వాడుకరి:Poojitha manchi/sand box/ప్రస్తావన
ప్రస్తావన
నావాఙ్మయసూత్రపరిశిష్టంలో నేటికాలపు కవిత్వమనే యీ కృతి ప్రథమాధ్యాయం నేటికాలపువిద్య, నేటికాలపుకృతులు అనేవి ద్వితీయతృతీయాధ్యాయాలు తృతీయాధ్యాయంలో పరిశిష్టం సమాప్తమవుతుంది మద్రాసులో కొంతకాలం కింద జరిగిన ఒకసమావేశంలో శ్రీ వింజమూరి రంగాచార్యులవారు శ్రీ భావరాజు సుబ్బారావుగారు అదివరకు వ్యాకరణసిద్ధాన్తాలను ప్రవచనంచేయడానికి ఆంధ్రదేశమందలి ముఖ్యపట్టణాలకు పోయినప్పుడు మరికొందరు మిత్రులు నేటికాలపు కవితను గురించి ప్రస్తావించా రని ఆసమయంలో నేనేమీ చెప్పలేదని నాకు జ్ఞాపకం. అప్పటికి ఆపరిశీలనం ముగియకపోవడమే దానికి కారణం. విచారణ ముగిసిన తరువాత యీకృతిలో వున్న విషయాన్ని 5027 సం॥ చైత్రంలో చెన్నపురి ఆంధ్రసభలో ఉపన్యసించాను. ఆంధ్రపత్రికలో ప్రకటితమైన ఆఉపన్యాసాల విస్తరరూపమే యీకృతి. వాఙ్మయసూత్రం ప్రకటితమైన తరువాత పరిశిష్టం ముద్రితం కావడం క్రమమైనప్పటికీ, పరిశిష్టం ఒక వేరైన భాగంకావడంవల్ల మహావాక్యానయత్వం వ్యక్తం కాకున్నా అర్ధబోధానికి ప్రాతికూల్యం అపతితంగాదు.
ఈకృతి ముద్రితంకావడానికి దయతో తోడ్పడ్డ శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులవారికి కృతజ్ఞతాసూచకంగా నమస్కృతు లర్పిస్తున్నాను. మనదేశంలో విద్యయిప్పటికీ వేరువేరు మార్గాల్లో నడుస్తున్నది గనుక జిజ్ఞాసావిషయాలను సంస్కృతంలోను ఇంగ్లీషులోను సయితం ఉపోద్ఘాతరూపాన క్లుప్తంగా తెలిపినాను. విచారణోపక్రమంలో సహాయులైన సాహిత్యతత్పరులను కృతజ్ఞతతో స్మరిస్తున్నాను.
చెన్నపురి |
అని |
"लोकोपदेशननं नाटसमेत विध्यति" इति. प्रतिपादितं च आनन्दवर्धनाचार्यैः. "सदाचारोपदेशरूप दि नाटलदिगोष्टी मुनिभिरवता " इति. रञ्जकरसप्रधाननां केयां विद्रूपकानां पुरुषार्थोपयोगो नास्तोत्पभिनव भारत्याख्यायां जाट्यविवृत्तौ वद्भिः अभिनवगुमपादैरपि पुरुषार्थे पदेशस्य काव्यफल सारत्वं सूचितपेत. काव्यप्रकाशकारादीनां वचनानि सुविदितालि. आनन्द एव प्राधान्येन उता इति लोचने यभिनवगुप्तपादा आबोचन्ता कारण अन्यदैलक्षायमेव घोरपतीति न कश्चिद्विरोध:. तदेव निरूपितं विद्यानाथेन "इयान विशेषः लागत नव्हताधी सरसा अन्यत्रम तथा" इति. पुरुषार्थेषु अत्र अर्थकामयोधर्मानुगतत्वमेवेच्छामः अर्थस्य कामस्य च धर्मास्पृष्ट्ये हि तत्प्रतिपादकं काव्यं 'काव्यालापांश्च वर्जये' दिति निषेधस्य विषयः स्यात्, धर्मादपेतयोरर्थकामधोरगृह्यत्वं पतनहेतुत्वं वा स्पषमेव. भवन्ति किल अब प्रसिद्धानि बहूनि स्मृत्यादीनां वाक्यानि. वाल्मीकि प्रस्थानमेतदेव विशदीकरोति. "धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ" इत्येतद्वीतावचनं उपादेयकामोपाधिं दर्शयत्येत. वात्स्यायनीये कामसूत्रेऽपि जयमङ्गलप्रदर्शिता ________________
Xxx "अपि नाम निवर्गेऽस्मिन् सेवेतोत्तरबाधकम् । पूर्वस्य तु प्रधानत्वन्न सेव्यः पूर्वबाधकः" || इत्यभियुक्तोक्तिः कामस्य धर्माबाधकत्वमेवोपदिशति. धमांधर्मयोरुभयोरपि स्पर्शः ययोर्न विद्यते तावर्थकामौ न संम्भवत एव. ननु कलाप्रसङ्गे. धर्मप्रशंसा न कर्तव्या क्रियतां सा कृतिस्मृत्यादिविचारे, अन्न तु आनन्दवैशिष्ट्य मेव प्रधानमिति चेन्मैवम्. केवल विनोदफलका अपि कलाविशेषास्तावदेव उपादीयन्ते यावक्ते मनुष्याणां दूष्यगुणान् न तोषयन्ति. यदि कला मानुषीः प्राकृत चित्तवृत्ती: संस्कर्तुमपि न पारयेत् मन्दप्रयोजना सती सा क्षुद्रकोटावेव प्रविशेत्. यदि संस्कर्तुं पारयति तर्हि तत्न धर्मप्रसक्तिं वारयितुं कः शक्नुयादित्यलं बहुना. विस्तरसत्वग्रे वक्ष्यते. ___ आधुनिककविता प्रायेण उदात्तप्रयोजनेन हीनैव दृश्यते. कालिदासादीनां. कृतीरलंकुर्वाणस्य स्वल्पवचः प्रतिपादितार्थ भूयस्त्वस्य रीति रिदानींतनानां कृतिपुमृग्या, अस्फुटस्वल्पार्थवच्छब्दबाहुल्यमेव आधुनिककाव्येषु प्रायः उपलभामहे. रघुवंशकर्तृप्रभृतिषु यद्विशिष्टलक्षणत्वेन नित्यधर्मद्रष्टुत्वं जागर्ति तदाधुनिकसंदर्भप्रणेतृषु नैव लक्ष्यते. समीचीनच्छन्दोनियमातिक्रमात्, अक्षर मैत्रीसंपादनस्यैव अवश्यकार्यत्वाच्य, आन्ध्राणां पद्यमप्यपथ एव चरति. आधुनिककाव्येषु शृङ्गारः प्रायेण अनुचिततां नति इति व्यक्ततरं ज्ञायते. आधुनिक कृतिषु भावकाव्यमिति कश्चन नूतनः काव्यभेदः उपलभ्यत इति केचित्. तदयुक्तम्. भारतवर्षीयसाहित्ये हि भावध्वनिः प्रसिद्धः सौन्दर्यलहर्यादीनि भावकाव्यान्येव. यूरोपीयलिरिक्सन्दर्भापेक्षया भारतवर्षीयभावकाव्यं प्रस्फुट लक्षणं भाति. शिष्टं निरूपयिष्यते. आधुनिककवितायां विज्ञानपरिणती लुप्तप्राये. ईदानींतनकाव्येषु प्रायेण यूरोपीयादिसरण्यनुकरणं पश्यामः, मद्रास्विश्वविद्यालयस्य तत्प्रतिबिम्बसदृशस्य आन्ध्रविश्वविद्यलयस्य च विद्यक्रमे, भारतवर्षीयविज्ञानप्रबोधहेतूनां उचितसंस्थितेरभावात् विज्ञानपरिणत्योः आधुनिककृतिषु प्रायः क्षयः संप्राप्त इति स्पष्टं जानीमहे. विज्ञानस्तब्धतादूरीकरणाय इदानीं आन्ध्राणां य आरम्भः स अतीव श्लाघ्यः, किं च क्षालनाय पुनर्नवत्वाय च शुद्ध जले अलभमानेन, पङ्कानिर्गतेनेव क्लेशः अनुभूयते. ________________
xxxi आन्धाणां विद्यास्थानेषु यूरोपीयविज्ञानलब्धिरिव भारतवर्षीयविज्ञानलब्धिरपि यद्यवश्यविधेया स्यात् तर्हि आन्ध्राः न केवलं भारतवर्षस्य किं तु सर्वस्यापि लोकस्य संस्कारसंपदं वर्धयितुं शकुयुः. ५०२७ मिते कल्यब्दे चेन्नपुर्यान्ध्रसभामन्दिरे आधुनिकवितामधिकृत्य मया उपन्यासि. तदवसरे ये व्याख्यातास्त एव विषयाः कृतावस्यां प्रपञ्चयिष्यन्ते. चेन्नपुरी, ५०२७ मिते कल्यब्दे कृतिप्रणेता. श्रावण शुद्धपञ्चम्याम् इति
INTRODUCTION
The following pages are a part of the Supplement to my "Interpretation of Literature." They deal with the present day poetry. In the Telugu country we are having productions in verse and prose in large numbers though there is not a corresponding widening of the reading circle. Even in the limited circles, the influence of poetry on not only the rise and growth of the noble qualities but also on the moral and intellectual prosperity of a nation is not inconsiderable. What is the nature of the poetry that we meet at every corner of our country to-day? What is the relation of this poetry with ourlife real and ideal? What is its effect upon us Telugus as a race? We, Andhras, as Indians are proud of the heritage of the culture and civilisation of our Ancient india. Are we in line with that cultural advancement? Or are we falling? Such considerations led me to inquire into ous literature past and present. The old literature does not come under this as it was dealt with in the previous part of the work.
I shall briefly mention here some of the facts which will be observed during the course of iny investigation in the following pages. The highest end of Indian art, at any rate of poetic art, is the guidance of human activities preceded by unstained pleasure for the blissful conduct of the world for a supreme goal. There is not much truth in the argument that guidance of human activities or Dharma is outside the province of aesthetics and that are stands by itself. No noble art can stand by itself without a high purpose behind it. Even such as yield mere amusement and satisfaction of a particular kind of sentiment are acceptable only so far as they do not appeal to the ugly qualities of human heart. No art is worth the name if it does not at least refine the grosser feelings of humanity. When it does, it cannot escape the extensive province of Dharma in its varied aspects. I do not like to go into the question further here and it will be discussed at some more length in the chapter on "Sringraa"
The present-day poetry falls very much below high ideals. The art of suggesting a world of ideas by a few strokes as found in our Kalidas etc. is very rare in the present-day writers. Moreover the unscientific and improper features of our Telugu verse and the absolute necessity of somehow securing some particular letter adjustments deprived it of its essentials and filled it with all sorts of uncouth encumbrances unconnected with the occasion. The present-day poetry in Telugu is more versification than poetry. It is a well-sounding mass of word-profusion with scanty meaning. The poetic vision that can see through ages giving out standing universal sentiments is hardly to be seen in it.
BHAVAKAVYA.
There is a wrong idea among some that Bhavakavya is a new innovation ins our literature. Bhavadhwani of indian poetics is very old and poems like Soundaryalahari are Bhavakavyas. The word bhavadhwani in Indian poetics is more definite than the term "Lyric" in modern Western poetry which can be applied to some aspects of all poetry. As for conjugal love we see it in its completion is separated from the category of Bhava and is given a higher place under Rasa. Devotional raptures fall under bhava and love of children and nature also may come under it
THOUGHT AND CULTURE.
Much of the present-day poetry is raw imitation of western writers and others and betrays a lack of maturity of thought and cultural background. Bare imitation of outward features without the inner life cannot but result in mockery. This is to a great extent due to the scheme of University studies in this province by which a vast majority of students go out of the University year after year without having the necessity, throughout their course, to be in sight of even the portals of Indian Culture, the literature in a Vernacular language like Telugu being extremely and pitiably insufficient for the purpose in the present stage. Alien culture without one's own cannot produce its proper effects in any individual in a country like India with its everlasting glories of culture and civilization. If there is renaissance and cultural revival in the other parts of India under a different system of University Education, Andhras cannot rest content that all that occurred among themselves.
Much of the present-day poetry is love-soliloquy straight and roundabout and it presents very little beyond personal erotomania and these erotic sentiments scarcely rise above the physical aspect and beastly passions. However, there are some happy signs of reaction against the intellectual stagnation of the middle ages but it is like the case of one who crawled out of a stagnant pool with no life-giving water fountain for purification and resuscitation. I expect changed and proper conditions for Indian culture along with other cultures with their due place in the seats of learning of Andhras that they may enable themselves to partake worthily in the sacred task of contributing to India's and World's civilization.
The present part is a collection of the lectures delivered by me in April 1926 in the Andhra Sabha hall and reproduced in the Andhra Patrika.
MADRAS
13-8-26
THE AUTHOR
శ్రీగురుభ్యోనమః హరిఃఓమ్.
ఈకృతిలో ప్రయుక్తమైన సంకేతాల వివరణం.
ఆగ్నేయ, ఆగ్నే = అగ్నేయపురాణం
అహో = అహోబిలపండితీయం
ఉత్తర = ఉత్తరరామచరిత్రం
ఋ.మ,సూ.ఋ = ఋగ్వేదం, మండలం, సూక్తం, ఋక్కు
ఐతరే = ఐతరేయోపనిషత్తు
కాదం = కాదంబరి
కవికర్ణ = కవికర్ణరసాయనం
కాశీ = కాశీఖండం
కావ్య = కావ్యప్రకాశం
కా.ప్ర.వ్యా = కావ్యప్రకాశవ్యాఖ్య
కా.త = కాలజ్ఞానతత్వాలు
కావ్యమీ = కావ్యమీమాంస
కా. ద = కావ్యాదర్శం
కాసూ.వృ = కావ్యాలంకార సూత్ర వృత్తి
కిరా = కిరాతార్జునీయం
కుమా = కుమారసంభవం
కేయూర = కేయూరబాహుచరిత్రం
గౌపా = గౌడపాదభాష్యం
చంద్రరేఖా = చంద్రరేఖాపరిణయం
చా = చాటువు
ఛాందో - చాందోగ్యోప నిషత్తు
తి. భా = తిక్కనభారతం
తైత్తి = తైత్తిరీయోపనిషత్తు
తైత్తి. భృ - తైత్తిరీయోపనిషత్తు భృగువల్లి
దశ = దశరూపకం
ధ్వన్యా = ధ్వన్యాలోకం
ధ్వ.లో = ద్వన్యాలోకలోచనం
న.భా, భా.నన్నయ = నన్నయ భారతం
నైష = నైషధం
ప్రశ్నో = ప్రశ్నోపనిషత్తు
ప్రస = ప్రసన్నరాఘవం
ప్రతాప = ప్రతాపరుద్రీయం
పాణి = పాణీనీయం
బసవ = బసవపురాణం
బ్రహ్మ. బ్ర.సూ = బ్రహ్మసూత్రం
బ్ర. భా =బ్రహ్మసూత్రభాష్యం
బిల్హ = బిల్హణీయం
భర్తృ, భ.త్రి, త్రి. శ = భర్తృతహరి త్రిశతి
భగవ = భగవధీత
భ. నా = భరతనాట్యశాస్త్రం
భజగో = భజగోవిందస్తోత్రం
భట్టి = భట్టికావ్యం
భా. ఆ, భా. న. ఆ = నన్నయభారతం. ఆదిపర్వం
భా. తి. వి = తిక్కనభారతం విరాటపర్వం
భామినీ = భామినీవిలాసం
మను = మనుస్మృతి
మహాభా = మహాభారతం
మహాభా. ఆ = మహాభారతం ఆదిపర్వం
మధురా, మధు = మధురావిజయం
మ = మనుచరిత్ర
మహా = మహాభాష్యం
మా, మాఘ = మాఘకావ్యం
మాలతీ = మాలతీమాధవం
ముద్రా = ముద్రారాక్షసం
మేఘ = మేఘసందేశం రఘు = రఘువంశం
రత్నా = రత్నాపణం
రామా, రా = రామాయణం
రా.యు = రామాయణం, యుద్ధకాండం
వసు = వసుచరిత్రం
వా. కా, వా. కా. సూ = వాత్స్యాయన కామ సూత్రం
వా. రా = వాల్మీకిరామాయణం
వాక్య = వాక్యపదీయం
విద్యా. భా = విద్యారణ్యభాష్యం
వేమ = వేమనశతకం
శంకర = శంకరవిజయం
శాకుం, శా = శాకుంతలం
శ్రు = శ్రుతి
శ్రీ. భా = శ్రీ భాగవతం
సర్వ = సర్వదర్శనసంగ్రహం
సాహి, సా.ద = సాహిత్యదర్పణం
సాహిత. ఉ = సాహిత్యదర్పణంలో ఉదాహరణం
సా. కా = సాంఖ్యకారిక
హర్ష = హర్షచరితం శ్రీరస్తు
వాఙ్మయసూత్ర పరిశిష్టం.
తృతీయాధ్యాయం
నేటి కాలపువిద్య
1. ఇంగ్లీషు పాఠశాలల్లో విద్య సంస్కృతపాఠశాలల్లో విద్య పద్య విద్య అని నేటికాలపు ఆంధ్రులవిద్య మూడువిధాలు.
2. ఇంగ్లీషుపాఠశాలల్లో భారతీయసంస్కారం నస్టప్రాయం.
3.పాశ్చాత్య భారతీయసంస్కారాల సమ్మేళనం విరశం
4.సంస్కృత పాఠశాలల్లో కావ్యపఠనమార్గం హేయం
5.భాషస్వాధీనమైన తరవాత, రసాస్వాదనశక్తియేర్పడ్డతరవాత రఘువంశం మొదలైనకవ్యాలు పఠించదగినవి
6.ప్రాయికంగా శాస్త్ర పఠనమార్గం అప్రశస్యం.
7.కనుక సంస్కృతపాఠశాలల్లో విద్యవల్ల భారతీయసంస్కార స్వరూప దర్శనమూ పరిణతిఫలమూ క్వాచిత్కం.
8. పద్యవిద్య విజ్ఞానశూన్యం
9. ఇదే ఆంధ్ర విద్య.
10. ఛందోవ్యతిక్రమంవల్ల భాషావ్యతిక్రమంవల్ల తెలుగుపద్యం కలుషితం
11. ఆంధ్రుల్లో సంస్కారోజ్జీవనం కార్యం కార్యం
అని శ్రీ - ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో తృతీయాధ్యాయం సమాప్తం. పరిశిష్ఠంగూడా సమాప్తం. శ్రీ ర స్తు
వాఙ్మయ పరిశిష్ట భాష్యం
నేటికాలపు కవిత్వం
ప్రధమాధ్యాయం
నూతనత్వాధికరణం
నైషదతత్వజిజ్ఞాస ముగింపువాక్యంగా నేటికాలపుకవిత్వం అనివ్రాశాను. ఇప్పుడు దీన్ని వివరిస్తున్నాను దీంట్లో నేడు అన్నా, నేటికాలమన్నా ఈపరిశిష్టం వ్రాసిన సమయని వ్యాఖ్యేయం నేడు ఆంధ్రదేశంలోఅనేకులు పద్యాలు వ్రాస్తున్నారు. చిన్నచిన్న కావ్యాలు కథాభాగం విశేషంలేకుండా కొందరు వ్రాస్తున్నారు. ఈ చిన్న కావ్యాలనే నేనిక్కడ ప్రధానంగా పరామర్శిస్తాను. వీటిని భావగీతాలని యిది భావకవిత్వమని కొందరంటున్నారు. ఇది మనకు నేటికి కొత్తగాలభించిందని చాలా ఉత్తమమయిన దని కొందరి అభిప్రాయము. ఇది కవితయొక్క హైన్యమని కొందరి అభిప్రాయం.
"ఈ దినములలో బావకవిత్వమనునది యొక్కటి బయలు వెడలిన దనియు అది శొచనీయస్థితియందున్నదనియు కొందరు వ్రాయుచున్నట్లు తోచెడిని."
కా. బ్రహ్మయ్య శాస్త్రి (భారతి)
ఈ తీరుగా ఈ చిన్నకావ్యాలను గురించి వేరు వేరు భావములు దేశంలో వ్యాపించియున్నవి వీటి నూతనత్వాన్ని వీటి హేయొపాదేయత్వాలను వివరించదలచి వీటి జీవవిచారణకుముందు శరీరవిచారణ ఆరంభిస్తున్నాను. భారతి మొదలైన పత్రికల్లోవున్న ప్రణయపద్యాలు అనేక పద్యాల సముదాయరూపమైన కృష్ణపక్షంవంటి పుస్తకాలు యేకాంత సేవ కావ్యకుసుమావళి వనకుమారి లక్ష్మీకాంతతొలకరి బాపిరాజుతొలకరి యెంకిపాటలు నారాయణమ్మ నాయుడుబావపాట, యెంకయ్య చంద్రమ్మపాట యిటువంటివన్నీ యిప్పటి నావిచారణకు విషయం ఈ కావ్యాలు నూతనమని అనేకుల అభిప్రాయమని చెప్పినాను.
"ఈ కృతులనేకములు భావగీతములని యిప్పుడు ప్రచారమునకు వచ్చిన కొత్త కవితాప్రపంచమునకు చేరినవి.
సంస్కృతంయొక్క దాస్యంనుండి విముక్తి నొందుచున్నామని మానమ్మకము."
క. రామలింగారెడ్డి (లక్ష్మీకాంత తొలకరి పీఠిక)
"మనవారు కొత్తవారైనారు"
-దే. కృష్ణశాస్త్రి (యేకాంత సేవ పీఠిక)
"నవ్యాంధ్ర కావ్యరీతులు - కడచిన పదియేండ్లలో పొందియున్నవి."
పు.సూరిశాస్త్రి (ఆంధ్ర హెరాల్డు)
"ఇంతవరకును మనకవులు సంస్కృతమునందు వివరించబడిన సంప్రదాయములను శిరసావహించి పనిచేసిరి. మార్పులురాక తప్పదు. ప్రాచీన సంప్రదాయూములయెడ గౌరవము తగ్గెను. మార్పులు రాక తప్పదు. ఆంధ్ర భాషాచరిత్రమున నేడొక నూతనాధ్యాయము ఆరంభమగుచున్నది"
-నిడమర్తి సత్యనారాయణమూర్తి (భారతి సం. 3 సం. 3)
"ఆయందము ఆనూతనవికాసము స్వర్ణయుగపు వాఙ్మయ చిహ్నాలు."
-దశిక సూర్యప్రకాశరావు (భారతి).
ఈ తీరుగా ఈ చిన్నకావ్యాలూ వీటికవిత్వం కొత్తదనీ భారతీయుల సంప్రదాయాలను అతిక్రమించి స్వేచ్ఛవహించడంవల్ల ఆనూతనత్వం వచ్చిం దనీ, అది మన మిదివర కెరుగమనీ అంటున్నారు యీవిషయాన్ని యిక విచారిస్తాను.
నూతనత్వం
"క్షణే క్షణే యన్నవతా ముపైతి
తదేవ రూపం రమణీయతాయా:" (మా.4)
అని మాఘు డంటున్నాడు.
అసలు నూతనత్వమే కవిత్వాన్ని ఉపాదేయకొటిలో చేరుస్తున్నది. అది లేదా పాడిందేపాట అయి హేయకోటిలో చేరుతున్నది. అందుకే శబ్దాలు అర్ధాలు వెనుకటికవులు వాడినవే అయినా శక్తిమంతుడైన కవి వాటినే స్వీకరించి కావ్యంరచించినప్పుడు నూతనత్వం ప్రకటితంవుతున్నదని.
"దృష్టపూర్వా అపి హ్యార్ధాః కావ్యే రసపరిగ్రహాత్.
సర్వే నవా ఇవాభాన్తి మధుమాస ఇవ ద్రుమాః"
అనే వాక్యాలతో ఆనందవర్ధనుడు చెప్పుతున్నాడు. అంతేగాదు భావాలన్నీ మహాకవులు గార్లించారే ఇక మనమేమి కొత్దిది చెప్పగలమని భయపడవద్దు అనంతంగా బిన్నస్వరూపాలు వహిస్తున్న యీప్రకృతిలో కాలం దేశం ప్రాణులమనో ప్యాపారలీలలు కవికి నూతనత్వం ప్రదర్శిస్తూనే వుండగలవనే ఆశయాన్ని సయితం ఆనందవర్ధనుడు.
| "స్వభావో హ్యయం వాచ్యానాం చేతనాచేతనానాం యదవ స్థాభేదా ద్దేశభేదాత్యాలభేదా దా త్స్వాలక్షణ్యలక్షణభేదా చ్చానంత తాభవతి తైశ్చతధావ్యస్థితైః సద్బి: ప్రసిద్దానేకస్వభానుసరణరూపయా స్వభావోక్త్యాపి తావదుపనిబధ్యమానై: నిరవధి: కావ్యార్ధ: సంపద్యతే | (ధ్వన్యా) |
(అవస్థాభేదంవల్ల దేశభేదంవల్ల కాలబేదంవల్ల అనితరలక్షణాలు కలిగివుండడమనే వైలక్ష్యణ్యంవల్ల కావ్యంలో వ్యర్ధభూతమైన చేతనా చేతనాలయొక్క అనంతత ప్రకృతి సిధ్దం ఇట్లాబిన్నంగా వ్యవస్థితమైన యీచేతనాచేతనాలను ప్రసిద్ధానేకస్వబావానుసరణ రూపమైన స్వభావోక్తి చేత ప్రతిపాదిస్తూరచించినా కావ్యార్ధం అనంతంగా సంపన్నమవుతున్నది") అనే పఙ్త్కుల్లో తెలుపుతున్నాడు.
| "యా వ్యాసారవతీ రసాన్రసయితుం కాచిత్ కవీనాం నవా దృష్టి" | (ధ్వన్యా) |
వాఙ్మయ సూత్ర పరిశిష్టం
1. శిష్ఠ్లా న్వవాయసంజాత సీతారామపశ్చితః,
గురుపాదాః సదా ప్రేమ్ణా వర్తన్తాం హృదయే మమ.
2. అన్యే ప్రమథనాథాద్యా మహాన్తో గురవోమయి,
ప్రసారయస్తు నిర్వ్యాజాన్. కటాక్షాన్ కరుణాంచితాన్.
3. నమామి వాఙ్మయీం దేవీం దేవం వాణీమనోహరం,
వీరాంశ్చ కవితాధీనాన్ ధీరాన్ రసవిమోహితాన్.
4. కృష్ణా పినాకినీ గోదా, తుంగభద్రా పయఃశుభాం,
త్రిలింగజననీం వందే త్రికోటిజనశోభితాం.
5. స్తవీమి ధ్వనికారాద్యాన్. సిద్దాన్ సౌందర్యలోభినః,
వాఙ్మయం భారతీయం యే దదృశు స్తత్త్వతోఖిలమ్.
6. సూత్రాణామథ భాష్యాణాం మార్గౌచిత్యం విలోకయన్,
పథా తేనైవ గచ్ఛామి వాఙ్మయస్య వివేచనే.
శ్రీ ర స్తు
వాఙ్మయ సూత్ర పరిశిష్టం.
ప్రథమాధ్యాయం.
నేటికాలపు కవిత్వం
1. నేటికాలపు కవిత్వాన్ని విచారణచేస్తాను
2. నూతనత్వం కవిత్వధర్మం
3. విస్తరం వికారాలు అనుచితపు పేర్లు ఊగుడుమాటలు నిదర్శనపరం పరలు అయోమయత్వం పులుముడు శబ్దవాచ్యత దృష్టిసంకోచం అనేవాటితో ప్రాయికంగా యీ కాలపుకవిత్వం దుష్ఠం
4. ఈ కాలపుకృతు లనేకాలు చాటుపద్యసంచయాలు; చాందసపు మాటలు కావ్యత్వసిద్ధిపొందినవి విరళం. ఉత్తమమధ్యమాలూ విరళం
5. వీట్లో తరుచుగా భాషావ్యతిక్రమం కనబడుతున్నది
6. ఇది ఉపలభ్యమానకృతుల్లో నన్నయభారతంలో ఆరబ్దం
7. ఛాందసాలు ఈ కాలపుకృతుల్లో బహుళం
8. నిర్భర్ధ వళిప్రాసలమైత్రుల అవర్జాలు ఛందోవ్యతిక్రమం వీట్లో కనబడుతున్నవి
9. భాషావ్యతిక్రమంవలె యివికూడా ఉపలభ్యమాన కృతుల్లో నన్నయ భారతంలో అరబ్ధం
10. పులుముడు మొదలైనదోషాలకీ ఛందోవ్యతిక్రమాదులు హేతువు
11. భారతీయభావకావ్యం ప్రాచీనం
12. పాశ్చాత్యభావకావ్యానికి పైన భారతీయభావకావ్యం ఔచిత్యవంతం 13. కావ్యం ప్రవృత్తిమార్గ ప్రధానసాధనం
14. నివృత్తిసాధనంగూడా నని కొందరు
15. శృంగారం జగదవిచ్చిన్నతారూప ధర్మప్రతిపాదకం
16. సాధారణ నాయకావలంబనం చిల్లరశృంగారమని క్షుద్రశృంగారమని యిక్కడ వ్యపదేశం
17. దుష్టనాయకాశ్రయం హేయశృంగారం
18. లోకోత్తర నాయకాశ్రయంవల్ల పరిపోషాతిశయమని విద్యానాథుడు
19. అది ఉత్తమ ప్రకృతి ప్రాయమని విశ్వనాథుడు
20. అదమనాయకాశ్రయం రసాభాసమని ప్రాచీనులు
21. అది అంగంగా కావ్యంలో ఉండదగినది
22. ఈ కాలపు కృతుల్లో ప్రాయికంగా క్షుద్రశృంగారం అంగి
23. అనౌచిత్యం రసభంగానికి ముఖ్య హేతువని ఆనందవర్దనుడు
24. అది యీకాలపుకృతుల్లో తరుచుగా కనబడుతున్నది
25. భారతీయకావ్యాలకు వనసీమలు చిరపరిచితం
26. ఉపోద్ఘాతకర్తలను కృతికర్తలాశ్రయించడం బహుళం
27.వక్ష్యమాణం చౌర్యం ఈకాలపుకృతుల్లో తరుచు
28. అన్యత్ర స్థితి దోషానికి ఉపాదేయత్వం లేదు
29. ఆంధ్ర దేశంలో భారతీయసంస్కారం క్షీణం
30. వక్ష్యమాణమైన పాశ్చాత్య భారతీయసంస్కారాల సమ్మేళనం మృగ్యం
31. నన్నయ పెద్దనాదుల భారతమనుచరిత్రాదుల స్వరూపం వాటి హేయోపాదేయతా విచారితపూర్వం
32. ఆంధ్రుల్లో సంస్కారోజ్జీవనం కార్యం కార్యం
అని శ్రీమదక్కి రాజు లక్ష్మినారాయణపుత్ర ఉమాకాన్త విద్యాశేఖర ప్రణీతమైన వాఙ్మయసూత్ర పరిశిష్టంలో ప్రథమాద్యాయం.