు. కొక్కోకుడు అందు ద్రుత, మధ్య, వజ్రములని త్రివిధ విభాగము లున్నట్లు పలికినాడు.

ఈ అధికరణమున తదుపరి వచ్చునది ఔపరిష్ట (Fellatio and Cunnilinctus) అధ్యాయము. ఇందు మొదట తృతీయాప్రకృతి (Hermophrodite) సంబంధమైన అనురాగము అభిమానికముగా దానిని గూర్చి చెప్పి తదుపరి నిమిత, పార్శ్వతోదష్ట, బహిస్సందంశ, చుంబితక, ప్రమృష్టక, అమ్ర చూతములను ఔపరిష్ట (Fellatio) విభేదములను తత్స్వరూపములు పలికినాడు. (2.9.1.20) ఇందును స్తన ప్రేరణముల ప్రయోగముండ వలయునని చెప్పి ఇట్టి ఔపరిష్టకములను కేవలము కులటలు, స్వైరిణులు, సంవాహికలు ప్రయోగించుకొందురని చెప్పినాడు. మరునాడు అచ్చోట చుంబనార్థము వదన సంపర్కమొనర్చుట వలన బాధ కలుగుటచే ఇది పనికిరాదని ఆచార్యులు నిషేధించిరి. ఔపరిష్టకము నే స్త్రీ కొనర్తురో దానితో కొన్ని దేశములవారు సంగమింపరని చెప్పినాడు. ఇందలి పురుషకృత్యమును (Cunnilinctus) గూర్చి కొలదిగనే ప్రసంగించినాడు. (1.6.31.33) పురుషులలో విస్తారరూపమున నీ ముఖచుంబనము (Buccal Congress) కనుపించిన దానిని గూడ పైరీతి నిమిత పార్శ్వ దష్టాదులవలె గ్రహింపవలెనని ఆయన అభిప్రాయము. ఇట్టివాని జోలికి విద్వాంసులు ఉత్తములు పోరాదని వైద్యశాస్త్రములోని రస వీర్య విపాకాది భక్షణ సామ్యమున నొక శాస్త్రార్థ మొనర్చినాడు. 'అర్థ స్వాస్య రహస్యత్వా చల త్వాన్మన సప్తధా. కః కదా కిం కుతః కుర్యాదితి కో జ్ఞాతు మర్హతి' అని దీని అనిశ్చయ స్వరూపమును వెల్లడించినాడు. (2.9.41) 76


అటుపిమ్మట వచ్చిన రతారంభావసానికాదధ్యాయమున సురతారంభ సురతావసానముల నొనర్పవలసిన కృత్యములను చెప్పినాడు. నృత్తవారిత్రాది గోష్ఠులు, ఆపాదకములు, ఖాద్యములు, మొదలగునవి భావ వృద్ధకములు ప్రవృత్తములైనవి. ఇట రతి విభేదముల గూర్చి 'రాగవ దాహార్యరాగం కృత్రిమరాగం వ్యవహితరాగం పోటూరతం ఖలరత మయంత్రిత మితి రతివిశేషాః' అని మహర్షి సూత్రీకరించినాడు. గోత్రస్ఖలనమును గూర్చి జాగరూకత వలసినది హెచ్చరించి ప్రణయ కలహ విధానముల జెప్పి చతుష్షష్టి మిగిలిన వాని కంటె శ్రేష్ఠము "విద్వద్భిః పూజితాం మేతాం ఖలైరపి సుపూజితాం, పూజితాం గణికా సంఘై ర్నందినీం కోనపూజయేత్" (2.9.51) అను శ్లోకమొనర్చి సాంప్రయోగికమును ముగించినాడు.


కన్యా సంప్రయుక్తకము తరువాత వచ్చు నధికరణము, చతుష్షష్టి కళావిచక్షణుడు, భావతః సంవక్ష్యమాణుడు అయిన నాయకునికి సమాగమోపాయమును అవాపము కావలయును. అందు కన్యక ముఖ్యురాలు గనుక నీ యధికరణమున ప్రథమాధ్యాయము వరణ విధానము. ఇందలి "సువర్ణాయాం అనన్యపూర్వాయం, శాస్త్రాధిగతాయాం, ధర్మార్థక పుత్రాః, సంబంధః పక్షవృద్ధిః అనుపసత్కృతారతిశ్చ” అను సూత్రము ముఖ్యముగ గమనింపదగినది. సవర్ణయు, అనన్య పూర్వయు, అయిన నాయిక వలన ధర్మము, అర్ధము, పుత్రులు, సంబంధము, పక్షవృద్ధి, అకృత్రిమ రతి లభించునని ఆయన అభిప్రాయము. (3.1.1) ఈ భావము నేటి పాశ్చాత్యుల వివాహవిజయమునకు సంబంధించిన అభిప్రాయముతో కొంత వ్యతిరేకించు చున్నది. " భారతదేశమున వివాహము కాని వారు ఎవరును ఉండకూడదని ఋషుల అనుశాసనము. రూపాజీవయైన పణ్యస్త్రీయును కుమార్తె నెవరికైన నిచ్చి వివాహమొనర్చి తీరవలసినదే. అటుల యోగ్యుడైన వరుడు లభించని పక్షమున నామె శాస్త్రోక్తముగ నొక వృక్షమునకు గాని, ప్రతిమకుగాని, కౌక్షేయకమునకు గాని వివాహ మొనర్పవలెను. వివాహము కాని మధ్యవయస్కుడైన బ్రహ్మచారితో సహపంక్తి భోజనము పనికిరాదని స్మృతి వాక్యమున్నది. వారి వివాహమునకు ప్రథమ కారణము 'కుమారుని మూలమున పితృతర్పణము' ప్రాచ్యఖండములు వివాహము, మృత్యువు రెండును దైవకార్యములని భావింతురు. వీటన్నిటిని బట్టియును ప్రాచ్య దృక్పథమును బట్టియు హిందూవివాహము కేవలము న్యాయసమ్మత (Legal) పరస్పర ప్రేమానురాగ బంధముల (Mutual Sexual unions) కంటే విశేషమైనదని అర్థము కాగలదు. అందువలన ప్రాచ్యఖండములలోని వైద్యశాస్త్రజ్ఞులు, ధర్మశాస్త్రకర్తలు, సాంఘిక శాస్త్రవేత్తలును కన్యావరణమునకు ఎన్నో నియమముల నేర్పరచినారు. ప్రాచ్యదేశ ములందును కేవలము సహకారులుగ నుండుటకు మాత్రమే ఇట్టి నియమములు కొన్ని వారి పూర్వులు పలికినారు. అందలి అనేక నియమములు ప్రాచ్యదేశ వరణనియమములును ప్రధానముగ భారతీయ వరణవిధులతో సరిపోవుచున్నవి.


భారతీయ వివాహ లక్షణవేత్తలు రూపమునకు విశేష ప్రాధాన్య మిచ్చినట్లు కనుపింపదు. ఆ రూపమును వ్యక్తిగత, దేశగత, జాతిగతము. జాతులను సంరక్షించుకొనుటకు ఆవశ్యకములైన శరీర ధర్మమును (Biological means of race preservation) వారు విశేషముగ కోరినారు. నేటి మానసిక శాస్త్రవేత్తలును మరియొక రీతి స్త్రీ భాతృపితృ సమానులను, పురుషుడు మాతాభగినీ సమానలను వరించుట సహజముగ గోచరించునని చెప్పినారు అందుమూలమున ఒకానొక వేత్తయన్న క్రింది వాక్యము లెంతయో సమంజములైనవి

“The Hindu Theologians have all along believed that marital partners are pre - ordained by God; where as the Freudian science admits that they are unconsciously pre - ordained by the children themselves, who alone can make a marraigae happy or unhappy."

ఒకటి సత్యము. భారతీయ వివాహము న్యాయానురాగ బంధములకంటె నధికమైన దగుటచే విచ్ఛేదవిరహితము.

కన్యయందు కోరదగిన లక్షణములు కొన్నిటిని మహర్షి వాత్స్యాయనుడు నిరూపించినాడు. వాటిని కల్యాణమల్ల కొక్కోకులు వారి కాలమునకు అనుగుణములుగ, నాటి అభిమానములతో పెంపొందించినారు. వరణ యోగ్యయగు కన్యక లక్షణములను చెప్పు సందర్భమున నున్న వాత్స్యాయనుని సూత్రమున (3.1.2) 'త్రివర్షాత్ప్రభృతి న్యూనవయసం' అను దానిని గమనింపవలసి ఉన్నది. " మిగిలిన లక్షణములన్నియు నన్నిజాతులవారు నంగీకరించునవియే. ఇట పౌరుష దైవములను వరణద్వితయమును వాత్స్యాయనుడు పలికినాడు. 'తస్యాః వరణే మాతా పితరౌ సంబంధినశ్చ ప్రయతేరన్మిత్త్రణిచ గృహీత వాక్యాని ఉభయ సంబద్ధాని' (3.1.4) అను సూత్రమును బట్టి వరించునది. నాయకుడొక్కడే కాదని తెలియుచున్నది. 'నక్షత్రాఖ్యం నదీనామ్నీం, వృక్ష నామ్నీం చ గర్హితాం, లకార రేఖోపేతాం చ వరణే పరివర్జయేత్' అను సూత్రమున అశ్వని, రోహిణి ఇత్యాది నక్షత్రనామములను, గంగా యమునా కావేరి మొదలైన నదీ నామములు, మాలతీ కదంబ పారిజాత ప్రభృతి వృక్షలతా నామములు గల కన్యకలను వరింపరాదని వాత్స్యాయన మతము. దీనికిని మానసిక వృత్తికిని కొంత సంబంధముండి యుండవలయును. తదుపరి ఆయా దేశ లక్షణముల ననుసరించి వివాహము చేయవలసినదని 'దేశ ప్రవృత్తి సాత్మ్యా ద్వా బ్రాహ్మ ప్రాజాపత్యార్ష దైవానామన్యత మేన వివాహేన శాస్త్రతః పరిణయే దితివరణవిధానమ్' (2.1.21) అని సూత్రీకరించి ఈ అధ్యాయము ముగించినాడు.


కన్యా విస్రంభణమున ఉపాయ పూర్వకముగ నాయికను విశ్వసింప జేయుట నిరూపితమైనది. వివాహపూర్వ ప్రణయము భారతదేశమున లేకపోవుటవలన నీ విస్రంభణము కామశాస్త్రమున చెప్పవలసి వచ్చినది. " కన్యావిస్రంభణ మెరుగని వారివలన జాతులు రోగగ్రస్తములగుచున్నవి. తదుపరి వచ్చు బాల్యోపక్రమ ఏకపురుషాభి యోగాద్యధ్యాయముల కన్యక బాహ్య అంతర రతిసుఖమునకు ఎట్టివానిని స్వీకరింపవలయునో మహర్షి నిరూపించినాడు. తదుపరి వచ్చు వివాహాధ్యాయమున నష్టవిధ వివాహ స్వరూపమును తెల్పి అంతమున 'సుఖత్వాదబహు క్లేశాదపిచా వరణా దిహ అనురాగా దాత్మ కత్వాచ్ఛ గాంధర్వ ప్రవరో మతః' (3.5.80) అను గాంధర్వ వివాహా (Romantic Marriage) ధిక్యమును నిరూపించినాడు.

భార్యాధికరణము ఒక రీతిగ కన్యాసంప్రయుక్తమునకు పరిశిష్టము. 'భర్తతు దేవతా స్త్రీణాం' అను న్యాయమున భార్య మెలగవలసిన రీతిని గృహకర్తవ్యములను నిరూపించి “జ్ఞాతి కులస్యా నభిగమన మన్యత్ర వ్యసనోత్సవాభ్యాం' (4.1.44) మొదలైన నీతులనెన్నిటినో వాత్స్యాయను డుపదేశించినాడు. ఈ ప్రకరణమున నాటి సాంఘిక స్థితి గృహిణి ఎట్టి ఉన్నతస్థితి ననుభవించునో తెలియగలదు. మనువు భార్యను గురించి చెప్పిన వాక్యములన్నియును సత్యములని వాత్స్యాయనుడు భంగ్యంతరముగ నిరూపించినట్లు వ్యక్తమగును. ఇందలి జ్యేష్టావృత్త ప్రకరణమున "జాడ్య ద్సౌశీల్య దౌర్భాగ్యే భ్యః ప్రజానుత్పత్తే రాఖీక్ష్యేన దారికోత్పత్తే నాయక చాపలాద్వా సపత్యధిక వేదనమ్' (4.2.1) అను సూత్రమున బహుభార్యాత్వ కారణముల జెప్పినాడు. సపత్నిక భార్యాలక్షణములు చెప్పిన తరువాత పునర్భువును పేర్కొని ఆమెకు ప్రథమ గౌరవము లేదనియును, అందలి అక్షతయోని (అగర్భాదాన క్షతయోని (గర్భాధాన) అనుభేదములున్నవనియును చెప్పినాడు. ఇటు పునర్భూ నిర్వచనమున గోనర్దీయ, బాభ్రవ్య మతభేదములు నిరూపితములైనవి. బాభ్రవ్యుని పునర్భువు పునర్భువు కాదని కామసూత్ర వ్యాఖ్యాత 'యాతు పునః పున్నిష్కా మత్ససౌవేశ్యా విశేషే అంతర్భూతా’ అని కొట్టివేసి వేశ్యావిశేషముగ పరిగణించినాడు. పునర్భూప్రకరణమున కొన్ని సూత్రములలో (996-1002) ఆమెకు వేశ్యకంటే ఉన్నత స్థానము నిచ్చినను ఉపపత్ని (Secondary Wife) గ మహర్షి పరిగణించినాడు. దుర్భగా ప్రకరణమున సపత్నీ బాధనొందు స్త్రీ తప్పించుకొని నాయకానురాగమును పొందురీతిని అతడు విశదీకరించినాడు. అంతఃపురికా ప్రకరణమున అంతఃపుర స్త్రీల విషయమున రాజును, జానపదులను భార్య లే రీతి వశమొనర్చుకొన వలయునో చెప్పినాడు. భార్యాధికరణ ఫలశ్రుతిగ మహర్షి పలిత “యువతిశ్చ జితక్రోధా యథా శాస్త్ర ప్రవర్తినీ హోతి వశ్యం భక్తారం సపత్నీ శ్చాధితిష్ఠతి' అనుమాట సత్యముగ విజ్ఞానప్రదముగ నీ యధికరణమును ఆయన చేకూర్చినాడు.


వేశ్యవల్ల కేవలము కామము మాత్రమే లభించి పరదారల వలన అర్థకామములు లభించుటచే వైశికము కంటే పారదారికాధికరణమును తదుపరి మున్ముందుగ మహర్షి పలికినాడు. అందును ముందు స్త్రీ పురుష శీలావస్థాపన మొనర్చి భారతీయుల పావిత్య్రలక్షణములను ద్యోతకమొనర్చినాడు.పరదారల పొందవలసిన నాయకునకును, నాయకుని పొందగోరు పరదారకును పరస్పరము స్త్రీ పురుష శీలావస్థాపన శక్తులత్యవసర మగుటయే ఈ అధ్యాయమును చెప్పుటకు మూల కారణము. ఇందు మదనావస్థ ఉత్పత్తి మొదలు ప్రాణాంతము వరకు పదిదశలని ప్రాచీనమతమును పేర్కొనినాడు. (5.1.5) స్త్రీలు సర్వసాధారణముగ వ్యావర్తనమును పొందుటకు గల కారణములను చెప్పి (5.1.17.42) స్థాలీపులాక న్యాయమున చెప్పినానుగాని ఇంకను నిట్టి వనేకములున్న వనినాడు. పరదారలయెడ సంసిద్ధతగల పురుషుల నెన్ని, తదుపరి కామసూత్ర కర్త అభియోగ విధానములను, పరిచయ కారణములను, బాహాభ్యంతర పరిచయ లక్షణములను చెప్పినాడు. భావపరీక్షా

ధ్యాయమున దూతీకర్మమూలమున అభియోగము నెరపుట నిరూపితమైనది. దూతీకర్మాధ్యాయమున దూతీలక్షణమున్నది. వాత్స్యాయనుడు 'దర్శితేంగి తాకారాంతు ప్రవిరళ దర్శనా మపూర్వాం చ దూత్యోప స్పర్శయేత్' (5.5.1) అను వాక్యమున దూతి ఉపయోగమును జెప్పి 1. నికృష్ణార్థ 2. పరిమితార్థ 3. పత్రహారి అనుదూతికల విభేదమును పలికినాడు. భార్యాదూతీత్వ మిందు గమనింపదగినది. ఈమె ఎందు నిమిత్తము దూత్యమొనర్చుచున్నదో ఎరుగని ముగ్ధురాలు, మూఢదూతిక.


తదుపరి అధ్యాయము ఈశ్వర కామితము. ఇందు ప్రభువుల పరదారాభిగమనము నిరూపితము. 'సత్వేవం పరభవన మీశ్వర ప్రవిశేత్' (5.5.29) అని వాత్స్యాయ నాభిమతమును నిర్దేశించినాడు. తదుపరివచ్చు అంతఃపురికాప్రకరణమున నీ సూత్రమును సమన్వయ మొనర్చి వీరికిని పరభవన ప్రవేశము పనికిరాదనినాడు. ఇందలి రెండవ మూడవ సూత్రమున అంతః పురికలు అపద్రవ్యముల మూలమునగాని అవ్యక్త లింగముల మూలమున గాని, లేక పురుష ప్రతిమల మూలమున గాని అభిలాషము తీర్చుకొన వలెనని చెప్పినాడు. (9,9.2-4) ఈ ప్రకరణమున చెప్పిన 'స్వైరేవ పుత్రై రంతః పురాణి కామచారై ర్జననీవర్ణ ముపయుజ్యంతే వైదర్భి కాణాం’ (5.6.36) అనుసూత్రము వలన నాత్మబంధు ప్రణయము (INCEST) అంతఃపుర స్త్రీల కున్నట్లు తెలియుచున్నది. ఇట స్త్రీవినాశ కారణములను 'అతిగోష్ఠీ నిరంకుశతా భర్తు స్వైరతా పురుషైస్సహా నియంత్రణతా ప్రవాసేవస్థానం విదేశే నివాసః స్వవృత్త్యుప ఘాతః స్వైరిణీ సంసర్గః పత్యుతీర్యాళతా చేతి స్త్రీణాం వినాశ కారణాని' (5.6.49) అను సూత్రమును పలికినాడు.


అతి ప్రాచీన కాలముననే భారతదేశమున నన్యదేశములందువలె పణ్యవృత్తి (వేశ్యావృత్తి) ఏర్పడినది. ఇందు ఉత్తమలు గణికలు. అత్యుత్తమ నాగరికత వ్యాపించిన ఆ కాలముల నాగరకులు భార్యలలో లుప్తమగు భోగమును భోగస్త్రీలయందు (Femmes De joie) పొందెడివారు. అందువలన సాంఘిక వ్యవస్థలో వారికున్నత స్థానము ప్రాపించినది. అందువలననే గణికకళా ప్రావీణ్య లక్షణమును విద్యాసముద్దే శాధ్యాయమున వాత్స్యాయనుడు నిరూపించినాడు. వీరికి సంబంధించిన కామమును ఆయన వైశికమున నిరూపించినాడు. కొందరు, మహర్షి భార్యాధికరణమును వదలి కేవలము పారదారికమునకు విశేష ప్రాధాన్య మిచ్చినారు. కల్యాణమల్లుడు వేశ్యా ప్రకరణమును వదలినాడు. కొందరు శాస్త్రకారులు కేవలము వేశ్యయే నాయిక యైనట్లు గ్రంథరచన మొనర్చినారు.

ఇందు వేశ్యకు గమ్యులు కేవలార్థులు ప్రీతి యశోర్థులని ద్వివిధములుగ రూపించి వాని అంతర్విభేదములను నిరూపించి, సహాయుల చెప్పి, ఆమె కగమ్యులను వివరించి, గోష్ఠీ ఉపావర్తనాదిక్రియా స్వరూపమును వెల్లడించినాడు. వారికి కాంతానువృత్త విధానమును, కాంతాను వృత్తమున, ప్రియాస్వీకరణము, అర్థాగమోపాయాద్య ధ్యాయమున అర్థస్వీకరణ విధానమును చెప్పినాడు. తదువరి విశీర్ణ ప్రతిసంధానాధ్యాయమున విశీర్ణ నాయకుని పొందు విధానమును చెప్పినాడు. లాభవిశేషాద్యధ్యాయమున గణిక, రూపాజీవ, కుంభదాసీలు వారి లాభములనెట్లు ఉపయోగింప వలయునో శాసించినాడు. తదుపరి అర్థానర్థానుబంధ సంశయ విచారా ధ్యాయము వైశికము చివరి అధ్యాయము. ఇందు విటులనేకులు విశ్వాసము గలిగి గోష్ఠీ పరిగ్రహముగ పొందిన వేశ్య ద్రవ్యార్జన మొనర్పవలసిన రీతిని నిరూపించినాడు. అంతమున 'కుంభదాసీ, పరిచారికా, కులటా, స్వైరిణీ, నటీ, శిల్పకారికా, ప్రకాశ వినష్టా, రూపాజీవా గణికా చేతి వేశ్యా విశేషాః (7.6.57) అని అందలి విభేదములను నిరూపించి వేశ్యలు అర్థ ప్రయోజనలుగాని, రతి ప్రయోజనలు గారనీ నిశ్చయించినారు. పణ్యజీవనము ఒకనాడు వచ్చినది కాదు. వివాహవిచ్ఛేదకమును కాదు. దీనిని గూర్చి ఎల్లిస్ మహాశయుడు “The History of the rise and development of prostitution enables us to see that prostitution is not an accident of our Marriage system, but an essential constituent which appears with its other concurrently essential constituents" అని చెప్పి ఉన్నాడు. ఇట్టి దృష్టి వాత్స్యాయనాది ప్రాచీన కామశాస్త్రవేత్తల కున్నట్లు గోచరింపదు. కాంతాను వృత్తాద్యధ్యాయమున పణ్యస్త్రీల కామలక్షణములను గూర్చి ప్రశ్నించుకొని మహర్షి 'సూక్ష్మత్వా దతి లోభాశ్చ ప్రకృత్యా జ్ఞానత స్తథా, కామలక్ష్మతు దుర్ ఙ్ఞానం స్త్రీణాం తద్భావితై రపి' ఇత్యాదిగ పలికినాడు. కాని నేటి జాతిశాస్త్రవేత్తలు (Sexologists), మానసిక శాస్త్ర వేత్తలు పణ్యస్త్రీ కామమును గూర్చి 'It is not from any innate wish of their own, but from necessity that most women enter this profession, indeed, psychological investigation has shown that, far from being over sexed, the majority of prostitutes are under-sexed. Many of them are even homosexual, with no feeling whatever for men' అని చెప్పుచున్నారు.


ఔపనిషదికము తరువాత అధికరణము. స్త్రీ పురుష సుఖానుభూతి కేవల మానసికమే కాదు; శారీరకమును. ఇందు తన్మూలమున శారీరక లోపముల తీర్చుటకై వశీకరణ, వశ్యయోగ, వాజీకరణ వర్ధనాది యోగములు చెప్పినాడు. 'పురుషునికి

విసృష్టి త్వరితముగ కలుగకుండుటకు వాత్స్యాయన కొక్కోకులు బుద్ధిని బహుధా ప్రసరింపజేయుట అవసరమనినారు. ఇందలి సుభగంకరణాద్యధ్యాయమున వేశ్యావివాహ స్వరూపమును విశదీకరించినాడు. (7.1.13-23) రంగోప జీవులైనవారు నృత్యగీతాదులందు తోడ్పడువారికే కన్యక నీయవలయునని నియమించి ప్రాచీన భారత కళాకర్మ రక్షణకు మహర్షి శాస్తయైనాడు. ఇందలి నష్టరాగ ప్రత్యానయినాద్యధ్యాయమున లింగవేదన గూర్చిన సూత్రము గమనింపదగినది. (7.1.15) బహుపాదపాది మూలములను నూరి పిల్లనగ్రోవికి పట్టించిన తరువాత వాయించినచో నా ధ్వనికి స్త్రీలు వశ్యులగుదురనుట నమ్మతగినదేనా? ఇతర శాస్త్ర గ్రంథములందున్న వశీకరణాదిక మంత్రములు వాత్స్యాయనమునలేవు.


మహర్షి వాత్స్యాయనుడు కేవలము నాయికా నాయక కామమును వర్ణించినాడు గాని పాశ్చాత్య లోకముల విరివిగను, ప్రాచ్యలోకముల కొలదిగను పొడకట్టు కామోన్మాదములైన అసహజ ప్రణయములను (Abnormalities) స్పృశింపలేదు. కొన్నితావుల స్వీయజాతి ప్రణయము Uni sexual love నుద్ఘాటించినను విశేషముగ నందు పుంభావరూపత అనుగుణ్యమున్నది.” ఇందలి Tribadism, Gyandry (పోటారతము) మొదలగు గుణములచ్చటచ్చట పొడకట్టక పోలేదు. పశుపక్షిప్రణయము (Zoo Philia or Beastiality) మందునకైన లేదు. కాని ప్రాచీన దేవాలయ శిల్పముల వీని విభేదములు క్వచిత్తుగ కాననగును. (Podophilia) బాల ప్రణయము మచ్చునకైనలేదు. (Sodomy) కనుపింపదు. అష్టవిధ వివాహములలోగాని అన్యత్రగాని దూషణము (Rape) కొన్ని జాతులవలె నెట్టిహీనులకైన వివాహవిధానముగ నా మహానుభావుడు పరిగణింపలేదు. వీనినిబట్టి మహర్షి దృక్పథము కామతంత్రమును జాత్యభ్యుదయమున కనుగుణముగ నిబద్ధించుటగాని అన్యముకాదు. ఈ మహాశాస్త్ర గ్రంథరచనము మూలమున మహర్షి భారతదేశమునకు నాటి సాంఘిక వ్యవస్థను గ్రహించుట కత్యుత్తమాధార గ్రంథమును సృజించి మహోపకార మొనర్చినాడు. ఈ శాస్త్ర గ్రంథము వలన నా నాటి సాంఘిక నాగరికత, జీవన విధానము, వర్ణ వ్యవస్థ, విద్యావైదు ష్యములు, క్రీడాదికములు, దేశసౌభాగ్య సంపదలు విస్పష్టముగ వెల్లుచున్నవి.


ఒకానొక ఆధునిక జాతిశాస్త్రజ్ఞుడు గ్రంథాంతరమున ఫలశ్రుతిగ “The Question of sex - with the racial questions that rest on it - stands before the coming generations as the chief problem for solution. Sex lies at the root of life, and we can never learn to reverence life until we know how to understand


sex” అని పలికినాడు. మహర్షి వాత్స్యాయనుడు బాభ్రవ్యాది మతములను గురువులవద్ద పఠించి తెలిసికొని, స్వబుద్ధిని తరచిచూచి యథావిధిగా ఈ కామసూత్రములు రచించి శాస్త్ర ప్రయోజనమును పైజాతి శాస్త్రజ్ఞుని కంటే నత్యున్నతస్థాయి నందుకొని ఇట్లు పలికినాడు.

“తదేత దృహ్మ చర్యేణ పరేణ చ సమాధినా
విహితం లోక యాత్రార్థం నరాగోరోస్య సంవిధి ।
రక్ష స్ధర్మార్థ కామానాం స్థితా స్వాలోకవర్తనీం
అన్య శాస్త్రస్య తత్త్వజ్ఞో భవత్యేవ జితేంద్రియః ||"

అనుబంధము

1. B.Z. Goldberg, “THE SACRED FIRE” Scientific curiosities of Love life and Marriage - Dr. Rustum J. Mehta (D.B. Tarapore-vala-Bombay) page 35

2. వాత్స్యాయన కామసూత్రములు: 1.1.5 - 19

3. Page 3 Introduction, Kalyana Malla's Ananga Ranga by Tridibnath Ray Medical Book Company, Calcutta)

4. Chandogyopanishat ch. v. ii, ch. vi. i,

5. Brihadaranyakopanishat ch. vi-Br 2.

6. మహాభారతము ఆదిపర్వము ch. 122 v 9-21

7. చతుర్భాణి ధూర్తవిట సంవాదము - 24

8. Ibid - పాదతాడితకము P. 28

9. Majjhima Nikaya II Majjhima Pannassam 89, Robert Chamer's Edition P. 118

10. అర్థశాస్త్రము - 95 అధ్యాయము.

11. Elliots History of India - VolIV

12. Page 15 - Introduction, The art of love in the orient- N.K. Basu (Medical Book Company)

13. వాత్స్యాయన కామసూత్రములు - పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి - విజ్ఞప్తి iii (ప్రథమ ముద్రణము)

14. Journal of the Mythic Soceity vii - 291

15. వాత్స్యాయన కామసూత్రములు ప్రథమ ముద్రణము - విజ్ఞప్తి ii 16. J.R.A.S. October 1930 pp - 930 -932

17. చతుష్షష్టి కళలు కామసూత్రములకు అంగవిద్యలని వానిని మహర్షి వాత్స్యాయనుడు సంగ్రహించినాడు. ఇవి ఇతర శాస్త్రములందును చెప్పబడి ఉన్నవి. కల్పసూత్రములలో కళలు డెబ్బదిరెండుగ నున్నవి. జైన గ్రంథము లందును నట్లే యున్నవి. కామసూత్ర వ్యాఖ్యాత ఈ అరువది నాలుగు మూలకళలయందే గర్భితములైయున్న అంతరకళలను మరికొన్నిటిని చేర్చి కళలు పంచశతములని చెప్పినాడు. వానిని కర్మాశ్రయములు (24), ద్యూతాశ్రయములు (20), శయనోపచారకములు (16), ఉత్తర కళలు (4) అని విభజించి వాని స్వరూపము రూపించినాడు. వాత్స్యాయనుని చతుష్షష్టి మరియొకటి ఉన్నది. మహర్షి, వ్యాఖ్యాత లిరువురు ఆ పాంచాలికా చతుఃషష్టిని గూడ కామశాస్త్రమున కంగవిద్యలుగా పరిగణించినారు. భోజుని చతుష్షష్టి మరొక విధముగ నున్నది. ప్రాచీన గ్రంథములను బట్టి కళలన్నియును తెలియకున్నను సుందరమైన ప్రతికర్మను మనవారు కళగా లెక్కించిరని చెప్పవచ్చును.

18. కామసూత్రములు - (1.4.42) ఇందలి యక్షరాత్రి, కౌముదీ జాగరము, సువసంతకము, యవన చతుర్థి, అలోల చతుర్థి, మదనోత్సవములు, కేవలము పురాతన గ్రీకుల కోర్డాక్సు నృత్యము, హేస్టీయా దేవపూజల వంటివి కావు. బొనాడియా, డైయినీషియస్, మొదలైన రోమక దేవతాపూజలలోని బుకనేలియా ఉత్సవముల వంటివి కావు. ఇందలి హోలాకా, అశోకొత్తంశికా, ఇక్షుభంజికాది క్రీడలు గ్రీకు రోముక దేశముల కామోన్మత్త వృత్తములతో పోల్చదగినవి కావు. ఉదకక్ష్వేడిక అను శృంగాటకము గిబ్బను మహాశయుడు విపులముగ వర్ణించిన ప్రజాస్నానద్రోణ జలక్రీడల పోలవు. (History of tho Decline and Fall of the Roman Empire Vol. V)

19. 'ఏకచారిణశ్చ విభవ సామర్థ్యా ద్గణికాయాం నాయికాయాశ్చ సఖౌభి ర్నాగర కైశ్చ సహచరిత మేతేన వ్యాఖ్యాతమ్' (1.4.43) అనుటను బట్టి ఏకచారులగు వారును విభవసామర్థ్యములను బట్టి సమస్త క్రీడలను ప్రవర్తించెడివారని తెలియుచున్నది.

20. పునర్భువును 'పునర్బూరియం అన్య పూర్వక రుద్దా నాత్ర శంకాస్తి' అని నిరూపించి పూర్వము క్షతయోనియై మరల వివాహమాడుటవలన నట్టి స్త్రీ నధిగమించుట వలన ధర్మపీడగాని, తదాశంక గాని లేదు (1.5.7) అని చెప్పుటవలన పునర్వివాహ విషయమున వాత్స్యాయనుని అభిప్రాయమేమో వ్యక్తమగుచున్నది. ఆమెకు ధర్మపత్నీత్వమును అతడంగీకరించినట్లు తోచదు. పునర్భూ సమాగమమునకు తరచుగ కలుగు కారణములను ఈ అధ్యాయమున 6-20 గల సూత్రముల విశేష బుద్ధికుశలతను ప్రకటించి మహర్షి విశదీకరించినాడు.

21. దీనిని గురించి ప్రత్యేకాధికరణము కామశాస్త్రమునందున్నది.

22. కామసూత్రములు : (1.5.- 4,5)

23. Ibid. (1.5.32)

24. Dr. N.K. Basu - Art of love in the Orient page 121.

25. Robinson Sexual impotence pp. 304-305

26. Wright - ‘The Sexual factor in Divorce' - Sex in Civilization - అమెరికా దేశమున విడాకుల చట్టము, వివాహములపై కెరోల్ మహాశయుడు తయారొ నర్చిన ప్రణాళికలో, విడాకులు కోరువారు చూపిన కారణములలో దుర్గంధత్వము ప్రధాన కారణముగ విశేషముగ గోచరించుచున్నదని తెలియుచున్నది. (Report on Marriage and Divorce in United States by Carroil, D. WRIGHT.)

27. “There are various dispositions in the fair, treat these in thous and different ways. There are characters in these various dispositions as these are forms in this world; the man that is wise will adopt himself to the innumerable characters" Ars Amatoria - Bk. 1-RILEYS translation.

28. Understanding Human Nature ALFRED ADLER (Garden City Publication New York) pp 180-181

29, 30. Sex Hostility in Marriages (W. Heinnemann Medical Book Ltd) pp 201-232 మీడియర్ స్త్రీ విషయమున చేసిన విభాగమునకు ప్రతిగా గయిల్ అను శాస్త్రజ్ఞుడు పురుషులను 1.ARCHITCTYPE2. PHALLICTYPE అని విభజించి "These architic Type is fond of family life... and often displays intelligeace thus the uterine type of women and has little artistic abilities and is generally conservative. The Phallic Type of Man has the qualitites and defects of the clitiroid type of women, who loves a man for his own sake and knows no satisfaction greater than sexual engagement" అని వాని గుణాగుణములను విశదమొనర్చినాడు.

31. Sex and a Changing Civilisation - KENNETH WALKER M.A; 3c.

32. Page 65 Modern Marriage - Edward. F. Griffith M.R. cs, L.R.C.P. (Methuen & Co Ltd, London)

32ఎ. ఇట గుణపతాకుని మతానుసారమున నాయికా విభేదములను గమనింపవలసి యున్నది. ఈ ఆచార్యుని మతమున స్త్రీలు శ్లథలు, ఘన, మధ్యలు. శ్లథ : 5 -

దీర్ఘ, కృష్ణ, కృశతను, చిరవిరహిణి, నిమ్న కక్ష. ఘన 5 - స్థూలాంగి,


గౌరవర్ణ వామన, శశప్రియ, ఉన్నత కర్షభాక్కు - అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నవారు సంకీర్ణలు మధ్యమలు. వీరికి అవస్థా పంచకములున్నవని ఇతరులు పేర్కొనినారు. అవి కన్యావస్థ, రోహిణ్యావస్థ, గౌర్యవస్థ, బాలావస్థ, తరుణ్యావస్థ, వృద్ధావస్థ. నాయికా నాయకులు సమానావస్థలు గల వారుగ నుండవలెనని కామజ్ఞుల మతము. సత్వభేదముల ననుసరించి స్త్రీలు (1) దేవసత్త్వ (2) నరసత్త్వ (3) నాగసత్త్వ (4) యక్షసత్త్వ (5) గంధర్వ సత్త్వ (6) పైశాచసత్త్వ (7) కాకసత్త్వ (8) కపిసత్త్వ (9) రక్షసత్త్వ (10) దానవసత్త్వ (11) గజసత్త్వ అని విభేదములున్నవి. అభిసారిక, ఖండిత, విరహోత్కంఠిత, వాసవసజ్జికాది శృంగార నాయికా విభేదములు అలంకార శాస్త్రము లందు గోచరించుచున్నవి. చరక శుశ్రుతాదుల వైద్య గ్రంథ విజ్ఞానముతో కొందరు శాస్త్రకారులు స్త్రీలను ప్రకృతి ననుసరించి వాత పిత్త కఫ ప్రకృతులని విభజించినారు. (శుశ్రుతము III. IV. - 62 - 63; ఈ సందర్భమున (శుశ్రుతము iii 72-76 63-71 చూడదగినవి), ఈ విభాగము పాశ్చాత్య వైద్యపిత యని చెప్పదగిన హిప్పోక్రేటిస్ విభజన వంటిది. బాల తరుణీ ప్రౌఢ వృద్ధాది విభాగమునకు ముఖ్యులు పంచసాయకకర్త జ్యోతీశ్వరాచార్యులు, స్మరదీపికకర్త ముఖ్యులు. బాల 16 వత్సరముల వరకు. 12వ వత్సరమున పుష్పవతి అయినను నాలుగు వత్సరముల తరువాత గాని గర్భాధానము జరుగరాదని కామశాస్త్రజ్ఞుల అభిప్రాయము. తరుణి 16-30. (20-30 అని జ్యోతీశ్వరాచార్యుడు) ప్రౌఢ వయస్సు స్మరదీపిక మతమున 19-50. వృద్ధ కొందరి మతమున 50 తరువాత, మరికొందరి మతమున 55 తరువాత. (నాగరసర్వస్వాదులు) గ్రీష్మ వసంతముల బాలతోను, హేమంత శిశిరముల తరుణితోను, వర్షమునను తదుపరి ప్రౌఢతోను ఆనందము నిచ్చునని పద్మశ్రీ పలికినాడు. రతిరత్న ప్రదీపికయందును, రతిరహస్యమునందును గల ఘనులే అనంగరంగ కర్త చెప్పిన దృఢలు. గుణపతాకుని విభాగము శాస్త్రీయముగ లేదు. నీలవర్ణలయిన సంతాల్ పర్గణాలలోని స్త్రీలు (దక్షిణ భారతము) ఘనులుగాని వారియందు శ్లథత (Flaccid Nature) ఉన్నది. మొరటువారు, ఉన్నత కర్షభాక్తత్వము వారిలో లేదు. శుశ్రుతాచార్యులవారు సత్త్వము ననుసరించి పురుషులను (1) సాత్త్విక (2) రాజసిక (3) తామసికు లని చెప్పినారు. వారిలో సాత్త్వికులు (6) మహేంద్రకాయ, వరుణకాయ, యమకాయ, కుబేరకాయ, గంధర్వకాయ, ఋషికాయలు. దేవ, గంధర్వ, యక్ష, మనుష్య, సత్త్వస్త్రీలు సాత్త్వికలు. రాజసికులు: అసురసత్త్వ, సర్పసత్త్వ, శకునసత్త్వ, రాక్షస, పిశాచ, ప్రేతసత్తులు. పిశాచ నాగ, కాక సత్త్వస్త్రీలు రాజసికలు. తామసికులు : నాయిక (3) స్వీయ, పరకీయ, సామాన్య. స్వీయ (3) ముగ్ధ, మధ్య, ప్రగల్భ ముగ్ధ (2) అజ్ఞాతయౌవన, జ్ఞాత యౌవన - నవోఢ, విస్రబ్ధనవోఢ, అతివిస్రబ్ధనవోడ. మధ్య

ధీర, అధీర, ధీరాధీర. ప్రతి జాతీయందును జ్యేష్టా కనిష్ఠలు విభేదములు.

పరకీయ: గుప్త, విదగ్ధ, లక్షిత, కులట, అనుశయన, ముదిత, కన్యక గుప్త:12) వస్తు సురత గోపన వర్తీయమాణ సురతగోపన (వర్తమాన సురతగోపన). వాగ్విదగ్ధ క్రియా విదగ్ధ అని విదగ్ధ ద్వివిధము. సామాన్య : అన్య సంభోగ దుఃఖిత, వక్రోక్తి గర్విత ప్రేమ గర్విత, (సౌందర్య గర్విత), మానవతి (పరస్త్రీ, దర్శనాధి జన్మ, గోత్ర స్కలనాధి జన్మ, అపరాంగనాసంగాధి జన్మ) ఇది కామశాస్త్రముల నాయికా స్థూలస్వరూపము.

33. భారతీయ శాస్త్రవేత్తలు స్యందనము (Antorgastic Secretion) నకు విసృష్టి (Orgastic emission) కి విభేదమును చూపినారు. ఇది పూర్వాచార్యులు ఒనర్చిన విధానము. తదుపరి కొక్కోక కల్యాణమల్ల మల్లులు ఇట్టి విభేదము పాటింపక కామసలిల శబ్దమును రెంటికిని సమముగ వాడినారు. భావ శబ్దమునకు రస, రతి, ప్రీతి, రాగ, వేగ, సమాప్తి మొదలగు పర్యాయపదములు కామసూత్రముల (11.1.65) కనుపించుచున్నవి. కామసమయముననున్న గ్రంథమును గూర్చి ప్రాచీనులొనర్చిన ప్రశంసతో నేటి విజ్ఞానులంగీకరింపరు. Encyclopaedia of Sex Practice pp. 244-45 కొందరు కామసలిలామోదమునే దైహికామోదమని భావించినారు. స్మరదీపిక, రతిమంజరులు ఈ కోటిలోనివి. ఈ సందర్భమున స్త్రీ, పురుష జాతి దైహిక గంధ తత్త్వమును గూర్చి విపుల విజ్ఞానమునకు టాలమీ 'ప్రణయము' అను గ్రంథము చూడనగును. (Love Talmey p. 98.)

34. Encyclopaedia of Sex Practice p. 231. Love 81, Ananga Ranga Tridibnath Ray pp 27-31. పాశ్చాత్యులందున స్త్రీ పురుష విసృష్టి విషయమున జీద్భాలకే, బాభ్రవ్య వాత్స్యాయనాదులు పోలిన మతభేదము లున్నవి.

35. Modern Marraige - Griffith. page 91

36. Studies in the Psychology of Sex - Havalock Ellis Vol. IV - p. 550

37. Clifford white - p. 156

38. Art of Love in the Orient - N.K. Basu pp. 202-204

39. Ananga Ranga - T. Ray page 30 Art of Love in the orient pp. 202-205 Physiology of Sex KENNETH WALKER - page 55,

40. Talmey - LOVE (Eugenics Publication Inc. New Yark - page 90.)

41. ఇట్టి ప్రేమకు పాశ్చాత్య కామతత్వవేత్తలు FELLATIO అని పేరు పెట్టినారు. దీనికి మనవారు ఔపరిష్టక రతి యనినారు. అంతఃపురికా ప్రకరణమున దీనిని

గూర్చి విపులముగ చర్చయున్నది. స్త్రీల ఔపరిష్టకాది రతులను గూర్చి ఎల్లిస్


మహాశయుడు విపులముగ వ్రాసియున్నాడు. (Studies, vol. VI - page 557) ఇట్టి విధానము ఏ నాడును విపులముగనున్నట్లు భారతదేశమున పొడకట్టదు కాని శ్రుతులందును ఇట్టి కామ వైపరీత్యము (Sexual Abnormality) గోచరించుచున్నది. దీనికి ప్రతిగా పురుషులందు కాననగు అభిమానిక ప్రీతిలో నొక భాగమును పాశ్చాత్యులు Cunnilinctus అనినారు. ప్రాచీన భారతీయ కామశాస్త్ర గ్రంథములో నీ మోహన చుంబనాదికమున్నను విశేష వ్యాప్తియులేదు. పాశ్చాత్య దేశములందు విరివిగ నున్నట్లు రచనలవలన తెలియుచున్నది. "The Superior Berlin Prostitutes testify that about a quarter of their clientee desire to exercise the practice of CUNNILINCTUS to the utter disregard of the coitus proper. In France and Italy the proportion is known to be higher. The Number of European Women who find this aggreeable is undoubtedly greater in the household and without than we generally believe" FLEXNER - History of Prostituttion in Europe.

42. వాత్స్యాయన కామసూత్రములు (2.2.4.) ఈ చతుష్షష్టి యనుమాట సాంప్రయోగికమునందుగాని, శాస్త్రైకదేశమునందుగాని వర్తించునట! ఋక్కులలో దశత్రయీ ఋక్కులని కొన్ని యున్నవట. వీటికి చతుష్షష్టి సంజ్ఞ యున్నది. సంప్రయోగాంగమునందును దశావయవ మండలార్థ సంబంధ ముండుటవలన దీనికిని చతుష్షష్టి యని చెల్లునట! ఆ దశాంగము లెవ్వి? "ఆలింగనం చుంబన దంత కర్మ నఖక్షతం సీత్కృత పాణిఘాతం సంవేశనం చోపస్పతౌపరిష్టం నరాయితం చేతి దశాంగ మాహః" అనునది ప్రమాణము.

43. Strange customs of courtship and Marriage - W.J. FIELDING, Blakiston Company, Philadelphia pages 53-66

44. "Three senses are blended in the kiss, touch, taste and smell; the sense of smell is important” Ideal Marriage - VANDE VELDE page 153. The prelude to sexual act begins with the kiss i.e. the erotic kiss. This is rich in its variation, from the lightest, gainest, form, it may run the gamut of intimacy and intensity to the pitch of Mariachinage in which the couple sometimes for hours mutually explore and caress the inside of the mouth of each other with their tongues as profuousely as possible" IBID

45. ఆదర్శ వివాహ గ్రంథకర్త వాన్ డి వెల్ది నూతన వధువుకు భయమును పారద్రోలుటకు నేటి దంపతులు ఇరువురును పరస్పరము మోహనచుంబన

మొనర్చుకొనుట యుక్తమనినాడు. పే. 170.


46. 'This Type of kissing has been endeared MARIACHINAGE in French, derived form the Mariaichins of the inhabitants of the district of Pays De Most in Britany. Here this form of Love Play is extremely popular among married as well as unmarried people. It is here that the lovers sometimes remain locked in embrace indulging in tongue-titling kiss for hours at times” Ideal Marriage - p. 153.

47. అరబ్బులు, పర్షియనులు చుంబన ప్రాధాన్యమును గుర్తించినట్లు కనుపింపరు. బాహ్యరతి "పైనవారికి ప్రణయమున్నట్లు గోచరింపరు." (Art of Love in the Orient - N.K.BASU - page 167 - 169)

48. “The more a couple kiss and make love, the more they will want to kiss and make love, untill they work themselves up into such a state of tension that they are unable to exercise proper control.

49. IBID pages 156- GRIFFITH - MOdern Marriage.

50. Van de Velde 'Ideal Marraige' page 156.

51. FRITZ WITTELS - Critique of Love pp 49, 79 అందలి అభిప్రాయమును మరియొక వేత్త ఇట్లు సంగ్రహించినాడు. "A certain amount of Sadistic impulse in man and mosachistic impulse in Women is normal and even necessary. There is nothing abnormal if these two instincts in a sane proposition are found mixed up and to appear successively in one and the same person.'

52. ఈ అభిప్రాయమునకు భిన్నముగ “ఆదర్శ వివాహ గ్రంథకర్త రదనచ్ఛదములను విశేషముగ స్త్రీలు ప్రయోగింతు"రని చెప్పినాడు. (Ideal Marriage p. 151). ఇది పాశ్చాత్య దేశ స్త్రీల విషయమున సత్యము కావచ్చును. కాని డచ్చి స్త్రీల కిట్టి గుణము లేదని అన్య ఆధారము వలన తెలియుచున్నది.

53. నాగర సర్వస్వము. 34, 35 అధ్యాయములు

54. కామసూత్రములు - (2.5.20 - 35) ఈ సాత్మ్య వివరణననుసరించి ప్రాచీన భారతదేశ విభాగ స్వరూపము కొంతగ గోచరించుచున్నది. ఇందు వాత్స్యాయనుడు పేర్కొనిన మధ్యదేశము మన్వాది సంహితలును పురాణములు పేర్కొనిన మధ్యదేశము హిమాలయ - వింధ్య మధ్యదేశము. తూర్పు హద్దు వినాశనము (సరస్వతి అంతర్వాహినియైన ప్రదేశము), పడమర ప్రయాగ, వరాహమిహిరుడు బృహత్సంహితలో (XIV, 2-4) ఈ ప్రదేశమునే మధ్యదేశమనినాడు. బౌద్ధుల మహావగ్గమున (v. 13.2) తూర్పు : కజంగల దక్షిణము : సతకన్నిక, పశ్చిమము : ధున, ఉత్తరము: ఉషిరధజలని యున్నది.


వాశిష్ఠ, బౌద్ధాయనులు దీని విస్తీర్ణము కొంత తగ్గించి చూపినారు. (Studies in Vatsyayana's Kama Sutras) వాత్స్యాయనుని మాళవకము నేటి తూర్పు మాళవము, దాని ముఖ్యపట్టణము విదిశ (Bhilsa). ఆభీర దేశ విషయమున కామసూత్ర వ్యాఖ్యాత 'అభీర దేశః శ్రీకంఠ కురుక్షేత్రాది భూమిః (2.5.24) సూత్ర వ్యాఖ్యానము) అని దేశ నిరూపణమున పొరబడినాడు. ఆయన చెప్పినట్లు ఆభీరము కురుక్షేత్ర శ్రీకంఠములతో సంబంధము కలది కాదు. బృహత్సంహిత ఈ దేశమును కొంకణ, ఆకర, అవంతి, వనవాసి మొదలగు దేశములతో కలిపి పలికినది. అందువలన ఆభీరము పశ్చిమ భారతము లోనిది కావలయును. అది నాసిక ప్రాంతము. వాత్స్యాయనుని లాటము తూర్పు గుజరాతు బరోడాలగు సౌరాష్ట్ర అవంతులకు మధ్యదేశము. నేటి ఉత్తర కథియవాడ దేశము. కోసలము ఔంఢ్ రాష్ట్రము. పాటలీపుత్రము మగధదేశ రాజధాని ప్రాంతము. మహారాష్ట్ర దేశమును కామసూత్ర వ్యాఖ్యాత 'నర్మదా కర్ణాట విషయోర్మధ్యే మహారాష్ట్ర విషయః' (2.5.28) అని నిర్దేశించినాడు. వంగము దక్షిణ బంగాళదేశము. గౌడము ఉత్తర బంగాళము. స్త్రీ రాజ్యమును కోసలతో కలిపి పేర్కొనినాడు. ఈ రాజ్యమును కొందరు బాలో ప్రాంత దేశమనినారు. కొందరి మతమున నిది భూటాను, ఇతరులు ఈ రాష్ట్రమును తిబ్బత్తు దేశమనినారు. కాని ఇది పశ్చిమ తిబ్బత్తు రాజ్యము. ఇందు నేటికిని బహుభర్తృత్వము (Polyandry) వివాహధర్మముగ నున్నది. 'వంగ రక్త దేశాత్ పశ్చిమేన స్త్రీ రాజ్యం' అని వ్యాఖ్యాత (2.5.27). ఉత్కళము నేటి ఒరిస్సా రాష్ట్రము. బ్రహ్మపుత్రకు తూర్పుననున్న దేశము కామరూపము (Assam). కొంకణ రాష్ట్రమునకు తూర్పునను మహారాష్ట్రమునకు దక్షిణమున నున్నదియును వనవాసము. దీని ముఖ్యపట్టణము వనవాసి, 'Vanavasa the South Eastern portion of the Bombay Presidency, North - Western Portion of the Madras Presidency and South Western portion of Hyderabad' 'కర్ణాటక విషయా దక్షిణేవ ద్రావిడ విషయ' వాత్స్యాయనుని తదనంతరము జనించిన గ్రంథములందు మరికొన్ని దేశనామము లున్నవి. అందు తిరుభుక్తి విదేహము. నేటి తిరుహట్. అది తూర్పున కౌశికీ నదీ పరివేష్టితము దక్షిణమున గంగ. పశ్చిమమున సదానీక Gandak అని Muir; Rapti - Pargitar, Little Gandak Fleet J.R.A.S. 1907. p. 644) ఉత్తరమున హిమాలయములు. పాట్నాకు ప్రాచీన నామములు పుష్పపురము, పాటలీపుత్రమే పుష్పపురమందమన్న వీలులేదు. కావున అనంగరంగ కర్త పేర్కొనిన పుష్పపురము పశ్చిమ బీహారు కావచ్చునని కొందరి అభిప్రాయము. అంగము తూర్పు బీహారము - భాగల్పూర్, రాజ్మహల్, పూర్నియా జిల్లాలు మద్రదేశము శల్యుని దేశము

(Sialkot). సౌవరము దక్షిణ పశ్చిమ రాజపుత్రస్థానము, మలయదేశము


తిరువాన్కూరు, మధుర, తిన్నవెళ్ళి ప్రాంతము. కాంభోజము దక్షిణ - పశ్చిమ కాశ్మీరములోని రాజూయార్ ప్రాంతము. పౌండ్రులు ఉద్ర, ఉత్కళ, మేఖల, కళింగులను వరుసగ జెప్పుటకు ఈ గ్రంథములందున్నది. బంగాళమునుండి పశ్చిమమునకు నటుపిమ్మట దక్షిణ పశ్చిమ క్రమమునకు నడచి చెప్పినట్లున్నది. గాధి రాజ్యము కన్యాకుబ్జము. (Kanauj)

55. ఈ రాగవృద్ధి కరణమును గూర్చి వాత్స్యాయనుడు ప్రశంస తెచ్చినాడు గాని కొక్కోక పద్మశ్రీలవలె వికల్ప స్వరూపమును నిరూపించలేదు. ఈ కరికరక్రీడ రతిరహస్య కర్త మతమున 5 విధములు, (VI- 241-246) పద్మశ్రీ ఇందు షడ్విధ విభేదములను పలికినాడు.

56. ఆంధ్ర కామశాస్త్ర వ్యాఖ్యాత కావ్యస్మృతి తీర్థ శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రులవారు వాత్స్యాయన మహర్షి పేర్కొనని అనేక దేశస్త్రీల సాత్మ్యములను జ్యోతీశ్వరాచార్యుని పంచసాయకాది గ్రంథములనుండి గ్రహించి విపులముగ సంకలనమొనర్చినారు. (ఆంధ్ర కామసూత్రములు ప్రథమ ముద్రణము పే. 370-371)

57. BASU - Love in the Orient- Chapter X & XI

58. సాహిత్య దర్పణ కారుడు సమస్త రత కోవిదయైన ప్రౌఢ నాయికను "క్వచిత్తాంబూలక్తః క్వచిదగరు పంకాంక మలినః, క్వచిచ్చూర్ణో ద్గారీ, క్వచి దపిచ సాలక పదః, వలీభంగా భోగై రలక పతితైః శీర్ణ కుసుమైః స్త్రియా సర్వావస్థాం కథయతి రతం ప్రచ్ఛదపటః” అని వర్ణించినపట్ల మార్జార, ధేనుబంధ, సమపద, ఉత్తానాది సురత విశేషములను పురుషాయితమును గర్భితముగ పలికిన వాక్యములు ఇందుకొక ఉదాహరణము.

59. “The reader will bear in mind that the exceeding pliablity of the Hindu's limbs enables him to assume attitudes absolutely impossible to the Europeans, and his chief object in Congress is to avoid tension of the muscles, which would otherwise shorten of the period of enjoyment Dr. Norman Himes vol VIp. 557

60. IBID 298

61. PAUL LECROIX, History of Prostitution - vol I p. 242 (Putnams Translation)

62. నెల్లూరు శివరామకవి - కామకళానిధి (శృంగార గ్రంథమండలి - సంపాదకులు,

పురాణం సూర్యనారాయణ శాస్త్రులవారు)


63. ఉత్తానకరణములు అతిప్రాచీనములు. ఇవి మిగిలినవారికంటె ప్రశస్తములైనవని శాస్త్రజ్ఞుల అభిప్రాయము. ఇందు యోనిమార్గము ఉన్నిద్ర లింగమున కనుగుణమై యుండుటయే ప్రశస్తిగల కారణము. వీటియందు స్త్రీ పురుషులన్యోన్యము అవయవ నిరూపణమును, భావవ్యక్తీకరణము నొనర్చుటకు వీలగుచున్నది. ఇందు (సంపుటక (Enclosing) పీడితక (Oppressive) వేష్టితక (Clasping) వేణువిదారిత (Split Bamboo) బంధములు (Poses or Attitudes) కుబ్జలింగత్వ ముననే (Phallic insufticienge) ఉపకరించును. ప్రపంచములోని సమస్త జాతులలోను ఈ కరణములే ప్రాముఖ్యము వహించినవి. ఈజిప్టు దేశ పురాతన గోరీలందును, పెరూలోని ఇంకా జాతులవారి చంద్రదేవాలయము లందును ఉత్తానకరణ శిల్పములు కనుపించుచున్నవి. ఆఫ్రికా అనాగరిక జాతులలోను, అమెరికా జాతులలోను ఈ కరణములనే విరివిగ వాడుదురు. దీనికి విపరీత కరణమే పురుషాయితము. సర్వకాలములందును రోమక జాతులవారిలోను నిట్టి ఆచారమున్నట్లు ఆర్స్ అమటోరియా వలన తెలియుచున్నది. పురుషుని అధఃస్థితికి మహమ్మదీయ జాతులంగీకరింపవు. “పురుషుని భూమిని - స్త్రీని ఆకాశమున జేయువానికి నరకము కల్గుగాక” అని వారికొక సామెత యున్నదట! సాహోలీ జాతిలో పురుషాయిత బంధ ప్రియత్వము విశేషము. అందు నాయికలు Digtisha అనునొక మంథన క్రియ యొనర్తురట. దానిని వృద్ధ స్త్రీలు యువతులకు ఒక మండల దినములు నేర్పుదురట. అది ఎరుగని స్త్రీకి ఆయా జాతులలో గౌరవ ప్రతిపత్తులు తక్కువ. కమటా షౌడిల్సు అనువారు ఈ బంధమును పాపకృత్యముగ తలచి వారి ముఖ్యాహారమగు చేపలవలె తిర్యక్కరణమున సంప్రయోగమొనర్తురట!

64. తిర్యక్కరణముల వలన కొంత శారీరకోపయోగము స్త్రీ పురుషుల కిరువురకున్నది. పురుషభారము వహింప వలసిన అగత్యముండదు. పురుషునకు విసృష్టి అతివేగముగ జరుగదు. ఇరువురుగాని లేక ఒకరు గాని కుండబొజ్జగల వారైన, లేదా గర్భధారణసమయమున నైనను నీ తిర్యక్కరణములు (Lateral attitudes) ఉపకరించుచున్నవి. వీనిని గూర్చి ఒక విజ్ఞుడు వ్రాసిన వాక్యము లెంతయు సమంజసములైనవి: "The Lateral attitude becomes distinctly disadvantageous unless and until the woman draws up her leg on which she is lying. In other words, this attitude virtually become half-super posed.” ఈ తిర్యక్కరణమును ఓవిడ్ మహాశయుడు ఆర్స్ అమటోరియాలో నిట్లు పొగడి ఉన్నాడు. "Of loves thousand ways a simple way and with the least labour this is, to lie on the RIGHT SIDE, and

half-supine withal.” కాని ఈ తిర్యక్కరణమున భారతీయులు నాయికకు


కుడిదిక్కున నుండరు. కామకళాతంత్ర మెరిగిన ఒక శాస్త్రవేత్త ఇందలి లోపములను గురించి “But it has its draw backs also - Viz superfect penetration and localised pressure on the woman's leg, this of course, can only be avoided by approaching the normal Horizontal attitude or through the Extreme flexation and lifting of the captive limb” అని వ్రాసి ఉన్నాడు. ఎడ్పిన్ హిర్బ్ అను వైద్యశిఖామణి ఈ తిర్యక్కరణము, నూతన వధూవరులకు సౌఖ్యదాయకమని అభిప్రాయపడినాడు. Power to Love అను గ్రంథమున నీగ్రో జాతులలో లొయిలగోలు, నామొల్లోలు, మరికొందరు నీ తిర్యక్కరణముల యెడ విశేషాసక్తి నిరూపింతురట. ఇందుకు వారి దీర్ఘలింగము మూలకారణమని పెద్దల అభిప్రాయము.

65. స్థితకరణమును షేకు 'డొక్ - ఎల్ - అజార్' అని పిలచినాడు. అతని గ్రంథమున దీని ప్రశస్తిని గురించి ఇట్లు చెప్పినాడు. “Try different manners, for every woman prefers a distinct method to all the others for her intimate pleasure. The Majority of them have however, a prediliction for the DOK - EL - AZAR, as in the application of the same belley is pressed to belley, mouth can easily be gloved to mouth and the action of the womb with the vaginal wall is rarely absent” ఇందు నాయిక ప్రధాన పాత్రను, నాయకుడు ద్వితీయ పాత్రను (Secondary role) వహించును (Art of love in the orient - p. 249)

66. Anangarangam - T. Ray Page 214

67. Ibid - 216

68. ఉత్థితబంధములకు అరబ్బు దేశస్థులు ఎల్ కూర్చి అని నామకరణ మొనర్చినారు. స్థిరతమునకు సంబంధించిన ఈ కరణములను ప్రాచ్యపాశ్చాత్య ఖండములు రెండును దోషయుక్తములని నిందించినవి. ఇందు మూటిని హిందువులును, రెంటిని అరబ్బులును పేర్కొనినారు (page 257 HAMMOND - Sexual Impotence; HIMES - Happy Marriage p. 295) స్థితవ్యానకరణముల రెంటిని వాత్స్యాయనుడు చిత్రరతములు (Fantastic Poses) గా పరిగణించినాడు.

69. అతి ప్రాచీన కాలమున వ్యాకరణములే (Prone or Ventral Attituder) సంప్రయోగమున విశేషస్థితి వహించినవనుటకు అనేక ప్రబల నిదర్శనములు కనిపించుచున్నవి. క్రైస్తవ దేశములందు మండలము మొదలు త్రిరాత్రముల వరకు నిట్టి మానవాసహజకరణప్రీతిని తొలగింపుమని భగవంతుని ప్రార్థించినట్లు నిదర్శనములున్నవి. వాన్డివెల్డి మహాశయుడు ఇందున్న అనేక దోషములు

కారణముగ వీనిని త్రోసిపుచ్చినాడు. ఉత్థానకరణములలోవలె నిందు యోని


మార్గమునకును, లింగమునకును సంయోగము కుదరదు. ఇందు స్త్రీకి విసృష్టి సుఖముండదు. కామాపత్రసీమకు (Clitoridal Region) ఇందు సంబంధముండక పోవుట గొప్పలోపము అని ఆయన అభిప్రాయము. (Marriage - Vendevelde 117-119) కాని ఇతని అభిప్రాయములకు భిన్నముగ క్లోట్జ్ అను శర్మణ్య మానవజాత్య శాస్త్రజ్ఞుడు (Sexual Anthropology) వ్యాసకరణములత్యున్నతము లైనవనియును ప్రతివ్యక్తియును వానిని స్వీకరింప వలయుననియును అభిప్రాయమిచ్చినాడు. (Der MenschEin Vier Fussler Berlin 1908) క్రీ.శ. 2వ శతాబ్ది నాటి రోమక శిల్పమున నీ వ్యానకరణములే విశేషముగ శిల్పితములైనవి. ఇందలి ధేనుకావ్యానత బంధమున (Bovine Posture) నితర బంధములన్నిటి కంటె యోనికుల్య (Vaginal Canal) విశేషముగ స్రవించునని పిళ్లై మహాశయుని అభిప్రాయము. (The Art of Love and Sane Sex living A.P. Pillai, pp. 878-9) అందుమూలమున దీర్ఘలింగమునకును, గర్భోత్పత్తికిని నీ కరణములు ఆత్యుత్తములని చెప్పవచ్చును.

70. వాత్స్యాయన కామసూత్రములు (2.6.42)

71. చిత్రరతముల గూర్చియు, సామాన్య రతి విధానముల గూర్చియు వాత్స్యాయన మహర్షి అభిప్రాయములనే భంగ్యంతరమున ఎల్లిస్, హేర్ష్విల్డె (Sex in Human Relationship), ఇవాన్సు (Men and Women in Marriage), రైట్ (Sex feels in Marriage) మొదలగు పాశ్చాత్య విద్వాంసులు వెల్లడి చేసి ఉన్నారు. వాత్స్యాయనుడు పలికినట్లు సాంప్రయోగిక విధానవైవిధ్యము మూలమున బహు శృంగార లక్షణుడగు (Poly-Erotic) పురుషునకు అసౌఖ్యము ఏకపత్నీత్వమున లభించుచున్నదని అంగీకరించు చున్నారు. విసుగును పోద్రోలుట, ఒకరికి గాని, ఇరువురకు గాని రతి సౌఖ్యమును వృద్ధి యొనర్చుట, ఆరోగ్య విషయకములును, స్థూలాది శరీర దోషము వలన కలిగిన అశక్తతను తొలగించుట, గర్భోత్పత్తి, గర్భనిరోధము - ఇట్టి రతివిభేద వైవిధ్యమునకు మూల కారణములు. సమస్త వ్యక్తులకు నొక విధానము యుక్తమని నిర్ణయించుటకు వీలులేదు. యాడ్లర్ మహాశయుడు చెప్పినట్లు కొందరు స్త్రీలకు విసృష్టి కలుగవలెనన్న తిర్యక్కరణము గాని (Laleral) పురుషాయితము (Posteriori) గాని కావలసి వచ్చును. (ADLER-Die Mangehate) 'అమెరికాదేశ స్త్రీలలో నెవ్వరికిని వైవాహిక జీవితమున విసృష్టి సుఖము లేకపోవుటకు ఇదియే ప్రధాన కారణమని విజ్ఞుల అభిప్రాయము. ఇందువలననే ఆ దేశములోని విడాకుల వైపరీత్యమును. కేవల ముత్తానకణములను ప్రేమించు పునీత

ఒక్కొక్కమారు సద్భర్తను పణ్యస్త్రీల పాలుచేయునన్న హెలీనా రైట్ (Birth Control)


మాటలోని సత్యము నిందు వలన కలిగినదే. కళాపిపాస వలనను, మానసిక లక్షణములవలనను సాంప్రయోగిక వైవిధ్య మవసరముగు చున్నది. డికిన్సన్ మహాశయుడు "మానవ జాత్య శారీరకము"న (Human Sex Anatomy) నీ చతుష్షష్టి (Coital Variations) వైద్యకర్మానుకూలతకు నుపయోగపడునని చెప్పినాడు. గర్భ విచ్చిత్తి నాపుటకును, గర్భధారణ విచ్ఛేదములకు నివి అనుకూలపడుచున్నవి. పురుషాయిత కేళిక్రియాదక్షతకు పుత్ర పుత్రీ దర్శనము దుర్లభమనుమాట నగ్న సత్యము.

72. Ellis - Love and Pain. page 83

73. Art of Love in the Orient page 271

74. This Princers action is effected by catching hold of the Phallus by SPINCTER CUNNI and other Muscles of the Vagina, the woman draws or presses it within and remains in this strate for a considerable time¹

75. కొక్కోకము - శ్లో 297 298

76. ఈ ఔపరిష్టకములను గురించి రతిరత్నప్రదీపిక కారుడును (ch VI. 21-54) కొక్కోక కర్తయును (309-318 శ్లోకములు) ప్రసంగించినారు. సంప్రయోగ పూర్వరంగమున ఏతదవసరములను గూర్చి వ్రాయుచు శాస్త్రజ్ఞులు ఎల్లిస్, వాన్ డి వెల్డీ లిరువురును ఔపరిష్టకములను (Fellatio and Cunnilinctus) గూర్చి ప్రసంగించి అవి నేటి అనాగర నాగరిక జాతుల రెంటియందును విశేషముగ కనుపించుచున్నవని చెప్పి ఉన్నారు. ఔపరిష్టకములు భారతదేశమున విశేష ప్రచారములో ననాది కాలము నుండి యున్నవని ఎల్లిస్ అభిప్రాయము. (Studies, vol. VI p 557) ప్రమాదమూలకము. ఇది ఏ నాడును భారతదేశమున యూరప్ ఖండములో వలె ప్రాచుర్యము వహింపలేదు. ఇట్టి ఆధారమునకు మూలకారణమును ఒక విజ్ఞాని ఇట్లు నిరూపించినాడు.

“These Two methods, thought apparently reprehensible, may every where be found to spring up quite naturally among some lovers sometimes during the height of their erotic frenzy as coital preludes. Freud has pointed out in the second series of his BEITRAGE ZURNEUROSENLEHRE that the idea of practising fellatio as a part of sexual pleasure on the part of women has its origin in the almost inevitable factor of infantile fixation, because of the fact that the similarly, the desire for CUNNILINCTUS in men should cause us little alaram as the clitoris bears a natural analogy with the mothers

treat the latter also being a prominent erogenous centre and the pleasure


derived in sucking by an infant being paid to be often erotically tinged." ఈ అభిప్రాయములే ఎల్లిస్ మహాశయుడు అతని (Sexual Selection In Man) అను గ్రంథమున (Sec. III) విశదీకరించినాడు. ఇట్టి మానసిక దౌర్భాగ్య కృత్యములు (Pathological cases) భారతదేశమున కనుపింపవు. కొందరు పడుపు వృత్తిలో జీవించువారు ఇట్టి కృత్యములగోరు విటునుండి అత్యధికధనమును పొంది విరక్తితో నొనరింతురని తెలియుచున్నది. యూరపు దేశములోని వ్యభిచార చరిత్రమును పరిశీలించినచో నిట్టి వృత్తి వారి యెడ విశేషమనియును, జర్మను కులస్త్రీలకే ఇట్టి భగచుంబనాసక్తి విస్తారమనియును, కేవల మద్దానితోనే సంప్రయోగరహితలుగ నుండగలరనియును తెలియుచున్నది. (FLEXNER'S - History of Prostitution in Europe) తృతీయా ప్రకృతి (Hermophroditism) ని గూర్చి విజ్ఞుల అభిప్రాయమిట్లున్నది. "In every male lurks female, some times arrogant as to mask the true personality, sometimes so shy as to be scarcely perceptible, not longer can we speak of the 'Male Type' and of the 'Female Type' but rather of a series of infinite gradations which extended from a flagrant Hermaprodistism to from so attenuated that they merge into normality itself" (MARANON)

77. Art of Love - Chapters III & IV.

78. N.K. BASU - History of Prostitution in India vol. I-p. 199

79. అత్రిసంహిత 2/50 - వ్యాససంహిత 2/13

80. “దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం... స్త్రీయ ముద్వహే' (వివాహ సంకల్పము) 'జాయా మానోవై బ్రాహ్మణః త్రిభిః ఋణవాన్ జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేవ దేవేభ్యః ప్రజయా పితృభ్యః, ఏషవా అనృణో యః పుత్రీ యజ్వా బ్రహ్మచారీ” ఇత్యాదులు ప్రమాణములు.

81. Psychological Factors in Marital Happiness - LEWIS TERMAN - page 474; Predicating Success and Failure in Marriage E.W. BURGESS nd COTTRELL - Page 47.

82. Physiology of Sex - WALKER - Page 53.

83. Happy Marriage - HIMES - page 77

84. అయినప్పటికిని విచ్ఛేదమును గూర్చి కొన్ని స్మృతులు పలికినవి. 'వివాదశీలీ, స్వయ మర్థ చోరిణీ, పరాభికూలాన్యవరాభి భాషిణి, అగ్రాశినీ చాన్య గృహప్రవేశినీ, భార్యాం త్యజేత్ పుత్ర దశ ప్రసూతికామ్' (పరాశర స్మృతి) 'చతుస్రస్తు పరిత్యాజ్యా

వావిలాల సోమయాజులు సాహిత్యం-4


శిష్యగా గురుగాదయా పతిఘ్నీతు విశేషేణ గింజు లోపగతా చయా' (వాసిష్ఠస్మృతి). విధివత్ పరిగృహ్యాపి త్యజేత్కన్యాం విగర్హితామ్, వ్యాధితాం విప్రదుష్టావా ఛద్మనా చోపపాదితామ్ - భార్య భర్తను పరిత్యజించుటకు 'నష్టా మృత ప్రప్రజితే క్లీబే చ తీతౌ పతౌ పంచ స్వాపత్యు నారీణాం పతిరన్యో విధీయతే', (పరాశరము) భార్యను భర్త త్యజించినను విక్రయించినను భార్యాభర్తల సంబంధము ఉండనే ఉండునని మనుస్మృతి - "న నిష్క్రియ విసర్గాభ్యాం భర్త ర్భార్యా విముచ్యతే” (9-46) ఇట్టివే 2-31 3-24. పూర్వము ఒక స్త్రీని వివాహమాడినవాడు పరపూర్వాపతి, అన్య స్త్రీలోలుడై భార్యను త్యజించిన వాడు స్త్రీ జితుడును పాపభాజనుడు - అతనికి యావజ్జీవమూ అశౌచ ముండునని భారతీయ ధర్మశాస్త్రము.

85. భార్యాభర్తల మధ్య ఉండే అంతరము మూలమున పూర్ణాయుర్దాయము నొందు సంతానము కలుగునని భారతీయుల నమ్మకము. శుశ్రుతాచార్యుని అనుసరించి స్త్రీ ఋతుధర్మం 12 ఏట ప్రారంభము. 15 మొదలు 45 వరకును స్త్రీలు సంతానవతులు కావచ్చును. అందువలన యువకుడు 30 ఏట స్త్రీ 12వ ఏట వివాహము చేసుకొనిన వైవాహిక జీవనము సంతృప్తికరముగను, సంతాన వంతముగను నొప్పునని భారతీయుల అభిప్రాయము. (అష్టాంగ హృదయము - శరీరస్థానము) ఆధునిక వివాహగ్రంథకర్త పాశ్చాత్యలోకముల ఆర్థిక సాంఘికాది పరిస్థితులు అనుసరించి కన్యకకు 25 ఏటను, యువకుని కంతకంటే కొలది సంవత్సరముల తరువాతను వివాహ యుక్తవయస్సు (Griffith Moderm Marriage p. 52) నేటి ఉత్తమ మధ్య తరగతి భారతీయులలో 16 మొదలు 24 సంవత్సరముల మధ్య వివాహములు జరుగుచున్నవి. భార్యాభర్తల అంతరము సామాన్యముగ 5 మొదలు 15 వరకు నున్నది. నేడు స్త్రీకి 18 సంవత్సరములు, 25 సంవత్సరములు పురుషునకు వివాహయోగ్య కాలముగ నిర్ణయింపవచ్చునని ఒక విజ్ఞుని అభిప్రాయము. అంతరమును గూర్చి ఆయన ఇట్లు వ్రాసినాడు. "Ten Years of age may be put as the safe biologic "Buffer" between marital partners in view of the fact that senile changes take place earlier in women than in men and that feminine charms is always the outstanding asset in the balance sheet of Nuptials.".

86. History of Human Marriage. WESTERMARCK- 'Marriage Consent'

87. ప్రపంచమునందలి వివాహ వ్యవస్థ ఒకనాడు జన్మించినది కాదనియును క్రమపరిణామమున నేటి రూపము వహించినదనియును తెలియుచున్నది.

(Marriage WESTERMARCK; Origin of Family Angels.) ప్రాచీన భారతమున


నిట్టి సంప్రదాయము నుండి ఉండవలయును. వేద యుగమునుండి నేటివరకు నేర్పడిన వివాహ విధానములలో 8 విధములు : ఆర్ష (Higher form of Purchase) బ్రాహ్మ్య (Religious) ప్రాజాపత్య (Sanctioned by Law and Religion) దైవ (daughter given to a ఋత్విక్ Potentate) గాంధర్వము (Mutual consent) పైశాచము, రాక్షసము, ఆసురము - ఇందు మొదటి నాలుగును ధార్మ్యములు; మిగిలినవి వ్యూఢములు. వ్యూఢములలో గాంధర్వము ప్రధానము (3.5.29) వీనికి స్వయంవర బహుభర్తృత్వములను చేర్పవచ్చును. మహా నిర్వాణ తంత్రము (IX-269) వలన సంఘ వివాహములను ఒకరీతి శైవవివాహములు పురాతన భారతమున నొప్పుచున్నట్లు తెలియుచున్నది.

88. కన్యాప్రణయము (Pre-Marital Courtship) అనాగరిక జాతులలోను, కొన్ని నాగరిక జాతులలోను విశేషము. (HANNA and Abrahm - Marriage Manual; IWANBLOCH Sexual Life of our time, Physiology of Sex-Chapter IX 103- 115 Night courtship ను గురించి City of the Saints, Burton - SPEARE - Dark Daughter - Rhys&Brynmore Jones- Welsh People pp 582 - 4 Burton Saints etc – అనాగరక జాతులలోని కన్యకా కామమునకు Emest CRAWLEY -Mystic Rose 2 vols. నేటి అమెరికాలో వివాహమునకు పూర్వము 73% పురుషులు, 63% స్త్రీలు వివాహమునకు పూర్వమే కామవ్యాపారము కలిగినట్లు టెర్మన్ పలికినాడు. అతడు అమెరికాను గురించి "If this drop should continue at the average rate shown for those born since 1890, Virginity at Marriage will be close to the vanishing point for males born after 1930 and for females born after 1940" అని పలికినాడు. నేటికది సత్యము. కన్యాప్రణయమును గూర్చి ఎల్లీస్ మహాశయుడు ((Psychology of Sex vol III. pp-380-381) "In some countries it is said to be almost a universal practice for the women to have Sexual relationship before legal Marriage,: Some times she marries the first man whom she tries! Some times she tries several before finding the man who suits her” ఇట్టి హాస్యాస్పదమైన వివాహపూర్వ ప్రణయము భారతదేశమున నేనాడును లేదని చెప్పవచ్చును. Health Disease in Relation to Marriage KAMINER - vol. I 2. SENANCOUR - Dil Amour vol. III p. 57 3. W. STEKEL Frigidity in Women vol. I 4. KRAFT Ebbing - Psychopathia Sexualis, Sex Friendship & Marriage - BARNES cap. X (Alen UNWIN)

89. WALKER - Physiology of Sex - Chap - VIII-Strange Customs of courtship & Marriage, W.J. FIELDING chap XVII etc.

90. మనుస్మృతి XI - 26 - 29; III - 60


91. ప్రపంచ వివాహ చరిత్ర కారుడు వెస్టర్ మార్కు 1. జనసంఖ్య 2. స్త్రీ పురుష గృహజీవన విధానమున శారీరక (Physical) ఉద్వేగ (Emotional) వైజ్ఞానిక (Intellectual) ప్రతిపత్తులలో సామ్యత లేకపోవుట 3. స్త్రీ ఋతుధర్మము, గర్భధారణము, దీర్ఘవ్యాధి కారణముగ మానవునిలో (దక్షిణత్వము) బాహునాయికత్వాపేక్ష (Polygomons Nature) నవ్యతా ప్రియత్వము 4. సంతానము ఆస్తిపాస్తులు బహుభార్యాత్వమునకు కారణములని చెప్పినాడు. చూడు. ఆంధ్రవారపత్రిక - 'నా బహుభార్యాత్వము - బహుభర్తృత్వము (27-4-48)

92.శీలమును గూర్చి ప్రపంచములోని అనేక దేశముల భిన్నభిన్నములైన అభిప్రాయములున్నవి. ఏతద్రక్షణార్థము వివిధ జాతులు వివిధ మార్గముల ననుసరించినారు - W. J. Fielding Strange customs of courtship & Marriage pp. 134–155; MEHTA : Scientific Curiosities of Love, Life and Marriage pp. 263-256. The battle of venus - HAAG: అనాగరిక జాతులలో కనుపించు కన్యాత్వమను దోషపరిహరణము (Defloration sceintific curiosities of Love Life and Marriage pagel41.142) నే యుగమున లేదని విస్పష్టము.

93.అలంకార శాస్త్రవేత్తలు దశావస్థలను చర్చించి 'మరణము' కాదు మరణయత్నము పదియవ అవస్థ అని చెప్పినారు. ప్రతాపరుద్రీయమున ప్రలాపము, సంజ్వరము అను మరి రెండు అవస్థలను అధికముగ చెప్పినాడు. భావప్రకాశమున శారదా తనయుడు ఈ దశావస్థలకు భిన్నముగ 'దశధా మన్మథావస్థా భవే ద్వాదశ ధా౽పివా, ఇచ్ఛోత్కంఠాభిలాషశ్చ చింతా స్మృతి గుణస్తుతీ, ఉద్వేగోధః ప్రలాపస్యా దున్మాదో వ్యాధిరేవ చ, జాడ్యం మరణ మిత్యాద్యేద్పేకై శ్చి ద్వర్జ్యతేబుధైః' అని పలికినాడు. (కావ్యాలంకార సంగ్రహము. సంపాదకుడు: సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి పుట 369)

94. FAUSBOLL - Jatakas vol. V 448; Kuntala Jalaka p. 536

95. ప్రాచీన భారతీయుల ప్రణయలేఖలు చిత్రలిపిలోను, సంజ్ఞలలోను వ్రాసుకొనెడివారు పత్రపుష్పాదికములను అందుల కుపయోగించు కొనుట కావ్య నాటకాదులవలన తెలియుచున్నది. చక్షుర్గోచరము గాని రీతిగ గుమ్మపాలతో గాని, పటిక నీటితో గాని వ్రాయుట రోమనులవలె (Ars Amatoria B.III 625 - 29) భారతీయు లెరిగినట్లు లేదు.

96. కామసూత్రములను పరిశీలించినపుడు హస్తినీజాతి స్త్రీలు అపద్రవ్య ప్రియలని తెలియుచున్నది. నష్టరాగ ప్రత్యానయనాద్యధ్యాయమున అపద్రవ్యములను

వృష్యయోగములుగ మహర్షి పలికి యున్నాడు. మంద ధృస్తములగు నష్టములను


నష్టరాగలకు సంబాధకము నుపమర్దన మొనర్చి 'అపద్రవ్యాణి యోజయేత్' (7.3.3) అని చెప్పినాడు. 'తాని సువర్ణరజత తామ్ర కాలాయన గజదంతగవల (కొమ్ము) ద్రవ్యమయాని' (7.2.5) అని, పలికి త్రా పుషాణి పైసకాని చ మృదూని శీత వీర్యాని వృష్యాని కర్మణి చ దృష్టూని భవంతీతి బాభ్రవీయాః యోగాః' (7.2.9) అని బాభ్రవీయుల సీసక త్రాపుసక అపద్రవ్యములను చెప్పి 'దారుమధాణి సామ్యతశ్చేతి వాత్స్యాయనః' అని దారుమయ అపద్రవ్యములను సామ్యమును బట్టి యోజన చేయదగుమ అని నిజాభిప్రాయమును వెల్లడించినాడు. ఇందలి కర్కశ పర్యంత, బహుళ, సంఘటి, చూడక, ఏకచూడక, కంచుక, జాలకాది భేదములను చెప్పినాడు. వాటి ప్రయోగ విధానమును నిరూపించినాడు. (7.2.14) అనేక అనాగరిక జాతులలో నష్టరాగలయిన వృద్ధ స్త్రీలలో రాగస్థాపనార్థము అపద్రవ్యముల నుపయోగించుట నేటికిని అలవాటు. ఇట్టివానిలో పురుష మోహనమును పోలిన కృత్రిమ లింగము (Artificial Phallus - Dildo) ఒకటి. ఇది స్వజాతి ప్రణయలగు (Tribades) స్త్రీలు పాశ్చాత్యదేశములందు విరివిగ నుపయోగింతురు. వారు దీనికి Consola Leur, Bijou Indiscret, Gaude Mihi, Penis Succdea Neus ఇత్యాది నామములతో వ్యవహరింతురు. ఈ అపద్రవ్యములు అన్ని దేశములందును అతి ప్రాచీన కాలమునందుండి ఉన్నవి. యూరప్ దేశమున ఇవి మధ్యకాలములోనే విశేష ప్రాచుర్యము వహించినట్లు బ్రాంటోమ్ మహాశయుని 'Lives of Fair and Gallent Women’ అను గ్రంథమువలన తెలియుచున్నది. ప్రాచీన గ్రీసు దేశమున వీని యుపయోగమున్నట్లు ఎరిస్టోఫానిస్ 'Lysistrata' వలన తెలియవచ్చు చున్నది. బాబిలోనియా శిల్పములందు స్త్రీలు ఇట్టివానిని హస్తమునం దుంచుకొన్నట్లు ప్రతిమలు బహుళముగ కనిపించును. వీనికి ప్రాచీన గ్రీకులు Olibos అని నామకరణ మొనర్చిరి. స్త్రీల జాత్యాజీవితము (Sexual Life of Women) అను గ్రంథమున కిస్చ్ మహాశయుడు ఇట్టివానిలో అతిదీర్ఘములైన వానిని (వాత్స్యాయన మహర్షి సంఘాటీ వంటిది) వాన్ మస్చకా చూచినట్లు చెప్పుచున్నాడు. ఇట్టి కృత్రిమలింగములలో కపి పాలుపోసి యోని రంధ్రముద్వారా లోపలికంపి శుక్రస్యందనము కలుగునట్లొనర్తురని అతని అభిప్రాయము. ఇట్టిదే 'కృత్రిమయోనిని' (Mannikin) ని పురుషు లుపయోగింతురు. ఈ సూత్రముల ననుసరించి స్వీయలింగ ప్రణయము, (Autoeroticism) అపద్రవ్య (Olibos) ప్రణయము ప్రాచీన భారతీయులు ఎరిగినట్లు తెలియుచున్నది. ఇది అభావమున స్వజాతి ప్రణయము గాని పాశ్చాత్యలోకములోని స్వతఃసిద్ధ స్వజాతీ

ప్రణయము (Homo-Sexuality) కాదు.


97.Chapter VII - INCEST, Physical Love in the Family R. J. Mehta - Scientific Curiosities of Sex Life pp. 60-67. కాని ఇది పురాతన ఇరాను ఈజిప్టు రాజవంశములలోని వైవాహిక సంబంధమైన స్వీయబంధుప్రణయము వంటిది కాదు. ఇది వ్యావర్తనకము. 'తథా ప్రవేశిభి రేవజ్ఞాతి సంబంధేభి ర్నాన్యై రుపయుజ్యం తేస్త్రిరాజ కానాం' స్త్రీ రాజ్యమున నిట్టి స్వబంధు ప్రణయము జ్ఞాతుల మూలమున జరుగునని మహర్షి పలికినాడు. ఈ ప్రకరణమును దారరక్షితమను ఒకే ప్రయోజనము కలిగినది.

98. ఆధునిక వ్యభిచారమునకు కారణములకు : (Encyclopaedia Brittanica vol. XXII (seventh Edn.) page 464.

99. వాత్స్యాయనుడు వర్ణించిన గణికలు పురాతన గ్రీసు దేశములోని Heterai వంటివారు. ఈ మహానుభావుని మతమున వేశ్య కేవలము అర్థప్రయోజన, కృత్రిమ ప్రణయ. పాశ్చాత్య దేశమునందలి పురాతన దేవాలయము దాసీత్వము పణ్యవృత్తిలో నొకజాతిది. "Their prostitute fulfils a social mission; She is the guardian of virginal Modesty, the channel to carry of adulterous desire, the protector of matrons who few late maternity; It is her part to act as the o shield to the female” అన్న ఒక సాంఘిక శాస్త్రవేత్తను బట్టి, ఈ స్త్రీ నిజవృత్తి మూలమున భంగ్యంతరముగా నెట్టి మహోన్నతసేవ స్వజాతి కొనర్చినదో గమనింపదగినది. అందుమూలమున పణ్యవృత్తి ఉండతగినదనిగాని, వలెనని గాని కాదు.

100. Physiology of Sex WALKER -page 144

101. మహర్షి వాత్స్యాయనుడు ఈ అధ్యాయమున ‘దాక్షిణాత్యానాం లింగస్య కర్ణయోరిన వ్యథనం బాలస్య (7.2.19) అను సూత్రమున లింగవేధను గూర్చి చెప్పి ఉన్నాడు. ఇట్టి కథ నేటికిని కొన్ని అనాగరిక జాతులందు కనిపించుచున్నది. లింగవేధ జరిగిన తరువాత అందు లోహ, వాంశిక, కాష్ఠ, అస్థి మొదలైన వానితో నొనర్చిన పుడకల నుంతురు. డైక్ జాతివారును, మరికొందరును ఉపయోగించు నిట్టి వేధ సంబంధమైన అపద్రవ్యములను గురించి రైలీ స్కాట్టు ఇట్లు వ్రాసినాడు. "Analagous methods are in use among other native race, such as metal rings in which feathers are inserted collars made of bristles for fastering round the conna glands etc. In some tribes small sharp stones or bits of metal are inserted under the skin of the glouds" అని. ఇండోనీషియనులలోను, ఉత్తర సెలచీ జాతులలోను నేటికి ఇట్టి ఆచారమున్నదట! చైనాజాతివారు అపద్రవ్యముగ ఈకలను చుట్టి వెండిపూత పోసిన గొట్టము నుపయోగింతురుట. నేటి ఐరోపా,

దక్షిణ అమెరికా, తూర్పు ఇండియా దీవులందు వేశ్యవాటికలలో ఉపయోగార్థము

180

అపద్రవ్యములను బహిరంగముగా నమ్ముదురని తెలియుచున్నది. అవి రబ్బరుతో తయారైనవి. చైనా జపాను దేశములందు భోగస్త్రీలు రిన్నోటమా అను రెండు బంతులను గుహ్యస్థాన ముందుంచుకొని వీని కదలిక మూలమున రాగాధిక్యమును పొందుదురట. బాకమాంట్ వ్రాత ననుసరించి క్రీ.శ. 10 శతాబ్దము నాటి ఫ్రెంచి స్త్రీలు ఇట్టి కందుకములు రాగవర్ధకములుగ నుపయోగించినట్లు తెలియుచున్నది. దీనికి వారిడిన నామము POMMES D'AMOUR. అపద్రవ్యములలో శృంగార కింకిణుల (Bells of eroticism) నీట చెప్పవలసి ఉన్నది. మానవజాత్య సంబంధము (The sexuall relations of mankind) అను గ్రంథమున మాంటిగజ్జ వీనిని గురించి ఇట్లు వ్రాసి ఉన్నాడు. 'I was amazed to find a custom in this country which is both lascivious and ridiculous... The women holds great store with them for when they are swen into the skin of the man's member they causes a swelling of tremulous length of the entire genital parts. Hence they claim their males have greater endurance and give them far greater pleasure. The men decorated in this fashion are held in high esteem by the women, and, when they walk through the streets believe it to be a mark of honour if the tinkling of the bells is heard' పురాతన భారతీయ స్త్రీల కింకిణీ ధారణ మెందుల కుద్దేశితమైనదో దీనినిబట్టి కొంతగ మనకర్థము కాగలదు. శృంగార కలస్వనములకు గల సన్నిహిత సంబంధమే అందుకు ముఖ్య కారణము.

102. రతిరహస్యము V 3-4 అనంగరంగకర్త వాజీకరణ వశీకరణాదులనేగాక యోని ప్రసాధన (Uterus Toilet)ను గురించియు విపులముగ వ్రాసినాడు.

103. MEHATA - Scientific curiosities - Chapter VI; page 86.